
కేసీఆర్ పంచాంగం చెప్పుకోవాల్సిందే: దానం
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తాజీ మాజీ మంత్రి దానం నాగేందర్ దీమా వ్యక్తం చేశారు. సర్వేల ఫలితాలు తలక్రిందులయ్యేలా తెలంగాణలో తెలంగాణలో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంచాంగం చెప్పుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.
వ్యాపారవేత్తలు టీఆర్ఎస్ ఒత్తిళ్లకు లొంగొద్దని సూచించారు. టీఆర్ఎస్కు భయపడాల్సిన పనిలేదని భరోసాయిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు గెలుచుకుంటుందని దానం నాగేందర్ అంతకుముందు చెప్పారు. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే మొత్తం 16 సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని నాగేందర్ జోస్యం చెప్పారు.