
కోల్‌కతా: ఇటీవల కోల్‌కతా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆర్జీ ఆర్ ఆస్పత్రిలో డాక్టర్‌పై హత్యాచారం కేసులో వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హాస్పిటల్‌లో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్‌కున్యాయం చేయాలని, ఆస్పత్రిలో డాక్టర్ల భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు జూనియర్ డాక్టర్లు గత శనివారం సాయంత్రం నుంచి ‘ఆమరణ నిరాహార దీక్ష’ చేపట్టారు.
మరోవైపు.. రోజురోజుకీ జూనియర్ డాక్టర్ల నిరసనలకు సీనియర్ డాక్టర్ల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ ఘటనపై ఆందోళన చేపడుతున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా తాజాగా ఆర్జీ కర్ ఆస్పత్రికి చెందిన మరో 60 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారికి మద్దతుగా 50 మంది డాక్టర్లు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
చదవండి: RG Kar Hospital: 50 మంది డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment