niranjan
-
వైభవంగా జరిగిన నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం - హాజరైన ప్రముఖులు (ఫోటోలు)
-
గొప్పలు చెప్పుకోకుండా బాధ్యత వహించాలి
సాక్షి, హైదరాబాద్: ‘కల్తీ ఆహారంతో పేద విద్యార్థి మృతి చెందడం బాధాకరం. ఈ దుస్థితికి మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యులు కారా ? దేశంలో ఏ ప్రభుత్వమైనా గొప్పలు చెప్పుకోకుండా బాధ్యతగా వహించాలి. ఏదో ఒకరోజు కాకుండా.. అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలి. విద్యార్థులు వసతిగృహాల్లో ఉన్నారంటే వారు ఎంత పేదవారో అర్థం చేసుకోవాలి. శిథిలావస్థలో ఉన్న బాలుర, బాలికల వసతి గృహాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. వసతి గృహాలు పూర్తి శిథిలావస్థగా మారాయంటే దానికి అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారహిత్యమే అందుకు నిదర్శనం’అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ స్పష్టం చేశారు.మంగళవారం రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, బాలలక్షి్మ, తిరుమలగిరి సురేందర్‌లతో కలిసి నిరంజన్ విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో ఒక హాస్టల్ పరిస్థితి చూద్దామని అక్కడకు వెళ్లాం. రెండేళ్ల నుంచి అద్దె చెల్లించడం లేదని చెప్పడంతో తలదించుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. మహబూబ్‌నగర్ హాస్టళ్లలో 200 మంది విద్యార్థులు ఉండాల్సిన చోట దాదాపు 300 మందికిపైగా ఉన్నారు. ఇలాఉంటే విద్య ఎలా సాగుతుంది. ఇలాంటి వాటిపై రాజకీయ నేతలందరూ దృష్టి పెట్టాలి’అని ఆకాంక్షించారు. తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ చర్యలు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ఎవరైన అపోహలు కల్పించినా, తప్పుడు సమాచారం ఇచ్చి నా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం అలా చేసే వారిని తెలంగాణ సమాజం, బీసీలు క్షమించరన్నారు. బహిరంగ విచారణలో ‘తోలుబొమ్మలాట వృత్తిలో ఉన్న వారికి కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలని, కలెక్టర్, తహసీల్దార్‌కు ఆదేశాలివ్వాలని, దేవాలయాల్లో గానుగ నూనె వాడుతారని, దానికి గానుగ వృత్తి ఉన్నవారికి అవకాశం కలి్పంచాలని, గంగపుత్రులను బీసీ ‘బీ’నుంచి బీసీ డీకి మార్చాలని పలువురు కోరారని కమిషన్ చైర్మన్ తెలిపారు. పందిరి వేసే మేదర కులం వారికి డెకరేషన్, తయారీపై శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారన్నారు. 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపారు. -
బీసీ కేటగిరీల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని కులాలను పునర్వ్యవస్థీకరణ (రీకేటగిరైజేషన్) చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పది జిల్లాల్లో నిర్వహించిన బీసీ కమిషన్ బహిరంగ విచారణల్లో ఈ అంశంపైనే ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చాయని వెల్లడించారు. లోతైన విచారణ చేపట్టిన తర్వాతే పునర్వ్యవస్థీకరణ సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, బాల లక్షి్మ, తిరుమలగిరి సురేందర్‌లతో కలిసి నిరంజన్ మీడియాతో మాట్లాడారు.‘‘బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ చేపట్టాం. ఇప్పటివరకు 1,224 విజ్ఞప్తులు అందాయి. వాటిని కంప్యూటరీకరిస్తున్నాం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తోంది. సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, కుల విభాగాల్లో ఈ సర్వే కొనసాగుతోంది. ప్రారంభ రోజుల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ప్రస్తుతం ప్రజల నుంచి స్పందన బాగుంది. కొన్ని విభాగాలకు సంబంధించిన ప్రశ్నలకు సరైన జవాబులు అందడం లేదని వార్తలు వస్తున్నాయి. బీసీ కులాల పునర్వ్యవస్థీకరణ చేయాలంటే వారి ఆర్థిక స్థితి కూడా తప్పకుండా తేల్చాలి. అందుకే ఈ సర్వే ఎంతో కీలకంగా మారింది..’’అని కమిషన్ చైర్మన్ వెల్లడించారు. అనుమానాలకు ప్రభుత్వం వివరణ ఇస్తుంది.. సమగ్ర సర్వే ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. తార్నాక వద్ద రోడ్లపై సర్వే ఫారాలు లభ్యమైనట్లు వచి్చన వార్తలపై స్పందించి, సూపర్వైజర్ను సస్పెండ్ చేసి, జవహర్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశామని వివరించారు. సర్వే ఫారాలను కంప్యూటరీకరించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సర్వేపై ఎలాంటి అనుమానాలున్నా ప్రభుత్వం సమాధానం ఇస్తుందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌తో నష్టంపై వినతులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలు నష్టపోతున్నారనే వినతులు సైతం పెద్ద సంఖ్యలో వచ్చాయని నిరంజన్ తెలిపారు. 2– 4 శాతం కూడా జనాభా లేని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా... జనాభాలో సగం ఉన్న బీసీలకు అత్యల్పంగా రిజర్వేషన్లు కలి్పంచారంటూ వాదనలు వచ్చాయని వివరించారు. ఇటీవల డీఎస్సీలో బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయంటూ వినతుల్లో ప్రస్తావించారని వెల్లడించారు. వచ్చే నెల 9న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో విచారణ ఉందని.. ఆరోజు నాటికి రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ తరపున నివేదిక సమర్పించనున్నామని తెలిపారు. కమిషన్ తరఫున కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాం బహిరంగ విచారణ ప్రక్రియలో వచ్చిన అంశాలన్నీ ప్రభుత్వానికి నివేదిస్తామని జి.నిరంజన్ వెల్లడించారు. ‘‘కుమ్మర కులస్తులకు మట్టి కేటాయింపులపై జారీ చేసిన జీవోలను క్షేత్రస్థాయి అధికారులకు పంపేలా చర్యలు.. రంగారెడ్డి జిల్లా బండ రావిర్యాలలో వడ్డెరలకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేయడం, సంచార జాతులు, ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు.. గ్రామ అభివృద్ధి కమిటీలు చేస్తున్న కుల బహిష్కరణలపై కఠినంగా వ్యవహరించడం, ఆరె కటికల కోసం మీట్ కార్పొరేషన్ ఏర్పాటు, మద్యం దుకాణాల్లో ఆరె కటికలకు 30 శాతం రిజర్వేషన్లు, ట్యాంక్‌బండ్ వద్ద భగీరథుడి విగ్రహం ఏర్పాటు, రజకులను ఎస్సీ కేటగిరీలో చేర్చడం తదితర అంశాలపై వచ్చిన వినతుల ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదన లు చేస్తాం’’అని వివరించారు.బీసీ సంక్షే మ వసతి గృహాల్లో వ సతులు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. ఇటీవల బహిరంగ వి చారణ ప్రక్రియలో భాగంగా కొన్ని హాస్ట ళ్లను సందర్శించామని.. కొన్నిచోట్ల ఏళ్ల త రబడి అద్దె చె ల్లించని పరిస్థితి ఉంద ని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో బా లురు, బాలికలకు ప్రత్యేక హాస్టళ్లను పూర్తిస్థాయి వసతులతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
తప్పుడు సమాచారమిస్తే క్రిమినల్ చర్యలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీసీలు కాకున్నా కులగణన సర్వేలో బీసీలుగా నమోదు చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్లు ఖరారు చేసే అం«శంపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా వేదికగా బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ సమగ్ర వివరాలు సేకరించనున్న నేపథ్యంలో భవిష్యత్‌లో ఇవే కీలకమని, దీని ఆధారంగానే రిజర్వేషన్లు, పథకాలు ఉంటాయని వివరించారు. కులాల వారీగా సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుసుకునేందుకు కలెక్టర్లకు బహిరంగ విచారణ చక్కటి అవకాశమని, 13 వరకు జరిగే కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొనాలని సూచించారు. కొన్ని కులాలు డీ నుంచి ఏ కు మార్చాలని, మరికొన్ని కులాలు బీసీ ఏ నుంచి ఎస్టీకి, బీసీ బీ నుంచి ఈకి రిజర్వేషన్లు మార్చాలని నివేదించారని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీసీ కమిషన్ సభ్యులు రంగు బాలలక్ష్మి, తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సత్యప్రకాశ్, కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.విచారణ రసాభాసబీసీ కమిషన్ బహిరంగ విచారణ రసాభాసగా మారింది. వివిధ బీసీ కుల సంఘాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వినతిపత్రాలు సమర్పించగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్‌కుమార్ బీసీ కమిషన్‌కు వినతిపత్రమిస్తూ కమిషన్ విచారణపై అనుమానాలు వ్యక్తం చేశారు. బిహార్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రొసీజర్ ల్యాప్స్ పేరుతో కోర్టు కొట్టివేసిందని, తెలంగాణలో కేవలం కాలయాపన కోసమే విచారణ, సర్వేలు చేస్తుందని దుయ్యబట్టారు. సర్వే కోర్టులో నిలబడుతుందా.. ఏ రకంగా నిలబడుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తన అభిప్రాయం చెప్పేందుకు కమిషన్ అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరూ రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేశారని, రిజర్వేషన్ల అమలులో ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
బీసీ కోటా పెంపు కసరత్తు మళ్లీ మొదటికి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపు అధ్యయన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో పనిచేసిన రెండు బీసీ కమిషన్లు వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిగతులు, విద్య, ఉద్యోగ అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినప్పటికీ... ప్రభుత్వం తాజాగా జి.నిరంజన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీసీ కమిషన్‌ను డెడికేటెడ్ కమిషన్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషన్ జిల్లాల వారీగా పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించడంతో ఈ ప్రక్రియ మళ్లీ మొదట్నుంచి ప్రారంభం కానున్నట్లు కనిపిస్తోంది.ప్రభుత్వం ఈనెల 6న జి.నిరంజన్ చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధ్యతలు స్వీకరించిన కమిషన్ చైర్మన్, సభ్యులు తాజాగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం పూర్వపు బీసీ కమిషన్ చైర్మన్లు, సభ్యులతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరించిన అనంతరం కులగణన కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని చెప్పారు. ఆ తర్వాత జిల్లాల వారీగా పర్యటనల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన చేసిన తర్వాతే బీసీ రిజర్వేషన్లు తేల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత అధ్యయనం అటకెక్కినట్లే...ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు బీసీ కమిషన్లు పని చేశాయి. బీఎస్ రాములు చైర్మన్‌గా వ్యవహరించిన కమిషన్ మూడేళ్లపాటు పనిచేసి అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) లెక్కలు తేల్చడంతోపాటు మైనార్టీ రిజర్వేషన్లపై కసరత్తు చేసింది. రాములు కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం ఎంబీసీ కేటగిరీని విభజించింది. ఆ తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు... వరుసగా మూడేళ్లపాటు రూ.వెయ్యి కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించింది.ఆ తర్వాత వకుళాభరణం కృష్ణమోహన్ అధ్యక్షతన రెండో బీసీ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ బీసీ రిజర్వేషన్ల పెంపుపై లోతైన అధ్యయనం చేసింది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి.. అక్కడి బీసీ కమిషన్లు రూపొందించిన అధ్యయనాలను సైతం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఇదే డెడికేటెడ్ కమిషన్..రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కుల గణనకు సంబంధించి నిపుణులు, సామాజికవేత్తలతో సమావేశాలు నిర్వహించి, దేశవ్యాప్తంగా అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి 64 ప్రశ్నలతో కూడిన ‘ముసాయిదా ప్రశ్నావళి’ని వకుళాభరణం కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. గత ఆగస్టు 31న వకుళా భరణం కమిషన్ పదవీ కాలం ముగియడంతో సర్కార్ కొత్తగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.స్థానిక సంస్థల్లో కోటా పెంపుపై ఇప్పటికే రెండు కమిషన్లు నివేదికలు సమర్పించినప్పటికీ.. ప్రభుత్వం తాజా కమిషన్నే డెడికేటెడ్ కమిషన్‌గా ప్రకటించడం, విధివిధా నాలు జారీ చేయాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించడంతో గత కమిషన్లు చేసిన అధ్యయనాలు అటకెక్కినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
'తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 64 వ సాహిత్య సమావేశం మన సినారె “విశ్వంభర” సంబురం ఘనంగా జరిగింది. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు అతిథులందరినీ ఆహ్వానించి తన స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు. సభాప్రారంభకులుగా హాజరైన తెలంగాణా సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయిన డా. జుర్రు చెన్నయ్య పద్మభూషణ్ ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి జీవనరేఖలను ఆయన విద్యార్ధి దశ, సాహిత్య ప్రయాణం, నిర్వహించిన పదవులు, సాధించిన విజయాలు, చేసిన రచనలు, అందుకున్న సన్మాన సత్కారాలను సోదాహరణంగా ఒక విహంగ వీక్షణంలా నారాయణ రెడ్డి గారి ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రముఖ కవి, పూర్వ రాజ్యసభ సభ్యులు, పూర్వ ఉపకులపతి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ సినీగీత రచయిత, పద్మభూషణ్, ఆచార్య డా. సి. నారాయణ రెడ్డి గారు తన జీవితకాలంలో అలంకరించిన పదవులు, సమవర్ధవంతంగా నిర్వహించిన బాధ్యతలు, సాధించిన విజయాలు ఏ సాహితీవేత్తకు దక్కని గౌరవాలు అన్నారు. ఆయన కలం నుండి జాలువారిన దీర్ఘ కావ్యం ‘విశ్వంభర’ కు సాహిత్యంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం దక్కడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రస్తుతం అదే విశ్వంభర కావ్యాన్ని ఇప్పుడు ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి అత్యున్నత ప్రమాణాలతో శ్రవణరూపంలో ముద్రించడం హర్షదాయకం” అన్నారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ “తెలుగు భాషాసాహిత్య వికాసాలకోసం తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, ప్రముఖ కవి డా. సినారె రాసిన విశ్వంభర కావ్యాన్ని ప్రముఖ సినీ కథారచయిత జే.కే భారవి తన విశిష్టగళంలో ఆడియో రూపంలో ముద్రించడం ముదావహమని, ఇప్పుడు దానిని సాహితీలోకానికి తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం ఆనందదాయకం అన్నారు.” సుప్రసిద్ధ సినీ కథారచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. తాను పలుమార్లు జే.కే భారవి రూపొందించిన విశ్వంభర ఆడియో విన్నానని, చాలా శ్రవణానందకరంగా ఉన్నదని, దీన్నే వీడియో రూపంలో తన స్వంత ఖర్చులతో దృశ్యమాలికగా తీసుకువచ్చే ఆసక్తి ఉన్నదని, త్వరలోనే ఈ విషయంలో సినారె కుటుంబసభ్యులను సంప్రదిస్తానన్నారు. సుప్రసిద్ధ కథారచయిత జే.కే భారవి మాట్లాడుతూ.. డా. సినారె విరచిత విశ్వంభర కావ్యాన్ని ఒక పిచ్చి వ్యామోహంతో ఎన్నో సార్లు చదివానని, ఎంతో ఆసక్తితో ఎన్నో వ్యవ ప్రయాసలకోర్చి దీన్ని అత్యున్నత ప్రమాణాలతో నేను రూపొందించిన ఆడియోని ఇప్పుడు తానా ప్రపంచ సాహిత్యవేదికగా విడుదలజేయడం చాల సంతోషంగా ఉన్నదని చెప్పారు. అలాగే దీనికి కారకులైన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా పూర్వధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూరకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ప్రముఖ ప్రేరణాత్మక ప్రసంగకర్త ఆకెళ్ళ రాఘవేంద్ర విశ్వంభర కావ్యంలోని అనేక విషయాలను ఉటంకించి, ఆ కావ్య లోతుపాతుల్ని, కావ్య వైభవాన్ని ప్రతిభావంతంగా విశ్లేషించి సినారె సాహిత్య ప్రతిభను గొప్పగా ఆవిష్కరించారు. పద్మభూషణ్ డా. సినారె కలం నుండి వెలువడిన “విశ్వంభర” కావ్యం మొత్తాన్ని ప్రముఖ సినీ కథా రచయిత జే.కే భారవి గళంలో మీకోసం ప్రత్యేక కానుకగా ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేసి వినవచ్చు. https://youtube.com/playlist?list=PL0GYHgMt2OQyx6qWv-kWt2bCxAl6GB5XO&si=D4SS-jzDXYhmqFQX -
మార్కెట్లోకి మళ్లీ హీరో కరిజ్మా..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా కరిజ్మా బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 సీసీ బైక్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ వాటాన్ని పెంచుకునే దిశగా తమకు ఇది మరో మైలురాయి అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. తాము ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, మార్కెట్ వాటా 4–5 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పూర్తి స్థాయిలో వేగవంతంగా రూపొందించుకోనున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 150 సీసీ లోపు సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఇకపై 150 సీసీ నుంచి 450 సీసీ వరకు బైక్‌ల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
హీరో మోటోకార్ప్ కొత్త సీఈవో ఎవరో తెలుసా?
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ స్కూటర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త సీఈవోను ప్రటించింది. ప్రస్తుతం సీఎఫ్‌వోగా ఉన్న నిరంజన్ గుప్తాకు ప్రమోషన్ ఇచ్చి మరీ సీఈవోగా నియమించింది. గుప్తా నియామకం 2023 మే 1వ తేదీ నుండి బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది. అయితే కొత్త సీఎఫ్‌వో ఎవరుఅనేది ఇంకా ప్రకటించలేదు. (ఇదీ చదవండి: IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు) ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, హార్లే డేవిడ్సన్, జీరో మోటార్‌సైకిల్స్ వంటి గ్లోబల్ బ్రాండ్లతో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంలో నిరంజన్ కీలక పాత్ర పోషించారు. గుప్తా ఏథర్ ఎనర్జీ, హెచ్‌ఎంసిఎల్ కొలంబియా, హెచ్ఎంసి ఎంఎం ఆటో ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులలో కూడా సేవలందిస్తున్నారు. నిరంజన్ హీరో మోటోకార్ప్‌లో చేరడానికి ముందు మూడేళ్లు వేదాంతలో, 20 సంవత్సరాలు యూనిలీవర్లో పనిచేశారు. గుప్తా సీఈవోగా ఎదగడంపై హీరో మోటోకార్ప్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోల్ టైమ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ సంతోషంప్రకటించారు. కాగా బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా పవన్ ముంజాల్ కొనసాగనున్నారు. -
వైద్య దిక్సూచి ‘కేర్ మోటో’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘పండగొస్తుంది. షాపింగ్కెళతాం. అక్కడి డ్రెస్సుల్లో ఒకటి ఎంపిక చేసి.. మనకు నప్పుతుందో లేదో ట్రయల్ వేసుకొని మరీ చూస్తాం. నచ్చితే ఒకే! లేకపోతే ఇంకోటి చూస్తాం! కుదరకపోతే వేరే షాపుకెళతాం’’ ఇందులో మనకయ్యే ఖర్చేమీ ఉండదు! మరి దీన్నే వైద్య సేవలకు అన్వయిస్తే...‘‘సుస్తీ చేస్తే దగ్గర్లోని ఆసుపత్రికెళతాం. మందులు వాడతాం. తగ్గలేదంటే మరో ఆసుపత్రికెళతాం. మళ్లీ మందులు వాడతాం. ఈ లోపు స్నేహితులో, బంధువులో మరో వైద్యుడిని సూచిస్తే అక్కడికీ వెళతాం’’ కానీ వెళ్లిన ప్రతి ఆసుపత్రిలో డాక్టర్ కన్సల్టేషన్, పరీక్షలు, మందులు ఖర్చులు తడిసిమోపడవుతాయి! పై రెండు ఉదాహరణలతో తెలిసిందొక్కటే.. విండో షాపింగ్‌లా ట్రీట్మెంట్ షాపింగ్ ఉచితంగా దొరకదని! దీన్నే వ్యాపారంగా మార్చుకున్నారు నిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సర్జన్‌గా ఉన్న డాక్టర్ నిరంజన్ రావూరి. 2016 ఏప్రిల్‌లో హైదరాబాద్ కేంద్రంగా కేర్మోటో.కామ్‌ను ఆరంభించారు. సంస్థ సేవలు, ఇతర వివరాలను ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. సాధారణంగా పేషెంట్లు 3 రకాలు. ఆరోగ్య బీమాతో చికిత్స చేయించుకునేవాళ్లు, బీమా లేకుండా డబ్బుతో చికిత్స చేయించుకునే వాళ్లు, ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే వాళ్లు. నిజానికి 60 శాతం పేషెంట్లు బీమాతో చేయించుకునేవారే. వీళ్ల సమస్యేంటంటే.. ఏ జబ్బుకు ఏ ఆసుపత్రి, ఏ వైద్యుడు సరైన చికిత్స చేస్తాడో తెలియదు. డబ్బులు వృథా చేస్తుంటారు. రోజూ పేషెంట్లు వచ్చి నాకు చెప్పే బాధలే కేర్మోటో.కామ్‌కు పునాది వేశాయి. ట్రీట్మెంట్ షాపింగ్ ఖర్చును నివారించి ఏ రోగానికి ఏ ఆసుపత్రిలో సరైన చికిత్స అందుతుందో.. అది కూడా అందుబాటు ధరల్లో ఎక్కడ ఉంటుందో చెప్పడమే కేర్మోటో.కామ్ పని. 6 నెలల్లో మార్కెట్లోకి ఐఓటీ పరికరం.. ప్రస్తుతం మా వద్ద 30 మంది ఉద్యోగులున్నారు. వైద్య పరిభాషతో పాటూ ఏ జబ్బుకు ఎలాంటి చికిత్స ఉంటుందనే అంశాలపై శిక్షణ ఇచ్చిన తర్వాతే ఉద్యోగులను నియమించుకుంటాం. ఐఓటీ ఆధారిత మెడికల్ డివైజ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 40 శాతం అభివృద్ధి పూర్తయింది. మరో 6 నెలల్లో మార్కెట్లోకి విడుదల చేస్తాం. ఇదేంటంటే.. డివైజ్‌ను కొన్న కస్టమర్ బీపీ, షుగర్, హృదయ స్పందన వంటి వివరాలు ఎప్పటికప్పుడు క్లౌడ్ ఆధారంగా కేర్మోటోకు చేరుతాయి. ఎలాంటి తేడాను గుర్తించినా.. వెంటనే కస్టమర్‌కు సమాచారం పంపిస్తాం. వెంటనే కస్టమర్ దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించే వీలుంటుంది. 3 నెలల్లో రూ.6 కోట్ల సమీకరణ.. 2 నెలల్లో డయోగ్నస్టిక్, ఆరోగ్య బీమా, ఫిజియోథెరపీ విభాగాల్లోనూ సేవలు ప్రారంభిస్తాం. తొలిదశలో 10 సెంటర్లతో ఒప్పందం చేసుకుంటాం. ఇప్పటివరకు కేర్మోటోలో వ్యక్తిగతంగా రూ.కోటి పెట్టుబడి పెట్టా. విస్తరణ కోసం రూ.6 కోట్లు సమీకరిస్తున్నాం. ఒకరిద్దరు వీసీ ఇన్వెస్టర్లతో చర్చించాం.3 నెల ల్లో డీల్ క్లోజవుతుంది. కర్ణాటక, తమిళనాడులో 40 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుని విస్తరిస్తున్నాం. 100 ఆసుపత్రులు.. 300 మంది వైద్యులు.. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటూ విజయవాడ, వైజాగ్, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, కాకినాడల్లోని సుమారు 100 ఆసుపత్రులు, 300 మంది వైద్యులతో ఒప్పందం చేసుకున్నాం. వైద్య ఖర్చులను సమకూర్చేందుకు మిలాప్, ఇంపాక్ట్ గురు వంటి క్రౌడ్‌ఫండింగ్ సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నాం. ఈ మధ్యే శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తికి కాలేయ మార్పిడికి మిలాప్ ద్వారా నిధులు సమీకరించాం. కాలేయ దాత దొరకగానే చికిత్స మొదలవుతుంది. కేర్మోటోకు 2.64 లక్షల యూజర్లున్నారు. 4,767 కన్సల్టేషన్స్ పూర్తి చేశాం. మా ద్వారా 1,049 సర్జరీలు జరిగాయి. ప్రస్తుతం రోజుకు 120 కాల్స్ వస్తున్నాయి. వీటిల్లో మెకాళ్ల మార్పిడి, కంటి శుక్షాల చికిత్స, కాలేయ మార్పిడి వంటి వ్యాధులకు సంబంధించిన ఫోన్లే ఎక్కువగా ఉంటున్నాయి. 70 శాతం కేసులను నిమ్స్, ఎంఎన్‌జే, పుట్టపర్తి ఆసుపత్రులకే సూచిస్తుంటాం. -
465... అసలేం జరిగింది?
కార్తీక్ రాజా, నిరంజన, మనోబాల ముఖ్య పాత్రల్లో సాయిసత్యం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘465’. శివపుత్ర క్రియేషన్స్ పతాకంపై అడ్డా వెంకట్రావు సమర్పణలో కుసుమ రామ్‌సాగర్ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘465’. ఈ చిత్రం తమిళనాడులో ఘనవిజయం సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇంతవరకు వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. శశాంక్ రవిచంద్రన్ రీ–రికార్డింగ్ ఈ చిత్రానికి హైలైట్. అనువాద కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. తమిళంలోలా తెలుగులోనూ మా చిత్రం విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. త్వరలో ఆడియో, సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శశాంక్ రవిచంద్రన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: పి.ఆర్.సుందర్, నిర్వహణ: యస్.కె. రఫీ, ఎ.టి. కృష్ణన్. -
మత్స్యకారులకు ఉపాధి కల్పించాలి
బిజినేపల్లి: కరవు కాటకాల్లో చెరువులు ఎండగా చేపల వేటే జీవనాధారంగా బ్రతికే మత్స్యకారులకు ప్రభుత్వం జీవనాధారం కల్పించాలని జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు నిర ంజన్ కోరారు. మండల కేంద్రంలో సర్పంచుల సంఘం మండలా«ధ్యక్షుడు గంగనమోని తిరుపతయ్య ఆధ్వర్యంలో ఆదివారం తాలూకా స్థాయి ముదిరాజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ ముదిరాజ్ కులాస్తులను బీసీ–డీ నుంచి బీసీ–ఏలకు మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపల వేటే జీవనాధారమైన, వృత్తి పరమైన సామగ్రిని ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. మత్స్యకారులకు రూ.వెయ్యికోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చే శారు. నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను కల్పించాలని మత్స్యకారులకు సామాజిక రక్షణ చట్టాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. నాయకుడు గొర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ముదిరాజ్ కులాస్తులు సామాజికంగా ఆర్థికంగా, విద్యపరంగా, రాజకీయాల్లో రాణించాలని కోరారు. సమావేశంలో మహాసభ మండలాధ్యక్షుడు అల్లోజి, నాయకులు మధు, నిరంజన్, జమ్ములు, జంగయ్య, శేఖర్, వెంకటయ్య, మహేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫేక్ జర్నలిస్టు ఆటకట్టు
తిరువనంతపురం: పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో వీరమరణం పొందిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాంతీయ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టుగా చెప్పుకుంటున్న అన్వర్ సాధిక్(24) ను మలప్పురం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. టెర్రర్ దాడి సమయంలో గ్రెనేడ్ ను నిర్వీర్యం చేసే క్రమంలో అసువులు బాసిన నిరంజన్, అతని కుటుంబంపై అన్వర్ సాధిక్ అమర్యాదకరమైన వ్యాఖ్యలను ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్లు పోలీసులు ఆరోపించారు. అతనిపై ఐపిసి 124 ( ఎ) ( దేశద్రోహం ) కింద కేసులు నమోదు చేశారు. సదరు పత్రిక ఫిర్యాదు ఆధారంగా జర్నలిస్ట్ గా నటిస్తున్న అతగాడిని అరెస్ట్ చేశామని తెలిపారు. -
లెఫ్టినెంట్ కల్నల్ అమర్ రహే..
-
లెఫ్టినెంట్ కల్నల్ అమర్ రహే..
బెంగళూరు: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ మృతదేహాన్ని సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన నివాసానికి తీసుకు వచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ నిరంజన్ అమర్ రహే అంటూ ఆ ప్రాంతం మారుమోగిపోతోంది. జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్ జీ)లో విధులు నిర్వహిస్తున్న కల్నల్ నిరంజన్.. విధినిర్వహణలో భాగంగా శనివారం తెల్లవారుజామునుంచి ఉగ్రమూకలతో పోరాడుతూ ఆదివారం అనూహ్యరీతిలో మరణించిన విషయం తెలిసిందే. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన ఏడుగురు సైనికుల్లో నిరంజన్ ఒకరు. కేరళకు చెందిన ఆయన.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత బెంగళూరులో విద్యాభ్యాసం చేసి ఆర్మీలో చేరారు. ఉగ్రవాదులు అమర్చిన గ్రేనేడ్ ను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలడంతో నిరంజన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు సైనికులు చనిపోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ఆరుగురు ఉగ్రవాదుల బలగాలు మట్టుపెట్టగలిగాయి. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. -
నిరంజన్, దానం మధ్య వాగ్వాదం
హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్ గ్రేటర్ కాంగ్రెస్ నేత నిరంజన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నగర్ కాంగ్రెస్ సమావేశాలను దానం నాగేందర్ నిర్వహించడం లేదని ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. ఆ సమావేశాలేవో మీరే పెట్టుకోండి అంటూ దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రేటర్ అధ్యక్షుడిగా దానం కొనసాగడానికి వీల్లేదంటూ కూడా ఆయన అన్నట్లు సమాచారం. -
ఎంఐఎంను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోగలరా?
హైదరాబాద్: ఎంఐఎం నేతల ఆస్తులు కాపాడేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్ మెంట్ మార్చిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ ఆరోపించారు. ఎంఐఎంను సంప్రదించకుండా మెట్రో రైలు ప్రాజెక్టు మార్పులపై నిర్ణయం తీసుకునే దమ్ము సీఎం కేసీఆర్ కు ఉందాని ప్రశ్నించారు. పాత అలైన్ మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్య, పింఛన్లు, రుణమాఫీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పి. శంకర్రావు కోరారు. రుణమాఫీపై ప్రభుత్వమే బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలని సూచించారు. పించన్లు అందక వృద్ధులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
శ్రవణ్ రాక.. టీ కాంగ్రెస్‌లో కాక
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే విభేదాలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నుంచి వచ్చిన శ్రవణ్‌ను టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. షబ్బీర్ అలీ పదవిని తీసి శ్రవణ్‌కు ఇవ్వడం సరికాదని, ఈ విషయంలో పొన్నాల పునరాలోచించకపోతే అందరం రాజీనామా చేసి తమ నిరసన తెలియజేస్తామని సీనియర్ నాయకుడు నిరంజన్ హెచ్చరించారు. దాసోజు శ్రవణ్‌తో పాటు కట్టెల శ్రీనివాస యాదవ్ కూడా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వెంటనే పొన్నాల వారికి పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో శ్రవణ్‌ను టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించారు. ఇదే ఇప్పుడు పార్టీలో విభేదాలకు కారణమైంది. -
రెండో రౌండ్లో నిరంజన్ గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్లో ఓపెన్ కేటగిరీలో నిరంజన్ వరుస రౌండ్లలో గెలిచాడు. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో శనివారం జరిగిన గేమ్‌లో నిరంజన్ (2)... మురళీకృష్ణ(1)పై విజయం సాధించాడు. రాజు (2)... చిరంజీవి (1)పై నెగ్గగా, చంద్రశేఖర్ (1)... చక్రవర్తి రెడ్డి (2) చేతిలో ఓటమి చవిచూశాడు. వినయ్ కుమార్ (1)... రాఘవ శ్రీవాస్తవ్ (2) చేతిలో, హర్షిత్ కృష్ణ (1)... ప్రభాత్ (2) చేతిలో ఓటమి పాలయ్యారు. జూనియర్స్ కేటగిరీ మూడో రౌండ్లో ఆశ్రీత్ రామ్ (1)... అభినవ్ (2) చేతిలో కంగుతిన్నాడు. అనూషా రెడ్డి (1)... లిఖితా రెడ్డి (2) చేతిలో, ప్రశాంత్ (1)... అరిహంత్ చేతిలో పరాజయం పొందారు.