Senior doctors
-
కోల్‌కతా ఘటన: మరో 60 మంది సీనియర్ డాక్టర్లు రాజీనామా!
కోల్‌కతా: ఇటీవల కోల్‌కతా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆర్జీ ఆర్ ఆస్పత్రిలో డాక్టర్‌పై హత్యాచారం కేసులో వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హాస్పిటల్లో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్‌కున్యాయం చేయాలని, ఆస్పత్రిలో డాక్టర్ల భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు జూనియర్ డాక్టర్లు గత శనివారం సాయంత్రం నుంచి ‘ఆమరణ నిరాహార దీక్ష’ చేపట్టారు. మరోవైపు.. రోజురోజుకీ జూనియర్ డాక్టర్ల నిరసనలకు సీనియర్ డాక్టర్ల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ ఘటనపై ఆందోళన చేపడుతున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా తాజాగా ఆర్జీ కర్ ఆస్పత్రికి చెందిన మరో 60 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారికి మద్దతుగా 50 మంది డాక్టర్లు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చదవండి: RG Kar Hospital: 50 మంది డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా -
కరోనా: సీనియర్ వైద్యుల మూకుమ్మడి రాజీనామా
సాక్షి,లక్నో: ఒకవైపు కరోనా మహమ్మారి విలయాన్ని సృష్టిస్తోంది. దీంతో సకాలంలో వైద్యం, ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో దిగ్భ్రాంతి కరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక, సమాజ ఆరోగ్య కేంద్రాల ఇన్‌చార్జ్‌లు సుమారు 16 మంది సీనియర్ వైద్యులు బుధవారం సాయంత్రం సామూహిక రాజీనామా చేశారు. తమకు ఉన్నతాధికారులనుంచి సహకారం లేకపోగా, వేధింపులకు గురవుతున్నామని వారు ఆరోపించారు. ఆరోగ్య కేంద్రాల ఇన్చార్జులగా ఉన్న 11మంది వైద్యులు, జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఐదుగురు వైద్యులు మొత్తం ఉన్నావ్ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ అశుతోష్ కుమార్‌కు తమ సామూహిక రాజీనామాను సమర్పించారు.అలాగే డిప్యూటీ సిఎంఓ డాక్టర్ తన్మయ్ కు మెమోరాండం సమర్పించారు. కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించడానికి తామంతా చాలా అంకితభావంతో పూర్తి నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, పైఅధికారులు వేధింపులకు గురిచేస్తూ నియంతృత్వ వైఖరితో ఉన్నారని, అక్రమంగా తమపై చర్యలకు ఉత్తర్వులిస్తున్నారని వాపోయారు. ఎలాంటి వివరణ లేదా చర్చ లేకుండానే జరిమానా చర్యలు తీసుకుంటున్నారని వైద్యులు ఆరోపించారు. మరోవైపు మూకుమ్మడి రాజీనామాల విషయం తనకు తెలియదని డాక్టర్ అశుతోష్ కుమార్ చెప్పారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, జిల్లా మేజిస్ట్రేట్‌తో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చదవండి: గంగానదిలో మృతదేహాలు : యూపీ, బిహార్ మధ్య చిచ్చు -
నిమ్స్‌లో ఇక వైద్యుల కరువు..
కొనఊపిరితో ఉన్న రోగులు సైతం అక్కడికి చేరుకోగానే లేచికూర్చొంటారని భరోసా. ఎంతటి మొండి రోగాలైనా ఇట్టే నయం అవుతాయని ఎందరికో నమ్మకం. అనేక పరిశోధనలు, అరుదైన వైద్యసేవలతో ఓ వెలుగు వెలిగిన ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ప్రస్తుతం తన ప్రాభవాన్ని కోల్పోతోంది. అంతర్గత కుమ్ములాటల వల్ల కొంత మంది, పదవీ విరమణతో మరికొంత మంది సీనియర్ వైద్యులు ఆస్పత్రిని వీడుతుండటమే ఇందుకు కారణం. ఇక్కడి వైద్య సేవలపై సంతృప్తి కలగక...మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతోద్యోగులు, సినీ, వ్యాపార ప్రముఖులు, మధ్య తరగతి పేయింగ్ రోగులు కూడా ఆస్పత్రికి దూరం అవుతున్నారు. ఫలితంగా ఒకప్పుడు కాసులతో గలగలలాడిన ఆస్పత్రి ఖజానా ప్రస్తుతం ఖాళీగా మారింది. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులకు కూడా నిధులు సరిపోని దుస్థితి నెలకొంది. సాక్షి, సిటీబ్యూరో: నిమ్స్ ఆస్పత్రిలో సీనియర్ వైద్యుల కొరతతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 34 విభాగాలు ఉండగా, ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ శేషగిరిరావు, న్యూరో సర్జన్ డాక్టర్ సుభాష్‌కౌల్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ అజిత్‌కుమార్‌లు ఇటీవల పదవీ విరమణ చేశారు. అంతర్గత విబేధాల వల్ల ప్రముఖ హెమటాలజిస్టు డాక్టర్ నరేందర్ ఇటీవలే ఆస్పత్రిని వీడారు. గతంలో న్యూరోసర్జన్ డాక్టర్ మానసపాణిగ్రహి సహా, మరో న్యూరోసర్జన్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ వీబీఎన్ ప్రసాద్ ఇష్టం లేకపోయినా ఆస్పత్రిని వీడిపోయినవారే. హృద్రోగ చికిత్సల్లో విశేష అనుభవంతో పాటు మంచి గుర్తింపు ఉన్న డాక్టర్ శేషగిరిరావు ఉద్యోగ విరమణతో...అప్పటి వరకు ఆయన కోసం వచ్చిన వీఐపీ నగదు చెల్లింపు (పెయింగ్)రోగులంతా ఆయన్ను వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. అదేవిధంగా న్యూరోసర్జరీ విభాగంలో డాక్టర్ సుభాష్‌కౌల్ సేవలందుకుంటున్న రోగులదీ అదే పరిస్థితి. డాక్టర్ నరేంద్ర ఆస్పత్రిని వీడటంతో హెమటాలజీ విభాగానికి వచ్చే రోగులకు కనీస వైద్యసేవలు అందకుండా పోయాయి. షుగర్ వ్యాధి చికిత్సల్లో మంచి గుర్తింపు పొందిన డాక్టర్ పీవీ రావు పదవీ విరమణ పొందిన తర్వాత ఆ విభాగం జీవశ్చవంలా మారిపోయింది. నిజానికి పదవీ విరమణ పొందిన ప్రముఖ వైద్యుల్లో చాలా మంది బయటికి వెళ్లడం కంటే..ఆ తర్వాత కూడా ఇక్కడే పనిచేయడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇలాంటి వైద్యుల పదవీ కాలం మరికొంతకాలం పొడిగించి వారి సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ యాజమాన్యం దీన్ని పట్టించుకోవడం లేదు. కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు. సీనియర్ వైద్యులంతా ఆస్పత్రిని వీడుతుండటం, జూనియర్లు ఆ స్థాయిలో రోగుల అభిమాన్ని చూరగొనలేక పోతుండటం వల్లే వీఐపీ రోగుల సంఖ్య తగ్గుతోందని సీనియర్ వైద్యుడొకరు అభిప్రాయపడ్డారు. భారీగా పడిపోయిన ఆదాయం ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 1500–2000 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్లుగా మరో 1500 మంది చికిత్స పొందుతుంటారు. నాలుగేళ్ల క్రితం పేయింగ్ రోగులు 55 శాతం ఉంటే, ఆరోగ్యశ్రీ బాధితులు 45 శాతం మంది ఉండేవారు. ప్రస్తుతం పెయింగ్ రోగుల శాతం పడిపోయింది. 80 శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉంటే, 20 శాతం మంది మాత్రమే పేయింగ్ రోగులు వస్తున్నారు. ఫలితంగా రోజూవారీ ఆదాయం భారీగా పడిపోయింది. దీనికి తోడు ఈఎస్ఐ, సీజీహెచ్ఎస్, ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ల వద్ద బకాయిలు రూ.కోట్లల్లో పేరుకుపోయాయి. బకాయిలపై యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వేతనాల చెల్లింపు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేతనాల చెల్లింపులు, ఇతర ఖర్చుల కోసం నెలకు సుమారు రూ.12 కోట్లు అవసరం కాగా, రూ.9 కోట్లకు మించి రావడం లేదు. ఈ ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ఓపీ, వైద్య పరీక్షల ఛార్జీలను పెంచాల్సి వచ్చింది. ఏడాది క్రితం వరకు రూ.50 ఉన్న ఓపీ ఫీజు ప్రస్తుతం రూ.100 పెంచారు. అదే విధంగా ఈవినింగ్ క్లినిక్ ఓపీ ఛార్జీలను కూడా రూ.300 నుంచి రూ.500 పెంచడంపై సర్వత్రా విమర్శలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. -
నక్సల్స్‌లో చేరండి.. కాల్చిచంపుతాం!
ముంబై: మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో సీనియర్ వైద్యుల వైఖరిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యమంటే ఇష్టం లేని ఇలాంటి(వైద్యులు) వాళ్లు నక్సల్స్‌లో చేరాలి. అప్పడు వాళ్లను ప్రభుత్వం కాల్చిచంపుతుంది’ అని వ్యాఖ్యానించారు. చంద్రపూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో జెనరిక్ మందుల షాపును అహిర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు పాల్గొనకపోవడంపై స్పందిస్తూ..‘ ఈ కార్యక్రమానికి మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ వచ్చారు. సీనియర్ వైద్యులు ఎందుకు రాలేదు? నక్సల్స్‌కు ప్రజాస్వామ్యం అక్కర్లేదు. ఈ కార్యక్రమానికి రాని వాళ్లకు(వైద్యులకు) ప్రజాస్వామ్యం అక్కర్లేదు. ఇలాంటి వాళ్లందరూ నక్సల్స్‌లో చేరాలి. ఒకసారి నక్సల్స్‌లో చేరిన మిమ్మల్ని కాల్చిచంపుతాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అరచేతిలో స్వర్గం చూపే రాజకీయాలు మానుకోండి
తిరుపతి కార్పొరేషన్ : ఏప్రభుత్వం వచ్చినా జూనియర్ డాక్టర్లను వాడుకుని వదిలేస్తున్నారని, ఇప్పటికైనా అరచేతిలో స్వర్గం చూపే రాజకీయాలు మానుకోవాలని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ఏపీ జూడాలు చేపట్టిన సమ్మె బుధవారానికి మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున రుయా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. జూడాలను ప్రభుత్వం చర్చలకు పిలవనందుకు నిరసనగా జూడాలు నోటికి నల్ల రిబ్బను కట్టుకుని, మానవహారంగా రుయా సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. జూడాలు మాట్లాడుతూ ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల సహనాన్ని పరీక్షిస్తోందన్నారు. కేరళలో జూనియర్ డాక్టర్లకు వేతనాలు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఇస్తున్నారని తెలిపారు. ఒక సంవత్సరం రూరల్ సర్వీసుకు గుర్తింపునిస్తూ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తారని, మన రాష్ట్రంలో అలాంటి గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. పైగా ‘కంపల్సరి బాండెడ్ లేబర్ సర్వీస్’ పేరుతో వైద్య విద్యార్థులను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందన్నారు. తమ ఉద్యమాన్ని పరీక్షిస్తే అవసరమైతే అత్యవసర సేవలను కూడా నిలిపేస్తామని వారు హెచ్చరించారు. సమ్మెకు పిలిస్తే ర్యాగింగ్ కేసులు? వైద్యవిద్యా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రమణ్యం జిల్లాలో సోమ, మంగళవారాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో జూడాల సమ్మెను అడ్డుకోవడానికి తిరుపతి ఎస్వీ మెడికల్ కళాళాశాల ఉన్నతాధికారి తీవ్ర ప్రయత్నాలు చేశారు. సమ్మెలో పాల్గొనవద్దంటూ ఆయన అన్ని విభాగాల హెచ్వోడీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. బుధవారం ఉదయం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను తన చాంబర్‌కు పిలుపించుకున్న సదరు ఉన్నతాధికారి సమ్మెకు వెళ్లకూడదని, వెళ్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని చెప్పినట్టు సమాచారం. సమ్మెకు రావాలని సీనియర్లు పిలిస్తే మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారంటూ తమకు ఫిర్యాదు చేయాలని వారికి చెప్పినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ వైద్యులు సదరు ఉన్నతాధికారిని నిలదీసినట్టు సమాచారం. -
జూడాల సమ్మె
ప్రభుత్వం వైద్య విద్యార్థులకు చెల్లించే స్కాలర్‌షిప్పు మొత్తాన్ని పెంచాలని కొంతకాలం నుంచి జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌పై రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. విధులను బహిష్కరించి తమ డిమాండ్ నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని వారు ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైలోని జీహెచ్, స్టాన్లీ, రాయపేట, కేఎంసీ ఆస్పత్రుల వద్దకు ఉదయం 8 గంటలకు చేరుకున్న విద్యార్థులు గేట్ల ముందు ధర్నాకు దిగారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఆందోళనలు చేశారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్యసేవలు స్తంంభించిపోయాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులను సీనియర్ వైద్యులు పరీక్షలు చేసిన పిదప వారి సూచనల ప్రకారం వైద్యం కొనసాగించే బాధ్యత జూనియర్ డాక్టర్లదే. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్ల సేవలు ఎంతో కీలకం. అకస్మాత్తుగా వేలాది మంది జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో వైద్య సేవలు స్తంభించిపోయాయి. స్టాఫ్ నర్సులే రోగుల బాధ్యతలను తీసుకోవలసి వచ్చింది. దీంతో సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. జూడాలు ఉంటున్న ప్రభుత్వ వసతి గృహాలను వెంటనే ఖాళీచేయాలని సైతం ఆదేశించింది. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని తాము ముందుగానే ఊహించినా తప్పలేదని చెన్నై ఆందోళనలకు నాయకత్వం వహించిన ఇలియా జానకిరామన్ అనే జూనియర్ డాక్టర్ సోమవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులకు తెలిపారు. వైద్య కళాశాలల్లోని డిగ్రీ విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం రూ.8,400, పీజీ విద్యార్దులకు రూ.17,400 చెల్లిస్తోందని, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ మొత్తం చాలా తక్కువని ఆమె పేర్కొన్నారు. ఇదే డిమాండ్‌పై ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించగా, అధికారులతో అప్పుడు జరిగిన చర్చలు విఫలమయ్యూయని ఆమె చెప్పారు. ఆ తరువాత ప్రభుత్వం స్పందించనందున ఈనెల 17న ఒక్కరోజు సమ్మె పాటి ంచామని తెలిపారు. అయితే ప్రభుత్వం ఏమాత్రం తమ డిమాండ్‌పై స్పందించక పోవడంతో నిరవధిక సమ్మె చేపట్టాలని ఆదివారం అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జూనియర్ డాక్టర్లకు (పీజీలకు) నెలకు ఢిల్లీలో రూ.71, 500, ఉత్తరప్రదేశ్‌లో రూ.55,370, కేరళలో 32 వేలు చెల్లిస్తుండగా తమిళనాడులో కేవలం రూ.17,400 చెల్లించడం అన్యాయమని ఆమె అంటున్నారు. డిమాండ్ నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆమె చెప్పారు. ఇక మంత్రులతో సైతం చర్చలకు తావులేదని, స్కాలర్ షిప్పులు పెంచాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.