
తిరువనంతపురం: కేరళలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడంటూ నర్సు మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనావైరస్ సోకిన ఒక వ్యక్తికి వెంటిలేటర్ ట్యూబ్స్ తారుమారుగా పెట్టడం వల్ల చనిపోయాడని ఒక నర్సు ఆమె సహచరులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో మృతుడి తరుపు బంధువులు ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు.
దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ ప్రభుత్వం కరోనాను అన్ని విధాలుగా ఎదుర్కొంటుందని, ఇలాంటి సమయంలో కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు రావడాన్ని సహించబోమని ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. ఇక ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ, ఇవన్నీ ఆధారం లేని ఆరోపణలు అంటూ దీనిని ఖండించారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి హై బీపీ, డయాబెటీస్, ఊబకాయంతో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. అతనికి మాన్యువల్ వెంటిలేటర్ పెట్టలేదని, ఎన్‌ఐవీ వెంటిలేటర్ పెట్టామని దానిలో ట్యూబ్‌లు తారుమారు అయ్యే అవకాశాలు లేవని పేర్కొన్నారు. ఇవన్నీ కావాలని చేస్తున్న ఆరోపణలు అని తెలిపారు.
చదవండి: కరోనాతో కొత్తముప్పు !
Comments
Please login to add a commentAdd a comment