
దానం నాగేందర్ పై కోడిగుడ్లతో దాడి
కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ పై ఆ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ పై ఆ పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఉప్పల్ లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ రసాభాసగా మారింది. దానం నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో గందరగోళం రేగింది.
దానం నాగేందర్ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రమేనని, గ్రేటర్ పరిధిలోని తమ జిల్లాలోకి రావొద్దని కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా పార్టీ జెండా ఎగురవేసేందుకు దానం ప్రయత్నించడంతో ఆయనపై కోడిగుడ్లతో కార్యకర్తలు దాడి చేశారు.