మరోసారి దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు | MLA Danam Nagender Sensational Comments Once Again | Sakshi

మరోసారి దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Feb 4 2025 12:49 PM | Last Updated on Tue, Feb 4 2025 1:07 PM

MLA Danam Nagender Sensational Comments Once Again

అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ స్పష్టం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని.. వచ్చాక స్పందిస్తానన్నారు. పోతే జైలుకు పోతా.. నాపై 173 కేసులు ఉన్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదల ఇళ్లు కుల్చుతా అంటే ఊరుకోం. హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదు. నా ఇంట్లో వైఎస్సార్‌, కేసీఆర్‌ ఫోటో ఉంది. ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి?. ఎవరి అభిమానం వాళ్లది’’ అంటూ దానం నాగేందర్‌ వ్యాఖ్యానించారు.

ఆయన గతంలో కూడా నగరంలో  ఫుట్‌పాత్‌ కూల్చివేతలపై అధికారులు ఏకఫక్షంగా వవ్యహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎలాంటి పబ్లిక్‌ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారన్నారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నామంటూ వ్యాఖ్యానించారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement