
నిరంజన్, దానం మధ్య వాగ్వాదం
హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్ గ్రేటర్ కాంగ్రెస్ నేత నిరంజన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నగర్ కాంగ్రెస్ సమావేశాలను దానం నాగేందర్ నిర్వహించడం లేదని ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. ఆ సమావేశాలేవో మీరే పెట్టుకోండి అంటూ దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రేటర్ అధ్యక్షుడిగా దానం కొనసాగడానికి వీల్లేదంటూ కూడా ఆయన అన్నట్లు సమాచారం.