ఆ బాధిత మహిళలకు భారీ పరిహారం
సియోల్: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైనికులు చేతిలో బంధీలుగా చిక్కి దశాబ్దాల పాటు సెక్స్ బానిసలుగా నరకయాతన అనుభవించిన దక్షిణ కొరియా మహిళా బాధితులకు ఎట్టకేలకు పరిహారం లభించనుంది. ఆ అభాగినులకు 100 మిలియన్లు (90 వేల డాలర్లు) పరిహారాన్ని అందించడానికి జపాన్ ముందుకొచ్చిందని దక్షిణ కొరియా ప్రకటించింది. బాధితుల సహాయార్థం గత నెలలో సియోల్ లో ఏర్పాటు చేసిన ఒక ఫౌండేషన్ కు ఒక మిలియన్ యెన్ ను(9.9 మిలియన్ డాలర్లు) ను జపాన్ వెంటనే బదిలీ చేయనుందని కొరియా విదేశాంగ శాఖ తెలిపింది.146 మంది బాధిత మహిళలలో ప్రస్తుతం 46 మంది మాత్రమే ప్రస్తుతం జీవించి ఉన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లక్ష మంది కొరియన్లు బలవంతంగా జపాన్ సామ్రాజ్య సైన్యంలో పనిచేయవలసి వచ్చింది. 'కంఫర్ట్ ఉమెన్' పేరుతో కొరియన్ స్త్రీలు జపాన్ సైన్యానికి బానిసలుగా సేవలు చేయవలసిన పరిస్థితి ఎదురైంది.