465... అసలేం జరిగింది? | 465 audio will be released shortley | Sakshi
Sakshi News home page

465... అసలేం జరిగింది?

Published Tue, Jul 18 2017 1:12 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

465... అసలేం జరిగింది?

465... అసలేం జరిగింది?

కార్తీక్‌ రాజా, నిరంజన, మనోబాల ముఖ్య పాత్రల్లో సాయిసత్యం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘465’. శివపుత్ర క్రియేషన్స్‌ పతాకంపై అడ్డా వెంకట్రావు సమర్పణలో కుసుమ రామ్‌సాగర్‌ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘హారర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘465’. ఈ చిత్రం తమిళనాడులో ఘనవిజయం సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ రాబట్టింది.

ఇంతవరకు వచ్చిన హారర్‌ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. శశాంక్‌ రవిచంద్రన్‌ రీ–రికార్డింగ్‌ ఈ చిత్రానికి హైలైట్‌. అనువాద కార్యక్రమాలు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. తమిళంలోలా తెలుగులోనూ మా చిత్రం విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. త్వరలో ఆడియో, సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శశాంక్‌ రవిచంద్రన్, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, కెమెరా: పి.ఆర్‌.సుందర్, నిర్వహణ: యస్‌.కె. రఫీ, ఎ.టి. కృష్ణన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement