గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ శుక్రవారం గాంధీ భవన్లో భేటీ అయిన కాంగ్రెస్ హైకమాండ్ నేతలు గులాం నబీ ఆజాద్, వాయిలార్ రవిలను కలిశారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ శుక్రవారం గాంధీ భవన్లో భేటీ అయిన కాంగ్రెస్ హైకమాండ్ నేతలు గులాం నబీ ఆజాద్, వాయిలార్ రవిలను కలిశారు. గత వారం రోజులుగా దానం నాగేందర్ గత వారం రోజులుగా హైకమాండ్ పట్ల అలకబూనారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారు. గురువారం రోజున హైకమాండ్ నేతలు గులాం నబీ ఆజాద్. వాయిలార్ రవిలు దానం నాగేందర్ ఇంటికి వెళ్లి బుజ్జగించారు. నేడు కూడా దానం ఇంటికి హైకమాండ్ నేతలు వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేయనున్నట్టు సమాచారం.