
సాక్షి, హైదరాబాద్: అప్సర కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అప్సరను ప్రేమ వివాహం చేసుకున్న చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా.. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల సంచలనం రేపుతోంది. తన కుమారుడిని మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడంటూ ధనలక్ష్మీ చెబుతోంది.
పెళ్లయిన కొద్ది రోజులకే లగ్జరీగా బతకాలని, టూర్లకు తీసుకెళ్లాలంటూ అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకు గురి చేశారన్న ధనలక్ష్మి.. తన కుమారుడితో రోజు గొడవలు పడే వారని, తన కుమారుడిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడన్నారు.
కార్తీక్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మానసికంగా కృంగిపోయాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి చావుకు అప్సర, ఆమె తల్లినే కారణం. అప్పటి నుంచి ఇద్దరూ కనిపించలేదు. అప్సర హత్యకు గురైందని మీడియాలో వార్తను చూసి తెలుసుకున్నాను. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తమకు తెలియదు. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. అందు కోసమే అప్సరను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నానని కార్తీక్ తల్లి అన్నారు.
కస్టడీకి సాయికృష్ణ.. పోలీసుల పిటిషన్
అప్సర హత్య కేసులో వారం రోజుల పాటు సాయికృష్ణను కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ నేడు కోర్టు విచారించనుంది.
చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్..
Comments
Please login to add a commentAdd a comment