
కోల్‌కతా: సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (76) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బుధవారం మధ్యాహ్నం ఆయనను కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. బుద్ధదేవ్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనా నెగెటివ్‌గా వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రక్తంలో ఆక్సిజన్, పీహెచ్ స్థాయిలు తగ్గి కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువయ్యిందన్నారు. న్యుమోనియా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని సీటీ స్కాన్‌లో తేలిందన్నారు.