Danam Nagender
-
మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని.. వచ్చాక స్పందిస్తానన్నారు. పోతే జైలుకు పోతా.. నాపై 173 కేసులు ఉన్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదల ఇళ్లు కుల్చుతా అంటే ఊరుకోం. హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదు. నా ఇంట్లో వైఎస్సార్, కేసీఆర్ ఫోటో ఉంది. ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి?. ఎవరి అభిమానం వాళ్లది’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.ఆయన గతంలో కూడా నగరంలో ఫుట్‌పాత్ కూల్చివేతలపై అధికారులు ఏకఫక్షంగా వవ్యహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారన్నారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నామంటూ వ్యాఖ్యానించారు. -
మీరు చేసే పనులు వల్ల ప్రజల్లో తిరగలేకపోతున్నాం: దానం
ఆదర్శ్ నగర్( హైదరాబాద్): నగరంలో ఫుట్‌పాత్ కూల్చివేతలపై(Demolished FootpathDemolish Footpaths) అధికారులు ఏకఫక్షంగా వవ్యహరిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేదందర్(Danam Nagender) మండిపడ్డారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆదర్శనగర్ లో ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్.. ‘ అధికారులు(GHMC Officials) చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నాం. పేదల ఇండ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదు.ఓల్డ్ సిటీ లో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా?, మొదలు పెడితే అక్కడి నుండే తొలగింపులు చేయాలి. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిని... హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేను. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారు... అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలు మనుగడ ఉండదు.ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పని చేయాలి. హైడ్రా చెరువులను కాపాడటానికి పని చేస్తుంది , దానిని స్వాగతిస్తున్నాను.మూసి ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్షతనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాద్ కాబట్టి.. తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికె పరిమితం కాదు..హైద్రాబాద్ లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం అన్నా ముందుంటాడు.గతంలో నేను హైడ్రా విషయంలో మాట్లాడిన ఇప్పుడు ఫుట్‌పాత్ ల విషయంలో మాట్లాడుతున్న అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనేదే నా అభిప్రాయంఇటీవల మాదాపూర్ లో ఫుట్పాథ్ పై కుమారి అంటి ని వేదిస్తున్నప్పుడు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆమె జోలికి పోవొద్దని అధికారులకు ఏవిధంగా ఆదేశాలు ఇచ్చారో..ఇప్పుడు ఫుట్పాథ్ ఆక్రమణల కూల్చివేతల్లో కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా ఆదేశాలు ఇవ్వాలి’ అని దానం పేర్కొన్నారు.హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు -
అక్రమ కూల్చివేతలను అడ్డుకున్న దానం!
-
హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఈ-కార్ రేస్‌లో కేటీఆర్‌కు తాను క్లీన్చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్‌కు ఇమేజ్ పెరిగిందని మాత్రమే చెప్పానని.. విచారణ జరిగేటప్పుడు కామెంట్ చేయడం సరికాదన్నారు. క్విడ్‌ప్రోకో జరిగిందా లేదా తేల్చాలి. హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెబుతున్నాను. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. తాను ఫైటర్‌ను.. ఉప ఎన్నికకు భయపడేది లేదని దానం అన్నారు.‘‘నేను ఏది మాట్లాడినా కూడా సంచలనమే అవుతుంది. మూసీపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు. వారి ఇళ్లల్లోనే చేసిన జొన్న రొట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబయికి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.’’ అని దానం నాగేందర్ చెప్పారు.‘‘పదేళ్ల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎంకి పాలాభిషేకం చేయాలి’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్! -
నిర్ణయం స్పీకర్‌దే
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఇచ్చిన అధికారాల మేరకు విధులు నిర్వహించాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో (రీజనబుల్ టైమ్) తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి..’ అని స్పష్టం చేసింది. ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తద్వారా స్పీకర్ ముందు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా కోర్టులు జోక్యం చేసుకోలేవని తేలి్చచెప్పింది. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు.అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అనర్హత పిటిషన్ల విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సెపె్టంబర్ 9న తీర్పునిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు ఇలా.. ‘స్పీకర్ తన ముందున్న పిటిషన్లపై నిర్ణయం వెలువరించిన తర్వాత కోర్టులు న్యాయ సమీక్ష జరపొచ్చు. అయితే అది కూడా చాలా స్వల్పమే. కానీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోక ముందు కోర్టులు ఆయనపై ఒత్తిడి తేలేవు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజ్యాంగ అధిపతి అయిన స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అతి స్వల్పం. తన ముందున్న అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం, స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది.స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని గతంలో ఎర్రబెల్లి దయాకర్ పిటిషన్లో ఇదే హైకోర్టు స్పష్టం చేసింది..’అని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, జంధ్యాల రవిశంకర్ వాదించారు. అయితే ‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందున్న అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి.సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. కాబట్టి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా నిరీ్ణత సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ 8 నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింగిల్ జడ్జి ఇచి్చన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదు..’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు, బీజేపీ Ôనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు.పలు తీర్పులు ప్రస్తావించిన ధర్మాసనం సెపె్టంబర్ 30న అప్పీళ్లు దాఖలైన నాటి నుంచి ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న సీజే ధర్మాసనం ఈ నెల 12న తీర్పు రిజర్వు చేసింది. ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్సెస్ తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎస్ఏ సంపత్‌కుమార్ వర్సెస్ కాలే యాదయ్య, కీష మ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్, మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాజేంద్రసింగ్ రాణా, కిహోటో హో లోహన్ సహా పలు కేసుల్లో తీర్పులను శుక్రవారం తీర్పు వెల్లడి సందర్భంగా సీజే ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు పలు కేసుల విచారణ సందర్భంగా స్పీకర్ తగిన(రీజనబుల్) సమయంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్న విషయాన్ని నొక్కి చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి తగిన అధికారం స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొంది. -
హైడ్రా ముందే మేల్కొంటే బాగుండేది: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా అంటే ప్రజల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కొంచెం ముందుగా మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కారణంగానే అక్రమ కట్టడాలను పర్మిషన్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్దారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతాను. హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెప్పలేదా?. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారు. కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలి. కూలగొట్టే ముందు అక్కడి వాస్తవ పరిస్థితులు హైడ్రా ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఒక చిన్నారి తన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయని బోరున ఏడ్చింది.. నాకు చాలా బాధగా అనిపించింది. పేదల విషయంలో హైడ్రా మరోసారి ఆలోచించాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు పది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. మా కేసు బూచీగా చూపెట్టి బీఆర్ఎస్ పెద్దలు ఆపుతున్నారు. కాస్త ఆలస్యం అయినా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పక్కా. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తిట్టిస్తున్నారు. గౌరవప్రదంగా ఉండే హరీష్ రావు కూడా గాడి తప్పారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాను’అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా..‘మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదర్షా కోట్లో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. పార్టీ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూసీ బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు.ఇది కూడా చదవండి: బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం: హైడ్రా రంగనాథ్ -
దానం నాగేందర్‌పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై దానం అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సినిమాల్లో పిచ్చి వేషాలు వేసుకునే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.మరోవైపు, కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. కంగనాపై చేసిన వ్యాఖ్యలకు దానం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన చేపట్టింది. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు దిగింది.ఇదీ చదవండి: నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ భార్య చిందులుఈ క్రమంలోనే దానం నాగేందర్ దిష్టి బొమ్మ దహనం చేశారు బీజేపీ మహిళా మోర్చా మహిళా నేతలు. దానం చేసిన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా నేతలు మండిపడ్డారు. దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. బాధ్యతగల ఎమ్మెల్యేగా చౌకబారు వ్యాఖ్యలు తగదు. దానం నాగేందర్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. -
కౌశిక్ రెడ్డికి దానం నాగేందర్ కౌంటర్
-
జూబ్లీహిల్స్‌లో ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ క్లబ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు, మెగాస్టార్ సందడి (ఫొటోలు)
-
ఐపీఎస్ రంగనాథ్‌పై సీఎంకు ఫిర్యాదు చేస్తా: దానం నాగేందర్
సాక్షి,హైదరాబాద్:హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్(హైడ్రా) కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవి రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా తనపై కేసు పెట్టడంపై దానం మంగళవారం(ఆగస్టు13) మీడియాతో మాట్లాడారు.‘ఆయనకు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లుంది. అందుకే నాపై కేసు పెట్టాడు. సీఎంకు ఫిర్యాదు చేస్తా. అధికారులు వస్తుంటారు పోతుంటారు. కానీ నేను లోకల్ నందగిరి హిల్స్ హుడా లే ఔట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందునే నేను అక్కడకి వెళ్లాను. జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్ళాను. నందగిరి హిల్స్ హుడా లే ఔట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తా. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా. ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది... నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు’అని దానం ఫైర్ అయ్యారు. -
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంపై కేసు నమోదు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–52లోని నందగిరిహిల్స్ హుడా లేఅవుట్లో ప్రభుత్వ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీగోడను పక్కనే ఉన్న గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు దౌర్జన్యంగా కూలి్చవేయడం జరిగిందని, ఇందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రోత్సాహం ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ ఇన్‌ఛార్జి వి.పాపయ్య ఇచి్చన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దానం నాగేందర్‌పై కేసు నమోదు చేశారు. నందగిరిహిల్స్ లేఅవుట్లో 850 గజాల జీహెచ్ఎంసీ ఓపెన్ స్పేస్ ఉందని, ఇది ప్రభుత్వానికి చెందినదని, దీనిని కాపాడే యత్నంలో భాగంగా చుట్టూ ప్రహరీ నిరి్మంచడం జరిగిందన్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు ఇక్కడికి వచ్చి జీహెచ్ఎంసీ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీని కూలి్చవేశారన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలంలోనే ఉండి బస్తీవాసులను ప్రోత్సహించారని, బస్తీ నేతలు గోపాల్‌నాయక్, రాంచందర్‌లను ప్రోత్స హించి ఈ కూలి్చవేతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కూలి్చవేతల వల్ల రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దానం, గురుబ్రహ్మనగర్ బస్తీ నేతలు గోపాల్‌నాయక్, రాంచందర్‌లపై బీఎన్ఎస్ 189 (3), 329 (3), 324 (4), రెడ్‌విత్ 190, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘దానం’ దమ్ముంటే రా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో తనను ఉద్దేశించి ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియాహాల్లో కౌశిక్‌రెడ్డి శనివారం(ఆగస్టు3) మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయన్నారు. సభలో రూల్స్‌కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే సీటు నుంచి మాట్లాడారన్నారు.‘దానం నాగేందర్ నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం. ఎక్కడో స్పాట్ చెప్పు రావడానికి నేను రెడీ. దానం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవడు ఇక్కడ భయపడటం లేదు. కేసిఆర్ పెట్టిన బిక్షపై నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు.గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్‌లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మరువకు. మేము మళ్లీ కొట్టే సమయం వచ్చింది. దానం నాగేందర్ నువ్వు తాజ్ క్రిష్ణ హోటల్‌కు టీషర్ట్, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు’అని కౌశిక్‌రెడ్డి దానంపై విరుచుకుపడ్డారు. -
అందుకే సహనం కోల్పోయా.. దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను టార్గెట్ చేశారని.. తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలిపారు.శనివారం ఆయన హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు. అసభ్యకర పదాలతో దూషించారని పేర్కొన్నారు.కాగా, శాసనసభలో శుక్రవారం.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు. బీఆర్ఎస్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలో వెళ్లడం, సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది. హైదరాబాద్‌లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేందర్‌కు మైక్ ఇచ్చారు. నాగేందర్ మాట్లాడటం ప్రారంభించగానే.. ఆయన వైపు తిరిగి ‘నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు’అంటూ బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా, వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పదేపదే ప్రశ్నించటంతో నాగేందర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.ఆ క్రమంలోనే సహనం కోల్పోయి.. ‘నన్ను ఏయ్ అంటారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మళ్లీ నాగేందర్‌ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావంటూ నిలదీయటంతో.‘ఏయ్ మూసుకో రా..నీయమ్మ.. తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కరిది.. నీ యమ్మ బయట కూడా తిరగనీయరా. ఏం అనుకుంటున్నార్రా మీరు...తోలు తీస్తా...బయట కూడా తిరగనియ్య.. రారా.’అంటూ మాట్లాడటంతో సభ్యులంతా విస్తుపోయారు. -
ఏయ్.. తోలు తీస్తా కొడకల్లారా.. బయట కూడా తిరగనివ్వ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శుక్రవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు. బీఆర్ఎస్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలో వెళ్లడం, సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది. అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేందర్‌కు మైక్ ఇచ్చారు. నాగేందర్ మాట్లాడటం ప్రారంభించగానే.. ఆయన వైపు తిరిగి ‘నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు’అంటూ బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా, వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పదేపదే ప్రశ్నించటంతో నాగేందర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.ఆ క్రమంలోనే సహనం కోల్పోయి.. ‘నన్ను ఏయ్ అంటారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మళ్లీ నాగేందర్‌ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావంటూ నిలదీయటంతో.‘ఏయ్ మూసుకో రా..నీయమ్మ.. తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కరిది.. నీ యమ్మ బయట కూడా తిరగనీయరా. ఏం అనుకుంటున్నార్రా మీరు...తోలు తీస్తా...బయట కూడా తిరగనియ్య.. రారా.’అంటూ మాట్లాడటంతో సభ్యులంతా విస్తుపోయారు. వెంటనే మేల్కొన్న కాంగ్రెస్ సభ్యులు నాగేందర్ వద్దకు వచ్చి మైక్ ఆన్‌లో ఉందని, అలా మాట్లాడొద్దని సూచించారు. ఇంతలో కొందరు బీఆర్ఎస్ సభ్యులు నాగేందర్ వైపు దూసుకొచ్చి తమను బూతులు తిడతావా అంటూ నిలదీశారు. రండిరా చూసుకుందాం.. అంటూ నాగేందర్ కూడా వారితో బాహాబాహికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను నిలువరించారు. అటువైపు బీఆర్ఎస్ సభ్యులను వారి పార్టీ, కాంగ్రెస్ సభ్యులు కొందరు ఆపి వెనక్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత దానం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సభలోనే ఏవో కాగితాలు చదువుతూ ఉండిపోయారు. ఖండించిన అక్బరుద్దీన్ సభ వెలుపల ఉన్న మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ వెంటనే సభలోకి వచి్చ. దానిపై స్పందించారు. సీనియర్ సభ్యుడైన దానం నాగేందర్ సభలో అన్‌పార్లమెంటరీ పదాలు వాడడం ఏమాత్రం సబబు కాదని, సభకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశా>రు. బీఆర్ఎస్ సభ్యులు కూడా అన్‌పార్లమెంటరీ పదాలు వాడుతూ తనను మాట్లాడనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఆ సందర్భంలో తాను ఆగ్రహం వ్యక్తం చేశానని, కావాలని అలాంటి పదాలు ఉచ్ఛరించలేదని, దానిపై ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని దానం పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల్లో నుంచి తొలగించే విషయమై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ పేర్కొన్నారు. అయి తే, తాను మాట్లాడింది హైదరాబాద్ నగర మాండలికంలో భాగమేనంటూ దానం నాగేందర్ పేర్కొనటం కొసమెరుపు. మాట్లా డేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ సభ్యులు అడగ్గా ఆయన ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. -
మీ చరిత్ర బయట పెడతా..
-
త్వరలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం: దానం నాగేందర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్‌లో చేరుతుండటంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై శుక్రవారం(జులై 12) మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. ‘రెండు రోజుల్లో మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్‌లో చేరుతారు. పదిహేను రోజుల్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటాం. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన అక్రమాలు వెలికి తీస్తాం. కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయటపెడతా. గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకుతో పాటు రాజేష్ రాజు లాంటి వాళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించారు. లెక్కలన్నీ బయటకు తీస్తాం’అని హెచ్చరించారు. -
TS : కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా..రాజకీయ నేతలు (ఫొటోలు)
-
ఎమ్మెల్యే ‘తెల్లం’కు కాంగ్రెస్ కండువా.. స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం(ఏప్రిల్ 7) ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఫొటోను కేటీఆర్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తాజాగా రిలీజ్ చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్ 13వ పాయింట్ గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే లు, ఎంపీలు ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టేకి వెళితే ఆటోమెటిక్‌గా అనర్హతకు గురయ్యేలా చట్ట సవరణ చేస్తాం అని మేనిఫెస్టోలో చెబుతున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించిందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కండుడవా కప్పి మరీ చేర్చుకుంటున్నారన్నారు. గెలిచేంత వరకు ఒక మాట ... గెలిచాక ఇంకో మాట. ఇదే కాంగ్రెస్ రీతి .. నీతి. బీజేపీకి కాంగ్రెస్‌కు తేడా ఏంటి. మేనిఫెస్టోలు అమలు చేసే ఉద్దేశం లేనపుడు ఎందుకీ నాటకాలు రాహుల్‌గాంధీ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే -
దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని అన్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రిగా ఉండి సికింద్రాబాద్‌కు కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్‌ను గెలిపించడమే మా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ..‘సభకు 10 లక్షల మందిని తరలిస్తాం. ఏప్రిల్ ఎనిమిదో తేదీన నాంపల్లిలో ఫిరోజ్‌ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ ఉంటుంది. బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. భువనగిరి, నల్లగొండలో ఖచ్చితంగా గెలుస్తాం. సికింద్రాబాద్‌లో కూడా దానం నాగేందర్‌ను గెలిపిస్తాం. దానం గెలుపు బాధ్యత మాదే. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఈసారి గెలిచాం. బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన. మాజీ మంత్రి హరీష్‌రావు మాటలకు అర్ధం లేదు. కేసీఆర్ చేసిన పాపాలకు వర్షాలు కూడా పడటం లేదు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నాడు. 40వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్‌ను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం. కేంద్రమంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ను పట్టించుకోలేదు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కిషన్ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నాడు. అది సాధ్యం కాదు. కాంగ్రెస్ కచ్చితంగా 14 సీట్లు గెలుస్తుంది’ అని కామెంట్స్ చేశారు. ఇక, దానం నాగేందర్ మాట్లాడుతూ..‘సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నేను గెలవడానికి అందరి సహకారం కావాలి. తుక్కుగూడ సభ విజయవంతం చేయడానికి సమావేశమయ్యాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
రాజీనామాయే ప్ర‘దానం’!
రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడుతుండటం కలకలం రేపుతోంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీకి దింపుతామని కాంగ్రెస్ అధిష్టానం తేల్చినట్టు వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. దీనికితోడు మంత్రి కోమటిరెడ్డి కూడా దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేస్తే ఇబ్బందులు వస్తాయని వ్యాఖ్యానించారు. ఇక వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించే సభ, లోక్‌సభ మేనిఫెస్టోపై చర్చించేందుకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ శుక్రవారం భేటీ అయింది. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యను కలిసిన దీపాదాస్ మున్షీ, మల్లురవి, సంపత్ కుమార్ అంతకుముందు గాం«దీభవన్ వేదికగా టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ అయింది. ఇక బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మల్లు రవి, ఇతర నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌లోకి ఆహ్వనించారు. కె. కేశవరావు కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా చేరేందుకు రంగం సిద్ధమైంది. నర్సాపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కూడా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. – సాక్షి, హైదరాబాద్ -
దానం అవుట్.. సికింద్రాబాద్ సీటు మరొకరికి??
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాకిచ్చే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఆయన తీరుతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు ఆ టికెట్ మరొకరికి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే.. ఎంపీ టికెట్ ఉంటుందని దానంకు ఏఐసీసీ ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో మూడో జాబితాలో దానం నాగేందర్ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. అయితే ముందు ఓకే చెప్పి తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఈలోపు ఆయన ఎన్నికపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. కోర్టు సైతం ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇదంతా పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ దానంను తప్పించి.. ఆ స్థానంలో మరో అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది. ఆయన పేరును ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధిష్టానం నిర్ణయం ఏంటన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్.. హైకోర్టులో మరో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. దానం కాంగ్రెస్ చేరడం, సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్‌పై పోటీ చేసి దానం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక, కొద్దిరోజుల క్రితమే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, దానంకు కాంగ్రెస్ ఎంపీ సీటు ఆఫర్ చేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి దానం బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్దం, చట్ట విరుద్దమంటూ పిటిషనర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సమయంలో దానంపై అనర్హత వేయాల్సిందిగా కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానంకు నోటీసులు జారీ చేసింది. -
కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్‌ను దానం నాగేందర్‌కు కాంగ్రెస్ ఖరారు చేసింది. కాగా, బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్కి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుడ్ బై చెప్పారు. ఇటీవల రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం -
కాంగ్రెస్‌లోకి దానం, పసునూరి!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో సిట్టింగ్ ఎంపీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, రోహిత్‌చౌదరి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి పాల్గొన్నారు. రెండు మూడురోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఈ సందర్భంగా నాగేందర్ తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పసునూరి దయాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా ఇద్దరు నేతలు ఈనెల 18న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలో నిలిపే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని గాందీభవన్ వర్గాలంటున్నాయి. మరోవైపు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎంఅర్జీ వినోద్‌రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు సికింద్రాబాద్ నుంచి పోటీచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం. -
వైఎస్సార్ హయాంలోనే కాంగ్రెస్ హవా
హైదరాబాద్: రాష్ట్రంలో అనుకూల పవనాలతో అధికారం ‘హస్త’గతమైనప్పటికీ రాజధాని హైదరాబాద్ మాత్రం కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. దశాబ్ద కాలంగా ఈ పార్టీకి ఇక్కడ ఆదరణ లభించడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడో ఎన్నికలోనూ కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవంగా పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ఖాతా తెరవడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాము కాగా, కోర్‌సిటీలో సైతం అదే పరిస్థితి నెలకొంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాత్రమే కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ మేరకు 2009లో ఖైరతాబాద్‌లో దానం నాగేందర్, జూబ్లీహిల్స్‌లో విష్ణువర్ధన్‌రెడ్డి, సనత్‌నగర్‌లో మర్రి శశిధర్‌రెడ్డి, గోషామహల్లో ముఖేశ్‌గౌడ్, సికింద్రాబాద్‌లో జయసుధ, కంటోన్మెంట్లో శంకర్రావు, మల్కాజిగిరిలో ఆకుల రాజేందర్, ఉప్పల్‌లో బండారి రాజిరెడ్డి, ఎల్బీనగర్లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో భిక్షపతి యాదవ్, మహేశ్వరంలో సబితారెడ్డి, ముషీరాబాద్‌లో మణెమ్మ తదితరులు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పూర్తిగా చతికిలపడింది. 2014లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలనుసైతం దక్కించుకోలేక పోయింది. 2018 ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్‌తో కలిసి కూటమిగా పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అన్ని స్థానాల్లో అపజయాన్ని మూటగట్టుకుంది. పదేళ్లలో రెండు పర్యాయాలు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినా..అందులోనూ సైతం మొక్కుబడి స్థానాలకు పరిమితమైంది. కాగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే. నగర అధ్యక్షుల ఎంపికలో ఆలస్యం..సీనియర్ల మధ్య సమన్వయలేమి కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చింది. 2014, 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ, 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నా అధిష్టానం సమీక్షించుకోకపోవడం దారుణం. -
అభ్యర్థులు ఎక్కడ ఓటు వేస్తారంటే?
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. నెల రోజుల నుంచి ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. గురువారం ఈ ముగ్గురు అభ్యర్థులు నియోజకవర్గంలోని వేర్వేరు డివిజన్ల పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ►బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వెంకటేశ్వరకాలనీ డివిజన్ బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని ఓల్డ్ వెంకటేశ్వరనగర్ బూత్ నెం. 130లో తన ఓటు వేయనున్నారు. ► కాంగ్రెస్ అభ్యర్థి పి. విజయారెడ్డి ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని టెలిఫోన్ భవన్ పక్కన పాఠశాల విద్యాశాఖ పోలింగ్ బూత్ నెం. 59లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి జూబ్లీహిల్స్ డివిజన్పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 2 షేక్‌పేట మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ బూత్‌లో ఓటు వేయనున్నారు. -
ఆస్తులకు మించిన అప్పుల్లో ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయగా అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. దానం నాగేందర్ పేరిట మొత్తం ఆస్తుల విలువ రూ. 41,33,50,000గా పేర్కొన్నారు. కాగా వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 47.63 లక్షలు ఉండగా ఆయన భార్య దానం అనిత పేరు మీద 78.17 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. కుమార్తె సాయి ప్రియ పేరిట 9.55 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు, పెట్టుబడుల రూపంలో భాగ్యలక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలో రూ. 16.16 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్పీ. ఇండెన్ సంస్థ నుంచి తనకు రూ. 2.74 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. తనకు వరంగల్ జిల్లా నిరుకులలో 6.09 ఎకరాలు, కళ్ళం గ్రామంలో 18.29 ఎకరాలు, నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 9 ఎకరాలు, జనగాం జిల్లా పల్లగుట్ట గ్రామంలో 16 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లా మల్యాల గ్రామంలో 4.11 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని 1432 గజాల్లో ఇల్లు ఉందని దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. తనకు రూ. 47.55 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భార్య పేరిట రూ. 2 కోట్ల అప్పు ఉందని కాగా తన చేతిలో రూ. 1.50 లక్షల నగదు మాత్రమే ఉందని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. ఆభరణాల విలువ రూ. 27కోట్లు దానం నాగేందర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ. 27 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో దానం పేరిట 1297 క్యారెట్ల వజ్రాలు(రూ.2.99 కోట్లు), 80 తులాల బంగారం(21.6లక్షలు), పది కేజీల వెండి(రూ.4.4 లక్షలు) ఉండగా ఆయన భార్య అనితకు 1350 క్యారెట్ల వజ్రాభరణాలు(3.39కోట్లు), 225 తులాల బంగారం(60.75లక్షలు) ఉన్నాయి. రూ. 10.82 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. -
విద్యాసాగర్ రావును బీజేపీ బలి పశువును చేస్తోంది: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు రాష్ట్రానికి ఇచ్చిన వివరాలను ‘రిపోర్టు టు పీపుల్ పేరుతో’ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పవర్ పాయింట్‌ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ సందర్బంగా దానం నాగేందర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి వాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. రావాల్సిన నిధులు ఇప్పటివరకు కేంద్రం ఇవ్వలేదు. ఎంపీగా గెలిచిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గానికి కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలి. మోటర్లకు మీటర్లు పెడతామని కేంద్రం చెప్పలేదా?. రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం అడ్డుకుంది. హైదరాబాద్, తెలంగాణ నుంచి వస్తున్న రిసోర్సెస్ వల్లనే రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. దాని ఆధారంగానే అభివృద్ధి జరుగుతోంది. కిషన్ రెడ్డి ఈ మాయ మాటలు పక్కన పెట్టాలి. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీ. విద్యాసాగర్ రావు హైదరాబాద్ రెండో రాజధాని అంటూ చేసిన కామెంట్స్‌పై కూడా దానం స్పందించారు. తెలంగాణకు రెండో రాజధాని అంటూ బీజేపీ మళ్లీ మాటలు చేప్తోంది. హైదరాబాద్ ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. విద్యాసాగర్‌ను బలిపశువును చేయడానికే బీజేపీ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తోంది. ఇది కూడా చదవండి: రాహుల్‌తో జూమ్ మీటింగ్.. 22న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల! -
ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిని నేనే
బంజారాహిల్స్: ‘ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అపోహలు, వదంతులు నమ్మొద్దు’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పెద్ద సంఖ్యలో విచ్చేసిన కార్యకర్తల సమక్షంలో స్పష్టం చేశారు. ఫిలింనగర్ బస్తీల్లో పాదయాత్ర చేయడానికి వచ్చిన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రికి అన్నీ తెలుసని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా తనే నిలబడతానని వెల్లడించారు. కొంత మంది యూట్యూబ్ చానళ్లు పెట్టుకొని పనికిమాలిన వార్తలను ప్రసారం చేస్తుంటారని, అదే పనిగా వైరల్ చేస్తున్నారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో మరోసారి గులాబీ జెండా గుబాళిస్తుందని వెల్లడించారు. -
అర్వింద్ పద్ధతి మారకుంటే ప్రజలు ఊరుకోరు: దానం
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను లక్ష్యంగా చేసుకుని ఎంపీ ధర్మపురి అర్వింద్ చేస్తున్న వ్యక్తిగత దాడిని ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకునేది లేదని, పద్ధతి మార్చుకోకపోతే ప్రజల చేతిలో చావుదెబ్బతినాల్సి వస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. శనివారం ఆయన కవితను కలసి సంఘీభావం తెలిపారు. అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలసి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ మాటలు వింటే ప్రజల రక్తం మరిగిపోతోంద న్నారు. కాంగ్రెస్ పార్టీలో బీఫారమ్స్ అమ్ముకున్న చిల్లర వ్యక్తి అరవింద్ ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారన్నారు. -
Sadar Festival 2022 :హైదరాబాద్ లో వైభవంగా సదర్ వేడుకలు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ ఎమ్మెల్యే కార్లపై 66 చలాన్లు.. రూ. 37, 365 చెల్లించి..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు పెండింగ్ చలాన్లను ఆదివారం క్లియర్ చేశారు. కొంత కాలంగా ఆయనకు చెందిన టీఎస్ 09 ఎఫ్ఏ 0999తోపాటు మరో నాలుగు కార్లకు 66 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఈ వాహనాలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెండింగ్ చలాన్ల జాబితా గుట్టురట్టైది. దీంతో 66 చలానాలకుగాను రూ. 37365లను ఎమ్మెల్యే చెల్లించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు చెందిన చలానాలు క్లియర్ అయినట్లు తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు -
విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్
Danam Nagender Fires On Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్సేన్- ప్రముఖ టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్లో జరిగిన డిబెట్లో విశ్వక్ సేన్, సదరు యాంకర్ దేవీ నాగవల్లి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ అభ్యంతరకర ఎఫ్.. పదంతో దూషించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీనిపై మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: విశ్వక్సేన్పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్ ‘చానళ్లు విశ్వక్ సేన్ హీరోగా గుర్తిస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ, మేం మాత్రం అతడిని హీరోగా గుర్తించడం లేదు. లైవ్‌లో ఇలాంటి అసభ్యకర పదాలు వాడటం కరెక్ట్ కాదు. దేవి నాగవళ్లికి యాంకర్‌గానే కాదు, బయట సమాజంలో కూడా మంచి పేరు ఉంది. అలాంటి యాంకర్‌ను పట్టుకుని అతడు అలా అనడం సహించరానిది. మీడియాలో మాట్లాడాల్సిన సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందుకు రావాలి. లేకపోతే సైలెంట్‌గా ఉండాలి. స్టూడియోలో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటల మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి’ అన్నారు. లేకపోతే మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తామని, అతను ఆ మాట అనగానే అదే వేదికపై యాంకర్ చెప్పుతో కొట్టేది ఉండే అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ ‘విశ్వక్ సేన్ బయట కనపడితే మా మహిళలు చెప్పులు తీసుకుని కొడతారు. విశ్వక్ సేన్ లాంటి వ్యక్తికి బుద్ది చెప్పాల్సిందే. ఇంకోసారి మరెవరు ఇలాంటి పదాలు వాడకుండా చేయాలి. విశ్వక్ సేన్ లాంటి వాళ్లను సినిమాల్లోకి తీసుకోవద్దని దర్శక నిర్మాతలను కోరుతున్నాను’ అని దానం నాగేందర్ పేర్కొన్నారు. అయినప్పటికీ తమ మహిళ సంఘాలు ఆయనను కొట్టడానికి రెడీగా ఉన్నారని దానం హీరోపై ఫైర్ అయ్యారు. అనంతరం రోడ్లపై ఇలాంటి వ్యవహరాలు చేయడం. కిరోసిన్ డబ్బాను పట్టుకుని సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి ఆయన ఏమైన పెద్ద హీరో అనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే యాంకర్ దేవి నాగవళ్లి ఫిర్యాదుతో విశ్వక్ సేన్‌పై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
GHMC: మేయర్ సహా మంత్రులకు జీహెచ్ఎంసీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీ నుంచి ట్విట్టర్ ద్వారా ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఇతర నిబంధనల అతిక్రమణలపై ఫిర్యాదుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(సీఈసీ) ఫిర్యాదుల స్వీకరణను పునరుద్ధరించింది. టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేందుకు, వారికి పెనాల్టీలు వేయకుండా ఉండేందుకేనని ప్రజల నుంచి ముఖ్యంగా నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సర్వర్ అప్డేషన్ కోసమని సీఈసీ పేర్కొన్నా ప్రజలు విశ్వసించలేదు. ప్రతిపక్ష రాజకీయపార్టీలు ఆందోళనలు సైతం నిర్వహించాయి. ► తాజాగా ట్విట్టర్ ఖాతా తెరిచి ఇన్ని రోజుల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ చలానాలతో పెనాల్టీలు విధించారు. ఈ పెనాల్టీల విధింపులో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. పెనాల్టీల విధింపు ఇంకా కొనసాగుతోంది. తాజా సమాచారం మేరకు జారీ అయినా పెనాల్టీల్లో ఆయా నాయకులకు పడ్డ మొత్తం పెనాల్టీలు దాదాపుగా దిగువ విధంగా ఉన్నాయి. (వాట్సాప్ చెకింగ్ వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్) ► ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో ఫ్లెక్సీల ఏర్పాటుకు ఈ పెనాల్టీలు విధించారు. అందరికంటే ఎక్కువగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు రూ.3 లక్షలకు పైగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రూ.1.60 లక్షలకు పైగా పెనాల్టీలు పడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట రూ.2.20 లక్షలు, మంత్రి చామకూర మల్లారెడ్డికి రూ.10 వేలు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావుకు రూ.10 వేలు, కాలేరు వెంకటేశ్‌కు రూ.25 వేలు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి రూ.60వేలు పెనాల్టీలు పడ్డాయి. కార్పొరేటర్ రాగం సుజాత రూ.2 లక్షలు. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?) -
చివరి శ్వాస ఉన్నంత వరకూ టీఆర్ఎస్తోనే: దానం
సాక్షి, హైదరాబాద్: ‘చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్తోనే ఉంటా. విధేయతతో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం కిందే పనిచేస్తా. నా ఇంటికి ఎవరు వచ్చినా టీఆర్ఎస్ కండువా కప్పుకుని రావాల్సిందే’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఆయన పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్లో చిచ్చు పెట్టేవారికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న వారు ఎలా పనిచేస్తారో అందరికీ తెలుసన్నారు. రేవంత్ నాయకత్వంలో ఎలా పనిచేస్తారో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్‌లో తనకు చాలా అవమానాలు జరిగాయన్నారు. కాంగ్రెస్‌లో కంటే టీఆర్ఎస్లో నాకు పదింతలు గౌరవం దొరుకుతోందన్నారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి జరగనందునే ఆత్మ పరిశీలనతో టీఆర్ఎస్ చేరి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములయ్యేందుకు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో భవిష్యత్తు లేదన్నారు. తాను సీఎం కేసీఆర్‌ను మంత్రి పదవి అడగలేదని ఇకముందు కూడా అడగని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు అదే పనిగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
దానం నాగేందర్ వియ్యంకుడిపై దాడి
సాక్షి, బంజారాహిల్స్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడు అనిల్ కుమార్ కిషన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 15లో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే నాగేందర్ వియ్యంకుడు అనిల్ కిషన్ సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మీటింగ్ ముగించుకొని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ మీదుగా కళాంజలి నుంచి తన ఇంటికి కారులో వెళ్తున్నాడు. కళాంజలి షోరూం దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై వెనుక నుంచి రాళ్లతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఆయన తన వియ్యంకుడు దానం నాగేందర్‌కు ఫోన్ చేశారు. అప్రమత్తమైన దానం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ నాయుడు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈఘటనలో కారు అద్దాలు పగిలి ఉన్నాయని, సీసీ ఫుటేజీలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్నదానిౖపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
బంజారాహిల్స్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తెలంగాణకు చెందిన ఒక్క క్రీడాకారుడిని కూడా ఎంపిక చేయకపోవడం పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో క్రీడాకారులను అందించిన హైదరాబాద్ నుంచి క్రికెట్‌కు ఆటగాడిని ఎంపిక చేయకపోవడం పట్ల ఆ జట్టు యాజమాన్యాన్ని దుయ్యబట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు లేకుండా అది హైదరాబాద్ జట్టు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా పునరాలోచించి స్థానిక క్రికెటర్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎంపిక చేయకపోతే త్వరలో ఉప్పల్‌లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించారు. మిగతా అన్ని జట్లు తమ ప్రాంతం వారికి అవకాశం కల్పిస్తే ఎస్ఆర్హెచ్ మాత్రమే విదేశీ, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిందని, ఇది చాలా బాధాకరమన్నారు. చదవండి: ఆ రికార్డుకు ఆరు వికెట్ల దూరంలో.. -
షేక్‌పేట తహసీల్దార్.. బదిలీ రగడ!
సాక్షి, హైదరాబాద్: నగరంలో షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక బదిలీపై రగడ రగులుకుంటోంది. తాజాగా మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యలతో దీనికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు బలం చేకూర్చినట్లయింది. బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికైన మరుసటి రోజు షేక్‌పేట తహసీల్దార్‌కు స్థానచలనం కలిగించడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. సరిగ్గా పక్షం రోజుల క్రితం జనవరి 20న ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగతున్న నిర్లక్ష్యం..జాప్యంపై ప్రశ్నించేందుకు బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి షేక్‌పేట తహసీల్ ఆఫీస్‌కు వెళ్లారు. ఈనేపథ్యంలో ఎమ్మార్వో శ్రీనివాస్‌రెడ్డి..కార్పొరేటర్ విజయలక్ష్మి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ విజయలక్ష్మి ఒకరిపై మరొకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ఈ నెల 11న కార్పొరేటర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికైన 72 గంటల్లోనే శ్రీనివాస్‌రెడ్డిపై బదిలీ వేటు వేస్తూ సీసీఎల్ఏలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్‌కు ఫిర్యాదు చేశాం: దానం నాగేందర్ షేక్‌పేట తహసీల్దార్‌పై ఎంపీ కేశవరావుతో కలిసి సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులంటే తహసీల్దార్‌కు గౌరవం లేదన్నారు. ఆదాయ, కులదృవీకరణ పత్రాల జారీలో నిర్లక్ష్యం వహించడం వల్లనే సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అండగా ఉద్యోగ సంఘాలు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి అండగా నిలబడ్డాయి. రాజకీయ జోక్యంతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూన్నాయి. ఏకంగా మీడియా ముందుకు వచ్చి గళం విప్పుతున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ఎంపీ కె.కేశవరావు కుమార్తె, అమెరికాలో ఉన్నత ఉద్యోగం సైతం వదిలి ప్రజా సేవకు వచ్చిన ఆమె.. ఇటువంటి చిన్న చిన్న విషయాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. అధికారికంగా ఉత్తర్వులు అందలేదు: శ్రీనివాస్ రెడ్డి ఇంకా అధికారికంగా తనకు బదిలీ ఉత్తర్వులు అందలేదని షేక్‌పేట మండల తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు జరగడం సాధారణమేనని, తన బదిలీ కూడా అలా జరిగే ఉంటుందని భావిస్తున్నానన్నారు. తనను ఎందుకు బదిలీ చేశారో తెలియదన్నారు. కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి ముందుగా తనపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఆ తర్వాతే తాను కౌంటర్ పిటిషన్ వేశానన్నారు. ఆదాయ «ధృవీకరణ పత్రం కోసం ఆమె ఫోన్‌చేశారని, తన వద్ద వీఆర్వోలు లేరన్న విషయాన్ని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఆ కొద్దిసేపటికే ఆఫీస్‌కు వచ్చారని, ఆ సమయంలో కోర్టుకు వెళ్లాల్సి ఉండగా కేసును స్టడీ చేస్తున్నానని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే తాను నడుచుకున్నానన్నారు. చదవండి: మేయర్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ -
ఎమ్మెల్యే దానంపై పోలీసులకు ఫిర్యాదు
-
వైరల్: ‘బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే దానం’
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్‌కు చెందిన ఓ స్థల వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్యాంక్ అధికారులతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తమను బెదిరించారంటూ బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 10 ఏళ్ల క్రితం ఖైరతాబాద్‌లోని ఓ స్థలంపై ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆ స్థలాన్ని బ్యాంక్ బహిరంగ వేలానికి పెట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దానం నాగేందర్ బ్యాంక్ అధికారుల విధులకు అడ్డుతగిలారు. ఎమ్మెల్యే తన అనరుచరులతో కలిసి వేలాన్ని అడ్డుకున్నారని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తమపై దౌర్జన్యం చేశారని, బెదిరింపులకు దిగారని తెలిపారు. ఆయన అనుచరులు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ) -
సచివాలయంపై కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ హైకోర్టును తప్పుదోవ పట్టించాయని మాజీ మంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డితో కలసి శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాతే సచివాలయం కూల్చివేతలు ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరేళ్లుగా అభివృద్ధి జరుగుతున్నా కళ్లుండీ చూడలేని కబోదులుగా విపక్షాలు మారాయని విమర్శించారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తున్నా ప్రతిపక్షాల వైఖరి మారడం లేదని, రాబోయే రోజుల్లో విపక్షాలకు బంగాళాఖాతమే దిక్కవుతుందన్నారు. సచివాలయంలో దేవాలయం, ప్రార్థనా మందిరం దెబ్బతినడంపై సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వడంతో పాటు మత పెద్దలతో కూడా మాట్లాడారని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రోడ్ల విస్తరణ పేరిట ప్రార్థనా మందిరాలను కూల్చివేశారన్నారు. మతాల నడుమ చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాద్‌లో మత సామరస్యానికి భంగం వాటిల్లకుండా చూస్తామని, విపక్షాల కుట్రలను అనుమతించేది లేదన్నారు. సచివాలయం శిథిలాలను తిరిగి వినియోగించుకునేందుకు జీడిమెట్లలో ప్రత్యేక ప్లాంటు నెలకొల్పినట్లు బొంతు రామ్మోహన్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న గంగా జమునా తెహజీబ్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. కొత్త సచివాలయం రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రతిపక్షాల తీరు మారకుంటే మరింతగా ప్రజలకు దూరమవడం ఖాయమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. -
చెయ్యి కడుక్కోవే శీనన్నా...
సాక్షి, బంజారాహిల్స్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర సరకులు ఎలా అందుతున్నాయో పరిశీలించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న (గురువారం) ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి బంజారాహిల్స్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా దానం ఇంటికి వచ్చిన శ్రీనివాస్ యాదవ్‌కు శానిటైజర్‌తో చేతులు కడిగించారు. ప్రజలకు మరింత అవగాహన పెంచే దిశలో నాగేందర్ గత పది రోజుల నుంచి తన ఇంటి వద్ద ప్రత్యేకంగా శానిటైజర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ తానే దగ్గరుండి చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కలిగిస్తున్నారు. (కరోనా కథ.. ఇల్లే సురక్షితం) కాగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మంత్రి తలసాని అన్నారు. నిన్న ఆయన బేగంబజార్‌లోని మిట్టికా షేర్ హోల్‌సేల్ మార్కెట్లో వ్యాపారులతో సమావేశం అయ్యారు. మార్కెట్లో సుమారు 300 దుకాణాలు ఉన్నాయని, రోజుకు 40 దుకాణాల చొప్పున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల విక్రయాలు జరుపుకోవాలని సూచించారు. (బ్రేక్ 'కరోనా') నిత్యావసరాలపై నిఘా అవినాష్ మహంతి నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రెండు రోజుల్లో 20 వేలకు పైగా పాసులు జారీ లాక్డౌన్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాల కదలికల్ని సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి, ఆయా విభాగాలతో సమన్వయానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ కొత్వాల్ అంజనీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. మొత్తం 25 మంది అధికారులతో ఉండే ఈ బృందం 24 గంటలూ మూడు షిఫ్టుల్లో నిర్విరామంగా సేవలు అందిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకువచ్చే లారీలు, నగరంలో వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే వాహనాల కదలికలకు ఆటంకం లేకుండా సాగేలా ఈ టీమ్ ఆద్యంతం పర్యవేక్షించనుంది. అలాగే మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు అత్యవసర సేవలు అందించే వ్యక్తులు, వాహనాలకు బుధవారం నుంచి ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తున్నారు. దీనికోసం ఎవరికి వారు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువుల్ని ఇళ్లకు సరఫరా చేసే ఈ–కామర్స్ వాహనాలు, వ్యక్తులు, కోళ్లు, కోడిగుడ్లు, ఆవులు, గేదెలు రవాణా చేసే వాహనాలు, కూరగాయలు తరలించే లారీలు, హాస్పిటల్స్‌లోని వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు, వివిధ స్టార్ హోటళ్లు, లాడ్జిలలో పనిచేసే ఉద్యోగులకు, మండీలు, మార్కెట్లలో పని చేసే హమాలీలు, ఇతర ఉద్యోగులు చేపలు, మాంసం, వంటనూనె,పంచదార రవాణా చేసే వాహనాలు, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవల టెక్నీషియన్లకు కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు పాస్‌లు ఇస్తున్నారు. గురువారం రాత్రికి జారీ చేసిన పాసుల సంఖ్య 20 వేలు దాటింది. ఈ పాసులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులుని స్పష్టం చేస్తున్నారు -
‘దానం’ అన్నను గెలిపించండి: లగడపాటి పద్మ
సాక్షి, హైదరాబాద్(ఖైరతాబాద్) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వాతావరణం, ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ చెబుతుంటే మరోవైపు ఆయన సతీమణి పద్మ టీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ సతీమణి అనితతో కలిసి ఆమె మంగళవారం రాత్రి ఖైరతాబాద్ డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. దానం నాగేందర్ అన్నను గెలిపించాలని కోరారు. ఏ ప్రభుత్వమూ ఐదేళ్లలో పనులన్నీ పూర్తి చేయలేదన్నారు. పదేళ్లలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి దానం నాగేందర్‌ను గెలిపించాలని కోరారు. -
దానం అంటేనే దందాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై పోరాటమే తప్ప తనకు ఏ గూండాయిజం తెలియదని ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. దానం నాగేందర్ అంటేనే దళారితనం, దందాలు, కబ్జాలని ఆరోపించారు. దానంకు ఖైరతాబాద్‌లో ఓడిపోతాననే భయం పట్టుకుందని.. దాంతోనే ఎవరికో డబ్బులు ఇచ్చి తనకు టికెట్ ఇప్పించానని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్ లో మధుకర్‌యాదవ్, నిరంజన్, మహేశ్యాదవ్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు 15 రోజులు తన కోసం వెచ్చిస్తే జీవితాంతం నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడతానని చెప్పారు. -
‘ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టినా నాదే విజయం’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ వందల కోట్లు ఖర్చు పెట్టినా ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్‌లో ప్రజలు 15 రోజులు తనకు కేటాయించి గెలిపిస్తే. ఐదేళ్లు వారికి సేవ చేసుకుంటానన్నారు. దానం నాగేందర్‌లాగా తనకు చిల్లర రాజకీయాలు చేయడం రాదని చెప్పారు. ఆయనలా తాను భూ కబ్జాలు, దందాలు చేయలేదన్నారు. ఒక డ్రైవర్‌గా ఉన్న దానం దందాలు, రాజీకీయాలు చేసి వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. దానం నాగేందర్ పీజేఆర్‌ను మానసికంగా హింసించి ఆయన చావుకు కారణమయ్యారని ఆరోపించారు. దానం అంటేనే దందాలు, దౌర్జన్యాలు, దళాలు అని ఎద్దేవా చేశారు. దానం ఎన్ని కుట్రలు చేసినా ఖైరతాబాద్‌లో తానే గెలుస్తానని శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు. -
నాడు శత్రువులు.. నేడు మిత్రులు
బంజారాహిల్స్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు/శత్రువులు ఉండరు. అందుకు ఈ రెండు ఉదంతాలే నిదర్శనం. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు టీడీపీ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ పార్టీల పరంగా బద్ధ శత్రువులు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇప్పుడు వారిద్దరినీ టీఆర్ఎస్ ఒక్కటి చేసింది. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్‌కు ఖైరతాబాద్ టిక్కెట్ కేటాయించగా టీఆర్ఎస్లోనే ఉన్న విజయరామారావు మద్దతు కావల్సి వచ్చింది. దీంతో నాగేందర్ శనివారం విజయరామారావు ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 2009లో ఇద్దరూ పోటీపడ్డ విషయాన్ని సరదాగా గుర్తుచేసుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థిగా విజయారెడ్డి పోటీ చేశారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ బరిలో నిలిచారు. ఈ ఇద్దరు హోరాహోరీ తలపడ్డారు. ఈ ఎన్నికల అనంతరం విజయారెడ్డి టీఆర్ఎస్లో చేరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచారు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్‌కు ప్రస్తుతం ఖైరతాబాద్ టిక్కెట్ దక్కడంతో.. నాడు పోటీలో నిలిచి ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న విజయారెడ్డి వద్దకు వెళ్లి ఆమె మద్దతు కోరారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని ఈ రెండు సంఘటనలు కళ్లకు కట్టాయి. తొలి మహిళా మంత్రి హైదరాబాదీ పరదా ధరించే సంప్రదాయం.. మగవాళ్ల మధ్యలోకి రావద్దంటూ ఆంక్షలు..ఆపై రజాకార్ల ఆగడాలు.. ఇంతటి ఆంక్షల చట్రంలోనూ ఉన్నత చదువులు పూర్తిచేసి, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు మాసుమా బేగం! హైదరాబాదీ అయిన మాసుమా బేగం చిన్నప్పట్నుంచే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా సరోజిని నాయుడుతో పరిచయం ఏర్పడింది. 1928లో బొంబాయిలో తొలిసారిగా నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్ స్టేట్‌లో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన కమ్యూనిస్టు యోధుడు మఖ్దూం మొహియుద్దీన్పై 780 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. మొహియుద్దీన్ పీడీఎఫ్ టికెట్‌పై.. మాసుమా బేగం కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాసుమా బేగం డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో çఫత్తర్‌గట్టి నుంచి శాసనసభ్యురాలిగా విజయం సాధించారు. 1960లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రభుత్వంలోనూ మాసుమా బేగం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. -
టీఆర్ఎస్ జాబితాలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు?
టీఆర్ఎస్ ఇప్పటివరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో సామాజికవర్గాల వారీగా వివరాలివి.. రెడ్డి – 37, వెలమ– 12, కమ్మ– 6, బ్రాహ్మణ– 1, వైశ్య– 1, ఠాకూర్ –1, మున్నూరుకాపు– 8, గౌడ– 6, యాదవ– 5, ముదిరాజ్– 1, పద్మశాలి– 1, విశ్వబ్రాహ్మణ –1, పెరిక– 1, వంజర– 1, మాదిగ– 11, మాల– 7, నేతకాని– 1, లంబాడ–7, కోయ–4, గోండు–1, ముస్లిం–3, సిక్కు–1. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటన జారీ చేశారు. కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు ఒకటిరెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. తాజాగా ప్రకటించిన జాబితాతో టీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య 117కు చేరింది. సెప్టెంబర్ 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అక్టోబర్ 21న మలక్‌పేట, జహీరాబాద్ స్థానాల అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా పది మంది పేర్లతో జాబితా విడుదల చేశారు. మల్కాజ్గిరి లోక్‌సభ సభ్యుడు చామకూర మల్లారెడ్డికి మేడ్చల్ స్థానంలో అవకాశం కల్పించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌ను వరంగల్ తూర్పు అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావును మల్కాజ్‌గిరిలో పోటీకి దింపారు. అనూహ్యంగా చార్మినార్ స్థానంలో ముస్లిం అభ్యర్థిని ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించడం వల్లే చార్మినార్‌లో ముస్లిం అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. కోదాడకు వేనపల్లి చందర్రావు, ముషీరాబాద్‌కు ముఠా గోపాల్ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించిన 117 సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, ముస్లింకు 3, సిక్కు వర్గానికి ఒకటి చొప్పున స్థానాలను కేటాయించింది. అభ్యర్థుల తాజా జాబితా ఇదీ మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి, గోషామహల్ – ప్రేమ్‌సింగ్‌రాథోడ్, చార్మినార్ – మహ్మద్ సలావుద్దీన్ లోడీ, వరంగల్ తూర్పు – నన్నపునేని నరేందర్, హుజూర్నగర్ – శానంపూడి సైదిరెడ్డి, వికారాబాద్ – డాక్టర్ మెతుకు ఆనంద్, అంబర్‌పేట – కాలేరు వెంకటేశ్, మల్కాజ్గిరి – మైనంపల్లి హనుమంతరావు, చొప్పదండి – శొంకె రవిశంకర్, ఖైరతాబాద్ – దానం నాగేందర్ -
టికెట్ ఎవరికిచ్చినా మద్దతిస్తా: దానం
హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్‌పై రెండు మూడు రోజుల్లో నిర్ణయం రానుందని, టీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ టిక్కెట్ ఎవరికిచ్చినా తన మద్దతు ఉంటుందని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో దానం విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. పొన్నాల లాంటి సీనియర్ నేతను బలి పశువును చేశారని విమర్శించారు. బీసీ నాయకులను రోడ్డున పడేసి.. ఏసీ రూముల్లో మీటింగ్‌లు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతుందని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిన వాళ్లు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానిస్తున్నానని, కేసీఆర్ అన్ని వర్గాలకు వారికి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఒకరి తోక మరొకరు కట్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
‘అలా చేస్తే సగం మీసం తీసేస్తా’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి అధికార పీఠం టీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ నమ్మకం వ్యక్తం చేశారు. సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడనున్న మహాకూటమికి ఘోర పరాభావం తప్పదని, తాజా సర్వేల్లో ఈ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. కుటంబ పాలనపై గొంతు చించుకుంటున్న టీపీసీసీ ఆధ్యక్షడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి దానం సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి కుటుంబానికి ఒక్కరికే సీటు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. అలా చేస్తే సగం మీసం తీసేసి తిరుగుతానని ఉత్తమ్‌కు దానం చాలెంజ్ చేశారు. -
ఆ వార్తలు ఆవాస్తవం
-
టికెట్ ఇవ్వకున్నా టీఆర్ఎస్లోనే: దానం
హైదరాబాద్: తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచా రం జరుగుతోందని, తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. తన నివాసం లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమా ర్రెడ్డిని తాను ఓ హోటల్లో కలిసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితా లో తన పేరు లేకపోవడం ఏ మాత్రం బాధించలేదన్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌లోనూ అసంతృప్తి రావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాకుండా చిత్తుగా ఓడించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. టీఆర్ఎస్ టికెట్‌ను ఎవరికి ఇచ్చినా వారి గెలుపుకోసం శ్రమిస్తానని వెల్లడించారు. -
టికెట్‌పై సస్పెన్స్: ఎట్టకేలకు మౌనం వీడిన దానం
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత దానం నాగేందర్‌కు గులాబీ అధినేత కేసీఆర్ ఇంకా టికెట్ ఖరారు చేయని సంగతి తెలిసిందే. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండగా.. గోషామహల్ నుంచి పోటీచేయాల్సిందిగా ఆయనను టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించినట్టు కథనాలు వస్తున్నాయి. టికెట్ ఖరారు చేయకపోవడంతో దానం అసంతృప్తిగా ఉన్నారని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఎట్టకేలకు మౌనం వీడారు. తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న కథనాలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తనకు టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా టీఆర్ఎస్లోనే కొనసాగుతానని దానం చెప్పారు. పార్టీ మారాలనుకున్న నాయకులు ‘వెళ్ళిపోతే... వెళ్లిపోవాలి’ తప్ప ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో కేటీఆర్ కోటరీ ఉంది అనడం తప్పు అని మీడియాతో చెప్పారు. తరచూ పార్టీలు మారడానికి తానేమీ గంగిరెద్దును కాదని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒప్పందం లేకుండానే తాను టీఆర్ఎస్లో చేరానని చెప్పారు. -
అసమ్మతి తిరుగుబావుటా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేస్తారన్న ఊహాగానాలు వచ్చినప్పుడే టీఆర్ఎస్లో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే, గులాబీ బాస్ మాత్రం ఎక్కడిక్కడ తాజా మాజీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయిస్తూ ప్రకటన జారీ చేశారు. దీంతో గ్రేటర్‌లోని ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి వర్గాలు తిరుగుబావుటా ఎగరేశాయి. మొదటి రెండు రోజుల్లో షాక్‌లో ఉన్న ఆశావహులు, తర్వాత తేరుకుని వేరు కుంపట్లకు రెడీ అయ్యారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం గ్రూపులు కట్టారు. తమ నిరసనను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఇంతకాలం అధికారం చెలాయించిన తాజా మాజీలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. టికెట్లు ఆశించినవారు సైతం రెబెల్స్‌గా మారారు. దీంతో ఎవరిని బుజ్జగించాలో.. ఇంకెవరి స్థానాలు మార్చాలో తెలియని పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. ఇదే అదునుగా ఇంతకాలం గుంభనంగా ఉన్నవారు సైతం తమకు ప్రజాబలం ఉందని.. తమకు టికెట్ ఇస్తే టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం తమ వెంట వస్తారని కాంగ్రెస్, టీడీపీ అధినేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో గ్రేటర్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ ముగ్గురు ఎటు వైపు..? కుత్బుల్లాపూర్: టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాయి. కుత్బుల్లాపూర్‌లో ఇప్పటి దాకా తెర చాటుగా ఉన్న గ్రూపు రాజకీయాలు బహిరంగ సమరానికి సై అంటున్నాయి. ఇక్కడి నుంచి తనకు టికెట్ ఇస్తే తన వెంట ముగ్గురు కార్పొరేటర్లు వస్తారని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్.. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాను కలిసి విన్నవించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ కార్పొరేటర్లుగా కొనసాగుతున్న పై ముగ్గురు జ్ఞానేశ్వర్ వెంట నడుస్తారా.. లేక పార్టీ అభ్యర్థికి మద్దతునిస్తారా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం పనిచేస్తామని, ఏ ఒక్కరూ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. సిట్టింగ్‌కు కార్పొరేటర్ల మధ్య దూరం.. తాజా మాజీ ఎమ్మెల్యేగా వివేకానంద్‌కు సీటు కేటాయించడంతో కార్పొరేటర్లు కనీసం వివేకానంద్‌ను కలిసేందుకు కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. రెండు రోజుల క్రితం ప్రకటన వెలవడగానే కేవలం రెండు, మూడు డివిజన్ల కార్యకర్తలు, కార్పొరేటర్లు మాత్రమే హంగామా చేశారు. తిరుగుబావుటా ఎగురవేసిన కార్పొరేటర్లు మాత్రం వివేకానంద్‌ను కలవకుండానే వేరు కుంపటి పెట్టడం చర్చానీయాంశమైంది. ఇంతలోనే కాసాని విషయం వెలుగులోకి రావడంతో టీఆర్ఎస్లో మరింత ఆందోళన మొదలైంది. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు ఆయన వర్గీయులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. అయితే సీఎం చెప్పిన విధంగానే సిట్టింగ్‌లకు అవకాశం ఇవ్వడంతో అటు కార్పొరేటర్లు, ఇటు గ్రామాల సర్పంచ్‌లు గ్రూపులు కట్టారు. శంభీపూర్‌కు టికెట్ ఇవ్వాలని తీర్మానం కుత్బుల్లాపూర్: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని మంత్రి కేటీఆర్‌ను కోరాలని కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీర్మానించారు. ఆదివారం మండలంలోని ఓ రహస్య ప్రాంతంలో సమావేశమైన వీరంతా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును నిలదీశారు. టికెట్ నీకేనని తామంతా ప్రచారం చేశామని, తీరా ఫలితం తారుమారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, రావుల శేషగిరి, విజయ్‌శేఖర్‌గౌడ్‌తో పాటు జడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్‌రెడ్డి, పలువురు సర్పంచ్‌లు, 14 మంది ఎంపీటీసీలు ఈ సమావేశంలో పాల్గొని తమకు కేటీఆర్‌ను కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్థి విషయంపై తమ అభిప్రాయాన్ని ఆయనకు చెబుతామన్నారు. అయితే, పార్టీ నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్ట వద్దని, అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని రాజు చెప్పగా.. పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఈ రహస్య సమావేశం మరింత హాట్‌టాపిక్‌గా మారింది. ఎల్బీనగర్కు అసమ్మతి సెగలు అధికార టీఆర్ఎస్లో ‘ముందస్తు’ అభ్యర్థుల ప్రకటన అసమ్మతి నగరమంతటా విస్తరిస్తోంది. ఆదివారం ఎల్బీనగర్లో అభ్యర్థితో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశానికి ఏడుగురు కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, జూబ్లీహిల్స్,రాజేంద్రనగర్‌లలో కార్పొరేటర్లే కేంద్రంగా అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఉప్పల్ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఏకంగా మేయర్ రాంమోహన్ పావులు కదుపుతున్నారు. ఇక అభ్యర్థులు ప్రకటించని ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట, మేడ్చల్ నియోజకవర్గాల్లో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. సందిగ్దంలో దానం నాగేందర్ ఖైరతాబాద్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి దానం నాగేందర్‌ను గోషామహల్ నుండి పోటీ చేయాల్సిందేనని పార్టీ ముఖ్యనేత హుకుం జారీ చేయడంతో ఆయన ఒకటి రెండు రోజుల్లో అక్కడ ప్రచారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఖైరతాబాద్‌లో కార్పొరేటర్ విజయారెడ్డి – మన్నె గోవర్ధన్రెడ్డిలలో ఒకరికి టికెట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇక ముషీరాబాద్‌లో హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తన సమీప బంధువు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి టికెట్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని బృందం నాయినిని కలిసి శ్రీనివాసరెడ్డి అన్ని విధాలుగా అర్హుడని ఆయనకే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజులుగా సీఎంను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. గోషామహల్లో ముస్లిమేతరులను అంగీకరించం బంజారాహిల్స్: ముస్లింలకు కనీసం పది సీట్లు కేటాయించాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ సీనియర్ నేత సయ్యద్ సాజిద్ అలీ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రకటించిన 105 స్థానాల్లో ముస్లింలకు కేవలం రెండు సీట్లు మాత్రమే కేటాయించారని ఇది అన్యాయమన్నారు. గోషామహల్లో పోటీ చేసేందుకు దానం నాగేందర్‌ను బతిమిలాడుతున్నారని, ముఖేష్‌గౌడ్ చుట్టూ తిరుగుతున్నారని అయితే, ఇక్కడున్న ముస్లిం నేతలను వదిలేసి ఇతరులను బతిమిలాడాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో 90 వేల మంది ముస్లింలు ఉన్నారని, తనకు అవకాశమిస్తే గెలిచి చూపిస్తానన్నారు. ఎవరినో తీసుకొచ్చి తమపై రుద్దితే సహించమని హెచ్చరించారు. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ‘బొంతు’కు టికెట్ ఇవ్వాలంటూ ఆందోళన బంజారాహిల్స్: గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు ఉప్పల్ అసెంబ్లీ స్థానానికి టిక్కెట్ ఇవ్వాలంటూ కుషాయిగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని బొంతు నివాసం ముందు బైఠాయించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఉప్పల్‌ను రామ్మోహన్‌కు ఇవ్వకపోతే స్థానిక మహిళలెవరూ టీఆర్ఎస్ కోసం పనిచేయరని హెచ్చరించారు. అయితే, ఆందోళనచేస్తున్న సమయంలో మేయర్ తన ఇంట్లో లేరు. -
ఖైరతాబాద్ సస్పెన్స్.. దానంకు ఆ ముగ్గురితో గండం!
సాక్షి, బంజారాహిల్స్: ఇప్పుడు అందరి దృష్టి ఖైరతాబాద్‌పైనే... కేసీఆర్ ప్రకటించిన 105 మంది టీఆర్ఎస్స్ అభ్యర్ధుల జాబితాలో ఖైరతాబాద్ అభ్యర్ధిని మాత్రం ప్రకటించలేదు. దీంతో ఇక్కడి నుంచి ఎవరికీ సీటు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డితోపాటు బంజారాహిల్స్ కార్పొరేటర్, కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు పీ విజయారెడ్డి ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా ఇక్కడి నుంచే పోటీలో ఉండాలనుకుంటున్నారు. గతంలో ఇది ఆయనకు సిట్టింగ్ సీటు. ఈ నేపథ్యంలో ఈ నలుగురిలో టిక్కెట్ ఎవరికి దక్కుతుందోనన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, దానం నాగేందర్‌ను గోషామహల్లో నిలబెట్టే అవకాశాలుగా మెండుగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే వీరెవరూ కాకుండా కొత్తవారిని ఎవరినైనా నిలబెడతారా అన్నదానిపై కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి ఖైరతాబాద్ టికెట్ ఇప్పుడు హాట్‌హాట్‌గా మారింది. -
అభ్యర్థుల జాబితా : దానం పేరు ఎక్కడ..?
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఊహాగానాలకు తెరదించుతూ... టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తెలంగాణ తొలి అసెంబ్లీని రద్దు చేసేశారు. ముందస్తు ఎన్నికలకు సంకేతాలిస్తూ.. అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు. నవంబర్‌లో ఎన్నికలు జరిగి, డిసెంబర్లో ఫలితాల ప్రకటన వచ్చే అవకాశముందని కూడా ప్రెస్ మీట్లో తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 105 మందికి టిక్కెట్లు కేటాయించారు. అయితే మరికొన్ని స్థానాలను, అభ్యర్థులను కేసీఆర్ పక్కనబెట్టారు. కేసీఆర్ జాబితాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కనిపించలేదు. దానం నాగేందర్‌కు హామీ దొరకలేదని తెలుస్తోంది. అంతేకాక వరంగల్ ఈస్ట్ కొండ సురేఖ స్థానాన్ని కూడా కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. మేడ్చల్ టిక్కెట్‌నూ కేసీఆర్ ప్రకటించలేదు. మేడ్చల్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ నేత కేఎల్ఆర్ ఫామ్ హౌజ్‌లో ఉన్నట్టు తెలిసింది. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభకు కూడా కేసీఆర్ టిక్కెట్ ప్రకటించిలేదు. హుజూర్ నగర్, కోదాడ, అంబర్‌పేట, మల్కాజిగిరి, వికారాబాద్ స్థానాలను కూడా కేసీఆర్ పెండింగ్‌లో ఉంచారు. కేసీఆర్ ప్రకటించిన ఈ జాబితా బట్టి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నాలుగు చోట్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉన్న స్థానం కోదాడలోనూ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించలేదని తెలిసింది. -
రికార్డు స్థాయిలో సభ: కర్నె, బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: కేవలం పది రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో బహిరంగసభను నిర్వహించామని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌రావు అన్నారు. సోమవారం విలేకరులతో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ సభకు 25 లక్షల మంది వస్తారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని, వారి అనుమానాలను తలకిందులు చేస్తూ అన్ని రికార్డులను అధిగమించిందన్నారు. దీనికి అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాయన్నారు. ఈ సభపై కాంగ్రెస్ నాయకులు దివాళాకోరు తనంతో దిగజారుడు విమర్శలు చేస్తున్నారని, ఈ సభ దేశంలోనే రికార్డు అని కర్నె ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 42 ఏళ్లు పాలించినా ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. ట్రాఫిక్ జామ్ వల్లే రాలేకపోయారు: దానం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ జామ్ వల్ల వేలాదిమంది ప్రగతి నివేదన సభ జరుగుతున్న ప్రాంతానికి రాలేకపోయారని మాజీమంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సభ విజయవంతమైనా కొందరు కాకి గోల చేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రగతి నివేదన సభ గురించి ఉత్తమాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ను గద్దెదించడం సాధ్యంకాదని, గాంధీభవన్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తొలగిస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు కాకి గోల చేస్తున్నారని, ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్‌లో తలొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల అండ టీఆర్ఎస్కు ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని నేరుగా ప్రధానమంత్రి మోదీకే కేసీఆర్ చెప్పాడని దానం వెల్లడించారు. ప్రగతి నివేదన సభలో అభివృద్ధి గురించి చెప్పడం తప్ప రాజకీయ విమర్శలు చేయలేదని, ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ కడిగి పారేస్తారని హెచ్చరించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ సాధ్యంకాదని ఉత్తమ్‌కు కాంగ్రెస్ నేతలే చెప్పారని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో ఉత్తమ్ ఎందుకు రహస్యంగా సమావేశం అయ్యారో చెప్పాలని దానం డిమాండ్ చేశారు. -
బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు
హైదరాబాద్ : బీజేపీ నేత రాంమాధవ్ ఎంతగా మాట్లాడినా ఆ పార్టీకి తెలంగాణాలో స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదని టీఆర్ఎస్ నేతలు జోస్యం చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే తెలంగాణలో అట్టడుగు వర్గాలకు కేసీఆర్ హయాంలోనే వచ్చిందని తాను చాలా సార్లు చెప్పానని గుర్తు చేశారు. ఇపుడు కూడా చెబుతున్నా ...సబ్సిడీ గొర్రెల పథకం తెచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారని చెప్పారు. ఇప్పటి వరకు అరవై లక్షల గొర్రెల పంపిణీ చేశామని, ఇదో పెద్ద విజయమన్నారు. గొల్ల కురుమలు, మత్స్యకారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది కేసీఆరేనని స్పష్టం చేశారు. కోట్లాది చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడంతో వెనుకబడిన కులాలకు మంచి మేలు జరిగిందన్నారు. అసెంబ్లీ స్పీకర్ ,శాసనమండలి చైర్మన్ కూడా వెనకబడిన వర్గాలకు చెందిన వారు కావడం బీసీ వర్గాల అదృష్టమని, ప్రభుత్వం బీసీ వర్గాలకు ఎన్ని కోట్ల రూపాలయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. బీసీలను తామే ఉద్ధరిస్తున్నట్టు కొందరు మాట్లాడుతున్నారని..కానీ వారు చేసింది ఏమీ లేదని విమర్శించారు. గొర్రెల పంపిణీ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హేళనగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. -
ఫ్లెక్సీ ఎక్కిన అభిమానం.. ఫైన్ వేసిన అధికారం
బంజారాహిల్స్: స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యానికి తూట్లు పొడిస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని నిరూపించారు గ్రేటర్ అధికారులు. తప్పు చేస్తే పైవారు.. తమ వారు అన్న వివక్ష వద్దని గతంలోనే మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి మారిన దానం నాగేందర్‌కు ఆహ్వానం పలుకుతూ ఓ మాజీ కార్పొరేటర్ బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కట్టారు. ఇలా కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీహెచ్ఎంసీ అధికారులు సదరు నేతకు నోటీసులతో షాక్ ఇచ్చారు. ఇది మంత్రి కేటీఆర్‌కు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డికి నచ్చలేదు. ఫ్లెక్సీలు బ్యానర్లపై నిషేధం ఉండగా ఇలా సొంత పార్టీ వారే నిబంధనలు ఉల్లంఘించడమేంటని వారు కింది స్థాయి అధికారులపై మండిపడ్డారు. తక్షణమే బాధ్యులపై జరిమానా విధించాలంటూ ఆదేశించారు. దీంతో దానంతో పాటు టీఆర్ఎస్లో చేరిన బంజారాహిల్స్ మాజీ కార్పొరేటర్ బి.భారతినాయక్‌కు నోటీసులు జారీ చేశారు. చేసిన తప్పుకు రూ.30 వేల జరిమానా చెల్లించాల్సిందేనంటూ అందులో పేర్కొన్నారు. దీంతో సదరు నాయకులు తెల్లమొహం వేశారు. దానం ఫ్లెక్సీలపై ఎవరెవరు ఆహ్వానం పలుకుతూ ఫొటోలు వేసుకున్నారో వారందరికీ జరిమానాలు వేస్తామని అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీలో చేరితో ఇదోమి గోసరా దేవుడా అంటూ ఇప్పుడా నేతలు తల పట్టుకుంటున్నారు. మా కాలంలో ఇలా లేదు బాబు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. -
కేసీఆర్ సవాల్‌ను స్వీకరించిన ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విసిరిన సవాల్‌ను కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్వీకరించారు. రాష్ట్రంలో ఎన్నికలు 2019లో వచ్చినా, ఈ ఏడాది డిసెంబర్లో వచ్చినా.. లేక ఈరోజే వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార టీఆర్ఎస్ను గద్దె దించుతామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్నికల విషయంలో తమ వైఖరిని ట్వీట్ ద్వారా వెల్లడించారు. అవినీతిమయమైన టీఆర్ఎస్ పాలనకు స్వస్తి పలికేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధమేనన్నారు. ముందస్తు ఎన్నికలు అనేవి తెలంగాణ ప్రజలకు నిజంగానే శుభవార్త అని, కేసీఆర్ పాలన నుంచి కొన్ని నెలల ముందుగానే రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ‘వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటైనా టీఆర్ఎస్ను ఏమీ చేయలేవు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు ఆపకపోతే ఎన్నికలకు పోదాం పదా అని అడుగుతా.. ఇలా అడిగే రోజు దగ్గర్లోనే ఉందని’ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు తెలివి తక్కువ దద్దమ్మలని, వారికి అబద్ధం కూడా అతికేటట్టు మాట్లాడే తెలివి లేదని మండిపడ్డారు. ఆదివారం(జూన్ 24న) మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించిన కేసీఆర్.. దానం టీఆర్ఎస్ చేరిక సమయంలోనూ డిసెంబర్లో ఎన్నికలకు ఇతర పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరో 15 మంది దాకా చేరుతామంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పందిస్తూ.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ను గద్దె దింపడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. సంబంధిత కథనం (ఎన్నికలకు వెళ్దామా?) Whether it is May, 2019 or December, 2018 or TODAY, @INCTelangana is fully prepared and geared up to pull down TRS’ corrupt and insensitive regime. Early polls is good news for the people of Telangana as we can get rid of KCR a few months earlier. https://t.co/oPrqyfzg1q — Uttam Kumar Reddy (@UttamTPCC) 25 June 2018 -
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మరో 15 మంది!
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటైనా టీఆర్ఎస్ను ఏమీ చేయలేవు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీ యాలు ఆపకపోతే ఎన్నికలకు పోదాం పదా అని అడుగుతా.. ఇలా అడిగే రోజు కూడా దూరంగా లేదు.. దగ్గర్లోనే ఉంది...అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రస్తుతం తెలంగాణ నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ను స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు తెలివి తక్కువ దద్దమ్మలని, వారికి అబద్ధం కూడా అతికేటట్టు మాట్లాడే తెలివి లేదని మండిపడ్డారు. ఆదివారం మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ భవన్‌కు వచ్చి సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కరెంటు, రైతులు, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు..ఇలా అన్నింటిపై ఆ పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ‘‘ఏ వర్గాలకు ఏం చేస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పరు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం.. కర్తవ్యం అంటరు. కాంగ్రెస్‌కు ఇదేం దిక్కుమాలిన కర్తవ్యం? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించిన నియోజకవర్గాల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్సే గెలిచింది. కాంగ్రెస్ వాళ్లకు సొంతంగా ఎలా పనిచేయాలో తెలియదు. ఎన్నడూ స్వయంగా పాలించిన వారు కాదు’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ తెలివైన వాళ్లున్న రాష్ట్రమని రుజువైందన్నారు. జనరేటర్ కంపెనీలు దివాలా తీసినట్టుగానే కాంగ్రెస్ కూడా దివాలా తీసిందన్నారు. అసెంబ్లీలో మాట్లాడమంటే ప్రిపేర్ కాలేదని చెప్పిన ఉత్తమ్‌కుమార్‌రెడ్ది ఇప్పుడా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లేనని, కరెంట్ ఉండదంటూ చేతిలో కర్రపట్టి చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కడ పోయాడని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఇంకా వస్తారు టీఆర్ఎస్, మజ్లిస్‌ది ఆషామాషీ స్నేహం కాదని సీఎం అన్నారు. ఇటీవలి కాలంలో ఏ సర్వే చేసినా టీఆర్ఎస్కు వంద స్థానాలు వస్తాయని తేలుతోందని చెప్పారు. ఈ సర్వేల ఫలితాలను త్వరలోనే స్వయంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. ‘‘దానం నాగేందర్ టీఆర్ఎస్లోకి సుఖ పడటానికి రాలేదు. పార్టీ భారాన్ని మోయాలి. తెలంగాణ నిర్మాణం జరుగుతోంది. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కాదు. రాబోయే రోజుల్లో పది పదిహేను మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్‌కు దమ్ముందా అని బీజేపీ నేతలు పాటలు పాడుతున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఎంత దమ్ముందో అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పథకాలు ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో నాపై కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి అనుచితంగా మాట్లాడారు. ఇలాంటి నాయకుల మాటల వల్ల ఏనాడూ సర్పంచ్‌గా కూడా పనిచేయని దయాకర్‌ను ప్రజలు ఆ ఎన్నికల్లో ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించారు అని కేసీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్‌ను మురికి కుంటగా మార్చారు మంచిగా పని చేసిన వారిని జనం ఓడించరని, ఏ పార్టీ, ఎవరని కూడా చూడరని సీఎం అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై ఏమీ అనుమానాల్లేవని స్పష్టంచేశారు. దానం నాగేందర్‌కు తమ సహకారం ఉంటుందని, పాత, కొత్త అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గత పాలకులు హైదరాబాద్‌ను మురికి కుంటగా చేశారని, ఎన్నికల తర్వాత నగరాన్ని స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. ‘‘ఈ నాలుగేళ్లుగా తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతిపక్ష పార్టీల వైఖరి వల్ల ఎన్నికలకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో 196 కేసులు వేసింది’’ అని అన్నారు. 90 శాతం మంది పేదలున్న రాష్ట్రం తెలంగాణ అని, అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని వివరించారు. అగ్రకుల పేదలకూ కల్యాణలక్ష్మి ఇస్తున్నాం. తెలంగాణకు మంచి ఆదాయం ఉంది. సొంత వనరుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుంది. పక్కరాష్ట్రం ఏపీలో మాటలు చెప్పడం తప్ప చేతలు ఏమీ లేవు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. నాలుగేళ్ల్లలో ఎన్నో అవార్డులను సాధించాం అని అన్నారు. సీఎం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కరెంటు, రైతులు, అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు..ఇలా అన్నింటిపై ఆ పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ‘‘ఏ వర్గాలకు ఏం చేస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పరు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం.. కర్తవ్యం అంటరు. కాంగ్రెస్‌కు ఇదేం దిక్కుమాలిన కర్తవ్యం? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించిన నియోజకవర్గాల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్సే గెలిచింది. కాంగ్రెస్ వాళ్లకు సొంతంగా ఎలా పనిచేయాలో తెలియదు. ఎన్నడూ స్వయంగా పాలించిన వారు కాదు’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ తెలివైన వాళ్లున్న రాష్ట్రమని రుజువైందన్నారు. జనరేటర్ కంపెనీలు దివాలా తీసినట్టుగానే కాంగ్రెస్ కూడా దివాలా తీసిందన్నారు. అసెంబ్లీలో మాట్లాడమంటే ప్రిపేర్ కాలేదని చెప్పిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే చిమ్మచీకట్లేనని, కరెంట్ ఉండదంటూ చేతిలో కర్రపట్టి చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కడకు పోయాడని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను మురికి కుంటగా మార్చారు మంచిగా పని చేసిన వారిని జనం ఓడించరని, ఏ పార్టీ, ఎవరని కూడా చూడరని సీఎం అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై ఏమీ అనుమానాల్లేవని స్పష్టంచేశారు. దానం నాగేందర్‌కు తమ సహకారం ఉంటుందని, పాత, కొత్త అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గత పాలకులు హైదరాబాద్‌ను మురికి కుంటగా చేశారని, ఎన్నికల తర్వాత నగరాన్ని స్వర్గసీమగా మారుస్తామని చెప్పారు. ‘‘ఈ నాలుగేళ్లుగా తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతిపక్ష పార్టీల వైఖరి వల్ల ఎన్నికలకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో 196 కేసులు వేసింది’’ అని అన్నారు. 90 శాతం మంది పేదలున్న రాష్ట్రం తెలంగాణ అని, అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని వివరించారు. ‘‘అగ్రకుల పేదలకూ కల్యాణలక్ష్మి ఇస్తున్నాం. తెలంగాణకు మంచి ఆదాయం ఉంది. సొంత వనరుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుంది. పక్కరాష్ట్రం ఏపీలో మాటలు చెప్పడం తప్ప చేతలు ఏమీ లేవు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. నాలుగేళ్ల్లలో ఎన్నో అవార్డులను సాధించాం’’ అని అన్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా చాలా మంది వస్తారు టీఆర్ఎస్, మజ్లిస్‌ది ఆషామాషీ స్నేహం కాదని సీఎం అన్నారు. ఇటీవలి కాలంలో ఏ సర్వే చేసినా టీఆర్ఎస్కు వంద స్థానాలు వస్తాయని తేలుతోందని చెప్పారు. ఈ సర్వేల ఫలితాలను త్వరలోనే స్వయంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. దానం నాగేందర్ టీఆర్ఎస్లోకి సుఖ పడటానికి రాలేదు. పార్టీ భారాన్ని మోయాలి. తెలంగాణ నిర్మాణం జరుగుతోంది. ఇవి చిల్లర మల్లర రాజకీయ చేరికలు కాదు. రాబోయే రోజుల్లో పది పదిహేను మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్‌కు దమ్ముందా అని బీజేపీ నేతలు పాటలు పాడుతున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఎంత దమ్ముందో అందరికీ తెలుసు. టీఆర్ఎస్ పథకాలు ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో నాపై కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి అనుచితంగా మాట్లాడారు. ఇలాంటి నాయకుల మాటల వల్ల ఏనాడూ సర్పంచ్‌గా కూడా పనిచేయని దయాకర్‌ను ప్రజలు ఆ ఎన్నికల్లో ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు. -
‘దానం టీఆర్ఎస్లో ఉండరు’
సాక్షి, హైదరాబాద్: దానం నాగేందర్‌ది పక్కా అవకాశవాద రాజకీయమని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు పవర్లో ఉన్న పార్టీల పట్ల మాత్రమే ప్రేమ ఉంటుందని మండిపడ్డారు. బీసీ నాయకుడుగా ఆయన ఎప్పుడూ వారి సమస్యలపై పోరాడలేదనీ, పదవులకోసమే రాజకీయాలు చేసేవారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బీసీలకు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందని అసత్య ప్రచారం చేస్తున్న దానం.. గతంలో మంత్రి పదవులెలా పొందారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పీజేఆర్, శశిధర్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచినా నాగేందర్‌కే మంత్రి పదవులు, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చారని గుర్తుచేశారు. పార్టీలు మారడం దానంకు కొత్తకాదనీ.. టీఆర్ఎస్ ఓడినా, గెలిచినా ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరతారని నారాయణరెడ్డి జోస్యం చెప్పారు. ఏదేమైనా కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
దానం ఓ బచ్చా; ఆయనతో ఏమీ కాదు..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి దానం నాగేందర్‌పై కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ నిప్పులు చెరిగారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ‘దానం ఓ బచ్చాగాడు. అతను చెప్పడం వల్లనే నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారనడం హస్యాస్పదం’ అని అంజన్‌కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. నాగేందర్ కాంగ్రెస్‌ను వీడడం వల్ల జరిగే నష్టమేమీ లేదని అన్నారు. అయినా, ఇప్పటికే పలుమార్లు పార్టీలు మారిన నాగేందర్ పార్టీని వీడడం ఒకందుకు మంచిదేనని అన్నారు. కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని చెప్పుకు తిరుగుతున్న దానంకు సిగ్గుండాలని అన్నారు. హైదరాబాద్‌లో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. కబ్జాదారున్ని ఎందుకు చేర్చుకున్నారు..? ‘దానం నాగేందర్ భూ కబ్జాదారుడని హోం మంత్రి గతంలో అన్నారు. అలాంటి కబ్జాదారున్ని పార్టీలో ఎందుకు చేర్చుకున్నార’ని పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్పై మండిపడ్డారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌పై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. బీసీలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని చెప్పుకుంటున్న దానం.. టీఆర్ఎస్ పాలనలో బీసీల అభివృద్ధికి కేటాయించిన నిధులెన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. వలిగొండ ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పొన్నం తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు దాసోహం.. దానం ఒక బీసీ అయివుండి అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడ్ విమర్శించారు. బీసీ సమస్యలపై ఏనాడూ పోరాడని దానం తనకు పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరేమిటో ప్రజలకు తెలుసునని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. -
చంద్రబాబు బాగోతం చెప్పిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఐదుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తోన్న విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి వెల్లడించారు. ‘‘పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతున్నదో చూస్తున్నాం కదా..’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి బాగోతాన్ని వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ను టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్న సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ సీఎం, బీజేపీ సీఎంలపైనా వ్యాఖ్యలు చేశారు. (చదవండి: సర్వే ఫలితాలు చూసి షాకయ్యా: కేసీఆర్) ఏపీలో జరుగుతున్నదిదే: ‘‘నాలుగేళ్ల నుంచి ఏపీలో జరుగుతున్నదేంటో మనం చూడట్లేదా, డుమ్కీలు కొట్టడం తప్ప అక్కడ పని జరగట్లేదు. మాకంటే పెద్ద ఎవడూలేడన్న స్థాయిలో ఏదేదో చేస్తమని అక్కడి పాలకులు అన్నారు. కేవలం మాటలు చెప్పుకుంటపోతే అయ్యేదేమీలేదని రుజువైంది. ఏపీకి భిన్నంగా తెలంగాణలో నాయకులందరం కష్టపడి పనిచేశాం. కాబట్టే మంచి ఫలితాలు, అభివృద్ధి సాధించాం’’ అని కేసీఆర్ అన్నారు. విభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడమేకాక, అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అని ప్రజానీకం గట్టిగా భావిస్తున్నా, సీఎం చంద్రబాబు మాత్రం అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కేసులకు భయపడి కేంద్రం పాదాల వద్ద ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబు.. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి, తీరా ఎన్నికలు వస్తుండటంతో కొత్త నాటకాలకు తెరలేపడాన్ని జనం అసహ్యించుకుంటుండటం విదితమే. బీజేపీ సీఎంలకు కితాబు: మంచి పనులు చేసే ప్రభుత్వాలను, నాయకులను ప్రజలు వదులుకోలేరన్న కేసీఆర్.. అందుకు ఉదాహరణగా బీజేడీ, బీజేపీ సీఎంలను పేర్కొనడం గమనార్హం. ‘‘మన పక్కనే ఒడిశాలో బీజేడీ వరుసగా నాలుగు సార్లు ఎన్నికల్లో గెలిచింది. ఐదోసారి కూడా ఆయనే(నవీన్ పట్నాయకే) గెలుస్తాడు. ఇటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ముఖ్యమంత్రులు విజయవంతంగా మూడో టర్మ్ పూర్తిచేసుకున్నారు. మంచిచేస్తే జనమే నాయకుల్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. తప్పుచేస్తే ఖచ్చితంగా శిక్ష తప్పదు’’ అని కేసీఆర్ అన్నారు. -
ప్రతిపక్షాలు సరేనంటే ముందస్తుకు రెడీ
-
సర్వే ఫలితాలు చూసి షాకయ్యా: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మంచి పనులు చేసే ప్రభుత్వాలను, పార్టీలను ప్రజలు వదులుకోరని, టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని జనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ 100 పైచిలుకు స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సిటీ కాంగ్రెస్ మాజీ చీఫ్, మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్కా సర్వే.. ముందస్తుకు సై: ‘‘ దేశంలో ఏ రాష్ట్రమూ అమలుచేయలేనన్ని గొప్ప గొప్ప పథకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మనసును గెలుచుకుంది. యావన్మంది ‘ఔరా!’ అని ముక్కున వేలేసుకునే విధంగా పరిపాలన సాగిస్తున్నాం. కానీ రాష్ట్రంలో జరుగుతోన్న మంచిని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. నీటి ప్రాజెక్టులకు అడ్డగోలుగా అడ్డం పడుతున్నాయి. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి వీళ్లు (విపక్షాలు) ఇంకా పిచ్చి కథలుపడతారు. ఇదంతా అవసరమా, ఈ గోలంతా ఎందుకు, సరే, మరి ముందస్తు ఎన్నికలకు పోదామా? అని నేనే వాళ్లను ప్రశ్నిద్దామనుకుంటున్నా. మా పార్టీ నేతలు కూడా ఇదే మాట అంటున్నారు. ‘జనం రెడీగా ఉన్నారు.. ముందస్తుకు పోదాం సార్’అని! నా లెక్క ప్రకారం కూడా ముందస్తు ఎన్నికలు రావొచ్చని అనుమానంగా ఉంది. ప్రతిపక్షాలు సరేనంటే ముందస్తుకు రెడీగా ఉన్నాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. నాగేందర్ తలపై బండ.. 20 రోజుల్లో ఇంకా చాలామంది: హైదరాబాద్‌ను విశ్వనగరంగా, ప్రపంచంలోనే నంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దాలంటే కష్టపడి పనిచేసే నాయకులు అవసరమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న పనులు నచ్చి ఇవాళ దానం నాగేందర్ పార్టీలోకి వచ్చాడు. రాబోయే 20 రోజుల్లో ఇంకా చాలా మంది నాయకులు క్యూ కడతారు. ఏదో సుఖపడటానికి ఆయన రాలేదు.. టీఆర్ఎస్లో చేరడమంటే నాగేందర్ నెత్తిన బండ ఎత్తుకున్నట్లే. అంత కష్టపడి పనిచేయాలన్నమాట! కార్యకర్తగా ఉన్నప్పటినుంచీ అతను నాకు తెలుసు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. ఇక్కడ కూడా మంచి అవకాశాలు, మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇస్తున్నా..’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సర్వే చూసి నేనే షాకయ్యా! : ఇంతకు ముందు చేయించిన సర్వేలకంటే బలమైన, సత్యప్రమాణాలు అధికంగా ఉన్న మరో సర్వేను ఇటీవలే చేయించానని ముఖ్యమంత్రి తెలిపారు. తాజా సర్వేలో తనతో సహా అందరూ ఆశ్చర్యపోయే ఫలితాలు వచ్చాయని చెప్పారు. ‘‘తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ బలం 50 శాతానికి మించి పెరిగింది. మిగతా పార్టీలతో డిఫరెన్స్ దాదాపు 40 శాతం ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 60వేలు, 70వేలు పైచిలుకు మెజారిటీ సాధించబోతున్నారు. ఈ సర్వే ఫలితాలు చూసి నేనే ఆశ్చర్యపోయాను. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలన్నీ మీడియాకు వెల్లడిస్తాను’’ అని సీఎం తెలిపారు. -
టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్
-
దానం విమర్శలకు పొన్నం కౌంటర్
-
రేసు గుర్రాలెక్కడ?
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలుపు గుర్రాలతో ఎన్నికల రణంలోకి దిగే వ్యూహానికి తెర లేపింది. మాజీ మంత్రి దానం నాగేందర్‌తో పాటు నగరంలో సగం నియోజకవర్గాలను కొత్త నేతలతో నింపే దిశగా పావులు కదుపుతోంది. గడిచిన సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మల్కాజిగిరి, సికింద్రాబాద్, పటాన్చెరు శాసనసభ స్థానాలనే గెలుచుకున్న టీఆర్ఎస్.. తదనంతరం టీడీపీ ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకొని ఆయా నియోకజవర్గాల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పక్షాన ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట తదితర నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బలమైన నాయకులు కనిపించడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతల కోసం వేట ప్రారంభించిన టీఆర్ఎస్.. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో గత మూడేళ్లుగా టీఆర్ఎస్లో చేరే ప్రయత్నాలు చేస్తున్న దానం నాగేందర్‌కు ఎట్టకేలకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇవ్వడంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ ‘ఆపరేషన్ ఆకర్‡్ష’ను అమలు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని చేర్చుకునే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుధీర్‌రెడ్డి సైతం గడిచిన కొన్నాళ్లుగా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు సైతం దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సుధీర్‌రెడ్డి సేవలను విస్తృత స్థాయిలో వాడుకునే విషయంలో ఫెయిలైందన్న భావన కూడా పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోంది. పార్టీ మారే విషయంలో సుధీర్‌రెడ్డి ఇప్పటికిప్పుడు నిర్ణయాన్ని ప్రకటించకుండా మరికొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ఉప్పల్ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్కు బలమైన నాయకుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండారి లక్ష్మారెడ్డి అధికార టీఆర్ఎస్, బీజేపీ నాయకుల కంటే విస్తృత కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీ బలమైన నాయకుడి కోసం పావులు కదిపే యోచనలో ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే కనకారెడ్డి సైతం వివిధ కారణాలతో క్యాడర్‌కు, జనానికి దూరంగా ఉండడం.. ఈ నియోకజవర్గంలో ఎమ్మెల్సీ హన్మంతరావు హడావుడి పెరగడం వల్ల మధ్యే మార్గంగా ప్రముఖ విద్యా సంస్థలకు అధిపతిగా ఉన్న ఓ యువ నాయకుడిని ఇక్కడి నుంచి పోటీకి దింపాలన్న చర్చ టీఆర్ఎస్లో సాగుతోంది. ఇక గోషామహల్, అంబర్‌పేట, ముషీరాబాద్‌లలో బీజేపీ ఎమ్మెల్యేలకు దీటుగా పనిచేసే నాయకులు కూడా ప్రస్తుతానికి టీఆర్ఎస్లో కనిపించడం లేదు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నేతలకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని మలక్‌పేట, కార్వాన్, చంద్రాయణగుట్ట, బహుదూర్‌పురా, యాకుత్‌పురాలో బలమైన నేతల కోసం వేట సాగుతోంది. ఆ ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా.. టీడీపీ తరఫున విజయం సాధించి టీఆర్ఎస్లో చేరిన కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, జూబ్లిహిల్స్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాల్లోనూ అవసరమైతే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎంచుకునే ఛాన్స్ ఉండాలని పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. సీఎం నిర్వహించిన అంతర్గత సర్వేల్లో ఆశించిన స్థాయిలో మార్కులు పొందలేని ఎమ్మెల్యేల స్థానే వారు సూచించిన కొత్త అభ్యర్థులను ప్రతిపాదించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. -
కాంగ్రెస్‌ను ఒక వర్గమే ఏలుతోంది...
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను ఒక వర్గానికి చెందిన వారే ఏలుతున్నారని ఆ పార్టీ మాజీ నేత దానం నాగేందర్ పేర్కొన్నారు. ఆత్మగౌరవం లేని చోట కొనసాగడం వృథా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను వీడేందుకు దారితీసిన పరిస్థితులను శనివారం ఆయన మీడియాకు వివరించారు. ‘‘30 ఏళ్లుగా పార్టీకి సేవ చేశా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశా. సైనికుడిగా పనిచేసినప్పటికీ చాకిరీగా వాడుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏ సమావేశం జరిగినా ఒక వర్గానికి చెందిన వారే వేదికపై ఉంటున్నారు. వారే మాట్లాడుతున్నారు. పార్టీలో బీసీ నేతలు, నాయకులకు అవకాశం లభించడం లేదు. సీనియర్లు డి.శ్రీనివాస్, కె.కేశవరావు పార్టీని వీడడానికి కారణాలేంటో తెలుస్తోంది. సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యకు పార్టీలో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదో చెప్పాలి. వీహెచ్‌ను కూడా పట్టించుకోవడం లేదు. ఆయన పార్టీలో మింగలేక.. కక్కలేక అన్నట్లు ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి చెప్పాను. ఆరు నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ బీసీ నాయకులతో రాహుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి నేను కూడా హాజరయ్యా. అందులో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను’’అని దానం చెప్పారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావాలంటే బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్‌కు సూచించినట్లు తెలిపారు. ఉత్తమ్ పని బాగున్నా.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పనితీరు బాగుందని, ఆయన పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని దానం పేర్కొన్నారు. కానీ కొందరు నేతలు ఉత్తమ్‌ను కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోలీసు శాఖలో ఒక సామాజిక వర్గానికే పదోన్నతులు ఇచ్చారని, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అప్పటి హోంమంత్రి జానారెడ్డిని వైఎస్ వారించారన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే టికెట్లు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గ్రేటర్లో ఏ కార్యక్రమం జరిగినా.. బాధ్యతనంతా నా భుజాలపైనే వేసుకుని పని చేశా. కానీ నన్ను విస్మరించారు. పార్టీలో అన్ని వర్గాలకు సమానత్వం లేదు. బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదు’’అని అన్నారు. కేసీఆర్‌ను చూసి గర్వపడుతున్నా.. సీఎం కేసీఆర్‌ను చూసి గర్వపడుతున్నానని దానం పేర్కొన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ గతంలో ఏ పార్టీ చేయని విధంగా బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను చూసి పలువురు ఆకర్షితులవుతున్నారన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. రైతుబంధు, రైతుబీమాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలు బడుగుల కులాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు. టీఆర్ఎస్లో చేరే విషయంపై త్వరలో సమాచారం ఇస్తానని చెప్పారు. టీఆర్ఎస్లో చేరిన తర్వాత తాను పదవులు ఆశించబోనన్నారు. ఎలాంటి కార్యాన్ని అప్పగించినా బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. -
కాంగ్రెస్‌లో కలవరం
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల తరుణంలో అధికార టీఆర్ఎస్ మళ్లీ మొదలుపెట్టిన ‘ఆకర్‡్ష’ వ్యూహానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. ఎన్నికల తరుణంలో ఇతర పార్టీల నుంచి నేతలు రావాల్సి ఉండగా దీనికి భిన్నంగా జరుగుతుండటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో కీలక నేత దానం నాగేందర్ రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. దానం దారిలోనే మరికొందరు ముఖ్య నేతలు పయనిస్తున్నారనే ప్రచారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పెద్దలను ఆత్మరక్షణలో పడేసింది. కాంగ్రెస్‌లో సమన్వయం లేదని, చొరవ తీసుకుని పార్టీని ఏకతాటిన పెట్టాలని రాష్ట్రంలోని పలువురు ముఖ్య నేతలు నాలుగు రోజుల క్రితమే ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీని కలసి విన్నవించారు. అయితే ఆ వెంటనే దానం నాగేందర్ పరిణామం జరగడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. పార్టీ నుంచి ముఖ్య నేతల వలసల ఆందోళన పెరగడంతో దిద్దుబాటు చర్యలపై టీపీసీసీ పెద్దలు కసరత్తు ప్రారంభించారు. అసంతృప్త నేతలకు సర్దిచెప్పే వ్యూహాలకు పదునుపెట్టారు. ఇలాంటి వారి వద్దకు ఇతర నేతలను పంపించి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దానం నాగేందర్ రాజీనామా, మరికొందరు నేతలు ఇదే దారిలో వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, తాజా పరిణామాలపై ఏఐసీసీ పెద్దలతో చర్చించారు. మొత్తంగా కాంగ్రెస్‌లో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ఊహించిందే అయినా... గ్రేటర్ హైదరాబాద్‌లో కీలక నేతగా గుర్తింపు పొందన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్‌ను వీడుతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ ప్రచారం తాజాగా వాస్తవరూపం దాల్చింది. అయితే ఇది జరిగిన తీరు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసిందనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ను వీడేందుకు దానం చెప్పిన కారణాలు, ఉత్తమ్ స్వయంగా ఇంటికి వెళ్లినా దానం కలకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో ఒక సామాజికవర్గం లాబీయింగ్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ కారణంతోనే కేకే, డీఎస్ లాంటి నేతలు పార్టీని వీడారంటూ దానం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను కలవరానికి గురి చేస్తున్నాయి. ఒక సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువైందనే అంచనా నేపథ్యంలోనే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా పార్టీ కమిటీల కూర్పు చేయాలని కసరత్తు ప్రారంభించారు. అయితే ఆ కసరత్తు మొదలై ఆరు నెలలైనా కొలిక్కి రాకపోవడం పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న ఆయా వర్గాల నేతలకు అసంతృప్తి కలిగించింది. పార్టీలో ఒకవైపు పదవులు, ప్రాధాన్యత లేకపోవడం, మరోవైపు టీఆర్ఎస్ ‘ఆకర్ష’ వ్యూహం అమలు చేస్తుండటంతో ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు ఊగిసలాటలో పడ్డారు. దానం నిర్ణయం ఈ కోణంలోనే జరిగిందని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. అదే బాటలో మరికొందరు.. దానం నాగేందర్ కాంగ్రెస్‌ను వీడిన తరహాలోనే మరికొందరు నేతలు అదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ మొదలైంది. హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ముఖేశ్‌గౌడ్, కూన శ్రీశైలంగౌడ్, లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డిలు కాంగ్రెస్‌లో సంతృప్తిగా లేరని, వారికి టీఆర్ఎస్ గాలం వేసిందనే చర్చ గాంధీ భవన్లో రెండు రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ పెద్దలు పార్టీ దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించారు. టీపీసీసీ ముఖ్య నేతలు శుక్రవారం రాత్రి సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఎన్నికల వేళ రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారుతున్న సమయంలో ఈ పరిణామాలు పార్టీపై ప్రజల్లో మరో విధమైన అంచనాను కలిగిస్తాయనే అభిప్రాయానికి వచ్చారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన అభిషేక్‌రెడ్డి వద్దకు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వెళ్లారు. అయితే తాను కాంగ్రెస్‌ను వీడనని అభిషేక్‌రెడ్డి చెప్పారు. కానీ మిగిలిన నేతలతో సంప్రదింపులకు టీపీసీసీ పెద్దలు ప్రయత్నిస్తున్నా వారిలో ఎందరు సర్దుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఛలో ఢిల్లీ... పార్టీలోని తాజా పరిణామాలపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ శనివారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు అశోక్ గెహ్లాట్, జైరాం రమేశ్, కాంగ్రెస తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాతోపాటు కొత్తగా నియమితులైన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులతో దాదాపు ఐదుగంటలపాటు చర్చించారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు కార్యదర్శులకు మూడు జోన్ల బాధ్యతలు అప్పగించారు. దక్షిణ, ఉత్తర, మధ్య తెలంగాణగా విభజించి ముగ్గురు కార్యదర్శులకు బాధ్యతలిచ్చారు. దీనికితోడు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మేనిఫెస్టో, స్క్రీనింగ్, ప్రచార, కో ఆర్డినేషన్ కమిటీల కూర్పుపైనా ఏఐసీసీ పెద్దలతో ఉత్తమ్ చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని, పార్టీ కమిటీల ప్రకటన వచ్చే అవకాశముందని, మరికొందరు నేతలు జారిపోకుండా సామాజిక న్యాయంతో కూడిన కమిటీలను ప్రకటిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. -
‘రెండేళ్లుగా టీఆర్ఎస్కు టచ్‌లో..’
సాక్షి, హైదరాబాద్: దానం నాగేందర్ పార్టీ మారడం కొత్త కాదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దానం రాజీనామా అంశంపై శనివారం కోమటిరెడ్డి స్పందించారు. ‘దానం నాగేందర్ పార్టీ మారడం ఊహించిన విషయమే. గత రెండు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్తో దానం టచ్‌లో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్లోకి వెళ్ళడానికి ఫ్లెక్సీలు కూడా రెడీ చేసుకున్నారు. అంతకుముందు కూడా టీడీపీలో చేరి మళ్ళీ కాంగ్రెస్‌కు వచ్చి మంత్రి పదవి అనుభవించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో బీసీలకు న్యాయం జరగడం లేదని చెప్పడం విడ్డురంగా ఉంది. సొంత ఎజెండా కోసమే దానం పార్టీ మారుతున్నారు. అలాంటి దానం ఇంటికి పీసీసీ ప్రెసిడెంట్ వెళ్లడం కూడా కరెక్ట్ కాదు. ఆయనకు అంత స్థాయి లేదు. దానం రాజీనామాను నేతలు ఎవరు సీరియస్‌గా తీసుకోవద్దు. అసలు టీఆర్ఎస్ పార్టీలోనే సామాజిక న్యాయం లేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మోసం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ క్యాబినెట్లో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదు. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించకుండా కేసీఆర్ మహిళలను అవమాన పర్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించాం.. దళిత, గిరిజన, బీసీలకు ప్రాధాన్యతనిచ్చాం. కాంగ్రెస్ నేతలంతా ధైర్యంగా ఉండాలి. రాబోయే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.’ అని పేర్కొన్నారు. -
హుటాహుటిన ఢిల్లీకి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఉత్తమ్ శనివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వార్ రూమ్ లో కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్‌తో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఉత్తమ్ హైకమాండ్‌తో చర్చించునున్నట్టు తెలుస్తోంది. అలాగే కొత్త కమిటీ ఏర్పాటు, సంస్థాగత మార్పులపై చర్చించే అవకాశం ఉంది. -
‘టీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీ రాలేదు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు దానం నాగేందర్ శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిలకు పంపారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 30ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. పార్టీ కోసం బాధ్యతగా పనిచేస్తూ వచ్చానని అన్నారు. అంతేకాక కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్లో ఏదైనా నా భూజాలపై వేసుకొని పనిచేశానని పేర్కొన్నారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీలో చాలా పితలు ఉన్నాయన్నారు. బలహీన వర్గాల గురించి దివంగత నేత వైఎస్సార్ తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో నాకు తెలియకుండా సీట్లు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసిన ఎదగకుండా వెనక్కి లాగుతున్నారని విమర్శించారు. ఒకే వర్గానికి చెందిన వారికి పార్టీలో ప్రధాన్యతా ఇస్తున్నారని దానం ఆసహనం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి తనకు ఎలాంటి హామీ రాలేదని దానం స్పష్టం చేశారు. అయినా టీఆర్ఎస్లో పని ఇస్తే చేస్తా.. లేకపోతే కార్యకర్తగా ఉంటానని దానం నాగేందర్ తెలిపారు. ‘అంజన్‌కుమార్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవని దానం స్ఫష్ట చేశారు. అతనికి పదవి ఇవ్వమని చెప్పిందే నేనే దానం తెలిపారు. నాకు కూడా కాంగ్రెస్‌లో పదవి ఫైనల్ అయింది.. పదవి వచ్చాక పోతే బాగోదని ఇప్పుడు కాంగ్రెస్‌ను నుంచి వెళ్లిపోతున్నానని దానం అన్నారు. ఢిల్లీ చుట్టూ తిరిగే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరాం. హైకమాండ్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. తెలంగాణ జనాభాలో 51శాతం బీసీలు ఉన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేకపోవడం, వారిని పక్కన పెట్టడం చాలా బాధ కలిగించింది. బస్సు యాత్రలో కూడా అతికష్టంగా బీసీ నుంచి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కోసం సైనికుడిలా పనిచేస్తున్నాడు. కానీ, ఆయనను కూడా పీతల మాదిరిగా లాగుతున్నారు. సీనియర్ నాయకులు డీఎస్, కేకే దూరం కావడానికి గల కారణాలను రాహుల్ గాంధీకి వివరించాను. అంతేకాక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కొందరు నేతలు పనిచేయనీయడం లేదు. పొన్నాలకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు. పార్టీలో వీహెచ్ పరిస్థితి కక్కలేక.. మింగలేక ఉన్నట్టు ఉందని’ దానం పేర్కొన్నారు. వైఎస్సార్ లాంటి నేత అవసరం.. కాంగ్రెస్ పార్టీకి దివంగత వైఎస్సార్ లాంటి నేత అవసరమని దానం నాగేందర్ అన్నారు. అంతేకాక వైఎస్సార్ లాంటి నేత ఇక దొరకరు అని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను దానం గుర్తు చేశారు. ఆ వర్గాలకు దివంగత నేత వైఎస్సార్ చేసినంత సేవ దేశంలో ఏ సీఎం చేయలేదని ఆయన పేర్కొన్నారు. బుజ్జగించేందుకు ఉత్తమ్ ప్రయత్నాలు దానం నాగేందర్‌ణు బుజ్జగించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రంగంలో దిగారు. దానంను కలిసేందుకు ఉత్తమ్ మీడియా సమావేశం జరిగే ప్రాంతానికి వెళ్ళారు. కానీ, అప్పటికే దానం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫోన్లో ట్రై చేసిన దానం అందుబాటులోకి రాలేదని సమాచారం. -
కాంగ్రెస్‌కు దానం గుడ్‌బై
-
కాంగ్రెస్‌కు దానం నాగేందర్ గుడ్‌బై
-
కాంగ్రెస్‌కు దానం నాగేందర్ గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలు ఐదా రు నెలల్లోనే ఉంటాయని ప్రచారం జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్‌లో కీలక నాయకుడు దానం నాగేందర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమి క సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు రాజీనామా లేఖ పంపారు. బడుగులు, బీసీలకు పార్టీలో అన్యా యం జరుగుతున్న కారణంగానే వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ‘వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి మూడు దశాబ్దాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేశాను. అయితే జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం, మారుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీలోని జాతీయ, రాష్ట్ర పెద్దలతో చర్చించినా పెడచెవిన పెట్టారు. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అభద్రత, అసంతృప్తితో ఉన్నారు. సమన్వయ లేమి, కార్యకర్తలతో సంప్రదింపులు జరపకపోవడం, క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం, సరైన మార్గనిర్దేశం లేకపోవడంతో వారంతా తప్పని పరిస్థితుల్లో పార్టీ వీడుతున్నారు. అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ లేమి కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితులే నన్ను రాజీనామా దిశగా అడుగులు వేయించాయి. పార్టీ పునర్నిర్మాణం, బీసీల సంక్షేమంపై చర్చించాలని చాలామార్లు ప్రయత్నించినా దురదృష్టవశాత్తూ నాయ కత్వం నా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు’’అని లేఖలో దానం పేర్కొన్నారు. మొదట్నుంచీ ప్రచారమైనట్టుగానే... నిజానికి దానం నాగేందర్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం 2014 ఎన్నికలు ముగిసిన నాటి నుంచీ ఉంది. ఆయన కాంగ్రెస్‌కు చాలా రోజు లుగా దూరంగా ఉన్నారు. 2015 గ్రేటర్ ఎన్నికల సందర్భంగా దానం టీఆర్ఎస్లో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ మేరకు ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. చివరి నిమిషంలో టీఆర్ఎస్ పెద్దల నుంచి సరైన హామీ రాక చేరిక వాయిదా పడింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ స్వయంగా మాట్లాడి, పార్టీలో కొనసాగాలని, గ్రేటర్లో బలోపేతం చేయాలని కోర డంతో దానం అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల పార్టీ పదవుల భర్తీలో దానం పేరును పార్టీ పట్టించుకోలేదు. నగర అధ్యక్ష పదవి నుంచి తొలగించి మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ను నియమించడంపై దానం ఆగ్రహించారు. ఐఏసీసీ కార్యదర్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దానం ఆశించినా నిరాశే మిగిలింది. ఏఐసీసీ కార్యదర్శిగా శుక్రవారం ఎమ్మెల్యే సంపత్‌ను ప్రకటించడంతో దానం మరింత అసంతృప్తికి లోన య్యారు. రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా బీసీ వర్గానికి చెందిన దానంను చేర్చుకునేందుకు పార్టీ సిద్ధపడటం, ఆ దిశగా చర్చలు ఫలప్రదం కావడంతో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. బుజ్జగించేందుకు.. దానం రాజీనామా సమాచారం అందగానే ఉత్తమ్ స్వయంగా రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని వెంటపెట్టుకొని దానం ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆయన బయటకు వెళ్లిపోవడంతో కలవలేకపోయారు. ఫోన్లో సం ప్రదించే ప్రయత్నం చేసినా దానం అందుబాటులోకి రాలేదు. బుజ్జగింపు యత్నాలు జరుగుతుండగానే దానం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో భేటీ అయ్యారనే సమాచారం అందడం, టీఆర్ఎస్లో చేరడం ఖాయమని తేలడంతో కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలను విరమించారు. -
‘దానం పార్టీ మారకుండా చూస్తాం’
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అంజన్‌కుమార్ యాదవ్ పేరును ఇటీవల ఖరారు చేసింది. అయితే తనకు మాట మాత్రమైనా చెప్పకుండా గ్రేటర్ అధ్యక్షుడి నియామకం జరగడంతో మాజీ మంత్రి దానం నాగేందర్ మనస్తాపం చెందారనీ, ఆయన కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దానం శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది. ఆయన శనివారం కేసీఆర్ సమక్షంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ పార్టీని వీడడం కాంగ్రెస్‌కు నష్టమేనని వ్యాఖ్యానించారు. రేపు ఉదయంలోగా దానంతో మాట్లాడి మనసు మార్చుకొనేలా ప్రయత్నిస్తామని అన్నారు. జానారెడ్డి నివాసంలో సమావేశమై పార్టీ నాయకత్వం ఈ విషయంపై చర్చించిందని తెలిపారు. -
దానం రాజీనామా కాంగ్రెస్‌లో కలకలం
-
తలసానిని కలసిన దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దానం నాగేందర్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం టీఆర్ఎస్లో చేరికపై దానం నాగేందర్ తలసానితో చర్చించారు. భేటీ అనంతరం మాట్లాడుతూ పార్టీలోకి ఎవరు వచ్చిన సాదరంగా ఆహ్వానిస్తామని తలసాని అన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. మరోవైపు దానం నాగేందర్ బాటలో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కూడా నడుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. దానం నాగేందర్ పార్టీని విడటంపై చర్చించారు. అంతకుముందు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దానం నాగేందర్‌ను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. సంపత్‌కుమార్‌కు పదవి ఇవ్వడంపై దానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సమయంలో కీలక నేతలు పార్టీని వీడటం వల్ల బలహీనమవుతామని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి ముఖేశ్, విక్రమ్‌లు కూడా పార్టీని వీడతారనే వార్త వారిలో మరింత గుబులు పుట్టిస్తోంది. -
కాంగ్రెస్‌కు దానం రాజీనామా