ఆగస్ట్‌లో ఎళ్‌కుత్తు | Tamil new movie release in August | Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌లో ఎళ్‌కుత్తు

Published Fri, Jul 1 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

ఆగస్ట్‌లో ఎళ్‌కుత్తు

ఆగస్ట్‌లో ఎళ్‌కుత్తు

 ఎళ్‌కుత్తు చిత్రం ఆగస్ట్‌లో విడుదలకు ముస్తాబవుతోంది. వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్న కెనన్నా ఫిలింస్ ఆధినేత జే.సెల్వకుమార్ నిర్మిస్తున్న చిత్రం ఎళ్‌కుత్తు. ఇంతకు ముందు ఆయన అట్టకత్తి దినేశ్, నందిత జంటగా తిరుడన్ పోలీస్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు.
 
 దానికి కార్తీక్‌రాజా దర్శకుడు. అదే కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఆ ఎళ్‌కుత్తు. బాలశరవణన్, జాన్‌విజయ్, చాయాసింగ్, శ్రీమాన్, శరత్, దిలీప్ సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జస్టిన్‌ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం గురించి నిర్మాత సెల్వకుమార్ తెలుపుతూ ఇది కుమరి జిల్లా సముద్ర ప్రాంత గ్రామాల అందాలను తెరపై ఆవిష్కరించే చిత్రం అన్నారు. ఆ ప్రాంతంలోని మత్స్యకారుల జీవితాల ఇతివృత్తంగా ఎళ్‌కుత్తు చిత్రం ఉంటుందన్నారు.
 
  వైవిధ్యభరిత చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్న తమ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ఇదని తెలిపారు. చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం తరువాత జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న బ్రూస్‌లీ, సంతానం హీరోగా నిర్మిస్తున్న సర్వర్‌సందరం చిత్రాలను వరుసగా తెరపైకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement