పొన్నాల వెంటనే రాజీనామా చేయాలి: కోమటిరెడ్డి | Komatireddy Venkat Reddy takes on Ponnala Lakshmaiah | Sakshi
Sakshi News home page

పొన్నాల వెంటనే రాజీనామా చేయాలి: కోమటిరెడ్డి

Published Sat, Aug 2 2014 2:15 PM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

Komatireddy Venkat Reddy takes on Ponnala Lakshmaiah

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్యపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు పార్టీని సమీక్షించే అర్హత లేదని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన పార్టీని ఎలా సమీక్షిస్తారని ప్రశ్నించారు.

పీసీసీ సమీక్షా సమావేశాలతో ఒరిగేదేమీ లేదని తెలిపారు. పొన్నాల వెంటనే రాజీనామా చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్బంగా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని తాము తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement