సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో భారీ విజయంతో కాంగ్రెస్ పార్టీ జోరుపెంచింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో హస్తం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో తొలిసారి సీడబ్ల్యూసీ భేటీ కానుంది.
వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీడబ్ల్యూసీ సభ్యులు రానున్నారు. ఇక, సెప్టెంబర్ 18న ఎన్నికల శంఖారావంగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అలాగే, తెలంగాణ ఎన్నికల టార్గెట్‌గా కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు. మరోవైపు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కారణంగా తేదీలు మారే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. సీడబ్ల్యూసీ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత తొలి భేటీ హైదరాబాద్‌లో జరగనుంది. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ ఎన్నికలే టార్గెట్‌గా పలు కార్యక్రమాలను రూపొంచాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ ముందుకు సాగుతున్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లోకి క్యూ కట్టిన నేతలు.. పొంగులేటి పోటీ ఎక్కడ?
Comments
Please login to add a commentAdd a comment