Population Growth
-
ముంచుకొస్తున్న జనాభా సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిరుద్యోగం పెచ్చురిల్లుతోంది. సరైన సంపాదన అవకాశాలులేక ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. దానికితోడు కొన్నిదేశాల్లో పెరుగుతున్న జనాభా ఆయా ప్రాంతాల అభివృద్ధికి సవాలుగా మారుతుంటే.. యూరప్‌లాంటి ఇంకొన్ని ప్రాంతాల్లో తగ్గుతున్న జనాభా భవిష్యత్తులో శ్రామికశక్తి లోటును సూచిస్తోంది. జనన రేటు, వృద్ధాప్యం, వలసలు, ఆర్థిక మార్పులు వంటి వివిధ అంశాలతో 2100 నాటికి యూరప్ జనాభా భారీగా తగ్గిపోతుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి జనాభాను ఆకర్షించేందుకు, స్థానికులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు యూరప్ దేశాలు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. అసలు యూరప్‌లో ఈ పరిస్థితులు నెలకొనేందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.వృద్ధులు అధికమవుతుండడంయూరప్ 2100 నాటికి ప్రపంచంలోనే అత్యధిక వృద్ధాప్య జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుందని అంచనా. ఆరోగ్య సంరక్షణలో పురోగతి వల్ల వృద్ధుల నిష్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో భారీగా వృద్ధులు పెరుగుతున్నారు. దేశ ఉత్పాదకతలో పెద్దగా పాలుపంచుకోని ఈ జనాభా వల్ల సామాజిక సంక్షేమ వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, పెన్షన్ పథకాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, వృద్ధాప్య సమాజానికి మద్దతు ఇవ్వడానికి సమగ్ర విధాన సంస్కరణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.తగ్గుతున్న జననాల రేటుఅనేక యూరప్ దేశాల్లో జననాల రేటు క్షీణిస్తోంది. ఈ ధోరణి రాబోయే దశాబ్దాల్లో అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. మారుతున్న సామాజిక నిబంధనలు, ఆర్థిక ఒత్తిళ్లు, జీవనశైలి వంటి అంశాలు ఈ తగ్గుదలకు దోహదం చేస్తాయి. దాంతో భవిష్యత్తులో గ్రీస్, పోర్చుగల్, హంగేరి వంటి దేశాలు స్థిరమైన శ్రామిక శక్తిని నిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇది కార్మికుల కొరతకు, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అధిక జనన రేటుకు అవసరమయ్యే విధానాలను అమలు చేయాలి. యువతకు, పనిచేసే తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచేందుకు వినూత్న పరిష్కారాలను అన్వేషించాలి.వలసలే శరణ్యం?2100 నాటికి యూరప్ జనాభాపై వలసలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రామిక కొరత, జనాభా అసమతుల్యతలను పరిష్కరించడానికి వలస విధానాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఫ్రాన్స్, యునైటెడ్ కింగడమ్, స్వీడన్ వంటి దేశాలు గణనీయమైన సంఖ్యలో వలసదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇది జనాభా పెరుగుదలకు, వైవిధ్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.స్పెయిన్: గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుదలను పరిష్కరించేందుకు ఆయా ప్రాంతాల్లో నివసించాలనుకునేవారికి ప్రత్యేకంగా 3,000 యూరోలు(రూ.2.7 లక్షలు) అందిస్తుంది. పిల్లలతో ఉన్న కుటుంబాలు అదనపు బోనన్‌ను పొందవచ్చు.ఇటలీ: ఇటలీ తన ప్రాంతాల్లో తిరిగి జనావాసాన్ని పెంచే కార్యక్రమాలను ప్రారంభించింది. మోలిస్, కాలాబ్రియా, సిసిలీ వంటి ప్రాంతాల్లో నివసించాలనుకునే కొత్తవారికి మూడు సంవత్సరాలకుగాను 28,000 యూరోలు(రూ.25.44 లక్షలు) అందిస్తుంది. దాంతోపాటు స్థానిక వ్యాపారాన్ని ప్రారంభించడానికి గ్రాంట్లు కూడా పొందవచ్చు. ఒక యూరో(సుమారు రూ.91) కంటే తక్కువకు గృహాలను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది.గ్రీస్: మారుమూల ద్వీపం అంటికైథెరాలో నివసించడానికి గ్రీస్ కొత్త నివాసితులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ నివసించాలనుకునే వారికి గృహ సహాయంతో పాటు ఏటా 3,000 యూరోలు(రూ.2.7 లక్షలు) వరకు గ్రాంట్లను అందిస్తుంది. ఈ చొరవ వల్ల ఆ ద్వీపం సంస్కృతిని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.ఐర్లాండ్: ఐర్లాండ్ ద్వీపాల్లో నివసించడానికి ఇష్టపడేవారికి గృహ పునరుద్ధరణ, పునరావాస గ్రాంట్ల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.పట్టణీకరణ, ప్రాంతీయ అసమానతలుపట్టణీకరణ పెరుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉపాధికోసం, ఇతర కారణాల వల్ల లండన్, పారిస్, బెర్లిన్ వంటి ప్రధాన నగరాల్లో నివసిస్తున్నారు. ఇవి ఆర్థిక కార్యకలాపాలు, సాంస్కృతిక వైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నప్పటికీ ప్రాంతీయ అసమానతలకు దారితీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు జనాభా, ఆర్థిక క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అవకాశాలను పెంపొందించడం ద్వారా ఈ అసమతుల్యతలను పరిష్కరించాలి.సాంకేతిక పురోగతి, భవిష్యత్తు అవకాశాలుయూరప్ భవిష్యత్తు జనాభాను పెంపొందించడంలో సాంకేతిక పురోగతి కీలక పాత్ర పోషిస్తుంది. ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సంరక్షణలో పురోగతి శ్రామిక శక్తిని ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వాలు, వ్యాపారాలు నూతన మార్పులకు అనుగుణంగా మారాలి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అవసరమైన నైపుణ్యాలు, వనరులను పౌరులు కలిగి ఉన్నారో లేదో నిర్ధారించుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.ఇదీ చదవండి: కుమారుడి పెళ్లి ఖర్చుపై విమర్శలు.. నీతా అంబానీ రిప్లై2100 నాటికి యూరప్ దేశాల్లో జనాభా క్షీణత ఇలా..దేశం జనాభా క్షీణత తగ్గుదలపోలాండ్ 1.88 కోట్లు 49%జర్మనీ 1.31 కోట్లు 16%ఇటలీ 2.38 కోట్లు 40%ఉక్రెయిన్ 2.38 కోట్లు 61%బల్గేరియా 32 లక్షలు 47%లిథువేనియా 16 లక్షలు 57%లాట్వియా 9.28 లక్షలు 50%సెర్బియా 30 లక్షలు 45%హంగేరీ 22 లక్షలు 23% -
నగరాలు నిండిపోతున్నాయ్..!
సాక్షి, అమరావతి: నగరాలు నిండిపోతున్నాయి. సమీప గ్రామాలు సైతం పట్టణాల్లో విలీనమవుతున్నాయి. మరో పదేళ్లల్లో దేశజనాభాలో 40 శాతం పట్టణాల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటారని కేంద్రం అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకోకపోతే ప్రమాదమని కేంద్రం భావిస్తోంది. దీంతో పట్టణీకరణపైనా, మౌలిక సదుపాయాల కల్పన పైనా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టింది.పట్టణీకరణపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా కమిటీని వేయడంతో పాటు వచ్చే ఐదు దశాబ్దాలు మన నగరాలు ఎలా అభివృద్ధి చెందాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 2022లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. దీనిప్రకారం 2036 నాటికి దేశంలో పట్టణ జనాభా 60 కోట్లకు చేరుతుందని, 2047 నాటికి 80 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో పట్టణీకరణ సమీప భవిష్యత్‌లో అత్యవసరమని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా భవిష్యత్ నగరీకరణ ప్రణాళిక, సంస్కరణలను సిఫారసు చేసింది.ఆలిండియా అర్బన్ ప్లానింగ్ సర్వీస్ అవశ్యంపట్టణ ప్రణాళికను పర్యవేక్షిస్తున్న శిక్షణ పొందిన నిపుణులకు ప్రాధాన్యతనిస్తూ, టౌన్ ప్లానింగ్‌లో అర్హత కలిగిన ప్లానర్లను నియమించుకోవడానికి ‘ఆలిండియా అర్బన్ ప్లానింగ్ సర్వీస్’ అవసరాన్ని నివేదిక పునరుద్ఘాటించింది. ఇది ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ తరహాలో ఉండాలని పేర్కొంది. దీంతోపాటు నేషనల్ అర్బన్ అండ్ రీజినల్ ప్లానింగ్ అథారిటీని రూపొందించడానికి, బలోపేతం చేయడానికి టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సూచించింది.పట్టణాలకు ఆర్థిక స్థిరత్వంపట్టణ స్థానిక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేది సిఫార్సుల ముఖ్యాంశాల్లో ఒకటి. ఒక నగరం బడ్జెట్ మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. నగరాలు, పట్టణాల్లో వసూలు చేసే ఆక్ట్రాయ్ పన్నుల ద్వారా ఆదాయం సమకూరే అవకాశం లేనందున నగరాల్లో చేపట్టే ప్రాజెక్ట్‌లకు ఆర్థిక వనరులను మల్టీ లేటరల్ లోన్లు, దేశీయ టర్మ్లోన్లు, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం, మునిసిపల్ బాండ్లు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని సూచించింది. తమిళనాడు తరహాలో పట్టణాభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలని తెలిపింది.అలాగే పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీ)లు సమర్థవంతమైన పనితీరుతో స్వతహాగా ఆర్థిక వనరులను పెంచుకోవాలని, జీఎస్టీ రాబడిలో కొంత భాగాన్ని పంచుకోవడం తప్పదని కమిటీ సిఫారసు చేసింది. ఉదాహరణకు... మహారాష్ట్రలో వసూలు చేసే జీఎస్టీలో స్థానిక సంస్థల పన్నులు కూడా ఉన్నాయని, ఆ మొత్తాన్ని యూఎల్బీలకు ఇస్తున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ‘నగర ఆర్థిక అభివృద్ధి కౌన్సిళ్లు’ ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. స్థానిక వ్యాపారాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులతో ఈ స్టాండింగ్ కమిటీ ఉండాలని పేర్కొంది.ఇది కేవలం సలహా సంఘంగా మాత్రమే కాకుండా పట్టణ స్థానిక సంస్థల్లో నైపుణ్యాలు, సామర్థ్యాల కొరతను పూరించడానికి వాటితో సంఘటితం కావాలని సూచించింది. ఈ సూచనలను అసోం, గుజరాత్, హరియాణా, జమ్మూ–కశ్మీర్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పరిస్థితుల అధ్యయనం తర్వాత చేసినట్టు నివేదికలో పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ఇదే తరహా విధివిధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది.పెరుగుతున్న జనాభా.. తగ్గుతున్న సాగుభూమిపట్టణ జనాభా 1961లో 79 మిలియన్ల నుంచి 2011లో 388 మిలియన్లకు పెరిగింది, 2030 నాటికి 630 మిలియన్లకు చేరుతుందని అంచనా. ఈ సమయంలో తలసరి సాగు భూమి 1950–51లో 0.83 హెక్టార్లు ఉండగా, ఇది 2015–16 నాటికి 0.12 హెక్టార్లకు తగ్గిపోయింది. 2030 నాటికి ఇది మరింత క్షీణించి 0.08 హెక్టార్లకు తగ్గుతుందని అంచనా. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమని నివేదిక హెచ్చరించింది. ఈ క్షీణత ఆహార భద్రత, స్థిర వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధికి గణనీయ సవాళ్లను విసురుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.చాలా దేశాల్లో నగరాలు బహుళజాతి సంస్థల్లా నడుస్తూ, సొంతంగా నిధులు సమకూర్చుకుంటుంటే, మన దేశంలో ఇంకా నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 శాతానికి పైగా నిధులు సమకూరుస్తుండగా, యూఎల్బీలు తమ రాబడి నుంచి 15 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. నగరాల మౌలిక సదుపాయాల అవసరాల్లో 5%మాత్రమే ప్రైవేట్ వనరుల ద్వారా నిధులు వస్తున్నాయని.. వీటిని మరింత పెంచాల్సిన అవసరముందని పేర్కొంది. పట్టణీకరణను నివారించాలని సూచనపరిశ్రమలు, వ్యాపార ప్రాంతాల (బ్రౌన్ఫిల్డ్) కోసం వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాలనే రియల్టర్ల ఆశ పట్టణ విస్తరణలకు దారితీసింది. ఫలితంగా పర్యావరణం క్షీణించడం, వ్యవసాయ యోగ్యమైన భూమిని కోల్పోవడంతో పాటు పట్టణీకరణ విపరీతంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. -
లెక్కలు, చిక్కులు
లెక్కల్లో ఎంత పండితుడైనా ఓడిపోయే చిక్కులెక్కలు ఉంటూనే ఉంటాయి; లెక్క తప్పే సందర్భాలు మనిషికి ఎదురవుతూనే ఉంటాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘వడ్లగింజలు’ కథే చూడండి; అందులో శంకరప్ప అనే చదరంగ నిపుణుడు అంతే ప్రవీణుడైన ‘శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులుంగారి’ ఆట కట్టిస్తాడు. అప్పుడా మహారాజు, తన పెద్దాపురం రాజ్యంలో ఉన్నదేదైనా సమర్పించుకుంటాను, సెలవివ్వండని అడుగుతాడు. ఒక వడ్లగింజతో మొదలుపెట్టి చదరంగంలోని అరవై నాలుగు గడుల్లోనూ గింజల్ని రెట్టింపు చేస్తూపోతే ఎన్ని గింజలవుతాయో అన్ని ఇప్పించండని శంకరప్ప అడుగుతాడు. ఓస్, అంతేకదా అనుకున్న రాజుగారు లెక్క కట్టమని షరాబును ఆదేశిస్తాడు. పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగదేశం మొత్తంలో నూరేళ్లపాటు పండించిన ధాన్యం కూడా ఆయనకు ఇవ్వడానికి సరిపోదని అతను సెలవిస్తాడు. మన లెక్కలనూ, అంచనాలనూ చిత్తు చేస్తున్నవాటిలో జనాభా సమస్య ఒకటి. ఆ లెక్క కూడా దాదాపు ఇలాగే మనల్ని చిక్కుల కీకారణ్యంలోకి తీసుకెళ్ళి విడిచిపెడుతుంది. ప్రపంచం మహాజనసాగరంగా మారుతున్న వైనాన్ని గమనించి దానిని ఎలా ఈదాలో ప్రణాళికలు వేయడం డెబ్బై ఏళ్లక్రితం మొదలుపెట్టాం. ఏవో కొండ గుర్తులు పెట్టుకుని, సంకల్పాలు చెప్పుకుని ఈదడమైతే ప్రారంభించాం కానీ, జనసముద్రం విస్తరిస్తూనే ఉంది. ఒక జంటకు ఇద్దరనే నినాదంతో ప్రారంభించి చివరికి ఒక్కరే చాలనుకోవడానికి అలవాటుపడ్డాం. ఇంతలోనే ఈ లెక్క మారిపోతోంది; ఒకరూ, ఇద్దరితో సరిపెడితే ప్రమాదంలో పడతాం, ముగ్గురు, నలుగురిని కని తీరాలన్న నినాదం మన దగ్గర ఇప్పుడిప్పుడే శ్రుతి పెంచుకుంటోంది. దీనికి ఎవరి కారణాలు వారికే ఉన్నాయి. ఉదాహరణకు, ఒకరూ, ఇద్దరితో సరిపెడితే క్రమంగా వృద్ధుల సంఖ్య పెరిగి, యువకుల సంఖ్య తగ్గి అభివృద్ధికి తోడ్పడే విలువైన మానవ వనరుకు కొరత వస్తుందన్నది ఒక కారణం. పెరిగిన జనాభాను బట్టి లోక్ సభ, శాసన సభల్లోని స్థానాల సంఖ్యను పెంచుకోవలసి ఉంటుంది కనుక, అందువల్ల జననాలను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలలో స్థానాల సంఖ్య పెరిగి, అన్నింటిలోనూ వారిదే పై చేయిగా మారుతుందనీ; దానితో జననాలను నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరిగి, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నది మరో కారణం. నియంత్రణను పాటించిన అధిక సంఖ్యాక మతస్థులను మించి నియంత్రణను పాటించని అల్పసంఖ్యాక మతస్థుల సంఖ్య పెరిగిపోతుందన్నది మరికొందరు ముందుకు తెచ్చే కారణం. కారణమేదైనా నినాదం మారుతుండడం నిజం. రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ‘హోమో సేపియన్స్’ అనే ఆధునిక మానవుడు అవతరించడంతో మొదలుపెట్టి ఇప్పటివరకూ వస్తే జనాభా గణాంకాలు చిక్కులెక్కలుగానే కాదు చిత్రవిచిత్రాలుగానూ రూపుకడతాయి. హోమోసేపియన్స్ తొలి వృద్ధి రేటు కేవలం 0. 011 శాతం అయితే, ఆ శాతం ఏ కొంచెమైనా పెరుగుతూ 19వ శతాబ్ది ప్రారంభానికి వందకోట్లకు చేరడానికి వేల సంవత్సరాలు పట్టింది. అప్పటి నుంచి అది పెరుగుతూనే ఉండి, అతి స్వల్ప కాలంలోనే ఏడువందల కోట్లకు చేరింది. మరో ఇరవయ్యేళ్లలో తొమ్మిది వందల కోట్లకు చేరుతుందని అంచనా. సమస్యను ఐక్యరాజ్యసమితి తన చేతుల్లోకి తీసుకుని పరిష్కరించడానికి ఎన్ని ప్రణాళికలు వేసి, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సమస్య ఎందుకు విషమిస్తూనే ఉందంటే, అభివృద్ధిలో దేశాల మధ్య తేడాలు, పేద, ధనిక వ్యత్యాసాలు మొదలైనవి కారణం. పారిశ్రామిక విప్లవానికి లానే జనాభావృద్ధికీ, క్షీణతకూ కూడా యూరప్ తొలి ప్రయోగశాల అయింది. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధీ, దానితోపాటే ఆహార పుష్కలత్వం, చదువూ సంధ్యా పెరగడంతోనే యూరప్ లో జనాభా పెరిగి క్రమంగా క్షీణిస్తూనూ వచ్చింది. సరిగ్గా ఇవే కారణాలతో వర్ధమానదేశాలలో కూడా జనాభా పెరగడం, ఆ తర్వాత క్షీణించడం మొదలైంది కానీ వృద్ధి రేటుకు ఆ క్షీణత రేటు తులతూగడం లేదు. యూరప్ తర్వాత ఆసియాదేశాలు జనాభావృద్ధిలో అగ్రస్థానానికి వస్తే, ఇప్పుడా ఘనతను ఆఫ్రికా దేశాలు చేజిక్కించుకోబోతున్నాయి. ఇక్కడొక ఆసక్తికర వివరం ఏమిటంటే, 1950లలో మొత్తం ఆసియా దేశాల జనాభా 140 కోట్లు అయితే ఇప్పుడు దానిని కూడా మించిన జనాభా ఒక్క మన దేశంలోనే ఉంది. అభివృద్ధికీ, ఆహార పుష్కలత్వానికీ, జనాభా వృద్ధికీ ఉన్న పీటముడిని మన ప్రాచీనులు సైతం గుర్తించారనడానికి మహాభారతమే సాక్ష్యం. పెరిగిన జనాభా భారాన్ని మోయలేకపోతున్నానని భూదేవి మొరపెట్టుకున్నప్పుడు, ఆహార లభ్యత వల్ల జనాభా పెరిగిందని, త్వరలోనే కురుపాండవుల మధ్య యుద్ధమొచ్చి పెద్ద ఎత్తున జననష్టం జరిగి నీ భారం తగ్గుతుందని చెప్పి బ్రహ్మ ఆమెను ఊరడిస్తాడు. విశేషమేమిటంటే, 18వ శతాబ్ది చివరినాటికి యూరప్ అనుభవాన్ని గమనించిన థామస్ రాబర్ట్ మాల్తస్ అనే ఆర్థికవేత్త కూడా ఆహార లభ్యతకూ జనాభావృద్ధికీ ఉన్న సంబంధాన్ని నొక్కి చెప్పి, రోగాలు, కరవు కాటకాలు, యుద్ధాలే దానిని నియంత్రిస్తాయంటాడు. అలాంటి విధ్వంసక మార్గంలో కాకుండా విద్యా, విజ్ఞానాల ఊతతో జనమహాసాగరాన్ని ఈదడానికి మనం ఉపక్రమించి ఇంకా అందులోనే మునిగితేలుతున్నాం. ఇంతలోనే నినాదం మారిపోయి సమస్యను మళ్ళీ మొదటికి తెస్తోంది; అదీ సంగతి! -
రానున్నది తాతల కాలం.. 2050 నాటికి వృద్ధ జనాభా మూడింతలు
మనిషికి వృద్ధాప్యం అనేది గడ్డుకాలమని చాలామంది అంటుంటారు. అలాంటి కాలం త్వరలో రానుంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి. రానున్న 25 ఏళ్లలో దేశంలో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సవాల్ విసురుతున్న వృద్ధాప్య జనాభాప్రస్తుతం భారతదేశంలో వృద్ధుల సంఖ్య దాదాపు 10.40 కోట్లు (104 మిలియన్లు), ఇది 2050 నాటికి 31.90 కోట్లకు (319 మిలియన్లు) చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. వృద్ధాప్య దశలో శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా వృద్ధులు దీర్ఘకాలం జీవించగలుగుతారు. అయితే ఇదే సమయంలో వృద్ధుల ఆరోగ్య సంబంధిత సవాళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.రెండున్నర దశాబ్దాల్లో వృద్ధుల సంఖ్య మూడు రెట్లుఅసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోఛామ్) నేషనల్ కౌన్సిల్ ఆన్ సీఎస్ఆర్, చైర్మన్ అనిల్ రాజ్‌పుత్ ఇటీవల ఒక సదస్సులో మాట్లాడుతూ వృద్ధులకు వారి స్వతంత్రతను కాపాడుకునేందుకు, చురుకుగా ఉండటానికి అనువైన విధానాలను అనుసరించడం అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్యం అనేది 21వ శతాబ్దపు అతిపెద్ద సామాజిక సవాళ్లలో ఒకటిగా మారింది. వచ్చే రెండున్నర దశాబ్దాల్లో భారతదేశంలో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందనే అంచనాలున్నాయి. వృద్ధాప్య సంరక్షణపై కార్పొరేట్ రంగం, సమాజం, ప్రభుత్వాలు క్రియాశీల సహకారం అందించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.వృద్ధాప్య సమస్యలను నియంత్రించే యోగాన్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సుభాష్ మంచాంద ఇదే అంశంపై మాట్లాడుతూ వృద్ధులకు వచ్చే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల సమస్యలను నియంత్రించడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. యోగాభ్యాసం వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదింపజేస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. వృద్ధులు క్రమం తప్పకుండా యోగా చేయాలని, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సుభాష్ మంచాంద పేర్కొన్నారు.సమతుల ఆహారంతో ఆరోగ్యంఢిల్లీలోని ఎయిమ్స్‌లో గల వృద్ధాప్య క్లినిక్ మాజీ సీనియర్ సలహాదారు ప్రొఫెసర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వృద్ధాప్యం కోసం, ప్రజలు సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరమని అన్నారు. అనారోగ్యకరమైన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామం రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని, వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాల పాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలని, తగినంతసేపు నిద్రించాలని సలహా ఇచ్చారు. ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
నారు పోస్తే.. నీరు ‘నారా’వారు పోస్తారా?
సంతానోత్పత్తికి సంబంధించి ఏపీ శాసనసభ చేసిన చట్ట సవరణ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలంగా చేస్తున్న ప్రచారానికి అనుగుణంగా ఉంది. దీని ప్రకారం ఇద్దరు మించి పిల్లలు ఉన్నవారూ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అర్హులవుతారు. దీంతో మూడు దశాబ్దాల క్రితం జనాభా నియంత్రణ కోసం అప్పటి ప్రభుత్వం చేసిన చట్టం కాస్తా లేకుండా పోయింది. అయితే దీనివల్ల ప్రయోజనం ఎంత మేరకన్నది మాత్రం చర్చనీయంశమే. ఇద్దరి కంటే ఎక్కువమంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనువుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టాన్ని ఆమోదించింది కానీ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రం ఇది వర్తించదు. టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అరకొరగా చేసిన ఈ చట్టం వల్ల ప్రయోజనం ఏమిటన్న సందేహమూ ఆయన వ్యక్తం చేశారు. ఇది వాస్తవమే. చంద్రబాబు నాయుడు కొన్నేళ్లుగా ‘‘పిల్లలను కనండి..వారి భవిష్యత్తు నేను చూసుకుంటా‘ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. అందులో భాగంగా కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఏడాదికి రూ.15 వేల చొప్పు ఇస్తామన్న ‘తల్లికి వందనం’ పథకాన్ని తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా హామీ కూడా ఇచ్చారు. అదే సందర్భంలో ఏపీలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును పెంచాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ప్రోత్సహాకాలు ఇవ్వాలని కూడా సూచించారు. చైనా, జపాన్ వంటి దేశాలలో వృద్దుల సంఖ్య పెరుగుతుండడం, అక్కడ యువత ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటుండడం వంటి కారణాల రీత్యా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు చైనా తన చట్టాలను కూడా మార్చుకుంది. ఒకే సంతానం అన్న పరిమితిని ఎత్తేసింది. జపాన్ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. రష్యా తదితర దేశాలు కూడా ఇదే మార్గంలో ఉన్నాయి. అయితే ఈ దేశాలకు, భారత్‌కు అసలు పోలికే లేదు. భారత్‌లో నిరక్షరాస్యత ఎఉక్కవ, పేదరికమూ తగ్గలేదు. అధిక జనాభా కారణంగా సంక్షేమ పథకాల అమలు కూడా కష్టమవుతోందన్న ఆలోచనతో అప్పట్లో భారత్‌లో జనాభా నియంత్రణకు ప్రభుత్వం ప్రోత్సాహమిచ్చింది. 1960లలో కేంద్రం కుటుంబ నియంత్రణను ఒక ఉద్యమంలా అమలు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారన్న అంశం పెద్ద వివాదమైన సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ అకృత్యాలతోపాటు నిర్భంధ ఆపరేషన్లూ కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణమయ్యాయి.1990లలో జనాభా నియంత్రణ లక్ష్యంతో ప్రభుత్వాలు స్థానిక ఎన్నికలలో పోటీ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఉమ్మడి ఏపీలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులను చేస్తూ చట్టం తెచ్చారు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాభా తగ్గుదల ఆవశ్యకతపై శాసనసభలో చర్చలు జరిపారు. తీర్మానాలు చేశారు. నిరోధ్ వంటి బొమ్మలను అసెంబ్లీ ఆవరణలో ప్రదర్శించడం పై కొన్ని అభ్యంతరాలు వచ్చినా, ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత కాలంలో ఈ అంశానికి అంత ప్రాధాన్యత రాలేదు. దానికి కారణం ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఒకరిద్దరు పిల్లలను కంటున్నారు. వారికి విద్య, ఆరోగ్యం వంటి వాటిపై శ్రద్ద చూపుతున్నారు. మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాలు ఎప్పటి నుంచో ఈ విధంగా ఒకరిద్దరు పిల్లలకే పరిమితం అవుతున్నాయి. ఒకప్పుడు అంటే పూర్వకాలంలో జనాభా నియంత్రణ పద్దతులు అంతగా వ్యాప్తిలోకి రాకముందు అధిక సంఖ్యలో సంతానాన్ని కనేవారు. ఉదాహరణకు అందరికి తెలిసిన ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు పదకుండు మంది పిల్లలు ఉన్నారు. ఇలా ఒకరని కాదు..అనేకమంది పరిస్థితి ఇలాగే ఉండేది. కాని కాలం మారుతూ వచ్చింది. ప్రజల ఆచార వ్యవహారాలు, అలవాట్లు, కుటుంబ పద్దతులు అన్నిటిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టిన వెంటనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ప్రభుత్వాల ప్రోత్సాహాకాలతో నిమిత్తం లేకుండా ఎవరికి వారు అలా చేస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చంద్రబాబు అధిక సంతానం కోసం ప్రచారం ఆరంభించే దశ వచ్చింది. దీనిని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి వంటి ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవరూ స్వాగతించలేదు. దానికి కారణం పిల్లలను కంటే ఎవరు పోషిస్తారు? దానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? అన్న మీమాంస ఉండడమే. ఈ రోజుల్లో పిల్లల విద్యకు ప్రైవేటు స్కూళ్లలో వేల రూపాయల చొప్పున ఫీజులు కట్టాల్సి వస్తోంది. జగన్ ప్రభుత్వం పేద పిల్లలకు ఉపయోగపడేలా ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయడంతో పాటు ,అమ్మ ఒడి పేరుతో పిల్లలను స్కూళ్లకు పంపించే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చింది. ఆ స్కీమ్ సఫలం అవడంతో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం చేస్తూ ప్రతి తల్లికి కాదు.. బడికి వెళ్లే ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది దీనిని అమలు చేయలేదు. దాంతో ఏపీలో పేద కుటుంబాలు మోసపోయామని భావిస్తున్నాయి. అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని కూడా టీడీపీ, జనసేన కూటమి సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చాయి. ఆ విషయాన్ని చంద్రబాబుతో పాటు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక అవన్ని ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి నిజంగానే పిల్లలను ఎక్కువగా కంటే ఎవరు పోషిస్తారని జనం అడుగుతున్నారు. పోనీ ఈ ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ముందుగా తమ కుటుంబాలలో దానిని అమలు చేసి చూపిస్తున్నారా? అంటే అదేమీ లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు బీజేపీతో మళ్లీ స్నేహం పెట్టుకున్నాక, వారి మెప్పు పొందేందుకు ఇలాంటి కొత్త, కొత్త ప్రచారాలు ఆరంభించారన్న అభిప్రాయం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ కొత్త అవతారం ఎత్తే యత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలపై హిందూవాదులు పెద్దగా స్పందించలేదు కాని, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. నిజానికి ఎవరి కుటుంబం వారిది. వారి ఆర్థిక స్థోమతను బట్టి పిల్లల సంఖ్యను నిర్ణయించుకుంటారు. అంతే తప్ప చంద్రబాబు చెప్పారనో, మరెవరో అన్నారనో, లేక కేవలం ఏదో స్థానిక ఎన్నికల నిమిత్తమో ఇద్దరిని మించి పిల్లలను కంటారని ఎవరూ అనుకోవడం లేదు. టీడీపీ సభ్యుడు అన్నట్లు నిజంగానే అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కంటే ఆయా సంక్షేమ పథకాలు పిల్లలందరికి వర్తిస్తాయని కూడా ప్రభుత్వం తీర్మానించాలి కదా! అలా చేయలేదు సరికదా, ఇస్తామన్న తల్లికి వందనం స్కీమును హుళక్కి చేశారు. ఈ నేపథ్యంలో పిల్లలను బాగా కనండి అని చంద్రబాబు ప్రచారం చేస్తే నమ్మి ఎవరైనా అలా చేస్తారా? :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నిర్మానుషంగా ఉంది నిజమే కానీ.. ! కర్ఫ్యూ ఏం పెట్టలేద్సార్!
-
దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా?
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరొందిన భారత్ గత కొన్ని దశాబ్దాలుగా జనాభా పెరుగుదల విషయంలో గణనీయమైన మార్పులను చూసింది. నవంబర్ 2024 నాటికి దేశ జనాభా 145.56 కోట్లుగా ఉంది. ఈ సంఖ్య చైనాను అధిగమించింది. అయినప్పటికీ సంతానోత్పత్తి రేటులో చెప్పుకోదగిన క్షీణతను ఎదుర్కొంటోంది. ఈ ధోరణి భవిష్యత్తులో దేశానికి సానుకూల, ప్రతికూల పరిణామాలను తెచ్చిపెట్టనున్నదని నిపుణులు చెబుతున్నారు.రెండు శాతానికన్నా దిగువకు..1950లో దాదాపు 250 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ఇప్పుడు 800 కోట్లకు చేరుకుంది. పెరుగుతున్న ప్రపంచ జనాభా మంచిదా? కాదా అనే చర్చ ఒకవైపు జరగుతుండగా, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం 1950లో ఒక మహిళకు 6.2 మంది పిల్లలు ఉన్న భారతదేశంలో ఇప్పుడు సంతానోత్పత్తి రేటు రెండు శాతానికన్నా తక్కువకు పడిపోయింది. ఇదే ధోరణి భవిష్యత్‌లో కొనసాగితే భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2050 నాటికి 1.3 శాతానికి పడిపోనుంది.ఒకవైపు సవాళ్లు.. మరోవైపు అవకాశాలు2050 నాటికి ప్రపంచ సంతానోత్పత్తి రేటు 1.8 శాతానికి తగ్గుతుందని, అది 2100 నాటికి అది 1.6 శాతానికి తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఈ క్షీణత భారతదేశంతో పాటు పలు దేశాలకు ఒకవైపు సవాళ్లను, మరోవైపు అవకాశాలను అందిస్తుంది. 2021లో భారత్‌లో సుమారుగా రెండు కోట్ల మంది పిల్లలు జన్మించారు. 2050 నాటికి ఈ సంఖ్య కేవలం 1.3 కోట్లకు తగ్గుతుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రాబోయే కాలంలో సంతానోత్పత్తి రేటులో క్షీణతను చవిచూడనున్నాయి.కారణాలివే..దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం వెనుక అనేక కారణాలున్నాయి. ఆలస్యంగా వివాహాలు జరగడం, ఉన్నత విద్యావకాశాలు పెరగడం, కుటుంబ నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణను పాటిస్టున్నారు. ఈ పోకడలు భవిష్యత్‌లో కొనసాగి, కొన్ని దశాబ్దాల్లోనే దేశ జనాభా గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి.జీవన నాణ్యత కోణంలో మేలుసంతానోత్పత్తి రేటు క్షీణించడాన్ని ఒక సవాలుగా భావించినప్పటికీ, దీనివలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వనరుల నిర్వహణ, జీవన నాణ్యత కోణంలో మేలు జరగనుంది. ఆహారం, నీరు, ఇంధన శక్తి తదితర వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు తక్కువ పిల్లలను కలిగి ఉన్న మహిళలు సగటున ఎక్కువ కాలం జీవిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నియంత్రిత జనాభా దేశంలో దీర్ఘకాలికంగా మరింత స్థిరమైన వృద్ధిని సృష్టిస్తుంది.సామాజిక భద్రతా వ్యవస్థలపై ఒత్తిడిసంతానోత్పత్తి రేటు పడిపోతున్న దశలో సమాజంలో యువత నిష్పత్తి తగ్గుతుంది. వృద్ధుల జనాభా పెరుగుతుంది. ఫలితంగా కార్మిక మార్కెట్లో అసమతుల్యత, సామాజిక భద్రతా వ్యవస్థలపై ఒత్తిడి ఏర్పడుతుంది. భారతదేశంలో 0-14 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా ఇప్పటికే క్షీణిస్తూ వస్తోంది. ఇది 2001లో 36.4 కోట్ల నుండి 2024 నాటికి 34 కోట్లకు చేరుకుంది. ఇదేసమయంలో 60 అంతకంటే అధిక వయసు కలిగినవారి సంఖ్య 1991లో 6.1 కోట్ల నుండి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇది 2024 నాటికి 15 కోట్లుగా అంచనాలున్నాయి. పెరుగుతున్న వృద్ధాప్య జనాభా సామాజికంగా గణనీయమైన సవాళ్లను తెచ్చిపెడుతుంది.విస్తృత ప్రపంచ ధోరణిలో భాగంసంతానోత్పత్తి రేటు క్షీణత అనేది భారతదేశానికి మాత్రమే కాదు.. ఇది విస్తృత ప్రపంచ ధోరణిలో భాగం. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంతానోత్పత్తి రేటు క్షీణిస్తున్నందున శ్రామికశక్తి, వృద్ధాప్య జనాభా మరిన్ని సవాళ్లను తెచ్చిపెడుతోంది. దీంతో తక్కువ ఆదాయ వనరులు కలిగిన దేశాలలో పరిస్థితి మరింత క్షిష్టంగా మారనుంది. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు క్షీణత అటు అవకాశాలను, ఇటు సవాళ్లు రెండింటినీ అందించనుంది. ఇటువంటి పరిస్థితుల్లో సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం లాంటి లక్ష్య వ్యూహాలతో ప్రభుత్వాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.ఇది కూడా చదవండి: Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరికి ఊరట -
మంచి పనిని కించపరుస్తారా?
