'బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపుతున్నాం' | Ponnala Lakshmaiah takes on TRS Party | Sakshi
Sakshi News home page

'బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపుతున్నాం'

Published Wed, Aug 27 2014 10:51 AM | Last Updated on Tue, Oct 16 2018 3:09 PM

'బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపుతున్నాం' - Sakshi

'బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపుతున్నాం'

హైదరాబాద్: మెదక్ లోక్సభకు జరుగుతున్న ఉప ఎన్నిలలో అభ్యర్థిగా బరిలోకి దిగాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఆశించినప్పటికీ... బలమైన అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని రంగంలోకి దింపుతున్నామని టీ.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. బుధవారం గాంధీ భవన్లో సునీత లక్ష్మారెడ్డికి పార్టీ భీ ఫారం అందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో సునీత తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ద్వారా టీఆర్ఎస్కు ప్రజలే గుణపాఠం చెబుతారని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement