విశ్రాంత ఉద్యోగులను ఆదుకోవాలి
విశ్రాంత ఉద్యోగులను ఆదుకోవాలి
Published Mon, Sep 26 2016 7:30 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్
గుంటూరు (కొరిటెపాడు): న్యూఇండియా, యునైటెడ్ ఇండియా, ఓరియంటల్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీల విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు గురుమూర్తి కోరారు. అరండల్‌పేటలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన వైజాగ్ రీజియన్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగినప్పుడల్లా విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ పెరుగుతోందని, కానీ బీమా సంస్థల విశ్రాంత ఉద్యోగులకు అటువంటి సౌకర్యం కల్పించకపోవడం అన్యాయమన్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement