అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా దూసుకెళ్తున్నాయి. డోజోన్స్, నాస్‌డాక్ సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ట్రంప్' షేర్స్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. జపాన్, సౌత్ కొరియా మార్కెట్లు సైతం లాభాల్లోనే సాగుతున్నాయి.
ప్రారంభ ట్రేడ్‌లో జపాన్ నిక్కీ 263.50 పాయింట్లు లేదా 0.68 శాతం పెరిగి 38,843.50 వద్ద ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఎస్&పీ/ఏఎస్ఎక్స్200.. 67.90 పాయింట్లు లేదా 0.83 శాతం పెరిగి 8,200.90 వద్ద ఉంది. దక్షిణ కొరియా కోస్పి 4.05 పాయింట్లు లేదా 0.16 శాతం పురోగమించి 2,581.57 వద్దకు చేరుకుంది.
అమెరికా ఎన్నికలు ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌లు లాభపడ్డాయి. ఓవర్‌నైట్ ట్రేడ్‌లో.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 427.28 పాయింట్లు లేదా 1.02 శాతం పెరిగి 42,221.88 వద్ద ఉంది. ఎస్&పీ 500 ఇండెక్స్ కూడా 70.07 పాయింట్లు లేదా 1.23 శాతం పెరిగి 5,782.76 వద్దకు చేరుకుంది. గిఫ్ట్ నిఫ్టీ.. ఒక రోజు స్మార్ట్ రికవరీ తర్వాత దేశీయ స్టాక్ సూచీలు ఎలా రాణిస్తాయనే దానిపై అందరి దృష్టి ఉంది.
ఎన్నికల ఫలితాలు అమెరికాకు ఎగుమతి చేసే ఐటీ అండ్ ఫార్మా వంటి అనేక దేశీయ రంగాల దృక్పథాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా యూఎస్ ప్రభుత్వ విధానాలు ఆటో, బ్యాంకింగ్, రక్షణ, చమురు & గ్యాస్‌తో సహా అనేక ఇతర రంగాలను ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment