karthik raja
-
అప్సర కేసు.. కలకలం రేపుతున్న కార్తీక్ రాజా తల్లి ఆడియో
సాక్షి, హైదరాబాద్: అప్సర కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అప్సరను ప్రేమ వివాహం చేసుకున్న చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా.. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల సంచలనం రేపుతోంది. తన కుమారుడిని మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడంటూ ధనలక్ష్మీ చెబుతోంది. పెళ్లయిన కొద్ది రోజులకే లగ్జరీగా బతకాలని, టూర్లకు తీసుకెళ్లాలంటూ అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకు గురి చేశారన్న ధనలక్ష్మి.. తన కుమారుడితో రోజు గొడవలు పడే వారని, తన కుమారుడిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడన్నారు. కార్తీక్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మానసికంగా కృంగిపోయాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి చావుకు అప్సర, ఆమె తల్లినే కారణం. అప్పటి నుంచి ఇద్దరూ కనిపించలేదు. అప్సర హత్యకు గురైందని మీడియాలో వార్తను చూసి తెలుసుకున్నాను. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తమకు తెలియదు. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. అందు కోసమే అప్సరను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నానని కార్తీక్ తల్లి అన్నారు. కస్టడీకి సాయికృష్ణ.. పోలీసుల పిటిషన్ అప్సర హత్య కేసులో వారం రోజుల పాటు సాయికృష్ణను కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ నేడు కోర్టు విచారించనుంది. చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
ట్రిపుల్ ట్రీట్
సంగీతప్రియులకు ఓ శుభవార్త. ఇళయరాజాకు ‘పద్మ విభూషణ్’ అవార్డు వచ్చిందని ఆనందంలో ఉన్న ఈ సంగీత జ్ఞాని అభిమానుల ఆనందాన్ని డబుల్.. కాదు ట్రిపుల్ చేశారు ఆయన తనయులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా. తండ్రి ఇళయరాజాతో కలసి ఈ ఇద్దరూ ఓ సినిమాకి పాటలు సమకూర్చనున్నారు. సోదరుడు కార్తీక్ రాజాతో కలిసి యువన్ శంకర్ రాజా తన సొంత ప్రొడక్షన్ హౌస్ వైయస్సార్ ఫిలింస్‌పై ‘మామనిదన్’ అనే సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాకే ముగ్గురూ స్వరాలందిస్తారు. ఇంతకుముందు తండ్రి కంపోజిషన్‌లో తనయులు, తనయుల కంపోజిషన్‌లో తండ్రి పాడినప్పటికీ ముగ్గురూ కలిసి ఓ సినిమాకి పాటలివ్వడం ఇదే తొలిసారి. కచ్చితంగా ట్రిపుల్ ట్రీట్ అనే చెప్పాలి. శ్రీను రామస్వామి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నారు. -
465... అసలేం జరిగింది?
కార్తీక్ రాజా, నిరంజన, మనోబాల ముఖ్య పాత్రల్లో సాయిసత్యం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా ‘465’. శివపుత్ర క్రియేషన్స్ పతాకంపై అడ్డా వెంకట్రావు సమర్పణలో కుసుమ రామ్‌సాగర్ ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘465’. ఈ చిత్రం తమిళనాడులో ఘనవిజయం సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇంతవరకు వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. శశాంక్ రవిచంద్రన్ రీ–రికార్డింగ్ ఈ చిత్రానికి హైలైట్. అనువాద కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. తమిళంలోలా తెలుగులోనూ మా చిత్రం విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. త్వరలో ఆడియో, సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శశాంక్ రవిచంద్రన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: పి.ఆర్.సుందర్, నిర్వహణ: యస్.కె. రఫీ, ఎ.టి. కృష్ణన్. -
ఆగస్ట్‌లో ఎళ్‌కుత్తు
ఎళ్‌కుత్తు చిత్రం ఆగస్ట్‌లో విడుదలకు ముస్తాబవుతోంది. వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్న కెనన్నా ఫిలింస్ ఆధినేత జే.సెల్వకుమార్ నిర్మిస్తున్న చిత్రం ఎళ్‌కుత్తు. ఇంతకు ముందు ఆయన అట్టకత్తి దినేశ్, నందిత జంటగా తిరుడన్ పోలీస్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. దానికి కార్తీక్‌రాజా దర్శకుడు. అదే కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆ ఎళ్‌కుత్తు. బాలశరవణన్, జాన్‌విజయ్, చాయాసింగ్, శ్రీమాన్, శరత్, దిలీప్ సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జస్టిన్‌ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం గురించి నిర్మాత సెల్వకుమార్ తెలుపుతూ ఇది కుమరి జిల్లా సముద్ర ప్రాంత గ్రామాల అందాలను తెరపై ఆవిష్కరించే చిత్రం అన్నారు. ఆ ప్రాంతంలోని మత్స్యకారుల జీవితాల ఇతివృత్తంగా ఎళ్‌కుత్తు చిత్రం ఉంటుందన్నారు. వైవిధ్యభరిత చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్న తమ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ఇదని తెలిపారు. చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం తరువాత జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న బ్రూస్లీ, సంతానం హీరోగా నిర్మిస్తున్న సర్వర్‌సందరం చిత్రాలను వరుసగా తెరపైకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. -
త్వరలో ఇళయరాజా అభిమాన సంఘం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా త్వరలోనే తన తండ్రి పేరుమీద ఓ అభిమాన సంఘం ఏర్పాటుచేయబోతున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సంఘం ఏర్పాటుకానుంది. ఇళయరాజా విశేషాలతో కూడిన ఓ వారపత్రిక తీసుకురావడంతో పాటు సామాజిక కార్యకలాపాలలో కూడా ఈ సంఘం పాల్గొంటుంది. ఇది ఇతర నటీనటుల అభిమాన సంఘాల్లా ఉండబోదని, విభిన్నంగా ఉంటుందని కార్తీక్ చెప్పాడు. ఆ కళాకారుడి ద్వారా అభిమానులకు చేరువ కావడమే అభిమాన సంఘాల ఉద్దేశం అవుతుందని, దాన్ని తాము సాధిస్తామని అన్నాడు. 'ఇసైజ్ఞాని' అనే పేరుతో వారపత్రికను తీసుకొస్తున్నట్లు తెలిపాడు. ఇందులో ఇళయరాజా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, ఇతర విషయాలు అన్నీ ఉంటాయి. ఇళయరాజా వారసుడిగా సంగీత దర్శకత్వంలోకి అడుగుపెట్టిన కార్తీక్, ఇప్పటికి దక్షిణాదిలోని పలు భాషల్లో 50 సినిమాలకు సంగీతం అందించాడు.