ventilator
-
ఇది కదా అసలైన ప్రేమంటే..
కర్నూలు (టౌన్): కర్నూలు అబ్బాయికి జపాన్ అమ్మాయికి ప్రేమ చిగురించింది. ఇరువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లితో సుఖాంతమైంది. కర్నూలు నగర శివారులోని లక్ష్మీపురంలో ఎతిక్స్ హోమ్స్‌లో కోరకోల కిషోర్‌కుమార్, కడపటింటి ప్రేమమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమారుడు కొరకోల కీర్తి కుమార్ ముంబై ఐఐటీలో చదువుకున్నాడు. మూడేళ్ల క్రితం జపాన్‌లో అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇతనికి అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న టోక్యో పట్టణానికి చెందిన మట్ సుమోటో రియోకో, మట్ సుమోటో తఢాక దంపతుల కూతురు మట్ సుమోంటో రింకతో పరిచయం ఏర్పడింది. మూడున్నరేళ్ల వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. రింక అబ్బాయిని తన తండ్రికి పరిచయం చేసింది.ఇరు కుటుంబాలు అంగీకరించడంతో శనివారం కర్నూలులోని సీఎస్ఐ క్రైస్ట్ చర్చిలో పెళ్లి తంతు నిర్వహించారు. చదవండి: మాధవీలతపై వ్యాఖ్యలు..క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి -
ఎంజీఎంలో విద్యుత్ అంతరాయం.. పేషెంట్ మృతి
హన్మకొండ: వరంగల్ ఎంజీఎం అస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ అంతరాయంతో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక బొజ్జ బిక్షపతి (45) అనే పేషెంట్ మృతి చెందాడు. నర్సంపేట మండలం రాజేశ్వరపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి ఆర్ఐసీలో చికిత్స పొందుతున్నాడు. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అయితే నిన్న (శుక్రవారం) విద్యుత్ అంతరాయంతో ఆయనకు అమర్చిన వెంటిలేటర్ కాసేపటి వరకు పనిచేసి ఆగిపోయింది. అదే సమయంలో ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి జనరేటర్ ఆన్ చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ జనరేటర్ పని చేయకపోవటంతో ఒక్కసారి వెంటిలేటర్ ఆఫ్ అయి రోగి బిక్షపతి మృతి చెందాడు. చదవండి: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం -
అంతర్జాతీయస్థాయిలో ‘టిమ్స్’ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులను అంతర్జాతీయస్థాయిలో నిర్వహిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న టిమ్స్ ఆస్పత్రుల్లో వెయ్యి పడకలు ఉంటాయని, ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), నిమ్స్(నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరహాలోనే ‘టిమ్స్’పనితీరు ఉంటుందన్నారు. ప్రతి ఆస్పత్రికి ప్రత్యేకంగా పాలకమండలి ఉంటుందని మంత్రి తెలిపారు. వీటన్నింటిని కలిపి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. టిమ్స్ ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి ఉంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం నిమ్స్‌కు ఈ హోదా కల్పించడంతో వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. ఆదివారం ఆయన శాసనమండలిలో ‘టిమ్స్ బిల్లు– 2023’ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిమ్స్ ఆస్పత్రుల ఏర్పాటుతో దాదాపు 10వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ అందుబాటులోకి వస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 10వేల బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 34వేలకు చేరిందన్నారు. అతిత్వరలో వీటి సంఖ్య 50వేలకు చేరనుందని మంత్రి సభలో వెల్లడించారు. టిమ్స్ ఆస్పత్రుల్లో 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు ఏర్పాటవుతాయని, సూపర్ స్పెషాలిటీల్లో నర్సింగ్, పారామెడికల్ కోర్సులతో పాటు గుండె, మూత్రపిండాలు, లివర్, ఊపిరితిత్తులు, కేన్సర్, ట్రామా, ఎండోక్రైనాలజీ, ఎలర్జీ, రుమటాలజీ తదితర 30 విభాగాలుంటాయన్నారు. 200 మంది ఫ్యాకల్టి, 500 మంది వరకు రెసిడెంట్ వైద్యులు, 26 ఆపరేషన్ థియేటర్లు, గుండెకు సంబంధించి క్యాథ్ ల్యాబ్, కిడ్నీలకు డయాలసిస్, కేన్సర్‌కు రేడియేషన్, కీమోథెరపీతో పాటు సీటీస్కాన్, ఎంఆర్ఎస్ఐ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి ఆస్పత్రిలో 300 ఐసీయూ పడకలతోపాటు వెంటిలేటర్ బెడ్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయన్నారు. మంత్రి హరీశ్ మండలిలో ప్రవేశపెట్టిన టిమ్స్ బిల్లు–2023ని సభ ఆమోదించింది. వీటితో పాటు కర్మాగారాల సవరణ బిల్లు–2023, జైనులను మైనార్టీలుగా గుర్తిస్తూ మైనార్టీ కమిషనర్ సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, పంచాయతీ సవరణ బిల్లుల్ని కూడా శాసనమండలి ఆమోదించింది. -
సౌండ్ వినలేక పేషెంట్ వెంటిలేటర్‌నే ఆపేసింది! నివ్వెరపోయిన పోలీసులు
వెంటిలేటర్‌పై పేషెంట్ ఉన్నాడంటే ప్రతిక్షణం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు లెక్క. ఐతే అదే గదిలో ఉన్న మరో మహిళా పేషెంట్ తన సహ పేషెంట్ వెంటిలేటర్ శబ్దాన్ని భరించలేక ఆపేసింది. దీంతో ఆమె హత్యానేరం కింద జైలుపాలైంది. వివరాల్లోకెళ్తే...72 ఏళ్ల జర్మన్ మహిళ తన రూమ్మేట్ వెంటిలేటర్‌ని స్విచ్ఆఫ్ చేసింది. ఆమెకి మెషిన్ శబ్ధం చికాకు కలిగించిందని ఆపేసింది. ఇలా రెండు సార్లు వెంటిలేటర్‌ని స్విచ్ ఆఫ్ చేసింది. ఈ ఘటన నవంబర్ 29న జర్మన్‌లోని మాన్హీమ్ నగరంలోని ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఐతే వైద్యులు సదరు మహిళకి పేషెంట్‌కి వెంటిలేటర్ ఎంత కీలకమో చెప్పినా కూడా మళ్లీ ఆపేసిందని వైద్యులు చెబుతున్నారు. అంతేగాదు వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్ ప్రమాదంలో లేడని, ఇంకా ఇంటిన్సెవ్ కేర్‌లో ఉంచి చికిత్స అందిచాల్సి ఉండటంతో ఆ పేషెంట్‌ని అలా ఉంచినట్లు తెలిపారు. దీంతో పోలీసులు సదరు వృద్ధ మహిళను కావలనే ఇలా చేసి సదరు రోగిపై హత్యయత్నానికి పాల్పడి ఉండవచ్చని అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆమెను బుధవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచి జైలుకి తరలించారు. -
స్ట్రోక్‌తో కోమాలోకి నటి.. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై!
పొట్టి జుట్టు.. చందమామ లాంటి రూపంతో కనిపించే ఆ ముద్దుగుమ్మ.. మామూలు యోధురాలు కాదు. ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించింది. అదీ ఒక్కసారి కాదు.. రెండుసార్లు!. పూర్తిగా కోలుకుని నటనలోకి మళ్లీ అడుగుపెట్టి అభిమానులను అలరిస్తోందనగా.. పిడుగులాంటి వార్త. ఆమె ఆరోగ్యం మరోసారి తిరగబడింది. ఈసారి పరిస్థితి విషమించి ప్రాణాంతక స్థితికి చేరుకుంది. ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ.. చక్కని రూపం, హోమ్లీ క్యారెక్టర్లతో ఇంటిల్లిపాదిని అలరిస్తూ విశేష అభిమానుల్ని సంపాదించుకుంది. జుమూర్, భోలే, బాబా పర్ కరేగా లాంటి పలు చిత్రాలతో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. మరోవైపు సీరియల్స్‌లోనూ నటిస్తూ బుల్లితెర గుర్తింపూ దక్కించుకుంది. క్యాన్సర్ సోకపోయి ఉంటే ఆమె ఖాతాలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు ఉండేవే. రెండుసార్లు క్యాన్సర్‌ను జయించిన ఐంద్రీలా శర్మ.. తాజాగా స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చేరింది. క్రమంగా కోలుకుంటోందని వైద్యులు ప్రకటించడంతో.. ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని అంతా భావించారు. అయితే ఆమె ఇంకా కోమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఆమె శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైందని వైద్యులు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. వెంటిలేటర్‌పై ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెదడులో అక్కడక్కడ రక్తం గడ్డకట్టిందని తెలుస్తోంది. దిగ్గజ నటి సుచిత్ర సేన్ స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఐంద్రీలా శర్మ.. చిన్నవయసులోనే ఇలా ప్రాణాంతక స్థితికి చేరకోవడంపై బెంగాలీ ప్రేక్షకులు, ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అద్భుతం జరిగి ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గతంలో కీమోథెరపీల ద్వారా, సంక్లిష్టమైన సర్జరీల ద్వారా ఆమె క్యాన్సర్ నుంచి రెండుసార్లు కోలుకున్నారు. బెంగాలీలో పలు చిత్రాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులతోనూ ఆమె అలరించారు. టీవీ షోలతోనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తోటి నటుడు(జుమూర్ సీరియల్లో లీడ్ పెయిర్) సవ్యసాచి చౌదరితో డేటింగ్ చేస్తోంది. క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న సమయంలో ఇలా ఒక్కసారిగా ఆస్పత్రి పాలైంది. ఇదీ చదవండి: వీ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్: జాన్వీ కపూర్ -
Salman Rushdie: వెంటిలేటర్‌పై రష్దీ.. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం
న్యూయార్క్: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే. రక్తసిక్తమైన రష్దీకి వాయవ్య పెన్సిల్వేనియాలోని యూపీఎంసీ హ్యమాట్ సర్జరీ సెంటర్ ఆస్పత్రి వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 20 సెకన్ల వ్యవధిలో ఆగంతకుడు వెనుక 15 సార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. ‘గంటలపాటు ఆయనకు శస్త్రచికిత్స కొనసాగింది. మెడ భాగంలో కత్తిపోట్ల కారణంగా మెడ నుంచి చేతిలోకి వచ్చే నరాలు తెగిపోయాయి. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉంది. పొత్తికడుపుపై కత్తిగాటుతో కాలేయం దెబ్బతింది’ అని సల్మాన్ రష్దీ ప్రతినిధి ఆండ్రూ విలే న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థతో చెప్పారు. పశ్చిమ న్యూయార్క్‌లోని చౌటాకా ఇన్స్టిట్యూట్లో రష్దీపై దాడి చేసిన వ్యక్తిని 24 ఏళ్ల హదీ మతార్‌గా గుర్తించారు. అతడిపై హత్యాయత్నం, దాడి సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 150 ఏళ్ల చరిత్రలో తొలి దారుణం ‘150 ఏళ్ల లాభాపేక్షలేని విద్యా సంస్థ చరిత్రలో ఇలా దాడి జరగడం ఇదే తొలిసారి’ అని చౌటౌకా ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు మైఖేల్ హిల్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సంస్థలో జరిగే కార్యక్రమాలకు భద్రత పెంచాలంటూ గతంలోనే విజ్ఞప్తులు వచ్చాయన్న వార్తలను ఆయన కొట్టేపారేశారు. అయితే, కార్యక్రమ నిర్వాహకులు అక్కడ ఎలాంటి సెక్యూరిటీ సెర్చ్ చేయలేదని, మెటల్ డిటెక్టర్లు లేవని, బ్యాగుల తనిఖీ విధానం లేదని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పడం గమనార్హం. ‘ఇరాన్ నేత అయోతొల్లా హత్య ఆదేశాలిచ్చినా రష్దీ తన స్వేచ్ఛా గళాన్ని వినిపించారు. ఈ కష్టకాలంలో రష్దీ ధైర్యాన్ని, అంకిత భావాన్ని వేనోళ్లా పొగడాల్సిన సమయమిది’ అని కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ సీఈవో మార్క్ వ్యాఖ్యానించారు. ఉగ్రసంస్థల ఆర్థికమూలాలను దెబ్బతీయాలంటూ కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ అనే లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థ పనిచేస్తోంది. దాడిపై ఇరాన్ మౌనం రష్దీని చంపాలంటూ దాదాపు దశాబ్దం క్రితం దేశ సుప్రీం లీడర్ అయోతొల్లా ఇచ్చిన ఫత్వాను ఇన్నాళ్లకు ఓ ఆగంతకుడు అమలుకు యత్నించాడన్న వార్తలపై ఇరాన్ పెదవి విప్పలేదు. ‘ఫత్వాను అమలుచేసే ప్రయత్నం జరిగింది’ అంటూ పొడిపొడిగా ఒక ప్రకటనను మాత్రం శనివారం ఇరాన్ అధికారిక మీడియా వెలువరించింది. ‘ ఇలాంటి ఘటనలు ఇరాన్‌ను అంతర్జాతీయ సమాజం నుంచి దూరం చేస్తాయి’ అని ఇరాన్ మాజీ దౌత్యవేత్త మాషల్లా సెఫాజదీ అన్నారు. దాడిపై వెల్లువెత్తిన నిరసనలు ఘటనను భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా సాహిత్యలోకం అభివర్ణించింది. రచయితల గొంతు నొక్కే, హింసాత్మక, అణచివేత ధోరణులపై ముక్తకంఠంతో తమ తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు. అత్యంత హేయమైన చర్యగా బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి గీతాంజలి శ్రీ వ్యాఖ్యానించారు. నీల్ గైమన్, అమితవ్ ఘోష్, స్టీఫెన్ కింగ్, జీన్ గెరీరో తదితరులు దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రష్దీ త్వగా కోలుకోవాలని కోరుకున్నారు. జాగర్‌నాట్ బుక్స్, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా వంటి పలు పబ్లిషింగ్ సంస్థలూ ఘాటుగా స్పందించాయి. ఎవరీ హదీ మతార్? న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూ ప్రాంతంలో మతార్ నివసిస్తున్నాడు. మతార్ ఎందుకు దాడి చేశాడనే కారణాలను వెతికే పనిలో అమెరికా ఎఫ్‌బీఐ, స్థానిక దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ‘ఘటనాస్థలిలోని బ్యాక్ ప్యాక్, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సెర్చ్ వారెంట్ తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు. దాడి ఘటన వెనుక ఎవరూ ఉండకపోవచ్చని, మతార్ ఒక్కడికే ఇందులో ప్రమేయముందని అధికారులు ప్రాథమికంగా విశ్వసిస్తున్నారు. లెబనాన్ మూలాలున్న మతార్ నేర చరిత్రపై వివరాలు సేకరిస్తున్నాం’ అని పోలీస్ ట్రూప్ కమాండర్ మేజర్ ఎజీన్ జె. స్టాన్జ్యూస్కీ చెప్పారు. అయితే, అతని సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించగా కొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది. షియా ఉగ్రవాదులకు ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు మతార్ సానుభూతిపరుడని తెలుస్తోందని దర్యాప్తులో భాగంగా ఉన్న ఒక ఉన్నతాధికారి ఎన్బీసీ న్యూస్‌తో చెప్పారు. మతార్ వాడుతున్న సెల్‌ఫోన్ మెసేజింగ్ యాప్‌లో ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సులేమానీ ఫొటోను దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సులేమానీ ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్కు సైన్యాధికారిగా ఉన్నాడు. రష్దీ రాసిన రచనను ఇరాన్ 1988లో నిషేధించిన విషయం తెల్సిందే. ఇంత భద్రత అవసరమా? గతంలో రష్దీ వ్యాఖ్య హత్యా బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు కల్పించిన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఒకానొక దశలో అసహనం వ్యక్తంచేశారని న్యూయార్క్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో ఒక సారి రచయితల సదస్సు జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన రష్దీ మాట్లాడారు. ‘ఇంత మందితో నాకు భద్రత కల్పించడం నిజంగా అవసరమా? నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. నాకు ఇంతగా అదనపు భద్రత అవసరమని నేనెప్పుడూ అడగలేదు. గతంలో ఎలాంటి భద్రతా లేకుండానే ఇక్కడొకొచ్చాను. ఇప్పుడు ఇదంతా వృథా ప్రయాస. అయినా, భద్రత అవసరమైన రోజులను నేనెప్పుడో దాటేశాను’ అని ఆనాటి సభలో అన్నారు. -
దేశంలోనే తొలిసారి... కుక్కలకు వెంటిలేటర్ సౌకర్యం..
గాంధీనగర్: సాధారణంగా శునకాన్ని విశ్వాసానికి గుర్తుగా భావిస్తారు. యజమానులు కుక్కని తమ కుటుంబ సభ్యుల్లో ఒకదానిలా చూసుకుంటారు. ఒకవేళ తమ పెంపుడు కుక్కకు ఏమైనా జరిగితే యజమానులు విలవిల్లాడిపోతారు. కుక్కలు కూడా తమ యజమానిపట్ల అదే విధంగా ప్రేమను, విశ్వాసాన్ని కనబరుస్తుంటాయి. ఇక్కడ ఒక యజమాని.. తన పెంపుడు కుక్క పట్ల తన ప్రేమను గొప్పగా చాటుకున్నాడు. వివరాలు.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన శైవల్ దేశాయ్ అనే వ్యక్తి ఒక కుక్కను పెంచుకున్నాడు. అది ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో.. శైవల్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. తన కుక్కకు సరైన వైద్యం దొరికితే.. బతికేదని భావించాడు. ఈ క్రమంలో తన మిత్రులతో కలిసి ఒక కొత్త ఆలోచన చేశాడు. మనిషి మాదిరిగానే కుక్కలకు కూడా వెటర్నరీ ఆస్పత్రిలో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆ తర్వాత.. అతను కొన్నిరోజులకు అహ్మదాబాద్‌లో.. వెటర్నరీ బెస్ట్ బడ్స్ పెట్ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. దీనిలో అన్నిరకాల సదుపాయాలతోపాటు.. వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేశాడు. భారత్‌లో మూగజీవాలకు వెంటిలేటర్ సౌకర్యం ఉన్న తొలి ఆస్పత్రిగా ఇది రికార్డులకెక్కింది. ఈ ఆస్పత్రిలో మూగజీవాలన్నింటికి ఉచితంగా వైద్యం అందిస్తారని శైవల్ దేశాయ్ తెలిపారు. ఈ ఆస్పత్రి సీనియర్ వైద్యుడిగా దివ్వ్యేష్ కేలవాయ పనిచేస్తున్నారు. కొంత మంది కుక్కల నుంచి కరోనా సోకుతుందని పుకార్లు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో ఎలాంటి నిజంలేదని తెలిపారు. -
నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
Kaikala Satyanarayana Health Condition: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఈ రోజు ఉదయం ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో వైద్యులు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు కైకాల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారని, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే కైకాల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని అపోలో వైద్యులు తమ ప్రకటనలో వెల్లడించారు. చదవండి: బ్రేకప్‌లు, విడాకులు మన స్టార్ హీరోయిన్స్‌కు కలిసోచ్చాయా?! -
Corona: కొవిడ్ పేషెంట్లకు ఎమర్జెన్సీ టైంలో..
కరోనా చికిత్స సమయంలో పేషెంట్ల పరిస్థితి ఒక్కసారిగా తిరగబడిన సందర్భాలు ఉంటున్నాయి. ఆ టైంలో అప్రమత్తం అయ్యే లోపే ప్రాణాల మీదకు వస్తోంది. ఈ తరుణంలో పేషెంట్ల ప్రాణాలను కాపాడగలిగే అత్యాధునిక సాంకేతికతను రూపొందించారు భారత సంతతికి చెందిన అనంత్ మాడభూషి. ఓహియో క్లీవ్‌లాండ్‌లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో ‘కంప్యూటేషనల్ ఇమేజింగ్ అండ్ పర్సనలైజ్డ్ డయగ్నోస్టిక్స్’ ఎక్స్‌పర్ట్‌గా అనంత్ మాడభూషి. ఈయన డెవలప్ చేసిన ఏఐ టెక్నాలజీ ఇప్పుడు కొవిడ్ పేషెంట్లకు ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడనుంది. కొవిడ్ పేషెంట్‌కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు.. ఈ ఏఐ టూల్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. పేషెంట్‌కు వెంటిలేటర్ అవసరమని సూచిస్తుంది. తద్వారా పేషెంట్ల ప్రాణాలు కాపాడొచ్చని ఆయన చెప్తున్నారు. డీప్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీల సాయంతో ఈ టూల్‌ను రూపొందించారు ఆయన. అమెరికా, వుహాన్(చైనా)లో 2020లో నమోదు అయిన 900 మంది కొవిడ్ పేషెంట్ల సీటీ స్కాన్లను ఆధారం చేసుకుని ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. ‘‘ఈ టెక్నాలజీ.. కొవిడ్ 19 పేషెంట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో ఫిజిషియన్స్ను అప్రమత్తం చేస్తుంది. పేషెంట్‌కు, వాళ్ల కుటుంబ సభ్యులకు పరిస్థితి అప్డేట్ అందిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆస్పత్రికి ఎన్ని వెంటిలేటర్స్ అవసరం అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎర్లీ స్టేజ్‌లోనే గుర్తించి అప్రమత్తం చేస్తోందని, 84 శాతం సక్సెస్ రేటు చూపిస్తున్న ఈ టూల్‌ను త్వరలోనే వినియోగంలోకి తేనున్నామని పరిశోధకులు వెల్లడించారు. ముందుగా యూనివర్సిటీ ఆస్పత్రుల్లో, లూయిస్ స్టోక్స్ క్లీవ్‌లాండ్ వీఏ మెడికల్ సెంటర్లో వీటిని రియల్ టైంలో ఉపయోగించనున్నారు. క్లౌడ్ బేస్డ్ యాప్ఎమర్జన్సీ యూనిట్లకు వీటిని అనుసంధానిస్తారు. చదవండి: డ్రైవింగ్ సీట్లో నిద్ర..రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తం చేసే డివైజ్ -
వెంటిలేటర్‌పై బిగ్‌బాస్ బ్యూటీ అరియానా.. ఫోటో వైరల్
Ariyana on Ventilator : బిగ్‌బాస్ షో అనంతరం అరియానా గ్లోరీ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందన్న సంగతి తెలిసిందే. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా అరియానా పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. రీసెంట్గా ఆర్టీజీవో చేసిన ఇంటర్వ్యూతో అరియానా పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌పై ఫోకస్ చేసిన అరియానా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫోటో అభిమానులను షాక్‌కి గురిచేసింది. వెంటిలేటర్‌పై అరియానాను చూసి ఆమె ఫ్యాన్స్‌కి గుండె ఆగినంత పని అయ్యింది. అయితే ఇది రియల్ లైఫ్‌లో జరిగింది కాదు. సినిమా షూటింగ్లో భాగంగా అరియానా అలా వెంటిలేటర్‌పై కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా అరియానా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సినిమాలో అరియానా ఓ రోల్లో కనిపించనున్నట్లు తెలిసిందే. షూట్లో భాగంగా వెంటిలేటర్‌పై కనిపించి అరియానా షాకిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
మా చిన్నమ్మ ఐసీయూలో ఉంది.. వెంటిలేటర్ బెడ్ కావాలి :నటి
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు సహా పలువురు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా లక్షలు వెచ్చించినా పలు ప్రాంతాల్లో వెంటిలేటర్లు, బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. తాజాగా బాలీవుడ్ నటి భూమి ఫడ్నేకర్‌కు సైతం ఇలాంటి పరిస్థతే ఎదురైంది. వెంటిలేటర్ కావాలని, ఎవరికైనా వివరాలు తెలిస్తే అందజేయాలని సోషల్ మీడియాలో విన్నవించుకుంది. 'ఇది చాలా కష్టతరమైన సమయం. డిల్లీలోని ఎన్సీఆర్ ఆసుపత్రిలో మా చిన్నమ్మ ఐసీయూ ఉంది. తక్షణమే ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాలి. దయచేసి మీలో ఎవరికైనా వెంటిలేటర్ బెడ్ సమాచారం తెలిస్తే ఆ వివరాలు నాకు పంపండి' అని సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది. కాగా భూమి ఫడ్నేకర్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఆమెకు సహాయం అందడంతో ఆ పోస్టును డిలీట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఒక సెలబ్రిటీ అయ్యిండి భూమి ఫడ్నేకర్ లాంటి వాళ్లే వెంటిలేట్ దొరకడం లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలె భూమి ఫడ్నేకర్ కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కరణ్ జోహార్ రూపొందిస్తున్న తఖ్త్ సినిమాలో నటిస్తుంది. She has gotten the help 🙏 Deleting tweet thank you https://t.co/NyTk8bnuKZ — bhumi pednekar (@bhumipednekar) May 3, 2021 View this post on Instagram A post shared by Bhumi 🌻 (@bhumipednekar) చదవండి : దీపికా ఫ్యామిలీని తాకిన కరోనా, ఆసుపత్రిలో ప్రకాష్ పడుకోనే యాంకర్ అనసూయ భర్త జాబ్ ఏంటో తెలుసా? -
దారుణం: వెంటిలేటర్ లేక సీనియర్ వైద్యుడు మృతి
సాక్షి,లక్నో: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో రోజుకు మూడున్నర లక్షలకుపైగా వణికిస్తోంది. రోజుకు రోజుకుపెరుగుతున్న బాధితులతో దేశ రాజధానిలో కరోనా ఉగ్రరూపాన్నిదాల్చింది. తీవ్ర ఆక్సిజన్ కొరత మృత్యు ఘంటికలను మోగిస్తోంది. అటు ఉత్తర ప్రదేశ్‌లో కరోనా కల్లోలం కానసాగుతోంది. ఈ క్రమంలో వెంటిలేటర్ లభ్యంకాక ఒక సీనియర్ డాక్టర్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్‌రాజ్ ఆసుపత్రిలో 50 ఏళ్లపాటు ఎనలేని సేవలదించిన సీనియర్ సర్జన్ డాక్టర్ జెకె మిశ్రా (85) సమయానికి వెంటిలేటర్ అందుబాటులోకి రాక అదే ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన భార్య, ప్రముఖ గైనకాలజిస్ట్ రామ మిశ్రా (80) కళ్లముందే ఆయన ప్రాణాలు విడిచారు. దీంతో మిశ్రా కుటుంబ సభ్యులతో పాటు, ఆసుపత్రి సిబ్బంది,ఇతరులు విచారంలో మునిగి పోయారు. అలహాబాద్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ (ఎస్ఆర్ఎన్) ఆసుపత్రిని తరువాతి కాలంలో ప్రయాగ్‌రాజ్ అని పేరు మార్చారు. ఈ ఆసుపత్రిలో మొట్టమొదటి రెసిడెంట్ సర్జన్లలో మిశ్రా ఒకరు. ఆయన భార్య డాక్టర్ రామ మిశ్రా అధ్యాపక సభ్యురాలు.ఇద్దరు పదవీ విరమణ చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు లేకపోవడంవల్లే తమ బంధువులను కోల్పోయామని బాధిత కుటుంబాలు ఇప్పటికే ఆరోపణలు గుప్పించాయి. దాదాపు 50 ఏళ్లపాటు విశేష సేవలందించిన మిశ్రాకు వెంటిలేటర్ దొరకక ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యం సీనియర్ వైద్యులుగా తమకెదురైన భయంకరమైన అనుభవాలను మీడియాతో షేర్ చేశారు. (కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం) ‘‘ఆ హాస్పిటల్ ఆయనకు రెండో ఇల్లు... ఈ హాస్పిటల్ తమను కాపాడుతుందని భావించాం.. కానీ కానీ అదే తాము చేసిన పెద్ద తప్పయిపోయింది. తీవ్ర అనారోగ్యంతో ఆక్సిజన్ స్థాయి లెవల్స్ పడిపోయి స్థితిలో ఏప్రిల్ 13న ఆసుపత్రిక వచ్చాం..నొప్పితో బాధపడుతూ, చికిత్స కోసం ఎదురుచూస్తూ, బెడ్స్ దొరక్క ఒక రాత్రంతా గడిపాల్సి వచ్చిందదంటూ రామ మిశ్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు హాస్పిటల్ సిబ్బంది మిశ్రాకోసం బెడ్ సమకూర్చారు. కానీ, నేను మాత్రం నేలపైనే పడుకున్నా. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు. బీపీ మానిటర్ లాంటి కనీస సౌకర్యాలు లేవు. ఆయనకు మొదటి రెండు రోజుల్లో ఇంజక్షన్లుఇచ్చారు. కానీ అవేమిటో అడిగినా చెప్పలేదు. అసలు అక్కడ రోగులను పట్టించుకునేనాధుడేలేదు.. ఈ క్రమంలో ఏప్రిల్ 16 మధ్యాహ్నం నుంచి తన భర్త పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. వెంటిలేటర్లో ఉంచమని వైద్యులను వేడుకున్నాను. కానీ కీలకమైన (లారింగోస్కోప్, ఎండోట్రాషియల్ (ఇటి) ట్యూబ్) పరికరాలు వెంటనే అందుబాటులో లేవు. మరోవైపు ఆయనకు విపరీతమైన దగ్గు, రక్తం పడుతోంది. క్షణ క్షణానికి పరిస్థితి విషమిస్తోంది. హాస్పిటల్ సిబ్బందిని గట్టిగా అరిచేసరికి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే ఆయన్ను పై అంతస్తులో ఐసీయూలోకి తరలించారు. దీంతో పరిస్థితి మరింత విషమించింది. తాను పైకి వెళ్లేసరికే ఆయన ఊపిరి ఆగిపోయిందంటూ ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు. రెండో ఆలోచన లేకుండా.. ఆదుకుంటుందనే ఆశతో ఈ ఆసుపత్రికి వచ్చాం...కానీ ఈ ఆసుపత్రే తన భర్త ప్రాణాలను బలి తీసుకుందంటూ ఆమె ఆవేదన వెలిబుచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తిరస్కరించింది. 25-30 కంటే తక్కువ ఆక్సిజన్ స్థాయిలతో 500 మంది రోగులు ఉన్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. రోగులందరినీ కాపాడటానికి చేయగలిగిందంతా చేస్తున్నాం.. అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం తమకు ఉందని తెలిపింది. అలాగే డాక్టర్ జెకె మిశ్రా గుండెపోటుతో మరణించారని కూడా వెల్లడిండంచింది. కాగా రికార్డు స్థాయి కేసులతో దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్ ప్రకంపనలు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. దీంతో పలువురు వైద్యులు తమ ప్రాణాలకు తెగించి మరీ కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది వైద్యులు,ఇతర సిబ్బంది కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. చదవండి :ఆక్సిజన్ కొరత: సింగపూర్ భారీ సాయం పీరియడ్స్ టైంలో మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? -
వెంటిలేటర్‌పై ఉన్నా నీ పాడు బుద్ధి వదులుకోలేవా..
సాధారణంగా మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏది కూడ తినే పరిస్థితి ఉండదు. ఏది కూడా తినాలనిపించదు. అయితే, ఈ వీడియోలోని సదరు వ్యక్తి మాత్రం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉండికూడా తన చెడు వ్యసనాన్ని వదులుకోలేక పోయాడు. ఇతడు చేసిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అతడు గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్నాడు. అతని శరీరానికి అన్ని పైపులే ఉన్నాయి. కాగా, ఒక నర్సు వచ్చి అతని ఆరోగ్య పరిస్థితిని చూస్తొంది. మరోక వ్యక్తి అతని పాదాల వద్ద ఉండి అతడిని గమనిస్తుంది. ఆ సదరు వ్యక్తి మాత్రం తీరిగ్గా.. తన చేతుల్లో ఖైనీ ( తంబాకు) తీసుకొని, చేతిలో వేసుకొని రుద్దుతు తంబాకు తయారు చేయడం చేస్తున్నాడు. ఈ వీడియో.. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు ఆసుపత్రిలో ఇదేం పాడుపని.. ప్రాణాలు పోతున్నా, చెడు వ్యసనం మాత్రం వదులుకోలేకున్నాడు’ అంటూ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. -
వెంటిలేటర్‌పై 30% యువకులే.. జాగ్రత్త
రోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదు. కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వస్తున్నారు. అందువల్లనే అవసరమైన వారికి కూడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి. గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30% మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారన్నమాట. సెకండ్ వేవ్‌లో యువకులు కూడా ఎక్కువగా వైరస్ బారినపడుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రెమిడెసివిర్, తుసిలిజు మాబ్... ఇప్పుడు వీటికున్న క్రేజే వేరు. వీటిని కరోనా రోగులపాలిట అపర సంజీవనిగా అందరూ భావి స్తున్నారు. ఇదే కరోనా సీరియస్ రోగులను కాపాడే గొప్ప మందుగా తలపోస్తున్నారు. కానీ ఇలాంటి యాంటీ వైరల్ డ్రగ్స్‌తో ప్రాణాలు నిలపడం సాధ్యం కాదని, వాటిని వాడాల్సిన అవసరమే లేదని తేల్చి చెబుతున్నారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. వాటికోసం పిచ్చెక్కినట్లు బ్లాక్‌లో కొంటూ వేలు లక్షల రూపాయలు వృథా చేసుకుంటున్నారని అంటున్నారు. సెకండ్ వేవ్‌లో పిల్లలతోపాటు యువకులు కూడా ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. గాంధీలో 30 శాతం మంది యువకులే వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. కరోనా చికిత్సకు సంబంధించి వివిధ అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... అవసరం లేకున్నా భయంతో ఆక్సిజన్... కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదు. అనేక మంది భయాందోళనతో అనవసరం గా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వస్తున్నారు. వాస్తవంగా ఆక్సిజన్ శాచురేషన్ స్థాయిలను బట్టి వాడాలా లేదా అనే నిర్ధారణకు వస్తాం. ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్స్ 85 శాతం కంటే తక్కువగా ఉంటే అత్యంత విషమమైన పరి స్థితుల్లో రోగి ఉన్నట్లు లెక్క. 85–89 మధ్య ఉంటే విషమం, 90–93 శాతం శాచురేషన్ ఉంటే మధ్య స్థాయి, 93–95 వరకు ఉంటే మైల్డ్‌గా ఉన్నట్లు లెక్క. 95 అంతకంటే ఎక్కువగా శ్యాచురేషన్ ఉంటే సాధారణం కింద లెక్క. కానీ శాచురేషన్ స్థాయి 100 శాతం రావడంలేదని, 95 మాత్రమే ఉందని.. ఆక్సిజన్ పెట్టాలని అనేక మంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అందువల్లనే అవసర మైన వారికి కూడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి. చాలామంది దమ్ము అని ఆస్పత్రికి వస్తుంటారు.. కానీ వారిని చూస్తే సాధారణంగానే ఉంటారు. వెంటిలేటర్‌పై 30 శాతం మంది యువకులే... గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30 శాతం మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారన్నమాట. సెకండ్‌వేవ్‌లో యువకులు కూడా ఎక్కువగా వైరస్ బారినపడుతున్నారు. ఇక గతం కంటే ఇప్పుడు డాక్టర్లు ఎక్కువగా వైరస్‌కు గురవుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద ్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలు, కాలేజీలను మూసేసింది. సీరియస్ కేసులను తగ్గించలేదు రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ప్లాస్మాలు వాడితే కరోనా తగ్గుతుందన్న రుజువు లేనేలేదు. రెమిడెసివిర్‌ను వాడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది. సీరియస్ రోగులను అది ఏమాత్రం సాధారణ స్థితికి తీసుకురాలేదు. రెమిడెసివిర్ కావాలని రోగులే ఎక్కువగా అడుగుతున్నారు. అది ఇస్తేనే సరైన వైద్యంగా భావిస్తున్నారు. దీనిపై జనాల్లో పిచ్చి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఇంజెక్షన్ ప్రాణాలను ఏమీ కాపాడదు. యాంటీ వైరల్ డ్రగ్స్ అయిన రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ఫావిపిరావిర్‌లతో ప్రయోజనం లేదు. తుసి లిజుమాబ్‌ను డాక్టర్ నిర్ణయం మేరకు అత్యంత అరుదైన కేసుల్లోనే వాడాలి. ఈ మందు ఒక శాతం మందిలో కూడా అవసరం పడదు. అయితే రోగుల సంతృప్తి కోసం మాత్రమే ఇస్తున్నారు. సివియర్ కేసుల్లో స్టెరాయిడ్ చికిత్స... కరోనా లక్షణాలను బట్టే చికిత్స ఉంటుంది. సాధారణ కేసుల్లో డాక్టర్ సూచనల మేరకు మందులు వాడితే సరిపోతుంది. సీరియస్ కేసుల్లో స్టెరాయిడ్స్, యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్, యాంటీ కోయాగ్లెన్స్ మందులు అవసరాన్ని బట్టి వాడాలి. ఏ సమయంలో ఇవ్వాలో వాటిని అప్పుడు ఇస్తేనే సరిగా పనిచేస్తాయి. సెకండ్ వేవ్‌లో వైరస్ విజృంభణ అధికం... మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ట్రిపుల్ మ్యుటేషన్ రాష్ట్రంలో గుర్తించలేదు. డబుల్ మ్యుటెంట్ వైరస్‌లైతే ఉన్నాయి. దీంతో వైరస్ ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంది. కుటుంబంలో ఒకరికి వస్తే ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. దీంతో చాలామంది వైరస్ బారిన పడుతున్నారు. వందలో 80 మందికి ఇంట్లోనే రికవరీ అవుతుంది. మిగిలిన వారిలో ఐదుగురికి మాత్రమే ఆక్సిజన్ అవసరం పడుతుంది. వైరస్ విజృంభణ వల్ల అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఇప్పుడు కరోనా చికిత్సలకు అనుమతి వచ్చింది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు పడకలు నిండుతున్నాయి. కేసుల సంఖ్య ఎక్కువుంది కాబట్టి అందులో సివియర్ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మూడు వారాల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాం. టీకా వేసుకోండి... జాగ్రత్తలు పాటించండి అనవసరంగా బయటకు పోవద్దు. సినిమాలు, పబ్స్, రెస్టారెంట్లు, బార్లకు వెళ్లొద్దు. అత్యవసరమైతే తప్ప శుభకార్యాలకు వెళ్లొద్దు. బర్త్‌డే పార్టీలు చేసుకోవద్దు. పండుగలను తక్కువ మందితో జాగ్రత్తలు తీసుకొని చేసుకో వాలి. ముక్కు, నోరు పూర్తిగా మూసుకునేలా మాస్క్ పెట్టుకోవాలి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఏ కంపెనీ వ్యాక్సిన్ అని చూడకుండా ఏది అందుబాటులో ఉంటే దాన్ని వేసుకోవాలి. కరోనా నియంత్రణలో ఇవే కీలకమైన అంశాలు. -గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ -
ఎంజీఎంలో విషాదం: నిర్లక్ష్యానికి ‘ఊపిరి ఆగింది’!
సాక్షి,వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ కరోనా రోగి మృతి చెందాడు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్‌పై ఉన్న రోగి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. కరోనా బాధితుడు గాంధీ.. గత నెలాఖరులో ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే, శనివారం ఆస్పత్రిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై అతను ప్రాణాలు కోల్పోయాడు. కాగా, వెంటిలేటర్ తీసేసి సాధారణ బెడ్‌పై వేయడంతో గాంధీ ప్రాణాలు కోల్పోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి వివరణ ఇస్తూ... ఆస్పత్రిలో అందుబాటులో జనరేటర్లు ఉన్నాయని, మరో వెంటిలేటర్ మార్చే క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగానే కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేశారు. -
వెంటి లేటర్పైకి వెళ్లినా రోగి వెనక్కిరావచ్చు!
ఒకసారి వెంటిలేటర్‌పైకి వెళ్తే రోగి తిరిగి కోలుకోవడం కష్టమనే అపోహ చాలామంది రోగుల్లో, వారి రోగి బంధువుల్లో ఉంటుంది. సాధారణంగా రోగులను డాక్టర్లు.. సాధారణ పరిస్థితులోనే మొదట ట్రీట్మెంట్ అందిస్తారు. అయితే ఒక్కొసారి వారి శరీరం, మాములు స్థితికి సహకరించకపోతే ఆసమయంలోనే వారిని వెంటిలేటర్‌పైన ఉంచి వైద్యం చేస్తారు..ఒకసారి రోగిని వెంటిలేటర్‌పై పెట్టాక... ఏ పరిస్థితి కారణంగా రోగిని వెంటిలేటర్‌పై పెట్టారో, అది మెరుగయ్యే వరకు వెంటిలేటర్‌పైనే ఉంచాల్సి వస్తుంది. ఇక రోగి కోలుకోవడం అన్నది, అతడికి ఉన్న జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ పై ఉంచుతారు. కొన్ని రోజుల గడిచిన తర్వాత వాళ్ళు సాధారణ స్థితిలోకి చేరుకుంటారు. కాబట్టి వెంటిలేటర్‌పై పెట్టిన రోగులంతా కోలుకోరని భావించడం సరికాదు. తక్కువ మంది మాత్రమే పరిస్థితి విషమించి, ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తున్నారు. కాబట్టి వెంటిలేటర్ అనగానే ఆందోళన అక్కర్లేదు. చదవండి: సిజేరియన్ తర్వాత మహిళల ప్రధాన సమస్య ఇదే! -
వెంటిలేటర్‌పై మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య
కోల్‌కతా: సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (76) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బుధవారం మధ్యాహ్నం ఆయనను కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. బుద్ధదేవ్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనా నెగెటివ్‌గా వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రక్తంలో ఆక్సిజన్, పీహెచ్ స్థాయిలు తగ్గి కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువయ్యిందన్నారు. న్యుమోనియా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని సీటీ స్కాన్‌లో తేలిందన్నారు. -
కేరళ నర్సు ఆడియో వైరల్, విచారణకు ఆదేశం
తిరువనంతపురం: కేరళలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడంటూ నర్సు మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనావైరస్ సోకిన ఒక వ్యక్తికి వెంటిలేటర్ ట్యూబ్స్ తారుమారుగా పెట్టడం వల్ల చనిపోయాడని ఒక నర్సు ఆమె సహచరులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ సామాజిక మాద్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో మృతుడి తరుపు బంధువులు ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ ప్రభుత్వం కరోనాను అన్ని విధాలుగా ఎదుర్కొంటుందని, ఇలాంటి సమయంలో కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు రావడాన్ని సహించబోమని ఈ విషయంపై విచారణకు ఆదేశించారు. ఇక ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ, ఇవన్నీ ఆధారం లేని ఆరోపణలు అంటూ దీనిని ఖండించారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి హై బీపీ, డయాబెటీస్, ఊబకాయంతో బాధపడుతున్నాడని పేర్కొన్నారు. అతనికి మాన్యువల్ వెంటిలేటర్ పెట్టలేదని, ఎన్ఐవీ వెంటిలేటర్ పెట్టామని దానిలో ట్యూబ్‌లు తారుమారు అయ్యే అవకాశాలు లేవని పేర్కొన్నారు. ఇవన్నీ కావాలని చేస్తున్న ఆరోపణలు అని తెలిపారు. చదవండి: కరోనాతో కొత్తముప్పు ! -
వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టారు
కోట : రాజస్తాన్‌లోని కోటలో శుక్రవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. సాకెట్లో నుంచి వెంటిలేటర్ ప్లగ్ తీసి, ఎయిర్‌కూలర్ ప్లగ్ పెట్టడంతో ఒక రోగి మరణించాడు. వివరాలు.. కరోనా వైరస్ అనే అనుమానంతో ఒక 40 ఏళ్ల వ్యక్తిని రాజస్తాన్‌లోని మహారావు భీమ్ సింగ్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డ్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్ వార్డులో బాగా వేడిగా ఉండటంతో, రోగి కుటుంబ సభ్యులు బయటి నుంచి ఎయిర్ కూలర్ తీసుకువచ్చారు. కూలర్‌ను ఆన్ చేసేందుకు.. వెంటిలేటర్ కనెక్ట్ అయి ఉన్న సాకెట్లో వెంటిలేటర్‌కు సంబంధించిన ప్లగ్‌ను తీసి, కూలర్ ప్లగ్‌ను పెట్టారు. అరగంట తరువాత వెంటిలేటర్లో చార్జింగ్ అయిపోవడంతో ఆ వ్యక్తి మృతి చెందారు. పొరపాటున రోగి కుటుంబ సభ్యులే వెంటిలేటర్ ప్లగ్‌ను తీసేశారని ఎంబీఎస్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.(కరోనాతో నాగిరెడ్డి మనవడు మృతి) అయితే ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో నెగెటివ్ అని తేలిందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో జూన్ 15న సదరు వ్యక్తిని ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు మార్చినట్లు వెల్లడించారు. ఇంతలోనే కుటుంబసభ్యుల పొరపాటు వల్ల ఇలా జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించామని, వారు దర్యాప్తు జరుపుతున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. -
కోవిడ్‌తో మెదడుకు నష్టం?
బెర్లిన్: కోవిడ్ కారణంగా మెదడు దెబ్బతింటుందా? అవునంటున్నారు స్వీడన్‌లోని గొథెన్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వ్యాధి చికిత్సకు ఆసుపత్రిలో చేరిన కొందరిలో తాము మెదడు దెబ్బతిన్న ఆనవాళ్లను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 47 మందిపై తాము పరిశోధనలు చేశామని వారి రక్త నమూనాలను పరిశీలించినప్పుడు మెదడు దెబ్బతినేందుకు సూచికలైన కొన్ని రసాయనాలను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతోపాటు మెదడు నాడుల కొనలలో ఉండే ఎన్ఎఫ్ఎల్ అనే మరో ప్రొటీన్ కూడా రక్తంలో కనిపించిందని చెప్పారు. కోవిడ్ –19 కారణంగా వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన రోగుల్లో ఈ ఎన్ఎఫ్ఎల్ చాలా ఎక్కువగా కనిపించిందని, దీనికి వ్యాధి తీవ్రతకు సంబంధం ఉందన్న విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చునని చెప్పారు. -
వెంటిలేటర్‌పై ఉన్న కరోనా బాధితులకు..
లండన్: వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కరోనా వైరస్ బాధితులకు డెక్సామెథాసోన్ అద్భుతంగా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యంత చౌకగా లభించే ఈ ఔషధం కరోనా బాధితుల్లో మూడింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు, ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న బాధితుల్లో ఐదింట ఒక వంతు మరణాలను తగ్గించినట్లు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు పేర్కొన్నారు. యూకేలోని వివిధ ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 11,500 మందికిపైగా బాధితులపై డెక్సామెథాసోన్‌ను ప్రయోగించి, ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. వెంటిలేటర్ లేదా ఆక్సిజన్ సపోర్టు అవసరం లేని బాధితులకు డెక్సామెథాసోన్‌తో పెద్దగా ఉపయోగం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్ రోగుల్లో సానుకూలమైన ఫలితాలు చూపిన తొలి ఔషధం డెక్సామెథాసోన్ మాత్రమేనని, అది ఆహ్వానించదగ్గ పరిణామమని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ పీటర్ హార్బీ చెప్పారు. -
కరోనా: రోజుల తరబడి కోమాలో శిశువు
రియో డి జనీరో: చిన్నాపెద్దా తేడా లేని కరోనా ఐదు నెలల వయసున్న శిశువును వదల్లేదు. ఆ మహమ్మారి వల్ల కోమాలోకి కూడా వెళ్లిన ఆ శిశువు అంతిమంగా వైరస్‌నే జయించిన ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. బ్రెజిల్‌కు చెందిన ఐదు నెలల చిన్నారి డామ్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించింది. దీంతో శిశువు తల్లిదండ్రులు బాబును స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. డామ్‌ను పరీక్షించిన వైద్యులు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా భావించి మందులు రాసిచ్చారు. కానీ మందులు వాడినప్పటికీ బాబు ఆరోగ్య పరిస్థితి కుదుటపడలేదు. పైగా రోజురోజుకూ మరింత క్షీణిస్తుండటంతో కలవరపడ్డ తల్లిదండ్రులు రియో డి జనీరోలోని ప్రొ కార్డికో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు బాబుకు పరీక్షలు నిర్వహించి కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. (అమెరికాను బ్రేక్ చేయనున్న బ్రెజిల్!) అనంతరం చికిత్స అందించే సమయంలో బాబు కొన్ని రోజుల పాటు కోమాలోకి వెళ్లాడు. దీంతో వైద్యులు అతడిని రక్షించేందుకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. సుమారు 54 రోజుల తర్వాత ఆ శిశువు కరోనా బారి నుంచి బయటపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ విషయం గురించి ఆ చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. "ఇది నిజంగా అద్భుతం" అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా బ్రెజిల్లో 12 నెలల లోపు వయసు ఉన్న చిన్నారులు 25 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం అమెరికాలో 5,14,849 కేసులు నమోదవగా 29,300 మంది మరణించారు. (చనిపోతే బతికించారు.. మళ్లీ ‘చంపేశారు’!!) -
మనకూ.. వైటల్ వెంటిలేటర్లు!
నాసా అభివృద్ధి చేసిన వైటల్ వెంటిలేటర్‌ను తయారు చేయడానికి మూడు భారతీయ కంపెనీలు లైసెన్సులు పొందాయి. కోవిడ్-19 రోగులకు క్లిష్టమైన పరిస్థితుల్లో చికిత్సనందించే ఈ వెంటిలేటర్లను తయారు చేసేందుకు ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ప్రాగ్ లిమిటెడ్, మేధా సర్వ్ డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అనుమతి పొందినట్లు నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ కంపెనీలతోపాటు మరో 18 కంపెనీలకు ఈ అనుమతి లభించింది. వీటిలో 8 అమెరికన్ కంపెనీలు, 3 బ్రెజీలియన్ కంపెనీలు కూడా ఈ అనుమతులు పొందినట్లు నాసా వెల్లడించింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) క్యాలీఫోర్నియాలోని జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ(జేపీఎల్)లో ప్రత్యేకమైన వెంటిలేటర్లను అభివృద్ధి చేసింది. జేపీఎల్ ఇంజినీర్లు కరోనా రోగులకు సమర్థవంతంగా చికిత్సనందించే వైటల్ అనే వెంటిలేటర్‌ను రూపొందిచారు. అత్యవసర పరిస్థితులో ఈ వెంటిలేటర్‌ను వాడేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఏప్రిల్ 30న ఆమోదం తెలిపింది. డాక్టర్లు, మెడికల్ పరికరాల తయారీదారులను సంప్రదించి నాసా ఈ వైటల్ను అభివృద్ధి చేసింది. సంప్రదాయ వెంటిలేటర్ల కంటే అతితక్కువ వ్యయంతో వీటిని తయారు చేయవచ్చని నాసా పేర్కొంది. సాధారణ వెంటిలేటర్ తయారిలో వాడే పరికరాలలో 7 వంతు మాత్రమే వినియోగించి ఈ వైటల్ వెంటిలేటర్‌ను తయారు చేసినట్లు తెలియచేసింది. అయితే ఇది సమర్థవంతంగా పనిచేస్తుండడంతో అధిక మొత్తంలో వీటిని తయారు చేసేందుకు వివిధ కంపెనీలకు నాసా ఆనుమతులను మంజూరు చేస్తోంది. -
‘నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది’
ముంబై: నిర్లక్ష్యపూరిత ధోరణి వల్లే తాను కరోనా వైరస్ బారిన పడ్డట్లు వెల్లడించారు మహారాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్ర అవద్. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఆయన థానే జిల్లాకు పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలో అధికారులతో సమీక్ష సందర్భంగా ఓ పోలీసు అధికారి నుంచి మంత్రికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దాంతో ఈ నెల ప్రారంభంలో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందారు. రెండు రోజులు వెంటిలేటర్ మీద కూడా ఉన్నారు. కరోనా నుంచి కోలుకుని ఇటివలే డిశ్చార్జ్ అయ్యారు జితేంద్ర అవద్. ఈ క్రమంలో తాజాగా డెవలపర్స్ లాబీ బీడీఏ నిర్వహించిన ఓ ఆన్లైన్ సెమినార్లో పాల్గొన్నారు జితేంద్ర అవద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా నిర్లక్ష్యం కారణంగానే కరోనా వ్యాధి సోకింది. నేను ప్రజల సలహాలు పాటించలేదు. అందుకే కరోనా వలలో చిక్కాను. కానీ నా సంకల్ప బలంతో త్వరగానే వ్యాధి నుంచి కోలుకున్నాను. ఇతర ఐఏఎస్ అధికారులతో పోల్చుకుంటే నేను చాలా అదృష్టవంతుడుని. ప్లాస్మా థెరపీ, ఇంపోర్టెడ్ మందుల అవసరం లేకుండానే వ్యాధి నుంచి కోలుకున్నాను. ప్రస్తుతం నా హిమోగ్లోబిన్ లెవల్ బాగానే పెరిగింది. ఇందుకోసం కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నాను’ అన్నారు జితేంద్ర. (మహారాష్ట్రలో మంత్రిని కూడా వదల్లేదు..) -
చౌకైన వెంటిలేటర్
వాషింగ్టన్: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అమెరికాలోని భారతీయ దంపతులు ఓ వినూత్నమైన, చౌకైన వెంటిలేటర్‌ను తయారు చేశారు. మూడు వారాల వ్యవధిలోనే ఈ వెంటిలేటర్‌కు ఆలోచన చేయడంతోపాటు నమూనా యంత్రాన్ని తయారు చేసిన దేవేశ్ రంజన్, కుముదా రంజన్..దీనిని భారత్‌తోపాటు, పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవేశ్ రంజన్ జార్జియా టెక్ వర్సిటీలోని జార్జ్ డబ్ల్యూ వుడ్రఫ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తూండగా, కుముదా రంజన్ అట్లాంటాలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ‘‘ఈ యంత్రాన్ని వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేస్తే ఒక్కోదానికి రూ. 7,600 (వంద డాలర్లు) వరకూ అవుతుంది. ఐదు రెట్లు ఎక్కువ ధరకు అమ్మినా తయారీదారుకు మంచి లాభాలే వస్తాయి’’అని దేవేశ్ రంజన్ పీటీఐతో చెప్పారు. అమెరికాలో సాధారణ వెంటిలేటర్ ఖరీదు ఏడెనిమిది లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. ఊపిరితిత్తులు బలహీనపడిన సందర్భాల్లో శ్వాసను అందించేందుకు వెంటిలేటర్లు ఉపయోగిస్తారన్నది తెలిసిన విషయమే. శ్వాస వేగం, ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్లో గాలి మోతాదు, ఊపిరితిత్తులపై పీడనం వంటి అన్ని అంశాల నిర్వహణకు దేవేశ్, కుముద్ రంజన్లు ఎలక్ట్రానిక్ సెన్సర్లు, కంప్యూటర్ నియంత్రణలను ఉపయోగించారు. దీన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మాత్రం వాడే అవకాశం లేదని, అది మరింత అత్యాధునికమైందని వారు స్పష్టం చేశారు. దేవేశ్ స్వస్థలం బిహార్‌లోని పట్నా కాగా, కుముద్ రాంచీకి చెందిన వారు. భారత్‌తోపాటు ఆఫ్రికా దేశం ఘనాలో ఈ వెంటిలేటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జార్జియా టెక్ పూర్వ విద్యార్థులు తమను సంప్రదించినట్లు దేవేశ్ తెలిపారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న రిన్యూ గ్రూపు ఈ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందని ఆ సంస్థ అధ్యక్షుడు ఉత్తరాఖండ్‌కు చెందిన రవీ సజ్వాన్ తెలిపారు.