మీరు చేసే పనులు వల్ల ప్రజల్లో తిరగలేకపోతున్నాం: దానం | MLA Danam Nagender Fires On GHMC Officials Over Footpath Demolition Near Khairatabad, More Details Inside | Sakshi
Sakshi News home page

‘మీరే సుప్రీం అనుకుంటే ఎట్లా? అలా చేస్తే ప్రభుత్వాలకు మనుగడ ఉండదు’

Published Thu, Jan 23 2025 11:25 AM | Last Updated on Thu, Jan 23 2025 11:57 AM

MLA Danam Nagender Fires On Officials Over Footpath Demolition

ఆదర్శ్ నగర్( హైదరాబాద్‌):  నగరంలో  ఫుట్‌పాత్‌ కూల్చివేతలపై(Demolish Footpaths) అధికారులు ఏకఫక్షంగా   వవ్యహరిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేదందర్‌(Danam Nagender) మండిపడ్డారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎలాంటి పబ్లిక్‌ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆదర్శనగర్‌ లో ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్‌.. ‘ అధికారులు(GHMC Officials) చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నాం. పేదల ఇండ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదు.ఓల్డ్ సిటీ లో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా?, మొదలు పెడితే అక్కడి నుండే తొలగింపులు చేయాలి. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిని... హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేను. 

అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారు... అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలు మనుగడ ఉండదు.ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పని చేయాలి. హైడ్రా చెరువులను కాపాడటానికి పని చేస్తుంది , దానిని స్వాగతిస్తున్నాను.మూసి ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష

తనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాద్‌  కాబట్టి..  తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికె పరిమితం కాదు..హైద్రాబాద్ లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం అన్నా ముందుంటాడు.గతంలో నేను హైడ్రా విషయంలో మాట్లాడిన ఇప్పుడు ఫుట్‌పాత్‌ ల విషయంలో మాట్లాడుతున్న అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనేదే నా అభిప్రాయం

ఇటీవల మాదాపూర్ లో ఫుట్పాథ్ పై కుమారి అంటి ని వేదిస్తున్నప్పుడు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆమె జోలికి పోవొద్దని అధికారులకు ఏవిధంగా ఆదేశాలు ఇచ్చారో..ఇప్పుడు ఫుట్పాథ్ ఆక్రమణల కూల్చివేతల్లో కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా ఆదేశాలు ఇవ్వాలి’ అని దానం పేర్కొన్నారు.

హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement