solution
-
సమస్య, పరిష్కారాలు : సంస్కారాలు
గతాన్ని విడిచిపెడుతూ, ఎప్పటికప్పుడు పునరుత్తేజాన్నిపొందుతూ శిశిర రుతువులో ఒక్క ఆకు కూడా లేనటువంటి చెట్లు వసంత రుతువులో ఆకుపచ్చని ఆకులతో నిండిఉంటాయి. ఎందుకు? ఎందుకంటే ప్రాణంలేని ఆకులన్నీ రాలి పోయి, తిరిగి ప్రాణశక్తిని పొంది కొత్త ఆకులతో చెట్లు నిగనిగ లాడతాయి.మన సంస్కారాలు కూడా మనల్ని గతంలోనికి తోసి వేస్తాయి లేక భవిష్యత్తు లోనికి లాక్కెళతాయి. పర్యవసానంగా మనం మన కళ్లెదుట ఉన్న వర్తమానాన్ని కోల్పోతున్నాం. మన చంచలమైన మనస్సును స్థిర పరచాలి. దీనిని లోపలికి మళ్ళించుట (అనగా అంతర్ముఖత్వం గావించుట)ను అభ్యసించాలి. గతంలో సంభవించిన వాటిని లేక భవిష్యత్తులో సంభవించనున్న వాటిని పట్టుకొని మనస్సు ఊగిసలాడకూడదు. జీవితం దాని మార్గంలో అది నడుస్తూ ఉంటుంది. వర్తమాన కాలంలో ఏం జరుగనున్నదో దానికి సాక్షీభూతుడుగా ఉండాలి. ఇదీ చదవండి: Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్విమనస్సు నుండి అనేక కోరికలు పుడతాయి. అటువంటి వానిలో కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే పూర్తవుతాయి. అందువలన మనం సంతోషాన్ని పొందుతాం. మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు. కోరికలు ఫలించని పరిస్థితిలో... నా కోరికలు ఏ విధంగా నెరవేరతాయి? ఏ కోరికలు నెరవేరతాయో అటువంటి కోరికలనే నేను కోరుకోవాలా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఈ రెండింటికి సమాధానాలు మన దగ్గర లేవు.మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండటం వలన కోరికలు జనిస్తాయి. కోరికలు నెరవేరినా, నెరవేరకున్నా వాటిని గూర్చి మనస్సులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే ఇటువంటి పరిస్థితిలో చిక్కుకుంటారో అటువంటివారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు. ఈ విధంగా చిక్కుకున్నప్పుడు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది?మనస్సును నెమ్మదిగా, క్రమంగా ఆలోచనారహిత స్థితికి తీసుకొని రావాలి. అందుకోసం సాధకుడు తన సాధనల ద్వారా ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఆధ్యాత్మిక లక్ష్యంపైననే మనస్సును కేంద్రీకరింప చేయాలి. దేవుని (గురువు) అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలడు. -
యాసిడ్ ఫ్లైనా.. ‘లైట్’ తీస్కోండి!
సాక్షి, హైదరాబాద్: అది అలాంటి ఇలాంటి దోమ కాదు.. కుడితే చర్మం ఎర్రగా మారిపోతుంది. భరించలేని మంట పుడుతుంది. అదే యాసిడ్ ఫ్లై దోమ. కందిరీగ మాదిరిగా ఉండే ఈ దోమను నైరోబీ ఫ్లై లేదా యాసిడ్ ఫ్లైగా జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. ఇది కుడితే పెడెరస్ డెర్మటైటిస్ సమస్య ఏర్పడు తుంది. కుట్టిన చోట కా లిన గాయాల తరహాలో చర్మం మండుతుంది. కమిలిపోతుంది. ఈ దోమలతో నిత్యం ఇబ్బంది పడిన ఓ విద్యార్థి.. దానికి విరుగుడు కనుగొన్నాడు. తనతోపాటు తోటి విద్యార్థుల సమస్యను తీర్చాడు. సమస్య నుంచి ఆవిష్కారం హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో యాసిడ్ ఫ్లై దోమల సమస్య తీవ్రంగా ఉండేది. విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడేవారు. యాసిడ్ ఫ్లై బాధితుల్లో ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ అయిన తేజస్ ఆంటో కన్నంపూజ కూడా ఉన్నాడు. అయితే ఇతర విద్యార్థులలాగా దోమ కరిచినప్పుడు బాధపడి తర్వాత ఆ విషయాన్ని వదిలేయలేదు. యాసిడ్ ఫ్లై దాడులను అరికట్టడానికి మార్గాలను అన్వేషించాడు. ఈ దోమల సంచారంపై అధ్యయనం చేశాడు. ఈ క్రమంలో యాసిడ్ ఫ్లై దోమలు హాస్టల్లో కొన్ని రూమ్స్‌లో మాత్రమే అధికంగా ఉన్నట్లు గుర్తించాడు. అందుకు కారణాలను అన్వేషించగా.. అల్ట్రా వయలెట్ కిరణాలకు ఈ దోమ ఆకర్షింపబడుతోందని తేలింది. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ (సీఎఫ్ఎల్) ట్యూబ్ లైట్లకు ఇవి బాగా ఆకర్షింపబడుతున్నాయని గుర్తించాడు. రేడియేషను అధికంగా విడుదల చేసే ఎల్ఈడీ లైట్లు ఉన్న గదుల్లోకి ఈ దోమలు అంతగా రావటంలేదని గమనించాడు. దీంతో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డా.షమన్న ఆధ్వర్యంలో దీనిపై మరింత లోతుగా అధ్యయనం నిర్వహించి.. వర్సిటీకి నివేదిక సమర్పించాడు. తేజస్ పరిశోధన పెద్ద సమస్యను తీర్చిందని డాక్టర్ షమన్న సాక్షికి తెలిపారు. ఎక్కడైనా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేయటం ద్వారా యాసిడ్ ఫ్లై సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు. వర్సిటీ హాస్టల్లో యాసిడ్ ఫ్లై సమస్య గతంలో 38 శాతం ఉండగా.. లైట్ల మార్పుతో 8 శాతానికి తగ్గిందని చెప్పారు. బాధకు పరిష్కారం వెతికానుకొంతకాలంగా హాస్టల్ రూమ్స్‌లో యాసిడ్ ఫ్లై బాధను అనుభవించాం. పరిష్కారం కోసం అన్వే షించడంలో తప్పులేదుగా అనుకున్నా. మొత్తానికి సమస్యకు మూలం గుర్తించడంతో పరిష్కారం కూడా దొరికింది. – తేజస్, హైదరాబాద్ వర్సిటీ విద్యార్థి -
మట్టి + ఆముదం + కుంకుడు ద్రావణం: పంటలు పచ్చగా, నిండుగా!
పొలంలోని మట్టినే సేంద్రియ ఎరువుగా, పురుగులనునియంత్రించే ద్రావణం వాడి సత్ఫలితాలు పొందటం ద్వారా ఆరోగ్య దాయకమైన ద్రాక్ష, వరి తదితర పంటలు పండించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సివిఆర్) మరో ద్రావణాన్ని రూ పొందించారు. మట్టి+ఆముదంతో పాటు కుంకుడు రసం కలిపి చల్లితే పంటలకు చీడపీడల నియంత్రణతోపాటు పెరుగుదల బాగుందని గుర్తించారు. ఈ ద్రావణాన్ని తయారు చేసి మొదట తన పెరట్లోని టొమాటో, మొక్కజొన్న పంటలపై ఆయన ప్రయోగించి చూశారు. కేవలం వారం నుండి 10 రోజుల్లోనే పంటలో విపరీతమైన మార్పును గమనించారు. అంతకు ముందు మొక్కజొన్న ఆకులను పురుగులు తినటం, పంట పసుపు పచ్చగా ఉన్నపుడు ఈ ద్రావణం పిచికారీ చేశారు. కేవలం వారం నుంచి పది రోజుల్లోనే ఆ పంట పచ్చదనంతో కళకళలాడుతూ, ఆకులు కూడా వెడల్పుగా రావటం అంటే పంటలో మంచి ఎదుగుదలను గమనించారు. మరి కొందరు రైతులు కూడా సత్ఫలితాలు సాధించటంతో ఈ ద్రావణం సామర్థ్యంపై సివిఆర్ నిర్థారణకు వచ్చారు.మట్టి, ఆముదం, కుంకుడు ద్రావణం తయారీ విధానంలోపలి మట్టి (బాగా జిగటగా ఉండే మట్టి) 10 కిలోలు (ఒక తట్టెడు) తీసుకొని, గడ్డలు చిదిపి మెత్తని మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఆ మట్టిలో 250 మి.లీ. నుంచి 500 మి.లీ. వరకు ఆముదం కలపాలి. 250 నుండి 500 గ్రా. కుంకుడు కాయలు తీసుకొని కొంచెం నీటిలో వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో పిసికి, విత్తనాలు తీసివేసి, పేస్టులాగా తయారు చెయ్యాలి. అలా తయారైన పేస్టును అంతకు ముందు రోజు ఆముదం కలిపి పక్కన పెట్టిన మట్టిలో వేసి, బాగా కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటి డ్రమ్ములో వేసి కర్రతో బాగా కలపాలి. మట్టి మిశ్రమం అంతా నీటిలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి నీటిలోని మట్టి రేణువులు నీటి అడుగుకు పేరుకుంటాయి. పైకి తేరుకున్న ద్రావణాన్ని వడకట్టి స్ప్రేయర్లలో పోసుకొని పంటపై పిచికారీ చెయ్యాలి. రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మట్టి ద్రావణం నీటిలో కలిపిన తర్వాత 4 గంటల్లోగా వంటపై పిచికారీ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ఆలన్యం అయితే ఆముదం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. కుంకుడుతో పచ్చదనం వస్తోంది!పైకి పురుగు కనిపిస్తూ ఉంటే గతంలో చెప్పినట్లు మట్టి 20 కిలోలు, ఆముదం పావు కిలో నుంచి అర కిలో వరకు కలిపిన ద్రావణం చల్లితే పురుగుల నియంత్రణ బాగుంటుంది. అయితే, పెరుగుదల ఉండేది కాదు. మొలకల ద్రావణం చల్లాల్సి వచ్చేది. ఇప్పుడు కుంకుడు రసం కలపటం వల్ల ఆ కొరత తీరి పచ్చదనం వస్తోంది. తెగుళ్లు నివారిస్తుంది. పురుగులను గుడ్లు పెట్టనివ్వదు. అనేక పంటల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇది చల్లిన వారం, పది రోజుల్లోనే పంటలు ఆకుపచ్చని రంగులోకి మారి, గ్రోత్ వేగాన్ని అందుకుంటున్నది. మల్బరీ తప్ప ఏ పంటలోనైనా చల్లొచ్చు. పత్తి రైతులు కాయ పగలటానికి ముందు దశలోనే ఈ ద్రావణం వాడాలి. టొమాటోలో ఏ తెగుళ్లు, పురుగులూ రాలేదు. మిర్చిలో తామర పురుగు నియంత్రణకు మట్టి, ఆముదం, కుంకుళ్లతో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా కలిపి తయారు చేసిన ద్రావణం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ద్రావణాన్ని వర్షాలు బాగా పడే రోజుల్లో వారానికోసారి చల్లాలి. ఇప్పటి నుంచి పది రోజులకోసారి చల్లితే సరిపోతుంది. ఇది చల్లిన 2 గంటల వరకు వర్షం పడకపోతే చాలు, పనిచేస్తుంది. – చింతల వెంకటరెడ్డి (98668 83336), పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆల్వాల్, సికింద్రాబాద్చాలా పంటలపై చల్లా.. రిజల్టు బాగుంది!మట్టి, ఆముదం, కుంకుడు రసం ద్రావణం వాడిన వారం రోజుల్లోనే చీడపీడల నియంత్రణతో పాటు పంటల్లో పెరుగుదల బాగా కనిపించింది. 10 కిలోల లోపలి మట్టికి 250 ఎంఎల్ ఆముదం కలిపి పెట్టుకోవాలి. కుంకుడు కాయలను గింజలతో ΄ాటు నలగ్గొట్టి, ఉడక బెట్టాలి. నానబెట్టిన దానికన్నా, కుంకుడు విత్తనాలు కూడా పగులగొట్టి ఉడకబెడితే మరింత ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించింది. ఆ తెల్లారి కుంకుళ్లను పిసికి రసం తీసుకోవాలి. ఆముదం కలిపిన మట్టిలో ఈ కుంకుడు రసం కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. పసుపు, మామిడి, నిమ్మ, అవకాడో, అరటి తదితర పంటలన్నిటిపైనా ఈ ద్రావణాన్ని పిచికారీ చేశాను. వారంలోనే గ్రోత్ చాలా కనిపించింది. నూనెలు చల్లితే గ్రోత్ వస్తుంది. ఇక్కడ ఆముదం వాడుతున్నందున గ్రోత్తోపాటు చీడపీడల నియంత్రణ కూడా జరుగుతుంది. మట్టి ద్వారా మినరల్స్ కూడా పంటకు అందుతున్నాయి. 12–15 రోజులకోసారి అన్ని పంటలపైనే పిచికారీ చేస్తున్నా. ఈ రెండు పిచికారీల మధ్య ఒకసారి వేపనూనె పిచికారీ చేస్తే పురుగుల గుడ్లు నశించి మరింత మెరుగైన ఫలితాలుంటాయి. – పడాల గౌతమ్ (98497 12341), ఎస్టేట్ మేనేజర్, రుషి వ్యాలీ స్కూల్, మదనపల్లిదివంగత సంజీవరెడ్డి సూచనలతో 2007 నుంచి మా 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. 2014లో ‘సాక్షి సాగుబడి’లో సివిఆర్ మట్టి ద్రావణం గురించి చదివినప్పటి నుంచి వంగ, సాంబారు దోస, పూల తోట, వేరుశనగ వంటి అన్ని పంటలకూ లోపలి మట్టి+ ఆముదం ద్రావణం వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. సివిఆర్ కొత్తగా చెప్తున్నట్లు మట్టి, ఆముదంతోపాటు కుంకుడు రసం కూడా కలిపి పత్తి పంట 20 రోజుల దశలో రెండు నెలల క్రితం ఒకసారి, ఆ తర్వాత మరోసారి పిచికారీ చేశాను. పంట ముదురు ఆకుపచ్చగా బలంగా పురుగుల బెడద లేకుండా పెరిగింది. ఇప్పుడు పత్తి తీస్తున్నాను. ఇతర రైతులతో కూడా మట్టి ద్రావణం వాడిస్తున్నాం. – పి. గిరీష్ గౌడ్ (80732 45976), ఇనగలూరు,అగళి మండలం, సత్యసాయి జిల్లా -
హాయ్.. ఏఐ
కృత్రిమ మేధ.. సాంకేతిక విప్లవంలో మానవుడి ఆలోచనలకు అందనంత దూరం వెళ్లిపోయింది. మెషీన్ లెర్నింగ్, డీప్ లెరి్నంగ్ సాయంతో మనిషి కూడా చేయలేని ఎన్నో పనులకు పరిష్కారం చూపుతోంది. భవిష్యత్తు మొత్తం కృత్రిమ మేధదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా కృత్రిమ మేధపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏఐ సిటీ నిర్మించాలని ప్రణాళికలు కూడా రచిస్తోంది. యువత కూడా ఏఐలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమ సృజనాత్మకతకు పదును పెడుతోంది. ఏఐతో నడిచే కొత్త కొత్త యాప్‌లను సృష్టించి.. ఎన్నో చిక్కుముడులను విప్పుతోంది. ఏదో ఒక ఉద్యోగం చేయడం కన్నా.. సొంతంగా స్టార్టప్‌లు స్థాపించి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సమాజానికి తమ చేతనైన సాయం చేస్తున్నారు. ఇప్పటికే టీ–హబ్ వేదికగా ఎన్నో ఏఐ ఆధారిత స్టార్టప్‌లు పురుడుపోసుకున్నాయి. ఎన్నో స్టార్టప్‌లకు టీ–హబ్ ప్రోత్సాహం అందిస్తోంది. సాధారణంగా మనుషుల జాతకం గురించి వినే ఉంటాం. కానీ వాహనాలకు కూడా జాతకం ఉంటుందా అనే కదా మీ అనుమానం. ఏఐతో వాహనం జాతకం గురించి చెప్పే యాప్‌ను చరణ్ సింగ్, మల్లికారెడ్డి అనే ఇద్దరు యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ తీసుకొచ్చారు. వీళ్లు రూపొందించిన చిన్న పరికరం ఏఐ సాయంతో పనిచేస్తుంది. దాన్ని కనుక వాహనానికి అమర్చుకుంటే వాహనం కండీషన్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు మన మొబైల్ ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. ఎప్పుడు బ్రేక్‌డౌన్ అవుతుంది.. ఎప్పుడు సరీ్వసింగ్ చేయించాలి.. అన్న వివరాలను మనకు తెలుపుతూ ఉంటుంది. వాహనం ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని మనకు చెబుతుందన్న మాట. 2018లోనే ఈ ఐడియాతో ఓ స్టార్టప్ మొదలు పెట్టాలని భావించారు. చివరకు 2022లో దీన్ని ప్రారంభించి ఔరా అనిపించుకుంటున్నారు. సాధక్ అనే ఈ పరికరంతో వాహనాల లైఫ్‌టైం భారీగా పెంచుకోవచ్చని చరణ్ సింగ్ చెబుతున్నారు. ఏదైనా సమస్య వస్తుందని ముందే పసిగట్టి చెబుతుంది కాబట్టి అవసరమైన చిన్న చిన్న మరమ్మతులు చేయించుకోవడం లేదా జాగ్రత్తలు పాటించడం ద్వారా వాహనం షెడ్డుకు వెళ్లకుండా కాపాడుకోవచ్చని వివరించారు. వేక్.ఇన్ అనే పోర్టల్ ద్వారా వీరు సేవలు అందిస్తున్నారు.మూసీ పరిరక్షణలోనూ ఏఐ.. మూసీ ప్రక్షాళనకు ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం కనిపించట్లేదు. అసలు సమస్య ఎక్కడ మొదలైందో కనుక్కొని ప్రయత్నాలు చేస్తే ఫలితం ఉంటుందని పలువురు చెబుతున్నారు. అయితే కృత్రిమ మేధతో పరిష్కారం చూపుతామని కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు ముందుకొచ్చారు. నాలుగు దశల్లో మూసీని పూర్తిగా పరిశుభ్రం చేయొచ్చని చెబుతున్నారు. తొలుత డ్రోన్ల సాయంతో మూసీ నదిలో, పరీవాహక ప్రాంతంలోని చెత్తను తొలగించాలని పేర్కొంటున్నారు. సెన్సార్ల ద్వారా మూసీలో చెత్త వేస్తే వెంటనే అధికారులకు సమాచారం అందిస్తుంది. అంతేకాదు.. వరదలు, విపత్తులను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. వరదలు రావడానికి ముందే ముప్పును పసిగట్టి స్థానికులకు సమాచారం అందజేస్తుంది. దీంతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధికారులు త్వరగా సహాయక చర్యలు చేపట్టే వీలు కలి్పస్తుంది. అర్బన్ ప్లానింగ్‌లో కూడా కృత్రిమ మేధను వినియోగించుకుని, భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రణాళికలు రచించవచ్చని పేర్కొంటున్నారు. ఇక, ఎక్కడెక్కడ బ్రిడ్జిలు అవసరం ఉన్నాయనే విషయం కూడా కృత్రిమ మేధ చెప్పేస్తుందని చెబుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను పట్టేసేలా..ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిని సులువుగా గుర్తించేందుకు కృత్రిమ మేధ సాయంతో వినూత్నంగా కళ్లద్దాలను పర్వ్యూ ఎక్స్ అనే కంపెనీ అభివృద్ధిపరిచింది. వీటిని ధరించిన పోలీసు జస్ట్ అలా వాహనాన్ని తరచి చూస్తే చాలు.. కృత్రిమ మేధ సాయంతో సమాచారం మన ముందుంచుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, అద్దాలు ఉన్నాయా లేదా ఇలా అన్ని వివరాలను ఫోన్‌కు పంపుతుంది. ఏవైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే చలాన్లు కూడా జెనరేట్ చేసి, వాహనదారుడికి పంపుతుంది. ఉన్నతాధికారులకు ఈ విషయాలను పంపుతుంది. వాయిస్ రూపంలో సదరు అధికారికి వివరాలను చెబుతోంది. అలాగే ట్రాఫిక్ ఎలా ఉందనే వివరాలను కూడా అంచనా వేసి, ట్రాఫిక్ నియంత్రణలో మేలు చేస్తుంది. చాలా కచి్చతత్వంతో వివరాలను నమోదు చేస్తుంది. అలాగే దీంతో కిందిస్థాయి సిబ్బంది ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పారదర్శకత పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది.భవిష్యత్తు ఏఐదే.. భవిష్యత్తులో మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏఐ నిర్ణయించే రోజు వస్తుంది. మనం చేయాల్సిన ప్రతి పనినీ ఏఐ అ«దీనంలోకి తీసుకుంటుంది. కృత్రిమ మేధతో చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉంది. కాకపోతే ఏఐని సరైన క్రమంలో మలుచుకుని, స్కిల్స్ పెంచుకుంటే మాత్రం కృత్రిమ మేధ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. – చరణ్‌సింగ్, వేక్ వ్యవస్థాపకుడుస్టార్టప్లో పనిచేస్తూ సొంతంగా.. స్టార్టప్ ఏర్పాటు చేసే ముందు ఏదైనా స్టార్టప్ కంపెనీలో పనిచేస్తే మంచిది. అందులో ఉండే కష్టనష్టాలు తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త పడితే.. నిర్వహణలో విజయం సాధించవచ్చు. నేను కూడా అలా ముందు ఓ కంపెనీలో పనిచేసి.. సొంతంగా స్టార్టప్ స్థాపించాను. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా సంస్థను నడిపిస్తున్నాను. మా బాబాయి మెకానిక్. ఆయన లాంటి మెకానిక్‌లకు ఉపయోగపడేలా ఏదైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వేక్‌ను స్థాపించాను. – మల్లికారెడ్డి, వేక్ సహ వ్యవస్థాపకురాలు -
తెల్లవెంట్రుకలకు శాశ్వతంగా గుడ్ బై : అమేజింగ్ వీడియో
ప్రస్తుతం కాలంలో తెల్లవెంట్రుకలు ఎక్కువగా బాధించే సమస్య. 50ఏళ్ల దాటిన తరువాత నల్లుజుట్టు తెల్లగా మారితే పెద్దగా సమస్య ఉండదు. కానీ టీనేజ్లోనే తెల్ల జుట్టు రావడంతో చాలి నిరాశకు లోనవు తున్నారు. తెల్లజుట్టు పోగొట్టుకోవడానికి యువత పడని పాట్లు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. మార్కెట్లో రకరకాల కాస్ట్లీ ఉత్పత్తులతోపాటు, సహజంగా దొరికే, ఆర్గానిక్ పదార్థాలతో తయారైన చిట్కాలకోసం ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్విటర్లో ఒక వీడియో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ వీడియోలో లవంగాలు, ఉల్లిపాయల పొట్టు, టీ బ్యాగులతో కషాయం తయారుచేశారు. దీన్ని చక్కగా వడబోసుకుని ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. కావాలంటే ఫ్రిజ్‌లో కూడా పెట్టుకోని వాడుకోవచ్చు. ఈ కషాయాన్ని కుదుళ్లతో సహా తలకు బాగా పట్టించి, బాత్ క్యాప్ లేదా, ప్లాస్టిక్ కవర్‌తో తలను కవర్ చేసి కొద్దిసేపు వదిలివేయాలి. ఆ తరువాత వాటర్‌తో కడిగేయాలి. షాంపులాంటివి వాడకూడదు. ఇలా చేయడం ద్వారా తెల్ల వెంట్రుకలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని ఈ వీడియోలో పేర్కొనడం విశేషం. దీని వల్ల జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుందట. అయితే దీనిపై నెటిజన్లు కమెంట్లు విభిన్నంగా ఉన్నాయి. నోట్: ఇది అవగాహన కోసం అందించిన వీడియో మాత్రమే. Say Goodbye to gray hair permanently pic.twitter.com/EVYDMLJkTJ — Learn Something (@cooltechtipz) April 4, 2024 -
‘హిట్ అండ్ రన్’కు టెక్నికల్ పరిష్కారం?
ఢిల్లీ: కొత్త చట్టాలను అనుసరించి.. హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలను నిరసిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఇటీవల దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన కేంద్రం.. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు ‘హిట్ అండ్ రన్’కు పరిష్కారం.. రవాణాశాఖ(MoRTH.. The Union road transport and highways ministry) కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసే సాంకేతిక వ్యవస్థను ట్రక్కు డ్రైవర్లు వినియోగించేందుకు అనుమతించాలని సూచించినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తద్వారా అటువంటి వాటిని ‘హిట్ అండ్ రన్’ కింద పరిగణించకుండా ఉండవచ్చని తెలిపింది. అయితే ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని.. తుది నిర్ణయం ఆ శాఖ తీసుకుంటుందని రవాణాశాఖ పేర్కొంది. ‘ప్రమాదం జరిగిన అనంతరం బాధితులకు సహాయం చేసేందుకు అక్కడే ఉంటే స్థానికులు వారిపై దాడి చేసే ప్రమాదం ఉందని ట్రక్కు డ్రైవర్లు భావిస్తున్నారు. దీనికి పరిష్కారంగా మనం సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసేందుకు డ్రైవర్లు సాంకేతికత వాడుకోవచ్చు. ఆ తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 25-50 కి.మీ పరిధిలో ఉన్న పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. అటువంటి దాన్ని ‘హిట్ అండ్ రన్’ కేసుగా పరిగణనలోకి తీసుకోకుండా ఉండవచ్చు’ అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు సూచించామన్నారు. -
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం
-
తెలంగాణ వర్సిటీ అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరిస్తాం: వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌యూటీఏ) 3వ కన్వెన్షన్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ‘తెలంగాణలో ఉన్నత విద్య– సమకాలీన సమస్యలు – సాధ్యమైన చర్యలు‘ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీ నిర్మాణాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. వివిధ భావజాలాలతో సంబంధం లేకుండా విద్యార్థులను రాజకీయ భాగస్వామ్యానికి దూరంగా ఉంచడంలో కుట్ర దాగుందని, దీని పర్యవసానాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడు తూ..పెండింగ్‌లో ఉన్న వర్సిటీ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. -
ఎంఎస్ఈలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను (ఎంఎస్ఈలను) రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. ఇతర ఎంఎస్ఈలు, ప్రభుత్వ సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న సూక్ష్మ, చిన్న తరహా యూనిట్లకు అండగా నిలుస్తోంది. ఈ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఏపీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ వాటి బకాయిల వసూళ్లలోనూ సహాయ పడుతోంది. ఇప్పటివరకు ఈ కౌన్సిల్‌కు రూ.654 కోట్ల బకాయిలకు సంబంధించిన 534 ఫిర్యాదులు రాగా వాటిలో 149 ఫిర్యాదులను పరిష్కరించింది. తద్వారా రూ.97 కోట్ల బకాయిలకు పరిష్కారం చూపింది. మిగిలిన 385 కేసుల్లో 60 కేసులను ఈ నెలలో జరిగే కౌన్సిల్ సమావేశంలో పరిష్కరించనున్నట్లు కౌన్సిల్ సభ్యుడు, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫాఫ్సియా) అధ్యక్షుడు మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. కౌన్సిల్ ముందుకు కొత్తగా 65 కేసులు వచ్చాయని, మరో 78 కేసులు ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఎక్కువ సమస్యలను ఇరు వర్గాలతో మాట్లాడటం ద్వారా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. సూక్ష్మ, చిన్నతరహా సంస్థలు ఆర్థిక ఇబ్బందులతో రుణాలను చెల్లించలేక ఎన్పీఏలుగా మారకుండా ఎంఎస్ఎంఈడీ యాక్ట్ 2006 కింద ప్రభుత్వం ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. పరిశ్రమల శాఖ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కౌన్సిల్ కమిటీలో ఫాప్సియా ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ, ఏపీఐఐసీ జీఎం (లీగల్) ఎంఎస్ఎంఈ జేడీ సభ్యులుగా ఉంటారు. బకాయిల కోసం కోర్టులకు వెళ్లి సుదీర్ఘ సమయం వృథా చేసుకునే అవసరం లేకుండా వేగంగా పరిష్కరించే చట్టపరమైన హక్కులు ఈ సంస్థకు ఉన్నాయి. కౌన్సిల్లో ఫిర్యాదు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలపై సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్ రెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉద్యం పోర్టల్‌లో నమోదు చేసుకున్న సంస్థలు మాత్రమే కౌన్సిల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉండటంతో అన్ని సంస్థలు ఆ పోర్టల్‌లో నమోదు చేసుకునేలా చూడాలని చెప్పారు. -
టమాటా ధర పెరిగిందని టెన్షన్ వద్దు.. ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!
ప్రస్తుతం కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గడిచిన నెలలో ఎండల తీవ్రత.. దీనికి తోడు అకాల వర్షాలు..వీటన్నింటి కారణంగా సరైన దిగుబడి లేకుండా పోయింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో దిగుమతులు కూడాలేవు. దీంతో మొన్నటి వరకు సాధారణ స్థితిలో ఉన్న కూరగాయాల ధరలు కాస్తా ఒకేసారి సామాన్యుడు కొనలేనంతగా పైకి ఎగబాకాయి. అందులోనూ.. టమాట ధర సెంచరీ కొట్టేసింది. మొన్నటి వరకు కిలో రూ. 20, రూ. 40గా ఉన్నాయి వంద రూపాయాలు పైనే పలుకుతోంది. అన్ని కూరల్లోనూ గ్రేవీ కోసం టమాటాలను విరివిగా వాడటం సర్వసాధారణం. అలాంటిది ఇప్పుడూ కొనాలన్నా, ఉపయోగించాలన్న ఆలోచించాల్సిన స్థితి. టమాట వేస్తే ఆ కూర రుచే వేరే. ఆఖరికి రెస్టారెంట్లు, హోటళ్ల వాళ్లు సైతం కస్టమర్లకు గ్రేవీతో కూడిన కూర సర్వ్ చేయాలంటే.. అక్కడ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కానీ గృహణులు ఇలాంటి సమయంలోనే తమ పాక శాస్త్ర ప్రావిణ్యాన్ని వెలికితీసి టమాటాకే డౌటు తెప్పించే రుచిగా వండాలి. ఈ ప్రత్యామ్నాయాలతో ఆ కొరతను భర్తీ చేసుకుంటూ టమాటా లాంటి రుచిని తెప్పించి చూపించ్చొఉ. అందుకు కాస్త తెలివిని ఉపయోగిస్తే చాలు. ఇంతకీ అవేమిటో చూద్దామా!. టమాటాలకు అల్ట్రనేటివ్గా వేటిని ఉపయోగించాలంటే.. ►టమాటా వేయగానే కాస్త పులుపు తీపి మిక్సింగ్‌లతో కూర రుచి అదిరిపోతుంది కదా. దాని ప్లేస్‌లో చింతపండును చక్కగా ఉపయోగించవచ్చు. అది కూడా కూరకు సరిపడగా పులుపు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడితే ఆ కూర రుచి అదర్స్ అనే చెప్పాలి. ►మార్కెట్లో దొరికే టమాటో పేస్ట్‌తో కూడా ఆలోటును సులభంగా భర్తి చేసుకోవచ్చు. తాజా టమాటాలు అందుబాటులో లేనప్పుడూ, కొనలేని స్థితిలో ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఇవి మార్కెట్లో కూడా సరసమైన ధరలోనే అందుబాటులో ఉంటాయి. ►ఇక రెడ్ బెల్ పెప్పర్ కూడా టమాటా మాదిరిగా కూరకు రుచిని ఇవ్వగలదు. పైగా కూర మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ►ఇంకోకటి ఆలివ్‌లు వీటిని ఉడికించి లేదా నేరుగా ఉపయోగించవచ్చు. పండిన ఆలివ్‌లు అయితే టమాటకు బెస్ట్ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు ►అలాగే ఉసిరి కూడా మంచి పులుపు వగరుతో కూడిని స్వీట్‌ని అందిస్తుంది. దీనిలో ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు దీనిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కారణంగా క్యాన్సర్-నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న ఆకుపచ్చ ఉసిరికాయ ఆకుపచ్చ టమాటాలను గుర్తుకు తెచ్చే పుల్లని రుచిని అందిస్తుంది. గృహుణులు ఇలాంటి ప్రత్నామ్నాయ చిట్కాలతో టమాటాకు ప్రత్యామ్నాయంగా వాడటం తోపాటు కుటుంబసభ్యులందరికి ఆరోగ్యకరమైన భోజనం పెట్టినవాళ్లం అవుతాం. సో మహిళలు మేథస్సు మన సోంతం. తెలివిగా ఇలాంటి చిట్కాలతో పెరుగుతున్న ధరలకు చెక్‌పెట్టేలా ఇలా ఇంటిని చక్కబెట్టుకోండి. (చదవండి: మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు) -
జన హృదయాల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర
కనిగిరి రూరల్: అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ.. తెలుగు పత్రికా రంగంలో సంచలనంగా ఆవిర్భవించి.. అడుగులు ముందుకు వేసిన ‘సాక్షి’ 15 వసంతాలు పూర్తి చేసుకుని, 16వ ఏట అడుగు పెట్టింది. నిఖార్సైన జర్నలిజానికి నిలువుటద్దంగా నిలిచింది. తెలుగు ప్రజల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర వేసుకుంది. ఈ 15ఏళ్లలో ఎన్నోకథనాలను ప్రచురించింది. అందులో కొన్ని.. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారనే విషయంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై 2017 జనవరిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో దీక్ష చేపట్టారు. ఆ వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కనిగిరిలో డయాలసిస్ సెంటర్ మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. చదవండి: పూర్తి చేసేది మేమే వైఎస్ జగన్ సీఎం కాగానే ఏకంగా 17 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం, ఒంగోలు రిమ్స్‌లో డయాలసిస్ మిషన్ల సంఖ్యను భారీగా పెంచారు. సమస్య మూలాలపై దృష్టి సారించి కృష్ణా జలాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. రూ.130 కోట్లతో ఏఐఐబీ స్కీం కింద కనిగిరి పట్టణానికి సమగ్ర మంచి నీటి పథకం మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.400 కోట్లతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 442 గ్రామాలకు సురక్షిత జలాలను అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని మంజూరు చేశారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేస్తున్నారు. -
Russia-Ukraine War: యుద్ధం– శాంతి కింకర్తవ్యం!
(ఎస్.రాజమహేంద్రారెడ్డి) ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. రష్యా సేనలు ప్రతీకారేచ్ఛతో ముందూ వెనకా చూసుకోకుండా వరుసపెట్టి దాడులు చేస్తున్నాయి. కీవ్‌ను హస్తగతం చేసుకుని ఉక్రెయిన్ను తమ కబంధ హస్తాలతో ఆక్రమించుకోవాలనేదే రష్యా ఆశగా కనిపిస్తోంది. తలవంచడానికి సిద్ధంగా లేని ఉక్రెయిన్ వీరోచితంగా ఎదురొడ్డి నిలుస్తోంది. ఈ స్థాయి ప్రతిఘటనను ఆర్నెల్ల కింద యుద్ధం మొదలైనప్పుడు ఎవరూ ఊహించలేదు. రష్యా ఒక్క ఉదుటున ఉక్రెయిన్‌లోకి చొరబడి దాడికి దిగగానే కథ రెండు మూడు వారాల్లోనే ముగుస్తుందని భావించారు. ఉక్రెయిన్ పరిస్థితిని చూసి జాలి పడ్డవాళ్లూ ఉన్నారు. అటు నాటో కానీ, ఇటు అమెరికా కానీ తొలినాళ్లలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు సంశయించాయి. కానీ, ఆర్నెల్లు దాటిపోయినా యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతి దాడులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అంచనాలను వమకమే చేస్తూ ఉక్రెయిన్ నిలబడి పోరాడుతూనే ఉంది. ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మంకుపట్టు వీడటం లేదు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్థైర్యాన్ని కోల్పోవడం లేదు. మరి యుద్ధం ఎప్పుడు ముగిసేను?! ఉక్రెయిన్ రష్యా నీడలోకి వచ్చేదాకా అని పుతిన్ అంటాడు, వచ్చే ఏడాదిలో తమ విజయంతోనే ముగుస్తుందని అంటాడు! పెనం నుంచి పొయ్యిలోకి... ఉక్రెయిన్‌లో యుద్ధం ఇప్పుడు రెండు ప్రాంగణాలుగా విడిపోయింది. తూర్పులో డోన్బాస్ ప్రాంతాన్ని రష్యా దాదాపు పూర్తిగా ఆక్రమించేసుకుంది. మిగతా కొద్ది ప్రాంతాన్ని కాపాడుకుందామని ఉక్రెయిన్ సేనలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు దక్షిణాన చేజారిన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకోవడానికి ఉక్రెయిన్ సంసిద్ధమవుతోంది. ప్రాణనష్టం లెక్కలపై వైరిపక్షాలు ఎంత బింకానికి పోయినా భారీ మూల్యాన్నే చెల్లించాయి. రష్యా దాదాపు 80 వేల మంది సైనికులను కోల్పోయిందని పెంటగాన్ అంచనా. క్షతగాత్రులు ఇంకెంతమందో! రష్యా అమ్ములపొది కూడా ఖాళీ అవుతూ వస్తోంది. ఉక్రెయిన్‌కూ ప్రాణనష్టం భారీగానే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం దాడుల తీవ్రతను బట్టి రోజుకు 100 నుంచి వెయ్యి మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా కనీసం 12 వేల మంది సామాన్యులు కూడా చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఐరాస అంచనా. నిజానికి పౌర నష్టం అంచనాలకు మించి ఉందనేది నిపుణుల వాదన. మరింత ఆయుధ సాయం చేయాలనడమే కాకుండా నేరుగా కీవ్‌లో అమెరికా రక్షణ దళాలను మోహరించాలని జెలెన్స్కీ తాజాగా అభ్యర్థించడం పరిస్థితికి అద్దం పడుతోంది. తిండికి అల్లాడుతున్న దేశాలు యుద్ధానికి మరోవైపు చూస్తే ఆహార సంక్షోభం పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గోధుమలు, మొక్కజొన్నలు, బార్లీ ఉత్పత్తుల్లో రష్యా, ఉక్రెయిన్‌లదే ప్రపంచంలో అగ్ర స్థానం. యుద్ధం వల్ల రవాణా నిలిచిపోవడంతో ఈ రెండు దేశాల దిగుమతులపై ఆధారపడ్డ పలు దేశాలు దాదాపు కరువు పరిస్థితులతో అల్లాడుతున్నాయి. గత నెల రెండు దేశాలు ఒప్పందానికి వచ్చి ఉక్రెయిన్‌లోని ఆహార ధాన్యాల ఎగుమతులకు అంగీకరించాయి. కానీ 45 దేశాల్లోని కోట్లాది మందికి ఇవి సరిపోతాయా అన్నదే ప్రశ్న. మరోవైపు యుద్ధానికి ముగింపు ఎప్పుడన్నది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నగానే ఉంది. ఇటీవలే పశ్చిమ దేశాలు సమకూర్చిన అత్యాధునిక ఆయుధాలతో ఉక్రెయిన్ స్థైర్యం కాస్త ఇనుమడించింది. దేశ దక్షిణాది ప్రాంతాల్లో తిష్ట వేసి కూర్చున్న రష్యా సేనలను తరిమికొట్టడమే వ్యూహంగా ఉక్రెయిన్ సాగుతోంది. అత్యంత కీలకమైన ఖెర్సన్‌ను తిరిగి చేజిక్కించుకుంటే ఉక్రెయిన్ ఒక ముందడుగు వేసినట్టేనని నిపుణుల అంచనా. అదే జరిగితే రష్యాకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. అసలే అరకొర సైన్యంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రష్యాను ఇది మరిన్ని కష్టాల్లోకి నెడుతుంది. రిటైరైన సైనికులను సైతం యుద్ధానికి సన్నద్ధం చేయాల్సి వస్తుంది. ఇది పుతిన్‌కు సుతరామూ ఇష్టం లేకున్నా, తప్పేట్టు లేదు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో తమ పట్టును కొనసాగిస్తే జెలెన్స్కీకి కష్టకాలం మొదలైనట్టే. మరీ మొండితనానికి పోయి యావత్ సైన్యాన్ని దక్షిణంలోనే మోహరించడానికి ఉక్రెయిన్ సిద్ధపడితే తూర్పు ప్రాంతంలో రష్యాకు పూర్తిగా తలొంచక తప్పదని అంచనా. ఇదంతా ఒకెత్తయితే ఇప్పటిదాకా అంటీముట్టనట్టు ఉన్న చైనా బాహాటంగా రష్యాకు తమ మద్దతు ప్రకటించి రంగంలోకి దిగితే యుద్ధ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. యుద్ధం తొలినాళ్లలోనే చైనాను రష్యా సైనిక మద్దతు కోరడం తెలిసిందే. మరో ప్రచ్ఛన్న యుద్ధం దిశగా... ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక, ఆయుధ సాయం ఒకరకంగా యుద్ధాన్ని ప్రేరేపించినట్టే అయిందన్న వాదన కూడా ఉంది. చినికిచినికి గాలివాన అయినట్టు చివరికిది రెండు అగ్రరాజ్యాల మధ్య పోరుగా మారితే పరిణామాలు భయానకంగా ఉంటాయి. ప్రపంచ శాంతి అల్లకల్లోలం అవుతుంది. అణ్వాయుధ ప్రయోగానికి కూడా వెనకాడనంటూ పుతిన్ ఇప్పటికే బెదిరించడం తెలిసిందే. నాటోకు, రష్యాకు మధ్య ఈ పోరు ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీయకముందే అమెరికా వంటి దేశం సంధికి ప్రయత్నిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే మధ్యేమార్గంగా కనీసం యుద్ధ విరామానికన్నా ప్రయత్నించి చర్చలకు తెర తీయాలి. పోనీ, యుద్ధం కొనసాగుతుండగానే చర్చలను మొదలుపెట్టినా బాగానే ఉంటుంది. ఏదో ఒక ముగింపు తప్పక దొరికే అవకాశముంటుంది. రష్యా తన విధ్వంసక దాడులను ఆపకపోతే అటు అమెరికా, ఇటు నాటో ఉక్రెయిన్‌కు ఇలాగే సాయాన్ని కొనసాగించడం తప్పనిసరవుతుంది. కాబట్టి యుద్ధానికి రాజకీయ పరిష్కారం దిశగా రెండు దేశాలు కదిలేలా చేయడానికి ఇదే సరైన సమయం. ఈ బాధ్యతను అమెరికా, నాటో దేశాలే భుజానికెత్తుకోవాలి. లేదంటే దౌత్యం కూడా వీలుపడని స్థాయికి పరిస్థితి చేజారే రోజు ఎంతో దూరం లేదు! -
నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!
జులై 11 ప్రపంచ జనాభా దినోత్వం సందర్భంగా నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు పనిలో పనిగా జనాభా నియంత్రణ కోసం ఒక చిన్న పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు. గత నెలలో ఈ శాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని అందరూ అంటారు గానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పి వార్తల్లో నిలిచారు. మళ్లీ మరోసారి కుటుంబ నియంత్రణ అంశంపై చాలా చమత్కారమైన పరిష్కార మార్గం చెప్పి మరోసారి వార్తలో నిలిచారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....ఇది చాలా సున్నితమైన విషయం. జనాభా పెరుగుదలను నియంత్రించటం కోసం మనం సరైన మార్గాన్ని ఎంచుకుందాం. లేదా నాలాగే సింగిల్‌గా ఉంటూ...అందరం కలసి స్థిరమైన భవిష్యత్తు కోసం పాటుపడదాం. ఈ రోజు నుంచే సింగిల్ ఉద్యమంలో పాల్గొనండి అని నాగాలాండ్ మంత్రి ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు నాగాలాండ్ మంత్రికి చక్కటి హాస్య చతురత ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. On the occasion of #WorldPopulationDay, let us be sensible towards the issues of population growth and inculcate informed choices on child bearing. Or #StaySingle like me and together we can contribute towards a sustainable future. Come join the singles movement today. pic.twitter.com/geAKZ64bSr — Temjen Imna Along (@AlongImna) July 11, 2022 (చదవండి: రాష్ట్ర సీఎంను ఇలాగే ఆహ్వానిస్తారా?.. బీజేపీపై టీఎంసీ ఆగ్రహం) -
అప్పుడే పట్టణాలు శుభ్రపడతాయి!
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ అతి వేగంగా పెరుగుతోంది. భారతదేశంలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో పట్టణాలలో చెత్త, వ్యర్థాలు ప్రతి రోజూ కుప్పలు కుప్పలుగా పెరిగిపోవటం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందువల్ల ప్రజారోగ్యానికీ, పర్యావరణానికీ ఎంతో హాని కలుగుతోంది. స్థానిక సంస్థలకు ఈ చెత్తను తొలగించడం సవాలుగా మారింది. గత రెండు దశాబ్దాలలో వేగవంతమైన పట్టణాభివృద్ధి, జనాభా పెరుగుదల, మారుతున్న జీవన ప్రమాణాలు పట్టణాల్లో వ్యర్థాల పెరుగుదలకు హేతువులుగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బహుముఖ వ్యూహంతో వ్యర్థాల నిర్వహణను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటివరకూ చేపడుతున్న కార్యక్రమాలలో ఆర్ఆర్ఆర్ఆర్ (రెఫ్యూజ్: తిరస్కరణ, రెడ్యూస్: తగ్గించడం, రీయూజ్: తిరిగి వాడటం, రీసైకిల్: వేరుచేసిన చెత్తను ఇతర వస్తువులను తయారు చేయడానికి లేదా పునర్వినియోగానికి సిద్ధం చేయడం) వంటి వ్యూహాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు ఇండోర్ నగరంలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా తెలుస్తోంది. వ్యర్థాల నిర్వహణలో ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ గత 5 సంవత్సరాలుగా దేశంలోనే మొదటి ర్యాంకు సాధిస్తోంది. ఇండోర్ నగంలోని ప్రజలలో వచ్చిన అవగాహన, ప్రవర్తనలోని మార్పులు, మునిసిపల్ సిబ్బంది అకుంఠిత దీక్ష వల్లనే ఇది సాధ్యమయింది. ఇండోర్ నగరంలోని వివిధ ప్రాంతాలలో పది ట్రాన్స్ఫర్ కలెక్షన్ సెంటర్లను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుండి వేరు వేరుగా సేకరించిన చెత్తను భారీ వాహనాల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ పొడి చెత్తను ఆరు రకాలుగా విభజించి ఆ తదుపరి మిగిలిన కొద్దిపాటి ఉపయోగం లేని చెత్తను శాస్త్రీయ పద్ధతి ద్వారా లాండ్ ఫిల్లింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ యూనిట్ నుండి తరలించిన చెత్తతో అనేక నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో ‘ఇంక్‌వాష్’ సంస్థ నిర్వహించిన సదస్సులో చెత్త రీసైక్లింగ్ చేయడం ద్వారా అత్యధికంగా లాభాలు పొందే ఉపాధి అవకాశాలపై చర్చ జరిగింది. చెత్తతో వస్తువులను తయారు చేయడానికి ముందుకు వచ్చే స్టార్టప్ సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. జనాభా పెరుగుతున్న నగరాలలో రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికలను రచించి పకడ్బందీగా ‘చెత్త’ సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యవంతులను చేయాలి. కాలనీ, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వనరులను సమకూర్చుకోవాలి. అప్పుడే ప్రతి నగరం, పట్టణం పరిశుభ్రతతో అలరారుతుంది. - ప్రొఫెసర్ కుమార్ మొలుగరం భారత ప్రభుత్వ ప్రాంతీయ పట్టణ అధ్యయన కేంద్రం డైరెక్టర్, ఓయూ -
యస్ బ్యాంకుపై ఎస్బీఐ చీఫ్ కీలకవ్యాఖ్యలు
సాక్షి, ముంబై: వివాదాలు, సమస్యలసుడిగుండంలో చిక్కుకున్న ప్రయివేటు బ్యాంకు యస్‌బ్యాంకుపై స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ రజనీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్ బ్యాంకు సమస్యల నుంచి బయటపడి మనుగడ సాగించేందుకు కొన్ని పరిష్కారమార్గాలు తప్పక దొరుకుతాయంటూ సానుకూల సంకేతాలిచ్చారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2020 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యస్‌బ్యాంకును కుప్పకూలనివ్వమని, ఏదో ఒక పరిష్కారం తప్పక లభిస్తుందని వ్యాఖ్యానించారు. మూలధన సమీకరణ కోసం యస్‌బ్యాంక్ విశ్వప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎస్బీఐ ఛీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యస్‌బ్యాంకును సంక్షోభం నుంచి బయటపడేసేందుకు యత్నించాలని ప్రభుత్వం ఎస్బీఐని కోరవచ్చన్న అంచనాలకు రజనీశ్ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల బ్యాలెన్స్ షీట్‌తో మార్కెట్లో కీలకమైన బ్యాంకుగా ఉన్న యస్‌బ్యాంకు కుప్పకూలే పరిస్థితి రాదన్నది తన అభిప్రాయమన్నారు. అంతేకాదు యస్‌బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదంటూ రజనీశ్ పేర్కొనడం గమనార్హం. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి తప్పక మార్గాలు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రజనీశ్ వ్యాఖ్యల నేపథ్యంలో యస్‌బ్యాంకు షేరు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం లాభపడింది. కాగా గత నెల్లో యస్‌బ్యాంకును బయటపడేసేందుకు ఎస్బీఐ ఎలాంటి ప్రయత్నం చేయదని రజనీశ్ వెల్లడించడం గమనార్హం. కేవలం నెలరోజుల్లోనే ఆయన అభిప్రాయాల్లో మార్పు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా ప్రమోటర్ రానా కపూర్ ఆకస్మికంగా నిష్క్రమించిన తరువాత బ్యాంకు తీవ్ర సంక్షోభంలోకి పడిపోయింది. ఆస్తి నాణ్యత క్షీణించడం, ఎన్పిఏ, మూలధన పడిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో గత సంవత్సరంలో యస్ బ్యాంకు 80 శాతానికి పైగా పడిపోయాయి. జనవరి 10 న జరిగిన బోర్డు సమావేశం రుణదాత అర్హత కలిగిన సంస్థాగత నియామకం (క్యూఐపి) లేదా, ఏదైనా ఇతర ప్రైవేటు ఈక్విటీ లేదా అప్పు ద్వారా రూ .10,000 కోట్ల వరకు నిధులను సేకరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే ఈ నిధుల సేకరణపై చర్చించడానికి, అంతకుముందు రూ .800 కోట్లుగా ఉన్న అధికారిక మూలదనాన్ని రూ .1,100 కోట్లకు విస్తరించేందుకుగాను, ఫిబ్రవరి 7 న తన వాటాదారుల అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. -
రాజకీయం మారుతోందా..? అవుననే అనిపిస్తోంది...
రాజకీయం మారుతోందా..? అవుననే అనిపిస్తోంది. నాయకుడు మాటిస్తాడు, మర్చిపోతాడు అన్నదే జనాలకు తెలుసు. హామీ ఎన్నికల ఆయుధమన్నదే ప్రజల నమ్మిక. కానీ ఈ రాజకీయం వేరు. ఈ నాయకత్వం భిన్నం. ఈ పాలన వినూత్నం. కష్టం చెప్పుకున్న వారి చెంపలపై జారిన కన్నీళ్లు ఆయనకు ఇంకా గుర్తున్నాయి. చేతులు పట్టుకుని సాయం చేయమని కోరిన వారి మాటలు ఆయన చెవిలో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా వారి సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీలు ఇంకా ఆయన గుండెల్లోనే ఉన్నాయి. గెలిచి మూడు నెలలైంది. అప్పుడే ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిపై యుద్ధం ప్రకటించారు. తిత్లీలో నష్టపోయి సాయం అందక, న్యాయం పొందక నిస్సహాయులుగా మిగిలిన వారిని ఆదుకుంటున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్య పరిష్కారానికి దారి చూపారు. రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిక్కోలు ప్రజలు వేనోళ్ల కీర్తిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దశాబ్దాల ఉద్దానం సమస్యకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చూపించారు. కిడ్నీ బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను నిలబెట్టుకున్నారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 10వేలు పింఛను అందజేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాజా గా మరో ముందడుగు వేసింది. కిడ్నీ బాధితుల కోసం పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దానికి అనుసంధానంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం యూనిట్‌కు రూ. 50 కోట్లు కేటాయిస్తూ జీఓ కూడా జారీ చేసింది. వాటికి అవసరమైన వైద్య పోస్టులను కూడా మంజూరు చేసింది. ఉద్దానంలో కిడ్నీవ్యాధిగ్రస్తుల బతుకులు, వెతలు మాటలకు అందనివి. ఈ పరిస్థితులను వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో దగ్గరుండి చూశారు. వెతలు చూసి చలించిపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 10వేల పింఛను, ఆ వ్యాధి మూలాలు తెలుసుకునేందుకు రీసెర్చ్ సెంటర్, రోగులకు దగ్గరలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు. కిడ్నీ వ్యాధి బారిన పడిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రభుత్వాలు మా రినా ఇక్కడి పరిస్థితులు ఏ మాత్రం మారలేదు. టీడీపీ పాలనలోనైతే పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీలో పథకం వైద్యం అందించే అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వ్యాధుల కత్తిరింపుల నేపథ్యంలో కి డ్నీ వ్యాధిగ్రస్తులకు న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో అరకొర సాయం.. జిల్లాలో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట మండలాల్లో 16వేలకు పైగా కిడ్నీ రోగులు ఉన్నారు. అందులో మందస మండలం ఒక్క లోహరిబందలోనే 1500మందికి పైగా కిడ్నీ రోగులు ఉన్నా రు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు 370మందికి రూ. 2500 పింఛ ను ఇస్తూ ఉండేది. ఎన్నికలకు రెండు నెలలు ఉండగా దాన్ని రూ. 3500కు పెంచింది. అదనంగా మరో 220 మందికి లబ్ధి చేకూర్చింది. కానీ ఈ డబ్బు బాధితులకు ఎంత మాత్రమూ సరిపోయేది కాదు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నానంటూ కిడ్నీ రోగులకు భరోసా ఇచ్చారు. ప్రతి కిడ్నీ రోగికి అధికారంలోకి రాగానే రూ. 10వేలు పింఛ ను ఇస్తానని, దగ్గరలోనే డయాలసిస్ యూనిట్‌తో పాటు కిడ్నీ రీసె ర్ఛ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అంతేకాకుం డా కిడ్నీ వ్యాధి తీవ్రంగా ఉన్నందున 200 పడకలతో ఆస్పత్రి కూడా నెలకొల్పుతానని, అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపన చేసి పనులు చేపడుతానని హామీ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా తాగునీరు కలుషితమైనందున ప్రతి గ్రామానికి శుద్ధ జలాలను అందిస్తామని ధైర్యం కలిగించారు. మాట మర్చిపోకుండా.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కి డ్నీ వ్యాధిగ్రస్తులనే ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. నెలవారీ ఇచ్చే పింఛనును రూ. 10వేలకు పెంచారు. వెంటనే అమల్లోకి తెచ్చి బాధితులకు అందజేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో డ యాలసిస్ చేసుకుంటున్న 507మందికి, ప్రైవే టు ఆస్పత్రిలో డయాలసిస్ చేసుకుంటున్న 219 మందికి నెలకి రూ. 10వేలు చొప్పున మొత్తం 726 మందికి అందజేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగుల కోసం పింఛ ను కింద రూ. 20లక్షలు వెచ్చించగా, అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పింఛన్ల కింద నెలకి రూ. 72లక్షల 60వేలు ఖర్చు పెడుతోంది. అంతటితో ఆగని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యులు, నిపుణులు, మేధావులు, అధికారులతో సుదీర్ఘ అధ్యయనం చేసి బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోనే ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించారు. వ్యాధిని అదుపులోకి తీసుకురావాలంటే మూలాలు తెలుసుకోవాలని, దాని కోసం ఏకంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, దగ్గరలో డయాలసిస్ సెంటర్‌తో పాటు 200 పడకల సూపర్ స్పెషాలటీ ఆస్పత్రిని కూడా నెలకొల్పాలని నిర్ణయించారు. ప్రకటన చేయడమే కాకుండా దానికి సంబంధించిన జీఓ కూడా విడుదల చేశారు. దానితో పాటే రూ. 50కోట్ల నిధులు, వైద్యపోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరైన పోస్టులివి.. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఐదు పోస్టులు, కాంట్రాక్ట్ పద్దతి కింద 98, సర్వీస్ ఔట్‌సోర్స్ కింద 60పోస్టులను మంజూరు చేసింది. రెగ్యులర్ పోస్టులు.. అడిషనల్ డైరెక్టర్ హోదాలో మెడికల్ సూపరింటెండెంట్, సీఎస్ఆర్ఎంఓ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల పోస్టులను రెగ్యులర్ హోదాలో భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్ పోసులు.. యూరాలిజిస్టు పోస్టులు రెండు, వాస్క్యూలర్ సర్జన్ పోస్టు ఒకటి, జనరల్ ఫిజీషియన్ పోస్టులు నాలుగు, జనరల్ సర్జన్ పోస్టులు రెండు, అనస్తీటిస్టు పోస్టులు నాలుగు, రేడియోలజిస్టు పోస్టు ఒకటి, పెథాలజిస్టు పోస్టు ఒకటి, మైక్రో బయాలజిస్టు పోస్టు ఒకటి, బయో కెమిస్టు పోస్టు ఒకటి, జనరల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 12, నూట్రీషనిస్టు పోస్టు ఒకటి, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, ఇద్దరు రీసెర్చ్ ల్యాబ్ ప్రాజెక్టు మేనేజర్ పోస్టులు, రీసెర్చ్ సైంటిస్టు పోస్టులు రెండు, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు రెండు, జూనియర్ రీసెర్స్ ఫెలో పోస్టులు–2ను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. మిగతా 60 పోస్టులను ఔట్ సోర్స్ పద్ధతిలో నియమించనున్నారు. మరో అడుగు ముందుకు.. ఉద్దానంలో కిడ్నీ సమస్యను అధిగమించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. వ్యాధుల విజృంభణకు ప్రాథమిక కారణంగా చెబుతున్న మంచినీటి సమస్యను పరి ష్కరించాలని నిర్ణయించారు. ఉద్దానంలోని ఇ చ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని 807 గ్రామాలకు శుద్ధ జలాలను అందించేందుకు రూ. 600కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. తొమ్మిది క్లస్టర్లలో నీటిసరఫరాకు ప్రణాళిక రూపొందించారు. సమస్యలు తీరుతాయి.. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కిడ్నీవ్యాధి బారిన పడిన వారు విశాఖ, శ్రీకాకుళం వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ ఖర్చులు, మందుల ఖర్చులతో ఆర్థికంగా చితికిపోతున్నాం. ప్రస్తు తం ప్రభుత్వం రూ.పది వేల పింఛన్ అందజేస్తుండడంతో మాలాంటి వారికి ఎంతో ఆసరా కలిగింది. పలాసలో కిడ్నీ రోగుల కోసం ఆస్పత్రి నిర్మిస్తే మా వంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. – బైరి కూర్మారావు, బెంకిలి, డయాలసిస్ రోగి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.. దశాబ్దాల పాటు ఉద్దానం ప్రాంతాన్ని పీడిస్తున్న కిడ్నీ వ్యాధి బారిన పడి వందలాది మంది ఉద్దానం వాసులు కాటికెళ్లారు. ప్రభుత్వాలు మారాయి కానీ ఈ ప్రాంత రోగుల గురించి ప ట్టించుకునే నాథుడే లేకపోయారు. కానీ నాడు జగతిలో జరిగిన సమావేశంలో మావంటి రోగుల పక్షాన నిలిచి, ఇచ్చిన మాటకు కట్టుబడిన ఏకైక రాజకీయ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన ఇప్పుడు మా కోసం తీసుకున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. – చంద్రు మజ్జి, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం -
రెరా ఫలాలు 2020 తర్వాతే!
మొక్క నాటగానే రాత్రికి రాత్రే చెట్టుగా పెరిగి.. ఫలాలను ఇవ్వదు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కూడా అంతే! ప్రస్తుతం దేశంలో రెరా శైశవ దశలో ఉంది. దాని ప్రయోజనాలు పొందాలంటే రెండేళ్ల వరకూ వేచి ఉండాల్సి వస్తుంది. నిర్మాణంలో నాణ్యతతో మొదలుకుంటే గడువులోగా ప్రాజెక్ట్‌ల పూర్తి, లావాదేవీల్లో పారదర్శకత, వాస్తవ వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులు.. వంటివి రెరాతో సులభమవుతాయి. 2020 తొలి త్రైమాసికం నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ రంగం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. సాక్షి, హైదరాబాద్: ఏ పరిశ్రమకైనా నియంత్రణ వ్యవస్థ అనేది అత్యవసరం. బ్యాంక్‌లకు ఆర్బీఐ, మార్కెట్లకు సెబీ, బీమాకు ఐఆర్డీఏ ఎలాగో.. రియల్టీకి రెరా కూడా అంతే. రెరా కారణంగా 2–3 ఏళ్ల వరకూ కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభాలు, భారీ ప్రాజెక్ట్‌లు సప్లయి తక్కువగా ఉంటడం సహజమేనని, కానీ నిర్మాణ రంగం ఎదుర్కొనే చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారం రెరాతో లభిస్తుందని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) నేషనల్ ప్రెసిడెంట్ ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలో జక్సే షా తెలిపారు. గృహాలపై ఎన్నికల ప్రభావం ఉండదు.. సాధారణంగా ఎన్నికల సమయంలో 3 నెలల పాటు ప్రతికూల వాతావరణం ఉండటం సహజం. అయితే ఇది కేవలం ఆఫీస్, రిటైల్ విభాగాలకే పరిమితమవుతుంది. ఎందుకంటే నివాస విభాగంలో ఇన్వెస్టర్ల కంటే వాస్తవ గృహ కొనుగోలుదారులే ఎక్కువగా ఉంటారు. వీరికి ఎన్నికలు, ఇతరత్రా రాజకీయాంశాలతో సంబంధం ఉండదు. నిజం చెప్పాలంటే ఇలాంటి సమయంలోనే గృహ కొనుగోళ్లు ఎక్కువగా జరుపుతుంటారు. ఎందుకంటే? నగదు రాయితీలు, ఇతరత్రా ప్రోత్సాహకాలతో కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు కాబట్టి! అదే ఆఫీస్, రిటైల్ విభాగాలు ఇన్వెస్టర్లతో అనుసంధానమై ఉంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడితే నిబంధనలు, నిర్ణయాలు ఎలా ఉంటాయోనని ఎన్నికల సమయంలో వేచి చూసే ధోరణిలో ఉంటారు. 50 శాతం ల్యాండ్ అబాండ్‌మెంట్.. మెట్రోల్లో ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో భూమి ధరే 50 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ల్యాండ్ అబాండ్‌మెంట్ 33 శాతం మాత్రమే ఇవ్వటం సరైంది కాదు. దీన్ని 50 శాతానికి పెంచాలి. లేకపోతే ఇతర నగరాల్లోని కొనుగోలుదారులతో పోలిస్తే మెట్రోలో 3–4 శాతం జీఎస్టీ ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. స్థల, పన్ను సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటూ నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) కాలపరిమితిని పెంచాల్సిన అవసరముంది. తెలంగాణలో 1,94,602 గృహాలు మనిషి అత్యవసరాల్లో ఒకటి సొంతిల్లు. కానీ, ఆశించిన స్థాయిలో దేశంలో ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎంఐజీ గృహాల సరఫరా లేదు. అందుకే పీఎంఏవైలో క్రెడాయ్ భాగస్వామ్యమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 60,36,220 పీఎంఏవై గృహాలు మంజూరు కాగా.. ఇందులో 9,66,236 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 31,79,440 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 9,21,877 గృహాలు మంజూరయ్యాయి. 1,08,643 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. 6,21,475 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. తెలంగాణలో 1,94,602 మంజూరయ్యాయి. 15,170 యూనిట్ల నిర్మాణం పూర్తి కాగా.. 1,50,865 నిర్మాణంలో ఉన్నాయి. భవిష్యత్తు కో–వర్కింగ్, వేర్హౌస్లదే.. దేశంలో ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్ రంగ కంపెనీల్లో టెక్నాలజీ వినియోగం పెరిగింది. చాలా వరకు సంస్థలు తక్కువ స్పేస్‌లో ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో సాధారణ ఆఫీసు స్పేస్ గిరాకీ తగ్గింది. స్టార్టప్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రవేశంతో కో–వర్కింగ్ స్పేస్, ఈ–కామర్స్ కంపెనీలతో గిడ్డంగులకు డిమాండ్ బాగా పెరిగింది. రానున్న రోజుల్లో కో–వర్కింగ్, గిడ్డంగి విభాగాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కార్మికుల్లో నైపుణ్యం కొరత.. ప్రస్తుతం క్రెడాయ్‌కు 28 రాష్ట్రాల్లో 204 చాప్టర్లున్నాయి. 12 వేల మంది సభ్యులున్నారు. ఏప్రిల్ నాటికి 300 చాప్టర్లకు విస్తరించాలని లకి‡్ష్యంచాం. గుజరాత్, కేరళ, మహారాష్ట్రలతో పోలిస్తే ఏపీ, తెలంగాణల్లోని నిర్మాణ కార్మికుల్లో నైపుణ్యం తక్కువగా ఉంది. త్వరలోనే ఆయా రాష్ట్రాల్లోని క్రెడాయ్ సంఘాలతో కలిసి లేబర్లకు నైపుణ్య శిక్షణ శిబిరాలను ప్రారంభించనున్నాం. హైదరాబాద్ రియల్టీలోకి సావీ అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్టీ సంస్థ సావీ గ్రూప్ హైదరాబాద్ రియల్టీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఏడాదిలో నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థతో కలిసి గోల్ఫ్ కోర్ట్ లేదా టౌన్షిప్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని సావీ గ్రూప్ ఎండీ జక్సే షా తెలిపారు. స్థానిక ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు, ప్రోత్సాహాలతో ఇతర నగరాల కంటే హైదరాబాద్ మార్కెట్‌కు మంచి అవకాశాలున్నాయని.. అందుకే భాగ్యనగరంలో ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. సావీ గ్రూప్ అహ్మదాబాద్‌లోని రాజ్‌పత్ క్లబ్ సమీపంలో 900 ఎకరాల్లో కెన్స్విల్లీ పేరిట గోల్ఫ్ కోర్ట్‌ను అభివృద్ధి చేసింది. దేశంలోనే అతిపెద్ద గోల్ఫ్ ప్రాజెక్ట్ ఇది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో 25 లక్షల చ.అ.ల్లో పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. గిఫ్ట్ సిటీలో ప్రాగ్యా, ఎస్జీ రోడ్లో స్ట్రాటా, సంస్కార్, స్వరాజ్ నిర్మాణాలు రానున్నాయి. ముంబైలో 60 ఎకరాల్లో టౌన్షిప్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించనుంది. -
అమ్మానాన్నకు చెబితేనే పరిష్కారం దొరుకుతుంది
మీటూతో ప్రపంచం ప్రకంపిస్తోంది ఇప్పుడు. విద్యావంతులు, ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, సినిమా రంగంలో ప్రముఖులు.. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా మగవాళ్లందరినీ బిక్కుబిక్కుమని భయపెడుతున్న ఉద్యమం ఇది. అంత పెద్దవాళ్లే నిలువు గుడ్లేసుకుని ఎప్పుడు ఎక్కడ మాట్లాడిన ఏ మాట ఎలా బాణంలా వచ్చి దిగుతుందో తెలియక సతమతమవుతుంటే పుణెలోని ఓ స్కూలు ప్యూన్ ఇవేవీ పట్టకుండా తన పైత్యాన్ని బయటపెట్టుకున్నాడు. ఉద్యోగం పోయి పోలీసుల ఎదుట దోషిలా నిలబడ్డాడు. రఘునాథ్ చౌదరికి 47 ఏళ్లు, పుణెలోని కొత్రుద్లో ఓ స్కూల్లో ప్యూను. అతడి కన్ను హైస్కూల్ అమ్మాయిల మీద పడింది. ముగ్గురమ్మాయిలతో అవసరానికి మించిన చనువు తీసుకోవడం మొదలుపెట్టాడు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వాళ్లు దూరంగా ఉంటే వీడియోలు చూపిస్తానంటూ తన స్మార్ట్ ఫోన్లో పోర్నోగ్రఫీ (అశ్లీల చిత్రాలు) చూపించి మీరూ నేర్చుకోవాలని వాళ్లను ఒత్తిడి చేస్తున్నాడు. వాళ్లంతా పదమూడు– పద్నాలుగేళ్ల వాళ్లే. ఈ బెడద నుంచి ఎలా బయటపడాలో తెలియక మూడు వారాలపాటు సతమతమయ్యారు. ఒకమ్మాయి ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో అతడి దురాగతం బయటపడింది. టీచర్ల విచారణలో మిగిలిన ఇద్దరమ్మాయిలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. స్కూలు యాజమాన్యం వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేసి, రఘునాథ్ చౌదరిని ఉద్యోగం నుంచి తొలగించింది. బాధితులంతా మైనర్లు కావడంలో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్, 2012) చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. – మంజీర -
పంటలకు రక్షణ బమావె ద్రావణం!
వాణిజ్య, ఉద్యాన పంటలు, పండ్ల తోటలను చీడపీడల నుంచి రక్షించే మరో ద్రావణాన్ని వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి.వెలంవారిపల్లెకు చెందిన సేంద్రియ వ్యవసాయ నిపుణుడు, వెన్నెల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు కొమ్ములూరి విజయకుమార్ రైతులకు పరిచయం చేస్తున్నారు. పల్లెల్లో బీడు భూముల్లో, గట్ల మీద, వాగులు, వంకల దగ్గర, అడవిలో విరివిగా కనిపించే బంకీర పండ్లు, మారేడు కాయలు, వెర్రి పుచ్చకాయలతో తయారు చేసే ఈ ద్రావణానికి ‘బమావె’ ద్రావణం అని పేరు పెట్టారు. పత్తి, మినుము,పెసర, వేరుశనగ, చీనీ(బత్తాయి), మామిడి, సపోటా, జామ, టమాటా, బీర, సొర, కాకర, దోస, కళింగర ఇతర తీగ జాతి పంటలు, పండ్ల, కూరగాయ పంటలను చీడపీడల నుంచి రక్షించుకోవడానికి రైతులకు ఈ ద్రావణం ఉపకరిస్తుందని విజయకుమార్ తెలిపారు. వార్షిక పంటలకు మొలక దశలో ఆశించి నష్టపరిచే మిడతలు, పచ్చదోమ, తెల్లదోమ, వైరస్ తెగుళ్ల నివారణకు ఈ ద్రావణం ఉపయోగపడుతుంది. పురుగులను సమూలంగా నాశనం చేస్తుందన్నారు. పంటలపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు. బంకీర పండ్లు బంకీర పండ్లు 10 కిలోలు సేకరించుకొని ఉంచుకోవాలి. ఇవి పొలాల గట్ల మీద, అడవులు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు తదితర చోట్ల పెరుగుతుంటాయి. పండ్లు తెల్లగా ఉంటాయి. విత్తనానికి చుట్టూ బంకతో కూడిన కండ ఉంటుంది. పండు తియ్యగా ఉన్నా తింటే బబుల్ గమ్లాగా నోటికి అంటుకుంటూ ఉంటుంది. మారేడు కాయలు మారేడు కాయలు 5 కిలోలు తీసుకొని బాగా పచ్చడి పచ్చడిగా దంచి సిద్ధం చేసుకోవాలి. ఈ చెట్లు దేవాలయాల వద్ద, పొలాల గట్లు, అటవీ ప్రాంతాల్లో విరివిగా ఉంటాయి. ఎలాంటి చీడపీడలు ఆశించని చెట్టు ఇది. బాగా మాగి ఉన్న కాయలు సేకరిస్తే మరీ మంచిది. వెర్రి పుచ్చ కాయలు వెర్రి పుచ్చకాయలు రెండున్నర కిలోలు సేకరించి మెత్తగా దంచి ఉంచాలి. ఈ కాయలు చెరువుల వద్ద గ్రామాల్లో వంకలు, వాగులు, గుట్టల సమీపంలో విరివిగా తీగలకు కాస్తుంటాయి. ఇవి బాగా మాగితే పసుపు పచ్చగా ఉంటాయి. ముఖ్యంగా చెరువులు, వంకలు, వాగుల వద్ద దొరుకుతాయి. వెర్రిపుచ్చ తీగలకు ఎలాంటి పురుగులు, తెగుళ్లు ఉండవు. కాయలు పచ్చగా నిగనిగలాడుతుంటాయి. కాయలు పండుబారి కొద్ది రోజులకు నశించి మళ్లీ కొత్త తీగలు అదే కాండం నుంచి పుడతాయి. ద్రావణం తయారీ ఎలా? 200 లీటర్ల నీరు పట్టే డ్రమ్ములో.. దంచి పెచ్చుకున్న 10 కిలోల బంకీరపండ్లు, 5 కిలోల మారేడు కాయలు, రెండున్నర కిలోల వెర్రి పుచ్చకాయలను వేసి బాగా కలియతిప్పాలి. డ్రమ్మును నీడలో ఉంచాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కర్రతో కలియబెడుతుండాలి. గొనె సంచి కప్పి 8 రోజులు మురగబెడితే ‘బమావె’ ద్రావణం వాడకానికి సిద్ధమవుతుంది. పిచికారీ ఎలా? ► పత్తి, టమాటా, మిరప, అన్ని రకాల కూరగాయ తోటలతో పాటు ఆముదం పంటకు, చీనీ, సపోట, జామ, దానిమ్మ, మామిడి, ఇతర పండ్ల తోటలకు ‘బమావె’ ద్రావణాన్ని నెలలో నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి. ఏ పంటకైనా సరే.. మొదటిసారి– 10 లీటర్ల నీటికి 1 లీటరు ద్రావణం, 2వ సారి– 10 లీటర్ల నీటికి 1.25 లీటర్లు, 3వ సారి– 10 లీటర్ల నీటికి 1.5 లీటర్లు, 4వ సారి– 10 లీటర్ల నీటికి 2 లీటర్ల ద్రావణం కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని విజయకుమార్ చెబుతున్నారు. ► ఉదయం 5.30 గంటల నుంచి 9 గంటల లోపల, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ► పంటకు పూత వచ్చినా, రాకపోయినా ద్రావణం పిచికారీని మరువకూడదు. ► లేత పంటను ఆశించే పచ్చ, తెల్లదోమ, ఆకులు తినే దాసరి పురుగు, మిడతలను ఇది నశింపజేస్తుంది. ► పూతను ఆశించే ఎటువంటి పురుగునైనా ఇది మట్టుబెడుతుంది. వైరస్‌ను మోసుకు వచ్చే పురుగులను పంట దరి చే రనీయదు. ► పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు.. పావు లీటరు నుంచి అర లీటరు పశువుల మూత్రం కలుపుకొని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ► అరటిలో పండు ఈగ రైతు ఆదాయాన్ని కోల్పోయేలా చేస్తుంది. దీని నివారణకు అరటి గెల వేసే సమయంలోనే ‘బమావె’ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. గెల పూర్తిగా పెరిగే వరకు నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి. ► మిరప తోటలను ఆకుముడత వేధిస్తుంటుంది. ముడత ఆశిస్తే పంట దున్నేయాల్సిందేనని రైతులు చెబుతుంటారు. ముడత నివారణకు ‘బమావె’ ద్రావణం అద్భుతంగా పనిచేస్తుంది. ► వరి పంటను దుంప కుళ్లు, ఉల్లికోడు, అగ్గి తెగులు, కాండం కుళ్లు తెగులు, రెల్లా పురుగులు ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు చక్కని మార్గం ‘బమావె’ ద్రావణం పిచికారీ చేసుకోవాలి. మొలక దశ నుంచి కంకులు వేసే దశ వరకు పిచికారీ చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ► బంకీర పండ్లు, మారేడు కాయలు, వెర్రి పుచ్చకాయలు కేవలం మే, జూన్ నెలల్లో మాత్రమే లభిస్తాయి. ఈ సీజన్లో వీటిని సేకరించుకొని ద్రావణం తయారు చేసి పెట్టుకుంటే.. ఏడాది పొడవునా పంటలకు పిచికారీ చేసుకోవచ్చని విజయకుమార్(98496 48498,79814 07549) తెలిపారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, వ్యవసాయం, వెఎస్సార్ జిల్లా -
కడుపు కదిలించేందుకు... కాంతి!
ఉదయాన్నే కడుపు సాఫీగా కదలకపోతే ఎంత చికాకో.. కాఫీలతో కొందరు.. కాసేపు నడక లేదంటే గోరువెచ్చటి నీటితో ఇంకొందరు కడుపు ఖాళీ చేసుకునేందుకు ప్రయత్నిస్తూంటారు. మరికొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని సాఫీగా అవదు. ఇలాంటి వారి కోసం కాంతి ఎంతో బాగా ఉపయోగపడుతుందంటున్నారు ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఆశ్చర్యపోవద్దు. అక్షరాలా నిజమే. కాంతి ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా గుండె చప్పుళ్లను క్రమబద్ధీకరిస్తుందని, కరెంటు షాకులతో గుండెలను మళ్లీ కొట్టుకునేలా చేసేందుకు ప్రత్యామ్నాయంగానూ ఉపయోగపడుతుందని ఎలుకలపై జరిపిన ప్రయోగాలు రుజువు చేస్తున్నాయి. తాజాగా పెద్దపేవు ప్రాంతాల్లో నీలపు కాంతిని ప్రసరింప చేయడం ద్వారా అక్కడి నరాలు చైతన్యవంతమై మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం మలబద్ధకం నివారణకు ఉపయోగిస్తున్న లాక్సేటివ్లు దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు చూపే అవకాశమున్నందున తాము కాంతిని ప్రత్యామ్నాయంగా గుర్తించామని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త నిక్ స్పెన్సర్ తెలిపారు. ఎలుకల పేవు గోడల్లో అతిసూక్ష్మమైన ఎల్ఈడీ బల్బులు వెలిగేలా చేసినప్పుడు కొన్ని నరాలు చేతన్యవంతమై ఆ పని పూర్తి అయ్యేలా చేసిందని చెప్పారు. అయితే మనిషి పేవుల్లోకి బల్బులు చొప్పించడం కాకుండా ఇతర మార్గాల ద్వారా వెలుతురును ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. -
మేనిచాయ కోసం...
∙ఆపిల్ స్లైస్ ఆయిల్ కంట్రోల్ సొల్యూషన్ ఆపిల్ ఒక్కటి ఉంటే చాలు ఏమయినా చేయొచ్చు. ఆపిల్‌ను సన్నని ముక్కలుగా కట్ చేసి వాటితో ముఖానికి మసాజ్ చేయాలి. ఆయిలీ స్కిన్‌కు ఇది ఇంట్లో చేసుకోగలిగిన సింపుల్ ట్రీట్మెంట్. ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాల్లో దాగిన అదనపు ఆయిల్ పోతుంది. జిడ్డు రావడాన్ని కంట్రోల్ చేస్తుంది కూడా. ∙బనానా ఫేషియల్ క్రీమ్ బాగా పండిన అరటిపండును పావు భాగం తీసుకుని మెత్తగా చిదిమి మెత్తగా అయ్యేవరకు కలపాలి. దీనిని ముఖానికి పట్టించి పదిహేను లేదా ఇరవై నిమిషాల తర్వాత ముందుగా వేడినీటితోనూ తరువాత చల్లటి నీటితోనూ కడగాలి. కడిగిన తర్వాత ముఖాన్ని తుడవకుండా గాలికి ఆరనివ్వాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మెరవడంతో పాటు పాటు ముడతలను కూడా నివారిస్తుంది. -
చర్చలతోనే అన్ని సమస్యలకు పరిష్కారం
లక్నో: ఎలాంటి సమస్యలనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. రామ జన్మభూమి వివాద పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆయన శుక్రవారం అయోధ్యలో పలువురు ముస్లిం మతపెద్దలతో సమావేశమయ్యారు. ఫారంగి మహల్ ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా రెక్టర్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులో సీనియర్ సభ్యుడైన మౌలాని ఖాలిద్ రషీద్ ఫారంగిమహలి రవిశంకర్‌ను కలుసుకున్న వారిలో ఉన్నారు. ఈ వివాద పరిష్కారం ఇప్పటికే ఆలస్యమైందని, త్వరలోనే దీనికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్లు రవిశంకర్ తెలిపారు. -
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి
విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో సీజీఆర్ఎఫ్ చైర్మన్ ధర్మారావు జగ్గంపేట : విద్యుత్ వినియోగదారుల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు విద్యుత్ వినియోగదారుల ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్మన్, రిటైర్డ్ జడ్జి డి.ధర్మారరావు అన్నారు. విద్యుత్ పొదుపు వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట ఎలక్ట్రికల్ డివిజనల్ కార్యాలయంలో బుధవారం జిల్లా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఫోరం చైర్మన్ ధర్మారావు మాట్లాడుతూ డిసెంబరు రెండున తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత 137 ఫిర్యాదులు స్వీకరించి వీటిలో 75 వరకు పరిష్కరించినట్టు తెలిపారు. జగ్గంపేటలో ఐదు డివిజన్లకు సంబంధించి 36 కేసులు రాగా వాటిలో పరిష్కరించామన్నారు. విద్యుత్ వినియోగదారుల ఫోరం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్యలు, విద్యుత్ మీటర్ సమస్యలు, కొత్త సర్వీసుల ఇవ్వడంలో జాప్యం తదితర వాటిపై పరిష్కరిస్తామన్నారు. విద్యుత్ పొదుపు వారోత్సవాలు సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈఈ తిలక్‌కుమార్, సిబ్బంది బాలాజీ, రమణారావు, రవికుమార్, విజయ్, మీనకేతనరావు, తదితరులు పాల్గొన్నారు. -
చిల్లర సమస్యకు ఏపీ దేవాదాయ శాఖ పరిష్కారం
-
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించండి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో రేషన్ పంపిణీ నిమిత్తం ఈ పోస్, ఈ వేమెంట్ అమలు చేసినప్పటి నుంచి ఆర్థికంగా డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రాజులపాటి గంగాధరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. తూనికలు, కొలతల శాఖ స్టాంపింగ్, సర్వీసింగ్ పేరుతో రూ.300, రూ.600 వసూలు విధానాన్ని నిలుపుదల చేయాలని కోరారు. ఈ పోస్, కాటాల రిపేరు నిమిత్తం రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారని, దీనిని నిలుపుదల చేయాలన్నారు. డీలర్లకు ఆహారభద్రతా చట్టం ప్రకారం రూ.87 కమీషన్‌ను పూర్తిగా అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీని కలిసిన అనంతరం వారు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి డి.శివశంకరరెడ్డిని కూడా కలిసి వినతిపత్రం అందించారు. సంఘ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు కానుమోలు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి వెంకట నరసింహారావు పాల్గొన్నారు. -
విశ్రాంత ఉద్యోగులను ఆదుకోవాలి
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ గుంటూరు (కొరిటెపాడు): న్యూఇండియా, యునైటెడ్ ఇండియా, ఓరియంటల్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీల విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు గురుమూర్తి కోరారు. అరండల్‌పేటలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన వైజాగ్ రీజియన్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగినప్పుడల్లా విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ పెరుగుతోందని, కానీ బీమా సంస్థల విశ్రాంత ఉద్యోగులకు అటువంటి సౌకర్యం కల్పించకపోవడం అన్యాయమన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రజా సమస్యలకు పరిష్కారమేదీ?
– చూద్దాం..చేద్దామంటూ కాలయాపన – మీ కోసం కార్యక్రమానికి వెల్లువెత్తిన వినతులు కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. కనీసం వారి సమస్య వినే ఓపిక కూడా అధికారులకు లేదు. వివిధ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ఎంతో వ్యయ ప్రయాసలు పడి సోమవారం కలెక్టరేట్లోని మీ కోసం కార్యక్రమానికి వ చ్చిన ప్రజలకు అధికారులు భరోసా ఇవ్వలేకపోయారు.lబాధితుల నుంచి వినతులు తీసుకుని చూద్దాం.. చేద్దామంటూ సమాధానం చెప్పడంతో వారు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. సునయన ఆడిటోరియంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్ తదితరులు వినతులు స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వినుతుల వెల్లువెత్తాయి. వచ్చిన సమస్యల్లో ముఖ్యమైనవి కొన్ని.. చెరువులకు హంద్రీ నీవానీళ్లు వదలండి: దేవనకొండ గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో హంద్రీనీవా కాలువ ఉంది. అక్కడక్కడ బ్రిడ్జి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పందికోన రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా దేవనకొండలోని రెండు చెరువులకు నీళ్లు ఇవ్వండి. తాగునీటి సమస్య తీరడంతో పాటు పశువులకు నీరు దొరుకుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. పిల్ల కాల్వలను మేమే సొంతంగా తవ్వుకుంటాము. అనుమతి ఇవ్వాలని ఎంపీపీ రామచంద్రనాయుడు, జెడ్పీటీసీ సభ్యురాలు భర్త ఉబ్బీరప్ప, ఎంపీటీసీ సభ్యుడు నరసారావు, వీరేష్, వైసీపీ నాయకుడు కిట్టు తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నీటి సమస్య పరిష్కరించండి : ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య ఉంది. ఎస్ఎస్ ట్యాంకులో పూర్తిగా నీళ్లు అడుగంటి పోయాయి. గ్రామంలో కేవలం ఒక బోరు మాత్రమే పని చేస్తుంది. కరెంటు లేకపోతే చుక్కనీరు రాదు. వెంటనే తగిన చర్యలు తీసుకుని నీటి సమస్య పరిష్కరించాలని సర్పంచ్ పాపన్న, ఎంపీటీసీ సభ్యుడు సుబ్బన్న, రైతు సంఘం నేతలు కోరారు. రూ.20 వేలు లంచం ఇచ్చినా సర్వే చేయడం లేదు: మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలోని 7 సర్వే నెంబర్లలో 19.60 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో నావాట 4.50 ఎకరాలు ఉంది. ఈ భూమికి హద్దులు గుర్తించడానికి 3సార్లు చలానా కట్టినాను. రూ.20 వేలు లంచం ఇచ్చాను. అయినా, ఇంతవరకు సర్వే చేయలేదు. మీరైనా స్పందించి పొలం సర్వే చేయించాలని కోరారు. -
లోక్ అదాలత్‌లో 1,946 కేసుల పరిష్కారం
* కేసుల పరిష్కారంలో మూడోసారి రాష్ట్రంలో ప్రథమ స్థానం * న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసింహారెడ్డి గుంటూరు లీగల్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి రాష్ట్రంలో వరసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహించిన అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 1,946 కేసులు పరిష్కరించినట్లు న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి చెప్పారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత ఆధ్వర్యలో నిర్వహించిన అదాలత్‌లో 53 సివిల్ కేసులు, 368 క్రిమినల్ కేసులు, 31 వివాహ సంబంధమైనవి, 8 మోటారు వాహన ప్రమాద కేసులు, 8 లేబర్ కోర్టు కే సులు, 176 విద్యుత్ కేసులు, 1234 ఎస్టీసీలు, 50 బీఎస్ఎన్ఎల్ కేసులు, 18 ఇతర ప్రీలిటిగేషన్లు పరిష్కారమయ్యాయి. రూ.2,82,91,514 పరిహారంగా మంజూరు చేశారు. -
క్షణం.. ఆలోచిస్తే..
భవిష్యత్తు బంగారమే.. •క్షణికావేశమే అనర్థాలకు మూలం •ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది •ఆత్మన్యూనతే పెద్ద ఉపద్రవం ఆత్మవిశ్వాసం గెలుపునకు రాచబాట •నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం జీవితంలో వెనక్కి తీసుకోలేనివి రెండే.. ఒకటి కాలం.. మరొకటి ప్రాణం. తొందరపాటు జీవితాన్ని చిదిమేస్తుంది. మనపై ప్రేమను పెంచుకున్న కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిలిస్తుంది. కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటే కదా జీవితం అంటాడు ఓ కవి. జీవిత ప్రయాణాన్ని ముగించే మరణం సహజంగా ఉంటేనే ఆ జీవితానికి సార్థకత. అయితే, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోలేక, చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూస్తూ భయపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రస్తుత పరిస్థితులో అధికమవుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం, జీవితంలో పెరిగిపోతున్న యాంత్రికత, తీవ్రమైన మానసిక ఒత్తిడి, న్యూనతా భావం ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని మానసిక విశ్లేషకులు అభిప్రాయం. క్షణికావేశానికి గురైన వ్యక్తుల ఆలోచనలను కొద్ది సేపు మళ్లించగలిగితే మళ్లీ ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయబోరని చెబుతున్నారు. ఇలాంటి మానసిక బలహీనుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వారిని మంచి మార్గంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. క్షణికావేశంలో యువత ఆత్మహత్యలకు పాల్పడుతూ బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అమ్మతిట్టిందనో..నాన్న కొట్టాడనో...ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దన్నారనో.. అడిగిన డబ్బులు ఇవ్వలేదనో...తరగతిలో టీచర్ అవమానించారనో చిన్న చిన్న వాటికి యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్రిమిసంహారక మందులు వేసుకోవడం, ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకోవడం, చెరువులల్లో దూకి చనిపోవడం వంటివి చేసుకుంటున్నారు. మనకు తల్లిదండ్రులు ఎందుకు ఈ జన్మను ఇచ్చారన్న విషయాన్ని మరచిపోయి అప్పటికప్పడు నిర్ణయాలు తీసుకొని, వారిపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగులుస్తున్నారు. ఉన్నత చదువులు చదువుతున్న యువత కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం బాధకరం. సమాజంలో నలుగురిని చైతన్య వంతులుగా చేసే తెలివి ఉన్న వారు కూడా అప్పటికప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రాణాలమీదుకు తెచ్చుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు పంటల కోసం పెట్టిన పెట్టుబడులు చేతికిరాక, వాతావణం అనుకూలించక చేసిన కష్టం కూడా దక్కేటట్లు లేదని ప్రతి రోజు రైతులు ఎక్కడో ఒక చోట ఆత్మహత్యలు చేసుకుంటునే ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా కూడా రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి బలవన్నరణాలకు దిగుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న ధరలు, పెస్టిసైడ్స్, ఎరువులు , విత్తనాలు ఆమాంతం పెరగడం.. కష్టించి తీరా పంట వస్తే గిట్టు బాటు ధర లభించడంలేదు. వ్యవసాయానికి బ్యాంకుల్లోను సొసైటీల్లోను, అప్పులు తీసుకొన్నా.. తిరిగి చెలించలేక కుటుంబాన్ని పోషించుకోలేక అనుదినం మానసిక సంఘర్షణలకు గురై బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు తెలిసిందే.. రెండేళ్ల కాలంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. డిప్రెషన్‌కు లోనైన వారే ఎక్కువ ‘ఆత్మహత్యలు చేసుకునేవారిలో చాలా మంది డిప్రెషన్‌కు లోనైన వారే. సున్నిత మనస్కులు, హిస్టీరికల్ మనస్థత్వం ఉన్న వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. జీవితంపై సానుకూల ధోరణిలో ఒక్క క్షణం ఆలోచించినా ఆత్మహత్యను నివారించడం సులభం. సమస్యలను, బాధలను సన్నిహితంగా ఉండే బంధువులు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఆత్మహత్య భావన మదిలో కదలినపుడు ఒకసారి అలా బయటకు వెళ్లి ఏకాంతంగా గడపడం, శ్వాసపై ధ్యాస ఉంచి ఓ పది నిమిషాలు నెమ్మదిగా ఉండడం ఉపయోగపడుతుంది. బంధువులు, కుటుంబ సభ్యులు సైతం బలహీన మనస్థత్వమున్న వారిని ఒంటరిగా వదలడం మంచిది కాదు.జీవితం పట్ల అనురక్తిని పెంచేలా మాట్లాడడం ఉదాహరణలుగా ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలే కాదు ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చు. మనల్ని నమ్ముకున్న వారికి కడుపు కోత పెట్టడం ఎంతటి పాపమో ఆలోచిస్తే తప్పకుండా మనసు మారుతుంది. - ప్రముఖ వైద్యుల, డాక్టర్ నాగరాజు -
రైతు సమస్యలకు పరిష్కారం చూపాలి
‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి సాక్షి, హన్మకొండ: రైతు సమస్యలకు పరిష్కారం చూపించేలా పార్లమెంటు ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చ జరగాలని సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి అన్నారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అందించే శాంతిదూత అవార్డుకు 2015 సంవత్సరానికి ప్రవాస భారతీయురాలు దూదిపాల జ్యోతిరెడ్డి ఎంపికయ్యారు. వరంగల్‌లో ఆదివారం జరిగిన ఈ అవార్డు బహూకరణ కార్యక్రమానికి రామచంద్రమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విజయ్‌మాల్యా వంటి బడా పారిశ్రామిక వేత్తలు చేసిన అప్పులతో పోల్చితే... రైతులు చేసే అప్పులు చాలా చిన్నవని అన్నారు. అప్పుల పాలైన రైతులు, ఆత్మన్యూనతా భావానికి లోనై బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభించి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవోగా ఎదిగిన ప్రవాస భారతీయురాలు జ్యోతిరెడ్డి జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆశయాలు ఉండటం గొప్పకాదని, వాటిని ఆచరించడం గొప్పని అన్నారు. శాంతి స్థాపన కోసం వరల్డ్ పీస్ సంస్థ చేస్తోన్న కృషిని అభినందించారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ మహిళలందరికీ జ్యోతిరెడ్డి ఆదర్శప్రాయమన్నారు. జ్యోతిరెడ్డి అనుమతిస్తే ఆమె జీవిత గాథను నవలగా రాస్తానని జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు. -
జిల్లాలో 988 కేసులు పరిష్కారం
ఖమ్మం లీగల్ : జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లావ్యాప్తంగా 988 కేసులు పరిష్కారమయ్యాయి. 2వేల మందికిపైగా కక్షిదారులు కేసుల నుంచి విముక్తి పొందారు. మోటారు వాహన ప్రమాద కేసుల లోక్ అదాలత్‌కు న్యాయమూర్తి రాధాకృష్ణ కృపాసాగర్ అధ్యక్షత వహించి.. 140 కేసులను పరిష్కరించారు. మొత్తం రూ.3.42కోట్ల పరిహారం బాధితులకు చెల్లించేందుకు బీమా కంపెనీ అధికారులు అంగీకరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారుపల్లి గంగాధర్ లోక్ అదాలత్ సభ్యుడిగా వ్యవహరించారు. బ్యాంక్, ఇతర సివిల్, టెలిఫోన్ కేసుల లోక్‌అదాలత్ బెంచ్‌కు న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి వీఏఎల్.సత్యవతి అధ్యక్షత వహించి.. 395 కేసులను పరిష్కరించారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి మేకల సుగుణారావు లోక్ అదాలత్ సభ్యుడిగా వ్యవహరించారు. రాజీ పడదగిన క్రిమినల్, ఇతర నేరాంగీకార కేసులను మెజిస్ట్రేట్లు డి.మాధవీకృష్ణ, డి.గీతారాణి, సీహెచ్.పంచాక్షరి, ఎన్.అమరావతి, సతీష్‌కుమార్, వెంకటేశ్వర్లు పరిష్కరించారు. న్యాయవాదులు దేవకీ శ్రీనివాస్ గుప్తా, కన్నాంబ, నాగటి రాము, ఎ.ఇంద్రాచారి, లక్ష్మీనారాయణ, కందుల అమరనాథ్ లోక్ అదాలత్ సభ్యులుగా వ్యవహరించారు. మధిరలో 297 కేసులు, సత్తుపల్లిలో 82, ఇల్లెందులో 48, భద్రాచలంలో 38, కొత్తగూడెంలో 128 కేసులు పరిష్కారమయ్యాయి. -
భూ సమస్యను పరిష్కరించండి
ఆ తరువాతే ప్లాట్ల కేటాయించండి లేకుండా సీఆర్డీఏకు తాళాలు వేస్తాం.. డిప్యుటీ కలెక్టర్‌ను చుట్టుముట్టిన ఐనవోలు రైతులు తుళ్లూరు రూరల్ : ‘గ్రామకంఠాల సమస్యను పరిష్కరించకుండా ప్లాట్ల పంపిణీకి ఒప్పుకునేది లేదు. కాదని చేస్తే సీఆర్డీఏ కార్యాలయానికి తాళాలు వేస్తాం’ అంటూ ఐనవోలు రైతులు డిప్యుటీ కలెక్టర్‌ను అడ్డుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో భాగంగా సోమవారం డిప్యుటీ కలెక్టర్ ఏసురత్నం ఐనవోలులోని సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. గత కొద్దిరోజులుగా గ్రామస్తులు గ్రామకంఠాల సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవిస్తూవచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న సీఆర్డీఏ కార్యాలయాన్ని మందడం గ్రామానికి తరలించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలుసుకున్న రైతులు అధికారులను నిలదీశారు. ఆ సమయంలో కొంత సమయం ఇవ్వాలని కోరారు. రైతుల సమస్యకు పరిష్కారం కనిపించకపోవటంతో సోమవారం గ్రామానికి వచ్చిన డిప్యుటీ కలెక్టర్‌ను చుట్టుముట్టారు. సీఆర్డీఏ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రోజులు గడుస్తున్నా గ్రామకంఠాల సమస్య పరిష్కరించకుండా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టడాన్ని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామకంఠాల సమస్యను పరిష్కరించిన తరువాతే ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను మొదలు పెట్టుకోవచ్చని. అలా కాకుండా చేస్తే సీఆర్డీఏ కార్యాలయానికి తాళం వేస్తామని హెచ్చరించారు. దీంతో డిప్యుటీ కలెక్టర్ ఏసురత్నం రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళతానని హామీ ఇవ్వటంతో రైతులు శాంతించారు. -
కావలికారుల సమస్యలు పరిష్కరించాలి
కావలికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అమీరొద్దీన్ బషీరాబాద్: గ్రామాల్లో రాత్రీ పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్న కావలికారుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కావలికారుల (రెవెన్యూ సహాయకుల) సంఘం జిల్లా అధ్యక్షుడు అమీరొద్దీన్ డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల కావలికారుల సంఘం అధ్యక్షుడు అనంతయ్య ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ తులసీరాంకు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలికారులను (రెవెన్యూ సహాయకుల)లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రతినెలా రూ.15 వేల వేతనాలను అందించాలన్నారు. తక్షణమే 010 పద్దు కింద పాత పద్ధతిలో వేతనాలు చెల్లించాలన్నారు. కావలికారులకు మెరుగైన వైద్యం అందించేందుకు జీఓ 670ను సవరించాలన్నారు. వాటా బంది పద్ధతి ద్వారా కావలికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటా బంది సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం జీఓ నంబర్ 39 ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. మృతిచెందిన కావలికారుల కుటుంబసభ్యులకు బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలన్నారు. ప్రతినెలా జీతాల బడ్జెట్‌ను వెంటనే రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కావలికారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న జిల్లా వ్యాప్తంగా ఉన్న కావలికారులతో బహిరంగసభ నిర్వహించనున్నామన్నారు. సమస్యల సాధన కోసం జరిగే నిర్వహించే కార్యక్రమానికి జిల్లాలో ఉన్న కావలికారులు పెద్దఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కావలికారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంజిలయ్య, గౌరవ అధ్యక్షుడు ఎల్లప్ప, కావలికారుల సంఘం నాయకులు బందెప్ప, యకాంబరి, వడిచర్ల నగేష్, జగ్గప్ప, నర్సింలు, నర్సప్ప, మొగులప్ప, శేఖర్, రాజమణి, శివప్ప తదితరులు ఉన్నారు. -
ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్‌గౌడ్ సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తేనే పరిష్కారం లభిస్తుందని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్‌గౌడ్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఇందిరాపార్క్ వద్ద ఈనెల 27న భారీ ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధ్యాయుల, విద్యార్థి సంఘ నేతలు తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎస్టీయూ భవన్లో జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమించాల్సి వస్తుందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పద్ధతులను అమల్లోకి తెస్తున్నప్పటికీ.. వాటికి అవసరమైన నిధులతోపాటు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు పరమేష్, ఏవీ.సుధాకర్, రాజశ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముందడుగు..
♦ పరిష్కారం దిశగా ఏళ్లనాటి సమస్యలు ♦ ఆ వైపుగా రెవెన్యూ అధికారుల అడుగులు ♦ ఇప్పటికే దాచారం, అన్నారం గ్రామాలసమస్యల పరిష్కారం ♦ తాజాగా 59జీఓ కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై దృష్టి జిన్నారం : దీర్ఘకాలికంగా ఉన్న భూసమస్యల పరిష్కారానికి మండల రెవెన్యూ అధికారులు చొరవ చూపుతున్నారు. అరవై ఏ ళ్లుగా నానుతున్న దాచారం ఇళ్లస్థలాలు, అన్నారంలో 30 ఏళ్లుగా వేధిస్తున్న రైతుల భూసమస్యను ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరించారు. తాజాగా 59జీఓ కింద రిజిస్ట్రేషన్లపై దృష్టిసారించారు. జిన్నారం మండలం దాచారం, దార్గుల గ్రామాలను 60 ఏళ్ల క్రితమే డీఆర్డీఓ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ తమకు వేరే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ఈ గ్రామాలను వదిలే ప్రసక్తే లేదని దాచారం, దార్గుల వాసులు తేల్చిచెప్పారు. అలా చాలా ఏళ్లుగా ఈ సమస్య నానుతూ వస్తోంది. రెండేళ్ల క్రితం దాచారం, దార్గుల గ్రామాల ప్రజలకు కి ష్టాయిపల్లిలోని 166 సర్వే నంబర్ గల భూమిలో 36 ఎకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. రెండు నెలల క్రితం దాచారం గ్రామాన్ని డీఆర్డీఓ, రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో దాచారం గ్రామాల ప్రజలు రోడ్డున పడ్డారు. వారికి త్వరగా ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. దాచారం, దార్గుల గ్రామాల ప్రజలకు కేటాయించిన స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన 360 మందిని గుర్తించి ఇళ్ల స్థలాల పట్టాతోపాటు పొజిషన్‌ను కూడా చూపించారు. అన్నారం సమస్య 30 ఏళ్లది... అన్నారంలోని 261 సర్వే నంబర్లో 30 ఏళ్ల క్రితం 108 మంది రైతులకు ఎకరం చొప్పున సాగు చేసుకునేందుకు భూమి ని అందిస్తూ సర్టిఫికెట్లు అందించారు. ఇదే సర్వే నంబర్లో ఎక్స్సర్వీస్మెన్లకు కూడా స్థలాలు కేటాయించారు. అప్పటినుంచి రైతులకు, ఎక్స్సర్వీస్మెన్లకు పొజిషన్ చూపడంలో అధికారులు విఫలమయ్యారు. సర్వే నంబర్ ఒకటే కావటంతో ఎవరికి ఎక్కడ స్థలాన్ని కేటాయించాలో తెలియక అధికారులు మల్లగుల్లాలుపడుతూ వచ్చా రు. తహసీల్దార్ శివకుమార్ ఎమ్మెల్యే చొరవతో గ్రామంలో రైతులతో, ఎక్స్సర్వీస్మెన్లతో స్వయ ంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు ముందుగా స్థలాన్ని కేటాయించి, ఆ తర్వాత ఎక్స్సర్వీస్మెన్లకు కేటాయిస్తామని చెప్పా రు. దీంతో రైతులకు ఎకరం చొప్పున లాట రీ ద్వారా స్థలాన్ని ఎంపిక చేసి అం దజేశారు.దీంతో ఈ సమస్యకు పరిష్కారమైంది. 59జీవో కింద ఆయా గ్రామాల ప్రజలు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేం దుకు దరఖాస్తులు చేసుకున్నారు. రెండేళ్లుగా ఈ సమస్య అలాగే ఉంది. ప్రస్తుతం మండల వ్యాప్తంగా 59జీఓలో భాగంగా రిజిస్ట్రేషన్ పనులు వేగంగా జ రుగుతున్నాయి. ఇందుకోసం రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుం టున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, రెవెన్యూ అధికారులను ఆయా గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు. శాశ్వతపరిష్కారం దిశగా ముందుకు.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సహకారంతో మండలంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతున్నాం. 59జీఓ కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాం. ఈ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దాచారం, దార్గుల గ్రామాల ప్రజల సమస్య పరిష్కారం కావటం సంతోషంగా ఉంది. - శివకుమార్, తహసీల్దార్ జిన్నారం -
హైకోర్టు విభజనే పరిష్కారం:కేసీఆర్
-వాస్తవాలను కేంద్రానికి వివరించండి -గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తక్షణమే హైకోర్టు విభజనను చేపట్టేలా వాస్తవాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో హైకోర్టు విభజన వివాదం...న్యాయాధికారుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గవర్నర్‌తో భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం అరగంట సేపు గవర్నర్‌తో సమావేశమయ్యారు. వరుసగా జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు విభజనకు ముందే న్యాయాధికారుల కేటాయింపులు చేయటంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు. తెలంగాణకు 95 మందిని, ఏపీకి 110 మంది న్యాయాధికారులను కేటాయించగా... తెలంగాణకు ఇచ్చిన 95 మంది న్యాయాధికారుల్లో 58 మంది ఏపీకి చెందిన వారే ఉన్నారని వివరించారు. న్యాయాధికారులు, జూనియర్ జడ్జీలు, సీనియర్ జడ్జీలు.. అన్ని కేడర్లలో ఏపీకి చెందిన 143 మందిని తెలంగాణకు కేటాయించినట్లు చెప్పారు. దీంతో భవిష్యత్తులో తెలంగాణకు చెందిన న్యాయాధికారులు తీవ్రంగా నష్టపోతారని.. అందుకే ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని గవర్నర్‌కు నివేదించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తాను రాసిన లేఖ ప్రతిని, గతంలో హైకోర్టు విభజనను చేపట్టాలని పలుమార్లు కేంద్రానికి రాసిన లేఖలను, ప్రస్తుత వివాదం పూర్వాపరాలపై సిద్ధం చేసిన నివేదికను ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌కు సమర్పించారు. హైకోర్టు విభజన చేపడితేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని.. అప్పటివరకు కేటాయింపులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు మంగళవారం ఢిల్లీలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడను కలిసిన సందర్భంలో ఆయన గవర్నర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో సంప్రదింపులు జరిపితే.. న్యాయ శాఖ మంత్రి మాట్లాడినా వాస్తవాలను వివరించి.. హైకోర్టు విభజనకు సహకరించాలని గవర్నర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. హైకోర్టు వివాదంతో పాటు జంట నగరాల్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నడం, అనుమానితులను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటనపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది. -
విసుగెత్తించడమే పరిష్కారం
బైలైన్ భారత్-పాక్ క్రికెట్ సిరీస్ విజయవంతంగా జరగడమే అందరికీ కావాలి. అయితే క్రికెట్ ఒక సంబరం కానట్లయితే, అంతటి ప్రమాదానికి సిద్ధపడాలా? క్రీడ ఆనందం కోసమే తప్ప, యుద్ధానికి ప్రత్యామ్నాయం కాదు. భారత్-పాకిస్తాన్ క్రికెట్ విషయంలో నెలకొన్న బాధా కరమైన ప్రతిష్టంభనకు పరి ష్కారం ఒక్కటే. ఎవరూ పట్టించుకోనంత మహా విసుగెత్తించేదిగా దాన్ని మార్చేయడం. హాకీ ఆ పని ముందే చేసి చూపింది. ఒకానొకప్పడు ఎప్పుడో గతంలో ఒలింపిక్ లేదా ఆసియా హాకీ స్వర్ణం కోసం భారత్, పాక్ జట్లు తలపడుతుంటే ఉపఖండమంతా ఆ క్రీడకు దాసోహమనేది. రెండు జట్లు మొదటి స్థానం కోసం గాక, చివరి స్థానం కోసం పోటీ పడటం మొదలు కావడంతోనే ఆ ఉత్సాహోద్వేగాలన్నీ తుస్సుమని పోయాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య క్రికెట్ గురించిన చర్చ నత్తనడక నడుస్తోంది. అసలు అలాంటి చర్చే సంఘ వ్యతిరేకమైనదన్నట్టుగా సోషల్ మీడియా ఉద్రేకపడుతోంది. భారత్, పాక్‌లు హాకీ ఆడుతుంటే గుసగుసైనా వినిపించదు. అదే క్రికెట్ అయితే కల్లోలం రేగుతుంది. కాబట్టి సమస్య క్రీడ కాదు, దానికి లభించే ప్రతిస్పందన. ఆసక్తిని చంపేస్తే, వివా దమూసమసిపోతుంది. కాకపోతే ఇరు దేశాల క్రికెట్ జట్లూ విసుగెత్తించ నిరాకరిస్తుండటమే సమస్య. రెండు జట్లూ ఏ శుభ దినానైనా ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించగలిగేవే. సహజంగానే, ఏదీ నిలకడగా ఆడే బాపతు కాదు. ఉపఖండం స్వభావానికే అది విరుద్ధం. రెండు జట్ల ఆట తీరూ ఊహింపశక్యం కానిదే. అదే ఉద్విగ్నతకు కారణం. భారత్-పాక్ టెస్ట్ సిరీస్ విషయంలోని ఆచర ణాత్మక సమస్యలను గురించి ఆలోచించండి. హాకీ అయితే ఓ రెండు గంటల్లో ఆట ముగిసిపోతుంది. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులుంటుంది. సిరీస్ మన దేశంలో జరుగుతుంటే మన మైదానాల అధికారులు ఆట మూడు రోజుల కంటే ముందే ముగిసిపోయేలా చేసి, శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు కర్త వ్యాన్ని నిర్వర్తిస్తారు. భారత్, పాక్‌తో ఆడుతున్న ప్పుడు ఆ పద్దెనిమిది గంటల క్రీడా సమయం సైతం అనంతంలా అనిపిస్తుంది. శాంతికాముకులైన పౌరుల ఉద్వేగాలను నియంత్రించడం నిజానికి అతి చిన్న సమస్య. కానీ క్రీడాకారుల భద్రతకు ఎవరూ హామీని కల్పించలేరు. కాబట్టి పాకిస్తాన్ జట్టు పాక్‌లో ఆడలేదు. ఆ దేశం తన ‘సొంత మైదానాల’ను యునెటైడ్ ఎమిరేట్స్‌కు ఔట్‌సోర్స్ చేసింది. పాక్‌లో క్రికెట్‌ను అసాధ్యం చేసిన ఉగ్రవాదులు, మరెక్కడైనా పాక్, భారత్‌తో తలపడుతుంటే చూస్తూ ఊరుకుం టారా? ఆట జరిగేచోట కాకున్నా మరెక్కడైనా దాడి జరిగితే ఏం చేయాలి? మీడియా ఉన్మాదాన్ని రేకె త్తిస్తుంది కాబట్టి, ప్రభుత్వాలు సంతృప్తిపరచే విధా నాన్ని అవలంబిస్తున్నాయని విమర్శలను ఎదుర్కో వాల్సి ఉంటుంది. కాబట్టి ఆటను పూర్తిగా కట్టిపెట్టే యాలా? ఇటీవల ఈ సిరీస్‌ను ఇంగ్లండ్‌లో ఏర్పాటు చేయాలనే మాట వినిపిస్తోంది. పారిస్ ఉగ్రదాడి తదుపరి లార్డ్స్‌లో ఈ ప్రదర్శన జరగడానికి ఆ మైదానం యజమాని ఎమ్సీసీగానీ, బ్రిటన్ గూఢచార సంస్థ ఎమ్16గానీ సుముఖత చూపితే ఆశ్చర్య పోవాల్సిందే. భారత్-పాక్ క్రికెట్లో ఏ మూల చూసినా, ఏదో ఒక ఊహించని సమస్య పొంచి ఉంటుంది. ఉదాహ రణకు, గత టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌లో జరిగిన ప్పుడు భారత టీవీ చానళ్లలో చూపిన పలు ప్రకటనలు రెచ్చగొట్టేవిగా, ప్రమాదకరమైనవిగా, వివేకరహిత మైనవిగా, జాతీయోన్మాద పూరితమైనవిగా ఉన్నాయి. అవి లెక్కలేనంతమంది వీక్షకులను భారత్‌కు వ్యతి రేకంగా మార్చాయి. నాడు జరిగిన నష్టం ఇంకా కనిపిస్తూనే ఉంది. భారత క్రికెట్‌కు బాధ్యత వహిం చాల్సిన బీసీసీఐ అప్పుడూ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకునే అవకాశమూ తక్కువే. దానికి పట్టేది ఒక్కటే, కాసుల గలగలలు. ఇక చారిత్రకంగా అత్యంత వివాదాస్పద అంశమైన అంపైరింగ్‌ను చూద్దాం. అంపైరింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విషయంలో భారత్‌ది... తప్పంటూ జరిగితే అది మానవ తప్పిదమే కానిద్ధామనే యంత్ర విధ్వంసకుల(లుడ్డైట్ల) వైఖరే. ఇది మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ వారసత్వంలో భాగం. జనం యంత్రాలను క్షమిస్తారే తప్ప, మనిషిని క్షమించలేరనే చిన్న విషయం పెద్దపెద్ద క్రికెట్ బుర్రలకు ఎందుకు బోధపడదు? యంత్రానికి లంచం ఇవ్వలేం. క్రికెట్ భారీగా డబ్బుతో ముడిపడినదిగా మారడం, దాన్ని అనుసరించి వచ్చిన బెట్టింగ్ తమాషా నేపథ్యంలో ప్రతిచోటా అవినీతి వాసనలు వ్యాపిస్తూనే ఉన్నాయి. అలా అని అంపైర్లు అవినీతి పరులని ఆరోపిస్తున్నట్టు కానే కాదు. వాళ్లు తమపైన తామే నిరంతర నిఘాను ఉంచుకుంటారు. అయితే పుకార్లకు, ఊసుపోని కబుర్లకు వాస్తవాలలో ఆసక్తి ఉండదు. పాక్‌తో మనం క్రికెట్ ఆడటం అంటూ జరిగితే అది, మనం కూడా మిగతా ప్రపంచంలాగా అనుమానం వస్తే కెమెరాను సంప్రదించడం మొదలు పెట్టాకనే. విసుగెత్తించేటప్పుడైనా నాకు క్రికెట్ అంటే ప్రేమే. అదీ, ఇంగ్లిష్ ప్రీమియర్ ఫుట్‌బాల్ మాత్రమే టీవీ కొనడానికి నాకు ముఖ్య కారణం. భారత్-పాక్ క్రికెట్ సిరీస్ విజయవంతంగా జరగడం కంటే ఎక్కువ ఎవరూ ఆశించరు. క్రికెట్ ఒక సంబరం కానట్లయితే, అంత ప్రమాదాన్ని ఆహ్వానించాలా? క్రీడ ఆనందం కోసమే తప్ప యుద్ధానికి ప్రత్యామ్నాయం కాదు. క్రీడ అంటే స్త్రీపురుషులు తమ అత్యున్నత స్థాయి ప్రతిభను ప్రదర్శించి, మహోత్కృష్ట మనోహర కళా కౌశలాన్ని ప్రదర్శించే రంగస్థలి. క్రీడ అంటేనే పోటీ పడటం ఉంటుంది. నాటకీయతను అత్యున్నత స్థాయికి చేర్చేది అదే. అయితే వివేకవంతులైన క్రీడాకారులెవరూ పోటీని శత్రుత్వమనే రొచ్చుగుంటలోకి దిగజారిపోని వ్వరు. క్రీడల మౌలిక సూత్రాలకే అది విరుద్ధం. చూస్తు న్నదాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నామంటే, అది ఆటే కాదు. ఈ చలికాలంలో భారత్, పాక్‌తో ఆడాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి. -
నీటి సమస్యలను పరిష్కరించుకోవాలి
తెలంగాణ, ఏపీ సీఎంలకు కేంద్రమంత్రి దత్తాత్రేయ సూచన సాక్షి, హైదరాబాద్: రైతాంగం కోసం రెండు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న నీటి సమస్యలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కలసి పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. మంచి వాతావరణం కల్పించాలని.. రైతులకు మంచి చేయాలని కోరారు. భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం జరిగిన ‘సృజనాత్మక వరి రైతుల సమావేశం’లో కేంద్రమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 30 మంది రైతులు కనుగొన్న పద్ధతులను ఆవిష్కరించారు. అనంతరం వారిని సత్కరించారు. తెలంగాణ, ఏపీల్లో రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని దత్తాత్రేయ పేర్కొన్నారు. కొత్త పద్ధతులతో వందల కొద్దీ వంగడాలను తయారుచేస్తున్నప్పటికీ ఖర్చు పెరుగుతుందే కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరికి గిట్టుబాటు ధర రూ. 1,200 మాత్రమే ఉందనీ... అందుకయ్యే ఖర్చు మాత్రం రూ. 1,500 వరకు అవుతోందన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్రావు మా ట్లాడుతూ సోనామసూరి, బాస్మతి వరిలో హైబ్రీడ్ తీసుకువస్తే బాగుంటుందన్నారు. ఐఐఆర్ఆర్ డెరైక్టర్ రవీంద్రబాబు మాట్లాడుతూ రైతులు సబ్సిడీల కోసం ఆలోచించడం లేదని.. మంచి విత్తనం, కల్తీలేని ఎరువులు కావాలని కోరుకుంటున్నారన్నారు. -
దిగివచ్చిన హిందుజా
తెలంగాణకు వాటా మేర విద్యుత్ సరఫరాకు అంగీకారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా మేరకు విద్యుత్ సరఫరాకు హిందుజా కంపెనీ సూత్రప్రాయంగా అంగీకరించిం ది. గతంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లోని పలు షరతులపైనే తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసిం ది. ఎట్టకేలకు తెలంగాణ డిస్కంతో సంప్రదింపులకు ముందుకు వచ్చిన ఆ కంపెనీ ప్రతినిధులు బుధవారం టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులతో చర్చలు జరిపారు. ‘‘1998లో హిందుజా కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. అయితే 2003లో అమల్లోకి వచ్చిన విద్యుత్ చట్టం ప్రకారం కొన్ని సవరణలు చేసుకోవాల్సి ఉంది. వాటిపైనే చర్చలు జరిగాయి. పరస్పర అంగీకారం కుదిరింది. కొన్ని చిన్న చిన్న అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాటిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తీర్పునకు లోబడి పరిష్కారం చేసుకోవాల్సి ఉంది..’’ అని చర్చల అనంతరం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. అయితే విద్యుత్ వాటాల పంపిణీ విషయంపై డిస్కం అధికార వర్గాలు మాట్లాడుతూ ‘‘హిందుజా ప్రైవేటు కంపెనీ. గతంలోనే డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గతంలో ఉన్న పీపీఏలన్నీ అమల్లోనే ఉంటాయి. ఆ కంపెనీ ఒప్పందాలకు లోబడి వ్యవహరిస్తుందనే నమ్మకం మాకుంది..’’ అని పేర్కొన్నాయి. విశాఖపట్నం సమీపంలో నిర్మించిన ఈ విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం 1,040 మెగావాట్లు. ఇక్కడ మొదటి యూనిట్లో ఫిబ్రవరి నెలాఖరున విద్యుత్ ఉత్పాదన ప్రారంభమవుతుందని చర్చల సందర్భంగా కంపెనీ ప్రతినిధులు వెల్లడించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 520 మెగావాట్ల మొదటి యూనిట్లో ఉత్పాదన ప్రారంభమైతే... తెలంగాణకు వాటా ప్రకారం 280 మెగావాట్లు అందాలి. ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల పాటు ఆ కంపెనీ విద్యుత్ సరఫరా చేయాలి. ప్లాంట్ నిర్మాణం ఆలస్యమైనందున కాల పరిమితిని తగ్గించే అంశంపై చర్చలు జరిగాయని, పీపీఏలకు కట్టుబడి ఉండాలనే వాదనతో చర్చలు ముగిశాయని తెలిసింది. -
మీ పిల్లల్ని కాపాడుకోండి!
వాయనం ప్రపంచవ్యాప్తంగా టీనేజర్లలో పెరుగుతున్న ఆత్మహత్యల గురించి ఇటీవలే కొన్ని నమ్మలేని నిజాలు వెల్లడయ్యాయి. కోరుకున్నది దొరక్కపోవడం, అనుకున్నది జరగకపోవడంతో ఏర్పడిన నిరాశతో మగపిల్లలు ప్రాణాలు తీసుకుంటుంటే; ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితి.. ఆడపిల్లల్ని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. మరెలా? పిల్లలను కాపాడుకోవడం ఎలా? దీనికి ఒక్కటే పరిష్కారం... పిల్లల ప్రవర్తనను గమనించి, వారిలో ఆత్మహత్యకు సంబంధించిన సంకేతాలను పసిగట్టడం. చలాకీగా ఉండే పిల్లలు డల్ అయిపోతున్నా... వినయంగా ఉండేవారు, తల్లిదండ్రులని కూడా చూడకుండా తిరగబడుతున్నా... ప్రతిదానికీ అరుస్తున్నట్టు మాట్లాడుతున్నా... కారణం లేకుండా ప్రతి చిన్నదానికీ కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నా... ఏ పనీ సరిగ్గా చేయకపోతున్నా, కాస్త పని చెప్పినా విసుక్కుంటున్నా... తిండి తినకుండా, నిద్రపోకుండా రెస్ట్‌లెస్‌గా ఉంటున్నా జాగ్రత్తపడాలి. అలాగే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా... రివర్స్‌లో అయినవాళ్లతో మరీ ఎక్కువ ఆప్యాయంగా ఉంటున్నా... ఒక్క క్షణం విడిచిపెట్టకుండా తిరుగుతున్నా... అది ప్రేమ అనుకుని మురిసిపోయి ఊరుకోవద్దు. అది... త్వరలో దూరమైపోతున్నాను కదా, అంతవరకూ తమవారి ప్రేమను తృప్తిగా అనుభవించాలి అన్న భావన కూడా కావచ్చు. లేదంటే మీతో తమ బాధను చెప్పుకోవాలని వెంట వెంట తిరుగుతూ, చెప్పలేకపోతుండవచ్చు. చెడు అలవాట్లకు బానిసలవుతున్నా... తమకు తాము హాని చేసుకోవాలని చూస్తున్నా... చావు గురించి తెలుసుకోవాలని చూస్తున్నా.. మరణం గురించి మాట్లాడుతున్నా... దాని గురించి కవితలు, కథనాల వంటివి రాసేందుకు ప్రయత్నిస్తున్నా... చావు గురించి జోకులేస్తున్నా ఇవన్నీ సంకేతాలే. నాకేదైనా అయితే, నేను సడెన్‌గా కనిపించకుండా పోతే అని అడిగినా... తమకెంతో ఇష్టమైన వాటిని పదే పదే చూసుకుంటున్నా... ఇష్టమైన వారిని ఊరకే తలచుకుంటున్నా ... మీ పిల్లల మనసులో ఏదో తిరుగు తోందన్న మాట. దాన్ని గుర్తించాల్సి బాధ్యత మీదే. గుర్తించాక వారిని దగ్గరకు తీసుకుని కారణం అడగండి. గుచ్చి గుచ్చి ప్రశ్నించొద్దు. లాలించి అడగండి. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినండి. నీ బాధ తీర్చడానికి నేనేం చేయగలను అని అడగండి. వాళ్లకోసం మీరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేయండి. మీరు ఉండగా తనకి చనిపోవాల్సిన అవసరం లేదు అనిపించేలా చేయండి. వాళ్లు మీ పిల్లలు... వాళ్లని మీరే కాపాడుకోవాలి మరి! -
ఫోన్ కొట్టు.. పరిష్కారం పట్టు
హలో సాక్షికి స్పందన వీధిలో లైటుపోయినా.. మంచినీటి కుళాయి మరమ్మతులకు గురైనా.. మురుగు సమస్య పరిష్కారం కాకున్నా.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందిపడిన జనానికి ‘హలో సాక్షి’ సాంత్వననిస్తోంది. ఒక్క ఫోన్ చేసి సమస్యను సాక్షికి వివరిస్తే పరిష్కారమవుతుందన్న నమ్మకం జనానికి కలిగింది. ఇందుకు నిదర్శనమే హలోసాక్షికి లభిస్తున్న స్పందన. చీరాల రూరల్ : నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు సాక్షి దినపత్రిక హలో సాక్షి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ప్రజలు తమ సమస్యలను సాక్షికి వివరిస్తున్నారు. సమస్యపై సాక్షిలో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందిస్తున్నారు. దీంతో ప్రజలు సాక్షికి కృతజ్ఞతలు చెబుతున్నారు. సమస్యల పరిష్కారం.. వేటపాలెం : నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు సాక్షి చేపట్టిన హలో సాక్షి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి చోట ఉండే వీధి దీపాల సమస్య, మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులను సాక్షి చొరవతో అధికారులు పరిష్కరిస్తున్నారు. దేశాయిపేట పంచాయతీ పరిధిలోని విజయనగర్ కాలనీ నుంచి ఎస్సీ బాలికల వసతి గృహం ముందు రోడ్డు గుండా చీరాల-ఒంగోలు ప్రధాన రోడ్డుకు వచ్చే మార్గంలో వీధి దీపాలు పాడైపోయాయని స్థానికులు సాక్షి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హలోసాక్షి సమస్యను పంచాయతీ కార్యదర్శి కృష్ణ దృష్టికి తీసుకెళ్లగా వీధి దీపాలకు మరమ్మతులు చేయించారు. దేశాయిపేట పంచాయతీ పరిధిలోని శారదాకాలనీ మొదటి లైను రోడ్డులో తాగి పడేసిన కొబ్బరి బోండాల వ్యర్థాల వల్ల దోమల బెడద పెరిగిందని కాలనీ వాసులు శ్రీనివాసరావు సాక్షి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి కృష్ణ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి సాక్షి చొరవ చూపింది. వేటపాలెం 8వ వార్డులోని పాకనాటి వీధిలో వీధిదీపాలు వెలగడం లేదని స్థానికులు సాక్షి దృష్టికి తీసుకురాగా హలోసాక్షిలో సమస్య ప్రచురితం కావడంతో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ బాబు స్పందించి వీధిదీపాలకు మరమ్మతులు చేయించారు. నాయిన పల్లి ఫకీర్ వీధిలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు సాక్షి దృష్టికి తెచ్చారు. సమస్యపై వార్త ప్రచురితం కావడంతో పందుల పెంపకందారులకు శానిటరీ ఇన్స్పెక్టర్ నోటీసులు పంపారు. వీధి దీపాలు వెలిగాయి.. * బుర్లవారిపాలెంలోని సాయికాలనీ ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ దీపాలు 4 రోజులుగా వెలగడం లేదని స్థానికురాలు బి.పద్మ సాక్షి దృష్టికి తీసుకువచ్చారు. దానిపై కథనం ప్రచురితం కావడంతో అధికారులు సమస్యను పరిష్కరించారు. * పట్టణంలోని 15 వార్డులోని బెస్తపాలెంలో రామమందిరానికి వెళ్లేదారిలో పది రోజుల నుంచి వీధి దీపాలు వెలగడం లేదని స్థానికుడు పి.ప్రసాద్ హలోసాక్షికి వివరించారు. ఆ వార్తను ప్రచురించడంతో పరిష్కారం లభించింది. * సమస్య : దండుబాట రోడ్డు, వైకుంఠపురంలోని కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడంలేదని కె.సింగారావు హలోసాక్షి దృష్టికి తీసుకువచ్చారు. సాక్షిలో కథనం రావడంతో సమస్యకు పరిష్కారం లభించింది. * సమస్య : చీరాలనగర్లోని ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ దీపాలు 3 రోజులుగా వెలగడం లేదని ఎ.శ్రీనివాసరెడ్డి సాక్షి దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కారమైంది. బాగుపడిన వీధులు.. * పేరాల హైస్కూల్ వెనుకవైపు ఉన్న మురుగు కాలువలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని ఎస్కే సత్తార్ సాక్షికి వివరించడంతో కథనం ప్రచురితమైంది. దీంతో మురుగు కాలువలు బాగుపడ్డాయి. * ఈపూరుపాలెంలోని పద్మనాభునిపేటలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని ఎం.రవికుమార్ సాక్షి దృష్టికి తీసుకురావడంతో కథనం ప్రచురితమైంది. దీంతో సమస్యకు పరిష్కారం లభించింది. * సాల్మన్ సెంటర్ పంచాయతీలోని నవాబుపేటలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఎస్కే మస్తాన్ సాక్షికి వివరించారు. సమస్యపై వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. * పట్టణంలోని రామ్‌నగర్, వీవర్స్ కాలనీల్లోనిమున్సిపల్ ట్యాప్‌ల నుంచి మంచినీరు సక్రమంగా రావడంలేదని స్థానికుడు శివన్నారాయణ సాక్షి దృష్టికి తీసుకువచ్చారు. హలోసాక్షిలో సమస్యపై వార్త ప్రచురితం కావడంతో పరిష్కారం లభించింది. * చీరాల ఆంధ్రాబ్యాంక్ రోడ్డులో పైపులు వేసేందుకు మట్టిని తవ్వి రోడ్డుపై వేయడంతో అందరికీ ఇబ్బందిగా ఉందని స్థానికుడు కె.సురేంద్ర సాక్షి దృష్టికి తెచ్చారు. సమస్యను ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కరించారు. మీ ప్రాంత సమస్యలు పరిష్కరించుకోండి వీధిలైట్లు వెలగడం లేదా, చెత్త పేరుకుపోయినా పట్టించుకోవడం లేదా, మురుగు నీరు బుసలు కొడుతోందా... పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయా? ... ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారా...ఎవరికి చెప్పాలనే అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారా...? ఇంకెందుకు ఆలస్యం ... మీ ఇక్కట్లను తొలగించే ప్రయత్నానికి ‘సాక్షి’ నడుం బిగించింది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ పరిసర ప్రాంతవాసులు చవిచూస్తున్న సామాజికపరమైన ఇబ్బందులను కింద ఉన్న సెల్ నంబర్లకు ఫోన్ చేసి సవివరంగా తెలియచేయండి. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తుంది మీ ‘హలో సాక్షి’. చీరాల టౌన్ : సమస్య : తోటవారిపాలెం గ్రామంలోని వీవర్స్ కాలనీలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. రాత్రి వేళల్లో ఒంటరిగా నడిచివెళ్లే వారిపైకి వస్తున్నాయి. ప్రజలను గాయాలపాలు చేస్తున్న వీధి కుక్కలను గ్రామం నుంచి తరిమేయాలి. - కె.శ్రీనివాసరావు, స్థానికుడు. సమాధానం : పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా. - పి.శంకరరెడ్డి, ఈవోఆర్డీ, చీరాల సింగరాయకొండ: సమస్య : స్వచ్ఛభారత్ పేరుతో ప్రభుత్వాస్పత్రి వద్ద రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు తొలగించారు కానీ సమీపంలోని చేపల మార్కెట్ వద్ద రోడ్డుమార్జిన్లలో ఉన్న ముళ్లచెట్లను తొలగించ లేదు. వాటిని తొలగించండి. -షేక్ నజీర్,సింగరాయకొండ. సమాధానం : ఈ ప్రాంతంలోని ముళ్లచెట్లను వెంటనే తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాను. - సీహెచ్ వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సింగరాయకొండ. సమస్య : ఎస్సీ కాలనీల్లోని సైడు కాలువల్లో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న మురుగు నిలుస్తోంది. ఊరు చివర వరకు పారేలా చర్యలు తీసుకోవాలి. - పి.విజయచంద్ర, కొండపి గ్రామస్థులు. సమాధానం : సైడు కాలువల్లో మురుగు ముందుకు పారేందుకు చర్యలు తీసుకుని కాలనీ వాసుల ఇబ్బందులు తొలగిస్తాం. - సాంబయ్య, కార్యద ర్శి మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు: చీరాల : 9705348102, చీరాల అర్బన్ : 9030627609, చీరాల టౌన్: 9291373791, చీరాల రూరల్: 9885080777, వేటపాలెం : 9705347568. దర్శి : 98855 88559, తాళ్లూరు : 97053 47580 కురిచేడు : 94401 40522, ముండ్లమూరు : 97053 47581, దొనకొండ : 9705347600 గిద్దలూరు 97053 47591 కంభం 73962 29222 గిద్దలూరు రూరల్ 9704672501 రాచర్ల 9848877148 కొమరోలు 73961 16400 బేస్తవారిపేట 9705347593 కనిగిరి : 9705347570 పామూరు : 9440560707, సీఎస్ పురం : 8978448089, హనుమంతునిపాడు : 9705944299, పీసీ పల్లి : 9951574214 వెలిగండ ్ల: 7731973918 కందుకూరు : 9010937913 ఉలవపాడు : 9912249239, కందుకూరు అర్బన్ : 9491708133 కందుకూరు రూరల్ : 9951850046 వలేటివారిపాలెం : 9705800861 గుడ్లూరు : 9652774450 లింగసముద్రం : 9705347559 కొండపి : 99491 03696 టంగుటూరు : 97053 47550, సింగరాయకొండ: 81251 93100 పొన్నలూరు: 97053 47562 మర్రిపూడి: 97053 47597 జరుగుమల్లి: 99128 77391. పర్చూరు : 7386550989 ఇంకొల్లు : 9949112302 కారంచేడు : 9299998836 చినగంజాం : 9989348359 యద్దనపూడి -9493924570 మార్టూరు : 9440786558 -
గిరిజన సమస్యలపై స్పందించండి
విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : గిరిజన సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సూచించారు. రాజమండ్రిలో గురువారం ఆయన విశాఖ జిల్లా అరకు, పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థులు, ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. అరకు, పాడేరు నియోజక వర్గాల్లో పార్టీ విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలను అభినందించారు. సమీక్షలో అరకు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన కె సర్వేశ్వరరావు, పాడే రు నుంచి ఎన్నికైన గిడ్డి ఈశ్వరి, అరకు ముఖ్యనేతలు సుబ్బారావు, అనంద్, స్వామి, రఘునాథ్, సత్యం, పాండురంగస్వామి, పాడేరు నేతలు నూకరత్నం, పద్మకుమారి, నళినీకృష్ణ, రామదాసు, రమణ, గోవిందరావు, మల్లుపడాల్, చంద్రరావు, రాజబాబు పాల్గొన్నారు. -
టెన్ కమాండ్మెంట్స్
మతగ్రంథంలో ఉన్నట్లే... మహిళల కోసం కూడా పది ఆజ్ఞలు ఉన్నాయని తెలుసా? ఇవి వ్యక్తిత్వ వికాస నిపుణులు రూపొందించినవి. వీటిని అనుసరిస్తే ఈ సమాజంలో మీకో గొప్ప స్థానం లభిస్తుంది. అంతేకాదు, విజయశిఖరాలను అందుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. నిన్ను నువ్వు నమ్ము: ఎవరినో నమ్ముతాం. వాళ్లు మనకోసం ఏదో చేస్తారని ఆశపడతాం. చేయకపోతే దిగులుపడతాం. అసలు ముందు నిన్ను నువ్వు నమ్మితే, ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. ఊహల్లో తేలవద్దు: ఊహలు అవకాశాలను చంపేస్తాయని మీకు తెలుసా? అలా చేయాలి, ఇలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే సమయం గడిచిపోతుంది. కాబట్టి ఊహల్లో తేలడం మాని, అవకాశాలను వెతకండి. మనసు మాట వినండి: చేసేది తప్పనిపించినప్పుడు తప్పుకోవడం ఎంత అవసరమో, సరైన దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో చెప్పారనో, ఏమైనా అంటారేమోననో వెనకడుగు వేయకుండా ఉండటం అంతే అవసరమని గుర్తు పెట్టుకోండి. కొన్నింటిని మరవాలి: మీలో చాలా ప్రతిభ ఉంటుంది. ఏదైనా చేయగలిగే శక్తి ఉంటుంది. కానీ అది గుర్తించరు. నాకు చాలా కష్టాలు ఉన్నాయి అని గుర్తు తెచ్చుకుని పదే పదే బాధపడుతుంటారు. వద్దు. వాటిని మర్చిపోండి. ఆవేదన దేనికీ పరిష్కారం కాదు. అది మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. ఉన్నతంగా ఆలోచించండి: మీ చూపు ఎప్పుడూ పైకే ఉండాలి. ఎలా ఎదగాలి, ఎక్కడి వరకూ వెళ్లాలి, ఏం సాధించాలి అన్నది తప్ప మరో ఆలోచన వద్దు. ఇంతకంటే చేయలేమేమో అన్న ఆలోచనే వద్దసలు. ఇతరులకు చాన్స్ ఇవ్వకండి: మనం చేసే ప్రతి పనిలోనూ తలదూర్చేందుకు, మనకు సలహాలిచ్చేందుకు బోలెడంతమంది సిద్ధంగా ఉంటారు. మనకు వాళ్ల సలహాలు అవసరం లేదనుకున్నప్పుడు మెల్లగా వాళ్లను అవాయిడ్ చేయండి. లేదంటే వాళ్లు మన లక్ష్యాల మీద పెద్ద ప్రభావమే చూపిస్తారు. మనసును తెరవండి: మీ ఆలోచనలను లోపలే అణచేసుకోకండి. ఒక పని మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఒక లక్ష్యం మీద కానీ... మీకేదైనా అభిప్రాయం ఉంటే ఓపెన్‌గా చెప్పండి. అందరికీ అది నచ్చాలని లేదు. కానీ ఎందరికి నచ్చుతోందో తెలిస్తే మీ ఆలోచనా విధానం ఎలా ఉందో మీకు తెలుస్తుంది. లేదంటే మనం మరుగున అయినా పడిపోతాం, మరొకరికి మనల్ని దాటేసే అవకాశమైనా ఇచ్చేస్తాం. బ్రేకులు వేయొద్దు: ఏదో చేసెయ్యాలనుకుంటారు. ఎక్కడో ఏదో అడ్డు తగులుతుంది. వెంటనే అనుకున్నదాన్ని వదిలేసి వేరే వైపు దృష్టి మళ్లించేస్తారు. ఇది కూడదు. ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే చేశాకే వదిలిపెట్టండి. నో చెప్పి తీరాలి: నచ్చినదానికి ఎస్ చెప్పినట్టు, నచ్చనిదానికి నో చెప్పడం కూడా అవసరం. పని చేసేచోట మనలను ఇబ్బందిపెడుతున్నా, ఎందులోనైనా ఇరికించే ప్రయత్నం చేస్తున్నా, మనది కానిదాన్ని మనమీద రుద్దుతున్నా నో అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మిమ్మల్ని పిరికివారిగానో, భయస్థులగానో చూస్తారు. రిస్క్ తీసుకోండి: ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండలేం. ఉండాలని కోరుకోకూడదు కూడా. ఏదైనా చేయాలని అనిపించినప్పుడు... కష్టనష్టాలను తలచుకుని భయపడకండి. కాస్త కష్టమైనా పర్లేదు ప్రయత్నిద్దామని అనుకోండి. ప్రయత్నం ఎప్పుడూ వృథా కాదు. కష్టం ఎప్పుడూ ఓడిపోనివ్వదు. అది మర్చిపోకండి! -
రాజీనామాలతో సాధించేదేమిలేదని నేతల డీలా