బహిరంగ విచారణలో పెద్ద ఎత్తున వచ్చిన డిమాండ్ ఇదే
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ వెల్లడి
పునర్వ్యవస్థీకరణ కావాలంటే కులాల ఆర్థిక స్థితి తేల్చాలి
దీనికి సమగ్ర కుటుంబ సర్వే ఎంతో కీలకం
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకే ఎక్కువ నష్టమనే వాదనలు వచ్చాయి
పది జిల్లాల్లో బహిరంగ విచారణ చేశాం..
వచ్చే నెల 9న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టుకు నివేదిక ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని కులాలను పునర్వ్యవస్థీకరణ (రీకేటగిరైజేషన్) చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పది జిల్లాల్లో నిర్వహించిన బీసీ కమిషన్ బహిరంగ విచారణల్లో ఈ అంశంపైనే ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చాయని వెల్లడించారు. లోతైన విచారణ చేపట్టిన తర్వాతే పునర్వ్యవస్థీకరణ సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, బాల లక్షి్మ, తిరుమలగిరి సురేందర్‌లతో కలిసి నిరంజన్ మీడియాతో మాట్లాడారు.
‘‘బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ చేపట్టాం. ఇప్పటివరకు 1,224 విజ్ఞప్తులు అందాయి. వాటిని కంప్యూటరీకరిస్తున్నాం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తోంది. సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, కుల విభాగాల్లో ఈ సర్వే కొనసాగుతోంది. ప్రారంభ రోజుల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ప్రస్తుతం ప్రజల నుంచి స్పందన బాగుంది. కొన్ని విభాగాలకు సంబంధించిన ప్రశ్నలకు సరైన జవాబులు అందడం లేదని వార్తలు వస్తున్నాయి. బీసీ కులాల పునర్వ్యవస్థీకరణ చేయాలంటే వారి ఆర్థిక స్థితి కూడా తప్పకుండా తేల్చాలి. అందుకే ఈ సర్వే ఎంతో కీలకంగా మారింది..’’అని కమిషన్ చైర్మన్ వెల్లడించారు.
అనుమానాలకు ప్రభుత్వం వివరణ ఇస్తుంది..
సమగ్ర సర్వే ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. తార్నాక వద్ద రోడ్లపై సర్వే ఫారాలు లభ్యమైనట్లు వచి్చన వార్తలపై స్పందించి, సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేసి, జవహర్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశామని వివరించారు. సర్వే ఫారాలను కంప్యూటరీకరించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సర్వేపై ఎలాంటి అనుమానాలున్నా ప్రభుత్వం సమాధానం ఇస్తుందని తెలిపారు.
ఈడబ్ల్యూఎస్‌తో నష్టంపై వినతులు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలు నష్టపోతున్నారనే వినతులు సైతం పెద్ద సంఖ్యలో వచ్చాయని నిరంజన్ తెలిపారు. 2– 4 శాతం కూడా జనాభా లేని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా... జనాభాలో సగం ఉన్న బీసీలకు అత్యల్పంగా రిజర్వేషన్లు కలి్పంచారంటూ వాదనలు వచ్చాయని వివరించారు. ఇటీవల డీఎస్సీలో బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయంటూ వినతుల్లో ప్రస్తావించారని వెల్లడించారు. వచ్చే నెల 9న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో విచారణ ఉందని.. ఆరోజు నాటికి రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ తరపున నివేదిక సమర్పించనున్నామని తెలిపారు.
కమిషన్ తరఫున కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాం
బహిరంగ విచారణ ప్రక్రియలో వచ్చిన అంశాలన్నీ ప్రభుత్వానికి నివేదిస్తామని జి.నిరంజన్ వెల్లడించారు. ‘‘కుమ్మర కులస్తులకు మట్టి కేటాయింపులపై జారీ చేసిన జీవోలను క్షేత్రస్థాయి అధికారులకు పంపేలా చర్యలు.. రంగారెడ్డి జిల్లా బండ రావిర్యాలలో వడ్డెరలకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేయడం, సంచార జాతులు, ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు.. గ్రామ అభివృద్ధి కమిటీలు చేస్తున్న కుల బహిష్కరణలపై కఠినంగా వ్యవహరించడం, ఆరె కటికల కోసం మీట్ కార్పొరేషన్ ఏర్పాటు, మద్యం దుకాణాల్లో ఆరె కటికలకు 30 శాతం రిజర్వేషన్లు, ట్యాంక్‌బండ్ వద్ద భగీరథుడి విగ్రహం ఏర్పాటు, రజకులను ఎస్సీ కేటగిరీలో చేర్చడం తదితర అంశాలపై వచ్చిన వినతుల ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదన లు చేస్తాం’’అని వివరించారు.
బీసీ సంక్షే మ వసతి గృహాల్లో వ సతులు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. ఇటీవల బహిరంగ వి చారణ ప్రక్రియలో భాగంగా కొన్ని హాస్ట ళ్లను సందర్శించామని.. కొన్నిచోట్ల ఏళ్ల త రబడి అద్దె చె ల్లించని పరిస్థితి ఉంద ని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో బా లురు, బాలికలకు ప్రత్యేక హాస్టళ్లను పూర్తిస్థాయి వసతులతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment