ముంబై: మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో సీనియర్ వైద్యుల వైఖరిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యమంటే ఇష్టం లేని ఇలాంటి(వైద్యులు) వాళ్లు నక్సల్స్‌లో చేరాలి. అప్పడు వాళ్లను ప్రభుత్వం కాల్చిచంపుతుంది’ అని వ్యాఖ్యానించారు. చంద్రపూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో జెనరిక్ మందుల షాపును అహిర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు పాల్గొనకపోవడంపై స్పందిస్తూ..‘ ఈ కార్యక్రమానికి మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ వచ్చారు. సీనియర్ వైద్యులు ఎందుకు రాలేదు? నక్సల్స్‌కు ప్రజాస్వామ్యం అక్కర్లేదు. ఈ కార్యక్రమానికి రాని వాళ్లకు(వైద్యులకు) ప్రజాస్వామ్యం అక్కర్లేదు. ఇలాంటి వాళ్లందరూ నక్సల్స్‌లో చేరాలి. ఒకసారి నక్సల్స్‌లో చేరిన మిమ్మల్ని కాల్చిచంపుతాం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment