ప్రపంచం మొత్తం దాదాపు 800 కోట్ల జనాభా ఉంది. ఇందులో నాలుగోవంతు భారత్, చైనాల్లోనే నివసిస్తోంది. ప్రస్తుతం చైనా జనాభా 141.7 కోట్లు, ఇండియా జనాభా 141.2 కోట్లు.
ఈ ఏడాదిలోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. చైనా జనాభా 1990 నుంచి క్రమంగా తగ్గుతోంది. భారత్ జనసంఖ్య మాత్రం 2050 వరకు పెరుగుతూ 166.8 కోట్లకు చేరుతుందని సమాచారం. 2022-2050 మధ్య 46 పేద దేశాల్లో జనాభా పెరుగుతూ ఉంటే 61 దేశాల్లో ఏటా ఒకశాతం చొప్పున తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అనేక ఐరోపా దేశాల్లో జనాభా పెరుగుదల రేటు ఇప్పటికే బాగా క్షీణించింది. మున్ముందు మరింత క్షీణిస్తుందని సమాచారం.
ఇదీ చదవండి: ‘రూ.1.8 లక్షలు చెల్లిస్తే రూ.5 కోట్లు’.. సీఈఓ ఏమన్నారంటే..
ప్రపంచంలో ప్రతిసెకనుకు దాదాపు నలుగురు, అంటే ప్రతి నిమిషానికి 259 మంది శిశువులు పుడుతున్నారని కొన్నిసర్వేల ద్వారా తెలుస్తోంది. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ అండ్ సోషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం.. ఏడాదిలో కొన్ని రోజుల్లోనే అధికంగా, మరికొన్ని రోజుల్లో తక్కువగా జననాలు నమోదవుతున్నాయని తెలుస్తోంది. అందుకు సంబంధించిన సర్వే వివరాలు ఆసక్తిగా మారాయి. సర్వే ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువ మంది సెప్టెంబర్‌లోనే పుడుతున్నారట.. నవంబర్, డిసెంబర్, జనవరి, జులై, ఫిబ్రవరిలోని ప్రత్యేక తేదీల్లో చాలా తక్కువ జననాలు నమోదవుతున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 9న చాలా మంది, ఫిబ్రవరి 29న తక్కువ మంది పుడుతున్నారని సర్వే వివరించింది.
Most & least common day to be born:
— World of Statistics (@stats_feed) November 25, 2023
1. Sept 9
2. Sept 19
3. Sept 12
4. Sept 17
5. Sept 10
6. July 7
7. Sept 20
8. Sept 15
9. Sept 16
10. Sept 18
357. Nov 25
358. Nov 23
359. Nov 27
360. Dec 26
361. Jan 2
362. July 4
363. Dec 24
364. Jan 1
365. Dec 25
366. Feb 29
According to…
Comments
Please login to add a commentAdd a comment