సోనియాకు మోడీ జన్మదిన శుభాకాంక్షలు
సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదట ఆమెకు అభినందనలు అందజేసినది ఎవరో తెలుసా? ఆమెను బద్ధశత్రువుగా భావించే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ!! అవును, నరేంద్రమోడీ తన రాజకీయ చాతుర్యాన్ని రంగరించారు. కాంగ్రెస్ నాయకులందరికంటే కూడా ముందుగానే ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ అధినేత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ''యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియాగాంధీ చిరకాలం పాటు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ప్రార్థిస్తున్నా'' అని ట్విట్టర్లో పొద్దున్నే పోస్ట్ చేసేశారు. ఆయన చేసిన తర్వాత కొద్ది సేపటికి కాంగ్రెస్ ఎంపీ, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ తమ అధినేత్రికి పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు తెలిపారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఒక్కరోజు తర్వాతే సోనియాగాంధీ పుట్టినరోజు కావడంతో కాంగ్రెస్ కార్యాలయంలో గానీ, మరెక్కడ గానీ సంబరాలు కనిపించలేదు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, జాతివివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా మృతికి సంతాపంగా ఐదురోజుల సంతాపదినాలు కూడా ఉన్నందున సంబరాలు చేసుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ఇంకా సోనియాగాంధీకి అభినందనలు తెలిపినవారిలో మధ్యప్రదేశ్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్ఎస్ఎస్ నాయకుడు జితేన్ గజారియా తదితరులున్నారు. అయితే జితేన్ గజారియా మాత్రం కాస్త వ్యంగ్యం జోడించారు. నిన్ననే పుట్టినరోజు బహుమతి అందించామని, తిరిగి బహుమతి ఇవ్వడానికి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన తన ట్విట్టర్ లో రాశారు.
Wishing UPA Chairperson Smt. Sonia Gandhi on her birthday. I pray for her long and healthy life.
— Narendra Modi (@narendramodi) Decembe r 9, 2013
Best wishes to Smt Sonia Gandhi Ji- wishing you a very Happy Birthday
— Naveen Jindal (@MPNaveenJindal) Dece mber 9, 2013
Birthday greetings to UPA Chairperson & Congress leader Smt Sonia Gandhi.
— ShivrajSingh Chouhan (@ChouhanShivraj) Decem ber 9, 2013
Happy Birthday Sonia Gandhi. You got your birthday gift yesterday. Please give us a return gift. Declare Rahul Gandho as PM candidate
— Jiten Gajaria (@jitengajaria) December 9, 2013