
డిస్పుర్: అస్సాం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్ బర్మన్(91) గువహతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఈరోజు(ఆదివారం) అనారోగ్యంతో మరణించారు. ఈయన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. రెండు సార్లు అస్సాంకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.1931లో జన్మించిన బర్మన్ తొలిసారి 1996లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండోసారి 2010లో తరుణ్ గొగొయ్ శస్త్రచికిత్సకోసం ముంబై వెళ్లినప్పుడు ముఖ్యమంత్రిగా పని చేశారు.
కాగా, ఈయన హితేశ్వర్ సైకియా, తరుణ్ గొగొయ్ ప్రభుత్వాలలో ఆరోగ్య, విద్య, రెవెన్యూ శాఖలలో సేవలందించారు. 1967లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన, ఏడుసార్లు శాసన సభకు ఎన్నికై ప్రజలకు సేవలందించారు. కాగా, ఆయన నల్బరీ జిల్లా బొర్ఖేట్రీకి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. వృత్తిరిత్యా వైద్యుడైన బర్మన్ అస్సాం మెడికల్ కాలేజ్ నుంచి మెడికల్ పట్టా పోందారు.
Comments
Please login to add a commentAdd a comment