ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తేలి్చచెప్పిన హైకోర్టు
తగిన సమయంలో స్పీకర్ తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి
ఫిరాయింపుల చట్టాన్ని, అసెంబ్లీ కాల పరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి
10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్‌గా విధులు నిర్వహించాలి
సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన సీజే ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఇచ్చిన అధికారాల మేరకు విధులు నిర్వహించాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో (రీజనబుల్ టైమ్) తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి..’ అని స్పష్టం చేసింది. ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తద్వారా స్పీకర్ ముందు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా కోర్టులు జోక్యం చేసుకోలేవని తేలి్చచెప్పింది. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు.
అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అనర్హత పిటిషన్ల విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సెపె్టంబర్ 9న తీర్పునిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఇరుపక్షాల వాదనలు ఇలా..
‘స్పీకర్ తన ముందున్న పిటిషన్లపై నిర్ణయం వెలువరించిన తర్వాత కోర్టులు న్యాయ సమీక్ష జరపొచ్చు. అయితే అది కూడా చాలా స్వల్పమే. కానీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోక ముందు కోర్టులు ఆయనపై ఒత్తిడి తేలేవు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజ్యాంగ అధిపతి అయిన స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అతి స్వల్పం. తన ముందున్న అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం, స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది.
స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని గతంలో ఎర్రబెల్లి దయాకర్ పిటిషన్‌లో ఇదే హైకోర్టు స్పష్టం చేసింది..’అని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, జంధ్యాల రవిశంకర్ వాదించారు. అయితే ‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందున్న అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి.
సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. కాబట్టి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా నిరీ్ణత సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ 8 నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింగిల్ జడ్జి ఇచి్చన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదు..’అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు, బీజేపీ Ôనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు.
పలు తీర్పులు ప్రస్తావించిన ధర్మాసనం
సెపె్టంబర్ 30న అప్పీళ్లు దాఖలైన నాటి నుంచి ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న సీజే ధర్మాసనం ఈ నెల 12న తీర్పు రిజర్వు చేసింది. ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్సెస్ తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎస్‌ఏ సంపత్‌కుమార్ వర్సెస్ కాలే యాదయ్య, కీష మ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్, మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాజేంద్రసింగ్ రాణా, కిహోటో హో లోహన్ సహా పలు కేసుల్లో తీర్పులను శుక్రవారం తీర్పు వెల్లడి సందర్భంగా సీజే ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు పలు కేసుల విచారణ సందర్భంగా స్పీకర్ తగిన(రీజనబుల్) సమయంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్న విషయాన్ని నొక్కి చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి తగిన అధికారం స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment