Nagaland Minister Temjen Imna Along Give Solution For Population Growth - Sakshi
Sakshi News home page

Nagaland Minister Temjen Imna: నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!

Published Mon, Jul 11 2022 4:16 PM | Last Updated on Mon, Jul 11 2022 6:20 PM

Nagaland Minister Give Solution For Population Growth - Sakshi

జులై 11 ప్రపంచ జనాభా దినోత్వం సందర్భంగా నాగాలాండ్‌ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు పనిలో పనిగా జనాభా నియంత్రణ కోసం ఒక చిన్న పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు. గత నెలలో ఈ శాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని అందరూ అంటారు గానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పి వార్తల్లో నిలిచారు. మళ్లీ మరోసారి కుటుంబ నియంత్రణ అంశంపై చాలా చమత్కారమైన పరిష్కార మార్గం చెప్పి మరోసారి వార్తలో నిలిచారు.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే....ఇది చాలా సున్నితమైన విషయం. జనాభా పెరుగుదలను నియంత్రించటం కోసం మనం సరైన మార్గాన్ని ఎంచుకుందాం. లేదా నాలాగే సింగిల్‌గా ఉంటూ...అందరం కలసి స్థిరమైన భవిష్యత్తు కోసం పాటుపడదాం. ఈ రోజు నుంచే సింగిల్‌ ఉద్యమంలో పాల్గొనండి అని నాగాలాండ్‌ మంత్రి ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లు నాగాలాండ్‌ మంత్రికి చక్కటి హాస్య చతురత ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు.

(చదవండి: రాష్ట్ర సీఎంను ఇలాగే ఆహ్వానిస్తారా?.. బీజేపీపై టీఎంసీ ఆగ్రహం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement