ex chief minister
-
విషాదం: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత
ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మనోహర్ తుదిశ్వాస విడిచారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి మృతిచెందారు. ముంబైలోని పీడీ హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఈరోజు మధ్యాహ్నం ముంబైలో మనోహర్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, గత ఏడాది మేలోనూ మెదడులో రక్తస్రావం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇక, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం సాయంత్రమే వైద్యులు తెలిపారు. #WATCH | Former CM of Maharashtra Manohar Joshi passed away at Hinduja Hospital in Mumbai at around 3 am today. He was admitted here on February 21 after he suffered a cardiac arrest. Visuals from outside the hospital. pic.twitter.com/yFL7aUkhfo — ANI (@ANI) February 23, 2024 రాజకీయ ప్రస్థానం.. 1937 డిసెంబర్ 2న నాంద్వీలో మనోహర్ జోషి జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే జరిగింది. తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మనోహర్ జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968-70 మధ్య మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇక, శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గానూ వ్యవహరించారు. మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున ముంబై నార్త్-సెంట్రల్ నియోజవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాగా, ఆయన సతీమణి అనఘ మనోహర్ జోషి 2020లో మరణించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పురుషుడిలా మారాలనుకుంటున్నట్లు తెలుపుతూ.. ఈమేరకు లింగమార్పిడి చేయించుకోనున్నట్లు ప్రకటించారు. అందుకోసం ఆమె న్యాయ సలహా కూడా తీసుకోవడంతో పాటు ఈ ప్రక్రియకు అవసరమైన అన్ని ధృవపత్రాల కోసం వైద్యులను సంప్రదించినట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల ఎల్జిబిటిక్యూ వర్క్‌షాప్‌కు హాజరైన సుచేతన దీని గురించి మాట్లాడుతూ.. తనను తాను మగవాడిగా గుర్తించానని, శారీరకంగా కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. ప్రముఖ వార్తా పత్రికతో మాట్లాడిన సుచేతన, “నా తల్లిదండ్రుల గుర్తింపు లేదా కుటుంబ గుర్తింపు పెద్ద విషయం కాదు. నా ఎల్జిబిటిక్యూ ఉద్యమంలో భాగంగా నేను దీన్ని చేస్తున్నాను. ట్రాన్స్‌మ్యాన్‌గా నేను ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను ఆపాలనుకుంటున్నాను. ఇప్పుడు నా వయసు 41. ఫలితంగా నా జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను నేనే తీసుకోగలను. అదే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దయచేసి నా తల్లిదండ్రులను ఇందులోకి లాగవద్దు. నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అవసరమైతే దీని కోసం పోరాడతాను. నాకు ఆ ధైర్యం ఉంది. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను'' అని సుచేతన తెలిపింది. ఈ వార్తలను వక్రీకరించవద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేసింది. తన తండ్రి ఈ నిర్ణయానికి మద్దతిస్తాడని సుచేతన భావిస్తున్నట్లు చెప్పింది. చదవండి: రెండురోజులుగా ఇంట్లో బిగ్గరగా సంగీతం.. చివరికి షాకింగ్ ఘటన వెలుగులోకి -
పట్టు వదలక.. పది పరీక్షకు హాజరైన మాజీ సీఎం
చండీగఢ్: చదువుకోవడానికి వయసుతో పని లేదని నిరూపిస్తూ 86 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి పదో తరగతి పరీక్షలు రాశాడు. అలా రాసింది ఎవరో కాదు ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. మీరు విన్నది నిజమే. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా బుధవారం పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యారు. జేబీటీ రిక్రూట్మెంట్ కేసులో 2013లో ఆయనకు 10ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. చౌతాలా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూనే పదో తరగతి పరీక్షలు కూడా రాశారు. అయితే అప్పుడు ఇంగ్లీష్ పరీక్ష రాయలేదు. ఆ తర్వాత హర్యానా ఓపెన్ ఎడ్యుకేషన్ బోర్డు 12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్టు 5న ఆ పరీక్షల ఫలితాలు రాగా చౌతాల ఫలితాన్ని బోర్డు నిలిపివేసింది. పెండింగ్‌లో ఉన్న ఆయన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష పూర్తి చేస్తేనే ఫలితాన్ని వెల్లడిస్తామని తెలిపింది. దీంతో ఆయన సిర్సాలోని ఆర్య కన్య సీనియర్ సెకండరీ స్కూల్ పరీక్ష కేంద్రంలో ఇంగ్లీష్ పరీక్ష రాశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా... తాను ప్రస్తుతం విద్యార్థినని, రాజకీయాలకు సంబంధించినవి మాట్లాడటానికి నిరాకరించారు. కాగా, చౌతాలా ఓ సహాయకుడిని పెట్టుకోవడానికి బోర్డును అభ్యర్థించి అనుమతి పొందీ పరీక్ష పూర్తి చేశారు. 2017లో తన 82 ఏండ్ల వయస్సులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్లో 10వ తరగతి పరీక్ష రాసి 53.4 శాతం మార్కులు సాధించారాయన. -
హిమాచల్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కన్నుమూత
సిమ్లా: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ (87) కోవిడ్ నుంచి కోలుకున్నాక తలెత్తిన ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు కోవిడ్ నుంచి కోలుకున్న ఆయన సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో సోమవారం ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన మరణించారని ఐజీఎంసీ సూపరింటెండెంట్ డాక్టర్ జనక్ రాజ్ వెల్లడించారు. ఆరుసార్లు ముఖ్యమంత్రిగా, తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు లోక్‌సభకి ఎన్నికై తిరుగులేని విజయాలను మూటగట్టుకున్న వీరభద్ర సింగ్ మృతితో హిమాచల్ రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయింది. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ. వీరభద్ర సింగ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అపారమైన పరిపాలనా అనుభవం కలిగిన నేతను కోల్పోవడం తీరని లోటని ప్రధాని ఒక ట్వీట్లో నివాళులర్పించారు. వీరభద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా, రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవల్ని ఎన్నటికీ మరువలేమని సోనియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరభద్ర సింగ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన రామ్‌పూర్‌లో శనివారం జరగనున్నాయి. జన హృదయ విజేత ప్రజల హృదయాలను గెలుచుకున్న అతి కొద్ది మంది ముఖ్యమంత్రుల్లో వీరభద్ర సింగ్ ఒకరు. రాజా సాహెబ్ అని అందరూ పిలుచుకునే ఆయన గొప్ప పోరాట యోధుడు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని పట్టు కొనసాగించారు. హిల్ స్టేషన్‌ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడంతో పాటుగా విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి మాస్ లీడర్‌గా ఎదిగారు. రామ్‌పూర్ రాజకుటుంబానికి చెందిన వీరభద్ర సింగ్ 1934 జూన్ 23న జన్మించారు. 1962లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 28 ఏళ్ల వయసులో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 1983లో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ గద్దెనెక్కారు. ప్రస్తుతం సోలాన్ జిల్లాలోని అక్రి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రెండు సార్లు కోవిడ్బారినపడ్డారు. ఏప్రిల్ 12న ఆయనకి తొలిసారి కరోనా సోకింది.జూన్ 11న మళ్లీ రెండోసారి ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. -
అనారోగ్యంతో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
డిస్పుర్: అస్సాం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్ బర్మన్(91) గువహతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఈరోజు(ఆదివారం) అనారోగ్యంతో మరణించారు. ఈయన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. రెండు సార్లు అస్సాంకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.1931లో జన్మించిన బర్మన్ తొలిసారి 1996లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండోసారి 2010లో తరుణ్ గొగొయ్ శస్త్రచికిత్సకోసం ముంబై వెళ్లినప్పుడు ముఖ్యమంత్రిగా పని చేశారు. కాగా, ఈయన హితేశ్వర్ సైకియా, తరుణ్ గొగొయ్ ప్రభుత్వాలలో ఆరోగ్య, విద్య, రెవెన్యూ శాఖలలో సేవలందించారు. 1967లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన, ఏడుసార్లు శాసన సభకు ఎన్నికై ప్రజలకు సేవలందించారు. కాగా, ఆయన నల్బరీ జిల్లా బొర్ఖేట్రీకి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. వృత్తిరిత్యా వైద్యుడైన బర్మన్ అస్సాం మెడికల్ కాలేజ్ నుంచి మెడికల్ పట్టా పోందారు. -
వెంటిలేటర్‌పై మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య
కోల్‌కతా: సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (76) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బుధవారం మధ్యాహ్నం ఆయనను కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. బుద్ధదేవ్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనా నెగెటివ్‌గా వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రక్తంలో ఆక్సిజన్, పీహెచ్ స్థాయిలు తగ్గి కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువయ్యిందన్నారు. న్యుమోనియా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని సీటీ స్కాన్‌లో తేలిందన్నారు. -
మాజీ ముఖ్యమంత్రులకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ బంగ్లాలను తక్షణమే ఖాళీ చేయాలంటూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎస్సీ నేతలు ములాయం, అఖిలేష్‌తోపాటు మాయావతి, మరో ముగ్గురు మాజీ సీఎంలు తమ బంగ్లాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1981 స్థానిక చట్టం ప్రకారం పదవి నుంచి దిగిపోయాక 15 రోజుల్లో ఆ మాజీ సీఎం తన బంగ్లాను అప్పగించాల్సి ఉంటుంది. కానీ, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చట్ట సవరణ ద్వారా మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలోనే నివసించే వెసులుబాటును కలిపించారు. ఆ ఆదేశాలను అనుసరించి యూపీ మాజీ సీఎంలు అయిన ఎన్టీ తివారీ, రాజ్‌నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్, ములాయం, మాయావతి కుటుంబ సభ్యులు అధికారిక బంగ్లాలో నివసిస్తూ వస్తున్నారు. అయితే ఆ ఆదేశాలపై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆ సవరణను కోర్టు తప్పుబట్టింది. ‘ప్రభుత్వ బంగ్లాలు ప్రజల ఆస్తులు, వాటిని దుర్వినియోగపరచటం రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధం. అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుంది’అని కోర్టు తెలిపింది. తక్షణమే బంగ్లాలను ఖాళీ చేయించి.. ఆ మాజీ సీఎంల నుంచి బకాయిలను వసూలు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్లు ఆదేశించింది. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయి
కర్నూలు(టౌన్): ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే కోట్ల సర్కిల్లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక కిసాన్‌ఘాట్‌లో కోట్ల 97వ జయంతి వేడుకలను పురస్కరించుకుని భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ స్వర్గీయ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. రైతుల కోసం ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, గాజులదిన్నె ప్రాజెక్టు నిర్మాణంలో విశేషంగా కషి చేశారని కొనియాడారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ మాట తప్పారన్నారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే మదన్‌గోపాల్, మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.