సరిహద్దుల్లో ఉత్తర కొరియా కవ్వింపు చర్యలతో సతమతమయ్యే దక్షిణ కొరియాకు కొత్త భయం పొంచి ఉంది!. అయితే అది బయటి నుంచి కాదు. దేశ అంతర్గత సమస్య కావటం గమనార్హం. దక్షిణ కొరియాలో జననాల రేటు క్షీణిస్తోంది. సంతానోత్పత్తి తగ్గుదల భవిష్యత్తులో దేశ జనాభా క్షీణించడంలో తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు తెలుస్తోంది. తాజా గణాంకాల ప్రకారం సగటు జననాల రేటు 0.72గా నమోదైంది. ఈ తగ్గుదల ఇలాగే 2025 వరకు కొనసాగితే 0.65గా నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అంతకంతకు తగ్గుతున్న సంతానోత్పత్తి ఇలాగే కొనసాగితే దక్షిణ కొరియా జనాభా విషయంలో మరిన్ని ఇబ్బందలు ఎదుర్కోనుంది. ఇక 2022 ఏడాదిలో ప్రపంచంలో అతి అక్కువ సంతానోత్పత్తి 0.78 శాతంగా నమోదు చేసుకున్న దేశం దక్షిణ కొరియా కావడం గమనార్హం. దక్షిణ కొరియాలో జననాల రేటు తగ్గుదల.. ఆ దేశ అర్థిక వ్యవస్థ, శ్రాకమిక శక్తి, ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపనుందని అధికారులు పేర్కొన్నారు.
అదీకాక ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉన్న దక్షిణ కొరియా.. సైనిక, రక్షణ రంగంలో కూడా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. జనాభా పరంగా చూసుకుంటే 2024లో 36.2 మిలియన్ల నమోదు కానుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జనాభా 51.7తో పోల్చుకుంటే దాదాపు 30 శాతం తగ్గుదల నమోదు కానున్నట్లు అంచనా. డిసెంబర్ నెల ప్రారంభంలో దక్షిణ కొరియా ఆర్థిక మంత్రి నామినీ చోయ్ సాంగ్ మాక్ దేశంలో జననాల రేటు క్షీణించడాన్ని ఓ ప్రమాదంగా పేర్కొన్నారు. చర్యలు చేపట్టడంలో చాలా ఆలస్యం జరిగిపోయిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment