
సియోల్: అమెరికాలోని అడవుల్లో కార్చిర్చు రగలిన ఉదంతాలు మరువక ముందే ఇప్పుడు దక్షిణ కొరియా(South Korea) అడవుల్లో మంటలు చెలరేగాయి. మొత్తం 20కి పైగా అడవులు మంటల గుప్పిట్లో ఉన్నాయి. ఆగ్నేయ కొరియా ద్వీపకల్పంలో వ్యాపించిన మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ భారీ అగ్నిప్రమాదాల్లో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. దక్షిణ కొరియాలో తగలబడుతున్న అడవులకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో కార్చిచ్చు ఎంత తీవ్రంగా ఉందో గమనించవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలలోని అడవుల్లో వ్యాపించిన మంటలు అధికారులతో పాటు, స్థానికులను వణికిస్తున్నాయి. మంటలను ఆర్చేందుకు అగ్నిమాపక సిబ్బంది(Fire fighters), సహాయక సిబ్బంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు. బలమైన గాలులు మంటలు మరింతగా వ్యాపించడానికి కారణంగా నిలుస్తున్నాయి.
South Korea hit with multiple forest fires, two firefighters dead
More than 20 wildfires have flared across the country including the deadly one in the southeast of the Korean Peninsula.#SouthKorea #Wildfire pic.twitter.com/J5rVTjMiGB— DD News (@DDNewslive) March 23, 2025
దక్షిణ జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్‌లో శుక్రవారం ప్రారంభమైన మంటలు శనివారం మధ్యాహ్నం నాటికి 275 హెక్టార్ల (680 ఎకరాలు) విస్తీర్ణంలోని అడవులను దహించివేసాయి. మంటలను అదుపు చేసే ప్రయత్నంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 200 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సూర్యాస్తమయానికి ముందే మంటలను అదుపు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్-మోక్ ఆదేశించారు. దక్షిణ కొరియా ప్రభుత్వం అగ్ని ప్రభావిత ప్రదేశాన్ని విపత్తు ప్రాంతంగా ప్రకటించింది.
ఇది కూడా చదవండి: తరతరాలకు చెరగని ‘టాపర్ల’ చిరునామా..
Comments
Please login to add a commentAdd a comment