కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పురుషుడిలా మారాలనుకుంటున్నట్లు తెలుపుతూ.. ఈమేరకు లింగమార్పిడి చేయించుకోనున్నట్లు ప్రకటించారు. అందుకోసం ఆమె న్యాయ సలహా కూడా తీసుకోవడంతో పాటు ఈ ప్రక్రియకు అవసరమైన అన్ని ధృవపత్రాల కోసం వైద్యులను సంప్రదించినట్లు చెప్పుకొచ్చారు.
ఇటీవల ఎల్‌జిబిటిక్యూ వర్క్‌షాప్‌కు హాజరైన సుచేతన దీని గురించి మాట్లాడుతూ.. తనను తాను మగవాడిగా గుర్తించానని, శారీరకంగా కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. ప్రముఖ వార్తా పత్రికతో మాట్లాడిన సుచేతన, “నా తల్లిదండ్రుల గుర్తింపు లేదా కుటుంబ గుర్తింపు పెద్ద విషయం కాదు. నా ఎల్‌జిబిటిక్యూ ఉద్యమంలో భాగంగా నేను దీన్ని చేస్తున్నాను. ట్రాన్స్‌మ్యాన్‌గా నేను ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను ఆపాలనుకుంటున్నాను. ఇప్పుడు నా వయసు 41. ఫలితంగా నా జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను నేనే తీసుకోగలను.
అదే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దయచేసి నా తల్లిదండ్రులను ఇందులోకి లాగవద్దు. నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అవసరమైతే దీని కోసం పోరాడతాను. నాకు ఆ ధైర్యం ఉంది. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను'' అని సుచేతన తెలిపింది. ఈ వార్తలను వక్రీకరించవద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేసింది. తన తండ్రి ఈ నిర్ణయానికి మద్దతిస్తాడని సుచేతన భావిస్తున్నట్లు చెప్పింది.
చదవండి: రెండురోజులుగా ఇంట్లో బిగ్గరగా సంగీతం.. చివరికి షాకింగ్ ఘటన వెలుగులోకి
Comments
Please login to add a commentAdd a comment