న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 69వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 'భగవంతుడు ఆమెకు ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయువును ప్రసాదించాలి' అంటూ ఆయన తన ట్విట్టర్లో ట్విట్ చేశారు. మరోవైపు పలువురు కాంగ్రెస్ నేతలు ...సోనియాకు బర్త్డే విషెష్ తెలిపారు.
అలాగే పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అధినేత్రి నివాసం వద్దకు చేరుకున్నారు. బొకేలు, మిఠాయిలతో తరలి వచ్చారు. దీంతో సోనియా నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కాగా గత ఏడాది ఛత్తీస్‌గఢ్లో నక్సల్స్ దాడులు, కశ్మీర్‌లో తీవ్రవాదుల దాడుల్లో బలైన జవాన్లకు సంతాప సూచకంగా పుట్టినరోజు వేడుకలకు సోనియా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.