జనాభా సమీకరణాల్లో వస్తున్నంత పరివర్తన సామాజికార్థిక పరిస్థితుల్లో రాకపోవడం దేశంలో ఏకరీతి ప్రగతికి సవాల్ విసురుతోంది. అసమగ్ర అభివృద్ధికి ప్రభుత్వాలే కారణమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘జనాభా ఆధారంగా చట్టసభలకు ప్రాతినిధ్య’ పద్ధతి సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగించేలా పరిణమించింది. నియోజకవర్గ పునర్విభజనతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగనుండగా, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనున్నాయి. జనాభా నియంత్రిస్తే తప్పయినట్టు, ఎక్కువ మంది పిల్లల్ని కనడమే గొప్పయినట్టు అధికారిక ప్రచారాలు, అమలు చర్యలు మొదలయ్యే ప్రమాదముంది. ఈ పరిస్థితులపై లోతైన సమగ్ర అధ్యయనం, దిద్దుబాటు చర్యలు తక్షణావసరం.మనమిపుడు 140 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్నాం. వనరులు, సదుపాయాలు, జనాభా నిష్పత్తిలో చూసినపుడు ఇదొక సంక్లిష్ట నమూనా! ఇటీవలి వరకు అధిక జనాభా దేశంగా ఉన్న చైనా కొన్నేళ్లుగా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలతో జనాభా వృద్ధిని నిలువరించింది. మనం కూడా నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, ఆశించిన లక్ష్యాలు అందుకోలేకపోయాం. అయితే, దేశంలోని కొన్ని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో మంచి విజయాలు సాధించాయి. అర్థవంతమైన సంతానోత్పత్తి రేటు తరుగుదలను నమోదు చేశాయి. ఇది ప్రగతి సంకేతమే! కానీ, అదే తమ పాలిట శాపంగా పరిణమించిందని ఇప్పుడా రాష్ట్రాలు నెత్తి బాదుకుంటు న్నాయి. ప్రధానంగా రెండు సమస్యల్ని ఎదుర్కొంటున్నామని ఆ యా రాష్ట్రాల అధినేతలు భావిస్తున్నారు. ఒకటి, సంతానోత్పత్తి రేటు నియంత్రణ వల్ల పిల్లలు, యువ జనాభా తగ్గుతూ, వృద్ధుల జనాభా నిష్పత్తి పెరుగుతోంది. రెండోది, జనాభా నిలువరింపు కారణంగా, జాతీయ సగటు జనాభా ఆధారంగా జరిగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఆ యా రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గనుంది. ఇది దేశంలోని అత్యున్నత విధాన నిర్ణాయక సభలో ప్రాతినిధ్యం కోతగా భావిస్తూ వారు కలత చెందుతున్నారు. ఇంకోవైపు, జనాభాను అదుపు చేయక, సంతానోత్పత్తి రేటును అధికంగానే చూపుతున్న రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగనుండటం దేనికి సంకేతం? అనే ప్రశ్న పుట్టుకొస్తోంది.తగ్గిన సంతానోత్పత్తి రేటుదక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య భారతంలోని చిన్న రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటులో రమారమి తరుగుదల నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ ఈ రేటు తక్కువగానే ఉంది. 2019–21 కాలంలో, దేశంలోనే అత్యల్పంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో సంతానోత్పత్తి రేటు 1.4గా ఉంటే... తెలంగాణ, ఏపీ, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఇది 1.5గా నమోదయినట్టు ‘భారత రిజిస్ట్రార్ జనరల్’ నివేదిక చెబుతోంది. ‘పిల్లలు కనే వయసు’ కాలంలో మహిళలకు పుట్టిన పిల్లల సంఖ్య సగటును, ఆ ప్రాంతపు లేదా ఆ రాష్ట్రపు సంతా నోత్పత్తి రేటుగా పరిగణిస్తారు. అదే సమయంలో బిహార్ (3), ఉత్తర ప్రదేశ్ (2.7), మధ్యప్రదేశ్ (2.6) రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు అధి కంగా నమోదవుతోంది. ఎక్కువ సంతానోత్పత్తి రేటున్న రాష్ట్రాల్లో అభివృద్ధి మందగించడం సహజం.సంతానోత్పత్తి పరిమితుల్లో ఉండటం ప్రగతి సంకేతమే అయినా, మరో సమస్యకు అది కారణమవుతోంది. ఒక వంక పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతుంటే, మరోవంక శాస్త్ర సాంకేతికత పురోగతి పుణ్యమా అని మనిషి సగటు జీవనకాలం పెరగటం వల్ల వృద్ధుల సంఖ్య అధిక మవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోలాగా ఒక నిర్దిష్ట వయసు దాటినవారికి ప్రభుత్వమే కల్పించే సామాజిక భద్రత పథకాలు, కార్యక్రమాలు మనవద్ద లేకపోవడంతో వారి పోషణ, ఆరోగ్య నిర్వహణ కుటుంబాలకు అదనపు ఆర్థిక భారంగా పరిణమిస్తు న్నాయి. జనాభా ఆధారంగానే వివిధ కేంద్ర పథకాలు, సంక్షేమ కార్య క్రమాల నిధుల కేటాయింపులు, చివరకు చట్టసభల్లో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్య సంఖ్య ఖరారు కూడా జరగటం తమకు నష్టం కలిగిస్తోందని ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు.ఆధారపడే జనాభా రేటులో వృద్ధిప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కానీ, ఇటీవలి కాలంలో వృద్ధుల జనాభా శాతం క్రమంగా పెరుగుతున్నట్టు, మున్ముందు అది మరింత పెరుగనున్నట్టు ఐక్యరాజ్యసమితి విభాగమొకటి (యూఎన్‌ఎఫ్‌పీయే) తన నివేదికలో చెప్పింది. భారత వైద్య, కుటుంబ ఆరోగ్య విభాగం అందించిన సమాచారం ఆధారంగా అంచనాలు లెక్కగట్టిన ఈ విభాగం 2021లో 10.1 శాతంగా ఉన్న వృద్ధుల జనాభా 2036 నాటికి 15 శాతానికి చేరవచ్చని చెప్పింది.అయితే, వృద్ధుల జనాభా పెరుగుదల రేటు సమస్య కాదు... సదరు జనాభా పనిచేసే వయస్కుల మీద ఆధారపడే స్థితి అధిక మవడం ఇబ్బంది. అంటే, వంద మంది పనిచేసే (18–59 ఏళ్లు) వయస్కులున్నపుడు, వారిపై ఆధారపడే వృద్ధుల జనాభా అధికంగా ఉండటం కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుందనేది అంతర్జాతీయ ప్రమాణాల లెక్క. ఆ నిష్పత్తి పెరుగుతోంది. అది 15 శాతాన్ని దాటితే సమస్యను ‘వృద్ధుల సంక్షోభం’గా లెక్కిస్తారు. భారత జాతీయ జనాభా కమిషన్ (ఎన్సీపీ) 2021 లెక్కల ప్రకారం, కేరళలో ఇది ఇప్పటికే 26.1 శాతంగా ఉంది. తమిళనాడు (20.5), హిమాచల్ ప్రదేశ్ (19.6), ఏపీ (18.5) శాతాలు కూడా అధికంగానే ఉన్నాయి. 2036 నాటికి అవి మరింత గణనీయంగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. సంతానన్పోత్తి రేటును, తద్వారా జనాభాను నియంత్రించినందుకు, సదరు కుటుంబాల్లో లభించే ఆ ప్రయోజనం... వృద్ధుల పోషణ, వారి ఆరోగ్య పరిరక్షణలోనే కరిగిపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.కట్టడి చేసినందుకు కనీస స్థానాలా?2026 తర్వాతి జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్ట నిర్దేశ్యం ప్రకారం ఏపీ, తెలంగాణల్లోనూ సంఖ్య పెంపుతో పునర్విభజన జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా గడువు లోపల జనాభా తాజా లెక్కలు అందించడానికి వీలుగా జనగణన ప్రక్రియ సత్వరం చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. దశాబ్దానికి ఒకసారి జరిపే జనగణన, పాత సంప్రదాయం ప్రకారం 2020లో మొదలు కావాల్సింది. కోవిడ్ మహమ్మారి వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు 2025లో చేపట్టి, పదేళ్ల సైకిల్ని (ఇదివరకటిలా 2021 –2031 కాకుండా 2025 –2035గా) మారుస్తున్నారు. జనాభా వృద్ధి రేటు తీరుతెన్నుల్ని బట్టి కె.ఎస్. జేమ్స్, శుభ్ర కృతి జరిపిన అధ్యయనం ప్రకారం, వచ్చే పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరు గనుండగా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనుంది. ఉత్తరప్రదేశ్ (12), బిహార్ (10), రాజస్థాన్ (7) లలో లోక్‌సభ నియోజకవర్గాలు పెరుగ నున్నాయి. తమిళనాడు (9), కేరళ (6), ఏపీ (5) లలో తగ్గనున్నాయి. జాతీయ జనాభాలో వాటా పెరుగుదల, తరుగుదలను బట్టి ఈ సంఖ్య మారనుంది. ‘ఎక్కువ పిల్లలు కలిగిన తలిదండ్రులకు ప్రోత్సాహకాలివ్వాలి, ఆ మేరకు చట్టం తేవాలని నేను ఆలోచిస్తున్నాను’ అంటూ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల అన్నారు. ఇటువంటి పంథా మంచిది కాదనీ, దాని వల్ల ఏ మంచీ జరుగదనేది ప్రపంచ వ్యాప్తంగా రుజువైన అంశమనీ సామాజికవేత్తలు అంటున్నారు. ప్రభుత్వాలిచ్చే ప్రాత్సాహకాలు అదనంగా పుట్టే సంతాన పోషణ, వారి విద్య –వైద్య అవసరాలు తీర్చవనీ, అధిక సంతానం కుటుంబ జీవన ప్రమాణాల పతనానికే కారణమవుతుందనీ విశ్లేషణలున్నాయి.ఈ పరిణామాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టాలి. జానాభా వృద్ధిని నిలుపుదల చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయాలుండాలి. సరైన జనాభా నిష్పత్తి ఉండేలా చూడాలి. వయసు మళ్లినవారు ఆయా కుటంబాలకు భారం కాకుండా సార్వత్రిక సాంఘిక భద్రతా పథకాలు ఉండాలి. ‘పనిచేసే వయసు’ కాలం నిడివి పెరిగేట్టు జీవన ప్రమాణాల వృద్ధికి చర్యలు తీసుకోవాలి. జనాభా నియంత్రణ తప్పు కాదు. ముసలితనం శాపం కాకూడదు. మంచి పనులకు ప్రోత్సాహం ఉండాలే తప్ప, శిక్షలు ఉండకూడదు.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
అధిక జనాభా వరమా!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్‌కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్‌కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్ మాటల ఆంతర్యం అదే. మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. -
ఉత్తరాది.. తగ్గేదే లే
సాక్షి, అమరావతి: దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గుతుండగా.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం తగ్గేదే లేదంటున్నాయి. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎకనామిక్స్ రీసెర్చ్ వింగ్ నివేదిక వెల్లడించింది. త్వరలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న జనాభా లెక్కలకు ముందస్తుగా.. ‘ద ఫైన్ ప్రింట్స్ ఆఫ్ రేపిడ్లీ ఛేంజింగ్ నేషన్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. 2001–2011 మధ్య దేశ జనాభా వృద్ధి రేటు 1.63 శాతం ఉండగా.. 2011–24లో 1.2 శాతానికి తగ్గే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు 4.3 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గనుండగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం 6.4 శాతం నుంచి 7.2 శాతానికి పెరుగుతోందని వెల్లడించింది. పెరిగిన జనాభాలో 33 శాతం కేవలం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. అలాగే దేశంలో 52 శాతం జనాభా ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాల్లోనే ఉందని నివేదిక తెలిపింది. దేశంలో 64.4 శాతం మంది పనిచేసే వయసులో ఉన్నారని.. 2031 నాటికి 65.2 శాతానికి పెరిగే అవకాశముందని పేర్కొంది. -
'వృద్ధి'ల్లుతోంది
సాక్షి, అమరావతి: ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలో జనాభా వృద్ధి తగ్గుతోంది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ జనాభా వృద్ధి పెరుగుతోంది. 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2024లో పలు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదలను విశ్లేషిస్తూ ఎస్బీఐ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలతో పోల్చితే 2024 అంచనాల మేరకు తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి క్షీణించిందని నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో 2011లో జనాభా వృద్ధి 15% ఉండగా 2024 అంచనాల మేరకు జనాభా వృద్ధి 12 శాతానికి తగ్గిపోయిందని పేర్కొంది.ఉత్తరాది రాష్ట్రాల్లో 2011 లెక్కల ప్రకారం జనాభా వృద్ధి 27 శాతం ఉండగా 2024 అంచనాల మేరకు అది 29 శాతానికి పెరిగిందని వెల్లడించింది. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఏపీ రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య తక్కువగా పెరుగుతోందని వెల్లడించింది. ఏపీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వృద్ధుల సంఖ్య 50 లక్షలు ఉండగా ఇది మొత్తం జనాభాలో 10.1%గా ఉంది. 2024 అంచనాల మేరకు వృద్ధుల జనాభా 70 లక్షలకు పెరిగింది. ఇది మొత్తం జనాభాలో 12.4%గా ఉంది. అంటే 2011–24 నాటికి వృద్ధుల సంఖ్య 2.3% పెరిగింది. 2011 జనాభాతో పోల్చి చూస్తే 2024 అంచనాల మేరకు కేరళలో 16.5 శాతం, తమిళనాడు 13.6 శాతం, హిమాచల్ ప్రదేశ్ 13.1 శాతం, పంజాబ్ 12.6 శాతం వృద్ధులు పెరిగారు. అతి తక్కువగా వృద్ధుల జనాభా 2024 అంచనా మేరకు బిహార్‌లో 7.7 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 8.1 శాతం, అసోంలో 8.2 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
విద్యా కుసుమాలు.. వాడిపోతున్నాయి
పరీక్ష పాసవ్వలేదనో, అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ప్రేమవిఫలమైందనో.. మరో కారణంగానో చిన్న వయసులోనే జీవితాల్ని చాలిస్తున్న విద్యార్థులు ఆత్యహత్యలు మనసుల్ని పట్టి కుదిపేస్తుంటాయి. కదా.. తాజాగా ఒక అధ్యయనం ఈ తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. భారతదేశంలో జనభా వృద్దిరేటు కన్న విద్యార్థులు ఆత్యహత్యలే ఎక్కువ అని తేలింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ఆధారంగా, ఇంటర్నేషనల్ కెరీర్ అండ్ కాలేజ్ కౌన్సెలింగ్ (IC3) కాన్ఫరెన్స్ ,ఎక్స్పో 2024లో బుధవారం సమర్పించిన "విద్యార్థుల ఆత్మహత్యలు: భారత్‌ను వణికిస్తున్న మహమ్మారి(ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా)" నివేదికలో ఈ విషయాలు వెల్లడైనాయి.ఈ నివేదిక ప్రకారం మొత్తం ఆత్మహత్యల సంఖ్య సంవత్సరానికి 2 శాతం పెరిగింది. 2021- 2022 మధ్య విద్యార్థుల బలవన్మరణాలు 4 శాతం పెరిగాయి. విద్యార్థుల ఆత్మహత్య కేసులు తక్కువగా నమోదయ్యే అవకాశ ఉన్న నేపథ్యంలో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. అంతేకాదు ఇది మొత్తం ఆత్మహత్యల ట్రెండ్‌ను కూడా ఇది అధిగమించింది. గత దశాబ్దంలో, 0-24 సంవత్సరాల వయస్సున్న జనాభా 582 మిలియన్ల నుండి 581 మిలియన్లకు తగ్గగా, విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుండి 13,044కి పెరిగింది. ఆందోళనకరంగా విద్యార్థుల ఆత్మహత్యలు!దేశంలో జనాభా వృద్ధి, మొత్తం ఆత్మహత్యల రేట్ల కంటే, విద్యార్థి ఆత్మహత్యలే అధికంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా వీరి ఆత్మహత్యల వార్షిక రేటు నాలుగు శాతం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు అనూహ్యంగా పెరిగాయని, పురుషుల ఆత్మహత్యలు 50 శాతం, మహిళల ఆత్మహత్యలు 61 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో 53 శాతం మగ విద్యార్థులే. అయితే, 2021-22 మధ్య, మగ విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గాయి. కానీ ఇదే సమయంలో ఆడపిల్లల ఆత్మహత్యలు 7 శాతం పెరగడం గమనార్హం.మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో అత్యధిక విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రాలుగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇది జాతీయ మొత్తంలో మూడింట ఒక వంతు. దక్షిణాది రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు సమిష్టిగా 29 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోటా లాంటి కోచింగ్ కేంద్రాల హబ్ రాజస్థాన్ రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. అంతేకాదు కేసులు నమోదైన దాని ప్రకారం గుర్తించిన డేటా మాత్రమేననని, నమోదు కానీ కేసుల సంఖ్య కలిస్తే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చనే ఆందోళన వ్యక్తం చేసింది. 2017 మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఆత్మహత్యాయత్నాలను నేరరహితం చేసినప్పటికీ రిపోర్టింగ్ పద్ధతులను ప్రభావితం చేస్తూనే ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రిపోర్టింగ్ తక్కువగా ఉంటుందని నివేదిక తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యలకు కారణాలు- నివారణ మార్గాలుఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ర్యాంకుల్లో రేసులో వముందుండాలనే విషయంలో తల్లిదండ్రులు ,సమాజం నుండి తీవ్రమైన పోటీ, భారీ అంచనాలు విద్యార్థులలో అధిక ఒత్తిడికి, ఆందోళనకు కారణమవుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు: డిప్రెషన్, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులు విద్యార్థుల ఒత్తడికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అయితే విద్యార్థుల మానసిక ఆందోళనలో అండగా నిలిచి, తగిన సహాయం, కౌన్సెలింగ్ సదుపాయాలు విద్యాసంస్థల్లో లేకపోవడం దురదృష్టం. ఆత్మహత్య ఆలోచనలు అడ్డుకుని, ఆరోగ్య, కెరీర్ కౌన్సెలింగ్ అందించడం ,అవగాహన కల్పించడం చాలా అవసరం.కుటుంబ సమస్యలు, వివాదాలు, తల్లిదండ్రుల ఘర్షణలు,కుటుంబ సభ్యులనుంచి తగిన ఆప్యాయత, ఆసరా లేకపోవడంతో నిరాశతో కుంగిపోతున్న విద్యార్థులు. అందుకే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలి. సమస్యలతో బాధపడుతున్నవారికి మానసిక ఆరోగ్య నిపుణులు లేదా విశ్వసనీయ వ్యక్తులద్వారా కౌన్సెలింగ్ ఇప్పించడం ముఖ్యం. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యకు ప్రయత్నించడం మరియు సహాయం చేయడం నేరం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ఒడిదుడుకుల్లో జనాభా పెరుగుదల!
జనాభా పెరగడంపై మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఏం సమాధానమిస్తారు.. ప్రజలు పెరిగితే మంచితే కదా..శ్రామిక అవసరాలు తీరుతాయి.. అని కొందరు అంటారు. జనాభా ఎక్కువైతే మౌలిక అవసరాలకు ఎక్కువ ఖర్చు చేయాలి..ఉపాధి కరవవుతుంది..నిరుద్యోగం పెరుగుతుంది..ఆకలి అధికమవుతుంది.. అని ఇంకొందరు అభిప్రాయపడుతారు. ప్రాంతాలవారీగా స్థానిక అవసరాలు, అక్కడి ప్రజల అవగాహన, సదుపాయాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం..వంటి చాలా కారణాలు జనాభాను ప్రభావితం చేస్తాయి. ఈ జనాభా పెరుగుదలలోని తారతమ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అసమానతలను పెంచుతున్నాయి. 1950 నుంచి 2023 వరకు ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎలా ఉందో తెలియజేస్తూ ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.జనాభా పెరుగుదల కొన్ని ప్రాంతాలను వృద్ధి పథంలోకి తీసుకెళితే..మరికొన్ని ప్రాంతాలను నష్టాల్లోకి నెట్టేస్తోంది. యువత ఎక్కువగా ఉన్న భారత్‌లో శ్రామికశక్తికి ప్రస్తుతం ఢోకాలేదు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతాల సరసన చేరిన జపాన్ వంటి దేశాల్లో యువతలేక అల్లాడిపోతున్నారు. పిల్లల్ని కనడానికి ప్రభుత్వం అక్కడి దంపతులకు ప్రత్యేక వెసులుబాటు అందిస్తోంది. అక్కడ జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారణం యువత వివాహాలకు సుముఖంగా లేకపోవడం, వివాహమైనా పిల్లలను కనడానికి ఆసక్తిచూపకపోవడమేనని తెలుస్తోంది. నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్ష తదితర సమస్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. వివాహం చేసుకుని సంతానాన్ని కనే వారికి జపాన్ ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా యువత నిర్ణయంలో పెద్ద మార్పు ఉండడంలేదని తెలుస్తోంది. జపాన్ 2070నాటికి 30శాతం మేర జనాభాను కోల్పోయే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.ఆసియాలో..ఆసియాలో 1950లో ఏటా జనాభా పెరుగుదల దాదాపు 58 కోట్లుగా ఉండేదని నివేదిక చెబుతుంది. 73 ఏళ్ల తర్వాత 2023లో అది 65 కోట్లుగా ఉంది. 1990ల్లో గరిష్ఠంగా జనాభా పెరుగుదల సుమారు 90 కోట్లకు చేరింది. క్రమంగా తర్వాతికాలం నుంచి పడిపోయింది. 2012లో ఘణనీయంగా దిగజారింది. చారిత్రాత్మకంగా భారత్, చైనా, ఇండోనేషియా..వంటి దేశాల్లో 20వ శతాబ్దంలో పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ పురోగతి, ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో జనాభా పెరిగింది.ఆఫ్రికా.. ఆకలిరాజ్యంఓ వైపు జనాభాలేక ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంటే ఆఫ్రికాలో మాత్రం అందుకు భిన్నంగా జనాభా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం..1950లో ఏటా సరాసరి 98 లక్షల జనాభా పెరుగుదల ఉండే ఆఫ్రికాలో 2023 నాటికి అది 4.6 కోట్లకు చేరింది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సరైన ఉపాధి అవకాశాలులేక అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పోషకాహారలోపంతో ఉన్నవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆకలి తాండవిస్తోంది.యూరప్‌లో..పారిస్, లండన్, బ్రిటన్..వంటి ప్రాంతాల్లోని ప్రజల్లో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. దాంతో ఏళ్లకాలం నుంచే ఎక్కువగా పిల్లల్ని కనకుండా జాగ్రత్త పడ్డారు. సరాసరి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను మాత్రమే కనేవారు. అది ప్రస్తుతం మరింత తగ్గిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1950లో ఏటా జనాభా పెరుగుదల 95 లక్షలుండే యూరప్‌లో 2023 నాటికి అది 63 లక్షలకు చేరింది.అగ్రరాజ్యం అమెరికాలో..క్రిస్టఫర్ కొలంబస్ 1490లో అమెరికాను కనుగొనే దానికంటే ముందు అక్కడ కేవలం రెండు తెగలకు చెందిన ప్రజలే ఉండేవారు. దాంతో జనాభా తక్కువగా ఉండేది. క్రమంగా విద్యా వ్యవస్థ విస్తరించింది. అమెరికాలో స్త్రీ, పురుష భేదాలు తక్కువగా ఉంటాయి. దాంతో దాదాపు అందరూ ఉద్యోగాలు చేసేవారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అమెరికాలో నివసించడం ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి పిల్లల్ని తక్కువగానే కనేవారు. దంపతులిద్దరు ఉద్యోగాలు చేయడంతో డబ్బు ఆదా అయ్యేది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేవారు. సంస్థలు స్థాపించేవారు. అక్కడి జనాభాకు ఉపాధి దొరకండంతోపాటు మరింత మంది అవసరం ఏర్పడేది. దాంతో ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసలు పెరిగాయి. కానీ అక్కడి ప్రజలు మాత్రం జనాభా పెరుగుదలపై అప్రమత్తంగానే ఉన్నారు. 1950లో జనాభా ఏటా పెరుగుదల 40 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థజనాభా ఎక్కువగా ప్రాంతాల్లో జననాల నియంత్రణ ఆవశ్యకత పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాని పెరుగుదలకు అవసరమయ్యే చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. జనాభా తారతమ్యాలు ఏర్పడకుండా ప్రపంచదేశాలు కొన్ని నియమాలు రూపొందించుకుని వాటిని పాటించాలని కోరుతున్నారు. -
ముస్లింల జనాభా పెరుగుదల జీవన్మరణ సమస్యగా మారింది: హిమంత
రాంచీ: జనాభా సమీకరణాల్లో మార్పు అస్సాంలో అతిపెద్ద సమస్యగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘అస్సాంలో 1951లో ముస్లింల జనాభా 12 శాతం మాత్రమే. కానీ ఇప్పుడది 40 శాతానికి చేరుకుంది. నాకిది రాజకీయ సమస్య కాదు. జీవన్మరణ సమస్య. మనం ఎన్నో జిల్లాలను కోల్పోయాం’ అని హిమంత వ్యాఖ్యానించారు. 2021 జూన్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక హిమంత మాట్లాడుతూ.. ‘జనాభా విస్పోటం అస్సాం ముస్లింలలో పేదరికానికి, ఆర్థిక అసమానతలకు మూలకారణం’ అని అన్నారు. రాంచీలో బుధవారం బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ జార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో బంగ్లా చొరబాటుదారుల సంఖ్య పెరుగుతోందన్నారు. జార్ఖండ్‌ను సీఎం హేమంత్ మినీ బంగ్లాదేశ్‌గా మార్చేశారన్నారు. -
World Population Prospects 2024: జన భారతం @ 170 కోట్లు!
ఐక్యరాజ్యసమితి: భారతదేశంలో జనాభా విస్ఫోటం కొనసాగనుందని ఐక్యరాజ్యసమితి కుండబద్దలు కొట్టింది. ఈ శతాబ్దం చివరిదాకా అంటే 2100 సంవత్సరందాకా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌పేరు నిలిచిపోనుందని ఐరాస ప్రకటించింది. ప్రస్తుత ఏడాదిలో 145 కోట్లుగా ఉన్న భారతదేశ జనాభా 2060 దశకంలో ఏకంగా 170 కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది. ‘ ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024’ పేరిట ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాలు, జనాభా విభాగం తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలను ఐరాస అధికారి క్లేర్ మెనోంజీ వెల్లడించారు. ‘‘భారత జనసంఖ్య 170 కోట్లకు చేరుకున్నాక నెమ్మదిగా 12 శాతం క్షీణతతో కిందకు దిగొస్తుంది. ప్రస్తుత ఏడాది 820 కోట్లుగా ఉన్న ప్రపంచజనాభా 2080 దశకం మధ్యకల్లా 1030 కోట్లకు చేరుకుంటుంది. ప్రపంచజనాభా గరిష్ట స్థాయికి చేరుకున్నాక 2100 సంవత్సరంకల్లా 1020 కోట్లకు దిగివస్తుంది. జనాభాలో ఇప్పటికే చైనాను దాటేసిన భారత్ తన జన ప్రభంజనాన్ని 2100దాకా కొనసాగిస్తుంది. అంటే అప్పటిదాకా ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా భారత్ పేరిట రికార్డ్ పదిలంగా ఉండనుంది. భారత జనాభా 2054లో 169 కోట్లకు చేరుకుని 2100 నాటికి 150 కోట్లకు పడిపోనుంది’’ అని మెనోంజీ అంచనావేశారు.చైనాలో సగం జనాభా మాయం‘‘ప్రస్తుత ఏడాది 141 కోట్లుగా ఉన్న చైనా జనాభా 2054 కల్లా 121 కోట్లకు పడిపోనుంది. 2100 నాటికి 63.3 కోట్లకు మరింత తగ్గనుంది. 2024 నుంచి 2054 కాలంలో చైనా జనాభా వేగంగా తగ్గిపోనుంది. ఆ కాలంలో 20.4 కోట్లు తగ్గనుంది. జపాన్‌లో 2.1 కోట్లు, రష్యాలో కోటి జనాభా తగ్గిపోనుంది. 2100 నాటికి చైనాలోనే అత్యంత తక్కువ సంతాన సాఫల్యతా రేటు నమోదు కావ డమే ఈ జనాభా క్షీణతకు అసలు కారణం. 2100 కల్లా చైనాలో 78.6 కోట్ల జనాభా అంతరించిపోనుంది.126 దేశాల్లో జనాభా పైపైకి..2054 ఏడాదిదాకా ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల్లో మాత్రం జనాభా పెరుగుతూనే పోతుందని ఐరాస అంచనావేసింది. 2100 ఏడాదిదాకా ఈ పెరు గుదల ధోరణి గరిష్టస్థాయికి చేరుకోనుంది. భారత్, ఇండోనేసియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాల్లో ఈ జనాభా విస్ఫోటం కనిపించనుంది. తగ్గిన చిన్నారుల మరణాలు..ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 2023లో 5లక్షల లోపుకు దిగొచ్చాయి. ఇంత తక్కువగా నమోదవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. చిన్నారుల మరణాల్లో 95 శాతం జనాభా బాగా పెరుగుతున్న కాంగో, భారత్, పాకిస్తాన్, నైజీరియా వంటి 126 దేశాల్లో నమోదవుతున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుర్దాయం 73.3 ఏళ్లుగా నమోదైంది. 1995తో పోలిస్తే ఆయుర్దాయం 8.4 సంవత్సరాలు పెరగడం విశేషం. 2054 ఏడాదికల్లా ఆయుర్దాయం 77.4 సంవత్సరాలకు పెరగనుంది.అమెరికాను దాటేయనున్న పాక్ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు 2.25గా ఉంది. 1990లో ఇది 3.31గా ఉండటం విశేషం. సాధారణంగా ఉండాల్సిన 2.1 కన్నా తక్కువ రేటు ప్రపంచంలోని సగానికిపైగా దేశాల్లో నమోదవుతోంది. 2054కల్లా పాకిస్తాన్ జనాభా అమెరికాను అధిగమించి 38.9 కోట్లకు చేరుకోనుంది. ప్రస్తుతం అమెరికా జనాభా 34.5 కోట్లు. 2054లో పాక్‌కంటే తక్కువగా అమెరికాలో 38.4 కోట్ల జనాభా ఉండనుంది. 2100కల్లా 51.1 కోట్ల జనాభాతో మూడో అతిపెద్ద దేశంగా పాక్ అవతరించనుంది. -
World Population Day 2024 : ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
జనాభా పెరుగుతోంది...కానీ సంతానోత్పత్తి రేటు పడిపోతోంది!
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా జనభా విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుత (2024 నాటికి) ప్రపంచ జనాభా సుమారు ఎనిమిది బిలియన్లుగా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి గణనీయంగా పడి పోతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం.గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే జనాభా పెరుగుదల తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, పెరుగుతూనే ఉంది. వార్షిక జనాభా వృద్ధి రేటు కాలక్రమేణా క్షీణిస్తూ వస్తోంది. 20వ శతాబ్దం మధ్యలో ఇది దాదాపు 2 శాతంగా ఉండగా ఇదిపుడు ఒక శాతానికి పడిపోయింది.. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం , మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి వాటిని కారణాలుగా చెబుతున్నప్పటికీ, సంతానోత్పత్తి రేటు తగ్గడం కొంత ఆందోళన కలిగించే విషయంగతంలో జనన , మరణాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా జనాభా పెరుగుదల నెమ్మదించింది. ప్రచార అవగాహన, అభివృద్ధి నేపథ్యంలో జనన రేట్లు తగ్గాయి. అలాగే శిశుమరణాల రేటు కూడా తగ్గింది.ఆయుర్దాయం పెరగడం , జననాల రేటు తగ్గడం వల్ల, అనేక దేశాల్లో యువకుల సంఖ్య తగ్గుతోంది. వృద్ధుల నిష్పత్తి పెరుగుతోంది. ఇది ఆరోగ్య సంరక్షణ , సామాజిక వ్యవస్థలకు సవాళ్లను విసురుతోంది.పాపులేషన్ పిరమిడ్ (నిర్దిష్ట జనాభా వయస్సు ,లింగ కూర్పుతో ఏడిన గ్రాఫ్). అభివృద్ధి చెందిన దేశాలలో సమతుల్యాన్ని సూచిస్తూ దీర్ఘచతురస్రాకారంగా ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతరం ఎక్కువ ఉంటోంది. అందుకే ఇక్కడి పాపులేషన్ పిరమిడ్ , పిరమిడ్ ఆకారంలో ఉంటోంది.ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ కూడా బాగా పెరింది. 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 68 శాతం మంది నగరాల్లో నివరసిస్తారని అంచనా. పట్టణీకరణ మౌలిక సదుపాయాలు, పర్యావరణం, జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది.అధిక జనాభా ఆందోళనలు: ప్రపంచ జనాభా పెరుగుదల మందగించినప్పటికీ, అధిక జనాభా గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. వనరుల కొరత, పర్యావరణ క్షీణత , అవస్థాపనపై ఒత్తిడి క్లిష్టమైన సమస్యలని మరి కొందరు వాదిస్తున్నారు. సంతానోత్పత్తి రేటు2021లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం సంతానోత్పత్తి రేటు 1 (TFR) అంటే ఒక మహిళకు 2.3 మంది పిల్లలున్నారు. ఇదే 1965లో 5.1గా ఉంటే, 1970లో 4.8, 1980లో 3.7, 1990లో 3.3గా ఉండి 2000లో 2.8కి పడిపోయింది. 2000లో వేగం తగ్గింది. 2000-15 మధ్య 5 సంవత్సరాల సగటు 0.07తో పోలిస్తే, 2015- 2020 మధ్య ఒక్కో మహిళకు 0.17 మంది పిల్లలు తగ్గారు.ఇటీవలి లాన్సెట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లోనూ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతోందని, సంతానోత్పత్తి రేటు పడిపోతుందటమే దీనికి కారణం. అలాగే దేశంలో 1950లో 6.18గా సంతానోత్పత్తి రేటు, 2021నాటికి అది 2 కంటే దిగువకు పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి దేశంలో సంతానోత్పత్తి రేటు 1.3కు, 2100నాటికి 1.04కు పడిపోవచ్చని కూడా హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్లు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వెరసి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సంతానోత్పత్తి రేటులో తగ్గుదల.. ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపి దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.ఆసియాలో సంతానోత్పత్తి రేట్లుప్రతి స్త్రీకి 0.9 పిల్లలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్న దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. 1.0 వద్ద ప్యూర్టో రికో , మాల్టా, సింగపూర్ ,హాంగ్‌కాంగ్‌లో ఒక్కో మహిళకు 1.1 చొప్పున పిల్లలున్నారు.ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు, చైనా (1.7) ,భారతదేశం (2.2) సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి. ఈ రెండు గణాంకాలు ఈ దేశాలలో పునరుత్పత్తికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు, సాంస్కృతిక అంచనాల ద్వారా ప్రభావితమవుతాయి. ఉదాహరణకు చైనా సుమారు 1980 - 2016 వరకు ఒకటే బిడ్డ విధానాన్ని" కొనసాగించింది, అయితే ఆగస్టు 2021లో వివాహిత జంటలు ముగ్గురు పిల్లలను కలిగి ఉండవచ్చని అధికారికంగా ఒక చట్టాన్నిఆమోదించింది. ఇండియాలో కూడా అనధికారంగా చాలామంది జంటలు వన్ ఆర్ నన్ పద్ధతినే అవలంబిస్తుండటం గమనార్హం. -
World Population Day 2024 : జనం.. ప్రభంజనం..ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్!
ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటిస్తారు. నానాటికి పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, జనాభా పెరుగుదల సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ప్రపంచవ్యాప్తంగ ప్రజలలో అవగాహన తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది.1987, జూలై 11న ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న ("డే ఆఫ్ ఫైవ్ బిలియన్") రోజును పురస్కరించుకుని ఆరోజును "ప్రపంచ జనాభా దినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.ప్రపంచ జనాభా దినోత్సవం 2024 థీమ్యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) సమన్వయంతో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సంయుక్తంగా ప్రతీ ఏడాది ఒక్కో థీమ్‌ను నిర్ణయిస్తాయి ఈ సంవత్సరం థీమ్: 'ఎవరినీ వదిలిపెట్టవద్దు, ప్రతి ఒక్కరినీ లెక్కించండి (To Leave No One Behind, Count Everyone’)కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు ఐరాస లెక్కల ప్రకారం 20 ఏళ్ల తరువాత జూలై 11, 2007లో ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకుంది. .కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మాతృ ఆరోగ్యం , మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవ లక్ష్యం. ప్రపంచ జనాభా అధికారికంగా ప్రస్తుతం 8 బిలియన్లు దాటేసింది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే, భవిష్యత్ తరాలకు స్థిరమైన, స్నేహపూర్వక అభివృద్దికి అడ్డంకులను సృష్టిస్తుం దనేది ప్రధాన ఆందోళన. ప్రస్తుత ప్రపంచ జనాభా ఇరవయ్యవ శతాబ్దం మధ్యలో ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువ. అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు చైనా, భారతదేశం. ఈ రెండూ వందకోట్ల కంటే ఎక్కువ జనాభా ఈ దేశాల్లో ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 2050నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుతుందని ఐరాస అంచనా. అలాగే 2080ల మధ్యలో 10.4 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. -
ముగ్గురు పిల్లలను కంటే రుణమాఫీ..! ఎక్కడంటే..
జీవితాంతం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.. పెద్ద కారు కొనుక్కుంటే సబ్సిడీ కూడా ఇస్తారు. ప్రభుత్వమే క్రెచ్‌లు ఏర్పాటుచేసి మీ పిల్లల్ని సాకుతుంది.. ఏంటీ ఆఫర్ల సునామీ అంటారా..? ఉన్నాయ్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ రావాలంటే ఓ పని చేయాలి. అదేంపని.. ఎక్కడో అనుకుంటున్నారా అయితే ఈ ఆసక్తికరమైన వ్యవహారంపై ఓ లుక్కేయండి.ఓవైపు ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరుగుతుంటే.. కొన్ని దేశాలు మాత్రం జననరేటు క్షీణతతో ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపించడం లేదు. చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి ఆసియన్ కంట్రీస్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అటు యూరప్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. భవిష్యత్ తరం తగ్గిపోతోంది. వలసలపై ఆధారపడాల్సి వస్తోంది.ఐరోపా దేశం హంగేరీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. దీంతో జనాభా పెంచుకునేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఎక్కువమంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రకటించారు హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్. కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు జీవితకాలం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తామని తెలిపింది హంగేరీ సర్కార్. పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుక్కోడానికి.. సబ్సిడీని కూడా ఇస్తామని ప్రకటించి సంచలనం రేపింది. ప్రకటించింది. అంతేగాక, పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21వేల క్రెచ్‌లను ప్రారంభించినట్టు తెలిపింది. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని అభిప్రాయపడుతోంది హంగేరీ ప్రభుత్వం. ప్రస్తుతం హంగేరీ జనాభా దాదాపు 97 లక్షలు. కనీసం కోటి మంది కూడా లేని దేశం అన్నమాట. హంగేరీలో జనాభా సమస్య కొత్తేమీ కాదు. 1980 నుంచి అక్కడ జననాల రేటు తగ్గుతూ వస్తోంది.2000 సంవత్సరం నుంచి గణనీయంగా పడిపోయింది. దీంతో పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు.. 2019లో ఓ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది అక్కడి ప్రభుత్వం. 41 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ అంటే 33వేల అమెరికన్ డాలర్ల రుణ సదుపాయం కల్పించింది. పెళ్లయిన తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే, ఈ లోన్‌లో మూడోవంతును రద్దవుతుంది. ఒకవేళ ముగ్గురు అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే.. మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఆఫర్ ఇచ్చింది.విక్టోర్ అర్బన్ 2010 నుంచి హంగేరీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. వరుసగా ఐదోసారి ప్రధాని పదవి చేపట్టిన అర్బన్. వలస విధానంలో చాలా స్ట్రిక్ట్. ఇమ్మిగ్రెంట్స్ పెరిగిపోతే, హంగేరీ అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారుతుందని భావిస్తారు. అందుకే వలసదారుల విషయంలో జీరో టోలరెన్స్ విధానం అమలుచేస్తూ.. వివాదాస్పదంగా మారారు. వలసదారులు, నేటీవ్ హంగేరియన్స్కు పుట్టిన సంతానాన్ని మిక్స్డ్ పాపులేషన్‌గా అభివర్ణించి.. వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అయినప్పటికీ హంగేరీ కోసం కఠినంగా ఉండేందుకు వెనుకాడను అంటారు విక్టోర్ అర్బన్.వలసలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించుకునేందుకు..హంగేరీ మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనేలా ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నారు. జీడీపీలో 4 శాతం కుటుంబాల కోసమే ఖర్చు చేస్తోంది హంగేరీ ప్రభుత్వం. కొత్తగా పెళ్లైన జంటకు 24 నెలలపాటు నెలకు 5000వేల హంగేరియన్ ఫోరింట్స్ చెల్లిస్తోంది. వేతనాల్లో ప్రత్యేకంగా ఫ్యామిలీ అలవెన్సులు ఉంటాయి. పిల్లల సంఖ్య ఆధారంగా కొత్తగా ఇల్లు కట్టుకునే లేదా కొనుక్కునేవారికి సబ్సీడీలు అందిస్తోంది హంగేరీ ప్రభుత్వం. ఇన్ని ఆఫర్లు అమలుచేస్తున్నా.. 2010-2018 మధ్య హంగేరీలో ఫెర్టిలిటీ రేటు 0.30 శాతమే పెరిగింది. అందుకే మరిన్ని బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది హంగేరీ ప్రభుత్వం. మరి ఇవి ఎంతవరకూ వర్కౌట్ అవుతాయే చూడాలి మరి. -
‘వర్కింగ్ ఏజ్’ జనాభా తగ్గడమే పెద్ద సవాలు
జపాన్ దేశ ప్రజల జీవనశైలిలో మార్పులు, ఆర్థికవ్యవస్థలో మలుపుల కారణంగా అక్కడి నగరాల్లో మూడొంతుల జనాభా నివసిస్తోంది. దాంతో ఆ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి. దానికి సమీపంలోని మరో ఆధునిక ఆర్థికవ్యవస్థ దక్షిణ కొరియాలో జనాభా పెరుగుదల రేటు రోజురోజుకు తగ్గిపోతుండడంతో అక్కడ సంతాన సాఫల్య రేటును పెంచడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.‘మినిస్ట్రీ ఆఫ్ లో బర్త్ రేట్ కౌంటర్ ప్లానింగ్’ అనే పేరుతో దేశంలో జనాభా పెంచడానికి మార్గాలు ఆలోచించి, వాటిని అమలు చేసే శాఖను ఏర్పాటు చేయడానికి పార్లమెంటు అనుమతి కోరనున్నట్టు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెవల్ గురువారం ఓ టెలివిజన్ ప్రసంగంలో తెలిపారు. గత 65 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానాలుగా ఎదిగిన జపాన్, దక్షిణ కొరియాను ఒకేరకమైన ప్రత్యేక సమస్యలు పీడిస్తున్నాయి. జపాన్ నేడు 5 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానంలో ఉంది. 20 అగ్రస్థాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దక్షిణ కొరియా 14వ స్థానంలో, ఆసియాలో నాలుగో ర్యాంకులో ఉంది. ఆశించిన స్థాయిలో జనాభా పెరుగుదలకు కీలకమైన సంతాన సాఫల్య రేటు (ఫెర్టిలిటీ రేటు) బాగా తగ్గిపోవడం ఈ రెండు దేశాలను సంక్షోభాల వైపునకు నడిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెప్పుకోదగ్గ ఆర్థికాభివృద్ధి సాధించిన జపాన్, దక్షిణ కొరియాలతోపాటు ఆర్థికవ్యవస్థలో వేగంగా దూసుకుపోతున్న చైనాలో కూడా సంతాన సాఫల్య రేటు ఘననీయంగా తగ్గిపోవడం అక్కడ పాలకులను ఆందోళన కలిగిస్తోంది.ఈ ప్రమాదం ఇండియాకు ఉందా..?ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇండియా ఈ ఏడాది కొత్త రికార్డును సొంతం చేసుకుంది. భారత్‌లోనూ భవిష్యత్తులో సంతాన సాఫల్య రేటు కాస్త ఆందోళన కలిగించే స్థాయికి చేరే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ దేశంలోనైనా పనిచేసే వయసు కలిగిన ప్రజలు (వర్కింగ్ ఏజ్ పీపుల్) సరిపడా ఉండి, దానికి ఇతర కారణాలుతోడైతే ఆ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోంది. ఇతర కారణాలు బాగున్నా వర్కింగ్ ఏజ్ ప్రజలు సరిపడా లేకపోతే సమస్యలు తప్పవు. పారిశ్రామికాభివృద్ధి సాధించిన అనేక యూరప్ దేశాలకు ఇదే ప్రధాన సమస్య. యువ జనాభా బాగా తగ్గిపోవడం పాశ్చాత్య దేశాలకు చాలా ఏళ్ల కిందటి నుంచే పెద్ద ఇబ్బందిగా మారింది. కానీ, ఇతర దేశాలకు చెందిన నిపుణులు అక్కడకు వలస వెళ్లి స్థిరపడేలా వీలు కల్పించే విధానాలున్నాయి. దాంతో అమెరికా వంటి దేశాలకు ఇది అసలు ఆలోచించాల్సిన అంశమే కాదు.కొన్ని పశ్చిమాసియా దేశాల్లో కూడా సంతాన సాఫల్య రేటు ఆందోళన కలిగించేలా ఉన్నా వలస వచ్చి స్థిరపడుతున్న ప్రజలవల్ల ఈ సమస్యకు కొంత ఉపశమనం కలుగుతోంది. ఇలాంటి విధానాలు లేని జపాన్, దక్షిణ కొరియాకు ఇబ్బందులు తప్పడంలేదు. విదేశీ వర్కర్లు, ఉద్యోగుల వలసలను కఠినతరం చేసే పాలసీలు ఈ రెండు రాజ్యాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాగైనా వర్కింగ్ ఏజ్ జనాభా సరిపడా ఉండేలా ప్రభుత్వాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తు బంగారు బాట అవుతుంది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
100 శాతం ముస్లింలున్న దేశం ఏది?
ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న మతం ఇస్లాం . 2070 నాటికి ఇస్లాంను అనుసరించే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉండనున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2015తో పోలిస్తే 2060 నాటికి, మొత్తం ప్రపంచ ముస్లింల జనాభా 70 శాతం మేరకు పెరగనుంది. భారతదేశానికి పక్కనే ఉన్న మాల్దీవుల జనాభాలో 100 శాతం ముస్లింలు ఉన్నారు. అదే విధంగా ఆఫ్రికన్ దేశమైన మారిషస్‌లో 100 శాతం ముస్లిం జనాభా ఉంది. ట్యునీషియా మొత్తం జనాభాలో 99.8 శాతం మంది ముస్లింలు. సోమాలియా జనాభాలో 99 శాతం మంది ముస్లింను అనుసరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల్లో కూడా 99 శాతం మంది ఇస్లాంను అనుసరిస్తున్నారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశాల విషయానికొస్తే ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. మాల్దీవులను పన్నెండవ శతాబ్దం వరకు హిందూ రాజులు పరిపాలించారు. తరువాతి కాలంలో ఇది బౌద్ధమతానికి కేంద్రంగా మారింది. తమిళ చోళ రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ తర్వాత మెల్లగా మాల్దీవులు ముస్లిం దేశంగా మారడం మొదలైంది. మాల్దీవుల అధికారిక మతం ఇస్లాం. ముస్లిమేతరులు ఎవరూ మాల్దీవులలో పౌరసత్వం పొందలేరు. ముస్లిం జనాభాలో ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ముస్లింల సంఖ్య 23 కోట్లకు పైగా ఉంది. గత జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభా 18,68,90,601 కాగా, అందులో 18 కోట్ల 25 లక్షల 92 వేల మంది ముస్లింలు. పాకిస్తాన్లో హిందువుల సంఖ్య దాదాపు 22,10,000 కాగా, 74 వేలకు పైగా సిక్కులు ఉన్నారు. క్రైస్తవులు దాదాపు 18 లక్షల 73 వేలు, అహ్మదీలు 1,88,340. పార్సీలు దాదాపు 4000 మంది ఉన్నారు. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారత్‌లో ముస్లింల జనాభా 20 కోట్లకు పైగానే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 17.22 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఇది దేశ మొత్తం జనాభాలో 14.2 శాతం. ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్న దేశాలలో భారత్ ఒకటి. బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ ముస్లిం జనాభా 15 కోట్లకు పైగానే ఉంది. ఆఫ్రికన్ దేశం నైజీరియా ఐదవ స్థానంలో ఉంది. ఇస్లాం మతాన్ని అనుసరించే 11 కోట్ల మందికి పైగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. దీని తర్వాత ఈజిప్ట్ (11 కోట్లు), ఇరాక్, టర్కీ ఉన్నాయి. -
అప్పటికల్లా 10 కోట్ల మంది ధనికులు! అంతా లగ్జరీనే..
దేశంలో ధనికుల జనాభా వేగంగా పెరగుతోంది. వచ్చే నాలుగేళ్లలో 10 కోట్లకు చేరుకుంటుందని తాజాగా విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. వినియోగదారుల పోకడలు, సంపద గతిశీలతను పునర్నిర్మించడంలో ఇప్పటికే కీలక పాత్ర పోషించిన వీరు.. రానున్న రోజుల్లో లగ్జరీ వస్తువులు, నివాసాల కొనుగోలు, స్టాక్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతారని ఆ నివేదిక పేర్కొంటోంది. ‘ది రైజ్ ఆఫ్ అఫ్లుయెంట్ ఇండియా’ పేరుతో గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక భారత్‌లో ధనికుల జనాభా 2027 నాటికి 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో ధనికుల జనాభా 6 కోట్లుగా ఉంది. అంటే నాలుగేళ్లలో 67 శాతం పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఇలా 10 కోట్లకు పైగా ధనికులు ఉన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా 14 మాత్రమే ఉన్నాయి. ధనికులంటే.. వార్షిక ఆదాయం 10,000 డాలర్లు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు రూ.8.3 లక్షలు) అంతకంటే ఎక్కువ ఉన్నవారిని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక ధనికులుగా నిర్వచించింది. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్నవారి జనాభాలో 10 వేల డాలర్లు సంపాదిస్తున్నవారు 4 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
భారత్, యూఎస్.. ఓటర్ల శక్తిని పెంచే కొత్త సంవత్సరం 2024
ప్రపంచంలో అతిపెద్ద జనతంత్ర రాజ్యం ఇండియాలో, అత్యంత ఉత్కృష్ట ప్రజాస్వామ్య దేశంగా పరిగణించే అమెరికాలో 2024లో కేంద్ర ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటర్లు అప్పుడే సిద్ధమౌతున్నారు. ఈ జాతీయ ఎన్నికల్లో ఏయే అంశాల ఆధారంగా తాము ఓటేయాలో ఆలోచించడం మొదలుబెట్టారు. ఎన్నెన్నో వ్యత్యాసాలున్న ఈ రెండు విశాల దేశాలనూ కలిపే అంశం ఎన్నికల ద్వారా నడిచే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే. నిజానికి అమెరికా జనాభా 33 కోట్ల 49 లక్షలని, భారతదేశం జనసంఖ్య 142 కోట్లు దాటిందని ఈ ఏడాది తెలిసింది. ఇక భూభాగం విషయానికి వస్తే–ఇండియా కన్నా అమెరికా వైశాల్యం మూడు రెడ్లు ఎక్కువ. ఇతర దేశాల ప్రజలు లక్షల సంఖ్యలో వలసొచ్చి అమెరికాలో స్థిరపడడానికి అవసరమైన చోటు, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు, ఇతర వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో ఓటర్ల సంఖ్య విషయంలో ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. అన్ని పార్లమెంట్లకు మాతృక అని వర్ణించే బ్రిటిష్ పార్లమెంటు ఉన్న యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఆ దేశ సంపర్కంతో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. ‘కొత్త ప్రపంచం’గా అభివర్ణించే అట్లాంటిక్ మహాసముద్రం ఆవల ఉన్న ఈ సువిశాల అమెరికాలో ఎన్నికల ప్రజాస్వామ్యం ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 12 సంవత్సరాలకు ఆరంభమైంది. అక్కడ మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788 డిసెంబర్ 15న మొదలై 1789 జనవరి 7న ముగిశాయి. ప్రథమ అధ్యక్షుడిగా స్వాతంత్య్ర సేనాని జార్జి వాషింగ్టన్ ఎన్నికయ్యారు. అప్పటి నుంచీ 2020 ఎన్నికల వరకూ ఈ అత్యంత సంపన్న దేశంలో (ప్రతి నాలుగేళ్లకూ) 59 సార్లు జరిగాయి. వచ్చే ఏడాది నవంబర్ 5న 60వ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఇండియాతో పోల్చితే 163 ఏళ్ల ముందే ఎన్నికల ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన కారణంగా మనకు వింతగా కనిపించే ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అమెరికాలో కనిపిస్తాయి. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ కూడా ఇలాంటిదే. 18వ శతాబ్దం చివరిలో అమెరికాలోని వ్యవసాయ పనులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నవంబర్ మాసంలో తొలి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారంనాడు ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే ప్రతిసారీ నవంబర్ 7 లోపే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగడం చూస్తున్నాం. ఇండియాలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండేళ్లకే ఎన్నిక ప్రజాస్వామ్యం.. అమెరికాలో రాజ్యాంగ రచన పూర్తయి, మొదటి సాధారణ ఎన్నికలు జరిపించడానికి పుష్కర కాలం పట్టింది. కానీ, ఇండియాలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన (1950 జనవరి) నాటి నుంచి రెండేళ్లలోపే అంటే 1951 అక్టోబర్ 25న తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 1952 ఫిబ్రవరి 21న ముగిసింది. నాటి పరిస్థితులు, విస్తృతమైన ఎన్నికల నిర్వహణ అనుభవం లేకపోవడంతో ప్రథమ సాధారణ ఎన్నికలకు దాదాపు నాలుగు నెలల కాలం అవసరమైంది. ఇప్పుడేమో ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరగడం కోసం నెల రోజుల సమయం పడుతోంది. 2019 పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి నెలపైన వారం రోజుల సమయం అవసరమైంది. ఈ రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం విషయం ఓటర్ల నమోదు ప్రక్రియ. ఇండియాతో పోల్చితే పోలింగ్ శాతం బాగా తక్కువ ఉండే అమెరికాలో పోలింగ్ రోజు కూడా పొద్దున్నే ఓటరుగా నమోదు చేయించుకుని, తర్వాత ఓటు వేసే వెసులుబాటు అక్కడి పౌరులకు కల్పించారు. భారత్‌లో నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి. అలాగే, అమెరికాను దాదాపు 525 ఏళ్ల క్రితం క్రిస్టఫర్ కొలంబస్ కనిపెట్టినప్పటి నుంచీ అక్కడికి ఏటా లక్షలాది ప్రపంచదేశాల ప్రజలు వచ్చి స్థిరపడుతూనే ఉన్నారు. ఇలా ఉన్నత విద్య, ఉపాధి కోసం వచ్చిన వారందరికీ వెంటనే పౌరసత్వం రాదు. కోరుకోకపోతే కొందరికి ఎప్పటికీ రాకపోవచ్చు కూడా. ప్రధానంగా పని, నివాసం, ఇతర అంశాల వల్ల పౌరసత్వం వచ్చిన (నేచురలైజేషన్) వ్యక్తులు మొదట చేసే పని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం. ఎన్నికల్లో ఓటు వేయడాన్ని– తమ కృషిని గుర్తించి తమకు పౌరసత్వం ఇచ్చిన అమెరికా రుణం తీర్చుకోవడంలో భాగంగా ఈ పూర్వ వలసదారులు భావిస్తారు. ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారికి అత్యధిక సంఖ్యలో 2022లో అమెరికా పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కిందటేడాది నేచురలైజేషన్ ప్రక్రియ ద్వారా రికార్డు స్థాయిలో దాదాపు పది లక్షల మంది అమెరికా పౌరసత్వం పొందారు. ఈ నూతన పౌరులందరికీ 2024 నవంబర్ 5 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించింది. ఓటు వేయడాన్ని తమ శక్తిగా, దేశం రుణం తీర్చుకునే క్రియలో భాగంగా పరిగణించడం నిజంగా మంచి భావనే. ఈ సూత్రం ఇండియాకు కూడా వర్తిస్తుంది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి -
దక్షిణ కొరియాకు కొత్త భయం
సరిహద్దుల్లో ఉత్తర కొరియా కవ్వింపు చర్యలతో సతమతమయ్యే దక్షిణ కొరియాకు కొత్త భయం పొంచి ఉంది!. అయితే అది బయటి నుంచి కాదు. దేశ అంతర్గత సమస్య కావటం గమనార్హం. దక్షిణ కొరియాలో జననాల రేటు క్షీణిస్తోంది. సంతానోత్పత్తి తగ్గుదల భవిష్యత్తులో దేశ జనాభా క్షీణించడంలో తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు తెలుస్తోంది. తాజా గణాంకాల ప్రకారం సగటు జననాల రేటు 0.72గా నమోదైంది. ఈ తగ్గుదల ఇలాగే 2025 వరకు కొనసాగితే 0.65గా నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతకంతకు తగ్గుతున్న సంతానోత్పత్తి ఇలాగే కొనసాగితే దక్షిణ కొరియా జనాభా విషయంలో మరిన్ని ఇబ్బందలు ఎదుర్కోనుంది. ఇక 2022 ఏడాదిలో ప్రపంచంలో అతి అక్కువ సంతానోత్పత్తి 0.78 శాతంగా నమోదు చేసుకున్న దేశం దక్షిణ కొరియా కావడం గమనార్హం. దక్షిణ కొరియాలో జననాల రేటు తగ్గుదల.. ఆ దేశ అర్థిక వ్యవస్థ, శ్రాకమిక శక్తి, ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపనుందని అధికారులు పేర్కొన్నారు. అదీకాక ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉన్న దక్షిణ కొరియా.. సైనిక, రక్షణ రంగంలో కూడా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. జనాభా పరంగా చూసుకుంటే 2024లో 36.2 మిలియన్ల నమోదు కానుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జనాభా 51.7తో పోల్చుకుంటే దాదాపు 30 శాతం తగ్గుదల నమోదు కానున్నట్లు అంచనా. డిసెంబర్ నెల ప్రారంభంలో దక్షిణ కొరియా ఆర్థిక మంత్రి నామినీ చోయ్ సాంగ్ మాక్ దేశంలో జననాల రేటు క్షీణించడాన్ని ఓ ప్రమాదంగా పేర్కొన్నారు. చర్యలు చేపట్టడంలో చాలా ఆలస్యం జరిగిపోయిందని అన్నారు. చదవండి: హమాస్‌పై యుద్ధం: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక సూచన -
ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు!
ప్రపంచం మొత్తం దాదాపు 800 కోట్ల జనాభా ఉంది. ఇందులో నాలుగోవంతు భారత్, చైనాల్లోనే నివసిస్తోంది. ప్రస్తుతం చైనా జనాభా 141.7 కోట్లు, ఇండియా జనాభా 141.2 కోట్లు. ఈ ఏడాదిలోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. చైనా జనాభా 1990 నుంచి క్రమంగా తగ్గుతోంది. భారత్ జనసంఖ్య మాత్రం 2050 వరకు పెరుగుతూ 166.8 కోట్లకు చేరుతుందని సమాచారం. 2022-2050 మధ్య 46 పేద దేశాల్లో జనాభా పెరుగుతూ ఉంటే 61 దేశాల్లో ఏటా ఒకశాతం చొప్పున తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అనేక ఐరోపా దేశాల్లో జనాభా పెరుగుదల రేటు ఇప్పటికే బాగా క్షీణించింది. మున్ముందు మరింత క్షీణిస్తుందని సమాచారం. ఇదీ చదవండి: ‘రూ.1.8 లక్షలు చెల్లిస్తే రూ.5 కోట్లు’.. సీఈఓ ఏమన్నారంటే.. ప్రపంచంలో ప్రతిసెకనుకు దాదాపు నలుగురు, అంటే ప్రతి నిమిషానికి 259 మంది శిశువులు పుడుతున్నారని కొన్నిసర్వేల ద్వారా తెలుస్తోంది. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ అండ్ సోషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం.. ఏడాదిలో కొన్ని రోజుల్లోనే అధికంగా, మరికొన్ని రోజుల్లో తక్కువగా జననాలు నమోదవుతున్నాయని తెలుస్తోంది. అందుకు సంబంధించిన సర్వే వివరాలు ఆసక్తిగా మారాయి. సర్వే ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువ మంది సెప్టెంబర్‌లోనే పుడుతున్నారట.. నవంబర్, డిసెంబర్, జనవరి, జులై, ఫిబ్రవరిలోని ప్రత్యేక తేదీల్లో చాలా తక్కువ జననాలు నమోదవుతున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 9న చాలా మంది, ఫిబ్రవరి 29న తక్కువ మంది పుడుతున్నారని సర్వే వివరించింది. Most & least common day to be born: 1. Sept 9 2. Sept 19 3. Sept 12 4. Sept 17 5. Sept 10 6. July 7 7. Sept 20 8. Sept 15 9. Sept 16 10. Sept 18 357. Nov 25 358. Nov 23 359. Nov 27 360. Dec 26 361. Jan 2 362. July 4 363. Dec 24 364. Jan 1 365. Dec 25 366. Feb 29 According to… — World of Statistics (@stats_feed) November 25, 2023 -
ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్
భోపాల్: జనాభా నియంత్రణలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ప్రతిపక్షాల మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని గునా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన.. నితీష్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని అన్నారు. "భారత కూటమికి చెందిన ప్రధాన నాయకుడు బిహార్ అసెంబ్లీలో మహిళలపై అసభ్య పదజాలం ప్రయోగించాడు. భారత కూటమిలోని ఏ నాయకుడు దీనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది వారికి ఏమాత్రం అవమానకరంగా కనిపించట్లేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వ్యక్తులు మీకు ఏం మంచి చేయగలరు?మన అమ్మా, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవాళ్లు మన దేశాన్ని అవమానిస్తున్నారు"" అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఇంకా ఎంత దిగజారిపోతారని ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రశ్నించారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా ప్రముఖులు చిరునవ్వులు కురిపించారు. సీఎం వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అసెంబ్లీలో బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. నితీష్ వ్యాఖ్యలు అవమానకరమని తక్షణమే క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఎట్టకేలకు నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు
ఢిల్లీ: జనాభా నియంత్రణ అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ, ఢిల్లీ మహిళా ప్యానెల్ హెడ్ స్వాతి మలివాల్‌లు విరుచుకుపడ్డారు. నితీష్ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. "నితీష్ కుమార్ వ్యాఖ్యలు మహిళల హక్కులను భంగపరిచేవిలా ఉన్నాయి. ఇంతటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలి" అని జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్లో పేర్కొంది. 'నితీష్ మాట్లాడిన చెత్త వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించాయి. అసెంబ్లీలో వాడిన ఇలాంటి అవమానకరమైన, చౌకబారు పదజాలం మన సమాజానికి ఓ మరక. ప్రజాస్వామ్యంలో సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఆ రాష్ట్రంలో మహిళల దుస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.' అని రేఖా శర్మ అన్నారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. స్త్రీద్వేషి, పితృస్వామ్య స్వభావం అంటూ మండిపడింది. రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలతో నితీష్ కుమార్ ప్రజాస్వామ్యం గౌరవాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే దుయ్యబట్టారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఇదీ చదవండి: నోరుజారిన సీఎం నితీష్.. జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు -
ఆ ఊళ్లో జనాభా తక్కువ బొమ్మలే ఎక్కువ!
-
జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్లు పెరగలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదని.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పేర్ని నాని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను గురువారం కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 2014 నుండి 2019 వరకు, 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య హెచ్చుతగ్గులకు సంబంధించిన వివరాలను ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకూ ఓటర్ల జాబితాలో 30,08,032 ఓట్లు పెరిగాయని.. కానీ, 2019 నుంచి 2023 కాలంలో 38 వేల ఓట్లు తగ్గాయని వివరించారు. అదే విధంగా.. ఓటర్ల వృద్ధి చూసినట్లయితే 2014–19 మధ్య కాలంలో 8.1 శాతం మేర వృద్ధి నమోదైందని.. 2019 నుంచి 2023 మధ్య 0.09 శాతం క్షీణత నమోదైందని తెలిపారు. గతేడాది కంటే 2023లో నికర ఓట్ల సంఖ్య తగ్గిందని, దీనిని బట్టి నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోందన్నారు. 2019 ఓటర్ల జాబితా నుండి నకిలీ ఓట్లను తొలగించే అంశాన్ని పరిశీలించి, నకిలీ ఓట్ల విషయంపై సమగ్ర విచారణ జరపాలని పేర్ని నాని కోరారు. అలాగే, 2014–2023 మధ్య జనాభా వృద్ధి రేటు 1.1 శాతం వుందని, ఈ విధంగా చూస్తే నికర ఓటర్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గడంపై తమకు అనుమానాలున్నాయన్నారు. దీనికి కారణం 2014–19 సమయంలో తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున దొంగ ఓట్లను చేర్చడమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. -
సంతానోత్పత్తి తగ్గుముఖం..! తొలిస్థానంలో భారత్..!!
సాక్షి న్యూస్: "ఉన్నది పుష్టి మానవులకో యదు భూషణ.. ఆలజాతికిన్ తిన్నది పుష్టి.." అన్నారు తిరుపతి వెంకటకవులు ఓ పద్యనాటకంలో. మానవుడికి చేతిలో, వంట్లో, ఇంట్లో ఉన్నదే పుష్టికిందకు వస్తుంది. జంతువులకు అప్పటికప్పుడు తిన్నదే పుష్టి. కాబట్టి మానవుడు పుష్టిని సుష్టుగా సంపాయించుకొని ఉండాలన్నది సారాంశం. "ధాతు పుష్టి - వీర్యవృద్ధి సమృద్ధిగా ఉండాలి" అని చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి పదే పదే చెబుతుండేవాడు. తగ్గిపోతున్న సంతాన ఉత్పత్తిని చూస్తుంటే.. ఇవన్నీ గుర్తుకు రాక మానవు. అసలు విషయానికి వద్దాం. జనాభాలో ఒకటవ స్థానంలో ఉన్న చైనాకు మనం దాదాపుగా సమానంగా వచ్చేశాం. త్వరలో ఆ దేశాన్ని కూడా అధిగమించి, మొదటి స్థానానికి భారత్ చేరుకుంటుందని కొన్నాళ్ళుగా సర్వేలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా, జనాభా తగ్గుముఖం పడుతోందనే వార్తలు కొత్త ఆలోచనలను రేకేత్తిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ పరంగా, భారతదేశం అతి పెద్దది. అందుకనే అమెరికా, చైనా వంటి అగ్రదేశాల కళ్ళన్నీ మన పైనే ఉన్నాయి. మానవవనరుల సేవా రంగంలో భారతీయుల స్థానం విశిష్టమైనది. సమాచార సాంకేతిక రంగాల్లోనూ మనదే పై చేయి. The top 5 most populous nations and their fertility rates in 2023 1. 🇮🇳India 2.0 2. 🇨🇳China 1.76 3. 🇺🇸USA 1.76 4. 🇮🇩Indonesia 2.34 5. 🇵🇰Pakistan 3.03#fertility #population pic.twitter.com/HRpdNgrdyf — FacTrendStats (@factrendstats) September 13, 2023 ప్రగతి ప్రయాణంలో చైనాతో పోల్చుకుంటే మనం చాలా వెనుకబడి వున్నాం. జనాభాతో పాటు ఆర్ధికంగానూ బలమైనదిగా ఎదిగి,ఉత్పాదకత, పనిసంస్కృతిలోనూ చైనా ముందంజలో ఉంది. జాతి ఎదుగుదలలో,దేశ ప్రగతిలో మనిషి పాత్ర చాలా గొప్పది. అష్ట ఐశ్వర్యాలలో సంతానం కూడా ఒకటిగా భారతీయులు విశ్వసిస్తారు. అందుకే ఒకప్పుడు ఎక్కువమందికి జన్మనివ్వడంపై మక్కువ చూపించేవారు. క్రమంగా ఈ అభిప్రాయం మారుతూ వచ్చింది. ఆర్ధిక పరిస్థితులు, ఆరోగ్యం దృష్ట్యా సంతానోత్పత్తిని తగ్గించుకుంటూ వస్తున్నారు. ముగ్గురు లేదా ఇద్దరు,ఇద్దరు లేదా ఒక్కరూ అని మొదలై, చివరికి ఒక్కరే ముద్దు అనే ప్రచారాన్ని ప్రభుత్వమే చేపట్టింది. 'చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం'.. అనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది. ఈ క్రమంలో, 2019-2021లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటి వరకూ నమోదైన అత్యల్ప స్థాయి ఇదే. 2015-16లో 2.2శాతంగా ఉండేది. 1998-99లో ఈ రేటు 3.2గా ఉండేది. అంటే? భారతీయ మహిళ సగటున ముగ్గురికి జన్మనిచ్చేది. బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ తప్ప మిగిలిన రాష్ట్రాలన్నింటిలో సంతానోత్పత్తి సగటు కంటే కూడా తక్కువగా నమోదవుతోంది. TN doesn't have an exodus problem but Kerala does. https://t.co/JPshe2qmyT pic.twitter.com/UNPKl7ecD9 — Rishi 🗽🌐🔰🏙🥥 (@RishiJoeSanu) September 11, 2023 కుటుంబ నియంత్రణ సాధనాల వాడకం కూడా పెరుగుతూ వస్తోంది. గతంలో 54 శాతం ఉండేది. ప్రస్తుతం 67 శాతాన్ని దాటిపోయింది. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ధిక పరిస్థితులు,శారీరక దృఢత్వం తగ్గుతూ రావడం, లేటు వయస్సు పెళ్లిళ్లు, సౌందర్యం /గ్లామర్ తగ్గుతుందనే భయం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగై పోవడం మొదలైనవి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ మన సంఘ సంస్కర్తలు ఎందరో ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. ఆ దురాచారాన్ని దూరం చేయడానికి ఎంతో కృషి చేశారు.కానీ అది పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశంలో ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరికి 18 ఏళ్ళు నిండకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. వివాహ బంధాలు,ప్రేమ పెళ్లిళ్లు కూడా కలకాలం నిలవడం లేదు. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడానికి ఇవన్నీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 1950 ప్రాంతంలో, భారతీయ మహిళ సగటున ఆరుగురికి (5.9) జన్మనిచ్చేది. జనాభా పెరుగుదల వల్ల పోటీ పెరగడం, సదుపాయాలు తగ్గిపోవడం,వనరుల కొరత, అధిక ధరలు, డిమాండ్ - సప్లై మధ్య భారీ వ్యత్యాసం మొదలైన దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయి. #India may have edged out China as the world’s most populous country earlier this year, but it is facing a declining #fertility rate. India’s fertility rate faces sharp decline amid rising concern over lifestyle factors, infertility pic.twitter.com/w5iXXnf76s — Hans Solo (@thandojo) September 7, 2023 మహిళలలో అక్షరాస్యత పెరగడం తద్వారా ఉద్యోగాలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడంలో ఈ అంశాలు కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మానవ వనరుల సద్వినియోగం జరగకుండా, కేవలం జనాభా పెరగడం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. పేదరికాన్ని తగ్గించాలన్నా, అభివృద్ధిని సాధించాలన్నా, జనాభా ఉత్పత్తిలో సమతుల్యతను సాధించడమే శ్రేయస్కరం. శారీరక,మానసిక పటుత్వం సాధన దిశగా దృష్టి సారించడం అంతకుమించి అవసరం. మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..) -
ఎవరు పొట్టి..పొడుగు
ఇంట్లో, బయటా, ఆఫీసులో, మరో చోట.. ఎక్కడైనా ఎవరో ఒకరిని కలుస్తూ ఉంటాం. కొందరు మనకన్నా పొడుగ్గా ఉంటే.. మరికొందరు పొట్టిగా ఉంటుంటారు. ఇది సాధారణమే. కానీ కొన్ని ప్రాంతాల్లో వారు బాగా పొట్టిగా, మరికొన్ని ప్రాంతాల్లో వారు బాగా పొడుగ్గా ఉంటుంటారు. వారిలో తరాలుగా వస్తున్న జన్యువులకుతోడు స్థానిక వాతావరణం, ఉష్ణోగ్రతలు, జీవన విధానం, పని పరిస్థితులు, వైద్యారోగ్య సౌకర్యాలు, పోషకాహారం వంటివి మనుషుల ఎత్తులో తేడాలకు కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇన్సైడర్ సంస్థ ప్రపంచంలో ఎత్తు తక్కువ జనాభా ఉన్న 25 దేశాలతో నివేదికను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయా దేశాల ఆరోగ్యశాఖలు, వివిధ సర్వేలు, అధ్యయనాలను పరిశీలించి.. దీనిని సిద్ధం చేసింది. ఆయా దేశాల్లో బాగా పొడవుగా ఉన్నవారు కూడా ఉండొచ్చని, తాము సగటు ఎత్తును ప్రామాణికంగా తీసుకున్నామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను పరిశీలిస్తే.. దక్షిణాసియా, మధ్య ఆఫ్రికా దేశాల్లో జనంఎత్తు తక్కువగా ఉన్నారని నివేదిక పేర్కొంది. దాదాపు అన్ని దేశాల్లో కూడా మహిళల కంటే పురుషుల ఎత్తు ఎక్కువని తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా నెదర్లాండ్స్ దేశస్తుల సగటు ఎత్తు 175.62 సెంటీమీటర్లుకాగా.. అమెరికాలో 172.21, చైనాలో 161.45 సెంటీమీటర్లుగా ఉంది. -
పాపం.. జపాన్ భవిష్యత్తు అలా ఏడ్చింది
జపాన్‌లో అంతకంతకూ పెరుగున్న వృద్ధుల సంఖ్యకు తోడు తగ్గుతున్న జనాభా ఆ దేశానికి అనేక సవాళ్లను విసురుతోంది. భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ప్రభుత్వ డేటాలోని వివరాల ప్రకారం జపాన్‌లోని ప్రతి ప్రావిన్స్‌లో మొదటిసారిగా రికార్డు స్థాయిలో జనాభా సంఖ్యలో తగ్గుదల నమోదయ్యింది. జపాన్‌లో విదేశీ నివాసితుల సంఖ్య దాదాపు 3 మిలియన్లకు పెరిగింది. గత 14 ఏళ్లుగా జపాన్‌లో జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జపాన్ పౌరుల మొత్తం జనాభా 122.4 మిలియన్లు. ఇది 2021 నాటి జనసంఖ్య కంటే ఎనిమిది లక్షలు తక్కువ. 1968 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. జనాభాను భర్తీ చేయడంలో విదేశీ పౌరుల పాత్ర జపాన్‌లోని మొత్తం 47 ప్రిఫెక్చర్(ప్రాంతం)లలో పౌరుల సంఖ్య తగ్గింది. సాధారణంగా అధిక జనన రేటు కలిగిన ఒకినావా ప్రిఫెక్చర్లో కూడా జనాభా సంఖ్య క్షీణించింది. అయితే క్షీణిస్తున్న జనాభాను భర్తీ చేయడంలో విదేశీ పౌరులు పెద్ద పాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా రెసిడెన్సీ కార్డులు కలిగిన విదేశీయుల సంఖ్య 10 శాతం పెరిగింది. కోవిడ్-19 మహమ్మారి నుండి కోలుకున్న అనంతరం ఈ సంఖ్య మూడేళ్లలో మొదటిసారిగా పెరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చి జపాన్‌లో నివసిస్తున్న వారి సంఖ్య 2013 తర్వాత అత్యధికంగా ఉందని తేలింది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ జననాల రేటును ఎదుర్కొంటున్నాయి. అయితే జపాన్‌లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. విదేశీ జనాభాకు నిలయంగా టోక్యో జపాన్‌లోని ప్రతీ ప్రావిన్స్‌లో విదేశీ నివాసితుల సంఖ్య పెరిగింది. రాజధాని టోక్యో విదేశీ పౌరుల జనాభాకు నిలయంగా మారింది. దాదాపు ఆరు లక్షల మంది విదేశీయులు ఇక్కడ నివసిస్తున్నారు. అదేసమయంలో టోక్యోలో జపాన్ పౌరుల జనాభా తగ్గింది. అయితే విదేశీయుల చేరిక కారణంగా ఈ ప్రావిన్స్ మొత్తం జనాభా పెరిగింది. అకిటా ప్రిఫెక్చర్ జనాభా అత్యధికంగా 1.65 శాతం మేరకు తగ్గింది. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం 2067 నాటికి జపాన్ జనాభాలో 10.2 శాతం విదేశీయులు ఉంటారని అంచనా. విదేశీ నివాసితుల సంఖ్య పెద్ద నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతోంది. నిబంధనలను సడలించడంతో.. జపాన్‌లో కఠినమైన ఇమ్మిగ్రేషన్ నియమాలు అమలులో ఉన్నాయి. అయితే కార్మికుల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వాటిని క్రమంగా సడలిస్తోంది. ఇది విదేశీయుల రాకకు మార్గం సుగమం చేసింది. ఇక్కడ జనాభాలో 14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లల సంఖ్య 11.82 శాతంగా ఉంది. ఇది 0.18 శాతం తగ్గింది. 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 0.15 శాతం పెరిగి 29.15 శాతానికి చేరుకుంది. 92.4 శాతం ప్రిఫెక్చర్లలో జపాన్ జనాభా క్షీణించింది. ఈ సంవత్సరం జూన్‌లో దేశంలో పడిపోతున్న జనన రేటును అధిగమించడానికి జపాన్ ప్రభుత్వం $25 బిలియన్ల ప్రణాళికను ప్రారంభించింది. జపాన్‌లో జాతీయ విధానాలు జనాభా క్షీణతను ఆపడంలో విఫలమయ్యాయి. ఈ ధోరణి యువత,మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని సూచిస్తున్నది. ఇది కూడా చదవండి: మతోన్మాదం యూరప్ కొంప ముంచుతుందా? -
చినుకుతో వణుకు
యమునా నది ఢిల్లీ పరిధిలో 48 కి.మీ. మేరకు ప్రవహిస్తుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించింది. జూలై 10న సంభవించిన వరదల కారణంగా రాజధాని నగరానికి రూ.10 వేల కోట్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా. ఢిల్లీలో చిత్తడి నేలలు, బావులు, సరస్సులు వంటి జల వనరులు 1,040కి పైగా ఉన్నాయి. వీటికి అధికారిక గుర్తింపు లేదు. ప్రభుత్వం నోటిఫై చేయకపోవడంతో అవి సులభంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫలితంగా ఢిల్లీని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. నిజానికి దేశంలోని అన్ని చిన్నా పెద్దా నగరాలదీ ఇదే సమస్య... ♦ ఢిల్లీలో మురుగునీటి పారుదల వ్యవస్థ 1970ల నాటిది. నాటితో పోలిస్తే నగర జనాభా కనీవినీ ఎరగనంతగా పెరిగిపోయింది. ♦ దాంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. ఇక అడ్డగోలు నిర్మాణాలతో డ్రైనేజీ వ్యవస్థ కుదించుకుపోయి సమస్య మరీ పెద్దదవుతోంది. ♦ ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతం దాదాపుగా 97 చదరపు కిలోమీటర్లుంటుంది. నగర భూభాగంలో ఇది 7%. ఇందులో అత్యధిక భూభాగాన్ని ఆక్రమణలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు కట్టడానికి కేటాయించడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ♦ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం ఢిల్లీలో యమున వరద నీరు చేరే ప్రాంతాలు 600కు పైగా ఉన్నాయి. వీటిలో 60% వరకు నీరు లేక ఎండిపోయాయి. ఒక్క రోజులోనే అతి భారీ వర్షం కురవడంతో అవన్నీ ఇప్పుడు నీట మునిగాయి. ♦ పైగా వీటిలో చాలా ప్రాంతాలు ఆక్రమణలకు లోనయ్యాయి. వాటిని వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకొని లక్షలాది మంది బతుకుతున్నారు. మరెన్నో భూముల్ని అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించారు. 2010లో కామన్వెల్త్ క్రీడల కోసం నిర్మించిన గ్రామం, అక్షరధామ్ ఆలయం వంటివెన్నో వరద ప్రాంతాల్లోని ఆక్రమిత భూములపై నిర్మించినవే. ♦ చిత్తడి నేలలు సహజసిద్ధంగా నీటిని పీల్చుకొని భూగర్భ జలాలను పెంపొందిస్తాయి. కానీ ఢిల్లీలోని చిత్తడి నేలల్లో 200కు పైగా ఎండిపోయి ఆక్రమణలకు గురయ్యాయి. హతినికుండ్ వివాదం హరియాణాలో 1996లో కట్టిన ఈ ఆనకట్ట ద్వారా నీళ్లు యమున నది తూర్పు, పశ్చిమ కాలువల్లోకి ప్రవహిస్తాయి. హరియాణా ప్రభుత్వం ఈ బ్యారేజ్ గేట్లు ఎత్తేయడంతో నేరుగా యమున నదిలోకి వరద నీరు చేరి ప్రమాదకరంగా మారుతోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే తాము నిబంధనలకనుగుణంగానే వ్యవహరిస్తూ లక్ష క్యూసెక్కులు దాటితేనే నీటిని వదులుతున్నామని హరియాణా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నెల 10వ తేదీన హతినికుండ్ ప్రాజెక్టు నుంచి ఏకంగా 3.59 లక్షల క్యూసెక్కుల నీరు యమునలోకి వచ్చింది. అందుకే ఢిల్లీ నీట మునిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే 2010 వర్షాకాలంలో 7 లక్షల క్యూసెక్కుల నీరు హతినికుండ్ నుంచి విడదల చేసినప్పటికీ అప్పట్లో నగరానికి పెద్దగా ముప్పు రాలేదు. ఇప్పుడు మూడు లక్షల క్యూసెక్కులకే ముప్పు రావడానికి ఆక్రమణలు, అడ్డగోలు నిర్మాణాలే కారణమని సౌత్ ఆసియా నెట్వర్క్ ఆన్ డామ్స్, రివర్స్, పీపుల్ కోఆర్డినేటర్ హిమాంశు ఠక్కర్ అభిప్రాయపడ్డారు. చిత్తడి నేలల పునరుద్ధరణ.. వరద ప్రభావాన్ని తగ్గించాలంటే ఆక్రమణలను తొలగించి నదీ తీర ప్రాంతాలను పునరుద్ధరించాల్సిన అవసరం చాలా ఉంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన మెరుగుందుకు ప్రభుత్వం కృషి చేయాలి. యమునా నది పొంగి పొర్లకుండా ఢిల్లీకి రక్షణ కవచంలా ఉండే చిత్తడి నేలలు, సరస్సులు, చెరువుల వంటివి తగ్గిపోతున్నాయి. అవి లేకుండా యమున ప్రవాహం సవ్యంగా సాగదన్న అభిప్రాయాలున్నాయి. ఈ సరస్సులు, చెరువులు, బావుల వంటివి నీటిని స్టోరేజ్ చేయడం వల్ల డ్రైనేజీలోకి వెళ్లే నీటి ప్రవాహం తగ్గుతుంది. ‘‘నదుల వరదను శాపంగా చూడకూడదు. పరివాహక ప్రాంతంలో గడ్డివాములు, చెట్లు పెంచడం వంటివి చేస్తే వరద ముప్పు నుంచి తప్పించుకోవచ్చు’’ అని సీనియర్ సైంటిస్ట్ ఫయాద్ ఖుద్సర్ చెప్పారు. ఢిల్లీ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటోంది. నిర్మాణాలు పెరిగి కాంక్రీట్ జంగిల్‌గా మారింది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సన్నద్ధత లేదు. అందుకే నగరం ఇలా వరద ముప్పుకు లోనవుతోంది. – రితేశ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్, సౌత్ ఏషియా – సాక్షి , నేషనల్ డెస్క్ -
అసలు పుట్టేవాళ్లే తక్కువ.. మళ్లీ నియంత్రణ గోల ఏంటి?
వాషింగ్టన్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మరోసారి తప్పులో కాలేశారు. బాల్టిమోర్ లోని కొప్పిన్ స్టేట్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనం పొల్యూషన్(కాలుష్యం) తగ్గించుకుంటే భావితరాలు బాగుంటాయని చెప్పడానికి బదులు మనం పాపులేషన్(జనాభా) తగ్గించుకుంటే బాగుంటుందని నోరు జారారు. ఈ ప్రసంగం తాలూకు వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో కమలా హారిస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొప్పిన్ స్టేట్ యూనివర్సిటీ వారు నిర్వహించిన వాతావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(58) ముఖ్య అతిధిగా విచ్చేశారు. అయితే కార్యక్రమం పట్ల కొంచెమైనా అవగాహన లేకుండా హాజరైన ఆమె వైట్ హౌస్ వర్గాలు ఇచ్చిన స్క్రిప్తును యధాతధంగా చదివేశారు. వారిచ్చిన స్క్రిప్టులో మొదట పాపులేషన్ అని రాసి దాన్ని సరిచేస్తూ పక్కన బ్రాకెట్లో మళ్ళీ పొల్యూషన్ అని రాశారు. అయినా కూడా కమలా హారిస్ ప్రసంగ ప్రవాహంలో పొల్యూషన్ కి బదులు పాపులేషన్ అని చదివి కొత్త తలనొప్పని తెచ్చుకున్నారు. ప్రసంగం ఆమె మాటల్లో.. ఎలెక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తూ స్వచ్ఛమైన ఇంధన శక్తిపై పెట్టుబడి పెట్టి "జనాభాను తగ్గిస్తే" భావితరాలు స్వచ్ఛమైన వాయువును పీల్చుకుంటారని, పారిశుద్ధ్యమైన మంచినీరు తాగుతారని అన్నారు. ఇంధన శక్తిపై పెట్టుబడి పెట్టి జనాభాను తగ్గించడమేమిటని అక్కడివారు చాలాసేపు జుట్టు పీక్కున్నారు. చాలాసేపు సస్పెన్స్ తర్వాత గానీ వారికి అర్ధం కాలేదు.. కమలా హారిస్ పొరపాటుగా చదివారని.. ఆమె ఉద్దేశ్యం తగ్గించాల్సింది జనాభాని కాదు కాలుష్యాన్నని. తరవాత వైట్ హౌస్ వర్గాలు ఆమె ప్రసంగానికి సంబంధించిన కాపీని ప్రెస్ కు రిలీజ్ చేశారు. అందులో పాపులేషన్ పదాన్ని కొట్టేసి పొల్యూషన్ అని స్పష్టంగా రాశారు. అలవాటులో పొరపాటుగా ఆమె అదే చదివేశారు. ఇంకేముంది విమర్శకులు వారి అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. అసలు పుట్టేవాళ్లే తక్కువగా ఉంటే.. జనాభా తగ్గించమంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా అప్పుడప్పుడూ అర్ధజ్ఞానంతో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. విషయపరిజ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ పదేపదే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో కూడా ఆమె ఓ సారి కార్మికుల యూనియన్, పౌర హక్కుల నాయకుల సభలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) గురించి ప్రస్తావిస్తూ ఏఐ అంటే అది రెండక్షరాలు, యాంత్రిక సాయంతో అభ్యసించేదని అర్ధం అని చెప్పి తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో అద్భుతం.. తెగిన తలను అతికించారు.. -
దేశ జనాభా నియంత్రణపై బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో జనాభా నియంత్రణపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రస్తుతం దేశంలో జనాభా అత్యధికంగా ఉన్నదన్నారు. అందుకే దేశ జనాభా నియంత్రణకు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. దేశంలో జనాభా 140 కోట్లకు చేరుకున్నదని, ఇంతకుమించి అధికంగా జనాభా పెరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న జనాభాకు దేశంలో రైల్వే, ఎయిర్ పోర్టు, కాలేజీ, యూనివర్శిటీ, ఉపాధి కల్పన సేవలు అందించడమే చాలా ఎక్కువన్నారు. అందుకే పార్లమెంట్లో జనాభా నియంత్రణకు చట్టం చేయాలని, అప్పుడే దేశంపై అధికభారం పడదన్నారు. ఉత్తరాఖండ్‌కు తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందించినందుకు ప్రధాని మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌కు యోగా గురువు బాబా రామ్‌దేవ్ కృతజ్ఞతలు తెలిపారు. హరిద్వార్ అనేది ఉత్తరాఖండ్‌లో గర్వించదగిన ప్రాంతమని అన్నారు. ఢిల్లీ- డెహ్రాడూన్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడపడం ఆనందదాయకమన్నారు.ఇది దేవభూమికి దక్కిన గౌరవమని అన్నారు. గతంలోనూ బాబా రామ్ దేవ్ జనాభా నియంత్రణ గురించి మాట్లాడారు. ఏ కుటుంబంలోనైనా ఇద్దరికిమించి అధికంగా పిల్లలు ఉంటే వారికి కొన్ని హక్కులను వర్తింపజేయకూడదన్నారు. దేశంలో జనాభా పెరిగితే, ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందకు భారత్ సిద్ధంగా లేదన్నారు.దేశ జనాభా 150 కోట్లు దాటకుండా చూడాలని బాబా రామ్‌దేవ్ సూచించారు. -
జనాభాలోనూ గ్రేటరే..! 140 దేశాల కన్నా హైదరాబాద్ జనాభా ఎక్కువ
హైదరాబాద్ జనాభా దాదాపు 140 దేశాల కంటే ఎక్కువ. చాలా దేశాల జనాభా కోటికి లోపు ఉండటం గమనార్హం. ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం లెక్కల మేరకు 2020లో కోటి కంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 90 లక్షలపైన కోటి లోపు జనాభా ఉన్న దేశాలు ఆరు ఉన్నాయి. లక్ష జనాభా కంటే తక్కువగా జనాభా దేశాలు 35 ఉన్నాయి. మన దేశానికి వస్తే.. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే కూడా హైదరాబాద్ జనాభాయే ఎక్కువ. ఏదైనా రాష్ట్రం జనాభా అంటే కోట్లలో.. జిల్లా జనాభా అంటే లక్షల్లో ఉంటుందనేది మామూలే. కానీ మన గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా లక్షలనే కాదు.. కోటిని కూడా దాటేసింది. ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా మేరకు గ్రేటర్ హైదరాబాద్ జనాభా ప్రస్తుతం 1.05 కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం చివరినాటికి ఇది 1.08 కోట్లకు చేరనుంది. దేశంలో జనా భా లెక్కల గణాంకాల మేరకు.. వందేళ్ల క్రితం అంటే 1921లో హైదరాబాద్ జనాభా 4.05 లక్షలు. 2011 నాటి లెక్కల మేరకు హైదరాబాద్ జిల్లా జనాభా 67.31 లక్షలకు చేరింది. కరోనా కారణంగా 2021లో జనగణన నిర్వహించలేదు. అయినా సుమారు 82 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. అదే గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం తీసుకుంటే జన సంఖ్య కోటికి పైనే ఉంటుందని తేల్చారు. చదవండి: బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాలు -
జనాభా పెరుగుదల కలిసొచ్చేనా?
చైనాను అధిగమించి, ఇండియా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో యువశక్తితో కూడిన భారత్ కొంత ఈర్ష్య పుట్టించేదే. ఇదంతా కూడా యువజనానికి సరైన వేతనాలున్న ఉద్యోగాలు, ఉత్పత్తి అవకాశాలు ఉన్నాయని అనుకున్నప్పుడే. సమస్య మొత్తం ఇక్కడే ఉంది. ఉద్యోగాల్లో వ్యవసాయ రంగ భాగస్వామ్యం ఏకంగా 43 శాతం. చైనాలో ఇది 25 శాతమే. యువజనం ఉత్పాదకత పెరగాలంటే వారు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు రావాల్సి ఉంటుంది. భారత్ వ్యవసాయ సంబంధిత ఉద్యోగాలను 15 శాతం వరకూ తగ్గించాలనుకుంటే రాగల 25 ఏళ్లలో కనీసం 9.3 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది! ఈ క్రమంలో మనం చైనాను అధిగమించామని ఐక్యరాజ్యసమితి జనాభా డ్యాష్ బోర్డ్ అంచనా వేసింది. 2011 తరువాత దేశంలో జనాభా లెక్కల నిర్వ హణ జరగలేదు కాబట్టి ఐరాస అంచనాలపై మనం ఆధారపడాల్సి వచ్చింది. కోవిడ్ కారణంగా 2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్క లను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అధికారిక జన గణన ఎప్పుడు జరుగుతుందో ఇప్పటివరకూ ఎలాంటి సూచనా లేదు. జనాభా పెరిగిపోతోందంటే ఒకప్పుడు ఎంతో ఆందోళన వ్యక్తమ య్యేది. కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతున్న నేప థ్యంలో యువశక్తితో కూడిన భారత్‌ను కొంత ఈర‡్ష్యతో చూసే సందర్భం! ఐరాస లెక్కల ప్రకారం, దేశ జనాభా సగటు వయసు 28 ఏళ్లు. జనాభాలో సగం కంటే ఎక్కువ మంది వయసు ముప్ఫై ఏళ్ల లోపే. ఉద్యోగం లేదా పని చేసే వయసు 15 – 64 ఏళ్లనుకుంటే అలాంటివాళ్లు 92.5 కోట్ల మంది ఉన్నారు. వీళ్లు ఉత్పత్తి, వినియోగం, ఆదా కూడా బాగా చేయగలరు. అదే సమయంలో వయోవృద్ధుల సంక్షే మానికి పెట్టాల్సిన ఖర్చు తక్కువ. ఇక్కడ మనమో విషయం గుర్తుంచుకోవాలి. పైన చెప్పుకున్న అంచనాలన్నీ ఇతర అంశాలతో ముడిపడి ఉన్నవే. దేశంలోని యువ జనానికి సరైన వేతనాలున్న ఉద్యోగాలు, ఉత్పత్తి అవకాశాలు ఉన్నా యన్నది వీటిల్లో ఒకటి. ఉద్యోగాల ద్వారా వారికి తినేందుకు తగినంత ఆహారం, వినోదాలు అందుతున్నాయనీ, ఆరోగ్యం బాగుందనీ, పనికొచ్చే విద్యతో లాభాలు చేకూరాయనీ అనుకోవాలి. సమస్య మొత్తం ఇక్కడే ఉంది. ఉద్యోగాల్లో వ్యవసాయ రంగ భాగస్వామ్యం ఏకంగా 43 శాతం. చైనాలో ఇది 25 శాతమే. అమెరికాలో రెండు శాతం కంటే తక్కువ మంది ఉద్యోగాల కోసం వ్యవసాయంపై ఆధార పడుతున్నారు. ఒకవేళ భారత్ వ్యవసాయ సంబంధిత ఉద్యోగాలను 15 శాతం వరకూ తగ్గించాలనుకుంటే రాగల 25 ఏళ్లలో కనీసం 9.3 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. ఉద్యోగాల కల్పన జరగాలి యువజనం ఉత్పాదకత పెరగాలంటే వారు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు రావాల్సి ఉంటుంది. నగరీకరణ ఫలితంగా నగరాల మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పడుతుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని గమనిస్తే తయారీ రంగం బలహీనతలు కొట్టొచ్చినట్టు కని పిస్తాయి. మేకిన్ ఇండియా, ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహ కాలు (పీఎల్ఐ) వంటి పథకాలతో అధిగమించే ప్రయత్నం జరిగినా సాధించింది కొంతే. భారత ఆర్థిక వ్యవస్థ మొత్తమ్మీద తయారీ రంగం వాటా 14 శాతం మాత్రమే. చైనాలో ఇది దాదాపు 30 శాతం. ఉద్యోగాల విషయానికి వస్తే గత ఏడాది జూలైలో పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిస్తూ, 2014– 22 మధ్య కాలంలో ప్రభుత్వానికి 22.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయనీ, వీటిల్లో నియామక ఉత్తర్వులు అందుకున్నది కేవలం 7.22 లక్షలు లేదా 0.3 శాతం మాత్రమేననీ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని యువతకు ఉద్యోగాలు లేకపోవడమే కాదు... నిరాశా నిస్పృహలతో వాటి కోసం ఎదురు చూసే సహనాన్నీ కోల్పోయినట్లు కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, దేశ యువ జనాభాలో 30.7 శాతం అటు చదువుకోడం లేదు... ఇటు ఉద్యోగమూ చేయడం లేదు. అలా గని ఏదైనా శిక్షణ పొందుతున్నారా అంటే అదీ లేదు! గత ఏడాది అక్టోబరులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం... దేశంలో మునుపటి కంటే ఎక్కువ మంది పిల్లలు బడుల్లోకి చేరుతున్నారు. వదిలిపోయేవారు తక్కువ య్యారు. బోధన నాణ్యత, ఉపాధ్యాయుల సంఖ్యలు గత దశాబ్ద కాలంలో పెరిగాయి. అయితే ప్రాథమిక విద్యా రంగం చాలా సవాళ్లను ఎదుర్కొంటోందనీ, గ్రామీణ ప్రాంతాల్లో సాక్షరతను వృద్ధి చేయడం, అంకెలకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచడం వీటిల్లో కొన్ని మాత్రమేననీ తెలిపింది. ప్రాథమిక విద్యాభ్యాసం సమస్యలు ఒకవైపు అలా ఉండగా... ఉన్నత విద్య పరిస్థితి ఏమంత బాగోలేదు. కొత్త కాలేజీలు బోలెడన్ని పుట్టుకొస్తున్నా, విద్యారంగం పరిశ్రమ స్థాయికి చేరుకున్నా చాలా మంది పట్టభద్రుల నైపుణ్యాల స్థాయి తక్కువగా, కొన్ని సందర్భాల్లో అస్సలు లేకుండా పోయినట్లు బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటకు ఇవి స్పీడ్ బ్రేకర్లే. దేశం ఎదుర్కొంటున్న ఇంకో ముఖ్యమైన సవాలు పనిచేసే వారిలో మహిళల సంఖ్యను పెంచడం. అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కల ప్రకారం దేశంలో పని చేస్తున్న లేదా పనికోసం ఎదురు చూస్తున్న (లేబర్‌ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ లేదా ఎల్ఎఫ్పీఆర్) వారు 52 శాతం. మహిళలు అతితక్కువగా (22 శాతం) ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతూండటం ఇందుకు కారణం. ఎక్కువమంది భాగస్వాములయ్యే అమెరికాలో ఇది 73, చైనాలో ఇది 76 శాతం. వాస్తవానికి ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండవచ్చుననీ, ఎల్ఎఫ్పీఆర్ 40 శాతానికి తగ్గిపోయిందనీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెబుతోంది. మహిళల విషయానికి వస్తే అది కేవలం 19 శాతమేనని తేల్చింది. ఇది సౌదీ అరేబియా (31) కంటే తక్కువ కావడం గమనార్హం. సమస్యల జాబితా ఇక్కడితో ఆగిపోలేదు. ఆరోగ్యంపై దేశం పెడుతున్న ఖర్చు ప్రపంచంలోనే అత్యల్పం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (2019– 21) చెబుతున్న దాని ప్రకారం, దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో 35 శాతం మంది తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఎదగడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో ప్రతి పదివేల మంది పౌరులకు కేవలం ఐదు ఆసుపత్రి బెడ్లు ఉన్నాయి. చైనాలో ఈ సంఖ్య 43. అలాగే 15–49 మధ్య వయస్కులైన మహిళల్లో సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయత్నిస్తోందన్న దానికి నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే వ్యవస్థలు కొంతవరకూ నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రజా సేవల విష యంలో మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరముంది. ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు నిధుల కేటాయింపులు తక్కువగా ఉండటం మానవ వనరులపై దుష్ప్రభావం చూపుతుంది. ఇది కాస్తా ఉత్పాదకత తగ్గేందుకు, కార్మికులు, ఉద్యోగాలు చేసే వారిలో నైపుణ్యాల లేమికి దారి తీస్తుంది. జపాన్ , చైనా వంటి దేశాలు తమ జనాభాల కారణంగా ఎదిగేందుకు ఇవే కారణమన్నవి ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. భారత్ కూడా వీటి ఆధారంగానే వృద్ధి పథంలో అగ్రస్థానానికి చేరాలని ఆశిస్తోంది. అయితే జనాభా తీరు తెన్నుల వల్ల వచ్చే లాభాలు వాటంతటవే రావు. సుస్థిర ఆర్థికాభివృద్ధి కావాలంటే వినూత్నమైన విధానాలు, సమర్థమైన అమలు అత్యవ సరమవుతాయి. చైనా విషయాన్నే తీసుకుంటే... కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయడమే కాకుండా, తయారీ రంగంలో సూపర్ పవర్‌గా ఎదుగుతోంది. అయితే ప్రస్తుతం చైనా జనాభా తగ్గుముఖం పడు తోంది. దీంతో ఆ దేశం ఎదుర్కొనే సవాళ్లూ కూడా మారిపోతాయి. ఈ సవాళ్లలో ప్రధానమైంది తగ్గిపోతున్న కార్మిక శక్తి ఉత్పాదకతను వేగంగా పెంచాల్సిన అవసరం ఉండటం. చైనాకు కొన్ని లాభాలూ ఉన్నాయి. జనాభా తక్కువగా ఉండటం వల్ల పర్యావరణంపై దుష్ప్ర భావం తక్కువగా ఉంటుంది. నిరుద్యోగిత తగ్గి వేతనాలు పెరిగేందుకు దోహదపడవచ్చు. మనోజ్ జోషి డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెరుగని నేటి లభ్యత
-
ఇలాగైతే ‘నీళ్లు నమలాల్సిందే’
సాక్షి, అమరావతి: వరద జలాలను ఒడిసి పట్టడం.. భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి నీటి లభ్యత పెరగడం లేదనే అంశాన్ని స్పష్టంచేసింది. తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్ మీటర్లు (ఒక క్యూబిక్ మీటర్ వెయ్యి లీటర్లకు సమానం) ఉంటే.. 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోవడాన్ని గుర్తు చేసింది. నీటి లభ్యతను పెంచే చర్యలు చేపట్టకపోతే.. 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు, 2041 నాటికి 1,282 క్యూబిక్ మీటర్లకు, 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గిపోతుందని అంచనా వేసింది. ఇలాగైతే.. కష్టమే! పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని కేంద్ర జలసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సాగునీటి సమస్య పంటల సాగుపై ప్రభావం చూపుతుందని.. ఇది ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొంది. నీటి లభ్యతను పెంచేలా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాల్లో నిల్వ చేయడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జల సంక్షోభాన్ని నివారించవచ్చనని కేంద్రానికి సూచించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి.. నదీ జలాలను మళ్లించి వాటిని నింపడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవాలని స్పష్టం చేసింది. నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చుకోకుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదని తేల్చింది. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకుంటే ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించింది. సీడబ్ల్యూసీ అధ్యయనంలో ఏం తేలిందంటే ♦ దేశంలో ఏటా సగటున 1,298.60 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. తద్వారా 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. ♦ వర్షపాతం వల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా.. ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. ♦ ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలిసిపోతున్నాయి. అంటే వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్టు వెల్లడవుతోంది. ♦ దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యామ్‌ల నీటి నిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేస్తూ సాగు, తాగునీటి అవసరాల కోసం 24,367.43 టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నాం. ♦ ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. అన్ని జిల్లాల్లో కలిపి 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. -
ఈ జనాభాతో లాభమేనా?
కొద్ది నెలలుగా రకరకాల అంచనాలు అంటున్న మాటే... అనుకుంటున్న మాటే... మళ్ళీ ఖరారైంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశమనే కీర్తి ఇక భారత్‌దేనని ఈసారి ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది. అంచనాలు పాతవైనా, లబ్ధప్రతిష్ఠులు మరొకరు తొలిసారి అధికారికంగా సమర్థించడం విశేషమే. అందుకే, జనసంఖ్యలో దశాబ్దాలుగా ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న భారత్... ఈ ఏడాది మధ్యకల్లా 142.8 కోట్ల జనాభాతో, 30 లక్షలకు పైగా అధిక్యంతో, 142.5 కోట్ల చైనాను దాటేసి, నంబర్ వన్ అవుతుందన్న వార్త పతాకశీర్షికలకు ఎక్కింది. ‘ఐక్యరాజ్యసమితి జనాభా నిధి’ (యూఎన్ఎఫ్పీఏ) ఈ ఏటి ‘ప్రపంచ జనాభా స్థితిగతుల నివేదిక’లో ఈ సంగతి వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారం మేరకు తాము ఈ అంచనా కట్టినట్టు ఐరాస బుధవారం తెలిపింది. ఇంతకీ ఈ అత్యధిక జనాభా భారత్‌కు లాభమా, నష్టమా అన్నది అసలు పెద్ద చర్చ. జనాభాలో చైనాను భారత్ దాటేయడం 2020లలో జరుగుతుందన్నది ఎప్పటి నుంచో ఉన్న జోస్యమే. 2027లో ఇది జరుగుతుందని మొదట అంచనా. ఆ తర్వాత 2025కే జరుగుతుందని మాట సవరించారు. తీరా ఇది 2023లోనే జరిగిపోనుందని నిరుటి ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్’ నివేదిక పేర్కొంది. తాజాగా ఐరాస జనాభా నిధి ఈ ఏడాది మధ్యకల్లా అది నిజమవుతోందని తేల్చింది. ఈ లెక్కల్ని బట్టి 804.5 కోట్ల ప్రపంచ జనాభాలో మూడో వంతు పైగా భారత, చైనాలదే. అయితే, రెండు దేశాల్లోనూ జనాభా పెరుగుదల వేగం గతంతో పోలిస్తే తగ్గుతోంది. ఆ మాటకొస్తే, 1950 నుంచి ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు ప్రపంచ జనాభా పెరుగుదల అతి తక్కువ వేగంతో సాగుతోంది. నిరుడు ఇదే ఐరాస నివేదికతో పోలిస్తే చైనా జనసంఖ్య ఒక్క ఏడాదిలో 2.3 కోట్ల మేర తగ్గింది. ఉన్నట్టుండి పడిపోయిన చైనా జనసంఖ్య వల్లే భారత్ అధిక జనాభా పట్టం దక్కుతోంది. నిజానికి, భారత సొంత అంచనాల కన్నా ఐరాస నివేదిక తాజా జనాభా అంచనాలు కొంత ఎక్కువే. ఈ పరిస్థితుల్లో దేశంలో లెక్కకట్టి ఇందరే ఉన్నారని అసలు కథ చెప్పడం పదేళ్ళకోసారి చేసే జనగణనతో కానీ సాధ్యం కాదు. అలాగని అదీ పూర్తిగా దోషరహితమేమీ కాదు. 2011 జనగణన లోనూ ప్రతి వెయ్యి మందిలో 23 మందిని లెక్కపెట్టనే లేదట. అసలు 2011 తర్వాత మళ్ళీ ఆ గణన జరగనే లేదు. నిర్ణీత గడువైన 2021లో జరగాల్సిన జనగణన కరోనా పేరిట వాయిదా పడింది. తర్వాత అన్నీ సాధారణ స్థితికి చేరుకున్నా, కేంద్రం మాత్రం ‘చేస్తాం చేస్తా’మంటూ ఊరిస్తోందే తప్ప విధాన రూపకల్పనలో అతి కీలకమైన ఈ జనగణనకు నిర్ణీత షెడ్యూల్ ప్రకటించట్లేదు. ఏర్పాట్లూ చేయట్లేదు. ఈ జాప్యం ప్రతికూల పర్యవసానాలకు దారితీసే ప్రమాదం ఉంది. దేశపౌరులందరికీ ప్రాథమిక జీవన నాణ్యతా ప్రమాణాలను సైతం అందించడానికి ఇప్పటికీ సతమతమవుతున్న దేశానికి ఈ అధిక జనాభా ఒక రకంగా అవకాశం, మరో రకంగా సవాలు! కొందరి వాదన ప్రకారం 142 కోట్ల జనాభా అంటే అన్ని కోట్ల అవకాశాలు. ‘జనసంఖ్యతో వచ్చే లబ్ధి’ ఉంటుందని వారి మాట. నిజమే. జనాభాలో నూటికి 68 మంది యువత, అందులోనూ శ్రమ చేసే వయసులోని వారు కావడమనేది సానుకూలత. తద్వారా ప్రపంచంలో అతిపెద్ద శ్రామికశక్తి భారత్‌కు ఉన్నట్టవుతుంది. మరోపక్క జపాన్, దక్షిణ కొరియా లాంటి అనేక దేశాల్లో జనాభా తగ్గుతోంది. వయసు పైబడ్డ వారు పెరిగి, శ్రామికశక్తి తగ్గుతోంది! సమీప భవిష్యత్తులో ఆ దేశాల్లో శ్రామికులకు కొరత వస్తుంది. దీన్ని అందిపుచ్చుకొని, మన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో ఆ దేశాల శ్రామికశక్తి అవసరాలను తీర్చాలి. అలా చేయగలిగితే అధిక జనాభా మనకు కలిసొచ్చిన అదృష్టమే. అలాగని అధిక జనాభాతో వాటంతట అవే ప్రయోజనాలు ఊడిపడవు. ఒకదానికొకటి ముడిప డిన పలు అంశాలపై విధాననిర్ణేతలు దృష్టిపెట్టాలి. ‘జనాభా లబ్ధి’కే వస్తే, 2055 వరకు... భారత్‌లో వేరొకరిపై ఆధారపడ్డ వారి వాటాతో పోలిస్తే, 15 నుంచి 64 ఏళ్ళ లోపు వయసు శ్రామికశక్తి జనాభా వేగంగా పెరగనుంది. ఈ పెరిగే జనాభాకు మెరుగైన విద్య, ఉపాధి, ఆరోగ్య, గృహవసతి కల్పన ఒక సవాలు. అంటే పెరిగే జనాభాకు తగ్గట్టు ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన ధ్యేయంగా పాలకులు నడవాలి. కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలు తీరాక, అందరికీ ఉపాధి, వయోవృద్ధుల సంరక్షణ, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం రెండో అంశం. ఈ ప్రజాకాంక్షలకు తగ్గట్టు ప్రభుత్వాలు అడుగులు వేయలేకపోతే అసంతృప్తి పెచ్చరిల్లుతుంది. అలాగే, కొన్నేళ్ళ తర్వాత ఇప్పటి ఈ యువ జనాభా వృద్ధులవడంతో నేటి సానుకూలత పోయి, కొత్త సమస్య వస్తుందనీ గుర్తించాలి. సువిశాల భారతంలో సంతాన సాఫల్యతా రేటు మొత్తం మీద తగ్గుతున్నా, ప్రాంతాల్ని బట్టి తేడాలున్నాయి. నిరుపేద ఉత్తరాదిలో జనాభా వేగంగా పెరుగుతుంటే, సంపన్న దక్షిణాదిలో తగ్గుతోంది. ఫలితంగా దక్షిణాదికి వలసలింకా ఎక్కువవుతాయి. ఇది దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు వర్తించాలి. వలస కార్మికుల అనుకూల విధానాలు, పథకాలు చేపట్టాలి. అలాగే, మరో మూడేళ్ళలో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఇప్పుడున్న దాని కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లో జనసంఖ్య పెరుగుతున్నందున, జనాభా నియంత్రణే పాపమైనట్టు దక్షిణాది నియోజక వర్గాలు తగ్గిపోకుండా చూడాలి. ప్రాంతీయ, రాజకీయ ప్రాతినిధ్యాల్లో సమతూకం కాపాడాలి. మరో పక్క ఫలానా కులమతాల్లో జనాభా పెరుగుతోందన్న వాట్సప్ అజ్ఞాన అసత్య ప్రచారాలను సహించరాదు. జనాభా నియంత్రణకు కొత్త చట్టాల లాంటి యత్నాలూ చివరకు లింగనిష్పత్తిలో తేడాలకు కారణమవుతాయని గ్రహించాలి. వెరసి... అత్యధిక జనాభా కీర్తి మనదేశానికి ఓ ముళ్ళ గులాబీ. -
జనాభాలో చైనాను అధిగమించిన భారత్
-
జనాభాలో చైనాను దాటేశాం
న్యూఢిల్లీ: మరో మూడు నెలల తర్వాత జరుగుతుందనుకున్నది కొన్నాళ్ల క్రితమే జరిగిపోయిందా? జనాభాలో మనం చైనాను దాటేశామా? ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా అవతరించామా!! అవుననే అంటోంది వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్ల్యూపీఆర్) నివేదిక. గతేడాది చివరి నాటికే భారత జనాభా చైనా కంటే కనీసం 50 లక్షలు ఎక్కువని చెబుతోంది. 2022 డిసెంబర్ 31 నాటికి తమ జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. అదే రోజున భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ అంచనా వేసింది. తాజాగా బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పుకొచ్చింది. మాక్రోట్రెండ్స్ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం బుధవారం నాటికి భారత జనాభా 142.8 కోట్లు. మన జనాభాలో 50 శాతానికి పైగా 30 ఏళ్లో లోపు వయసువారే. కనుక దేశ జనాభా పెరుగుదల 2050 దాకా కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. 1961 తర్వాత తొలిసారిగా 2022లో తమ జనాభాలో తొలిసారిగా 8.5 లక్షల మేరకు తగ్గుదల నమోదైనట్టు చైనా మంగళవారం ప్రకటించడం తెలిసిందే. ఈ ధోరణి ఇలాగే కొనసాగి 2050 కల్లా ఆ దేశ జనాభా 131 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఆ సమయానికి భారత జనాభా 166 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. పదేళ్లకోసారి జరిగే ఆనవాయితీ మేరకు మన దేశంలో 2020లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. దాంతో మన జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు. -
పిల్లల్ని కనండి ఇంక్రిమెంట్ పొందండి.. ఉద్యోగులకు సిక్కిం సీఎం వరాలు!
భారత దేశ జనభా ఇప్పటికే దాదాపు 140 కోట్లు క్రాస్ చేసింది. జనాభా నియంత్రణ విషయంలో పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఒక్కరు ముద్దు.. ఇద్దరు వద్దు అంటూ ప్రకటనలు చేశాయి. కానీ, ఇందుకు భిన్నంగా ఈశాన్య రాష్ట్రం సిక్కిం సీఎం మాత్రం కొత్త పాలసీకి తెరలేపారు. జనాభాను పెంచాలన్నారు. పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్ ఉంటుందని భరోసా ఇచ్చారు. వివరాల ప్రకారం.. సిక్కింలో మాఘే సంక్రాంతి సందర్బంగా సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమాంగ్ మాట్లాడుతూ సిక్కింలో తమ జాతి జనాభాను పెంచాలన్నారు. మూడో పిల్లాడ్ని కంటే డబుల్ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధంగా చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు అందుతాయని ఆఫర్ ఇచ్చారు. అలాగే.. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్ ఇక్రిమెంట్‌తో పాటు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతి ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే, సిక్కింలో ఇటీవలి కాలంలో సంతనోత్పత్తి రేటు చాలా తగ్గిపోయిందన్నారు. అందుకే తమ జాతి జనాభాను పెంచాలని సూచించారు ఇదే క్రమంలో ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు అవసరమైన డబ్బును కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనే ఉద్యోగినులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తమాంగ్ వెల్లడించారు. ఐవీఎఫ్ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 38 మంది మహిళలు గర్భం దాల్చారని, కొందరు తల్లులు కూడా అయ్యారని తెలిపారు. కాగా, సర్వీసులో ఉన్న మహిళలకు 365 రోజుల ప్రసూతీ సెలవులు ఇస్తున్నారు. మగ ఉద్యోగులకు 30 రోజుల పితృత్వ సెలవులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా, సీఎం హామీలపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. -
జనాభాను నియంత్రించలేం
పాట్నా: జనాభా పెరుగుదలను అరికట్టే విషయంలో బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ రాష్ట్రంలో స్త్రీలు నిరక్షరాస్యులని, పురుషుల్లో నిర్లక్ష్యం ఎక్కువని, అందుకే జనాభా పెరుగుదలను నియంత్రించలేమని తేల్చిచెప్పారు. సమాధాన్ యాత్రలో భాగంగా ఆయన ఆదివారం వైశాలీలో బహిరంగ సభలో ప్రసంగించారు. మహిళలు చదువుకుంటే జనాభా తగ్గుతుందని, ఇదే వాస్తవమని అన్నారు. గర్భం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అక్షరాస్యులైన మహిళలకు తెలుస్తుందని వెల్లడించారు. జనాభా నియంత్రణపై పురుషులు సైతం దృష్టి పెట్టడం లేదని ఆక్షేపించారు. ఎక్కువ మంది పిల్లలను కనొద్దన్న ఆలోచన వారిలో ఉండడం లేదన్నారు. నితీశ్ కుమార్ వ్యాఖ్యలను ప్రతిపక్ష బీజేపీ నేత సామ్రాట్ చౌదరి తప్పుపపట్టారు. బిహార్ ప్రతిష్టను దెబ్బతీసేలా నితీశ్ మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించారని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
టోక్యోకు టాటా..!
జనాభా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తేనే అభివృద్ధి అంటున్న కిషిదా సర్కార్ రాజధాని పొమ్మంటోంది. తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపొమ్మంటోంది. జన ప్రభంజనం ఒక్కచోటే ఉంటే ఆ ఊరు తట్టుకోవడం కష్టం. అందుకే జపాన్ ప్రభుత్వం టోక్యోకు టాటా చెప్పేవారికి భారీగా తాయిలాలు ఆశ చూపిస్తోంది జపాన్ రాజధాని టోక్యోకు ఎందుకీ పరిస్థితి వచ్చింది...? డబ్బులిచ్చి మరీ జనాన్ని వెళ్లిపొమ్మని చెప్పడానికి కారణాలేంటి ? జపాన్ రాజధాని విడిచి పెట్టి వెళ్లిపోవడానికి అక్కడ ప్రభుత్వం భారీ తాయిలాలు ప్రకటించింది. కుటుంబంలోని పిల్లలకి ఒక్కొక్కరికి 10 లక్షల యెన్ అంటే భారత్ కరెన్సీలో రూ. 6 లక్షలు ఇస్తామని ఆశ చూపిస్తోంది. జపాన్‌లో జనాభా దేశవ్యాప్తంగా సమానంగా విస్తరించలేదు. అక్కడ నగరాలు, పట్టణాలు జనంతో కిక్కిరిసిపోతూ ఉంటే గ్రామీణ ప్రాంతాలు, చిన్న పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి. టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో జనాభా అంతకంతకూ పెరిగిపోతోంది.అందుకే కుటుంబంలో ఒక్కో పిల్లకి 10 లక్షల యెన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జపాన్‌కు ఇదేమీ కొత్త కాదు. మూడేళ్ల క్రితం కూడా టోక్యోకి టాటా చెప్పండంటూ 3 లక్షల యెన్లు ప్రకటించించింది. జనాలెవరూ రాజధాని వీడి వెళ్లడానికి ఇష్టపడ లేదు. దీంతో ఈ సారి ఇన్సెంటివ్ను భారీగా పెంచి 10 లక్షల యెన్లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెళ్లేవారికి ఈ ఇన్సెంటివ్ లభిస్తుంది. టోక్యో ఉక్కిరిబిక్కిరి జపాన్‌లో నానాటికి జనాభా తగ్గిపోతోంది. 1973 నుంచి ఆ దేశంలో జననాల రేటు తగ్గుతూ వస్తోంది. 2020–21 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6,44,000 మంది తగ్గిపోయారు. 2022 సంవత్సరం జనవరి–సెప్టెంబర్ మధ్య జపాన్‌లో కొత్తగా 5,99,636 మంది జన్మించారు. ప్రస్తుతం జపాన్ జనాభా 12.50 కోట్లు కాగా టోక్యో జనాభా 1.5 కోట్లు. దేశంలో మొత్తం జనాభాలో ఇంచుమించు 10శాతం మంది రాజధానిలోనే నివసిస్తున్నారు. ఈ నగరంలో జన సాంద్రత (చదరపు కి.మీ. నివసించేవారి సంఖ్య) 6,158గా ఉంది. జపాన్‌లో జనాభా తగ్గుతూ వస్తూ ఉంటే టోక్యోలో జనాభా గత దశాబ్దంలో 16% పెరిగింది. యువతీ యువకులు ఉపాధి అవకాశాల కోసం రాజధాని బాట పడుతున్నారు. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనాభాతో టోక్యో ఊపిరి పీల్చుకోలేకపోతోంది. 2020 నాటికి జపాన్‌లో జనాభాలో 52% మంది మూడు అతి పెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలైన టోక్యో, ఒసాకో, నగోయాలో నివసిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో 48% మంది ఉన్నారు.2050 నాటికి ఈ మూడు నగరాల్లోనే 57% మంది నివసిస్తారని, మిగిలిన ప్రాంతాల్లో 43% మంది ఉంటారని అంచనాలున్నాయి. దేశ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలన్నింటికీ టోక్యో కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే ముప్పు పెరిగిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే జనాభా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయా ? దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే జనాభా వికేంద్రీకరణ కూడా జరగాలని జపాన్ అధ్యక్షుడు ఫ్యూమియో కిషిదా భావిస్తున్నారు. అందుకే పల్లెలకు, ఇతర పట్టణాలకు కూడా ప్రజలు వెళ్లి స్థిరపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పల్లెల్లో కాలుష్యం లేని జీవనంపై ప్రత్యేకంగా వీడియోలు విడుదల చేస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. ప్రతీ ఒక్కరూ రాజధానిలో మకాం ఉంటే జరిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్యంతో పాటు నగరాల్లో ఉంటే సదుపాయాలన్నీ పల్లెల్లో కల్పిస్తోంది. ఏ ప్రాంతంలోనైనా జనం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కరోనా తర్వాత ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ కావడంతో టోక్యోలో ఉండాల్సిన పని లేదని, ఇతర చోట్లకు వెళ్లాలంది. 2019లో 71 కుటుంబాలు టోక్యోని వీడి వెళితే, 2021లో 1184 కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 2027 నాటికి ఏడాది 10 వేల కుటుంబాలు మకాం మారుస్తాయని అంచనాలు వేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అదొక్కటే ప్రమాణం కాదు! డీలిమిటేషన్‌పై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు
డీలిమిటేషన్‌పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గాల విభజనకు జనాభా మాత్రమే ప్రాతిపదిక కాకూడదని హిమంత బిస్వాశర్మ అన్నారు. కొత్తగా రూపొందించిన నాలుగు జిల్లాల విలీనానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ఒకరోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి డీలిమిటేషన్ కోసం జిల్లాల విలీనానికి మంత్రి వర్గం ఆమోదం తెలపలేదని, కేవలం పరిపాలనపరమైన చర్యల కోసమే అలా చేశామని తేల్చి చెప్పారు. ఐతే ఈ డీలిమిటేషన్ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ విషయమై తాము పార్లమెంటు చేసిన చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పారు. అలాగే జనాభాను నియంత్రించమని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను కోరిందని, కానీ కొన్ని ప్రాంతాల్లో దీన్ని పాటించలేదని ముఖ్యమంతి హిమంత బిస్వా శర్మ అన్నారు. అంతేగాదు తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ప్రస్తుత చట్టం ప్రీమియం ఇస్తుంది కాబట్టి పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగాలన్నారు. ఈ డీలిమిటేషన్ అనేది దేశంలో లేదా శాసన సభ ఉన్న రాష్ట్రంలో ప్రాదేశిక నియోజకవర్గాల పరిమితులు లేదా సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. కానీ ఇది స్వదేశీయుల హక్కులను, భవిష్యత్తును రక్షించలేకపోయిందని అన్నారు. ఈ డీలిమిటేషన్ కసరత్తు మన సమాజాన్ని కాపాడుతుందని, అలాగే అసెంబ్లీ లోపల జనాభా మార్పును కాపాడుతుందని అన్నారు. దీన్ని రాజకీయేతర రాజ్యంగ కసరత్తుగా అభివర్ణించారు. కాగా విలీన ప్రణాళిక ప్రకారం..బిస్వనాథ్ జిల్లాను సోనిత్‌పూర్‌లో, హోజాయ్ను నాగావ్‌లో, తముల్పూర్ జిల్లాను బక్సాలో, బజలి జిల్లాను బార్పేట జిల్లాలో విలీనం చేశారు. ప్రస్తుతం అస్సాంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతున్నందున జనవరి 1, 2023 నుంచి అస్సాం ప్రభుత్వం ఏ జిల్లాలు లేదా పరిపాలన విభాగాలలో ఎటువంటి మార్పులు చేయకూడదని నిర్దేశిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు) -
BC Census: బీసీ జన గణనతోనే న్యాయం
జనాభా కులాలుగా విడగొట్ట బడిన దేశం మనది. ఆధిపత్య కులాలు దేశంలోని భూమి, ఇతర వనరులు; విద్య, ఉద్యోగ అవకాశాలను అధికంగా అను భవిస్తున్నాయి. సంపద వారి చేతుల్లో ఉన్నందు వల్ల చదువు కోగలరు కాబట్టి... ఉద్యోగావకాశాలూ సహజంగా వారికే అధికంగా లభిస్తాయి. అయితే దేశంలో సంఖ్యాపరంగా వీరి సంఖ్య తక్కువ. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా అధికంగా ఉంది. రాజ్యాంగం అందరికీ సమాన అవ కాశాలు వాగ్దానం చేసింది. అవకాశాల్లో సమాన భాగం కాకపోయినా... కనీస భాగం పొందాలంటే రిజర్వేషన్లు ఒక్కటే మార్గమని రాజ్యాంగ సభ భావించి రాజ్యాం గంలో అందుకు తగిన ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కాలంలో కొత్త కులాలనూ, వర్గాలనూ రిజర్వేషన్ వర్గాల్లో కలపడంతో రిజర్వేషన్ వర్గాల వారికి అవకాశాలు పలుచబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కులాల జన గణన జరిగితే ఎవరి దామాషా ప్రకారం వారు అవకాశాలను పొందవచ్చుగదా అనే ఆలోచన బయలుదేరింది. ముఖ్యంగా వందలు, వేలా దిగా ఉన్న బీసీ కులాలు ఈ డిమాండ్‌ను బలంగా విని పిస్తున్నాయి. ఇలా కుల గణన జరిగితే ఒనగూరే ఇతర ప్రయోజనాలనూ వారు పేర్కొంటున్నారు. వెనుక బడిన మెజార్టీ ప్రజల సంక్షేమానికి తగిన పథకాల రూపకల్పనకు ఈ డేటా చాలా అవసరం. విద్య, ఉద్యోగ రంగాల్లో ఎవరి వాటా వారు పొందడానికి వీలు కలుగుతుంది. ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావచ్చు. ఫలితంగా అత్యధిక పేదలు ఉన్న బీసీల్లో తమ వాటా తమకు లభిస్తుందన్న సాంత్వన లభిస్తుంది. ఎవరి వాటా వారికి లభిస్తే సామాజిక అశాంతి తగ్గి శాంతి భద్రతలు మెరుగవుతాయి. ప్రభుత్వం తన దృష్టిని అభివృద్ధి కార్యక్రమాలపై నిలపడానికి అవకాశం ఏర్పడుతుంది. కులగణనపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం... కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనపరంగా కష్టమని తెలిపింది. దీంతో బీసీలు బాగా అసంతృప్తికి లోనయ్యారు. 1931 కులగణన తర్వాత బీసీ జనగణన జరగలేదు. అయితే 1979లో జనతా ప్రభుత్వం బీపీ మండల్ సారథ్యంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారిని గుర్తించి వారి అభివృద్ధికి సిఫార్సులు చేయమని ఒక కమిటీని నియమించింది. ఈ మండల్ కమిషన్ 1980లో సమర్పించిన నివే దికలో భారత్ మొత్తం జనాభాలో 52 శాతం వెనుక బడిన తరగతులవారేననీ, వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ సిఫార్సు చేసింది. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం అనేక సిఫార్సులు చేసినా అవన్నీ అటకెక్కాయి. 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అత్యంత దారుణ వ్యతిరేక పరిస్థితుల్లో అమలులోకి వచ్చాయి. నిజానికి ఇప్పుడు బీసీల జనాభా మరింతగా పెరిగి ఉండాలి. వారూ వీరూ చెప్పే లెక్కలన్నీ కాకి లెక్కలే. ఒక్కసారి కుల గణన జరిపితే అభివృద్ధి ఫలాల్లో ఎవరి వాటా వారు అడగడానికి వీలు ఉంటుంది. సామాజిక న్యాయం సాకారమవుతుంది. (చదవండి: కులాంతర వివాహాలు శాస్త్రబద్ధమే) - డాక్టర్ పరికిపండ్ల అశోక్ సామాజిక కార్యకర్త -
2050 నాటికి వెయ్యికోట్లు మించిపోతే, పరిష్కారం ఏమిటి? లోపం ఎక్కడుంది?
2050 నాటికి ప్రపంచ జనాభా మరో 250 కోట్లు పెరుగుతుందని అంచనా. అప్పటికి అందరికీ సరిపడ ఆహారాన్ని సాధించాలంటే వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలని నిపుణులు లెక్కలు చెబుతున్నారు. అవి కాగితాలపై లెక్కలే. అసలు లెక్క వేరే ఉంది. ఆహార ఉత్పత్తులను పెంచినంత మాత్రాన అవి పేదల ఇళ్లకు చేరతాయా? చేరవు. చేరాలంటే పేదల దగ్గర అవి కొనుగోలు చేసే స్థోమత ఉండాలి. ప్రపంచంలోనే అత్యధికంగా అసమానతలు ఉన్న దేశం మనది. ఇప్పటికీ సమాజపు అట్టడుగు వర్గాల జీవితాలు అత్యంత దుర్భర ప్రాయం. వాళ్ల జీవితాలు బాగు చేయకుండా జీవన ప్రమాణాలు పెంచకుండా వ్యవసాయ ఉత్పత్తులు ఎంత పెంచితే మాత్రం ఏంటి లాభం? పెరిగే జనాభా కలసి కట్టుగా ఆప్యాయంగా కలిసి జీవనం సాగించేలా పరిస్థితులను నెలకొల్పుకోగలమా అసలు? మన ముందున్న సవాల్ అతి పెద్ద సవాల్ ఇదే. అందరూ దృష్టి సారించాల్సింది కూడా దీనిపైనే.సంపద పంపిణీలోనే పెద్ద లోపం ఉంది. లోపం ఎక్కడుందో కనుక్కుని తక్షణమే దాన్ని సరిదిద్దుకోవల్సిన అవసరం ఉంది. మనుషుల మధ్య మానవ సంబంధాలు ఆరోగ్యకరంగా ఆప్యాయంగా ఉండాలి. (ప్రపంచ జనాభా 800 కోట్లకు: తిండి, నీళ్లు దొరకవా? ఏం చేయాలి?) ఇన్ని వర్గాలూ ఒక్కతాటిపై ముందడుగు వేసి ఒక్కటిగా మనుగడ సాగించేలా చేయగలగడంపై దృష్టి సారించాలి. అది సాధ్యమా? తమ రాజకీయ ప్రయోజనాల కోసం మానవహక్కులను ఉక్కుపాదాలతో తొక్కేసి మానవ సంబంధాల మధ్య చిచ్చు రేపి మనుషుల మధ్య విద్వేషాలు రగిల్చే పరిస్థితులు పోనంత వరకు మనుషులంతా ఒక్కటే అన్న ఆలోచన రావడం చాలా కష్టం. యంగిస్థాన్ పరిస్థితి ఏంటి? చైనా, అమెరికాల తర్వాత భారత దేశం ఆర్ధికంగా దూసుకుపోతోందని గర్వపడుతున్నాం. ఇంగ్లాండ్, ఫ్రాన్స్,జర్మనీ వంటి యూరప్ దేశాలను దాటేసి ముందడుగు వేస్తున్నామని ఆనందిస్తున్నాం. అన్నింటినీ మించి ప్రపంచంలోనే ఏ దేశానికీ లేనంతటి యువశక్తి ఒక్క భారత్ కే ఉందని పొంగిపోతున్నాం. యంగిస్థాన్ అని మురిసిపోతున్నాం. మరి అదే యంగిస్థాన్ లో యువతకు ఎంత నాణ్యమైన విద్య అందుతోందని ఆరా తీస్తే గుండెలు గుభేలు మంటాయి. అంతర్జాతీయ స్థాయి విద్య ఎంతమందికి అందుతోంది? ఎక్కువ మంది యువత ఉండేది గ్రామాల్లో. అక్కడ సరియైన విద్యాసంస్థలే లేని పరిస్థితి ఉంది. బడ్జెట్ లో విద్యారంగంపై అరకొరగా నిధులు కేటాయిస్తోన్న నేపథ్యంలో ముందుగు ప్రభుత్వం దృష్టి సారించాల్సింది విద్యావ్యవస్థపై కాదా? ఏదో ఒక చదువు చదివేశాంలే అనుకుంటే ఇపుడు యంగిస్థాన్గా ఉన్న భారత దేశమే 20 ఏళ్ల తర్వాత ఓల్డిస్థాన్ గా మారిపోతుంది. ఆ ఓల్డిస్థాన్ లోని వృద్ధులైనా తమ కాళ్లపై తాము నిలబడి సమాజానికి పనికొచ్చేది ఏమైనా చేయగలరా అంటే చెప్పడం కష్టమే అంటున్నారు మేథావులు.జనాభా పెరుగుతుంది.జనాభాతో పాటే పెరగాల్సినవి అవకాశాలు. విద్యాప్రమాణాలు. యువతకు ఉద్యోగ అవకాశాలు. ప్రగతి పథంలో దూసుకుపోడానికి అవసరమైన సదుపాయాలు. అన్నింటినీ మించి ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు. అవి పెరగాలి. అంతే కానీ జనాభాతో పాటు కేవలం ఆహార ఉత్పత్తులు పెంచేస్తే ఒరిగేదేమీ ఉండదు. ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి. దానికి తగ్గట్లు వారి ఆదాయాలు పెంచాలి. అలా చేయాలంటే వారికి ఉపాధి అవకాశాలు పెంచాలి. దానికోసం కొత్త అన్వేషణలు చేయాలి. అందుకోసం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలి. వాటిని నామమాత్రంగా కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలి. ఇప్పటికీ అంటరాని తనాన్ని రూపు మాపలేని నిస్సహాయ స్థితిలో గ్రామాలు ఉన్నాయంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచమంతా జీరో హంగర్ లక్ష్యాన్ని సాధించాలని నిశ్చయించుకుంది. అయితే కోవిడ్ పాపమా అని అది సాధ్యం కాలేదు. కేవలం అందరి కడుపులు నింపడమే పరిష్కారం కాదు. అదే అభివృద్ది కాదు. ఒకపక్క పూట గడవడమే గగనమయ్యే దుర్భర పేదరికం. మరో వైపు విందులు వినోదాల పేరుతో లక్షల కోట్ల విలువ చేసే ఆహారాన్ని వృధా చేసే నిర్లక్ష్యం. ఆహార వృధాను అరికట్టినంత మాత్రాన పేదల ఆకలి తీరదు. వృధాను అరికడుతూనే పేదల కడుపుల్లో కి బువ్వ చేరే ఆలోచనలు చేయడం ముఖ్యం. ఇది చెప్పుకున్నంత తేలిక కాదు. మాట్లాడుకున్నంత ఆషామాషీ కాదు. బలమైన సంకల్పం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. కాకపోతే అది తప్ప వేరే దారీ లేదు. గుక్కెడు పాలు అందక ఏటా కోట్లాది మంది చిన్నారులు తలలు వాల్చేస్తోన్న విషాదాలు కళ్ల ముందు కరాళ నృత్యాలు చేస్తూనే ఉన్నాయి. వాటిని చూసి అయినా మనసులో ఎక్కడో మూల చివుక్కుమనకపోవడమే దుర్మార్గం. ఒక్క భారత దేశమే కాదు యావత్ ప్రపంచం చూడాల్సింది దీన్నే పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, ఆదాయ మార్గాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అంటున్నారు మేథావులు. అన్నింటినీ మించి మనుషులంతా అన్యోన్యంగా కలసి మెలసి ఆనందంగా జీవించే వాతావరణాన్ని సృష్టించాలని వారు సూచిస్తున్నారు. కేవలం ఆహార ఉత్పత్తులను పెంచేసి చేతులు దులుపుకుంటే దమ్మిడీ ప్రయోజనం ఉండదని వారు అంటున్నారు. భిన్న వర్గాలు,కులాలు,తెగలు ఉన్న భారత్ వంటి దేశంలో అంతా ఒక్కతాటిపైకి వచ్చి హాయిగా జీవించాలంటే అసమానతలకు చరమగీతం పాడాలని హితవు పలుకుతున్నారు. ఆ దిశగా అడుగులు పడాలని వారంటున్నారు. పెరిగిన జనానికి అనుగుణంగా వనరులను పెంచుకోవాలి. ఉన్న వనరులు ఆవిరైపోకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. కొత్త అవకాశాలు సృష్టించుకోవాలి. రేపటి తరానికి ఎదిగేందుకు అవసరమైన చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించాలి. అంతిమంగా మనుషుల మధ్క మంచి సంబంధాలు ఉండేలా మానవ హక్కులకు పెద్ద పీట వేస్తూ పాలకులు ముందుకు సాగాలి. అప్పుడే ఈ భూమే ఓ స్వర్గం అవుతుందంటున్నారు మేథావులు. -సీఎన్ఎస్ యా జులు, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
ప్రపంచ జనాభా 800 కోట్లకు: తిండి, నీళ్లు దొరకవా? ఏం చేయాలి?
మానవాళి హాయిగా సుఖంగా ఉండాలి. మనుషుల మధ్య అసమానతలు తగ్గి అందరూ సంతోషంగా ఉండాలి. కొందరి దగ్గరే సంపద అంతా పోగు పడిపోతే.. మెజారిటీ ప్రజలు డొక్కలు మాడ్చుకుంటూ ఆకలి కేకలే వేస్తోంటే ఆ సమాజం ఎలా మనుగడ సాగించగలుగుతుంది? ఎలా ఆనందంగా ఉండగలుగుతుంది. అన్నింటికన్నా ప్రమాదకరమైనవి అసమానతలు, వివక్షలు. వాటిని రూపు మాపుకుంటూ మానవ సంబంధాలు పెంపొందించుకుంటూ ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వేసేలా దేశాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని పకడ్బందీగా అమలు చేయాలి. అప్పుడే మానవాళి మనుగడ సాగించగలుగుతుందని మేథావులు సూచిస్తున్నారు. ప్రపంచ జనాభా 800 కోట్లు అయిపోయిందని చాలా మంది కంగారు పడిపోతున్నారు. అది పెద్ద సమస్య కాదు. సమస్యల్లా పెరిగిన జనాభా చక్కటి మానవ సంబంధాలతో లోటు లేకుండా మనుగడ సాగించడమే. మన వ్యవస్థల్లోని సవాలక్ష అసమానతలు.. లింగ వివక్షలు పెను సవాళ్లను విసురుతున్నాయి. 300కోట్ల మంది పౌష్ఠికాహారం తినే స్థోమత లేక కడుపులు మాడ్చుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దానికి కారణం ఏంటో మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. జనాభాలో కేవలం 10 శాతం మంది వద్దే 80 శాతం సంపద పోగుపడ్డమే సమస్య. పేదలకు ఆ సంపద పంపిణీ కాకపోవడం వల్లనే అసమానతలు పెరుగుతున్నాయి. అవే ఆకలి కేకలు పెంచుతున్నాయి. అవే జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.అందుకే ప్రపంచమంతా మనిషి మనిషిగా బతికే వీలు కల్పించడంపైనే దృష్టి సారించాల్సి ఉందంటున్నారు మేథావులు. నిన్న కాక మొన్ననే. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది బాబోయ్ అంటూ తెలిసో తెలీకో చాలా మంది గగ్గోలు పెట్టేశారు.జనాభా ఇలా పెరుగుతూ పోతే అందరికీ ఆహారం ఎలాగ? అని చాలా సీరియస్‌గా ఆందోళన వ్యక్తం చేసేశారు కూడా. జనాభాని నియంత్రిస్తే ఎలాంటి సమస్యా ఉండదని కొందరైతే చాలా అమాయకంగా సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకొందరైతే ఆహార ఉత్పత్తులు పెంచడంపై ప్రపంచం దృష్టి సారించాలని తోచిన సలహా ఇచ్చారు. ఉన్న ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అదే పది వేలని కొందరు మేథావులు సూత్రీకరించేశారు. అసలు సమస్య ఎక్కడుంది? సమస్య ఏంటి? అన్నదానిపై ఎవరూ దృష్టి సారించడం లేదు. జనాభా పెరుగుతోంది. ఓకే. అది పెరుగుతుంది. అందులో ఆశ్చర్య పడాల్సింది కానీ ఆందోళన చెందాల్సింది కానీ ఏమీ లేదు కదా. ఒకప్పుడు సగటు జీవితకాలంతో పోలిస్తే ఇపుడు ప్రజల ఆయుష్షు బాగా పెరిగింది. దశాబ్ధాల క్రితం చాలా వ్యాధులకు, రుగ్మతలకు మందులే ఉండేవి కావు. ఏదన్నా సుస్తీ చేస్తేనే రోగనిరోధక శక్తి లేక చనిపోయే పరిస్థితులు ఉండేవి. ఇపుడు ప్రాణాధార ఔషథాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఒకప్పుడు పేరు చెప్పడానికే భయపడే క్యాన్సర్ వ్యాధి ఇపుడు ఎవరినీ కంగారు పెట్టడం లేదు. క్యాన్సరా? సరేలే..ఆసుపత్రికెళ్తే తగ్గిపోతుందిలే అనే ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వైద్య రంగంలో ఊహించని విప్లవాత్మక ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి కాబట్టి. అందు చేత జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఇక పెరిగిన జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచినంత మాత్రాన ఆకలి కేకలు మాయం అయిపోతాయా? ఛస్తే కావు. ఎందుకంటే ఆహార ఉత్పత్తులు పెంచినంత మాత్రాన అవి పేదల చేతుల్లోకి రావు. పేదలు వాటిని వినియోగించు కోగలగాలంటే వాటిని కొనుగోలు చేసే శక్తి వారికి ఉండాలి. అది జరగాలంటే ప్రభుత్వాలు పథకాలు రూపొందించాలి. చాలా దేశాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. దేశాలు చాలా సంపన్న దేశాలుగా పేరు గడిస్తున్నాయి. కానీ ఆ దేశాల్లో మెజారిటీ ప్రజలు మాత్రం గర్భ దారిద్య్రంలో ఉన్నారు. ఎక్కడో ఎందుకు మన దేశాన్నే తీసుకుంటే.. మన దేశంలోని 80 శాతం సంపద కేవలం పది శాతం మంది కుబేరుల వద్దే ఉంది. మిగతా 90శాతం మందిలో 80 శాతం మంది నిరుపేదలే. వీరిలో మెజారిటీ ప్రజలు పౌష్ఠికాహారం కొనుగోలు చేయగల స్థోమత ఉన్నవారు కారు. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరని తేలింది.సహజంగానే ఇందులో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాల్లోనే ఉంటారు. మన దేశంలో అయితే 97 కోట్ల మంది పౌష్ఠికాహారం కొనగల స్థితిలో లేరు. ఎందుకంటే ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడం జీవన ప్రమాణాలు పడిపోవడంతో మండే కడుపుకు కాలే బూడిదలా ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడమే గగనమైపోతోంది. ఇక పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? ప్రతీ మనిషీ రోజూ కనీసం 400 గ్రాములు కూరగాయలు, పళ్లు తినాలట. ఇంటి మొత్తానికి అరకిలో కూరగాయలతో కాలక్షేపం చేసే దేశంలో ఒక్క మనిషిపై ఇంత పెట్టుబడి పెట్టగల స్థితిలో ప్రజలుంటారా? ఏటా ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతుంటే.. ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు ప్రపంచంలోని ఆర్ధిక వ్యవస్థలన్నీ కుప్పకూలడంతో జీవన ప్రమాణాలు మరీ అధ్వాన్నంగా దిగజారాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? (ఇంకా వుంది) -సీఎన్ఎస్ యాజులు, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
జనాభా నియంత్రణ మా పని కాదు
న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న జనాభాను నియంత్రించడానికి ‘ఇద్దరు పిల్లల’ విధానాన్ని తప్పనిసరి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వ పరిధిలోని అంశమని జస్టిస్ ఎస్.ఎ.కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓకాల ధర్మాసనం వెల్లడించింది. జనాభా పెరుగుదల అనేది ఏదో ఒక మంచి రోజున ఆగిపోయే వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది. ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేయాలని కోరుతూ అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలో జనాభా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరికొందరు వేసిన పిటిషన్లపై సైతం శుక్రవారం దృష్టి సారించింది. జనాభా నియంత్రణ తమ పని కాదని, దానికంటే చేయాల్సిన ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. జనాభాను అరికట్టడానికి తాము చట్టాన్ని తీసుకురాలేమని ఉద్ఘాటించింది. వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలని పిటిషనర్లకు సూచించింది. -
Population Growth: సవాళ్ళు... సదవకాశాలు
ప్రతి అవకాశాన్నీ సంక్షోభంగా మార్చుకోవడం పలువురు చేసే తప్పు. అందరూ సంక్షోభం అనుకొనేదాన్ని కూడా సదవకాశంగా మార్చుకోవడమే తెలివైన పని. ఈ నవంబర్ 15న పుట్టిన శిశువుల్లో ఒకరితో పుడమిపై జనాభా 800 కోట్లకు చేరిందన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) అంచనాను ఆ దృష్టితో చూస్తే కర్తవ్యం బోధపడుతుంది. ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలుగా మొదట చైనా, తర్వాత భారత్ నిలిచినా, వచ్చే ఏడాదిలో మనం చైనాను అధిగమిస్తామట. ఈ మైలు రాయి సవాళ్ళు విసురుతూనే, అవకాశాలూ అందిస్తోంది. ఎందుకంటే, జనాభా పెరుగుదలైనా, తగ్గుదలైనా పూర్తి మంచీ కాదు, చెడూ కాదు. ఆ జనాభాను ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యం. సవాళ్ళను అధిగమించే జనసామర్థ్యమే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనను నిర్ణయిస్తుంది. చారిత్రకంగా చూస్తే – మానవ జాతి ఆవిర్భావం మొదలు క్రీ.శ. 1800వ సంవత్సరం నాటికి కానీ జనాభా వంద కోట్లకు చేరలేదు. కానీ, ఆ తర్వాత కేవలం రెండొందల పైచిలుకు ఏళ్ళలో మన సంఖ్యలో మరో 700 కోట్లు చేరాయన్నమాట. మెరుగైన ఆరోగ్యసంరక్షణ, ఒకప్పటితో పోలిస్తే తగ్గిన ప్రపంచ దారిద్య్రం, మాతా శిశు ఆరోగ్యంలో వచ్చిన మెరుగుదల, ఆయుఃప్రమాణం పెరగడం ఇలాంటివి అనేకం దీనికి కారణం. తాజా 800 కోట్ల మార్కును ‘‘మానవాళి సాధించిన విజయాలకు ఇది మైలురాయి’’ అని ఐరాస జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) అన్నది అందుకే. వర్తమాన ధోరణులే గనక కొనసాగితే, 2080ల నాటికి జనాభా 1040 కోట్ల గరిష్ఠానికి చేరుతుందనీ, దాదాపు 1050 కోట్ల దగ్గర ప్రపంచ జనాభా స్థిరపడవచ్చనీ అంచనా. వర్ధమాన దేశాల్లో అధిక భాగం జనాభా నియంత్రణపై దృష్టి పెట్టినా, గత ఆరు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా రెట్టింపైన మాట నిజమే. అలాగని ఈ లెక్కల్నే చూసి, సంపూర్ణ చిత్రాన్ని విస్మరిస్తే కష్టం. ప్రపంచ జనాభా 2011లో 700 కోట్లుండేది. ఆ పైన పట్టుమని పన్నెండేళ్ళకే మరో వంద కోట్లు పెరిగి, ఇప్పుడు 800 కోట్లయింది.అయితే, ఈ సంఖ్య 900 కోట్లవడానికి కాస్తంత ఎక్కువ సమయమే పట్టనుంది. మరో పధ్నాలుగున్నర ఏళ్ళకు, అంటే 2037 నాటికి గానీ అక్కడకు చేరుకోమని అంచనా. అంటే, జనాభా రేటు పెరుగుతున్న మాట నిజమే కానీ, ఆ పెరుగుదల వేగం తగ్గుతోందన్న మాట. 1950తో పోలిస్తే ఇప్పుడు జనాభా పెరుగుదల చాలా నిదానించి, 2020లో 1 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని ఐరాస జనాభా నివేదికే వెల్లడించింది. ఒక్కమాటలో... నిదానంగానైనా జనాభా తగ్గుదల మార్గంలోనే పయనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతాన సాఫల్య రేటూ దీనికి నిదర్శనం. దాని ప్రభావం స్పష్టంగా తెలియడానికి కొంతకాలం పట్టవచ్చు. వెరసి వయసు పెరిగిన జనాభా ఎక్కువవడం ఈ శతాబ్దిలో ప్రధాన ధోరణి కానుంది. వచ్చే 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరించనున్న భారత్ ముంగిట సువర్ణావకాశం ఉంది. చైనా (38.4 ఏళ్ళు), జపాన్ (48.6) దేశాల్లోని సగటు వయస్కుల కన్నా చాలా తక్కువగా భారతీయుల సగటు వయసు 28.7 ఏళ్ళే కానుంది. చివరకు ప్రపంచ జనాభా సగటు వయసు 30.3 ఏళ్ళ కన్నా మన దేశంలోనే పిన్న వయస్కులుంటారు. అలాగే, మన జనాభాలో 27 శాతానికి పైగా 15 నుంచి 29 ఏళ్ళ వయసువాళ్ళయితే, 25.3 కోట్ల మంది 10–19 ఏళ్ళ మధ్యవయస్కులు. వచ్చే 2030 వరకు ప్రపంచంలోనే పిన్న వయస్కులున్న దేశం మనదే కావడం కలిసొచ్చే అంశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. జనాభాను సమస్యగా భావించి ఆందోళన చెందే కన్నా ఆయుధంగా అనుకోవాలి. ఉత్పాదకత పెంచే శ్రామికశక్తిగా మలుచుకుంటే మంచి ఫలితాలుంటాయి. గతంలో చైనా చేసినది అదే! ప్రస్తుతం చైనా జనాభాలో పెద్ద వయస్కుల సంఖ్య పెరుగుతోంది. పడిపోతున్న జననాల రేటు వల్ల జనాభా తగ్గుతోంది. అంటే, ఇప్పటిదాకా ఆ దేశ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమైన శ్రామిక శక్తి ఇక ఏ మేరకు అందుబాటులో ఉంటుందనేది ప్రశ్నార్థకం. ఒక బిడ్డే ఉండాలంటూ అనేక దశాబ్దాలు కఠిన విధానం అనుసరించిన చైనా గత ఏడాది నుంచి ముగ్గురు పిల్లలకు అనుమతిం చింది. మరింతమందిని కంటే ప్రోత్సాహకాలిస్తామనీ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో మన 141 కోట్ల పైచిలుకు జనాభాను సానుకూలతగా మలుచుకోవాలి. అయితే, భారత్‌లో పట్టణ జనాభా అంతకంతకూ అధికమవుతున్నందున సవాళ్ళూ ఎక్కువే. పట్టణ ప్రజావసరాలు తీర్చా లంటే రాగల 15 ఏళ్ళలో భారత్ కనీసం 84 వేల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాలని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక. అంటే సగటున ఏటా 5500 కోట్ల డాలర్లు. అందుకు సిద్ధం కావాలి. పట్టణాల్లో అలా వసతుల కల్పన నాణ్యమైన జీవనంతో పాటు ఉత్పాదక శక్తి పెంపునకూ దోహదం చేస్తుంది. అయితే, జనాభాతో పాటు ధనిక, పేద తేడాలు పెరుగుతాయి. ఉద్రిక్తతలు హెచ్చే ముప్పుంది. ప్రపంచ ఆదాయంలో అయిదోవంతు కేవలం అగ్రశ్రేణి ఒక శాతం జనాభా గుప్పిట్లో ఉండడం పెను ప్రమాదఘంటిక. అత్యంత ధనిక దేశాల ప్రజలు, అతి నిరుపేద దేశాల వారి కన్నా 30 ఏళ్ళు ఎక్కువ జీవిస్తారట. పెరిగిన జనాభా కన్నా ఈ వ్యత్యాసాల పెరుగుదలే దుర్భరం. పెరిగిన జనసంఖ్య కోస మంటూ ప్రకృతి వనరుల విధ్వంసం ప్రపంచ సమస్య. అడవుల నరికివేత, భూగర్భ జలాల దుర్విని యోగం, చేజేతులా కాలుష్యాలు, వాతావరణ మార్పుపై అశ్రద్ధ లాంటివి అరికట్టాలి. 800 కోట్ల మంది కలసి బతుకుతూ, ఈ పుడమిని రాబోయే తరాలకూ నివాసయోగ్యంగా ఉంచడం కీలకం. -
ప్రపంచ జనాభా 800,00,00,000..
ఐక్యరాజ్యసమితి/బీజింగ్: భూగోళంపై జనా భా మరో మైలురాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభా 800 కోట్ల మార్కును దాటేసింది. ‘800 కోట్ల’ శిశువు మంగళవారం భూమిపై కన్నుతెరిచింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జన్మించిన చిన్నారి పాపతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇది వేడుక చేసుకోవాల్సిన సందర్భమేనని, అదే సమయంలో కోట్లాది మంది శాంతియుతంగా జీవించడానికి అనువైన ప్రపంచాన్ని ఎలా సృష్టించాలో అందరూ ఆలోచించాలని సూచించింది. ‘‘800 కోట్ల ఆశలు, 800 కోట్ల స్వప్నాలు, 800 కోట్ల అవకాశాలు. మన భూ గ్రహం ఇక 800 కోట్ల మంది ప్రజలకు ఆవాసం’’ అంటూ ఐక్యరాజ్యసమితి జనాభా నిధి(యూఎన్ఎఫ్పీఏ) ట్వీట్ చేసింది. పేదరిక నిర్మూలన, ఆరోగ్య రంగంలో పురోగతి, అందరికీ విద్య వంటి అంశాల్లో మానవ జాతి సాధిస్తున్న విజయాలు ప్రపంచ జనాభా వృద్ధికి కారణాలని పేర్కొంది. 1800 సంవత్సరం వరకూ 100 కోట్లలోపే ఉన్న ప్రపంచ జనాభా మరో వందేళ్లలోనే 200 కోట్లకు చేరిందని ప్రకటించింది. యూఎన్ఎఫ్పీఏ ఇంకా ఏం చెప్పిందంటే.. ► ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. వచ్చే ఏడాదికల్లా.. అంటే 2023లో జనాభాలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. ► ప్రపంచవ్యాప్తంగా జనాభా గత 12 ఏళ్లలోనే 100 కోట్లు పెరిగింది. ► కొన్నేళ్లుగా జనాభా వృద్ధి నెమ్మదించింది. అయినప్పటికీ 2037 నాటికి 900 కోట్లకు, 2057 నాటికి 1,000 కోట్లకు చేరుకోనుంది. ► 2080 దశకం నాటికి జనాభా 1,040 కోట్లకు చేరుకుంటుంది. అదే గరిష్ట స్థాయి. 2100 సంవత్సరం దాకా పెద్దగా మార్పు ఉండదు. ► 2023లో భారత్‌లో జనాభా సగటు వయస్సు 28.7 సంవత్సరాలు. ఇది చైనాలో 38.4, జపాన్‌లో 48.6 ఏళ్లు. ప్రపంచ జనాభా సగటు వయస్సు 30.3 ఏళ్లు. భారత్ యువ జనాభాతో కళకళలాడనుంది. ► ప్రస్తుతం భారత్ జనాభా 141.2 కోట్లు. చైనా జనాభా 142.6 కోట్లు. 2050లో భారత్ జనాభా 166.8 కోట్లు, చైనా జనాభా 131.7 కోట్లు కానుంది. స్థిరంగా భారత్ జనాభా వృద్ధి! న్యూఢిల్లీ: భారత్ జనాభా వృద్ధిలో స్థిరత్వం ఏర్పడనుందని యూఎన్ఎఫ్పీఏ వెల్లడించింది. జనాభా పెరుగుదల ఎక్కువ, తక్కువ కాకుండా, స్థిరంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ విధానాలు, మెరుగైన ఆరోగ్య వ్యవస్థలు, కుటుంబ నియంత్రణ వంటి చర్యలు ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొంది. టోటల్ ఫెర్టిలిటీ రేటు (సగటున ఒక్కో మహిళ జన్మినిచ్చే శిశువుల సంఖ్య) 2.2 కాగా, రాబోయే రోజుల్లో ఇది 2కు పడిపోతుందని అంచనా వేసింది. ఇదీ చదవండి: జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన ప్రస్తావనగా.. -
మధ్యతరగతి విస్ఫోటం
డి.శ్రీనివాసరెడ్డి: మధ్య తరగతి జన విస్ఫోటనం. కొంతకాలంగా ప్రపంచమంతటా శరవేగంగా జరుగుతున్న పరిణామమిది! మార్కెట్ల విస్తరణ, ఆదాయ వనరుల పెరుగుదల తదితర కారణాలతో ఏ దేశంలో చూసినా మధ్య తరగతి జనం ఏటా విపరీతంగా పెరుగుతున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రపంచ జనాభాలో 40 శాతం పైగా వాటా మధ్యతరగతిదే. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు నడవడానికి వీరి ఆదాయ వ్యయాలే ఇంధనంగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు! ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలు కూడా వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో మిడిల్ క్లాస్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఏటా 14 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి జనాభా ఏటా ఏకంగా 14 కోట్ల చొప్పున పెరిగిపోతోందని, ప్రస్తుతం 320 కోట్లుగా ఉందని ప్రపంచ బ్యాకు తాజా నివేదిక వెల్లడించింది. 2030 నాటికి వీరి సంఖ్య 520 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే ప్రపంచ జనాభాలో ఏకంగా 65 శాతానికి చేరనుందన్నమాట! మొత్తం ప్రపంచ ఆదాయంలో మూడో వంతు ఈ మధ్యతరగతి మహాజనుల నుంచే సమకూరుతోందట! సింహభాగం ఆసియాదే... ఈ శతాబ్దారంభంలో అమెరికా తదితర సంపన్న యూరప్ దేశాల్లో అధిక సంఖ్యాకులు మధ్యతరగతి వారే ఉండేవారు. క్రమంగా అక్కడ వారి వృద్ధి తగ్గుతూ ఆదియా దేశాల్లో శరవేగగంగా పెరుగుతోంది. వరల్డ్ డేటా లాబ్ అంచనా ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో కొత్తగా రానున్న 100 కోట్ల మంది మధ్యతరగతి జనంలో ఏకంగా 90 శాతం ఆసియాకు చెందినవారే ఉండనున్నారు! భారత్, చైనాతోపాటు ఇండొనేసియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌వంటి ఆసియా దేశాలు మిడిల్ క్లాస్ జనంతో మరింతగా కళకళలాడతాయట. ఆ దేశాల్లో శరవేగంగా సాగుతున్న పట్టణీకరణే అక్కడ మధ్యతరగతి ప్రాబ ల్యానికి తార్కాణం. వీరు చైనాలో 2010 నాటికి జనాభాలో 49 శాతముండగా ఇప్పటికే 56 శాతానికి పెరిగారు. 2035 నాటికి చైనా జనాభాలో ఏకంగా 100 కోట్ల మంది పట్టణవాసులే ఉంటారని అంచనా. భారత్‌లోనూ 2035 నాటికి 67.5 కోట్ల మంది (45 శాతం) పట్టణాల్లో నివసిస్తారట. ఆసియాలో ఈ సంఖ్య 300 కోట్లుగా ఉండనుంది. యూఎస్‌లో పాపం మిడిల్‌క్లాస్... ఒకప్పుడు మధ్యతరగతి ఆదాయ వర్గాల దేశంగా నిలిచిన అమెరికాలో వారి సంఖ్య బాగా తగ్గుతోంది. అక్కడ 35 వేల నుంచి 1.06 లక్షల డాలర్ల వార్షికాదాయముంటే మధ్యతరగతిగా పరిగణిస్తారు. 1971లో దేశ జనాభాలో 61 శాతం మిడిల్ క్లాసే కాగా గతేడాదికి 50 శాతానికి తగ్గిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఇక రష్యా, ఉక్రెయిన్లలో యుద్ధం దెబ్బకు ఒక్క ఈ ఏడాదే ఏకంగా కోటి మంది దాకా మధ్య తరగతి నుంచి దిగువ తరగతికి దిగజారినట్టు ప్యూ నివేదిక వెల్లడించింది. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని తేడాలున్నా మొత్తమ్మీద ఒక వ్యక్తి తన అన్ని అవసరాలకు కలిపి రోజుకు దాదాపు రూ.1,000, ఆ పైన వెచ్చించగలిగితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అతన్ని మధ్యతరగతిగా లెక్కిస్తారు. రూ.5 లక్షల నుంచి 30 లక్షల వార్షికాదాయం ఉన్నవారిని మధ్యతరగతిగా పరిగణిస్తారు. మన దగ్గర కూడా... మధ్యతరగతి మందహాసమే భారత్‌లో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు మిడిల్ క్లాస్ జీవులే. 2047 నాటికి వీరి సంఖ్య రెట్టింపై ప్రతి ముగ్గురిలో ఇద్దరు వాళ్లే ఉంటారని పీపుల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియాస్ కన్సూ్యమర్ ఎకానమీ (ప్రైజ్) అంచనా. 2005లో దేశ జనాభాలో కేవలం 14 శాతమున్న మధ్యతరగతి ఇప్పుడు ఏకంగా 31 శాతానికి పెరిగింది. 2035 కల్లా 43.5 శాతానికి వృద్ధి చెందనుంది! -
తాగుబోతు స్టాంప్: పురుషులకు 20 ఏళ్లు.. స్త్రీలకు రెండేళ్లే!
మద్యపానం విషయంలో ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. స్తీలు అధికంగా మద్యపానం చేస్తే పిల్లలు పుట్టరంటూ పోలాండ్ పాలక పక్ష నాయకుడు షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. స్త్రీలు డ్రింక్ చేయడం వల్లే జననాల రేటు తక్కువగా ఉంటుందంటూ వ్యాఖ్యానించాడాయన. పోలాండ్ జనాభా తక్కువగా ఉండటానికి కారణం స్త్రీలు అధికంగా మద్యపానం సేవించడమే ప్రధాన కారణమని అన్నారు. 25 ఏళ్లు వయసు ఉన్న స్త్రీలు.. అదే వయసు ఉన్న పురుషుల కంటే ఎక్కువగా డ్రింక్ చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అసలు పిల్లలు ఉండరన్నారు. పురుషులు తాగుబోతులు అని ముద్ర వేయించుకోవడానికి 20 ఏళ్లు పడితే స్త్రీలకు కేవలం రెండేళ్లు చాలంటూ కామెంట్లు చేశాడు. అంతేగాదు మద్యానికి బానిసైన మగవాళ్లకు చికిత్స అందించి సులభంగా నయం చేయవచ్చు కానీ స్త్రీలను నయంచ చేయలేమని ఇది ఒక వైద్యుడు అనుభవం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా ఇది పితృస్వామ్య రాజ్యమని ప్రూవ్ చేశారంటూ ప్రజలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. వాస్తవానికి పోలాండ్లోని మహిళలు ఆర్థిక స్థిరత్వం, అబార్షన్ రిస్ట్రిక్షన్స్ దృష్ట్యా పిలలు కనడం పట్ల అంత ఆసక్తి కనబర్చడం లేదనేది ప్రధాన కారణమని నిపుణుల చెబుతున్నారు. (చదవండి: ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్తే ఇలా ఉంటుందా!) -
భారత్‌లో ఇంధనానికి భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఈ దశాబ్దంలో భారత్‌లో ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఏఈఏ) అంచనావేసింది. ‘‘భారత్ 2025 నాటికి అత్యధిక జనాభా దేశంగా ఉంటుంది. పట్టణీకరణకుతోడు, పారిశ్రామికీకరణ వల్ల ఏటా ఇంధన డిమాండ్ 3 శాతం చొప్పున పెరుగుతుంది’’అని తెలిపింది. పప్రంచ ఇంధన వినియోగంపై అంచనాలతో ఓ నివేదికను గురువారం విడుదల చేసింది. పునరుత్పాదక ఇంధనానికి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు, సమర్థవంతమైన విధానాల వల్ల 2030 నాటికి పెరగనున్న విద్యుత్ డిమాండ్‌లో 60 శాతాన్ని పర్యావరణ అనుకూల ఇంధనాలే తీరుస్తాయని వివరించింది. అదే సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్ మొత్తం ఇంధన డిమాండ్‌లో మూడింట ఒకటో వంతు ఉంటుందని అంచనా వేసింది. ఒకటో వంతు అవసరాలు చమురు ద్వారా తీరతాయని పేర్కొంది. శిలాజ ఇంధనాల దిగుమతుల బిల్లు వచ్చే రెండు దశాబ్దాల కాలంలో రెట్టింపు అవుతుందని అంచనా వ్యక్తీకరించింది. ఇది ఇంధన భద్రతకు రిస్క్‌గా అభివర్ణించింది. ప్రపంచం మొదటి అంతర్జాతీయ ఇంధన సంక్షోభం మధ్యస్థ దశలో ఉన్నట్టు వివరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి దీనికి ప్రేరణనిచ్చిందని తెలిపింది. ‘‘రష్యా ప్రపంచంలో శిలాజ ఇంధనాల ఎగుమతుల్లో పెద్ద దేశంగా ఉంది. అయితే, యూరప్‌కు సహజ వాయువు సరఫరాను రష్యా తగ్గించేయడం, అదే సమయంలో రష్యా చమురు, బొగ్గు ఎగుమతులపై యూరప్ ఆంక్షలు విధించడం ప్రపంచ ఇంధన వాణిజ్యానికి ప్రధాన అవరోధాలు’’అని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇంధనాల వారీగా డిమాండ్.. ► భారత్‌లో 2030 నాటికి బొగ్గు డిమాండ్ గరిష్ట స్థాయిలో రోజువారీగా 770 మిలియన్ టన్ను లకు చేరుతుంది. 2021 నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యం 240 గిగావాట్లుగా ఉంటే, 2030 నాటికి 275 గిగావాట్లకు పెరుగుతుంది. ► చమురుకి డిమాండ్ 2021కి రోజువారీగా 4.7 మిలియన్ బ్యారెళ్లు ఉంటే, 2030 నాటికి 6.7 మిలియన్ బ్యారెళ్లకు పెరుగుతుంది. 2040 నాటికి 7.4 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుంది. ► 2030 నాటికి అదనంగా పెరిగే విద్యుత్ అవసరాల్లో 60 శాతాన్ని పునరుత్పాదక వనరులు తీరుస్తాయి. అప్పటికి మొత్తం విద్యుత్ అవసరాల్లో పునరుత్పాదక ఇంధనాల వాటా 35 శాతం మేర ఉంటుంది. ఇందులో సోలార్ పీవీ ప్లాంట్ల ద్వారానే 15 శాతం అవసరాలు తీరతాయి. ► సహజ వాయువు డిమాండ్ 2030 నాటికి 115 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుతుంది. 2021 నాటికి ఇది 66 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. మొత్తం మీద పెరిగే ఇంధన అవసరాల్లో గ్యాస్ వాటా 5 శాతంగానే ఉంటుంది. ► తక్కువ ఉద్గారాలు విడుదల చేసే ప్రత్యామ్నా య ఇంధన వనరుల్లో వేగవంతమైన పురోగతి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు.. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి. -
ముస్లిం జనాభా పెరగడం లేదు..
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో ముస్లింల జనాభా పెరగడం లేదు. పెరుగుదల రేటు తగ్గుతోంది. బిడ్డకు బిడ్డకు మధ్య అంతరం గరిష్టంగా ఉండేందుకు కండోమ్‌లు ఎక్కువగా వాడుతున్నది ముస్లింలే..’’ అని ఆలిండియా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో జరిగిన రహ్మతుల్ లిల్ ఆలమీన్ సభలో ఆయన ప్రసంగించారు. జనాభా నియంత్రణ విషయమై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ తప్పుపట్టారు. ముస్లింల సంతానోత్పత్తి రేటు తగ్గిందన్న విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ముస్లింల జనాభా పెరుగుతోందని అనవసరంగా ఆరోపణలు చేయవద్దన్నారు. వారి తీరు జాతీయ వాదానికి వ్యతిరేకం బీజేపీ హిందూ దేశం కలలు స్వాతంత్య్ర భారతానికి, జాతీయవాదానికి వ్యతిరేకమని అసదుద్దీన్ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉందని, బహిరంగ జైళ్లలో జీవిస్తున్నట్టుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీధికుక్కలకు దక్కిన గౌరవం కూడా ముస్లింలకు దక్కడం లేదన్నారు. గుజరాత్లో దాండియా కార్యక్రమంపై రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ పోలీసులు తొమ్మిది మందిని స్తంభానికి కట్టేసి కొరడాలతో కొట్టారని.. పోలీసులు ఇలా చట్టాన్ని చేతిలో తీసుకుంటే కోర్టులు ఎందుకు మూసివేయాలని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా మౌనం వహించడం విచారకరమని పేర్కొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను దేశభక్తులుగా అభివర్ణించడం సరికాదని విమర్శించారు. మిలాద్ సందర్భంగా పోలీసులు పెట్రోల్ బంకులు మూసివేయడం ఏమిటని, మిగతా పండుగలకు అలా ఎందుకు మూసివేయరని ప్రశ్నించారు. టిప్పు వారసత్వాన్ని తుడిచిపెట్టలేరు బెంగళూరు–మైసూర్ టిప్పు ఎక్స్‌ప్రెస్ రైలు పేరును వడయార్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చడాన్ని అసదుద్దీన్ తప్పుపట్టారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా టిప్పుసుల్తాన్ పోరాడారని, అది బీజేపీకి రుచించలేదా అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో టిప్పు వారసత్వాన్ని తుడిచి వేయడం బీజేపీకి ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. -
మరింత మందిని కనండి.. ఇటాలియన్లకు పోప్ పిలుపు
మటేరా: ఎన్నికల వేళ ఇటాలియన్లు మరింత మంది పిల్లలను కనాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన పిలుపు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆదివారం మటేరాలో ఆయన బిషప్‌ల సమావేశంలో ఈ మేరకు కోరారు. వలసదారులను స్వాగతించాలని పిలుపునిచ్చారు. దేవుడు కుటుంబం, మాతృభూమి’నినాదంతో ప్రచారం చేస్తున్న మెలోనీ నేతృత్వంలోని రైటిస్ట్ పార్టీ కూడా ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలిస్తామని వాగ్దానం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జననాల రేటున్న దేశాల్లో ఇటలీ ఒకటి. చదవండి: చైనాలో ‘సైనిక కుట్ర’పై... అదే అస్పష్టత -
జనాభా తగ్గినా డేంజరే..
(ఎం. విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): జనాభా పెరగడమే అన్ని సమస్యలకు మూలమని ఇప్పటివరకు అందరిదీ అదే భావన. ఇప్పుడు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న అంశాల్లో జనాభా తగ్గుదల కూడా చేరింది. ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాల్లోనే ముందుగా వచ్చింది. ఆర్థికంగా, సాంకేతికంగా బలమైన వ్యవస్థలున్న జపాన్‌లాంటి దేశమే ఇప్పుడీ సమస్య ఎదుర్కొంటోంది. ఆసియా ఖండంలో ప్రస్తుతం జపాన్ ఒక్కటే ఈ సమస్యను ఎదుర్కొంటుండగా.. ఐరోపా ఖండంలో చాలా దేశాలను పీడిస్తోంది. జనాభా తగ్గుదల నమోదు కావడమంటే.. దేశ జనాభా సరాసరి వయసు పెరగడం. తద్వారా పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడటం, ప్రజారోగ్యం మీద ఖర్చు పెరగడంతో పన్నుల భారం పెరుగుతుండటం ఆయా సమాజాల్లో ఇప్పుడు కనిపిస్తోంది. అదే మన దేశంలో ప్రస్తుత సరాసరి వయసు 28.4ఏళ్లు. ఇది ఇప్పుడు మనకు కలిసొచ్చే అంశం. పుడుతున్న ప్రతి వెయ్యి మందిలో మనోళ్లు 171 మంది ప్రపంచంలో ప్రతి నాలుగు నిమిషాలకు దాదాపు వెయ్యి మంది పుడుతున్నారు. వీరిలో అత్యధికంగా 171 మంది మన దేశంలోనే ఊపిరిపోసుకుంటున్నారు. ఆ తర్వాత 102 మందితో చైనా రెండో స్థానంలో.. 56 మందితో మూడో స్థానంలో నైజీరియా ఉన్నాయి. అలాగే, పాకిస్తాన్ 47 మందితో నాల్గో స్థానంలో.. 31 మందితో కాంగో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా టాప్–5లో ఆసియా, ఆఫ్రికా దేశాలే ఉన్నాయి. ► ఇక 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే.. ప్రపంచ సరాసరి బర్త్‌రేట్ కంటే కొద్దిగానే ఎక్కువ. మన దేశంలో బర్త్‌రేట్ 17.7 ఉంటే, ప్రపంచ బర్త్‌రేట్ 16.8 ఉంది. ► అదే చైనా ప్రపంచ జనాభాలో నంబర్‌వన్. కానీ, జననాల సంఖ్య మన కంటే తక్కువగా ఉంది. అక్కడ ఇప్పటికే జనాభా పెరుగుదల మందగించింది. ఇదే తీరు కొనసాగితే.. జనాభా పెరుగుదల ఆగిపోవడం ఎంతోదూరంలో లేదని నిపుణుల అంచనా. ► ఇక నైజీరియా కథ వేరు. ఇక్కడ బర్త్‌రేట్ (34.2) ప్రపంచ బర్త్‌రేట్‌కు రెట్టింపుగా ఉంది. పేదరికం ఎక్కువగా ఉండటం, మహిళలు విద్యకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. సంపద పెరిగితే జనాభా పెరుగుదల డౌన్ సంపద పెరిగిన దేశాల్లో బర్త్‌రేట్ తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభా పెరుగుదల వేగం మందగించడం 1960లో మొదలైంది. ఇదే తీరు కొనసాగితే.. 2100 సంవత్సరానికి జనాభా పెరుగుదల ఆగిపోతుందని, ఆ తర్వాత ప్రపంచ జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనాభా తగ్గుదల మొదలైతే ప్రపంచ జనాభా సరాసరి వయసు పెరగడం మొదలవుతుంది. ఇది జరిగితే సమాజానికి వృద్ధఛాయలు వస్తాయి. చాలా దేశాలు ఇప్పుడీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో 20 దేశాల జనాభా ప్రమాదకరస్థాయిలో తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. కానీ, జనాభా తగ్గుదల అంశం మన దేశంలో కనుచూపుమేరలో లేదు. ► యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలతో పోలిస్తే పేద దేశంగా పరిగణించే బల్గేరియాలో జనాభా తగ్గుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ గత మూడు దశాబ్దాల్లో జనాభా 20 శాతం తగ్గిపోయింది. మరో 30 ఏళ్లలో 22.5 శాతం తగ్గుతుందని ఐరాస అంచనా. ► ఇక ఉక్రెయిన్లోనూ బర్త్‌రేట్ బాగా తగ్గుతోంది. దేశం నుంచి వలసలూ పెరుగుతున్నాయి. ఫలితంగా వచ్చే 30 ఏళ్లలో దాదాపు 20 శాతం జనాభా తగ్గొచ్చు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావాన్ని కలిపితే జనాభా మరింత వేగంగా తగ్గొచ్చు. మరోవైపు.. జనాభా తగ్గుతున్న దేశాలన్నీ ఐరోపా ఖండంలో ఉన్నవే. ఆసియాలో ఈ సమస్యలేదు. కానీ, జపాన్ కథ భిన్నంగా ఉంది. 2008లో 12.68 కోట్లు ఉన్న జనాభా ప్రస్తుతం 12 కోట్లకు తగ్గిపోయింది. 2050 నాటికి 10.58 కోట్లకు తగ్గుతుందని అంచనా. జనాభా తగ్గుదల అంటే.. దేశంలో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే. పుట్టుకలు తగ్గుతున్నకొద్దీ.. జనాభా సరాసరి వయసు పెరుగుతుంది. అంటే పనిచేయగలిగే వయస్సున్న జనాభా తగ్గుతారు. 1950లో జపాన్ జనాభా సరాసరి వయసు 22ఏళ్లు. అదే 2020లో 48కు, ఇప్పుడు 49 ఏళ్లకు పెరిగింది. ఈ విషయంలో జపాన్‌ది తొలిస్థానం. ఫెర్టిలిటీ రేట్ (ఒక మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య) ప్రస్తుతం 1.4 ఉంది. ఇది ప్రపంచ సరాసరిలో సగానికంటే తక్కువ. మన దేశానికి ప్రయోజనాలెన్నో.. మన దేశం విషయానికొస్తే.. ఇక్కడ జనాభా పెరుగుతోంది. 140.2 కోట్ల మందితో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.7 శాతం. దేశంలో ఏటా ఒక శాతం చొప్పున పెరుగుతోంది. త్వరలోనే చైనాను అధిగమిస్తామని నిపుణుల అంచనా. జనాభా పెరుగుదలతో పాటే మన జనాభా సరాసరి వయసూ పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ► 1970లో దేశ జనాభా సరాసరి వయసు 19.3 ఏళ్లుగా నమోదైంది. ► 2015లో 26.8 ఏళ్లకు.. 2022లో 28.4, 2025లో 30 ఏళ్లు, 2030లో 31.7, 2050లో 38.1 ఏళ్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. ► గట్టిగా పనిచేయగలిగే వయస్సున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంవల్ల ఆర్థికాభివృద్ధి వేగంగా పెరుగుతోంది. ► వీరికి పని కల్పించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద సవాలు. ► ఈ నేపథ్యంలో.. జనాభా తగ్గుదల సమస్య మనకు ఇప్పట్లో లేకపోయినా, శతాబ్దం తర్వాత మనదీ ఐరోపా దేశాల పరిస్థితే అని అంచనా. -
మదర్ హీరోయిన్ను తెరపైకి తెచ్చిన పుతిన్
మాస్కో: ప్రపంచ జనాభా తగ్గిపోతోంది.. ఇప్పుడు ఇది ఒక ఆందోళనకరమైన అంశంగా సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు.. జనాభాను పెంచే మార్గాలపై దృష్టిసారించాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం రష్యా జనాభాను పెంచేందుకు ఓ పథకం తీసుకొచ్చి.. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. పదేసి మంది పిల్లలను కని.. వాళ్లను పెంచే తల్లులకు నగదు నజరానా ప్రకటించాడాయన. మదర్ హీరోయిన్.. పుతిన్ నేతృత్వంలో ప్రభుత్వం రష్యాలో తీసుకొచ్చిన పథకం పేరు. ఈ పథకం ప్రకారం.. పది మంది పిల్లలను కని.. వాళ్లను సురక్షితంగా పెంచాల్సి ఉంటుంది తల్లులు. అలా చేస్తే.. వన్ మిలియన్ రూబుల్స్(మన కరెన్సీలో 12 లక్షల 92 వేల రూపాయల)తో పాటు మదర్ హీరోయిన్ గౌరవం ఇచ్చి గౌరవిస్తారు. ఈ విషయాన్ని రష్యా రాజకీయ, భద్రతా దళ నిపుణుడు డాక్టర్ జెన్నీ మాథర్స్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సోమవారం పుతిన్ సంతకాలు చేసినట్లు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. తగ్గిపోతోంది.. గత రెండున్నర దశాబ్దాలుగా.. రష్యా జనాభా ఆందోళనకరంగా పడిపోతోంది. పైగా కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లాంటి తాజా పరిణామాలతో జనాభా సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ఈ సంక్షోభం బయటపడేందుకు పుతిన్ తాజా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు మాథర్స్ తెలిపారు. అయితే.. కొత్తదేం కాదు.. పుతిన్ సంతకం చేసిన ‘మదర్ హీరోయిన్’ ఆదేశాలు కొత్తవేం కాదు. గతంలోనూ ఉన్నాయి. ఇంతకు ముందు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ నేత జోసెఫ్ స్టాలిన్.. యుద్ధంలో మరణించిన వాళ్ల సంఖ్యతో జనాభా తగ్గిపోగా ‘మదర్ హీరోయిన్’ రివార్డును ప్రకటించాడు. ఆ స్కీమ్ అప్పట్లో బాగా వర్కవుట్ అయ్యింది. జనాభా క్రమేపీ పెరుగుతూ పోయింది. అయితే.. 1991 సోవియట్ యూనియన్ పతనంతో ఈ టైటిల్ ఇవ్వడం కూడా ఆగిపోయింది. ఇదిలా ఉంటే.. పుతిన్ ‘దేశభక్తి’ ప్రయత్నాలు వర్కవుట్ అయ్యేవి కావని డాక్టర్ మాథర్స్ అంటున్నారు. ఎందుకంటే.. పదవ బిడ్డ పుట్టిన తర్వాతే అదీ మిగతా తొమ్మిది మంది బిడ్డల ఆరోగ్య స్థితి బాగా ఉంటేనే ఈ ప్రైజ్ మనీని, మదర్ హీరోయిన్ ట్యాగ్‌ను సదరు తల్లికి అందిస్తారు. దీంతో ఆ ప్రైజ్ మనీ కోసం అంతమంది పిల్లలను పోషించడం.. కుటుంబాలకు భారం కావొచ్చనే చర్చ నడుస్తోంది అక్కడ. అప్పటి, ఇప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు బేరీజు వేసుకుంటే.. మదర్ హీరోయిన్ ఇప్పుడు విఫలం కావొచ్చనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: కొలీగ్ కౌగిలించుకోవడంతో కోర్టుకెక్కింది! -
జనాభాను మించి ఆధార్!
సాక్షి, హైదరాబాద్: పేద, ధనిక తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కావాల్సింది ఆధార్ కార్డు. ఎందుకంటే దేశంలోని ప్రతి పౌరుడికీ భారత ప్రభుత్వం కేటాయించే విశిష్ట గుర్తింపు సంఖ్య అందులో ఉంటుంది. అంతేకాదు ఈ కార్డు బహుళ ప్రయోజనకారి. అన్నిటికీ అనుసంధానమవుతూ, ప్రతిదానికీ ఆధారమవుతోంది. ఆధార్ కార్డు లేకుండా ఏ పనీ జరగదన్నట్టుగా దాని ప్రాధాన్యత పెరిగిపోయింది. బ్యాంకింగ్, బీమా, పన్నులు తదితర లావాదేవీలకు, డిజిటిల్ కార్యకలాపాలకు, మొబైల్ సిమ్ కనెక్షన్ నుంచి పిల్లల స్కూల్ అడ్మిషన్, స్థిర, చర ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు పలు ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయ్యింది. దీంతో ప్రతి ఒక్కరూ విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ నమోదు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటం గమనార్హం. అంచనా జనాభా దాటి.. తెలుగు రాష్ట్రాల్లో జనాభా కంటే అధికంగా ఆధార్ కార్డులు జారీ చేసినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా అంచనా వేసిన జనాభా కంటే కూడా ఆధార్ నమోదు సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నవారు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటున్న కారణంగా ఈ సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆధార్ కార్డుల జారీ సంఖ్య నాలుగు కోట్ల తొమ్మిది లక్షల పైచిలుకుగా ఉంది. అంచనా వేసిన జనాభా (3.79 కోట్లు) సంఖ్య కంటే 29.98 లక్షలు (7.91 శాతం) ఎక్కువగా ఆధార్ నమోదు కావడం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో 3.51 కోట్ల జనాభా ఉండగా 2022 అంచనాల ప్రకారం ఈ సంఖ్య 3.79 కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా సంఖ్య 4.93 కోట్ల నుంచి ప్రస్తుతం 5.29 కోట్లకు చేరింది. ఐదుకోట్ల 46 లక్షల ఆధార్ కార్డులు జారీ కాగా, అంచనా జనాభా కంటే 17.05 లక్షలు (3.21 శాతం) అధికంగా నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద 18 ఏళ్లు దాటిన వారే అధిక సంఖ్యలో ఆధార్ నమోదు చేసుకొని విశిష్ట నంబర్లు పొందినట్లు యూఐడీఏఐ వర్గాలు పేర్కొటున్నాయి. గత రెండు నెలల్లో ఎక్కువగా గడిచిన రెండు నెలల్లో ఆధార్ నమోదు సంఖ్య బాగా పెరిగింది. ఏడాది కాలం (ఆగస్టు 2021 నుంచి 2022 జూలై 31 వరకు) పరిశీలిస్తే.. తెలంగాణలో 6,10, 236 మంది నమోదైతే అందులో కేవలం జూన్, జూలైలోనే 1,25,665 మంది నమోదయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలో 7,71,818 మంది నమోదైతే అందులో రెండు నెలల్లో 1,72,614 నమోదు చేసుకున్నట్లు యూఐడీఏఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పురుషులు, మహిళలు సమానంగా.. ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందిన వారిలో మహిళలు, పురుషులు దాదాపు సమానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో 50.11 శాతం పురుషులు, 49.89 శాతం మహిళలు, ఏపీలో 50.43 శాతం పురుషులు, 49.57 శాతం మహిళలు ఉన్నట్లు యూఐడీఏఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారే అధికం ఆధార్ నమోదు చేసుకున్న వారిలో 18 ఏళ్ల పైబడిన వారే అధికంగా ఉన్నారు. తెలంగాణలో 18 ఏళ్లు దాటిన వారు 77.51 శాతం ఉండగా అందులో పురుషులు 38.92 శాతం, మహిళలు 38.59 శాతం ఉన్నారు. 5 నుంచి 18 ఏళ్లలోçపు వారు 19.55 శాతం ఉండగా, అందులో బాలురు 10.02 శాతం, బాలికలు 9.47 శాతం ఉన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు 2.99 శాతం ఉండగా అందులో బాలురు 1.48 శాతం, బాలికలు 1.51 శాతం ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ►ఏపీలో 18 ఏళ్లు దాటిన వారు 78.16 శాతం ఉండగా అందులో 38.92 శాతం పురుషులు, 39.24 శాతం మహిళలు ఉన్నారు. 5 నుంచి 18 ఏళ్లలోపు వారు 18.13 శాతం ఉంటే అందులో 9.31 శాతం బాలురు, 8.82 శాతం బాలికలు, ఐదేళ్లలోపుగల వారు 3.7 శాతం ఉండగా అందులో బాలురు 1.87 శాతం, బాలికలు 1.83 శాతం ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ టాప్ ఆధార్ నమోదులో గ్రేటర్ హైదరాబాద్ టాప్‌గా ఉంది. అంచనా జనాభాకంటే అధికంగా ఆధార్ కార్డులు జారీ అవుతున్నాయి. మహానగరంలో జనాభా వృద్ధి రేటు ఏటా 8 నుంచి 12 శాతం వరకు ఉంటోంది. 2022 అంచనా ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 1.05 కోట్ల జనాభా ఉండగా ఆధార్ నంబర్లు జారీ సంఖ్య 1.25 కోట్లకు చేరింది. అంటే జనాభా కంటే 20 లక్షలు (19 శాతం) అధికంగా ఆధార్ యూఐడీలు జారీ అయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వలస వస్తున్నవారు ఎప్పటికప్పుడు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటుండటంతో జనాభా కంటే ఆధార్ అధికంగానే నమోదైనట్లు తెలుస్తోంది. -
నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం: యంగిస్తాన్!
నరాల బిగువు, కరాల సత్తువ, వరాల వర్షం కురిపించే మేధో సంపత్తితో కూడిన యువ శక్తి భారత దేశ సొంతం. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత యువ జనాభా మన దగ్గరుంది. మన దేశ సగటు వయసు కేవలం 28 ఏళ్లు! అదే చైనా సగటు వయసు 37 ఏళ్లు, జపాన్‌దైతే ఏకంగా 48 ఏళ్లు. సూపర్ పవర్స్‌గా పేరుబడ్డ అమెరికా, చైనా వంటి దేశాల్లో వృద్ధ జనాభా నానాటికీ పెరిగిపోతోంది. ఆ రెండు దేశాల్లో సగానికిపైగా జనాభా వృద్ధులే! 15 నుంచి 24 మధ్య వయసు వారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో 16 శాతం. అదే భారత్‌లో 13 నుంచి 35 మధ్య వయసు వారు జనాభాలో ఏకంగా 66 శాతమున్నారు. అంటే మన దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు యువోత్సాహంతో తొణికిసలాడుతున్నారు. యువత శక్తి సామర్థ్యాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో సింహావలోకనం చేసుకునేందుకు ఏటా ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుతున్నారు. మేధో వలసలు ఆపాలి అపార ప్రతిభ, సజనాత్మకత పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలిచే తెలివితేటలు భారత యువత సొంతం. వీటిని వాడుకుని బహుళ జాతి సంస్థలు చాలా లాభపడుతున్నాయి. మన వారిలోని ప్రతిభా పాటవాలను ఇతర దేశాలే ముందుగా గుర్తించి ఎగరేసుకుపోతున్నాయి. దాంతో మన యువత మేధో సంపత్తి దేశాభివృద్ధికి ఉపయోగపడటం లేదు. మన దేశం నుంచి మేధో వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యాపిల్ ఉద్యోగుల్లో 35 శాతం, మైక్రోసాఫ్ట్‌లో 34›, ఐబీఎంలో 28, ఇంటెల్‌లో 17, అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో 36 శాతం భారతీయులే! మన యువతలో చాలావరకు భారత్‌లో ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించడం లేదన్న అసంతప్తితో వలస బాట పడుతున్నారు. ప్రపంచ సారథిగా భారత్ ఎదగాలంటే ఈ మేధో వలసను తక్షణం అడ్డుకోవాలి. దేశానికి అండదండ ► భారత యువతలో అక్షరాస్యత 90 శాతానికి పెరిగింది. వీరంతా స్మార్ట్ తరం. డిజిటల్ ప్లాట్‌ఫారాలపై దుమ్ము రేపుతున్నారు. మన యువత నైపుణ్యాలు పెంచడానికి కేంద్రం మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలపై లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోంది. ► యువకుల్లో 36%, యువతుల్లో 42% ఉన్నత విద్యాభ్యాసంపై ఆసక్తి చూపుతున్నట్టు లోక్‌నీతి–సీస్‌డీఎస్ తాజా సర్వే వెల్లడించింది. యువతీ యువకులు విద్యావంతులైతే ఉపాధి అవకాశాలు బాగా పెరిగి వారి భవిష్యత్తు బంగారమవుతుంది. ► ఐదేళ్ల క్రితం దాకా యువతలో 65% ఉద్యోగ భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వోద్యోగాలే కోరుకునేవారు. వారిలో క్రమంగా మార్పు వస్తోంది. సర్కారు కొలువు కోరుకునే వారు 55 శాతానికి తగ్గారు. 25% మంది సొంత వ్యాపారాలకు సిద్ధపడుతుండటం మరో మంచి పరిణామం. ► దేశ జనాభాలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు 54 శాతమున్నారు. పైగా ఏటా 1.5 కోట్ల మంది పని చేసే వయసులోకి అడుగు పెడుతున్నారు. ► దేశంలోని టాప్ 10 స్టార్టప్ కంపెనీల సారథులు యువతీ యువకులే కావడం విశేషం. ► దేశ స్థూల జాతీయాదాయం(జీఎన్ఐ)లో 34% 15–29 మధ్య వయసున్న యువత నుంచే సమకూరుతోంది. వచ్చే 20 ఏళ్లలోనే సాధించాలి సూపర్ పవర్‌గా ఎదగాలని భారత్ కలలు కంటోంది. చైనాను అధిగమించి దూసుకెళ్లాలని అనుకుంటోంది. ఇందుకు ఆశలన్నీ యువత మీదే పెట్టుకుంది. ఇలాంటి భారీ లక్ష్యాలను మనం మరో 20 ఏళ్లలోనే సాధించాలి. ఎందుకంటే ఏ దేశమైనా వృద్ధి బాట పట్టాలంటే 15 నుంచి 59 ఏళ్ల వయసు మధ్యనున్న వారే కీలకం. ఆర్థిక వ్యవస్థకు వారే వెన్నుదన్నుగా నిలుస్తారు. ఆ వయసు వారే పని చేసే రంగంలో ఉంటారు. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది. ప్రస్తుతం దేశ జనా«భాలో ఈ వయసు వారు 63% ఉన్నారు. 2036 నాటికి 65 శాతానికి చేరే అవకాశముంది. తర్వాత నెమ్మదిగా పని చేసే వారి సంఖ్య తగ్గి దేశంలో వృద్ధులు పెరిగిపోతారు. ఆ లెక్కన వచ్చే 20 ఏళ్లలో మన యువతరం ఏ మేరకు కష్టిస్తుందనే దానిమీదే భావి భారత పురోగతి ఆధారపడి ఉంది. యువతలో శక్తి సామర్థ్యాలను గరిష్టంగా వినియోగించుకొని వృద్ధి బాట పట్టిన దేశాల్లో చైనాతో పాటు న్యూజిలాండ్, ఫిన్లాండ్, ఆస్ట్రియా వంటివి ముందు వరుసలో ఉంటాయి. మన యువత మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. జనాభా స్థిరీకరణ, 2024 నాటికి రూ.5 లక్షల కోట్ల ఎకానమీ వంటి లక్ష్యాలు సాకారం కావాలంటే ప్రభుత్వం యువతపై దృష్టి సారించాలి. వారిమీదే అధికంగా పెట్టుబడులు పెట్టాలి – పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా – నేషనల్ డెస్క్, సాక్షి -
తగ్గనున్న భారత్ జనాభా.. నివేదికలో షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో భారత జనాభా భారీగా తగ్గుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 141కోట్లుగా ఉన్న మన దేశ జనాభా.. 2100 నాటికి 100 కోట్లకు పడిపోతుందని తెలిపింది. జనాభా పెరుగుదల ఎంత ప్రతికూలమో.. క్రమంగా తగ్గినా అంతే ప్రమాదమని పేర్కొంది. జ్ఞానం, జీవన ప్రమాణాలు పడిపోయి క్రమంగా జనాభా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుందని స్టాండ్ఫోర్డ్ అధ్యయనం పేర్కొంది. రానున్న రోజుల్లో భారత జనసాంద్రత ఆందోళనకర స్థాయిలో పడిపోతుందని చెప్పింది. జనాభా విషయంలో భారత్, చైనా దాదాపు ఒకేలా కన్పిస్తున్నప్పటికీ.. జనసాంద్రతకు వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంది. భారత్‌లో ప్రతి చదరపు కిలోమీటర్‌కు 476మంది నివసిస్తారు. చైనాలో మాత్రం ఆ సంఖ్య 148 మంది మాత్రమే. 2100 నాటికి భారత్‌లో జనసాంద్రత 335కి పడిపోతుందని, ఇది ప్రపంచం మొత్తంతో పోల్చితే చాలా ఎక్కువ అని అధ్యయనం అంచనా వేసింది. భారత్‌తో పాటు చైనా, అమెరికాలో వచ్చే 78 ఏళ్లలో జనాభా తగ్గిపోనుంది. ముఖ్యంగా చైనా జనాభా 2100 నాటికి 49 కోట్లకు పడిపోనుంది. సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. 2050 నాటికే మొత్తం సంతానోత్పత్తి 0.5 శాతానికే పరిమితం అవుతుందని అంచనా. భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2032నాటికి 1.76శాతం నుంచి 1.39శాతానికి తగ్గనుంది. 2052నాటికి 1.28శాతానికి, 2082 నాటికి 1.2శాతానికి, 2100 నాటికి 1.19శాతానికి పడిపోతుందనే అంచనాలున్నాయి. చదవండి: మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు -
జనమే... జయమా?
అగ్రస్థానం అందరూ ఆశించేదే, ఆనందించేదే! కానీ, ఒక్కోసారి కొన్ని అంశాల్లో ప్రథమ స్థానం అంటే ఉలిక్కిపడాల్సి వస్తుంది. ఆగి, ఆలోచించాల్సి వస్తుంది. వచ్చే ఏడాది కల్లా ప్రపంచ జనాభాలో మన దేశమే నంబర్ వన్ అవుతుందన్న ‘ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం’ (యూఎన్‌పీడీ) తాజా అంచనా అలాంటి పరిస్థితే కల్పించింది. ప్రపంచ జనాభాలో ఇప్పటి దాకా చైనా తర్వాత రెండో స్థానంలో మనం ఉన్నాం. వచ్చే ఏడాది కల్లా చైనాను అధిగమించి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించనుంది. అలాగే, ఈ నవంబర్ 15 నాటికే ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనున్నట్టు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం ఐరాస వెలువరించిన ఈ తాజా నివేదిక అంచనా. దేశంలో ఇంతటి జనాభా పెరుగుదల మంచికా, చెడుకా అనే చర్చ మొదలైంది. మిగిలిన అంశాల్లో కాకున్నా కనీసం జనాభాలోనైనా అగ్రరాజ్యమైన చైనాను అధిగమిస్తున్నామని సంబరపడాలన్నది కొందరి వ్యంగ్య చమత్కృతి. అయితే, జనాభా పెరుగుదలతో సవాళ్ళే కాక, సమీక్షించుకొనే వీలూ చిక్కిందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తుండడం విశేషం. ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లయితే, అంతకన్నా కొద్దిగా తక్కువగా భారత జనాభా 141.2 కోట్లు. వచ్చే ఏడాది కల్లా ఈ పరిస్థితి తారుమారై, చైనాను భారత్ దాటేస్తుందన్నది ఇప్పుడు పతాక శీర్షికలకు ఎక్కింది. నిజానికి, 2027 నాటికి జనాభాలో మనం చైనాను దాటతామని గతంలో ఐరాస అంచనా. తీరా తాజా లెక్కల ప్రకారం అంతకన్నా నాలుగేళ్ళ ముందరే 2023లో ఆ ‘జనాభా ఘనత’ మనం సాధిస్తున్నామన్నమాట. దీనికి కారణం – జనాభా విధానాన్ని మన దేశం సక్రమంగా అమలు చేయకపోవడం కాదు. చైనాలో సంతాన సాఫల్యత అనుకున్న దాని కన్నా తక్కువ కావడం! ఒక్క బిడ్డే ఉండాలంటూ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు చైనా కఠినంగా జనాభా నియంత్రణ చేసింది. కానీ, 2016లో దాన్ని సడలించి, ఇద్దరు పిల్లల విధానానికి ఓకే చెప్పింది. 2021 నుంచి మరింత సడలించి, మూడో సంతానానికీ సరేనంది. తీరా అప్పటికే ఒకే బిడ్డ పద్ధతికే చైనాలో అలవాటు పడిపోయారు. ఫలితంగా డ్రాగన్ దేశంలో జీవితకాల సంతాన సాఫల్యతా రేటు (టీఎఫ్ఆర్) 1.16 మాత్రమే. అదే మన దేశంలో 2 ఉందని తాజా ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (ఎన్ఎఫ్హెచ్ఎస్) తేల్చింది. అలా మన జనాభా గత అంచనా కన్నా ముందే చైనాను దాటేస్తోంది. దేశంలో జనగణన ఆధారంగా భవిష్యత్ జనాభాను అంచనా కట్టే రిజిస్ట్రార్ జనరల్ 2011 నాటి జనగణన ఆధారంగా 2019లో ఓ అంచనా విడుదల చేశారు. ఆ లెక్కలో చూస్తే మనం చైనాను దాటడానికి 2023 కన్నా కాస్తంత ఎక్కువ సమయం పడుతుంది. వారి వారి అంచనాలను బట్టి తేదీలు మారినా, రేపు కాకుంటే ఎల్లుండైనా జనాభాలో చైనాను భారత్ దాటేయడం నిస్సందేహమని అందరూ ఒప్పుకుంటున్నారు. అయితే, ఏ దేశమైనా జనాభా స్థిరీకరణ సాధించాలంటే టీఎఫ్ఆర్ 2.1 ఉండాలని యూఎన్‌పీడీ ఉవాచ. మన దేశంలో ఇప్పుడు ఆ రేటు 2 గనక, మరికొన్నేళ్ళు మనం అదే రేటును కొనసాగించగలిగితే చాలు. మనం అత్యంత కీలకమైన జనాభా స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్టే! ఒకప్పుడు కుటుంబ నియంత్రణ విధానాన్ని గట్టిగా మొదలుపెట్టినప్పుడు టీఎఫ్ఆర్ 6 ఉన్న మన దేశం ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడం చెప్పుకోదగ్గ విజయమే! చైనా లాంటి చోట్ల అమలు చేసిన నిర్బంధ కుటుంబ నియంత్రణకూ, మన దేశంలో అవగాహన, చైతన్యంతో ఒప్పించి సాధించిన జనాభా నియంత్రణకూ చాలా తేడా ఉంది. అయితే, ఇప్పటికీ లింగ వివక్ష ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి అనేక ప్రాంతాల్లో జాతీయ సగటు కన్నా ఎక్కువ టీఎఫ్ఆర్ ఉంది. ఇది ఆందోళనకరం. అక్కడ ప్రజల్ని జన నియంత్రణకు ఉద్యుక్తుల్ని చేయాలి. నిజానికి, దేశంలో 70 కోట్ల మంది దాకా ఉన్న మహిళల్ని చైతన్యపరచాలి. జనాభా నియంత్రణ సహా సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనలో స్త్రీలను భాగం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని గ్రహించాలి. ఒకప్పుడు ‘చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం’ అన్నాం. పెరిగిన సగటు ఆయుః ప్రమాణాలతో రాబోయే దశాబ్దాల్లో పిన్నలు తగ్గి, పెద్దలు పెరిగాక చిన్న కుటుంబాలతోనూ సమస్యలుంటాయని గుర్తించాలి. వ్యక్తిగత ప్రయోజనాల వ్యష్టి జీవన విధానం కన్నా, పెద్దలను పిల్లలు చూసుకొనే సమష్టి భారతీయ కుటుంబ వ్యవస్థను ఆశ్రయించడమే అందుకు పరిష్కారం. ఐరాస ప్రధాన కార్యదర్శి అన్నట్టు, పుడమి సంరక్షణలో మనందరి బాధ్యతను మరోసారి గుర్తు చేసుకోవడానికి ఇదే సరైన సందర్భం. చేసుకున్న బాసలను నెరవేర్చడంలో ఇప్పటికీ ఎక్కడ వెనుకబడి ఉన్నామో ఆగి, ఆలోచించుకోవాల్సిన తరుణం. ఇప్పుడు జనసంఖ్య ఎంత ఉందనే దాని కన్నా, వారికి ఎంత నాణ్యమైన జీవితం గడిపే వీలు కల్పిస్తున్నామన్నదే ఆలోచించాల్సిన అంశం. అందరికీ కూడు, గూడు, గుడ్డ ముఖ్యం. దారిద్య్రాన్ని తగ్గించడం, జనాభా అంతటికీ విద్య, వైద్య వసతులు కల్పించడంపై దృష్టి మరల్చాలి. 25 నుంచి 64 ఏళ్ళ లోపు వారు ఎక్కువున్నందున ఉత్పాదకత, ఆదాయం రెండూ పెరిగే నైపుణ్యాలను వారికి అందించాలి. విజ్ఞానాధారిత ఆర్థికవ్యవస్థలోకి ప్రయాణంలో యువతకు అవసరమైన సామర్థ్యాల్ని అందించాలి. దేశంలో 65 ఏళ్ళ పైబడిన వర్గం శరవేగంతో పెరుగుతున్నందున, పెద్ద వయసువారికి సామాజిక భద్రత కల్పనపై పాలకులు సమయం వెచ్చించాలి. ప్రపంచంలో ప్రథమ స్థానానికి పరుగులు తీస్తూ ‘జన భారత్’ అనిపించుకుంటున్న మనం అదే నోట ‘జయ భారత్’ అనిపించుకొనే రోజూ రావాలి! ఈ దేశానికి ఇప్పుడదే కావాలి!! -
చైనా కాదు త్వరలో భారత్ నెం.1: యూఎన్ నివేదిక
వచ్చే ఏడాది నాటికి చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుందట. ఈ మేరకు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదల చేసింది. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ఏమంటోందంటే.. ప్రపంచ జనాభా నవంబర్ మధ్య నాటికి ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని, దీంతో పాటు 2030లో దాదాపు 8.5 బిలియన్లుగా, 2050లో 9.7 బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా తక్కువ సంఖ్యలో జనాభా పెరుగుతున్నట్లు నివేదికలో వెల్లడించింది. నివేదికలోని కొన్ని కీలకమైన విషయాలు: ►2023నాటికి చైనాను భారత్ అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారునుందని అంచనా వేసింది. ►2050 వరకు అంచనా ప్రకారం.. ప్రపంచ జనాభాలో సగానికి పైగా జనాభా కేవలం ఎనిమిది దేశాలలో ఉండనున్నట్లు తెలిపింది. (అందులో భారత్ కూడా ఒకటి) ►ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, ఓషియానియాలోని జనాభా ఈ శతాబ్దం చివరి నాటికి పెరుగుదల నెమ్మదిగా ఉండనున్నట్లు భావిస్తున్నట్లు పేర్కొంది. ►2010-2021 నుంచి వలసదారుల నికర ప్రవాహం 1 మిలియన్ దాటిన 10 దేశాలలో ఉన్నాయని తెలపగా, అందులో భారతదేశం కూడా ఉంది. ►సిరియా, వెనిజులా, మయన్మార్ వంటి దేశాలు అభద్రత, సంఘర్షణ కారణాల వల్ల అక్కడ నుంచి వలసలు పెరుగుతున్నట్లు వెల్లడించింది. ►ఎక్కువగా కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా ప్రపంచ ఆయుర్దాయం 2019లో 72.8 నుంచి 2021లో 71.0 సంవత్సరాలకు పడిపోయిందని తెలిపింది. ►తక్కువ అభివృద్ధి చెందిన 46 దేశాలు జనాభా పరంగా.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నట్లు పేర్కొన్నారు. 2022 నుంచి 2050 మధ్య చాలా వరకు జనాభా రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!
జులై 11 ప్రపంచ జనాభా దినోత్వం సందర్భంగా నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు పనిలో పనిగా జనాభా నియంత్రణ కోసం ఒక చిన్న పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు. గత నెలలో ఈ శాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని అందరూ అంటారు గానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పి వార్తల్లో నిలిచారు. మళ్లీ మరోసారి కుటుంబ నియంత్రణ అంశంపై చాలా చమత్కారమైన పరిష్కార మార్గం చెప్పి మరోసారి వార్తలో నిలిచారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....ఇది చాలా సున్నితమైన విషయం. జనాభా పెరుగుదలను నియంత్రించటం కోసం మనం సరైన మార్గాన్ని ఎంచుకుందాం. లేదా నాలాగే సింగిల్‌గా ఉంటూ...అందరం కలసి స్థిరమైన భవిష్యత్తు కోసం పాటుపడదాం. ఈ రోజు నుంచే సింగిల్ ఉద్యమంలో పాల్గొనండి అని నాగాలాండ్ మంత్రి ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు నాగాలాండ్ మంత్రికి చక్కటి హాస్య చతురత ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. On the occasion of #WorldPopulationDay, let us be sensible towards the issues of population growth and inculcate informed choices on child bearing. Or #StaySingle like me and together we can contribute towards a sustainable future. Come join the singles movement today. pic.twitter.com/geAKZ64bSr — Temjen Imna Along (@AlongImna) July 11, 2022 (చదవండి: రాష్ట్ర సీఎంను ఇలాగే ఆహ్వానిస్తారా?.. బీజేపీపై టీఎంసీ ఆగ్రహం) -
World Population Day: ప్రభం‘జనం’..800
ప్రపంచ జనాభా ఈ ఏడాది ఒక మైలు రాయికి చేరుకోబోతోంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభా 800 కోట్లు కానుంది. వనరులు చూస్తే పరిమితం. జనాభా చూస్తే అపారం వీరందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తే అధిక జనాభా విసిరే సవాళ్ల నుంచి బయటపడతామా ? ఐక్యరాజ్యసమితి ఇప్పుడు ఈ దిశగానే కృషి చేస్తోంది. ప్రస్తుతం 795 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్ 15 నాటికి 800 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. ఈ సారి ప్రపంచ జనాభా దినోత్సవం రోజు ఐక్యరాజ్య సమితి ప్రజల సుస్థిర భవిష్యత్‌పై దృష్టి సారించింది. భూమ్మీద ఉన్న పరిమితమైన వనరులతో తమకున్న అవకాశాలను, హక్కుల్ని వినియోగించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడడంతో ఆ దిశగా అందరిలోనూ అవగాహన కల్పించడానికి యూఎన్ నడుం బిగించింది. జనాభా పెరుగుదల కారణంగా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు, ప్రకృతి సమతుల్యతకు పెరుగుతున్న జనాభా ఎలా గొడ్డలి పెట్టుగా మారుతుందో ప్రజల్లో అవగాహన కల్పించడానికి సిద్ధమైంది. తరాల మధ్య అంతరాలు, వనరులు అందరికీ అందుబాటులో లేకపోవడం నిరుపేద దేశాల్లో ఆకలి కేకలు, ఆరోగ్యం అందకపోవడం వంటి సమస్యలుంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు బాగా చదువుకొని, మంచి ఆరోగ్యంతో , మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికే మన భూమి పునరుత్పాదక శక్తి కంటే రెండింతలు ఎక్కువగా వనరుల్ని వాడేస్తున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి మన అవసరాలు తీర్చడానికి మూడు భూమండలాలు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 80 కోట్ల మందికి కావల్సినంత పోషకాహారం దొరకకపోతే మరోవైపు 65 కోట్ల మందికి సమృద్ధిగా ఆహారం లభించి ఊబకాయం బారిన పడుతున్నారు. 2050 నాటికి ఇప్పుడు లభిస్తున్న ఆహారం కంటే 70% ఎక్కువ అవసరం ఉంటుంది. వ్యవసాయ దిగుబడులకు చేసే ప్రయత్నాలతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. నాణేనికి రెండువైపులా ఉన్నట్టే పెరిగిపోతున్న జనాభా అనేది సమస్య కాదని, ఎన్నో సమస్యలకు అది పరిష్కారం కూడా అవుతుందని మన అనుభవాలే పాఠాలు నేర్పిస్తున్నాయని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్పీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నటాలియా కనెమ్ వ్యాఖ్యానించారు. జనాభా ఒక రకంగా శాపం. మరో రకంగా చూస్తే వరంగా మారే పరిస్థితులు వచ్చాయన్న అభిప్రాయం బలపడుతోంది. అత్యధిక దేశాల్లో జనాభా నియంత్రణపై అవగాహన ఉండడంతో ఇప్పుడు వనరుల సమాన పంపిణీపై అవగాహన పెంచే పరిస్థితులు వచ్చాయి. పిల్లల్ని కనకపోవడం వల్ల జపాన్, ఇటలీ వంటి దేశాల్లో వృద్ధులు పెరిగిపోయి ఒక సమస్యగా మారింది. చైనా కూడా వన్ చైల్డ్ పాలసీని రద్దు చేయాల్సి వచ్చింది. అదే భారత్‌ను తీసుకుంటే యువచోదక శక్తితో అభివృద్ధి పథంలో దూసుకువెళుతోంది. యువ భారతం ప్రపంచ జనాభాలో అయిదో వంతు మంది భారత్‌లోనే ఉన్నారు. ప్రతీ ఏడాది సగటున 1 శాతం జనాభా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ దేశాల్లోనే యువశక్తి అత్యధికంగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో భారత్ ఉంది. దేశంలోని 130 కోట్ల జనాభాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు 25 శాతంపైనే ఉంది. దేశంలో యువ జనాభా సగటు వయసు 28 ఏళ్లు అయితే చైనాలో 38 ఏళ్లు, జపాన్‌లో 48గా ఉంది. ఈ యువశక్తితోనే భారత్ ప్రపంచంలో శక్తిమంత దేశంగా అవతరిస్తుంది. ఇక జనాభా మితిమీరి పెరిగితే మాత్రం వారి అవసరాలు తీర్చలేక సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి. వృద్ధ జపాన్ ఆసియా, యూరప్ దేశాల్లో అత్యధిక వృద్ధులు నివసిస్తున్నారు. 65 ఏళ్లకు మించి ఉన్న వారు జపాన్ జనాభాలో 28% ఉంటే, 23 శాతం వృద్ధ జనాభాతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఆయుర్దాయం పెరిగిపోవడం, జననాలు తగ్గిపోవడంతో జపాన్, ఇటలీల్లో పని చేసే వారి సంఖ్య తగ్గిపోవడం వల్ల సమస్యలు ఎదురుకానున్నాయి. 2025–2040 మధ్య కాలంలో జపాన్‌లో పని చేసే ప్రజలు (20–64 ఏళ్లు) కోటి మందికి పడిపోతుందని, దానిని ఎదుర్కోవడానికి ఆ దేశం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. యూఎన్ తాజా నివేదిక ► ప్రపంచ జనాభా 600 కోట్ల నుంచి 700 కోట్లకి చేరుకోవడానికి 12 ఏళ్లు పడితే, అంతే సమయంలో 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోబోతోంది. ► ప్రపంచ జనాభాకి మరో 100 కోట్ల మది పెరగడానికి ఈసారి 14.5 సంవత్సరాలు పట్టవచ్చునని యూఎన్ అంచనా వేసింది. ► 2080 నాటికి ప్రపంచ జనాభా అత్యధికంగా వెయ్యి కోట్లకు చేరుకొని, 2100 వరకు అలాగే స్థిరంగా ఉంటుంది ► 700 కోట్ల నుంచి 800 కోట్లకి చేరుకోవడంలో సగం జనాభా ఆసియా దేశాల నుంచి ఉంటే, ఆఫ్రికా దేశాలు రెండో స్థానంలో ఉన్నాయి. 40 కోట్ల జనాభా ఆఫ్రికా దేశాల నుంచి పుట్టుకొచ్చింది. ► ప్రస్తుతం జనాభా అత్యధికంగా పెరుగుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత స్థానాల్లో చైనా, నైజీరియా ఉన్నాయి. ► అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పని చేసే జనాభా (25 నుంచి 64 ఏళ్ల వయసు) పెరుగుతూ వస్తోంది. ► ప్రపంచ సగటు ఆయుఃప్రమాణం 72.8 ఏళ్లకు చేరుకుంది. 1990 నుంచి చూసుకుంటే ఆయుర్దాయం తొమ్మిది సంవత్సరాలు పెరిగింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
'ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. ప్రోత్సాహకాలు అందుకోండి'
బీజింగ్: జన సంఖ్య పరంగా ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉన్న చైనా.. ప్రస్తుతం జనాభా సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కొన్నేళ్లుగా చేపట్టిన కట్టడి చర్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా మంది యువత పెళ్లి, సంతానానికి దూరంగా ఉండిపోవటమే అందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ అంశం దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన చెందుతోంది డ్రాగన్ దేశం. జనాభా వృద్ధి, శ్రామిక శక్తిని పెంచేందుకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ.. భారీ ప్రోత్సాహకాలు ఇస్తోంది. అందులో పన్నుల రాయితీ, ఇంటి రుణాలు, విద్యా ప్రయోజనాలతో పాటు నగదు రూపంలోనూ ప్రోత్సాహకాలు ఉన్నాయి. చైనాలోని జనాభాపై 2022, జనవరిలో గ్లోబల్ టైమ్స్ విడుదల చేసిన ఓ నివేదిక విస్తుపోయే విషయాలను వెల్లడించింది. 2021 చివరి నాటికి చైనాలో 1.413 బిలియన్ల జనాభా ఉండగా.. జననాల సంఖ్య 10.62 మిలియన్లకు పడిపోయింది. అది మరణాల సంఖ్యకు సమానంగా ఉండటం గమనార్హం. ఈశాన్య నగరమైన వూహూలో జననాల రేటు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. ఇలాగే జననాల రేటు పడిపోతే.. యువకుల సంఖ్య తగ్గిపోయి కొన్నేళ్లలోనే శ్రామిక శక్తి సైతం వేగంగా పడిపోనుంది. జనాభా సంక్షోభానికి కారణమిదే.. పెరుగుతున్న జనాభాను కట్టడి చేసేందుకంటూ.. గతంలో ఒకే బిడ్డ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది చైనా కమ్యూనిస్ట్ పార్టీ. దశాబ్దాలుగా బలవంతంగా అబార్షన్లు చేయించి మహిళల హక్కులను కాలరాసింది. దాంతో పిల్లల్ని కనేందుకు చాలా మంది వెనకడుగు వేయాల్సి వచ్చింది. కొన్నేళ్లలోనే అది జనాభా సంక్షోభానికి దారి తీసింది. ఈ సమస్యను గుర్తించిన చైనా.. ప్రస్తుతం ఇద్దరు, లేదా ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతిస్తోంది. అంతే కాదు మహిళలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు మహిళలకు.. పన్ను రాయితీలు, ఇంటి రుణాలు, విద్యా ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే, ఈ ప్రోత్సాహకాలు వివాహం జరిగిన దంపతులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఒకే బిడ్డ ఉన్న తల్లిదండ్రులు ప్రస్తుతం సామాజిక ప్రయోజనాలైన ఆరోగ్య బీమా, విద్య వంటివి పొందలేకపోతున్నారని తెలిపింది. మరోవైపు.. ఇప్పటికీ మైనారిటీలు, ఒంటరి మహిళలపై చైనా వివక్ష చూపుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నాయి. కొత్త పాలసీపైనా వ్యతిరేకత.. ఆ దేశంలో మహిళలు విద్య, ఆర్థిక పరంగా అభివృద్ధి సాధిస్తున్నా.. వివాహం విషయంలో పురుషులతో పోలిస్తే వెనకబడే ఉన్నారు. గత ఏడాది కొత్త జనాభా, కుటుంబ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది బీజింగ్. దంపతులు ముగ్గురు పిల్లలను కలిగి ఉండేందుకు అనుమతించింది. అయితే.. ఆర్థిక భారం వల్ల ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటం పట్ల అక్కడి ప్రజలు విముఖత ప్రదర్శిస్తున్నారు. -
తెలంగాణకు పట్టణ కళ
సాక్షి, హైదరాబాద్: పట్టణీకరణలో తెలంగాణ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఎంతగా అంటే.. 2025 నాటికి తెలంగాణ పట్టణ జనాభా 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నీతిఆయోగ్ వెల్లడించింది. ఇక్కడ పట్టణీకరణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే రెండున్నర దశాబ్దాల ముందున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తాజా నివేదిక వివరాలను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోని పట్టణ జనాభా జాతీయ సగటు మొత్తం జనాభాలో 31.16 శాతంగా ఉండగా.. తెలంగాణ మొత్తం జనాభాలో 46.8 శాతంగా నమోదైంది. ఈ అంశంలో తెలంగాణ కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మాత్రమే ముందున్నాయి. పట్టణీకరణ వేంగంగా ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు మొత్తం జనాభాలో సగటున 48.45 శాతం పట్టణ జనాభాను నమోదు చేస్తే, కేరళలో 47.23 శాతంగా నమోదైంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర 45.23 శాతంతో ఉంది. కాగా, వచ్చే మూడేళ్లలో తెలంగాణ పట్టణ జనాభా తమిళనాడు, కేరళను దాటి తొలి స్థానానికి చేరుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. రాష్ట్ర జీడీపీలో మూడింట రెండొంతుల వాటా పట్టణాల్లోనే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే ఆర్థిక కార్యకలాపాల ప్రభావంతో ఉపాధి, ఆదాయ స్థాయిలు అధికంగా ఉంటాయని నీతి ఆయోగ్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సంఖ్యను 142కు పెంచారు. ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీల్లో మౌలికవసతులు మెరుగుపడ్డాయి. ఆర్థిక కార్యకలాపాలు అధికంగా జరగడంతో రాష్ట్ర జీడీపీలో మూడింట రెండు వంతుల వాటాను పట్టణాలే అందిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలలో విద్య, ఉపాధి అవకాశాలు, మంచి జీవన స్థితిగతులు ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి కారణమవుతున్నాయి. ఆరు సంవత్సరాలుగా ‘జీవన నాణ్యత సూచిక‘లో దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. పట్టణ ప్రాంతాలలో జనాభా పెరుగుదల రాష్ట్రాన్ని పట్టణీకరణలో ప్రధాన సాధకంగా మారుస్తుండగా, 2025 నాటికి తెలంగాణ రాష్ట్రం యాభై శాతం పట్టణ జనాభా పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అంచనా వేశారు. 2050 నాటికి దేశంలో ఇదే తరహా పట్టణీకరణ ప్రక్రియ సాగుతుందని, తద్వారా తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రెండున్నర దశాబ్దాలు ముందుందని పేర్కొన్నారు. హైదరాబాద్ అన్ని రకాల ప్రమాణాల్లో మేటిగా ఉండటం కూడా రాష్ట్రం పట్టణీకరణలో ముందుండడానికి కారణంగా చెపుతున్నారు. అన్ని సూచికల్లో హైదరాబాద్ టాప్ దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరం అన్ని సూచికల్లో అగ్రభాగాన కొనసాగుతోంది. కొనుగోలు శక్తి సూచిక, భద్రత, ఆరోగ్య సంరక్షణ, జీవన వ్యయం, ఆస్తి ధర మొదలు ఆదాయ నిష్పత్తి, ట్రాఫిక్ ప్రయాణ సమయం, కాలుష్యం/వాతావరణ సూచికలో హైదరాబాద్ నగరం ముందంజలో ఉంది. ఇటువంటి పలు అంశాలతో హైదరాబాద్ నగరం ప్రపంచంలోని ముప్పై ప్రధాన నగరాల్లో ఒకటిగా నిలిచిందని నీతి ఆయోగ్ పేర్కొంది. -
నాటి పల్లెలు.. నేడు సరికొత్త హంగులతో..
కూలి కోసం.. ఉపాధి కోసం.. ఎదిగిన బిడ్డ చదువు కోసం.. కుటుంబ సభ్యుల అవసరాల కోసం పట్టణంలో బతుకుదామని పల్లెవాసి వలస బాట పడుతున్నాడు. ఫలితంగా పట్టణీకరణ పెరుగుతోంది. గత 20 ఏళ్లలో పుర/నగరాల జనాభా గణనీయంగా పెరగడమే దీనికి నిదర్శనం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2001 నుంచి 2011 మధ్య 29 శాతం పట్టణ జనాభా పెరిగిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ పదేళ్లలో ఇది ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం జనాభా 2001 జనæ గణన ప్రకారం.. 44,65,144. 2011 నాటికి ఇది 48,87,813కి పెరిగింది. ఆ పదేళ్ల కాలంలో జిల్లా మొత్తం జనాభా 9.46 శాతం అంటే 4,22,669 పెరిగింది. అదే సమయంలో పట్టణ జనాభా ఏకంగా 29 శాతం అంటే 3,67,158 పెరగడం విశేషం. 2001లో జిల్లాలో మొత్తం 12 పట్టణాలు ఉండగా, 2011 నాటికి మరో పట్నం అదనంగా చేరింది. ప్రస్తుతం దాచేపల్లి, గురజాల కూడా పట్నాలుగా రూపాంతరం చెందాయి. ఎన్నో గ్రామాలు సమీపంలోని పట్టణాలు, నగరాల్లో విలీనమయ్యాయి. కరోనా వల్ల 2021లో జరగాల్సిన జన గణన చేపట్టలేదు. జనగణన పూర్తయితే పట్టణ జనాభాలో గణనీయ పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యా, వైద్య, ఉపాధి సదుపాయాల కోసం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యవసాయాధారిత జిల్లా. గత 20 ఏళ్లలో సాగునీటి వనరులు అభివృద్ధి చెందడంతో వాణిజ్య, ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరిగింది. గ్రామీణ రైతుల, రైతు కూలీల ఆదాయాలూ, జీవన ప్రమాణాలూ మెరుగుపడ్డాయి. ఫలితంగా సౌకర్యాలపై మక్కువ పెరిగింది. దీనికితోడు పల్లెవాసుల్లో విద్యకు ప్రాధాన్యం పెరిగింది. నగరాలకు వలస వెళ్తే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, విద్య, వైద్య, రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉంటాయనే ఆలోచన గ్రామీణుల్లో బలంగా నాటుకుంది. అందుకే పల్లె ప్రజలు పట్టణాలకు రావడానికి ఆసక్తి చూపుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. గుంటూరు విద్యా కేంద్రంగా భాసిల్లుతుండటంతో ఇక్కడ జనాభా పెరుగుదల అధికంగా ఉంది. వైద్యం, ఇంజినీరింగ్, వాణిజ్య, సాంకేతిక, ఫార్మా తదితర కళాశాలలు అందుబాటులో ఉండడం కలిసొస్తోంది. ఒకప్పుడు పంచాయతీలుగా ఉన్న గ్రామాలు ఇప్పుడు నగర పంచాయతీలు, పట్టణాలుగా రూపాంతరం చెందడం పట్నం వాసంపై ప్రజల్లో ఉన్న అమితాసక్తికి సూచికగా విశ్లేషకులు చెబుతున్నారు. నాటి పల్లెలు.. నేడు సరికొత్త హంగులతో.. గతంలో పల్లెటూళ్లుగా ఉన్న రెడ్డిపాలెం, గోరంట్ల, అడివితక్కెలపాడు, పెదపలకలూరు, నల్లపాడు, బుడంపాడు, లాలుపురం, పొత్తూరు, అంకిరెడ్డిపాలెం, నాయుడుపేట, చౌడవరం, ఏటుకూరు, బొంతపాడు లాంటి గ్రామాలన్నీ ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో విలీనమయ్యాయి. ఫలితంగా పట్టణ సొబగులు అద్దుకున్నాయి. ఇస్సపాలెం, రావిపాడు, లింగంగుంట్ల గ్రామాలు దాదాపుగా నరసరావుపేట పట్టణంలో కలిసిపోయాయి. మెరుగైన జీవనం కోసమే.. పట్టణాల్లో మెరుగైన విద్య, ఉపాధి, వైద్య అవకాశాలు అందుబాటులో ఉండడంతో పల్లెల్లోని ప్రజలు దగ్గర్లోని నగరాలకు వలస వెళ్తున్నారు. ఎక్కువగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలే వీరిలో అధికం. వీరికి పల్లెల్లో పెద్దగా ఆస్తులేవీ ఉండవు కాబట్టి కుటుంబ అవసరాల కోసం పట్టణాలకు వచ్చి స్థిరపడుతున్నారు. – డాక్టర్ బి నాగరాజు, మానవ వనరుల అభివృద్ది విభాగం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మా పల్లె మారిపోయింది మాది 2001 వరకు పల్లెటూరే. 12 ఏళ్ల క్రితం గుంటూరులో విలీనమైంది. పూరి గుడిసెల స్థానంలో ఇప్పుడు బహుళ అంతస్తుల మేడలు వెలిశాయి. గతంతో పోలిస్తే భూమి ధరలు ఎన్నో రేట్లు పెరిగాయి. వ్యాపారాలు వృద్ధి చెందాయి. – డొక్కు కాటమరాజు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, గోరంట్ల పిల్లల చదువుల కోసం.. మా గ్రామంలో నాలుగు ఎకరాల పొలం ఉంది. కానీ మెరుగైన విద్య అందుబాటులో లేదు. దీంతో నా ఇద్దరు అమ్మాయిల చదువుల నిమిత్తం గుంటూరు నగరానికి వలస వచ్చాను. నగరం నుంచి గారపాడుకు వెళ్లి వస్తూ వ్యవసాయం చేస్తున్నాను. ఇక్కడ నివాసం ఉంటూ పిల్లల చదివిస్తున్నాను. పట్టణాల్లో అన్ని వసతులూ ఉంటాయి. – బొబ్బా నాగిరెడ్డి, గారపాడు, వట్టిచెరుకూరు మండలం -
భారత్ జనాభా నియంత్రణ చట్టం అతిత్వరలో..
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం దిశగా కేంద్రం చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి(ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్) మంగళవారం.. రాయ్‌పూర్(ఛత్తీస్గడ్)లో జనాభా నియంత్రణ చట్టం మీద వ్యాఖ్యలు చేశారు. గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌కు హాజరైన ఆయనకు జనాభా పెరిగిపోతుండడం, కట్టడికి చట్టం మీద ఓ ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది. ‘‘ఆందోళన అక్కర్లేదు. జనాభా నియంత్రణ చట్టం త్వరలోనే రాబోతోంది. బలమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇలాగే ఉంటుంది. అది కచ్చితంగా.. అతి త్వరలోనే వచ్చి తీరుతుంద’’ని వ్యాఖ్యానించారు. పాపులేషన్ కంట్రోల్ బిల్లు 2019లో జులైలో రాజ్య సభలో ప్రవేశపెట్టారు బీజేపీ నేత రాకేశ్ సిన్హా. సిన్హా ప్రతిపాదించిన 2019 బిల్లులో.. ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించని దంపతులకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హత వంటి జరిమానాలను ప్రవేశపెట్టడం లాంటి అంశాలను ప్రస్తావించింది. దేశంలో జనాభా నియంత్రణే ధ్యేయంగా ఈ చట్టం రాబోతోంది. మరో దశాబ్ద కాలంలో చైనా జనాభాను అధిగమించి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా అవతరించబోతోందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే.. జనాభా నియంత్రణ బిల్లు రూపకల్పన తెర మీదకు వచ్చింది. బిల్లు ప్రతిపాదనపై 125 మంది ఎంపీలు సంతకం చేశారు. అయితే ఇస్లాం విధానాలకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
మానవ వంశవృక్షం లెక్కతేల్చారు..
ఈ రోజు ఈ భూమ్మీద సుమారుగా 795 కోట్ల మంది జనమున్నారు. రోజురోజుకీ ఆ సంఖ్య పెరుగుతోంది కూడా.. ఇంతకీ మీరెప్పుడైనా ఆలోచించారా.. అసలు మనకన్నా ముందు ఈ భూమ్మీద ఎంతమంది జనం నివసించి ఉండి ఉంటారని.. ఎంత మంది పుట్టి.. చనిపోయి ఉంటారని.. అసలు కచ్చితంగా మన పూర్వీకులెంతమంది అని.. లేదు కదూ..నిజానికి అలా లెక్కగట్టడం సాధ్యమేనా? అసలీ లెక్కలేంటి? కార్ల్ హాబ్ తోషికో కనెడా సాధ్యమేనని అంటున్నారు డెమోగ్రాఫర్స్ తోషికో కనెడా, కార్ల్ హాబ్‌లు. డెమోగ్రాఫర్ అంటే.. జనాభా పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడంలో నిపుణులు అన్నమాట. మన పూర్వీకుల సంఖ్యను లెక్కించడానికి ఈ జనాభా శాస్త్రవేత్తలు క్రీ.పూ. 190000ని బెంచ్‌మార్క్ కింద తీసుకున్నారు. ఎందుకంటే.. మన అసలు సిసలు పూర్వీకుడైన ఆధునిక హోమోసెపియన్ నివసించిన కాలమది. దీని ప్రకారం మనకు ముందు 10,900 కోట్ల మంది మానవులు ఈ భూమ్మీద జన్మించి, మరణించారని తేల్చారు. దానికి ఇప్పుడున్న జనాభాను కలిపితే.. ఇప్పటివరకూ మొత్తంగా 11,695 కోట్ల మంది ఈ భూమ్మీద నివసించినట్లు అన్నమాట. ఈ లెక్కకు ఆధారం ఏంటి? ఇందుకోసం వారు మూడు అంశాలను ఆధారంగా చేసుకున్నారు. 1. మానవులు ఈ భూమ్మీద నివసించారు అని భావిస్తున్న కాల వ్యవధి. 2. నాటి నుంచి నేటి దాకా.. వివిధ కాలాల్లో సగటు జనాభా పరిణామం. 3. ఆయా కాలాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకు జననాల సంఖ్య.. మొత్తంలో మనమెంత? ప్రస్తుత జనాభా(795 కోట్లు)ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇప్పటివరకూ భూమ్మీద నివసించిన మొత్తం మానవుల సంఖ్యలో మన వాటా 7% అని జనాభా శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు.. 2050 నాటికి మరో 400 కోట్ల జననాలు కలుపుకుంటే.. అప్పటికీ ఈ భూమ్మీద నివసించిన మానవుల సంఖ్య సుమారు 12,100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. రుణపడి ఉండాల్సిందే.. నిజానికి ఈ 10900 కోట్ల మందికి మనం రుణపడి ఉండాలని ‘అవర్ వరల్డ్ ఇన్ డాటా’సంస్థకు చెందిన మాక్స్ రోజర్ అన్నారు. ‘‘ఈ ఆధునిక నాగరికత కోసం.. మనం మాట్లాడుతున్నఈ భాషల కోసం.. మనం వండుతున్న ఈ వంటల కోసం..మనం వింటున్న ఈ సంగీతం కోసం.. మనం వాడుతున్న ఆధునిక పరికరాల కోసం.. మనం వారికి థాంక్స్ చెప్పాల్సిందే. మనకు ఇప్పుడు తెలిసినదంతా.. వారి నుంచి నేర్చుకున్నదే. మనముంటున్న ఇళ్లు.. వాడుతున్న మౌలిక సదుపాయాలు, వివిధ రంగాల్లో గొప్పగొప్ప ఘనతలు.. మన చుట్టూ ఉన్నదంతా మన పూర్వీకులు.. మనముందున్నవారు నిర్మించి ఇచ్చినదే..’’అని ఆయన అన్నారు. మాక్స్ చెప్పిందీ నిజమే మరి.. మనం ఇంతకు ముందెప్పుడూ చెప్పిందీ లేదు.. అందుకే ఈసారైనా చెప్పేద్దాం.. తాతగారూ.. ముత్తాతగారూ.. థాంక్యూ -సాక్షి సెంట్రల్ డెస్క్.. -
99 శాతం ప్రజలు పీల్చేది కలుషిత గాలే!
జెనీవా: ప్రపంచంలోని 99 శాతం జనాభా కలుషిత గాలి పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు జనాభా మొత్తం ప్రమాణాలకు తగినట్లుగా లేని గాలినే పీలుస్తున్నారని, దీన్ని నివారించాలంటే వెంటనే శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించాలని సూచించింది. ఈ ఇంధన వాడకాలతో వాయుకాలుష్యం ఏర్పడుతోందని, దీనివల్ల రక్త సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ప్రబలి ఏటా 70 లక్షల మరణాలు జరుగుతున్నాయని తెలిపింది. గాల్లో పీఎం 2.5, పీఎం10 అనే పర్టిక్యులేట్ మేటర్‌ను ఆధారంగా చేసుకొని వాయునాణ్యతను సంస్థ నిర్ధారిస్తుంది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే కర్బన ఉద్గారాల స్థాయిల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని, పర్యావరణహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలంది. -
AP: రాష్ట్రంలో పెరిగిన అమ్మాయిల సంఖ్య
‘లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అన్నాడో సినీ కవి. ‘అన్నిటా సగం.. ఆకాశంలోనూ తాను సగం’ అన్నట్టుగా వివిధ రంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు.. సంఖ్యాపరంగానూ పురుషుల్ని దాటేస్తున్నారు. అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోను అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా నమోదైంది. దేశంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు 2 శాతం అధికంగా ఉండగా.. రాష్ట్రంలో 4.5 శాతం అధికంగా ఉన్నట్టు తాజా సర్వే తేల్చింది. సాక్షి, అమరావతి: నాలుగేళ్ల క్రితం నాటి లెక్కలతో పోలిస్తే దేశంలోను, రాష్ట్రంలోను అమ్మాయిల సంఖ్య పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వెయ్యి మంది అబ్బాయిలకు 991 మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 1,020కి పెరిగింది. అయితే, దేశవ్యాప్తంగా పట్టణాల్లో అమ్మాయిల సంఖ్య వెయ్యి మంది అబ్బాయిలకు 985 మాత్రమే ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వెయ్యి మంది అబ్బాయిలకు 1,037 మంది అమ్మాయిలు ఉన్నట్టు తేలింది. దేశ సగటుతో పోలిస్తే ఏపీలో ఎక్కువే రాష్ట్రంలో 2015–16లో వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలు ఉండగా.. 2019–20లో ఆ సంఖ్య 1,045కు చేరింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 1,024 చొప్పున నమోదు కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది అబ్బాయిలకు 1,055 మంది అమ్మాయిలు ఉన్నట్టు తేలింది. కాగా, 2015–16 ఆరి్థక సంవత్సరంతో పోలిస్తే 2019–20లో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా, చిత్తూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2015–16తో పోలిస్తే 2019–20లో అమ్మాయిల సంఖ్య తగ్గింది. -
పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!
Special Loans To Urge Couples To Have Babies: చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్ ప్రావిన్స్ వివాహం చేసుకోవడానికి, పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక రుణాలను అందజేస్తోంది. అంతే కాదు దాదాపు రూ.23 లక్షలు వరకు రుణాలు ఇచ్చేలా అక్కడి ప్రభుత్వం బ్యాంకులకు మద్దతు ఇచ్చింది. అంతేకాదు పిల్లల సంఖ్యనుబట్టి తక్కువ వడ్డీతో కూడిన రుణాలు పొందే వెసులుబాటు కూడా కల్పించింది. అయితే కొంతమంది జనాభా శాస్త్రవేత్తలు జిలిన్ ప్రావిన్స్‌లో జనాభా ఇప్పటికే తగ్గిపోవచ్చని అంచనా వేశారు. (చదవండి: ఒక్క అంకె తప్పుగా ఇవ్వడంతో ఆ మహిళకు 4,500 మిస్డ్ కాల్స్!) దీంతో జిలిన్ ప్రావిన్స్ జనాభా పెరుదలను ప్రోత్సహించే చర్యలు చేపట్టింది. అంతేకాదు ఆ చర్యల్లో భాగంగా ఇతర ప్రావిన్స్‌ల నుండి జంటలు నివాసం పొందేందుకు అనుమతిచ్చింది. అయితే ఇలా అనుమతి పొందడాన్ని అక్కడ హుకౌ అని పిలుస్తారు. పైగా వారికి పిల్లలు ఉంటే వారు పబ్లిక్ సేవలు పొందేలా నమోదు చేసుకోవడం వంటి వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్న జంటలు చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుంటే వారికి పన్ను రాయితీలు కూడా కల్పిస్తోంది. అయితే జిలిన్ ప్రావిన్స్ చైనా"రస్ట్ బెల్ట్" ప్రాంతంలోని భాగం. ఈ ప్రాంతం వ్యవసాయ పరంగా బాగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ప్రావిన్స్ గత కొన్ని సంవత్సరాలుగా అధ్వానమైన జనాభా క్షీణత, ఆర్థికవృద్ధిలో మందగమనాన్ని చవి చూసింది. అంతేకాదు ఇతర ప్రావిన్సుల మాదిరిగానే, జిలిన్ కూడా ప్రసూతి, పితృత్వ సెలవులను పొడిగించింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో జియాంగ్జీలోని ఆగ్నేయ ప్రావిన్స్‌లోని బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్ బిడ్డను కలిగి ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకుని రుణాలను ప్రోత్సహించడంపై విస్తృత విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత బ్యాంకు ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేదని భావించి ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నట్లు స్థానిక మీడియాకి తెలిపింది. (చదవండి: చైనా సైబర్‌స్పేస్ చివరి యుద్ధం!...ఇంటర్నెట్ క్లీన్ అప్!!) -
అమెరికాలో పెరుగుతున్న ఆసియన్ల జనాభా
వాషింగ్టన్: అమెరికాలో ఆసియన్ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. మరే ఇతర మైనార్టీల కంటే ఆసియన్ల సంఖ్య గత దశాబ్ద కాలంలో చాలా పెరిగిందని ఆ దేశ జనాభా లెక్కల్లో వెల్లడైంది. 2020 సంవత్సరం నాటికి ఆసియన్ అమెరికన్ల సంఖ్య 2.4 కోట్లకు చేరుకున్నట్టు తేలింది. అమెరికా జనాభా గణన బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికాలో మైనార్టీ కమ్యూనిటీల ప్రాబల్యమే ప్రస్తుతం అధికంగా ఉంది. అందులోనూ ఆసియన్లు 7.2 శాతం మంది ఉన్నారు. 1776 అమెరికా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా వైట్ అమెరికన్ల సంఖ్య తగ్గడం విశేషంగా చెప్పుకోవాలి. అమెరికాలో తెల్లజాతీయులు సంఖ్య తొలిసారిగా 60శాతానికి దిగువకి పడింది. 2000ఏడాదిలో వారి జనాభా 69 శాతం ఉంటే 2010 నాటికి 63.7శాతానికి తగ్గింది. 2020లో ఇది 58 శాతానికి తగ్గినట్టుగా జనగణనలో వెల్లడైంది. అమెరికాలో గత దశాబ్దకాలంలో మొత్తంగా జనాభా 7.4% పెరిగి 33.1 కోట్లకు చేరుకుంది. 1930 తర్వాత జనాభా అతి తక్కువగా పెరగడం గత దశాబ్దంలోనే జరిగింది. -
చట్టం కంటే ప్రజాచైతన్యం ముఖ్యం
ప్రభుత్వాలు చేసే చట్టాల వల్ల తమకు మేలు జరుగుతుందని ప్రజలు భావించాలి. అప్పుడే ఆశించే ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ వాస్తవం ఏడు దశా బ్దాల స్వతంత్ర భారతంలో పదేపదే రుజువైనప్పటికీ, ఆయా వర్గాలను సంతృప్తి పర్చడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పలు సందర్భాలలో మొక్కుబడి చట్టాలు తెచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల గొప్ప మేలు కలుగుతుం దని కేంద్రం పేర్కొంటున్నప్పటికీ, రైతులు సాను కూలంగా స్పందించడం లేదు. ఎన్డీఏ తెచ్చిన పలు చట్టాలపై ఇప్పటికే ప్రజాబాహుళ్యంలో విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘జనాభా నియంత్రణ’పై చట్టం తేవడానికి అధికార బీజేపీ అడుగులు వేయడం మరో వివాదానికి తెరలేపింది. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియం త్రణ బిల్లులను తమ శాసనసభల్లో ప్రవేశపెట్టాయి. ‘ఉత్తర ప్రదేశ్ జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు 2021’ ముసాయిదాను యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజానీకం ముందుంచి, వారి సలహాలు, సూచనలను ఆహ్వా నించింది. కాగా, యూపీ తరహాలోనే జనాభా నియంత్రణ బిల్లును తెచ్చి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జనాభా నియంత్రణకు సంబంధించి 2020 డిసెంబర్లో సుప్రీంకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వాజ్యంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో చైనా తరహాలో బలవంతంగా కుటుంబ నియంత్రణ చట్టాన్ని తెచ్చే ఉద్దేశమేదీ తమకు లేదనీ, వివిధ స్వచ్ఛంద విధానాల ద్వారా కుటుంబ నియంత్రణ చర్యలతోనే దేశంలో సంతానోత్పత్తి వృద్ధిరేటును కనిష్టంగా 2.1 శాతం సాధించే క్రమంలో ఉన్నామనీ తెలిపింది. జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ విధానం ఇంత విస్పష్టంగా ఉన్నదని తెలిసినప్పటికీ, పార్లమెం టులో కొందరు అధికార బీజేపీ నేతలు ప్రైవేటు మెంబర్స్ బిల్ రూపంలో జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలని పట్టుబడటం వెనుక పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుత భారత్ జనాభా ప్రపంచ జనాభాలో 6వ వంతు. దేశంలో ప్రతి 20 రోజులకు లక్ష చొప్పున జనాభా పెరుగుతోంది. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశం, 142 కోట్ల జనాభాతో ప్రపంచంలో తొలిస్థానంలో ఉన్న చైనాను దాటడా నికి ఎక్కువ సమయం పట్టదు. స్వాత్రంత్యం లభించిన తొలినాళ్లల్లోనే దేశంలో తీవ్ర ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అప్పుడున్న 30 కోట్ల జనాభాకు తిండిగింజలను విదేశాల నుండి దిగు మతి చేసుకొన్నది. అటువంటి నేపథ్యంలోనే, నెహ్రూ ప్రభుత్వం 1951లో కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రారంభించింది. అయితే, దీన్ని బల వంతంగా అమలు చేయలేదు. తర్వాతి ప్రభు త్వాలు కూడా ప్రజలపై నిర్బంధంగా రుద్ద లేదు. ఒక్క ఎమర్జెన్సీ సమయంలోనే చెదురుమదురుగా బలవంతపు ఆపరేషన్లకు పాల్పడిన అమానుష సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ‘మేమిద్దరం– మాకిద్దరు’ అనే నినాదంతో సాగిన కుటుంబ నియంత్రణ కార్య క్రమాలు సత్ఫలితాలు అందించాయి. ఫలితంగానే, 1950–55 మధ్యకాలంలో సంతానోత్పత్తి వృద్ధి రేటు 5.9 శాతం ఉండగా, అది క్రమంగా 4 శాతా నికి, తదుపరి 3 శాతానికి తగ్గుతూ 2.2 శాతం వద్ద స్థిరపడింది. 2025 నాటికి 1.93 శాతంకు తగ్గిం చేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘అన్ని సమస్యలకు మూలం అధిక జనా భాయే’ అనే భావన ఒకప్పుడు ఉండేది. తర్వాత ‘అన్ని సమస్యలను పరిష్కరించగలిగేది జనాభాయే’ అనే సిద్ధాంతం ఊపిరి పోసుకుంది. మానవ వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించు కొనే దిశగా సమర్థమైన కార్యాచరణ అమలు చేసిన తర్వాతనే చైనా ఆర్థిక వ్యవస్థ బలీయమైన శక్తిగా రూపొందింది. అంతకుముందు ‘ఒకే బిడ్డ’ విధా నాన్ని నిర్బంధంగా అమలు చేయడంతో చైనాలో యువత సంఖ్య గణనీయంగా తగ్గి, వైద్య ఆరోగ్య సౌకర్యాలు అవసరమైన వృద్ధుల సంఖ్య పెరగ డంతో తన విధానాన్ని సవరించుకొంది. ఇద్దరు బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. మహిళా సాధికారత, గ్రామీణ ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదు పాయాల కల్పన, ప్రతి ఒక్కరికి అర్హతలను అను సరించి నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించడం, అభి వృద్ధి కార్య కలాపాలను వికేంద్రీకరించడం, తది తర చర్యలను తీసుకొన్నట్లయితే పెరుగుతున్న జనాభా విలువైన వనరుగా రూపొందుతుంది. యూపీ, అస్సాం రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ కుటుంబ నియంత్రణ చట్టాలు రూపొందించి, కొన్ని వర్గాల జనాభాను నియం త్రించాలనుకోవడం వెనుక రాజకీయ కోణం ఉంది. దేశంలో కొన్ని రాష్ట్రాలలో హిందువుల జనాభా సంఖ్యను దాటుకొని ముస్లింల జనాభా పెరిగి పోతోందని కొంతకాలంగా చాంధసవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూపీలో ముస్లిం జనాభా పెరుగుతోందన్న కారణంగానే ఆ రాష్ట్రం చట్టం ద్వారా జనాభాను నియంత్రించా లనుకొం టోందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. యూపీ మోడల్‌ను జాతీయ స్థాయిలో అనుసరించి నట్లయితే, కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ఇద్దరు బిడ్డల విధానం వల్ల, ఆడపిల్లలను పిండ దశలోనే తొలగించి వేసే అవకాశం ఉంది. ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, ‘జనాభా నియంత్రణ బిల్లు’పై విçస్తృతమైన చర్చ జరగాలి. మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం చేయాలి. ‘చట్టం కంటే ప్రజా చైతన్యం’ ముఖ్యం. సి. రామచంద్రయ్య వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
జనాభా నియంత్రణ సంజీవని కాదు
దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాదిన జనాభా రేటు పెరిగిపోతుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా కట్టడికి చేపట్టిన తీవ్ర చర్యలు ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. యువజనాభా పెరుగుతుండటం లాభదాయకమని ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో, జనాభా కట్టడిపై చర్చ మొదలైంది. పెరుగుతున్న జనాభా భారత్ వంటి దేశాలకు నిజమైన సంపదగా ప్రపంచం భావించేది. కానీ దేశంలోని యువ, ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రజానీకానికి అధికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించిన పక్షంలోనే జనాభాపరమైన ఈ సానుకూలతను సరిగా వినియోగించుకోగలం. జన సంఖ్య రేటును తగ్గించాలంటే కేరళ, తమిళనాడు లాగా విద్య... ప్రత్యేకించి స్త్రీ విద్య, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. ప్రభుత్వ చర్యల ద్వారా జనాభా నియంత్రణ అనేది భారత్‌లో పెద్దగా పనిచేయదు. ప్రపంచ జనాభా దినోత్సవమైన జూలై 11న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 2021–2030 జనాభా పాలసీ ముసాయిదా ప్రకటించారు. భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన యూపీలో ప్రస్తుతం జనాభా పునరుత్పాదక రేటు 2.7 శాతంగా ఉండగా దీన్ని 2026 నాటికి 2.1 శాతానికి, 2030 నాటికి 1.9 శాతానికి తగ్గించడడమే ఈ విధాన లక్ష్యం. 2020లో జాతీయ పునరుత్పాదక రేటు 2.2 శాతంగా ఉండింది. గత దశాబ్ది కాలంగా దేశవ్యాప్తంగా జనాభా పునరుత్పాదక రేటు క్రమంగా పడిపోతూ వస్తోంది. ఉత్తరాదిన హిందీ భాషా ప్రాంతంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల పునరుత్పాదక రేటు బాగా తగ్గిపోతోంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో జనాభా పునరుత్పాదక రేటును తగ్గించే లక్ష్యం ఎలా కొనసాగించాలనేది ఒక అంశం కాగా, ఆర్థికంగా లాభదాయకంగా ఉండే యువజనాభా విస్తరిస్తున్న తరుణంలో జనాభా పరమైన ఈ డివిడెండును తగ్గించడానికి ప్రయత్నించడాన్ని ఏ దృష్టితో చూడాలనేది కీలకం. ఆర్థిక ప్రగతి ఫలితాలను పెరుగుతున్న జనాభా కబళిస్తుందని చెబుతూ మాల్తూస్ ప్రతిపాదించిన జనాభా స్థానభ్రంశ సిద్ధాంతానికి మళ్లీ ప్రాచుర్యం లభిస్తున్న కాలమిది. భారత ప్రజాతంత్ర రిపబ్లిక్ తొలి రోజుల్లో, జనాభా నియంత్రణ జాతీయ విధానంలో ఒక ఆమోదనీయమైన భాగంగా ఉండేది. ’’మనమిద్దరం, మనకిద్దరు’’ అనే నినాదాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకుందాం. అత్యవసర పరిస్థితి కాలంలో సంజయ్ గాంధీ సామూహికంగా కుటుంబ నియంత్రణపై కొనసాగించిన తప్పుడు ప్రచారం ఫలితంగా జనాభా నియంత్రణ అనేది రాజకీయంగా స్పృశించరానిదిగా మారిపోయింది. ఇప్పుడు ఈ కొత్త దృక్పథం ఏం చెబుతోందంటే, ఆదాయాల్లో పెరుగుదల, సంపదలో సాధారణ పెరుగుదల జరగాలంటే జనాభా వృద్ధిని కట్టడి చేయాలనే. నిజానికి, విద్యా వ్యాప్తికి ప్రత్యేకించి స్త్రీ విద్యా వ్యాప్తికి జనాభా కట్టడితో మరింత సన్నిహిత సంబంధం ఉంది. లేట్ మ్యారేజీలకు, లేబర్ మార్కెట్లో మహిళలు విస్తృతంగా ప్రవేశించడానికి కూడా జనాభా కట్టడితో సంబంధముంది. ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అనుభవాల ద్వారానే కాకుండా, భారత్‌లోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల అనుభవాల నుంచి కూడా ఈ విషయాన్ని నిర్ధారించవచ్చు. ఈ రెండు రాష్ట్రాలూ అధిక అక్షరాస్యతను, సాపేక్షికంగా మరింత ఎక్కువ మహిళా సాధికారతను ఆస్వాదిస్తున్నాయనేది తెలిసిందే. తర్వాత మనం 1990ల నుంచి ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు, ఉదారవాద దశకు వద్దాం. జనాభా తనకుతానుగా అతిపెద్ద లాభం అంటూ వర్ణించిన ఈ కాలంలోనే భారత్‌లో జనాభా పెరుగుతూ వచ్చింది, వీరిలో యువజనాభానే ఎక్కువ. వీరినే దేశానికి పెద్ద సంపదగా భావించేవారు. అదే సమయంలో ఉత్తర అమెరికా, యూరప్, జపాన్ వంటి పరిణతి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వయోవృద్ధులు వేగంగా పెరుగుతున్నారని మరో వాదన ఉండేది. ఈ దేశాల్లోని నిరంతర ఆర్థిక వృద్ధికి చైనా, భారత్ లాంటి దేశాల్లో పెరుగుతున్న యువ జనాభా ఎక్కువగా అవసరమౌతుందని చెప్పేవారు. దేశంలోని యువ, ఉత్పాదకతా సామర్థ్యం కలిగిన జనాభాకు అధికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించిన పక్షంలోనే జనాభాపరమైన ఈ డివిడెండ్‌ను వినియోగించుకోగలం. దీనికోసం కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమల ఏర్పాటుకు తగిన పెట్టుబడి కల్పన అవసరమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే యువజనాభాను తప్పకుండా ఉద్యోగాల్లో నియమించాలి. దీనికి అధిక అక్షరాస్యత, తగినన్ని నైపుణ్యాలు, వేగవంతమైన ముందంజకు చర్యలు చేపట్టడం తప్పనిసరి. ఈ మొత్తం ప్రక్రియ సజావుగా సాగాలంటే ప్రజానీకానికి ఆరోగ్యం, విద్య తప్పనిసరి. దేశంలోని పిల్లల్లో అధికశాతం పోషకాహార లేమి బారిన పడితే వీరి ఉత్పాదకతా సామర్థ్యం తగ్గిపోతుంది. మరో వాస్తవాన్ని కూడా విస్మరించరాదు. జనాభాపరంగా లాభదాయికతతో ఉండే దశను భారత్ సమీపించాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అలాగే 2050 నాటికి కానీ దేశ జనాభా 160 కోట్లకు పెరిగి స్థిరీకరణ చెందదు. భారీ స్థాయిలో ఉపాధి, ఉద్యోగాలను కల్పించి అధిక వృద్ధిరేటు వైపు దేశం పయనించలేకపోతే, మనం స్వల్ప ఆదాయాల ఉచ్చులోపడి కొట్టుకుపోవడం తథ్యం. ఉత్తరప్రదేశ్ జనాభా కట్టడి.. సమస్యల పుట్ట జనాభా నియంత్రణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నూతన కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలెన్నో ఉన్నాయి. జనాభా అనే లాభదాయక పార్శా్వన్ని మనం కోల్పోతున్నామని ముసాయిదా నర్మగర్భంగా అంగీకరిస్తోంది. అలాగే జనాభా పెరుగుతున్నప్పటికీ ఉత్పత్తి చేసే వారిపై ఆధారపడే జనాభా నిష్పత్తి మాత్రమే పెరుగుతూ పోతే మొదటికే మోసం వస్తుంది. జనాభా అనే వనరు లాభదాయకంగా ఫలితాలు అందించడానికి దేశానికి మరో దశాబ్ది సమయం పడుతుందని ఇంతవరకు అందుబాటులో ఉన్న డేటా సూచిస్తోంది. దాంతోపాటు కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే ఉత్పత్తి కార్యకలాపాలు పెంచడం, భారత్‌ని తక్కువ ఆర్థిక వ్యయంతో సాగే పునాదిమీద నిలబెట్టడం తప్పనిసరి అవసరం. మొదట్లో చైనాలో, ఇప్పుడు వియత్నాంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితినే మనం చూశాం. ఇది త్వరలో బంగ్లాదేశ్ తలుపులు కూడా తట్టబోతోంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మనం అమలు చేస్తున్న కొన్ని విధానాలు సరిగ్గా ఈ తర్కానికి భిన్నంగా సాగుతున్నాయి. ఉదాహరణకు ఉత్పత్తితో లింక్ చేసిన ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేయాలంటే, తక్కువ సంఖ్యలో ఉద్యోగులతో పనిచేయించుకుంటూ టెక్నాలజీని ఎక్కువగా వాడే పరిశ్రమల పంథాను మార్చడానికి ప్రజాధనాన్ని భారీగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. దీనికి బదులుగా దేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. అవకాశముంటే అసంఘటిత రంగాన్ని కూడా ఈ పథకంలో భాగం చేయాలి. పెట్టిన ప్రతి మదుపుకూ అధికంగా ఉద్యోగాలను సృష్టించే శక్తి అసంఘటిత రంగంలోనే ఎక్కువ. నిరంకుశ అమలు దెబ్బకొడుతుంది చైనాలో కుటుంబానికి ఒకే బిడ్డ విధానం నిరంకుశంగా అమలు చేశారు. అందుకే జనాభా నియంత్రణను సాధించడంలో చైనా తగుమాత్రంగా విజయం పొందింది. అలాంటి అమానవీయమైన ప్రభుత్వపరమైన చర్య ప్రజాస్వామ్యంలో అమలు చేయడం అసాధ్యం. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. దేశానికి తక్కువ పునరుత్పాదక రేటు అవసరమనుకుంటే దానికి విద్య... ప్రత్యేకించి స్త్రీ విద్య, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. అత్యధిక ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంటే అదే పునరుత్పాదకత రేటును తగ్గిస్తుంది. జనాభా వృద్ధిని తగ్గించడం ద్వారా లేక పరిమితం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచడం కంటే ఇదే ఉత్తమమైనది. పైగా జనాభా నియంత్రణ అన్నిటికీ పరిష్కారం అనే ఆలోచన మరిన్ని ప్రశ్నలను రేకెత్తించకమానదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ముసాయిదాలోని కొన్ని ఇతర అంశాలు స్వాగతించదగినవే. తల్లులు, శిశువుల మరణాల రేటును తగ్గించడం, ఆయుర్దాయాన్ని పొడిగించే చర్యలను ప్రోత్సహించడం, మాతా శిశు సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించడం వీటిలో కొన్ని. అర్థవంతమైన ప్రజారోగ్య విధానానికి ఇవన్నీ అత్యవసరమైనవే. అంతేతప్ప జనాభా నియంత్రణ విధానం లాంటిది మనకు అవసరం లేదు. ఉత్తమమైన ప్రజారోగ్య విధానం, ఉత్తమమైన విద్యా విధానం మనకు అవసరం. సమగ్ర ఆర్థిక వ్యూహం మరీ అవసరం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి (ట్రిబ్యూన్ ఇండియా సౌజన్యంతో) -
కొత్త బిల్లు.. సీఎం యోగి మెడకే చుట్టుకుంటుందా ?
UP Population Control Bill లఖ్నౌ: జనాభా నియంత్రణకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ తీసుకువచ్చిన జనాభా నియంత్రణ బిల్లు అధికార పార్టీ మెడకు చుట్టుకుంటుందా ? పైకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ప్రముఖులు ఈ బిల్లు సూపర్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నా.. అంతర్గత సమావేశాల్లో దీనిపై గుర్రుగా ఉన్నటు సమాచారం. జనాభా నియంత్రణే లక్క్ష్యం జనాభా నియంత్రణ లక్క్ష్యంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం బర్త్ కంట్రోల్, స్టెబిలైజేషన్, వెల్ఫేర్ బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులుగా ప్రకటించారు. ఈ నిబంధనే ఇప్పుడు అధికార పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. బీజేపీ మెడకే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో అధికార బీజేపీకి 304 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బిల్లు కనున అసెంబ్లీ ఆమోదం పొంది చట్టంగా మారి.. అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ చట్టం వర్తిస్తే... ప్రస్తుత ఎమ్మెల్యేల్లో సగానికి పైగా పోటీకి అనర్హులు అవుతారు. ఎందుకంటే వీరందరికీ ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. అసెంబ్లీలో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 387 సీట్లు ఉండగా ఇందులో అధికార పార్టీ బంపర్ మెజార్టీ సాధించింది. కమలం గుర్తు తరఫున మొత్తం 304 మంది అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అయితే ఇందులో 152 మంది ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండటం గమనార్హం. ఇక్కరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 137 మాత్రమే. మరో 15ను మందికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు. ఈ సమాచారం ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ అధికారిక వెబ్సైట్లో ఉంది. పార్లమెంటులో ఇదే చట్టాన్ని పార్లమెంటుకు అన్వయిస్తే ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సభ్యుల్లో 168 మంది అనర్హులు అవుతారు. ఇక్కడ కూడా బీజేపీదే సింహభాగం. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన ఎంపీలు బీజేపీ తరఫున 105 మంది పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మరీ విచిత్రం ఏటంటే జనాభా నియంత్రణ బిల్లు -2019ను ప్రైవేటు బిల్లుగా పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపిక చేసిన జాబితాలో ఉన్న బీజేపీ ఎంపీ, భోజ్‌పూరి నటుడు రవిశంకర్‌కి ఏకంగా నలుగురు పిల్లలు ఉన్నారు. భిన్న స్వరాలు యోగి సర్కార్ జనాభా నియంత్రణ విధానాన్ని అధికార పార్టీలో పైకి ఎవరు విమర్శలు చేయకున్నా ‘ఆఫ్ ది రికార్డు’ సంభాషనల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారను. ఈ రోజు స్థానిక సంస్థలు రేపు అసెంబ్లీ ఎన్నికలు అంటే తమ పరిస్థితి ఏంటని మథనపడుతున్నారు. పైగా క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే నాయకులు అనర్హులైతే, ఆ... అసంతృప్తి అంతా తమకు చేటు తెస్తుందేమో అని మల్లగుల్లాలు పడుతున్నారు. 8 మంది పిల్లలు యూపీ అసెంబ్లీ వెబ్సైట్ వివరాల ప్రకారమే ఒక ఎమ్మెల్యేకు 8 మంది పిల్లలు ఉండగా మరో ఎమ్మెల్యేకు 7 గురు పిల్లలు ఉన్నారు. ఇక ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు 6 గురు పిల్లలు ఉన్నారు. 15 మందికి 5గురు సంతానం, 44 మందికి నలుగురు సంతానం ఉన్నారు. ముగ్గురు సంతానం కలిగిన ఎమ్మెల్యేలు 83 మంది ఉన్నారు. అధిక సంతానం కలిగిన పిల్లలు బీజేపీఎమ్మెల్యేల సంఖ్య సంఖ్య 1 8 1 7 8 6 15 5 44 4 83 3 103 2 34 1 -
జనాభా నియంత్రణ.. యూసీసీపై ప్రైవేటు బిల్లులు!
న్యూఢిల్లీ: రాబోయే వర్షాకాల సమావేశాల్లో జనాభా నియంత్రణ, ఉమ్మడి సివిల్ కోడ్(యూసీసీ)పై ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టేందుకు బీజేపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఈమేరకు వారు యత్నిస్తున్న విషయాన్ని పార్లమెంట్ సెక్రటేరియట్లకు ఇద్దరు ఎంపీలు వెల్లడించారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును తెచ్చింది. అసోం సైతం ఇలాంటి బిల్లు తెచ్చే యోచనలో ఉంది. ఇదే బాటలో దేశవ్యాప్తంగా అమలయ్యేలా జనాభా నియంత్రణ బిల్లు తెచ్చేందుకు బీజేపీ ఎంపీలు యత్నిస్తున్నారు. యూపీకే చెందిన లోక్‌సభ ఎంపీ రవికిషన్ జనాభా నియంత్రణ బిల్లును, రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్న కిరోరి లాల్ మీనాలు యూసీసీ బిల్లును సమావేశాల జూలై 24న ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మరి కొందరు ఎంపీలు సైతం ఈ బిల్లుల కోసం నోటీసులు ఇచ్చారు. మంత్రులు కాకుండా సాధారణ సభ్యులు ప్రవేశపెట్టే బిల్లులను ప్రైవేట్ బిల్లులంటారు. వీటికి సంపూర్ణ ఆమోదం లభించకుండా చట్టరూపం దాల్చలేవు. అయితే ఈ బిల్లులు బీజేపీ ఎజెండాలో భాగం కనుక వీటిపై జరిగే చర్చలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇవన్నీ ఒక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్న యత్నాలంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.ఈ బిల్లులోని ఏక సంతాన నిబంధనను విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకిస్తోంది. ఈ నిబంధనతో ఇప్పటికే హిందూ, ముస్లిం జనాభా అసమతుల్యత మరింత పెరుగుతుందని అభ్యంతరాలు చెబుతోంది. బిల్లు ఉద్దేశాన్ని వ్యతిరేకించడం లేదని, బిల్లులో కొన్ని క్లాజులపై అభ్యంతరాలున్నాయని సంస్థ ప్రతినిధి అలోక్ కుమార్ యూపీ లాకమిషన్‌కు లేఖ రాశారు. 1970 తర్వాత ఇంతవరకు ఒక్క ప్రైవేట్ బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందలేదు. -
ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు సంక్షేమ పథకాలు బంద్ : యూపీ