45వ ఏట అడుగిడిన రాహుల్
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం 45వ ఏట అడుగుపెట్టారు. ఉదయమే సోనియాగాంధీ ఢిల్లీలోని రాహుల్ ఇంటికెళ్లి తనయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాహుల్‌గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా..’ అని మోదీ ట్వీట్ చేశారు. తొలుత తన ఇంటి వద్ద వేడుకలు జరుపుకొన్న రాహుల్ అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ 45 కేజీల కేక్‌ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు.