south koria
-
ఆసియా స్టాక్ మార్కెట్లలో జోష్: ఒక్కసారిగా పెరిగిన ట్రంప్ షేర్స్
అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా దూసుకెళ్తున్నాయి. డోజోన్స్, నాస్డాక్ సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ట్రంప్' షేర్స్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. జపాన్, సౌత్ కొరియా మార్కెట్లు సైతం లాభాల్లోనే సాగుతున్నాయి.ప్రారంభ ట్రేడ్‌లో జపాన్ నిక్కీ 263.50 పాయింట్లు లేదా 0.68 శాతం పెరిగి 38,843.50 వద్ద ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఎస్&పీ/ఏఎస్ఎక్స్200.. 67.90 పాయింట్లు లేదా 0.83 శాతం పెరిగి 8,200.90 వద్ద ఉంది. దక్షిణ కొరియా కోస్పి 4.05 పాయింట్లు లేదా 0.16 శాతం పురోగమించి 2,581.57 వద్దకు చేరుకుంది.అమెరికా ఎన్నికలు ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌లు లాభపడ్డాయి. ఓవర్‌నైట్ ట్రేడ్‌లో.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 427.28 పాయింట్లు లేదా 1.02 శాతం పెరిగి 42,221.88 వద్ద ఉంది. ఎస్&పీ 500 ఇండెక్స్ కూడా 70.07 పాయింట్లు లేదా 1.23 శాతం పెరిగి 5,782.76 వద్దకు చేరుకుంది. గిఫ్ట్ నిఫ్టీ.. ఒక రోజు స్మార్ట్ రికవరీ తర్వాత దేశీయ స్టాక్ సూచీలు ఎలా రాణిస్తాయనే దానిపై అందరి దృష్టి ఉంది.ఎన్నికల ఫలితాలు అమెరికాకు ఎగుమతి చేసే ఐటీ అండ్ ఫార్మా వంటి అనేక దేశీయ రంగాల దృక్పథాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా యూఎస్ ప్రభుత్వ విధానాలు ఆటో, బ్యాంకింగ్, రక్షణ, చమురు & గ్యాస్‌తో సహా అనేక ఇతర రంగాలను ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది. -
మస్క్ పేరుతో మోసం.. రూ.41 లక్షలు పోగొట్టుకున్న మహిళ
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోయాయి. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో సంఘటన తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలో ఏకంగా 'ఇలాన్ మస్క్' (Elon Musk) పేరుతో మోసం చేశారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సౌత్ కొరియాకు చెందిన ఒక మహిళను ఓ వ్యక్తి ఇలాన్ మస్క్ పేరుతో మోసం చేసి, ఆమె దగ్గర నుంచి ఏకంగా రూ. 41 లక్షలు కాజేశారు. జియోంగ్ జిసన్ అనే మహిళ ఈ డబ్బు పోగొట్టుకున్నట్లు తెలిసింది.నిజానికి జియోంగ్ జిసన్ ఇలాన్ మస్క్ జీవిత చరిత్ర చదివి, ఆయనకు పెద్ద అభిమానిగా మారిపోయింది. అయితే ఒక వ్యక్తి ఈమె ఇన్‌స్టాగ్రామ్‌ను ఇలాన్ మస్క్ పేరుతో ఉన్న అకౌంట్ ఫ్రెండ్స్ లిస్టులో యాడ్ చేసాడు. మొదట్లో అతడు మస్క్ అంటే నమ్మలేదు, కానీ అతడు మాట్లాడే మాటలు.. పనిచేసే ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసేవాడు. అప్పుడప్పుడు తన పిల్లల గురించి కూడా మాట్లాడేవాడు. ఇవన్నీ ఆ మహిళను నమ్మేలా చేసాయి.మస్క్ పేరుతో పరిచయమైన వ్యక్తి ఆ తరువాత మహిళను (జియోంగ్ జిసన్) ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఒక సారి వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు కూడా సమాచారం. దీనికి డీప్‌ఫేక్ టెక్నాలజీ ఉపయోగించినట్లు మ్యానేజ్ చేసినట్లు తెలుస్తోంది.ఇలా మాటలు సాగుతున్న కొంత కాలానికి స్కామర్ చివరికి 70 మిలియన్ కొరియన్ వోన్ లేదా 50,000 డాలర్లను పెట్టుబడిగా పెట్టమన్నాడు. తన వల్ల అభిమానులు ధనవంతులైతే.. నేను చాలా సంతోషిస్తానని స్కామర్ నమ్మబలికాడు. దీనికి సరేనన్న మహిళ స్కామర్ చెప్పిన డబ్బు పంపింది. చివరికి మోసపోయినట్లు తెలుసుకుంది.నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మోసాలు జరగటం కొత్తేమీ కాదు. 2022 జనవరి నుంచి జూన్ మధ్యలోనే ఏకంగా 280 నేరాలు (సైబర్) జరిగినట్లు, దీని ద్వారా చాలా డబ్బు మోసపోయినట్లు సియోల్‌లోని కొరియా యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో తెలిసింది. మోసపోయినవారిలో 71.4 శాతం మంది మహిళలే ఉండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. -
ఉత్తర కొరియా కిమ్ సంచలన వ్యాఖ్యలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధాన్నికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్-ఇల్ మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో స్థాపించారు. దేశంలో మిలిటరీ విద్యలో అత్యధికంగా సీట్లు ఉన్న యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ‘ఉత్తర కొరియా చుట్టూ.. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉంది’ అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇప్పటికే నార్త్ కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్త్ను విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
ఖరీదైన బ్యాగ్ గిఫ్ట్.. దక్షిణ కొరియా రాజకీయాల్లో దుమారం
ఓ ఖరీదైన బ్యాగ్ దక్షిణ కొరియా రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. దీనికి గల కారణం దక్షిణ కొరియా మొదటి మహిళ ఆ బ్యాగ్ గిఫ్ట్‌గా స్వీకరించటమని ఆరోపణలు వస్తున్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీ(దక్షిణ కిరియా మొదటి మహిళా) రెవ్ అబ్రహం చోయ్ అనే ఓ పాస్టర్ నుంచి ఓ ఖరిదైన డియోర్ బ్యాగ్‌ను కానుకగా స్వీకరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దక్షణి కొరియా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడి చట్టాల ప్రకారం ఒక మిలియన్ వాన్(రూ. 62,160) కంటే విలువైన వస్తువులు, కానుకలు, బహుమతుల స్వీకరించరాదు. అలా తీసుకుంటే దాన్ని అక్కడి చట్టాలు లంచంగా పరిగణిస్తాయి. దక్షిణా కొరియాలో లంచం వ్యతిరేక చట్టం చాలా కఠినంగా అమల్లో ఉంది. ఈ క్రమంలో దేశ మొదటి మహిళ సుమారు మూడు మిలియన్ వాన్స్( సుమారు రూ. 1,86,811) విలువైన డియోర్ బ్యాగ్‌ను అబ్రహం చోయ్ నుంచి ఆమె స్వీకరించటం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణ కొరియాలో జరగనన్ను అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ కిమ్ కియోన్ హీ ఖరిదైన బ్యాగ్ వ్యవహారం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు తల నొప్పిగా మారింది. రెవ్ అబ్రహం చోయ్ నుంచి కిమ్ కియోన్.. ఓ ఖరిదైన డియోర్ బ్యాగ్‌ను బహుమతిగా తీసుకున్నట్లు గతేడాది నవంబర్‌లో ఓ రహస్య కెమెరా ఫుటేజీ ద్వారా బయటపడింది. అయితే రెవ్ అబ్రహం చోయ్ ఆ బ్యాగ్‌ను కొనుగోలు చేసి కిమ్ కియోన్కు తన ఆఫీసులో కలవటానికి వెళ్లి ఆమె ఇవ్వడాని ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇక.. ఇలాంటి విలువైన వాటిని ఎందుకు తీసుకువస్తున్నారని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు ఆమె ఆ బ్యాగ్‌ను కూడా తీసుకున్నట్లు ఆ వీడియోలో కనిపించటం లేదని స్థానిక మీడియా పేర్కొనటం గమనార్హం. అయితే ఈ బ్యాగ్ అధ్యక్ష కార్యాలయంలో గుర్తించబడింది. దీంతో ప్రతిపక్షాలు అధ్యక్షుడి భార్య చట్టవ్యతిరేకంగా బ్యాగ్ రూపంలో లంచం తీసుకుందని ఆరోపిస్తూ.. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వటంతో పాటు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే మైనార్టీ ప్రభుత్వంగా కొనసాగుతున్న అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. అదీకాక ఈ వ్యవహారం.. ఏప్రిల్ 10న జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై యూన్ సుక్ యోల్ చెందిన పీపుల్ పవర్ పార్టీ(PPP)పై ప్రతికూల ప్రభావం చూపనుందని చర్చ జరుగుతోంది. చదవండి: టెక్సాస్, ఫెడరల్ ప్రభుత్వాల మధ్య తీవ్రమవుతున్న సరిహద్దు గొడవ -
ఏటా అయోధ్యకు దక్షిణ కొరియన్ల రాక! కారణం ఏంటంటే..
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించడానికి దేశవిదేశాలను నుంచి రామ భక్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అయోధ్యకు ప్రతి ఏడాది వందల సంఖ్యలో దక్షిణ కొరియా దేశపు సందర్శకులు వస్తుంటారు. అయితే వారంతా వచ్చేది.. రామ జన్మభూమిని దర్శించుకోవడానికి వచ్చినవారు అయితే కాదు? మరి వారంతా అయోధ్యకు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే... దక్షిణ కొరియాకు ఉత్తరప్రదేశ్‌లోని రాముడు పుట్టిన అయోధ్యకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. అయితే ఈ సంబంధం రాముడితో కాదు. ప్రతి ఏటా వందల మంది దక్షిణ కొరియన్లు రాణి హు హ్వాంగ్ ఓకేకు నివాళులు అర్పించడానికి అయోధ్య నగరాన్ని సందర్శిస్తారు. అయోధ్యతో తమకు పూర్వకాలపు సంబంధాలు ఉన్నట్లు దక్షిణ కొరియన్లు నమ్ముతున్నారు. దక్షిణ కొరియా ఇతిహాసాల ప్రకారం.. రాణి సూరిరత్న అని పిలువబడే క్వీన్ హు హ్వాంగ్ ఓకే దక్షిణ కొరియాకు వెళ్లక ముందు అయోధ్య యువరాణి. క్రీ.శ 48లో కరక్ వంశానికి చెందిన రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నారని దక్షిణ కొరియన్లు నమ్ముతారు. డాక్టర్ ఉదయ్ డోక్రాస్ పరిశోధనా ప్రకారం సుంగుక్ యుసా రాజు అయిన సురో అయుత రాజ్యానికి చెందినవారని తెలుపుతోంది. అప్పటి ‘అయుత’నే ప్రస్తుత అయోధ్య అని వివరించబడింది. అయితే దక్షిణ కొరియా రాణి స్మరకం 2001లో అయోధ్యలో ప్రారంభించారు. 2015లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ రాణి స్మారకం విస్తరణ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం రాణి హు హ్వాంగ్ ఓకే స్మారకాన్ని సుందరంగా తీర్చిదిద్ది 2022లో ప్రారంభించారు. ఇక రాణి హు హ్వాంగ్ ఓకే స్మారకంగా 2019లో భారత్ ప్రభుత్వం రూ. 25, రూ.5 పోస్టల్ స్టాంపులు విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ టూరిజం అధికారిక వెబ్సైట్ ప్రకారం.. కరక్ వంశానికి చెందిన 60 లక్షల మంది ప్రజలు అయోధ్యను తమ మాతృభూమిగా భావిస్తారని తెలుస్తోంది. చిన్న వయసులో రాణి సూరిరత్న పడవలో కొరియాకు చేరుకుందని, ఆమెకు 16 ఏళ్ల వయసులో వివాహం అయినట్లు కొరియా ప్రజలు నమ్ముతారని తెలుపుతోంది. మరోవైపు చైనా గ్రంథాల ప్రకారం.. అయోధ్యను పరిపాలించే రాజు తన 16 ఏళ్ల కూతురును దక్షిణ కొరియాకు చెందిన రాజు కిమ్ సూరోతో వివాహం జరిపించడానికి ఆమెను దక్షిణ కొరియాకు పంపాలని అతనికి కల వచ్చినట్లు ప్రచారంలో ఉంది. వారికి 10 మంది పిల్లలు పుట్టారని, వీరు 150 ఏళ్లు జీవించి ఉన్నారని చైనా గ్రంథాల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2020లో దక్షిణ కొరియా రాయబారి బాంగ్ కిల్.. అయోధ్యకు కొరియాతో ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయని అన్నారు. కొరియా పురాతన చరిత్ర గ్రంథాల్లో అయోధ్యకు చెందిన యువరాణి కొరియన్ రాజును వివాహం చేసుకున్నట్లు రాసి ఉందని తెలిపారు. రాజు కిమ్ సురో సమాధికి సంబంధించిన పురావస్తు పరిశోధనల్లో అయోధ్యకు చెందిన కళాఖండాలు బయటపడ్డాయనిపేర్కొన్నారు. View this post on Instagram A post shared by Uttar Pradesh Tourism (@uttarpradeshtourism) రాణి సూరిరత్న పార్క్ ప్రత్యేకతలు.. ►అయోధ్యలోని క్వీన్ హు హ్వాంగ్ ఓకే స్మారక పార్క్.. అయోధ్య నుంచి కొరియా వరకు యువరాణి సూరిరత్న ప్రయాణాన్ని కళ్లకుకట్టినట్లు ప్రతిబింబిస్తుంది. ►దక్షిణ కొరియా నుంచి రవాణా చేయబడిన రాతి నిర్మాణంపై పురాతన విషయాలు చెక్కారు. ►రూ. 21 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సరయు నది ఒడ్డున ఈ పార్క్ నిర్మించారు. ►స్మారక చిహ్నం యొక్క ఆగ్నేయ దిశలో క్వీన్ హు హ్వాంగ్ ఓక్ విగ్రహం ఉంది. ►ఈశాన్య దిశలో రాజు కిమ్ సురో విగ్రహం ఏర్పాటు చేశారు. ►పార్కులో గ్రానైట్‌తో చేసిన గుడ్డు ఆకారం ఉంటుంది. యువరాణి సూరిరత్న కొరియాకు తన ప్రయాణంలో బంగారు గుడ్డును తీసుకువెళ్లిందని కొరియన్లు నమ్ముతారు. -
Video: ‘రోబో కుక్క’ పరుగు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు
సాధారణంగా 100 మీటర్ల పరుగు పందెంలో అథ్లెట్స్ సరికొత్త రికార్డులను సృష్టించడం చూస్తూ ఉంటాం. ఉసేన్ బోల్ట్, టైసన్ గే వంటి ప్రపంచస్థాయి స్పింటర్లు ఎన్నో అరుదైన ఘనతలు తమ పేరిట లిఖించుకున్నారు. కానీ తాజాగా 100 మీటర్ల రేసులో ఒక రోబోడాగ్ చరిత్ర సృష్టించింది. హౌండ్ అనే రోబో కుక్క 100 మీటర్ల రేసును కేవలం 19.87 సెకన్లలోనే పూర్తి చేసి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డునను సాధించింది. ఈ రోబో గంటకు 11.26 మైళ్ల వేగంతో పరుగు పందెన్ని పూర్తి చేసింది. ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డులకెక్కిన తొలి నాలుగు కాళ్ల రోబోగా హుండూ చరిత్రలోకి ఎక్కింది. ఈ రోబోను దక్షిణ కొరియాలోని డేజియోన్లోని కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన యంగ్-హా షిన్ రూపొందించారు. 45 కేజీల బరువున్న ఈ రోబో పరుగుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: WI vs ENG: చివరి ఓవర్లో 21 పరుగులు.. ఇంగ్లండ్ సంచలనం! పాపం రస్సెల్ -
దక్షిణ కొరియాకు కొత్త భయం
సరిహద్దుల్లో ఉత్తర కొరియా కవ్వింపు చర్యలతో సతమతమయ్యే దక్షిణ కొరియాకు కొత్త భయం పొంచి ఉంది!. అయితే అది బయటి నుంచి కాదు. దేశ అంతర్గత సమస్య కావటం గమనార్హం. దక్షిణ కొరియాలో జననాల రేటు క్షీణిస్తోంది. సంతానోత్పత్తి తగ్గుదల భవిష్యత్తులో దేశ జనాభా క్షీణించడంలో తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు తెలుస్తోంది. తాజా గణాంకాల ప్రకారం సగటు జననాల రేటు 0.72గా నమోదైంది. ఈ తగ్గుదల ఇలాగే 2025 వరకు కొనసాగితే 0.65గా నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకంతకు తగ్గుతున్న సంతానోత్పత్తి ఇలాగే కొనసాగితే దక్షిణ కొరియా జనాభా విషయంలో మరిన్ని ఇబ్బందలు ఎదుర్కోనుంది. ఇక 2022 ఏడాదిలో ప్రపంచంలో అతి అక్కువ సంతానోత్పత్తి 0.78 శాతంగా నమోదు చేసుకున్న దేశం దక్షిణ కొరియా కావడం గమనార్హం. దక్షిణ కొరియాలో జననాల రేటు తగ్గుదల.. ఆ దేశ అర్థిక వ్యవస్థ, శ్రాకమిక శక్తి, ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపనుందని అధికారులు పేర్కొన్నారు. అదీకాక ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉన్న దక్షిణ కొరియా.. సైనిక, రక్షణ రంగంలో కూడా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. జనాభా పరంగా చూసుకుంటే 2024లో 36.2 మిలియన్ల నమోదు కానుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జనాభా 51.7తో పోల్చుకుంటే దాదాపు 30 శాతం తగ్గుదల నమోదు కానున్నట్లు అంచనా. డిసెంబర్ నెల ప్రారంభంలో దక్షిణ కొరియా ఆర్థిక మంత్రి నామినీ చోయ్ సాంగ్ మాక్ దేశంలో జననాల రేటు క్షీణించడాన్ని ఓ ప్రమాదంగా పేర్కొన్నారు. చర్యలు చేపట్టడంలో చాలా ఆలస్యం జరిగిపోయిందని అన్నారు. చదవండి: హమాస్‌పై యుద్ధం: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక సూచన -
జానపాడు టు సౌత్ కొరియా.. ఓ యువకుడి విజయగాధ
సాక్షి, అమరావతి బ్యూరో: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముందు చూపు, తల్లిదండ్రుల ఆకాంక్షకు తోడు కృషి, పట్టుదల ఓ యువకుడిని అందలం ఎక్కించింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడులోని ఓ పేద కుటుంబానికి చెందిన పసుపులేటి లక్ష్మీనారాయణ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మొగ్గ తొడిగి సౌత్ కొరియాలోని జియోన్‌గ్సాంగ్ నేషనల్ యూనివర్సిటీలో వికసించాడు. కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ సైన్స్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ నెల 25న పీహెచ్డీ పట్టా అందుకోనున్నాడు. ‘మా పిల్లల జీవితం మాలాగ సున్నపుబట్టీలో మగ్గిపోకూడదు’ అనుకున్న ఇతని తల్లిండ్రులు కష్టపడి టెన్త్ వరకు చదివించారు. అనంతరం ట్రిపుల్ ఐటీలో ఇతనికి సీటు వచ్చింది. ఆరేళ్లు అన్నీ ఉచితమే.. 2019లో నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరిన లక్ష్మీ నారాయణ ఇంటర్, బీటెక్ అక్కడే పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకునే వరకు తల్లిదండ్రులకు రూపాయి ఖర్చు కాలేదు. మెటలర్జీ సబ్జెక్టుపై పరిశోధన పట్ల ఇతడికి ఆసక్తి. ఇదే ఊరి నుంచి సౌత్ కొరియా వెళ్లి పరిశోధన చేస్తున్న హరిబాబు మార్గదర్శనంతో అక్కడి యూనివర్సిటీలలో పీజీ, పీహెచ్డీ సీటు కోసం దరఖాస్తు చేశాడు. స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. అయితే సౌత్ కొరియాకు వెళ్లడానికి డబ్బు కావాలి. ఇందుకోసం ఇతని తల్లి చెవి కమ్మలు తీసి అమ్మింది. ఆ మొత్తం సరిపోదు. దీంతో దొరికన చోట శక్తికొద్దీ అప్పు తెచ్చాడు తండ్రి. మొత్తం రూ.30 వేలు చేతిలో పెట్టారు. ‘చాలా మందికి అది చాలా చిన్న మొత్తమే కావచ్చు. నాకు మాత్రం అది కోటానుకోట్ల కంటే ఎక్కువ. అమ్మ చెవి కమ్మలు తీస్తుంటే బాధ అనిపించింది. ఒద్దు అని చెప్పలేని పరిస్థితి. ఆ డబ్బుతో తొలిసారి విమానం ఎక్కాను. ఏడాదిన్నరలో అప్పులు తీర్చాను. కొత్త కమ్మలు కొనుక్కోవడానికి అమ్మకు డబ్బులు పంపాను. ఈ రోజు నా విజయం వెనుక నా తల్లిదండ్రులు, మహానేత వైఎస్సార్, నాకు సీటు కోసం రికమెండ్ చేసిన జింజు యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్బారెడ్డిలను మరచిపోలేను’అని లక్షీనారాయణ చెప్పారు. ఎంతో మందికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం ఆరేళ్లలో 23 పబ్లికేషన్లు సమర్పించాను. మెటలర్జీలో టైటానియం త్రీడీ ప్రింటింగ్‌లో సాగుతున్న నా పరిశోధనలు ఏరోస్పేస్ రంగంలో, వైద్య విభాగంలో మంచి ఆవిష్కరణలు కానున్నాయి. గుండె వాల్వులు, మోకీలుకు, బోన్ రీప్లేస్‌మెంట్‌కు అమర్చే లోహపు పరికరాల తయారీలో మంచి ఫలితాలనిస్తాయి. ఏరో స్పేస్‌లో పెద్ద మెషినరీలో రిపేర్ వస్తే ఆ యంత్రాన్ని డిస్మాంటిల్ చేయాల్సిన పని లేకుండా పని చేయని భాగానికి మాత్రమే మరమ్మతు చేయడం సాధ్యమవుతుంది. నా మేధస్సుతో ఎంతో మందికి ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం. – లక్ష్మీనారాయణ -
నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు
ప్యాంగ్యాంగ్ : ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ ఆ ఒక్క దేశంలో మాత్రం కనీసం అడుగుపెట్టలేకపోయింది. ఆ దేశ నియంత పేరు చెబితే శత్రువులు వణికిపోవాల్సిందే అని అనుకునేవారంతా.. ఇప్పడు కరోనా కూడా భయపడిందేమో అంటున్నారు. సరిహద్దు దేశాల్లో కరోనా విజృంభిస్తున్నా ఇన్నాళ్లూ ఆ దేశంలో కనీసం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇదంతా నిన్నటి (శనివారం) వరకు ఉన్న ముచ్చట. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. ఆదివారం రాత్రి లక్షణాలున్న ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ దేశం అధికారికంగా ప్రకటించిన తొలి కేసు ఇదేకావడం గమనార్హం. (కరోనా కట్టడి: ‘ఇది కొరియా షైన్ సక్సెస్’) మరోవైపు వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేసాంగ్ నగరంలో లాక్డౌన్ విధించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వారితో మెలిగిన వారందరినీ కఠినమైన క్యారెంటైన్ నిబంధనలు వర్తించే విధంగా నిర్బంధించాలని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 976 పరీక్షలు నిర్వహించామని వారిలో ఏ ఒక్కరినీ కరోనా పాజిటివ్‌గా తేలలేదని అధికారులు అధ్యక్షుడికి వివరించారు. కోవిడ్ 19 లక్షణాలు ఉన్న 25,551 మందిని క్వారైంటైన్ చేశామని.. అందులో 255 మంచి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు వివరించామని పేర్కొన్నారు. (దక్షిణ కొరియాకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం) తొలి కేసు నమోదైన దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కొరియాకు ప్రమాదం పొంచిఉందని కిమ్ ఆదేశించారు. కాగా కేసాంగ్ నగరం దక్షిణ కొరియాకు సరిహద్దుల్లో ఉంటుంది. మొన్నటి వరకు కాస్తా ప్రశాంతంగా ఉన్న సౌత్ కొరియాలో కరోనా తిరగబెడుతోంది. గడిచిన పది రోజుల్లో 50-60 కేసులు కొత్తగా నమోదు అవుతున్నాయి. అక్కడి నుంచే వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని నార్త్ కొరియా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆ దేశానికి సరిహద్దు గల చైనా లోనూ గతంలో వైరస్ తీవ్రస్థాయిలో విజృంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ భవిష్యత్తు దృష్ట్యా చైనా సరిహద్దును ఇప్పట్లో తెరిచేది లేదని కిమ్ స్పష్టం చేశారు. కాగా గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ వెలుగు చూసిన నాటి నుంచి ఉత్తర కొరియా అన్ని సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్యాంగ్యాంగ్కు రాకపోకలపై నిషేధం విధించామని కిమ్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి లేకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తిసుకుంటుదని హెచ్చరించారు. -
కోవిడ్ కోరల్లో 57 దేశాలు
బీజింగ్: కోవిడ్ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఒకవైపు చైనాలో కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ ఉంటే, బాధిత దేశాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్ న్యూజిలాండ్, లిథువేనియాలకు సోకింది. ఇప్పటివరకు 57 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించి వణుకు పుట్టిస్తోంది. చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 44 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 2,780 దాటింది. ప్రపంచవ్యాప్తంగా 83 వేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. కోవిడ్ బారిన పడిన దేశాల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. దక్షిణ కొరియా, జపాన్ దేశాల నుంచి వచ్చే వారి వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 13 మంది ఈ వ్యాధితో మరణిస్తే, కేసులు 2 వేలు దాటిపోయాయి. జపాన్ షిప్లో ఉన్న ప్రయాణికుల్లో కూడా చాలా మందికి కరోనా వైరస్ సోకడంతో ఈ రెండు దేశాల నుంచి వీసాల జారీని తాత్కాలిక రద్దు చేసినట్టుగా భారత్ వెల్లడించింది. ఇటలీ, ఇరాన్లో కూడా కేసులు భారీగా పెరిగాయి. ఇరాన్లో తమిళనాడుకు చెందిన 450 మంది ,గుజరాత్‌కు చెందిన 350 మంది జాలర్లు చిక్కుకుపోయారు. వారిని స్వదేశానికి తిరిగి తేవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. రంగంలోకి అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కోవిడ్–19 విస్తరించిన దేశాల సంఖ్య 50 దాటిపోవడంతో అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఏయే దేశాలకు ఉంది ? వేటికి లేదు అన్న దిశగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో జనాభా ఎక్కువ కావడం, ఆరోగ్య సదుపాయాలు అందరికీ అందుబాటులో లేకపోవడంతో ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కొంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి. వారు కోలుకున్నారు కూడా. మరో 23,531 మందిని కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. -
అతిపెద్ద శాంసంగ్ ప్లాంట్‌ను ఆవిష్కరించిన మోదీ
నోయిడా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేతో కలిసి శాంసంగ్ నూతన మొబైల్ తయారీ యూనిట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం ఇరు దేశాల అధ్యక్షులు మెట్రో రైలులో ఢిల్లీ నుంచి నోయిడా చేరుకున్నారు. దీని కంటే ముందు మహాత్మాగాంధీ స్మృతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ జరిగిన కచేరిలో మహాత్మనికి ఇష్టమైన భజనలను విన్నారు. ప్లాంట్ ప్రారంభోత్సవ సందర్భంగా మోదీ ‘ఒక్క కొరియన్ ఉత్పత్తి అయినా లేని మధ్యతరగతి కుటుంబాలు మన దేశంలో చాలా అరుదు. అంతగా ఈ ఉత్పత్తులు ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం మన ప్రభుత్వం గవర్నమెంట్ ఈ-మార్కెట్(జీఈఎమ్) విధానాన్ని అవలంభిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వమే నేరుగా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. అందువల్ల వల్ల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు లాభం కలగడమే కాక పారదర్శకత కూడా పెరుగుతుందని’ అన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా హాజరయ్యారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య కీలక అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటన గురించి మూన్ జే.. ‘భారత ప్రభుత్వం 100 స్మార్ట్ సిటీలను నిర్మించాలని భావిస్తుంది. ఆ ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు మేము ఉత్సాహాంగా ఉన్నాం’ అని తెలిపారు. భారత్‌ను ఓ స్నేహదేశంగా గుర్తిస్తామని, తమకు అవసరమైనప్పుడల్లా భారత్ సాయం చేసిందన్నారు. తమ దేశం సదరన్ పాలసీని చేపట్టిందని, దానిలో భాగంగా భారత్‌తో మరింత బలమైన బంధాన్ని ఏర్పర్చుకోవాలని భావిస్తున్నట్లు మూన్ జే తెలిపారు. శాంసంగ్ ప్లాంట్... దక్షిణ కొరియా బేస్డ్ స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ శాంసంగ్ ప్రపంచంలోకెల్ల అతి పెద్ద మొబైల్ తయారీ యూనిట్‌ను నోయిడాలో ఏర్పాటు చేసింది. ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో మొబైల్ ఫోన్స్ మాత్రమే కాక టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి ఎలాక్ట్రానిక్ వస్తువులను కూడా తయారు చేస్తున్నట్టు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు... 35 ఎకరాల విస్తీరణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 81లో ఏర్పాటు చేశారు. అయితే నోయిడా ప్లాంట్‌కు 1996లోనే శంకుస్థాపన చేశారు. 1997 నుంచి తొలిసారి ఇక్కడ టెలివిజన్లను తయారుచేయడం ప్రారంభించారు. 2003 నాటికి రిఫ్రిజిరేటర్లను కూడా తయారు చేయడం ప్రారంభించారు. 2007 నుంచి ఇక్కడ మొబైల్ ఫోన్లను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం శాంసంగ్ మొబైల్, ఎలాక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిని రెండు రెట్లు పెంచడం కోసం ఈ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులను సార్క్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఇప్పటి వరకూ ఇండియాలో శాంసంగ్ తయారీ యూనిట్లు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి నోయిడాలో ఉండగా మరొకటి తమిళనాడులోని శ్రీపెరంబ్దూర్లో ఉంది. ఇవే కాక 5 ఆర్ అండ్ డీ సెంటర్లతో పాటు నోయిడాలో ఒక డిజైన్ సెంటర్ కూడా ఉంది. వీటిన్నింటి ద్వారా దాదాపు 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇవేకాక శాంసంగ్ ఔట్లెట్ల ద్వారా మరో 1.50లక్షల మందికి కంపెనీ ఉపాధి కల్పిస్తోంది. -
చర్చలకు మేం సిద్ధమే!
సియోల్: దాదాపు రెండేళ్ల తర్వాత దక్షిణకొరియా, ఉత్తరకొరియా దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు వచ్చే వారంలో సమావేశం కానున్నారు. సరిహద్దులోని పాన్ముంజోమ్లో వీరు చర్చలు జరపనున్నారు. ఈ చర్చలను ‘మంచి పరిణామం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. అమెరికాపై ఎక్కడైనా దాడి చేయగల అణు క్షిపణులు తన వద్ద ఉన్నాయనీ, దాడిని సంబంధించిన న్యూక్లియర్ బటన్ తన టేబుల్ పైనే ఉంటుందని కిమ్ ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. దీనికి సమాధానంగా ట్రంప్.. కిమ్ దగ్గర ఉన్న దాని కంటే శక్తిమంతమైన బటన్ తన వద్ద ఉందని హెచ్చరించారు. -
అమెరికాను హెచ్చరించిన ఉత్తరకొరియా
సియోల్ : తాము అణ్వాయుధాలను విడనాడాలని అమెరికా కోరుకుంటోందని, అయితే అటువంటిదేమీ జరగబోదని ఉత్తరకొరియా తాజాగా అమెరికాను హెచ్చరించింది. తమ దేశంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించడమనేది యుద్ధంతో సమానమైన చర్య అని, ఇలా చేయడం తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. నిరంతరం అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తరకొరియాను నిలువరించేందుకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) మరికొన్ని నూతన ఆంక్షలు విధించడం తెలిసిందే. ఉత్తరకొరియాకు చమురు సరఫరా నిలిపివేయాలని ప్రతిపాదిస్తూ అమెరికా రూపొందించిన తీర్మానాన్ని శుక్రవారం సమావేశమైన భద్రతామండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానానికి ఉత్తరకొరియా మిత్రదేశం చైనా కూడా మద్దతునివ్వడం విశేషం. విదేశాల్లో పనిచేస్తున్న ఉత్తరకొరియా పౌరులను వారి దేశానికి పంపించేయాలని కూడా తీర్మానించారు. ఐరాస తీర్మానం వల్ల ఉత్తరకొరియాకు 75 శాతం శుద్ధి చేసిన చమురు సరఫరా నిలిచిపోనుంది. అమెరికా ప్రధాన భూభాగాన్ని ఢీకొట్టడమే లక్ష్యంగా రూపొందించిన ఖండాంతర క్షిపణిని ప్యాంగ్యాంగ్ ఇటీవల పరీక్షించిన నేపథ్యంలో ఆంక్షలు విధించారు. ‘ఐరాస భద్రతామండలిలో అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి ఆమోదించిన తీర్మానం మా గణతంత్రసార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే. కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతలకు ఇది విఘాతం కలిగిస్తుంది. అందువల్ల ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’ అని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్యాంగ్యాంగ్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ తీర్మానం పూర్తిస్థాయి ఆర్థిక దిగ్బంధనమేనంది. ‘అమెరికా తాను సురక్షితంగా ఉండాలని కోరుకుంటే మా విషయంలో ప్రతికూల ధోరణిని విడనాడాలి. సహజీవనం చేయడం నేర్చుకోవాలి. -
ఆ బాధిత మహిళలకు భారీ పరిహారం
సియోల్: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైనికులు చేతిలో బంధీలుగా చిక్కి దశాబ్దాల పాటు సెక్స్ బానిసలుగా నరకయాతన అనుభవించిన దక్షిణ కొరియా మహిళా బాధితులకు ఎట్టకేలకు పరిహారం లభించనుంది. ఆ అభాగినులకు 100 మిలియన్లు (90 వేల డాలర్లు) పరిహారాన్ని అందించడానికి జపాన్ ముందుకొచ్చిందని దక్షిణ కొరియా ప్రకటించింది. బాధితుల సహాయార్థం గత నెలలో సియోల్ లో ఏర్పాటు చేసిన ఒక ఫౌండేషన్ కు ఒక మిలియన్ యెన్ ను(9.9 మిలియన్ డాలర్లు) ను జపాన్ వెంటనే బదిలీ చేయనుందని కొరియా విదేశాంగ శాఖ తెలిపింది.146 మంది బాధిత మహిళలలో ప్రస్తుతం 46 మంది మాత్రమే ప్రస్తుతం జీవించి ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లక్ష మంది కొరియన్లు బలవంతంగా జపాన్ సామ్రాజ్య సైన్యంలో పనిచేయవలసి వచ్చింది. 'కంఫర్ట్ ఉమెన్' పేరుతో కొరియన్ స్త్రీలు జపాన్ సైన్యానికి బానిసలుగా సేవలు చేయవలసిన పరిస్థితి ఎదురైంది. -
నెలాఖరులో చంద్రబాబు మరో విదేశీ యాత్ర
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ నెలాఖరులో ఆయన నాయుడు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఇప్పటి వరకూ ఎక్కువగా ముఖ్యమంత్రి హోదాలోనే విదేశీ పర్యటనలు చేపట్టిన బాబు గారు మళ్లీ ఫారిన్ టూర్ కు వెళుతున్నారు. ఇప్పటికే ఆయన సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.