పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నట్లు మరోసారి రుజువైంది. ప్రతి ముగ్గురిలో కనీసం ఒక మహిళ తమ ఉద్యోగ జీవితంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జపాన్ ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. పని సమయంలో వివిధ రకాలుగా లైంగిక వేధింపులకు గురవ్వడం, బలవంతంగా సంబంధాలను కొనసాగించాల్సి రావడం, దిగజారుడు వ్యాఖ్యలను వినాల్సి రావడం వంటి ఎన్నో ఇబ్బందులను ఉద్యోగినులు ఎదుర్కొంటున్నారని తాజా సర్వే ద్వారా తెలిసింది.
జపాన్ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన ఈ అధ్యయనంలో వివరాలను తాజాగా విడుదల చేసింది. మహిళలు అందరూ తమ అభిప్రాయాలను తెలపలేదని, ఈ మెయిల్, ఆన్‌లైన్లో దాదాపు పదివేల మంది మహిళా ఉద్యోగులు సమర్పించిన వివరాలను పరిశీలించి లెక్కలను వెల్లడించినట్లు చెబుతున్నారు. మొత్తం స్పందించిన వారిలో 29 శాతం లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా వేధింపుల్లో మహిళలు కనిపించే తీరును బట్టి లేదా వయసును బట్టి వారి వ్యాఖ్యలు ఉంటాయని 54 శాతం మంది పేర్కొన్నారు. తర్వాత అత్యధికంగా ఉండే వేధింపుల జాబితాలోకి అవాంఛితంగా హత్తుకోవడం వస్తుందని 40 శాతం మంది వివరించగా... 38 శాతం మంది మాత్రం లైంగిక సంబంధ ప్రశ్నలు సంధించడమే పనిగా పెట్టుకుంటారని తెలిపారట. మొత్తంలో 27 శాతం మంది మహిళలు మాత్రం వేధింపుల్లో భోజనానికి గానీ, డేటింగ్‌కు గానీ రమ్మంటున్నారని తెలిపినట్లు జపాన్ సర్వేలు చెబుతున్నాయి.
ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరిపై వేధింపులు!
Published Tue, Mar 1 2016 4:24 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM
Advertisement
Advertisement