'మేం అధికారంలోకి రాకపోవడం కొత్తేమీ కాదు' | Congress leaders celebrate Sonia Gandhi's birthday in Gandhibhavan | Sakshi
Sakshi News home page

'మేం అధికారంలోకి రాకపోవడం కొత్తేమీ కాదు'

Published Tue, Dec 9 2014 11:51 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'మేం అధికారంలోకి రాకపోవడం కొత్తేమీ కాదు' - Sakshi

'మేం అధికారంలోకి రాకపోవడం కొత్తేమీ కాదు'

హైదరాబాద్: కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మంగళవారం గాంధీ భవన్లో సోనియాగాంధీ 68వ జన్మదిన కార్యక్రమం పొన్నాల అధ్యక్షతను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో అచరణ సాధ్యమైయ్యే హామీలనే ఇచ్చి కాంగ్రెస్ ఇటు రాష్ట్రంలోను అటూ కేంద్రంలోనూ పదేళ్లపాటు అధికారంలో ఉండి పేదలకు మేలు చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం కొత్తేమీ కాదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకుండా కొన్ని పార్టీలు రాజకీయ కుట్ర చేశాయని ఆయన ఆరోపించారు. అయినా తమ పార్టీ తెలంగాణ ఇచ్చిందని తెలిపారు.


మత, ప్రాంతీయ భావాలతో కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులను కొనసాగించాలని టీఆర్ఎస్ సర్కార్కు పొన్నాల సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. అంతకుముందు పొన్నాల సోనియా జెండాను పొన్నాల ఆవిష్కరించారు. డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ ప్రకటన దినంగా కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. ఈ కార్యక్రమానికి పలువురు నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement