audio viral
-
మీరు ప్రూవ్ చేసుకోకపోతే ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సి ఉంటుంది..!
సాక్షి,రామచంద్రాపురం : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మంత్రి సుభాష్‌కు చంద్రబాబు అక్షింతలు వేసిన ఆడియోను ఆయన వ్యతిరేక వర్గం లీక్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు విషయంలో వెనుకబడిన మంత్రి సుభాష్‌ను తీవ్రంగా హె చ్చరించారు చంద్రబాబుతొలిసారి ఎమ్మెల్యే, మంత్రైన సుభాష్.. పనితీరు మార్చుకోవాలంటూ చివాట్లు పెట్టారు. ‘పార్టీకి ఉపయోగపడని రాజకీయాలు మీకెందుకయ్యా? ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏం చేస్తారయ్యా? ఎవ్రిడే మీకు టెస్టే.. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఏ ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని మీరూ ప్రూవ్ చేసుకోవాలి.లేదంటే మేం ఆల్టర్నేట్ చూస్తాం’ అని ఫోన్లో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏం చేయాలో అర్ధంగాక మంత్రి సుభాష్ నీళ్లు నమిలారు. ఆ ఆడియో అటు సోషల్ మీడియాలోనూ, ఇటు టీడీపీ వర్గాల్లోనూ చక్కర్లు కొడుతోంది. పనితీరు మార్చుకోండి లేదంటే..ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సభ్యత్వ నమోదుపై చంద్రబాబు నేతలకు టార్గెట్ ఇచ్చారు. ఈ సభ్యత్వ నమోదుపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రుల్ని, ఇతర పార్టీ నేతల్ని వివరాల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా రామచంద్రాపురం ఎమ్మెల్యే, మంత్రి సుభాష్‌కు తన నియోజకవర్గంలో 9వేల వరకు సభ్యత్వ నమోదు చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ సభ్యత్వ నమోదు విషయంలో మంత్రి సుభాష్ పనితీరు సరిగ్గా లేదని కేవలం 29 శాతం మాత్రమే చేశారని చిందులు తొక్కారు చంద్రబాబు. -
సొంత అక్కను పడుకుంటావా అని అడిగాడు.. ఆడియో బయటపెట్టిన భార్య
-
రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం! ఆడియో వైరల్
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులకు డీప్ ఫేక్ వీడియోలు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఏఐ జనరేటెడ్ వాయిస్ క్లిప్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆ వాయిస్ క్లిప్ విపిస్తుంది. ఏఐ వాయిస్‌తో పాటు.. మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట దృష్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆడియో క్లిప్‌ను కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు షేర్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.The day is soon… on June 4… The Prime Minister will be Rahul Gandhi… pic.twitter.com/ymrLZC447q— Aaron Mathew (@AaronMathewINC) April 25, 2024 ఒకవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ.. రాహుల్ గాంధీ ప్రమాణం చేసినట్లు ఆడియో క్లిప్ వైరల్ కావటంతో నెటిజన్లు తమ నేతకు మద్దతుగా కామెంట్లు పెడుతూ వీడియో క్లిప్ షేర్ చేస్తున్నారు.‘ఆ రోజు త్వరలోనే రానుంది.. అది జూన్ 4’, ‘రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఈ ఆడియో క్లిప్.. ఏఐ వాయిస్ క్లోన్ అని కొన్ని డిటెక్షన్ టూల్స్ నిర్ధారణ చేశాయి. ఆడియో, వీడియో రెండు వేరుగా చేసి.. ఫ్యాక్ట్ చేయగా ఈ క్లిప్ ఏఐ జనరేటెడ్‌గా తేలిందని పేర్కొంటున్నాయి. ఇది ఫేక్ ఆడియో క్లిప్ అని తేల్చాయి. ఇక.. ఇటీవల ఇదే తరహాలో కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ ఏఐ వాయిస్ క్లోన్ క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. అందులో ఆయన ఆర్టికల్ 370 గురించి మాట్లాడినట్టు ఉంది. -
హోంగార్డులను స్టేషన్లోనే ఉంచండి
సాక్షి, హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోంగార్డులకు పోలీస్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. హోంగార్డులంతా డ్యూటీలోనే ఉండాలని, డ్యూటీ అయిపోయిన వారిని కూడా పోలీస్ స్టేషన్లకే పరిమితం చేయాలని హుకుం జారీ చేసినట్టు ఓ ఆడియో వైరల్ అయ్యింది. రవీందర్ మృతికి నిరసనగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం అయినట్టు తెలిసింది. ఆదేశాలు మీరితే విధుల నుంచి బహిష్కరణకు గురవుతారని ఓ దశలో బెదిరింపు ధోరణిలో హెచ్చరించినట్టు తెలిసింది. ’రెస్ట్ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు’ ‘విధుల్లో ఉండే హోంగార్డులు, డ్రైవర్లు, ఆఫీసర్ల దగ్గర పనిచేసే వాళ్లయినా, డే డ్యూటీ చేసేవాళ్లు, ఇంకే డ్యూటీలో ఉండేవాళ్లయినా సరే ప్రతి ఒక్కరూ ఈ రోజు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. స్టేషన్ వదిలి బయటికి వెళ్లకూడదు. డ్యూటీ అయిపోయిన వాళ్లను కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచండి..రెస్ట్ ఉంది కదా.. ఇంటికి పోతాం అంటే కుదరదు. ఎవరెవరైతే ఆబ్సెంట్‌లో ఉన్నారో వాళ్ల పేర్లు రాసి పెట్టండి. పది నిమిషాల తర్వాత మళ్లీ నాకు చెప్పండి. ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వాళ్లను మిస్కండక్ట్ కింద తీసుకోబడుతుంది. వాళ్ల ఉద్యోగానికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్. అందరికీ పేరు పేరున ఫోన్ చేసి తెలపండి. ఇది మీ రెస్పాన్సిబిలిటీ...’అని ఓ పోలీస్ అధికారి సెట్లో ఆదేశాలిస్తున్న ఆడియో ఒకటి శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉన్నతాధికారుల ఒత్తిళ్లపై బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నా...హోంగార్డులు అంతర్గతంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కుట్రతోనే డీఎంకే వ్యాఖ్యలు: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: రాజకీయకుట్రలో భాగంగా, తమ ప్రభుత్వ వైఫల్యాల నుంచి, మంత్రులపై ఉన్న అవినీతి, ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే అధికార డీఎంకే గందరగోళం సృష్టిస్తోందని బీజేపీ నేత తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఉదయనిధిస్టాలిన్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టాలిన్‌తో పాటు కేంద్రమాజీమంత్రి ఎం.రాజాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ...తాను యజ్ఞయాగాలకు కేరాఫ్ అని చెప్పుకునే సీఎం కేసీఆర్, ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. -
అప్సర కేసు.. కలకలం రేపుతున్న కార్తీక్ రాజా తల్లి ఆడియో
సాక్షి, హైదరాబాద్: అప్సర కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అప్సరను ప్రేమ వివాహం చేసుకున్న చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా.. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల సంచలనం రేపుతోంది. తన కుమారుడిని మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడంటూ ధనలక్ష్మీ చెబుతోంది. పెళ్లయిన కొద్ది రోజులకే లగ్జరీగా బతకాలని, టూర్లకు తీసుకెళ్లాలంటూ అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకు గురి చేశారన్న ధనలక్ష్మి.. తన కుమారుడితో రోజు గొడవలు పడే వారని, తన కుమారుడిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడన్నారు. కార్తీక్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మానసికంగా కృంగిపోయాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి చావుకు అప్సర, ఆమె తల్లినే కారణం. అప్పటి నుంచి ఇద్దరూ కనిపించలేదు. అప్సర హత్యకు గురైందని మీడియాలో వార్తను చూసి తెలుసుకున్నాను. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తమకు తెలియదు. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. అందు కోసమే అప్సరను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నానని కార్తీక్ తల్లి అన్నారు. కస్టడీకి సాయికృష్ణ.. పోలీసుల పిటిషన్ అప్సర హత్య కేసులో వారం రోజుల పాటు సాయికృష్ణను కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ నేడు కోర్టు విచారించనుంది. చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
ఐపీఎస్ రూపా Vs ఐఏఎస్ రోహిణి: కాల్ లీక్ ప్రకంపనలు.. ఆ ఆడియోలో ఏముంది?
బనశంకరి(కర్ణాటక): ఐపీఎస్ రూపా మౌద్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య గత ఆదివారం నుంచి తలెత్తిన సంగ్రామం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది. వివాదం నేపథ్యంలో వారిద్దరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా సర్కారు బదిలీ చేయడం తెలిసిందే. కాల్ లీక్ ప్రకంపనలు తాజాగా రూపా మౌద్గిల్– సామాజిక కార్యకర్త గంగరాజు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపడింది. ఇందులో రూపా తీవ్ర ఆరోపణలు చేయడం ఉంది. కబిని వద్ద ఒక స్థలం డీల్ చేయడానికి భూ రికార్డుల కోసం రోహిణి సింధూరి నా భర్త, ఐఏఎస్ మౌనీశ్ వద్ద సమాచారం తీసుకుందని రూపా ఆ ఆడియోలో చెప్పారు. రూపా గతంలో చేసిన ఆరోపణలను మళ్లీ ఈ కాల్లో ప్రస్తావించారు. ఆడియో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే సారా మహేశ్ కేసును వెనక్కి తీసుకోవడానికి రాజీకోసం హెచ్డీ.కుమారస్వామి, హెచ్డీ.దేవేగౌడ, ఇద్దరు ఐఏఎస్‌ల ద్వారా రోహిణి ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెప్పారు. అంతేగాక ఆడియోలో గంగరాజుపైన రూపా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఆమెను సపోర్టు చేస్తున్నారా, నువ్వు ఫైల్ పట్టుకుని పదేపదే ఆమె వద్దకు వెళ్లడం తప్పా ఏముంది, కాల్ రికార్డు చేసుకుంటావా, చేసుకో, నాకు వచ్చే కోపానికి.. అంటూ అసభ్య పదజాలంతో దూషించడం రికార్డయింది. మైసూరులో ఆడియో విడుదల ఐపీఎస్ రూపాతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను బుధవారం మైసూరులో సామాజిక కార్యకర్త గంగరాజు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గొడవ మరింత జఠిలమయ్యే సూచనలే ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఆడియో హాట్ టాపిక్‌గా మారింది. రోహిణి సింధూరి ఆమె పరిచయాలను ఉపయోగించుకుని భర్త అన్నను బీజేపీలోకి చేర్చాలని చూస్తోంది అని ఆడియోలో రూపా పేర్కొన్నారు. తన భర్త మౌనీశ్ తీరుపైనా, కుటుంబ వ్యవహారాలపైనా రూపా ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రూపా నన్ను పావుగా వాడాలని చూశారు. ఈ సందర్భంగా మీడియాతో గంగరాజు మాట్లాడుతూ ఐపీఎస్ రూపా నాపై కోపంతో మాట్లాడారు. నాతో 25 నిమిషాలు మాట్లాడారు. రోహిణి సింధూరికి వ్యతిరేకంగా పోరాటం కోసం నన్ను ఉపయోగించుకునేందుకు ఆమె యత్నించారు. నాకు ఫోన్ చేసి భూ వ్యవహారాల గురించి సీబీఐ అధికారిలా ప్రశ్నించారు, రూపా నా మొబైల్ నుంచి ఫోటో తీసుకుని, వాట్సాప్ చాట్‌ను ఎమ్మెల్యే సా.రా మహేశ్‌కు పంపించారు. చదవండి: ఐపీఎస్ రూపా మౌద్గిల్‌ను కట్టడి చేయండి నన్ను అసభ్య పదజాలంతో మాట్లాడారు. రోహిణి అక్రమాల గురించి నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, మీడియా వద్ద వాటి గురించి మాట్లాడు అని చెప్పగా అందుకు నేను నిరాకరించానని ఆయన చెప్పారు. నా కుటుంబానికి ఏమైనా అయితే రూపానే కారణం. అధికారం మాటున ఆమె ఏమైనా చేయొచ్చని ఆయన ఆరోపించారు. ఆమె నా రాకపోకలను, కార్యకలాపాలపై నిఘా వేశారు, రూపాపై క్రిమినల్ కేసు వేస్తా అన్నారు. -
పళనిస్వామికి కొత్త తలనొప్పి.. కలకలం రేపిన రహస్య సంభాషణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మొన్నటి వరకు పన్నీర్‌సెల్వంతో పోరాడిన ఎడపాడి పళనిస్వామికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. పార్టీ నుంచి పొన్నయ్యన్‌ను బహిష్కరించాలని మాజీ మంత్రులు కొందరు అప్పుడే నిరసన గళం విప్పారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖుడొకరు పొన్నయన్‌తో రహస్య సంభాషణ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో, ఆయనను బహిష్కరించాలనే డిమాండ్ ఎడపాడిని ఇరుకునపెట్టింది. చదవండి: మరో కొత్త వివాదం.. అన్నాడీఎంకే ఖజానాపై ‘వారిద్దరి’ కన్ను ఆడియోలోని వివరాలు.. మాజీ మంత్రి కేపీ మునుస్వామి డీఎంకే మంత్రి దురైమురుగన్ సిఫార్సుతో క్వారీల కాంట్రాక్టు పొంది నెలకు రూ.2 కోట్లు సంపాదిస్తున్నట్లు, అలాగే మాజీ మంత్రి తంగమణి సైతం తన అక్రమాస్తులను ఏసీబీ దాడుల నుంచి కాపాడుకునేందుకు సీఎం స్టాలిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం గురించి విమర్శలు చేసినట్లు, ఎంజీఆర్, జయలలితల గురించి అమర్యాదగా మాట్లాడినట్లు ఆ సంభాషణల్లో ఉన్నాయి. అంతేగాక తంగమణి, వేలుమణి దొంగలు, డబ్బు, కాంట్రాక్టులు ఇచ్చి 42 మంది ఎమ్మెల్యేలను గుప్పిట్లో పెట్టుకున్నారని, వాస్తవానికి ఎడపాడికి కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు పలుకుతున్నారని కూడా మాట్లాడారు. ఈ కారణంగా పొన్నయ్యన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఎడపాడిపై మాజీ మంత్రులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆడియో సంభాషణలను పొన్నయ్యన్ ఖండించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తన గొంతుకను ప్రచారంలోకి తెచ్చారని ఆరోపించారు. మాజీ మంత్రులపై తాను తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. అయితే, మొత్తం ఈ ఆడియోల వివాదం కోర్టుకెక్కగా గురువారం విచారణ జరగనుంది. పన్నీర్, శశికళపై నిఘా పార్టీ పగ్గాలు చేజారిపోవడంతో పన్నీర్‌సెల్వం, శశికళ ఏకంకావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు అన్నాడీఎంకే నేతలు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ రహస్యంగా కలుసుకుని మంతనాలు సాగిస్తున్నారనే సమాచారం అందడంతో నిఘాపెట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎడపాడిపై జరుపుతున్న న్యాయపోరాటంలో నెగ్గకుంటే మరో మార్గంలో రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పన్నీర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా పన్నీర్‌ను తమవైపు తిప్పుకోవాలని కొందరు, జయ అన్న కుమార్తె, కుమారులైన దీప, దీపక్ పన్నీర్‌సెల్వంను ఇంటికి విందుకు ఆహా్వనించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విందుకు శశికళను కూడా ఆహ్వానిస్తాం, కలిసి కొత్త పార్టీ స్థాపించి ఎడపాడి ఎత్తుగడలను చిత్తుచేయవచ్చని పన్నీర్‌కు గాలం వేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రచారాన్ని ఓపీఎస్ వర్గీయులు నిర్ధారించడం లేదు. 17న ఎమ్మెల్యేలతో ఎడపాడి సమావేశం పారీ్టలో ఇంతటి గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండగా ఈనెల 17వ తేదీన ఎమ్మెల్యేలతో ఎడపాడి పళనిస్వామి సమావేశం నిర్వహిస్తున్నారు. 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, పన్నీర్ బహిష్కరణతో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పదవి భర్తీపై ఆనాటి సమావేశంలో చర్చించనున్నారు. అత్యవసర విచారణకు నో అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలును తొలగించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను అత్యవసర కేసుగా విచారించాలని ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం తరపున చేసిన అభ్యర్థనను మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్లు బుధవారం విచారణకు రాగా, ఎడపాడి తరపున పిటిషన్ వేసింది ఎమ్మెల్యే కావడం వల్ల ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి సాధారణ కేసుగా జాబితాలో చేరుస్తామని తెలిపారు. ఇక పన్నీర్‌సెల్వం తరపున దాఖలైన పిటిషన్‌పై కూడా ఆదే విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. -
Bribe: కదిరి తహశీల్దార్ ఆడియో వైరల్.. కలెక్టర్ సీరియస్
అనంతపురం అర్బన్: కదిరి తహసీల్దారు మారుతిపై కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ చర్యలు తీసుకున్నారు. ఆయన్ను కదిరి తహసీల్దారు స్థానం నుంచి రిలీవ్ చేస్తూ..కలెక్టరేట్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం పట్టాదారు పాసు పుస్తకం మంజూరుకు తహసీల్దారు లంచం అడుగుతున్నట్లుగా వాయిస్ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కదిరి ఆర్డీఓ ద్వారా ప్రాథమిక విచారణ చేయించారు. ఆర్డీఓ ఇచ్చిన నివేదికపై కలెక్టర్ సంతృప్తి చెందలేదు. ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్‌తో సమగ్ర విచారణ చేయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విచారణ అధికారి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
ఏఎస్ఐ వర్సెస్ మాజీ స్పీకర్: సిగ్గుండాలి.. మీకు పిల్లలు లేరా?
సాక్షి, బెంగళూరు/బనశంకరి: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్‌పై బెంగళూరు జేపీ నగర పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే గోపి అనే ఏఎస్ఐ మండిపడ్డారు. ఆదివారం గోపి మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అయింది. ‘‘మాజీ సభాధ్యక్షునికి మొదటి నుంచీ గౌరవం ఇస్తున్నాం. కానీ ఆయన అందరు రాజకీయనేతల కంటే భిన్నంగా ఉంటారు. ప్రవర్తన సరిగాలేదు’’ అని ఆడియో క్లిప్‌లో విమర్శలు చేశాడు. ‘‘ఇతను (రమేశ్‌కుమార్) రోడ్డులో వెళుతుండగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఏమి చెబుతారంటే రహదారుల్లో సక్రమంగా వాహనాలు తనిఖీలు చేయడం లేదంటారు. మా కుటుంబాల గురించి మాట్లాడతారు. మేం ఇతని కుటుంబం గురించి మాట్లాడామా? మా విధుల గురించి మాట్లాడాలి. ఇతనిపై ఉన్న గౌరవం కూడా పోయింది’’ అని ఏఎస్ఐ అన్నారు. తనిఖీలు చేయడం మీ భార్యపిల్లలకు మంచిది కాదని ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసం అని మాజీ స్పీకర్‌పై మండిపడ్డారు. వివాదం ఎక్కడ మొదలైంది రోడ్డుపై వాహనాలను నిలిపి జరిమానా విధిస్తున్న చింతామణి పట్టణ పోలీసులను ఎమ్మెల్యే రమేశ్‌కుమార్ మందలించారు. ఇది వివాదానికి దారితీసింది. కాగా శుక్రవారం, ఎస్ఐ ముక్తియార్ సిబ్బందితో తాలూకాలోని మడికెరి క్రాస్‌లో వాహనాలను అడ్డుకుని జరిమానా విధిస్తున్నారు. ఈ సమయంలో శ్రీనివాసపుర నుంచి బెంగళూరుకు వెళుతున్న రమేశ్‌కుమార్ తన వాహనాన్ని నిలిపి.. ‘‘పోలీసులను పిలిచి రోడ్ల మధ్యలో వాహనాలను నిలిపి జరిమానా విధించరాదని ఇటీవల హోంమంత్రి ఆదేశాలు జారీచేశారు కదా. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది మీ కుటుంబానికి మంచిదికాదు. ఏం డాక్యుమెంట్లను చెక్ చేస్తారు? సిగ్గుండాలి మీకు. హోంమంత్రి చెప్పినా వినిపించుకోరా?, ఇదే మీ ఉద్యోగమా మీకు’’ అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఏఎస్ఐ ఆడియోపై రమేశ్‌కుమార్ స్పందిస్తూ టోల్గేట్ వద్ద పోలీసుల ప్రవర్తన బాధ కలిగించడంతో మీకు పిల్లలు లేరా? వెళ్లండి అని అన్నాను అని చెప్పారు. ఈ వివాదంపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి! చదవండి: Karnataka: రూపాయికే రొట్టె, అన్నం, సాంబార్ -
ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపు కాల్.. మీటింగ్‌కు వెళ్లొద్దంటూ..
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనప్ప అనుచరుడు నరేందర్‌గౌడ్‌కు సంబంధించిన ఫోన్‌కాల్ ఆడియో హాట్‌టాపిక్‌గా మారింది. ఆదిలాబాద్‌లో జరిగే బీఎస్పీ మీటింగ్‌కు ఎవరు వెళ్లొద్దని స్థానిక వ్యాపారి శ్రీకాంత్‌కు ఆయన హెచ్చరికలు జారీ చేశాడు. తన ఆదేశాలు దిక్కరించి మీటింగ్ వెళ్లితే తోక్కుడే ఉంటుందని బెదిరిస్తూ ఫోన్లో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ ఫోన్‌కాల్ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! ఇప్పటివరకు తమ పార్టీలో ఉన్న అర్షద్ రాజీనామా చేసి బీఎస్పీలో చేరడానికి సిద్ధమయ్యాడని, అతనితో పాటు ఆ పార్టీలో చేరడానికి ఎవరు వెళ్లవద్దని నరేందర్ గౌడ్ బెదిరింపులకు దిగాడు. ఒకవేళ తమ ఆదేశాలు దిక్కరించి అర్షద్‌తో పాటు బీఎస్పీ సమావేశానికి వెళ్లితే పరేషాన్లో పడతారని హెచ్చరించారు. చదవండి: CM KCR Tour: అడుగడుగునా పలకరింపులు.. ఆలింగనాలు -
గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ భర్త ఆడియో వైరల్
గద్వాల్ రూరల్: గద్వాల్ సీఐగా పనిచేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన హనుమంతుతో జెడ్పీ చైర్పర్సన్ భర్త తిరుపతయ్య ఫోన్లో మాట్లాడిన సంభాషణలు శనివారం సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం జిల్లాలో చర్చనీయాంశమైంది. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డికి చెందిన ఓ వ్యక్తి గతంలో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యవహారానికి సంబంధించి కేసు విషయంలో తిరుపతయ్య.. హనుమంతుతో ఫోన్లో మాట్లాడుతూ గట్టు మండల పోలీసు శాఖ అధికారి, స్థానిక ఎమ్మెల్యేపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ సంభాషణ ఎంతవరకు వాస్తవం, ఇది తాజాదా, లేక గతంలో మాట్లాడిన సంభాషణా అన్నదానిపై స్పష్టత లేదు. మొత్తంగా గద్వాల టీఆర్ఎస్లో వర్గవిభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఫోన్ సంభాషణతో మరోమారు స్పష్టమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
Tamilnadu: శశికళ ఫోన్‌కాల్ ఆడియో కలకలం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తన ఊపిరి అని, దానిని వేరు చేయడం ఎవరితరం కాదు అంటూ.. దివంగత సీఎం అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన ఫోన్‌కాల్ ఆడియో గురువారం వైరల్‌గా మారింది. అస్త్రసన్యాసం ప్రకటనను వెనక్కి తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశానికి చిన్నమ్మ శశికళ సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన మద్దతు దారులతో ఆమె ఫోన్ ద్వారా మాటలు కలిపే పనిలో పడ్డారు. బుధవారం అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆనందన్‌తో ఫోన్లో మాట్లాడిన శశికళ, గురువారం శివగంగై జిల్లా కారైక్కుకుడి అన్నాడీఎంకే నేత ప్రభాకరన్‌తో ఐదు నిమిషాలకు పైగా మాటలు కలిపారు. ఈసందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో చర్చకు దారి తీశాయి. ఇప్పటి వరకు ఆమె 22 మంది నేతలతో మాట్లాడి ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ సమయాల్లో ఎక్కడా ఆమె అన్నాడీఎంకే పేరును ఉచ్చరించలేదు. పార్టీని రక్షించుకోవాలని, నేను వస్తున్నాను.. అని మాత్రమే స్పందించారు. అయితే, తాజాగా, అన్నాడీఎంకే తన ఊపిరని, దానిని ఎవరూ వేరు చే యలేరని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఎంతో కష్ట పడ్డాను.. దివంగత నేత ఎంజీఆర్ తదుపరి అన్నాడీఎంకే బలోపేతం కోసం అమ్మ జయలలితో కలిసి తాను ఎంతో కష్టపడ్డానని, ఇది ఎవరికీ తెలియని విషయంగా చిన్నమ్మ ఆ ఫోన్‌కాల్‌లో పేర్కొన్నారు. అమ్మకు వచ్చే లేఖల్ని చదివి వినిపించడం, వాటికి సమాధానాలు పంపించడం తానే చేయడం జరిగేదని పేర్కొంటూ, ఇప్పుడు కార్యకర్తల నుంచి తనకు వస్తున్న లేఖలు చదివి, చూస్తూ కూర్చునే పరిస్థితి లేదన్నారు. ఆరోజు కూవత్తూరులోనూ తాను చెప్పిన విషయాలు అందరికీ గుర్తుంటాయని, అందరం ఏకం అవుదామంటూ చిన్నమ్మ ముగించారు. 14వ తేదీ భేటీలో ఎమ్మెల్యేలకే అనుమతి.. చిన్నమ్మ ఫోన్ కాల్ వ్యవహారాలు ఓ వైపు ఉన్నా, మరోవైపు పార్టీ తమ గుప్పెట్లో నుంచి జారకుండా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కుస్తీలు పట్టే పనిలోపడింది. ఈనెల 14న పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి అనుమతి దక్కడంతో గురువారం పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి సంయుక్త ప్రకటన చేశారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే అనుమతి ఉందని, ఇతరులు ఎవ్వరూ రాకూడదని, కరోనా నిబంధనల్ని తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష ఉపనేత, విప్‌ను ఎంపిక చేయనున్నారు. చదవండి: దేశంలో, పార్టీలో మోదీనే టాప్: సంజయ్ రౌత్ యూపీ కేబినెట్ ప్రక్షాళన! -
ఆడియో వైరల్ : చెల్లిపై అన్నలు లైంగిక దాడి
-
కేరళ నర్సు ఆడియో వైరల్, విచారణకు ఆదేశం
తిరువనంతపురం: కేరళలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడంటూ నర్సు మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనావైరస్ సోకిన ఒక వ్యక్తికి వెంటిలేటర్ ట్యూబ్స్ తారుమారుగా పెట్టడం వల్ల చనిపోయాడని ఒక నర్సు ఆమె సహచరులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో మృతుడి తరుపు బంధువులు ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ ప్రభుత్వం కరోనాను అన్ని విధాలుగా ఎదుర్కొంటుందని, ఇలాంటి సమయంలో కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు రావడాన్ని సహించబోమని ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. ఇక ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ, ఇవన్నీ ఆధారం లేని ఆరోపణలు అంటూ దీనిని ఖండించారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి హై బీపీ, డయాబెటీస్, ఊబకాయంతో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. అతనికి మాన్యువల్ వెంటిలేటర్ పెట్టలేదని, ఎన్ఐవీ వెంటిలేటర్ పెట్టామని దానిలో ట్యూబ్‌లు తారుమారు అయ్యే అవకాశాలు లేవని పేర్కొన్నారు. ఇవన్నీ కావాలని చేస్తున్న ఆరోపణలు అని తెలిపారు. చదవండి: కరోనాతో కొత్తముప్పు ! -
రాసలీలలు.. మహిళ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్ : జిల్లాలోని ఓ బీజేపీ మహిళా కార్యకర్త కమలదళంలో కలకలం సృష్టిస్తున్నారు. నిన్నటి వరకు బీజేపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన బాస సత్యనారాయణ రాసలీలల వీడియో, ఆడియో బయటపెట్టి అడ్డంగా బుక్ చేసిన సదరు మహిళా సంచలన వ్యాఖ్యలతో మరో వీడియో విడుదల చేశారు. బాస సత్యనారాయణ బొట్టు పెట్టి చిన్న భార్యగా స్వీకరించడంతో ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నానని ప్రకటించారు. ప్రస్తుతం బయటికొచ్చిన రాసలీలల వీడియో తనకు తెలియకుండా ఎవరో కావాలని బయటపెట్టారని స్పష్టం చేశారు. 70 ఏళ్ళ ముసలాయనతో ఎలా సహజీవనం చేస్తున్నావని, డబ్బుల కోసమే వ్యభిచారం చేస్తున్నావని పేపర్ల మీద సంతకాలు తీసుకుని, నానా రకాలుగా హింసిస్తున్నారని తెలిపారు. (చదవండి : కార్యకర్తతో రాసలీలలు.. బీజేపీ అధ్యక్షుడిపై వేటు) తన ఇంట్లో బీజేపీ నాయకురాళ్ళు ఇద్దరు, మరో నాయకుడు అసభ్యకరమైన పని చేశారని చెప్పారు. నా ఇంట్లో ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే కామ్ గా ఊరుకోకుంటే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. తాను ఎవ్వరిని బ్లాక్ మెయిల్ చేయలేదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లానని, ఆయన పట్టించుకోలేదన్నారు. తనకు బీజేపీ నాయకుల నుంచి ప్రాణభయం ఉందని చెప్పారు. ఇప్పటికైనా బండి సంజయ్ న్యాయం చేయాలని కోరారు. రాజకీయ క్రీడలో తనను ఎందుకు వాడుకుంటున్నారని ఆ మహిళా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. -
మహిళతో రాసలీలలు.. అధ్యక్షుడిపై వేటు
సాక్షి, కరీంనగర్: బీజేపీ కరీంనగర్ అధ్యక్షుడు బాస సత్యనారాయణపై అధిష్టానం వేటువేసింది. ఓ మహిళా కార్యకర్తతో రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై ఈ మేరకు చర్య తీసుకున్నారు. సత్యనారాయణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించారు. బాధ్యత గల పదవిలో ఉండి మహిళా కార్యకర్తతో ఇలా వ్యవహరించడం పార్టీతో పాటు ఆయన వ్యక్తిత్వానికి సరైనది కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. కాగా బాస సత్యనారాయణ ఓ మహిళాతో అసభ్యకర రీతిలో మాట్లాడుతున్న ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. -
తిట్లపురాణం
‘యూస్ లెస్ ఫెల్లో.. జాయిన్ అయితే ఎంపీపీకి చెప్పాలన్న జ్ఞానం ఉండదారా.. దొంగ లం.. కొడుకా ఏం రాజకీయం చేద్దామని వచ్చినావురా గంగాధరకు.. ఎంపీపీ పర్మిషన్ తీసుకోవారా.. పని చేయకున్నా కూర్చుండబెట్టి జీతం ఇచ్చినరా ఇడియట్.. పిచ్చిపిచ్చి నకరాలు చేస్తే తన్ని ఎల్లగొడుతా’ .....ఇదంతా గంగాధర ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీకి చెందిన దూలం బాలాగౌడ్.. అధికారి ఎంపీడీవో బండుపై అందుకున్న తిట్లపురాణం. తనకు చెప్పకుండా ఎలా వస్తావని ఇలా కడిగి పారేశారు. చెప్పరాని మాటలు, వినటానికి వీలు లేని బూతులు తిట్టడంతో షాక్‌కు గురైన ఎంపీడీవో బండు ‘సభ్యత సంస్కారంతో మాట్లాడు’ అంటూ మౌనం వహించినా వినలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి.. ఓ మండల స్థాయి అధికారిని ‘బండు’ కడిగాడు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో సోమవారం సాయంత్రం ఓ ఆడియో వైరల్ అయ్యింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీ, ఎంపీడీవోపై కురిపించిన తిట్ల పురాణానికి సంబంధించిన ఈ ఆడియో సారాంశం కాస్తా వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. అధికారిని రాజకీయ నాయకులు ఇలా కూడా తిడతారా అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా.. అధికార పార్టీకి చెందిన మరో ప్రజాప్రతినిధి నోరు పారేసుకోవడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, కరీంనగర్/గంగాధర: గతంలోకి వెళ్తే గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో కొద్ది రోజులు ఈవోపీఆర్డీగా పనిచేసిన బండు ఇక్కడే ఇన్చార్జి ఎంపీడీవోగా సైతం విధులు నిర్వహించారు. ఇతనికి ఇదే మండలానికి చెందిన ఎంపీపీ దూలం బాలాగౌడ్‌కు విభేదాలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ప్రమోషన్‌పై ఎంపీడీవోగా వేములవాడ మండలానికి వెళ్లారు. గంగాధర మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతోపాటు, విధుల్లో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వేములవాడ ఎంపీడీవో బండుకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన మూడు రోజుల క్రితం విధుల్లో చేరారు. కాగా.. తనకు సమాచారం ఇవ్వకుండా విధుల్లో చేరుతావా అంటూ ఎంపీపీ దూలం బాలాగౌడ్ పత్రికల్లో రాయలేని విధంగా దూషించడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఇబ్బందులకు గురిచేశాడు గతంలో ఇక్కడ ఈవోపీఆర్డీవోగా, ఇన్చార్జి ఎంపీడీవోగా పని చేసినప్పుడు సైతం ఎంపీపీ దూలం బాలాగౌడ్ ఇబ్బందులకు గురిచేసాడు. తనకు లాభం అయ్యే పని చేయాలని ఒత్తిడి తెచ్చాడు. అటువంటి సంస్కృతి నాకు లేదు. దీంతో సాలరీలు ఆపాడు. ఎల్పీసీ ఆపాడు. ప్రమోషన్‌పై వేములవాడకు ఎంపీడీవోగా వెళ్లాను. నాలుగు రోజుల క్రితం ఇన్చార్జి ఎంపీడీవోగా గంగాధరకు వచ్చా. మంగళవారం మూడు గంటల ప్రాంతంలో ఎంపీపీ ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు. అసభ్యకరమైన భాషలో చెప్పరాని విధంగా, రాయలేని విధంగా తిట్టాడు. ఈ విషయాన్ని సీఈవోకు వివరించా. మండలంలో ఏ ఎంపీడీవో పనిచేయడానికి ముందుకు రావడంలేదు. తిట్ల విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. – బండు, ఎంపీడీవో, గంగాధర సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించా నేను ఎంపీడీవో విషయంలో మాట్లాడిన దానిలో తప్పేం లేదు. సమాచారం ఇవ్వాలనే విజ్ఞత లేదా అని ప్రశ్నించాను. గతంలో పనిచేసినప్పుడు ఇక్కడ ఇబ్బందులకు గురిచేశారు. మళ్లీ ఇన్చార్జిగా వచ్చారు. విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులకు గురిచేయలేదు. నాలుగు రోజుల క్రితం విధుల్లో చేరిన ఎంపీడీవో కనీసం ఎంపీపీకి సమాచారం ఇవ్వాలనే విషయం తెలియదా. జాయినింగ్ లెటర్‌పై ఎంపీపీతో అడ్మిట్ అని రాయించుకున్న తరువాతే బాధ్యతలు తీసుకోవాలనే నిబంధన ఉంది. విధుల్లో చేరి నాలుగు రోజులైంది. ఫోన్ ద్వారానైనా సమాచారం ఇవ్వలేదు. – దూలం బాలాగౌడ్, ఎంపీపీ, గంగాధర -
టీడీపీ కీలక నేతకు దిమ్మతిరిగే షాక్..
విజయవాడ/భీమవరం: టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సెటైర్లు, పంచ్‌లు చూసి చంద్రబాబు నాయుడు సర్కారు సహించలేకపోతోంది. అందుకే పొలిటికల్ పంచ్ రవికిరణ్, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగాన్ని టార్గెట్‌గా చేసుకున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే టీడీపీ నాయకులు పలువురు నెటిజన్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ నెటిజన్ ను టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ సోదరుడు బోండా ప్రకాశ్ బెదిరిస్తున్నట్లున్నగా ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తా..' అంటూ బెదిరించిన బోండా ప్రకాశ్ కు సదరు నెటిజన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదుకాలేదు. వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్ అభిమానినని గర్వంగా చెప్పుకున్న ఆ యువకుడు టీడీపీ నేతల బెదిరింపులకు ఎలాంటి సమాధానం ఇచ్చాడో వీడియో క్లిక్ చేసి మీరే వినండి.. -
బోండా ప్రకాశ్‌కు దిమ్మతిరిగే సమాధానం..