retired employees
-
జీతాల కోసం చకోర పక్షుల్లా..!
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ నెలా ఒకటో తేదీన ఠంచన్‌గా ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందిస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం ఓ వైపు గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే గడిచిన ఐదు నెలల్లో ఏ ఒక్క నెలలోనూ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకటో తేదీన పూర్తిస్థాయిలో జమైన దాఖలాలు లేవు. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చెందిన ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో అందకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. నవంబర్ మూడో వారం వచ్చినా..నవంబర్ మూడో వారం వచ్చినా.. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, యార్డుల్లో పనిచేస్తున్న మార్కెటింగ్ సిబ్బందికి జీతాలు అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా ఉన్న గ్రంథాలయాల్లో పనిచేస్తోన్న 2,500 మంది ఉద్యోగులకు జీతాలు పడలేదు. ఇదే శాఖకు చెందిన 600 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అలాగే మార్కెటింగ్ శాఖకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (ఎఎంసీ), యార్డుల్లో పనిచేస్తున్న వారికి సైతం జీతాలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అప్పులతో గ్రంథాలయ వారోత్సవాలుప్రతీ ఏటా నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వారోత్సవాల నిర్వహణ కోసం గ్రేడ్–1 గ్రంథాలయాలకు రూ.15వేలు, గ్రేడ్–2 గ్రంథాలయాలకు రూ.12వేలు, గ్రేడ్–3 గ్రంథాలయాలకు రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేసేది. అలాంటిది ఈ ఏడాది ఒక్కపైసా కూడా విడుదల చేసిన పాపాన పోలేదు. సకాలంలో జీతాలు ఇవ్వకపోగా, వారోత్సవాలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రంథాలయాల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా చేసేది లేక అప్పులు చేసి మరీ ఈ వారోత్సవాలను నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. తక్షణమే జీతాలు, పెన్షన్లు జమ చేయాలి నవంబర్ 17వ తేదీ దాటుతున్నా రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు జమ కాలేదు. అనారోగ్యంతో బాధపడే పెన్షనర్లు ప్రభుత్వ పెన్షన్ అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వేతనాలు, పెన్షన్లు విడుదల చేయాలి.– కళ్లేపల్లి మధుసూదనరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం -
ఇదో పెద్దకుటుంబం, ఏ ఆపద వచ్చినా..మేలిసంధ్య!
రిటైర్డ్ ఉద్యోగులు తమ మలివయసు జీవనం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ప్రశాంతంగా గడిచిపోవాలని కోరుకుంటారు. కానీ, ఆరోగ్యం సహకరించకపోవడంతో నలుగురిలో కలవలేకపోవడం, ఆనందకరమైన జీవనం గడపలేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటివి గుర్తించి హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్ర ప్రదేశ్ విశ్రాంత ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడ్డారు.వెయ్యికి పైగా ఉన్న ఈ సభ్యులు తమకు ఆత్మీయులు ఉన్నారనే భరోసాతో ఆనందాలను కలబోసుకుంటూ, ఆరోగ్యాల గురించి సమీక్షించుకుంటూమలివయసును ఉపయుక్తంగా మలుచు కుంటున్నారు. ఈ సంఘ సభ్యులను కలిసినప్పుడు అంతా ఒక జట్టుగా ఉంటే ఏ వయసు అయినా ఉల్లాసంగా గడిచిపోతుందనే ఆలోచనను పంచుకున్నారు.‘అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్’ సంఘం హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంది. ఈ ఏడాది నాల్గవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ నాలుగేళ్లలో వెయ్యికి పైగా ఉన్న సభ్యులను ఒక తాటి మీదకు తీసుకువచ్చి, తమ సమస్యలను పరిష్కరించుకోవడమే కాదు, వారి పెన్షన్‌లో నుంచి కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఉల్లాసభరితమైన కార్యక్రమాల ఏర్పాటుతో కొత్త ఉత్సాహాన్ని పొందడానికి ప్రయతిస్తున్నారు.ఆరోగ్యంగా భరోసా! సంఘం కార్యదర్శి బుచ్చిరాజు మాట్లాడుతూ ‘‘మొన్నీమధ్య అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. సనత్‌నగర్‌లో ఉన్న మా సంఘ సభ్యుడు ఒకరికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ‘ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. హెల్త్ కార్డ్ ఎలా?’ అనే విషయంపై ఆ సభ్యుడి కూతురు ఆందోళనగా ఫోన్ చేసింది. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. సమీప హాస్పిటల్ వాళ్లకు ఫోన్ చేసి, అంబులెన్స్‌ను పంపించడంతో పాటు, వారికి సహాయంగా ఉండటం కోసం వారి దగ్గరలో ఉన్న మరొక సభ్యుడిని అలెర్ట్ చేశాం. మాకు పెద్ద కుటుంబం అండగా ఉందన్న భరోసాను ఆ కుటుంబానికి అందించాం. ఇదే విధంగా ఇంకో సభ్యుడి సమస్య. పిల్లలిద్దరూ విదేశాలలో ఉన్నారు. తండ్రి ఒక్కడే హైదరాబాద్‌లో ఒంటరిగా ఉంటాడు. ఆరోగ్య స్థితి బాగోక ఆపద సమయంలో మమ్మల్ని సంప్రదించాడు. మేం తోడున్నామనే భరోసాను అందించాం. విశ్రాంత జీవనంలో ఉండేవి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలే. పిల్లలు వారి పనుల్లో బిజీగా ఉంటారు. దీంతో ఒంటరితనంతో బాధపడుతుంటారు. కొన్ని విషయాల్లో పిల్లలు చెప్పింది వినరు. ఇలాంటప్పుడు ఏ వయసు వారిని ఆ వయసు వారితో కౌన్సెలింగ్స్ కూడా ఇప్పిస్తుంటాం..’’ అంటూ తామంతా ఒకే కుటుంబంగా ఎలా ఉంటున్నదీ వివరించారు.గాత్రంతో వీనుల విందు..కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్‌గా చేసి, రిటైర్డ్ అయిన కె.రామారావు మాట్లాడుతూ ‘‘మా సంఘ సభ్యులుగా ఉన్న ఔత్సాహిక గాయనీగాయకులను ప్రోత్సహించడం కోసం కల్చరల్ విభాగం ఏర్పాటు చేశాం. ఇప్పటికి 16 మంది కళాకారులు తమ గాత్రంతో సభ్యులకు వీనుల విందు చేస్తుంటారు. ఘంటసాల, బాలసుబ్రమణ్యంవర్ధంతి, జయంతి, సుశీల బర్త్‌డే సందర్భంగా సంగీత విభావరి నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా కళాకారులు అందరినీ సన్మానిస్తుంటాం. ఈ విభాగానికి కన్వీనర్‌గా ఉన్నందుకు, ఇలా కళాసేవ చేస్తున్నందుకు ఆనందంగా ఉంద’ని తెలియజేశారు.పెన్షన్ నుంచి సామాజిక సేవఆరోగ్య అవగాహన కల్పించడమే కాదు ఈ సంఘం సభ్యులు సామాజిక సేవలో పాల్గొంటూ తమ దాతృత్వాన్నీ చాటుకుంటున్నారు. నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా చేసిన విశ్రాంత ఉద్యోగి డి.మీరం శెట్టి మాట్లాడుతూ ‘‘ప్రతి మూడు నెలలకు ఒకసారి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఇటీవల నిలోఫర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు లక్ష రూపాయల విలువైన మెడికల్ పరికరాలను, సైఫాబాద్ లో గల వైదేహి అనాథ బాలికల ఆశ్రమానికి స్కూటీని, దమ్మాయిగూడలోని వేద పాఠశాలకు పుస్తకాలు, వంట సామాగ్రిని, ఆర్ఓ వాటర్‌ప్లాంట్ అందించాం. కోవిడ్ సమయంలో గాంధీ హాస్పిటల్ వైద్యులను, 700 మంది నర్సులను సన్మానించాం. రెండు నెలల కిందట మున్సిపల్ వర్కర్లకు, గాంధీ ఆసుపత్రి మెటర్నటీ వార్డులోని 400 మంది స్త్రీలకు చీరలు పంపిణీ చేశాం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నా క్యాంటీన్‌కు రెండు లక్షలు, ఇటీవల వరద బాధితుల సహాయార్థం రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశాం. ఆర్మీలో పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబాల సహాయార్థం రెండు లక్షల రూపాయలకు పైగా వితరణ చేశాం’’ అని వివరించారు. ఈ మొత్తాలను సంఘ సభ్యులే తమ దయా హృదయంతో విరాళంగా ఇస్తుంటారని, వాటితోనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని తెలిపిన వీరు మలివయసును మహోన్నతంగా మలుచుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సంఘంలో చేరవచ్చుఆంధ్రప్రదేశ్ పెన్షన్ దారులు ఎవరైనా హైదరాబాద్‌లో స్థిరపడినవారుంటే ఈ సంఘంలో చేరి, తమ కంటూ మరో పెద్ద కుటుంబం ఉందన్న భరోసాతో ఆనందంగా జీవించవచ్చు. – టిఎంబి, బుచ్చిరాజుప్రధాన కార్యదర్శిమా సభ్యులకు వివిధ ప్రముఖ మెడికల్ ల్యాబ్‌ల నుండి, ఆసుపత్రుల నుండి ఫీజులో రాయితీ వచ్చేటట్లు కృషి చేస్తున్నాం. మా సభ్యుల సౌకర్యార్థం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సంఘానికి సంబంధించిన వివరాలతో త్రైమాసిక మ్యాగజైన్‌ని కూడా మా సభ్యులకు పంపుతున్నాం. – డి. మీరం శెట్టి, కన్వీనర్, ఆర్థిక సామాజిక సేవా విభాగంమహిళా బృందంవిశ్రాంత ఉద్యోగ మహిళలను, విశ్రాంత ఉద్యోగుల సతీమణులను చైతన్య పరచి, వారు వివిధ కార్యక్రమాలలో పాల్గొనేలా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఈ విభాగంలో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉత్సాహవంతులైన మహిళలతో కోలాట బృందాన్ని ఏర్పరచి వారికి శిక్షణను ఇచ్చి, వివిధ కార్యక్రమాలలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. – ఆర్ అనురాధ, కన్వీనర్, మహిళా విభాగం – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘డబుల్’ పెన్షన్‌పై ఆరా!
చుంచుపల్లి/సాక్షి, హైదరాబాద్ : రిటైర్డ్ ఉద్యోగులు, వారి మరణానంతరం కుటుంబ సభ్యులకు వచ్చే పెన్షన్ తీసుకుంటూ.. ఆసరా పింఛన్ సైతం పొందుతున్న వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా డబుల్ పెన్షన్లు పొందుతున్న సుమారు 200 మందిని సెర్ప్ సిబ్బంది గుర్తించి నోటీసులు అందజేశారు. చుంచుపల్లి మండలం బాబూ క్యాంపునకు చెందిన దాసరి మల్లమ్మ.. కూతురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోవడంతో వచ్చే ప్రభుత్వ పెన్షన్‌తో పాటు ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నట్లు గుర్తించిన అధికారులు రికవరీ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు.కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది.. అనే సామెతను ఉదహరిస్తూ.. ‘కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ప్రస్తుత సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి లాక్కునే వింత చేష్టలు మొదలుపెట్టింది’అని ఆరోపించారు. సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు వెనక్కి పంపాలని ప్రభుత్వం నోటీసులు జారీచేస్తోందని, దాసరి మల్లమ్మకు ఆసరా కింద వచి్చన రూ.1.72 లక్షలు కూడా తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలికి నోటీసులు జారీ చేసి, కేసీఆర్ సర్కారు ఇచ్చిన పెన్షన్ సొమ్మును లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ పోస్ట్ నేపథ్యంలో విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో డీఆర్డీఓ ఎం.విద్యాచందన సూచనల మేరకు సెర్ప్ సిబ్బంది మల్లమ్మ ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె పొందుతున్న పెన్షన్ వివరాలు సేకరించారు. ఈ విషయమై డీఆర్డీఓ విద్యాచందనను సంప్రదించగా.. ఆమె రెండు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించామని, రికవరీపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. ‘డబుల్’వల్లనే మల్లమ్మ పింఛన్ నిలిపివేత కేటీఆర్ పోస్ట్‌ను తప్పుపట్టిన సర్కార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ఆసరా పెన్షన్ కింద ఇచి్చన డబ్బులపై ప్రభుత్వం రికవరీ నోటీసు ఇచి్చందని.. ఇది అమానవీయమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేయడాన్ని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తప్పు పట్టింది. ఈ వ్యవహారం కూడా డబుల్ పెన్షన్ల జాబితాలోనే ఉందని ప్రకటించింది.దాసరి మల్లమ్మ కూతురు దాసరి రాజేశ్వరి దంతుకూరులో ఏఎన్ఎంగా పని చేసేవారని, 2010లో రాజేశ్వరి మరణించగా ఆమెకు పెళ్లి కాకపోవటంతో డిపెండెంట్‌గా మల్లమ్మకు రూ.24,073 ఫ్యామిలీ పెన్షన్ కింద ప్రతి నెలా చెల్లిస్తున్నామని, మరోవైపు ఆపన్నులకు ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా ప్రతినెలా ఆమెకు అందుతున్నట్లు ఇటీవలి సర్వేలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే జూన్ నెల నుంచి ఆమెకు ఇచ్చే ఆసరా పెన్షన్‌ను అక్కడి జిల్లా అధికారులు నిలిపివేశారని స్పష్టం చేసింది. -
బొకే ఇచ్చి.. బైబై
సాక్షి, హైదరాబాద్: పదవీవిరమణ పొందిన ఉద్యోగుల వీడ్కోలు కార్యక్రమాలు భావోద్వేగ వాతావర ణం మధ్య జరుగుతాయి. ఉద్యోగి దంపతులకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి వారి సేవలను ఘనంగా పొగు డుతారు. వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లలో కొన్నింటిని అదేరోజు చెల్లించి దర్జాగా సాగనంపుతారు. ఆర్టీసీలోనూ ఈ తంతు సాధారణమే. కానీ కొన్ని నెలలుగా తీరు మారింది. పూలమాలలు, బొకేలు ఇచ్చి వీడ్కోలు చెప్పేస్తున్నారు. పదవీ విరమణ ఆర్థిక ప్రయో జనాల మాటేమిటి అంటే ఆ ఒక్కటి అడగొద్దంటోంది సంస్థ. నష్టాల వల్ల నిధులు లేవన్న కారణంతో రిటైర్డ్ ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. ఇప్పుడు వందలమంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయో జనాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నిలిచిపోయిన గ్రాట్యుటీ..పదవీవిరమణ పొందిన కొద్ది రోజుల్లోనే గ్రాట్యుటీ మొత్తం చెల్లించే పద్ధతి ఉండేది. కానీ, ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. » ఈ సంవత్సరం జనవరి వరకు వెంటవెంటనే గ్రాట్యుటీ చెల్లించారు. » ఫిబ్రవరి నుంచి బ్రేక్ పడింది. ఆ నెలలో రిటైర్ అయిన వారికి నెల ఆలస్యంగా చెల్లించారు. » మార్చిలో రిటైర్ అయిన వారికి మూడు రోజుల క్రితం చెల్లించారు. » ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందుతున్న వారు ఎదురుచూపుల జాబితాలో ఉన్నారు. వీరికి ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేదు. ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్‌గా వచ్చే వాటిల్లో ఇదే పెద్ద మొత్తం. దీని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు. కానీ, ఆ మొత్తం చేతికందటంలో జరుగుతున్న జాప్యం ఆర్టీసీ కార్మికుల్లో గందరగోళానికి కారణమవుతోంది. డ్రైవర్, కండక్టర్ లాంటి వారికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఈ మొత్తం అందాల్సి ఉంటుంది. ఈడీ లాంటి పెద్ద పోస్టులోని అధికారులకు రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. చిరుద్యోగులుగా ఉండి రిటైర్ అయినవారు ఇప్పుడు ప్రత్యామ్నాయ నిధి లేక ఈ మొత్తంపైనే ఆశలు పెట్టుకున్నారు. దాదాపు ఐదొందల కుటుంబాలు ఇప్పుడు ఆ మొత్తం కోసం ఎదురుచూస్తున్నాయి. బాండ్ డబ్బులూ అంతే..ఆర్టీసీలో 2013 వేతన సవరణను 2015లో అమలు చేశారు. రెండేళ్ల బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. సర్వీసు ఉద్యోగులకు పెండింగ్‌లో పెట్టినా, రిటైర్ అయిన వారికి వెంటనే చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జనవరి నుంచి రిటైర్ అయిన వారికి కూడా చెల్లించటం నిలిపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అందరు ఉద్యోగులకు బాండ్ బకాయిలు చెల్లించనున్నట్టు మూడునెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ, కొన్ని నిధులే విడుదల కావటంతో ఇటీవల కేవలం డ్రైవర్లకు చెల్లించి వదిలేశారు. జనవరి నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.లక్షన్నర వరకు అందాల్సి ఉంది. దాదాపు 1500 రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి.‘చివరి నెల వేతనం’ హుళక్కే..ఉద్యోగి పదవీవిరమణ పొందేప్పుడు చివరి నెల వేతనాన్ని తాత్కాలికంగా నిలిపేస్తారు. ఆ ఉద్యోగి సంస్థకు ఏవైనా బకాయిలు చెల్లించాల్సి ఉంటే, లెక్కలు చూసి చివరి నెల వేతనం నుంచి మినహాయించి మిగతా మొత్తాన్ని అందిస్తారు. రిటైర్ అయిన నెల రోజుల్లో ఆ మొత్తం విడుదల అవుతుంది. కానీ, జనవరి నుంచి ‘చివరి నెల వేతనం’ ఆపేశారు.ఆర్జిత సెలవు మొత్తం ఏమైంది? ఉద్యోగ కాలంలో పోగైన 300 ఆర్జిత సెలవు (ఈఎల్స్)ల ఎన్‌క్యాష్‌మెంట్ ఉంటుంది. ఆ సెలవులకు సంబంధించి నగదు చెల్లిస్తారు. ఆర్టీసీలో పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంచిన తర్వాత, తిరిగి రిటైర్మెంట్లు మొదలైన 2022 డిసెంబరు నుంచి ఆర్జిత సెలవుల మొత్తం చెల్లించటం ఆగిపోయింది. ఈ మొత్తం కనిష్టంగా రూ.5 లక్షల వరకు ఉంటుంది.కరువు భత్యం బకాయిలకూ దిక్కులేదు ఆర్టీసీ ఉద్యోగు లకు గతంలో నాలుగున్నరేళ్ల పాటు కరువు భత్యం సవరించలేదు. అవన్నీ పేరుకుపోయాయి. విడతవారీగా ఆ తర్వాత 9 డీఏలను సవరించి వేతనంలో చేర్చారు. కానీ, ఆ డీఏలను వర్తింప చేయాల్సినకాలం నుంచి వర్తింపచేసినకాలం మధ్య రిటైర్ అయినవారికి కూడా ఆ లబ్ధి అందాల్సి ఉంది. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు వాటిని చెల్లించలేదు. ఈ మధ్యకాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కూడా వాటిని చెల్లించాల్సి ఉన్నా చెల్లించలేదు.వేతన సవరణ బకాయిలేమయ్యాయి? 2017లో జరగా ల్సిన వేతన సవర ణను గత మే నెల నుంచి అమలులోకి తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 21% ఫిట్మెంట్తో దాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కానీ వాటి బకాయిలను రిటైర్మెంట్ సమయంలోనే చెల్లించనున్నట్టు అప్పట్లో ఆర్టీసీ వెల్లడించింది. మరి, ఈ ఫిట్మెంట్ అమలులోకి తెచ్చేలోపు రిటైర్ అయినవారి విషయంలో మాత్రం చెల్లింపు ఊసే లేకుండాపోయింది. దానిపై కనీసం స్పష్టత కూడా ఇవ్వటం లేదు.మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్..కన్నీటి పర్యంతమైన విద్యార్థులుకుల్కచర్ల: విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు పాఠశాల అభ్యున్నతికి కృషి చేసిన తమ హెచ్ఎం బదిలీపై వెళ్లడాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. ‘మమ్మల్ని వదిలి.. మీరు వెళ్లొద్దు సార్’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. గురువుగా పాఠాలు చెప్పడంతో పాటు తండ్రిలా బంధాన్ని పెనవేసుకున్న తమ సార్ మరో స్కూల్‌కు వెళ్తున్నారని తెలిసి ఆవేదనకు గురయ్యారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని చౌడాపూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న తిమ్యా, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాస్కర్ స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో భాగంగా మరో చోటకు ట్రాన్స్ఫర్ అయ్యారు. మంగళవారం విధుల నుంచి రిలీవ్ అయి వెళ్తుండగా.. విద్యార్థులు వెక్కివెక్కి ఏడ్చారు. వారిని ఊరడించిన మాస్టారు.. ‘బాగా చదువుకోండి. మిమ్మల్ని చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తాం’ అని చెప్పి బరువెక్కిన హృదయంతో బైబై చెప్పుకుంటూ వెళ్లిపోయారు. -
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యవర్గం
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షునిగా దామోదర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో రెండ్రోజులు జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గురువారం ముగిశాయి. అధ్యక్షునిగా దామోదర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షునిగా విశ్వనాథం, ఉపాధ్యక్షులుగా జి.మోహన్‌రెడ్డి, జి.శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్ మోహన్, శ్రీహరిరెడ్డి, సీతారామయ్య, భాగ్యలక్ష్మి, కార్యదర్శులుగా టి.ప్రభాకర్, పి.శ్యామ్‌రావు, ఎన్.విష్ణువర్ధన్‌రెడ్డి, పి.శరత్‌బాబు, విజయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బక్కారెడ్డి, ఈశ్వరయ్య, రఘునాథ్‌రెడ్డి, నాగేశ్వరరావు, కోశాధికారిగా గంగారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా చందులాల్, శ్రీవాస్తవ్, రవీందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, పెంటయ్య తదితరులను ఎన్నుకున్నట్టు కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ప్రత్యేక ఓపీ’
లబ్బీపేట(విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ప్రత్యేక ఓపీ కౌంటర్ ఏర్పాటుచేశారు. ఈ కౌంటర్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక ఓపీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి సోమవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మంగళవారం మానసిక వ్యాధులు, జనరల్ మెడిసిన్, బుధవారం గుండె, కిడ్నీ వ్యాధులు, గురువారం ఆర్థోపెడిక్, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, శుక్రవారం చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్, శనివారం ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి మందులు అందజేస్తారని తెలియజేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రక్తపోటు, హైపో థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటీస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్రానిక్ కిడ్నీ వ్యాధులు వంటి వాటికి పరీక్షలు చేసి మందులు అందిస్తారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విఠల్‌రావు, జిల్లా ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ జె.సుమన్, ఆర్‌ఎంఓలు శోభ, మంగాదేవి, ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు. -
సకల జనుల సమ్మె కాలపు వేతనం వచ్చిందోచ్.. 11 ఏళ్ల తర్వాత!
సాక్షి, హైదరాబాద్: సకల జనుల సమ్మె కాలపు వేతనాలను ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అందుకోబోతున్నారు. పదకొండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు వారికి ఆ మొత్తం అందబోతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 2011 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు సకల జనుల సమ్మె జరిగిన విషయం తెలిసిందే. తర్వాత సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆర్టీసీలో వెంటనే అమలు కాలేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నా.. సెలవు కాలపు వేతనాన్ని విధుల్లో ఉన్న ఉద్యోగులకే చెల్లించారు. ఆ సమయానికే పదవీ విరమణ పొందిన 8,053 మందికి ఇవ్వలేదు. దీంతో ఆ వేతనం కోసం వారు 11 ఏళ్లుగా పోరాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య నేతలతో మంత్రుల చర్చల సందర్భంగా ఈ డిమాండ్ పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 3 డీఏలు, దసరా పండుగ అడ్వాన్సులాంటి వాటితోపాటు పదవీ విరమణ పొందిన అర్హులకు సమ్మె కాలపు వేతనం కింద రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ పేరుతో సర్క్యులర్ శనివారం జారీ అయింది. చదవండి: కరెంట్ నష్టాల్లో... కుమురం భీం టాప్! -
ఇది పింఛనా.. ఇగ పెంచరా?
గోదావరిఖనికి చెందిన ఎర్రం నర్సయ్య సింగరేణిలో పనిచేసి రిటైరయ్యాడు. ఆయన నెలనెలా వస్తున్న పింఛన్ రూ.600 మాత్రమే. భార్యాభర్తలిద్దరూ ఇదే పింఛన్‌తో గడపాలి. 1997లో పనిలోంచి దిగిపోయాడు. కాలుకు దెబ్బతగిలి గాయమవడం, షుగర్ కారణంగా అది పెద్దదవడంతో మోకాలి వరకు తొలగించారు. రెండో కాలు విరగడంతో రాడ్ వేశారు. రెండు కాళ్లూ పనిచేయని దుస్థితి. అయినా ఇదే పింఛన్‌తో కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి. గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌కు చెందిన మట్ట లింగయ్య 28ఏళ్లపాటు సింగరేణిలో పనిచేసి 2002లో రిటైరయ్యాడు. అప్పటి నుంచీ ఆయనకు రూ.580 పింఛన్ మాత్రమే వస్తోంది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ఆయన.. మందులు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నట్టు వాపోతున్నాడు. .. ఇది కేవలం నర్సయ్య, లింగయ్యల గాథ మాత్రమేకాదు. బొగ్గుగనుల్లో పనిచేసి రిటైర్ అయిన వేలాది మంది కార్మికుల గోస ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్ కంటే కూడా తమకు వచ్చే కార్మిక పింఛన్ చాలా తక్కువని.. కార్మిక పింఛన్ ఉందని ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. (సాక్షిప్రతినిధి, కరీంనగర్) ఏళ్లపాటు సేవలు చేసినా.. రిటైరైన తర్వాత సుఖంగా విశ్రాంత జీవితం గడుపుతామని కలలు కన్న బొగ్గుగని కార్మికుల జీవితాలు తలకిందులు అవుతున్నాయి. నామమాత్రపు పింఛన్‌తో బతుకీడుస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి కోసం కష్టపడిన కార్మికులు వయసు మీదపడ్డాక కీళ్ల అరుగుదల, శ్వాసకోస సంబంధ వ్యాధులతో సతమతం అవుతున్నారు. పింఛన్ సొమ్ము ఎటూ సరిపోక అప్పులపాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఆసరా పథకం కింద రూ.2,016 పింఛన్ ఇస్తోంది. కానీ రిటైర్డ్ కార్మికులు సీఎంపీఎఫ్ పింఛన్ అందుకుంటుండటంతో వారికి ఆసరా పథకానికి అర్హత లేకుండా పోయింది. కానీ ఆసరా కన్నా చాలా తక్కువగా కేవలం రూ.500, వెయ్యిలోపే సీఎంపీఎఫ్ పింఛన్ వస్తుండటం గమనార్హం. ఏళ్లుగా పోరాడుతున్నా.. పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోలిండియా వ్యాప్తంగా 2011లో పెన్షనర్ల అసోసియేషన్ ఏర్పడింది. నాలుగేళ్లపాటు పోరాడిన అసోసియేషన్ అప్పటి ప్రధాని మన్మోహన్‌ను కలిసి గోడు వినిపించుకున్నా స్పందన రాలేదు. దీనితో తమకు న్యాయం చేయాలంటూ.. 2015 జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ అంశాన్ని కిందికోర్టులో తేల్చుకోవాలంటూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది. ఏడేళ్లు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై నిర్ణయం వెలువడలేదు. ఈ కేసు వచ్చే నెల 11న తిరిగి విచారణకు రానున్నట్టు నాయకులు తెలిపారు. పెన్షన్ లోటుపై పట్టింపేది? మొత్తం పెన్షన్‌దారులు ఎంతమంది? మూలనిధి ఎంత ఉంది? రిటైర్ అవుతున్న బొగ్గు గని కార్మికులకు ఎంత పెన్షన్ చెల్లించాలనే అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయించాల్సిన ఫండ్ మేనేజ్మెంట్ కమిటీ కనీసం ప్రతి మూడేళ్లకోసారి సమావేశం కావాలి. ఫండ్‌లో లోటు లేకుండా చర్యలు చేపట్టాలి. దీనితో ఇప్పటివరకు రూ.45 వేలకోట్ల లోటు ఏర్పడినట్టు సమాచారం. దీనిని పూడ్చేందుకు ఇటీవలే చర్యలు చేపట్టారు. కోలిండియా యాజమాన్యంతో మేనేజ్మెంట్ కమిటీ చర్చించి టన్ను బొగ్గుపై రూ.15 లెక్కన సీఎంపీఎఫ్ ట్రస్ట్‌కు చెల్లించేందుకు అంగీకరించేలా చేసినట్టు తెలిసింది. 10న సీఎంపీఎఫ్ కార్యాలయాల ముందు ధర్నా బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంచాలని కోరుతూ ఈనెల 10న కోలిండియా స్థాయిలోని సీఎంపీఎఫ్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించనున్నారు. పెద్ద సంఖ్యలో రిటైర్డ్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా.. బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంచాలని 2011లో కోలిండియా అధ్యక్షుడితో కలిసి పోరాటం ప్రారంభించాం. అప్పటి ప్రధాని మన్మోహన్‌ను కలిసి సమస్య వివరించాం. సానుకూల స్పందన రాలేదు. ఐదేళ్లపాటు అనేక రూపాల్లో పోరాటం చేసి.. చివరికి సుప్రీంకోర్టులో కేసు వేశాం. వచ్చేనెల 11న విచారణ జరగనుంది. – కేఆర్సీ రెడ్డి, రిటైర్డ్ జీఎం, కోల్‌మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి మా సమస్యపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కొంత చలనం వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్లో చేసిన చట్టంలో లోపాలతో ఇబ్బంది పడుతున్నాం. తక్కువ పెన్షన్‌తో చాలా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. – మడిపెల్లి బాబురావు, ప్రధాన కార్యదర్శి, కోల్‌మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ -
ఈహెచ్ఎస్ మరింత పటిష్టం.. ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో బిల్లుల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమును (ఈహెచ్ఎస్) మరింత పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి వైద్య బిల్లులను ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఆటో డెబిట్ స్కీము ద్వారా చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పీఆర్సీపై చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన మాట మేరకు ఇతర రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు అందించేందుకు అనుమతిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరోగ్య శ్రీలో చేర్చినా, ఎంప్లాయిస్ హెల్త్ స్కీములో కవర్ కాని 565 వైద్య విధానాలను ఇప్పుడు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకుంది. నెట్వర్క్ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లను మరింత పటిష్టం చేస్తూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీము లబ్ధిదారులకు ఆరోగ్య మిత్రలు తగిన సహాయ సహకారాలు అందిస్తూ నగదు రహిత చికిత్సలు అందేలా చూస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు ఉత్తర్వుల్లో సూచించారు. ఉద్యోగులకు ఎంతో మేలు ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం 21 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని స్పష్టంగా పేర్కొనడంతో మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని ప్రధాన ఆస్పత్రులు ఈ స్కీమును అమలు చేస్తాయని పేర్కొన్నారు. 565 రకాల కొత్త వైద్య సేవల వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. -
ఉద్యోగమిచ్చి.. ఉచ్చులోకి దించి
అమలాపురం టౌన్: ఉద్యోగమంటూ ఎర వేశారు.. వ్యూహాత్మకంగా వలలోకి దించారు.. ది జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ మల్టీ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ బోర్డు తిప్పేసిన సంఘటనలో విశ్రాంత ఉద్యోగులే చాలామంది మోసపోయారు. ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచ్‌లు ఉన్నాయి. ‘జయలక్ష్మి’ యాజమాన్యం తమ సంస్థలో డిపాజిట్ల సేకరణకు ఆది నుంచి ముందు చూపుతో వ్యవహరించింది. ముందుగా పలు వాణిజ్య బ్యాంకుల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారుల వివరాలు సేకరించింది. తమ సొసైటీ బ్రాంచుల్లో వివిధ ఉద్యోగాలను ఎరగా చూపి వారికి కీలక పోస్టులను అప్పగించింది. మేనేజర్ స్థాయి కూర్చీల్లో కూర్చోబెట్టి గతంలో వారు పనిచేసిన బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసిన వ్యక్తులను పాత పరిచయాలతో తమ సొసైటీ వైపు ఆకర్షించేలా చేసుకుంది. అవిభక్త జిల్లా నుంచి ఇతర బ్యాంక్‌లు, డీసీసీబీల బ్రాంచ్‌ల్లో దాదాపు 45 మంది విశ్రాంత అధికారులకు ‘జయలక్ష్మి’ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చింది. వాణిజ్య బ్యాంక్‌లు, డీసీసీబీ తదితర బ్యాంక్‌లు వడ్డీ 5 నుంచి 6 శాతం ఇస్తుంటే.. తమ జయలక్ష్మి సొసైటీలో 10 శాతానికి మించి అధిక వడ్డీ ఇస్తున్నామని చెప్పి ఆకర్షించింది. ఉద్యోగుల విశ్వాసంతో వల డీసీసీబీ బ్రాంచ్‌ల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కొందరు మేనేజర్లకు ‘జయలక్ష్మి’ బ్రాంచీల్లో ఉద్యోగాలు ఇచ్చి వారికి ఆకర్షణీయమైన జీతాలతో మేనేజర్లుగా కూర్చోబెట్టింది. ఉదాహరణకు కోనసీమ జిల్లాలో ఉన్న ఏడు జయలక్ష్మి బ్రాంచ్‌ల్లో ఐదుగురు మేనేజర్లు విశ్రాంత డీసీసీబీ బ్రాంచ్‌ల మేనేజర్లే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్లాన్ ప్రకారం వివిధ వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు, అకౌంటెంట్లుగా ఉద్యోగ విరమణ చేసిన వారినే ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంది. విశ్రాంత అధికారులకు తమ సొసైటీల్లో ఉద్యోగాలు ఇచ్చి ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు కొల్లగొట్టాలని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారు. వారి చేత ఆయా బ్యాంకుల్లో డిపాజిట్‌దారులను నమ్మించి, ఒప్పించి అక్కడ డిపాజిట్ల సొమ్మును ‘జయలక్ష్మి’లో వేసేలా చేయడంలో యాజమాన్యం సఫలీకృతమైంది. అమలాపురం జయలక్ష్మి బ్రాంచ్‌లో దాదాపు రూ.48 కోట్ల మేర డిపాజిట్‌దారులు దాచుకున్న సొమ్మును దోచేస్తే అందులో సుమారు రూ.15 కోట్లు అప్పటివరకూ డీసీసీబీ బ్రాంచ్‌లో డిపాజిటర్లుగా ఉన్నవారి నుంచి మళ్లింపు అయ్యింది. అవిభక్త జిల్లాలో పలు వాణిజ్య బ్యాంకుల డిపాజిట్‌దారుల నుంచి సుమారు రూ.50 కోట్లు, డీసీసీబీ బ్రాంచ్‌ల్లో దాదాపు రూ.150 కోట్ల వరకూ ఇలా గత కొన్నేళ్లలో ఆయా బ్రాంచ్‌ల్లో దాచుకున్న డిపాజిట్దారులే తమ సొమ్మును ఈ సొసైటీ డిపాజిట్లలోకి మళ్లించుకునేలా వారిలో నమ్మకాన్ని నింపగలిగింది. వారినే వాడుకుంది.. పలు బ్యాంకుల బ్రాంచ్‌ల విశ్రాంత మేనేజర్లకు తమ సొసైటీ బ్రాంచ్‌ల్లో తిరిగి మేనేజర్ల ఉద్యోగాలు కల్పించి ‘జయలక్ష్మి’ యాజమాన్యం పావులుగా వాడుకుంది. ఉదాహరణకు అమలాపురంలో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు తమ కుటుంబ సభ్యుల ద్వారా రూ.45 లక్షల వరకూ ‘జయలక్ష్మి’లో డిపాజిట్ చేశారు. గతంలో ఓ వాణిజ్య బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేసి రిటైర్ తర్వాత జయలక్ష్మిలో మేనేజర్ అయిన ఓ అధికారి మాటలను నమ్మి అన్ని లక్షలు డిపాజిట్లు చేశానని ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు లబోదిబోమంటున్నారు. ఇలా రూ.లక్షలు దాచుకుని నేడు దోపిడీకి గురైన ఏ విశ్రాంత ఉద్యోగిని కదిపినా ఒక్కో కన్నీటి కథ చెబుతున్నారు. తాము డిపాజిట్ చేయడం వెనుక ఫలానా బ్యాంక్ విశ్రాంత మేనేజరో.. బ్యాంక్ అధికారో ఉన్నారని.. వారి మాటలను నమ్మే సొమ్ము వేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కరోనా : వారికి ఎస్బీఐ భారీ ఊరట
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా కాలంలో తన విశ్రాంత ఉద్యోగులకు ఊరట అందించే వార్త చెప్పింది. ఎస్బీఐ బ్యాంకు నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కోసం కొత్త బీమా పథకం ప్రవేశపెట్టింది. ఇందులో కోవిడ్-19 చికిత్స కూడా చేర్చడం విశేషం. మెడికల్ బెనిఫిట్స్ స్కీమ్ కింద క్రానిక్ ఒబెస్ట్రుక్టీవ్ పల్మనరీ డిసీజెస్ (సీఓపీడీ) లేదా ఉబ్బసం సహా మరో నాలుగు వ్యాధులతో బాధపడే వారు సైతం ఆసుపత్రిలో చేరేందుకు బ్యాంక్ అనుమతించింది. ఈమేరకు ఎస్బీఐ తన రిటైర్డ్ ఉద్యోగులకు సమాచారాన్ని అందించింది. (ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ ) ప్రస్తుత పథకాన్ని సమీక్షించి ఎస్బీఐ ఆసుపత్రిలో ఉన్న వ్యాధుల జాబితాలో కోవిడ్-19 ను అంటువ్యాధిగా చేర్చాలని నిర్ణయించినట్లు ఎస్బీఐ తెలిపింది. ఇప్పుడు 20 నుండి 25 వరకు వ్యాధుల సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ఇంట్లో కోవిడ్-19 చికిత్సకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ పథకంలో సభ్యులకు గృహ చికిత్స కోసం రూ. 25000 వరకు ఖర్చును అనుమతించాలని నిర్ణయించింది. దీంతో కోవిడ్ కోసం అదనంగా మరో బీమాను కొనుగోలు చేయనవసరం లేదని పేర్కొంది. స్టేట్ బ్యాంక్ తీసుకున్న ఈ చర్య సంస్థ రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది. కాగాఎస్‌బీఐ ప్రస్తుత ఉద్యోగులు ఇప్పటికే కోవిడ్ -19 చికిత్స కవరేజ్ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. -
ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి
సాక్షి, గజ్వేల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో విశ్రాంత ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గజ్వేల్‌లో నిర్మించిన రిటైర్డ్ ఉద్యోగుల అతిథి భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడ నుంచే పోటీ చేసి ముఖ్యమంత్రి కావడం గజ్వేల్ ప్రజల అదృష్టమని తెలిపారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తుందని.. వర్షాకాలంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. లాక్డౌన్ కారణంగా చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని.. వారిని దృష్టిలో ఉంచుకుని లాక్డౌన్లో సడలింపులు ఇచ్చామని పేర్కొన్నారు. 21 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని.. అందులో భాగంగా గజ్వేల్‌లో ప్రతి వీధిలో మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్ధిపేటను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్ధే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. -
ఆర్టీసీలో ఆ సిబ్బందికి పెద్ద కష్టమొచ్చిపడింది..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పదవీ విరమణ సిబ్బందికి ఇప్పుడు పెద్ద కష్టమొచ్చిపడింది. రిటైర్మెంట్ సమయంలో వారు విధుల్లో ఉంటేనే బెనిఫిట్స్ అందుతాయి. కానీ నెలాఖరున వారు సమ్మెలో ఉండిపోవటంతో ఇప్పుడు వారి కుటుంబాల్లో పెద్ద టెన్షన్ నెలకొంది. గత అక్టోబర్ నెలాఖరున ఆర్టీసీలో దాదాపు 250 నుంచి 300 మంది పదవీ విరమణ పొందారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం రావాలంటే చివరి రోజు కచ్చితంగా డ్యూటీలో ఉండాలి. ఇదే ఉద్దేశంతో వారందరూ విధుల్లో చేరాల్సిందిగా ఐదు రోజుల ముందే కార్మిక సంఘాల జేఏసీ సూచించింది. సమ్మెలో ఉన్నవారు అర్జీ పెట్టుకుని వస్తే విధుల్లోకి తీసుకుంటామని గతంలో ప్రభుత్వం పేర్కొనటంతో వీరంతా విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. అర్జీ పెట్టుకుని వచ్చేవారిని విధుల్లోకి తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి పేర్కొన్నా, ఆ సమయంలో ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత సరూర్‌నగర్‌లో భారీ బహిరంగసభ పెట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఒక్కసారిగా తీరు మారిపోయింది. ఇప్పుడు అర్జీ పెట్టుకుని డ్యూటీలో చేరదామని వచ్చేవారికి అధికారులు అనుమతించటం లేదు. ఇదే క్రమంలో పదవీ విరమణ పొందినవారికి కూడా చుక్కెదురైంది. వారు విధుల్లో చేరకుండానే విరమణ పొందాల్సి వచ్చింది. దీంతో తమ రిటైర్మెంట్ బెని ఫిట్స్‌కు ఇబ్బంది వస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. చదవండి: సమ్మెలోనే ఆర్టీసీ డ్రైవర్ పదవీ విరమణ -
గూడు ఉంటుందా?
చంచల్‌గూడ: మాదన్నపేట హౌసింగ్‌బోర్డు క్వార్టర్స్‌లో అద్దెకుంటున్నవారికి పెద్ద కష్టం వచ్చిపడింది. వాటిలో ఏళ్ల తరబడి ఉంటున్న విశ్రాంత ఉద్యోగులను ఖాళీ చేయాలని అధికారులు తరచూ నోటీసులతో బెదిరింపులకు గురిచేస్తున్నారు. 40 ఏళ్లుగా అద్దెకు ఉన్న తమకే క్వార్టర్స్‌ను కేటాయించాలని హౌసింగ్ బోర్డుకు పలుమార్లు నివాసితులు విజ్ఞప్తి చేసినా వారి అభ్యర్థనకు స్పందించలేదు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు 1964లో 36 బ్లాక్‌లతో 144 ఫ్లాట్స్‌తో మాదన్నపేటలో క్వార్టర్స్ నిర్మాణం చేపట్టింది. అవి పూర్తికాగానే 1969లో అమ్మకానికి పెట్టింది. అప్పట్లో ఒక్కో ఫ్లాట్‌ను రూ.20 వేల చొప్పున విక్రయించగా 71 ఫ్లాట్లు అమ్ముడు పోయాయి. మిగతా వాటిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అద్దెకు ఉండేలా వీలు కల్పించారు. అప్పటి నుంచి ఈ క్వార్టర్స్‌లో నివసిస్తున్నవారు తమ జీతభత్యాలకు అనుగుణంగా రూ.3 నుంచి 10 వేల వరకు అద్దె చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 73 మంది అద్దెదారుల్లో సగానికిపైగా విశ్రాంత ఉద్యోగులే. కాగా 1994లో తమకు క్వార్టర్స్‌పై యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీంతో క్వార్టర్స్‌ను ఖాళీ చేయాల్సిందిగా రెండు సార్లు వీరికి హౌసింగ్ బోర్డు నోటీసులు జారీ చేసింది. హౌసింగ్ బోర్డు అలసత్వం దాదాపు 40 ఏళ్లుగా అద్దెకు ఉన్న తమకే క్వార్టర్స్‌ను కేటాయించాలని ఇక్కడివారు హౌసింగ్ బోర్డుకు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. అటునుంచి స్పందన రాకపోవడంతో సమస్యను 2008లో ఆ నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. అద్దెదారులకు మార్కెట్ ధర ప్రకారం క్వార్టర్స్‌ను కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు వచ్చి సర్వే కూడా చేశారు. అయితే, దురదృష్టవశాత్తు అదే ఏడాది సీఎం రాజశేఖర్‌రెడ్డి అకాల మరణంతో నివాసితుల విజ్ఞప్తులు బుట్టకాఖలైపోయాయి. ఆ నాటి నుంచి వారి గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఫ్లాట్స్ కేటాయింపులను తిరిగి మొదలు పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వారిది న్యాయమైన డిమాండ్ నివాసితులది న్యాయమైన డిమాండ్. మార్కెట్ ధరకు అనుగుణంగా క్వార్టర్స్‌ను కేటాయించి యాజమాన్య హక్కులు కల్పించాలి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలి. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న ప్రభుత్వం వీరిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది. సీఎం కేసీఆర్ ఈ సమస్యపై దృష్టి సారించాలి. – సహదేవ్‌యాదవ్, బీజేపీ నేత ప్రభుత్వం న్యాయం చేయాలి నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ నివాసముంటున్న మమ్మల్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరిగాయి. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని క్వార్టర్స్‌ను మాకే కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అందుకు హౌసింగ్ బోర్డు అధికారులకు అదేశాలు జారీ చేయాలి.– పి. శ్రీశైలం, రిటైర్డ్ ఉద్యోగి -
పెద్దల బండారం బట్టబయలు
సాక్షి, అనంతపురం సెంట్రల్: పెద్దల బండారం బట్టబయలైంది. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. క్లబ్బుల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన 14 స్థావరాలపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కొన్నేళ్లుగా బహిరంగంగానే పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా క్లబ్బులు మారినా ఆ దరిదాపుల్లోకి కూడా పోలీసులు వెళ్లిన సందర్బాలు లేవు. అలాంటి వాటిపై ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు నేతృత్వంలో దాడులు నిర్వహించడం సర్వత్రాచర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు గురువారం స్థానిక పోలీసుకాన్ఫరెన్స్ హాల్లో విలేకరులకు తెలియజేశారు. అసాంఘిక కార్యాకలాపాలపై ఉక్కుపాదం అసాంఘిక కార్యాకలాపాలపై ఉక్కు పాదం మోపుతున్నామని ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో క్లబ్బులపై ఏకకాలంలో దాడులు చేశామన్నారు. మిగిలిన చోట్ల నిందితులు పట్టుబడకపోయినా జిల్లా కేంద్రంలోని అనంతపురం క్లబ్లో పేకాట ఆడుతున్న 42 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,87,417 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లాలో ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి వీలులేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఇసుక, రేషన్ బియ్యం, అక్రమ రవాణా, బెల్టు దుకాణాలు, మట్కా, పేకాట, క్లబ్‌లపై దాడులను ప్రాధాన్యతగా భావించి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 154 ట్రాక్టర్లు, నాలుగు టిప్పర్లు, లారీలను పట్టుకుని 26 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన 150 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నామన్నారు. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న 12 మంది నిందితులను అరెస్ట్ చేసి 337.6 క్వింటాళ్ల(564 బస్తాలు) రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. మట్కాపై జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి 27 కేసులు నమోదు చేయడంతోపాటు రూ.1,87,880 నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పేకాటకు సంబంధించి 553 కేసులు నమోదు చేసి రూ.9,97,240 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పేకాటరాయళ్లను తరలిస్తున్న పోలీసులు గుట్కా విక్రయాలపై 21 కేసులు నమోదు చేసి, 27 మందిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.3,96,571ల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బెల్టు దుకాణాలపై దాడులు చేసి 128 కేసులు 3,714 మద్యం సీసాలు, 149 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. జిల్లాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చౌడేశ్వరి పాల్గొన్నారు. ముందస్తు సమాచారంతో తప్పించుకున్న పేకాటరాయుళ్లు క్లబ్ బయట నిల్చున్న డీఎస్పీ శ్రీనివాసులు సాక్షి, కదిరి: పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సీఆర్సీ క్లబ్‌పై గురువారం పోలీసులు మెరుపు దాడి చేసేందుకు వెళ్లారు. అయితే ముందస్తు సమాచారంతో పేకాటరాయుళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. గత నెల 27న ‘ఇక్కడ పేకాట మామూలే’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు గురువారం జిల్లా వ్యాప్తంగా పేకాట క్లబ్‌లపై మెరుపు దాడులు చేయించారు. కదిరిలో సీఆర్సీ క్లబ్‌పై కూడా దాడి చేయడానికి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ బీవీ చలపతి, ఎస్ఐ ఖాజాహుస్సేన్ ఇంకా పలువురు పోలీసులు అక్కడికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే విషయం సీఆర్సీ క్లబ్ సభ్యులకు పోలీసులే కొందరు సమాచారం అందించడంతో పేకాటరాయుళ్లు తప్పించుకున్నారు. ముందస్తు సమచారం లేకుంటే మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అనుచరులు పట్టుబడేవారని కొందరు సీఆర్సీ క్లబ్ సభ్యులే అంటున్నారు. డీఎస్పీతో పాటు ఇతర కింది స్థాయి అధికారులు కాసేపు సీఆర్సీ క్లబ్ గేట్ ముందు గడిపి వెనుదిరిగారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా.. నగరంలోని అనంతపురం క్లబ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ క్లబ్‌కు అధ్యక్షులు జిల్లా కలెక్టర్, ఉపాధ్యక్షులు ఎస్పీలు వ్యవహరిస్తారు. రిక్రియేషన్ కోసం ఏర్పాటు చేసి క్లబ్ పేకాట, తాగుడుకు కేంద్రంగా మారింది. దీంతో పెద్దమనుషులుగా చలామణి అవుతున్న వారు, రిటైర్డ్ ఉద్యోగులు, చోటామోటా నాయకులు, ప్రజాప్రతినిధులు వారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఎంచుకున్నారు. ఇక్కడ తాగడం, పేకాట ఆడడం లైసెన్స్‌గా భావించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు కొరడా ఝలిపించారు. డీఎస్పీ పీఎన్ బాబు ఆధ్వర్యంలో నాలుగు పోలీసుస్టేషన్ల అధికారులు క్లబ్‌పై మెరుపుదాడులు నిర్వహించారు. 42మంది అరెస్ట్ చేసి నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
పేరు మార్పిడికి మోక్షం లభించేనా..?
సాక్షి, కొత్తగూడెం: మారుపేర్ల మార్పు కోసం సింగరేణి కార్మికులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. శ్రీరాంపూర్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా చెప్పారు. కానీ ఇంతవరకూ నెరవేర్చలేదు. సంస్థవ్యాప్తంగా సుమారు 7వేల మందికి పైగా మారుపేర్ల మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళన జరిగి సుమారు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ అంశం కొలిక్కి రాకపోవడంతో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ కార్మికులకు తప్పని ఇబ్బందులు బాయిపైన ఒకపేరు.. సొంత గ్రామంలో మరో పేరు ఉండటంతో ఉద్యోగ విరమణానంతరం పింఛన్ కోసం కార్మికులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఊర్లోని పేరుతో భూములు, ఇళ్లు ఉండటం, బాయిమీద ఇంకో పేరు ఉండటంతో ఏ పేరుతో కొనసాగాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు. ఊర్లో పేరు మార్చిన భూముల రికార్డులన్నీ మారి పోతాయి.. బాయి మీద పేరుమార్చితే పింఛన్ నిలిచిపోతోంది. దీంతో కార్మికులు సతమతమవుతున్నారు. రికార్డుల్లో సరిగా ఉన్నా.. 35ఏళ్ల పాటు సంస్థలో పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిచ్చే విషయంలో యాజమాన్యం మెలిక పెడుతోంది. రికార్డుల్లో తండ్రీ కొడుకుల పేర్లు సరిగానే ఉన్నప్పటికీ విజిలెన్స్ విచారణ పేరుతో ఊర్లో వేరే పేరు ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొడుక్కు ఉద్యోగం ఇచ్చేందుకు అభ్యంతరం చెబుతోంది. ఉద్యోగం చేసినంత సేపు లేని మారు పేరు ఇబ్బంది అతని మెడికల్ ఇన్వాలిడేషన్ పూర్తయి కొడుక్కి ఉద్యోగం ఇచ్చే విషయంలో మాత్రం అభ్యంతరం తెలపడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గనిపైన ఉన్న పేరుతోనే పిల్లలు చదివినా కొడుకు ఉద్యోగం విషయానికి వచ్చే సరికి విజిలెన్స్ విచారణ పేరుతో ఊర్లో తండ్రి పేరు వేరే ఉంటే ఉద్యోగాన్ని నిలిపివేస్తున్నారు. ఈతరహాలో సింగరేణి వ్యాప్తంగా 68 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. యాజమాన్యం నిర్ణయం కోసం సదరు కార్మికుల కుటుంబాలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాయి. సీఎండీ సమావేశంలో పరిష్కారమయ్యేనా..? వచ్చే నెల 2,3 తేదీల్లో సింగరేణి సంస్థ సీఎండీ స్థాయి జేసీసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనైనా మారు పేర్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని కార్మికులు ఆశిస్తున్నారు. ఈ స్ట్రక్చరల్ సమావేశంలో మెడికల్ ఇన్వాలిడేషన్ కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే టీబీజీకేఎస్ ఒత్తిడిపైనే ఈఅంశం ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. -
రిటైర్డ్ ఉద్యోగులనూ టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది
-
రిటైర్డు ఉద్యోగులను వేధించకండి: సుప్రీం
న్యూఢిల్లీ: రిటైర్డు ఉద్యోగులను వేధించవద్దనీ, వారి వైద్య బిల్లులను వెంటనే చెల్లించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) కింద మెడికల్ చెల్లింపులను నెలలోగా పూర్తి చేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను ఆదేశించింది. సీజీహెచ్ఎస్ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోలేదన్న కారణంతో అధికారులు తన వైద్య బిల్లులను ఆపేశారని ఓ రిటైర్డు ఉద్యోగి కోర్టును ఆశ్రయించడంతో ఈ ఆదేశాలిచ్చింది. కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో వారంలోగా ప్రత్యేక కమిటీని నియమించాలని, ప్రతినెలా ఈ కమిటీ సమావేశమై బిల్లుల చెల్లింపు ప్రక్రియను సమీక్షించాలని తెలిపింది. అర్జీదారు విషయంలో సీజీహెచ్ఎస్ అధికారులు అమానవీయంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఏ ఆస్పత్రిలో చికిత్స పొందారన్నది కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఆ చికిత్స పొందారనే అంశాన్నే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందంది. -
మీట నొక్కు..పింఛన్ పట్టు
ఖమ్మం, వైరా: విశ్రాంత ఉద్యోగులు పింఛన్ పొందాలంటే ఇక సులభ ప్రక్రియ అందుబాటులోకి వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్ డిజిటల్ ఇండియాలో భాగంగా..కేంద్ర ప్రభుత్వం జీవన్ ప్రమాణ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పెన్షనర్లు ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో జీవించి ఉన్నట్లు ధ్రవీకరణపత్రం (లైవ్ సర్టిఫికెట్) ఖజానా కార్యాలయాలు, బ్యాంకుల్లో విధిగా అందజేయాలి. వీటి కోసం వృద్ధులు ప్రతీ సంవత్సరం నానా కష్టాలు పడుతుంటారు. 10–15 రోజుల పాటు గెజిటెడ్ అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేది. పెన్షనర్ల బాధలను తొలగించాలనే సదుద్దేశంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బయోమెట్రిక్ ద్వారా జీవన ధ్రువీకరణ పత్రం పొందే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. జీవన్ ప్రమాణ్ అనే పోర్టల్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజేసే అవకాశమొచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర, సత్తుపల్లి, వైరా, నేలకొండపల్లి, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట పరిధిలో 12,500 మంది పైగా పెన్షన్షర్లు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దాదాపు 45వేల మందికి పైగా ఉన్నారు. వీరందికీ కొత్తగా కల్పించిన అవకాశం వల్ల ఇక ‘మేం జీవించి ఉన్నాం’ అని ప్రతిసారీ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా..బయోమెట్రిక్ యంత్రంపై మీటనొక్కితే చాలు. ఇక ఆగకుండా పెన్షన్ అందుతుంది. నమోదు ప్రక్రియ ఇలా.. www.jeevanpramaan.gov.in అనే వెబ్సైట్లో జీవన్ ప్రమాణ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు లభ్యమవుతాయి. సెల్‌ఫోన్ నంబర్, ఆధార్‌కార్డు సంఖ్య ఆధారంగా సమగ్ర వివరాలతో పేరు నమోదు చేసుకుంటే బయోమెట్రిక్ విధానం ద్వారా డిజిటల్ ధ్రువీకరణ పత్రం జారీ అవుతుంది. ఖాజానా, బ్యాంకు అధికారులు ఈ వెబ్సైట్ ద్వారా సంబంధిత పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్ సంఖ్య పెన్షన్ పేమేంట్ ఆర్డర్ బ్యాంకు ఖాతా సంఖ్య, ఫోన్‌నంబర్ వివరాలు పొందుపర్చాలి. ఆధార్‌లోని వేలిముద్రలు వైబ్సైట్లో తాజాగా నమోదు చేసే వేలిముద్రలు సరిపోతే పెన్షన్‌దారులకు రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు. సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశం అందుతుంది. ఆ తర్వాత జీవన్ ప్రమాణ్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య వస్తుంది. ఈ సంఖ్యలో ప్రత్యేక డిజిట్ «ధ్రువీకరణపత్రం జారీ అవుతంది. ఒక్కసారి జీవన్ ప్రమాణ్ డిజిటల్ ధ్రువీకరణ పత్రం జారీ అయితే..ఆ తర్వాత జీవన్‌ప్రమాణ్ పోర్టల్‌లో వేలిముద్రలు వేస్తే సరిపోతుంది. ప్రతి ఏటా కార్యాలయాలు, అధికారల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండదు. ఈ విషయాలు కీలకం.. సంబంధిత సైట్లోకి వెళ్లాక..హోమ్, ఎబౌట్, సెండ్యువర్ ఆధార్, గెట్ ఏ సర్టిఫికెట్ అనే వివరాలు కనిపిస్తాయి. ఎబౌట్ సైట్లో జీవన్ ప్రమాణ్ ధ్రువీకరణ పత్రం నమోదుకు సంబంధించిన వివరాలు పూర్తిగా పొందుపరిచారు. గెట్ ఏ సర్టిఫికెట్ సైట్లో పీసీల ద్వారా, ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ ద్వారా జీవనప్రమాణ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం ఉంది. తద్వారా పెన్షనర్లు ఇక ఏటా నవంబర్ నెల నుంచి వేలిముద్రలు వేసే అవకాశం లభిస్తుంది. -
రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త
గ్రాట్యుటీ వ్యత్యాసబకాయిల విడుదల ► రూ. 4 లక్షల వ్యత్యాసం చెల్లించేలా ఉత్తర్వులు జారీ ► 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన వారికి వర్తింపు సాక్షి, హైదరాబాద్: రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ సిఫారసుల ప్రకారం రిటైరైన ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీని ప్రభుత్వం రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచింది. సవరించిన గ్రాట్యుటీ 2014 జూన్ 2 నుంచే అమల్లోకి తెచ్చింది. 2015 మార్చి 1 నుంచి సవరించిన గ్రాట్యుటీని ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించింది. అయితే ఈ తొమ్మిది నెలల వ్యవధిలో రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 4 లక్షల చొప్పున గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో వ్యత్యాస బకాయిల చెల్లింపులకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు జీవో నం.79 జారీ చేశారు. 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన ఉద్యోగులకు ఈ బకాయిలు చెల్లించనున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో పొందుపరిచింది. తెలంగాణ స్టేట్ ఆడిట్ అకౌంటెంట్ జనరల్ అండ్ డైరెక్టర్ ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ట్రెజరీల అధికారులు, పెన్షన్ పేమెంట్ అధికారులు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ తొమ్మిది నెలల వ్యవధిలో రిటైరై, వ్యత్యాస బకాయిలు అందుకోకుండానే మరణించిన పెన్షనర్లు ఎవరైనా ఉంటే నిబంధనల ప్రకారం వారి వారసులకు ఈ బకాయిలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు యూనివర్సిటీ, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల టీచర్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. దాదాపు రూ.190 కోట్ల గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను చెల్లించాల్సి ఉన్నట్లుగా ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. -
వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్
కర్నూలు(రాజ్‌విహార్): ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీఎస్ఆ ఆర్టీసీ రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ రీజినల్ కార్యదర్శి పి. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కొత్త బస్టాండ్‌లోని రీజినల్ మేనేజరు కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013 ఏప్రిల్ నుంచి 2015 జూన్ మధ్య కాలంలో పదవీ విరమణ పొందిన కార్మికులు, ఉద్యోగులకు గ్రాట్యూటీ అరియర్స్ ఇప్పటి వరకు చెల్లించకపోవడం విచారకరమన్నారు. దీక్షల్లో ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్ఎస్ రావు, సుబ్బారాయుడు, ప్రసాద్, జీఎస్ వాసులు, ఎస్ఎ అజీమ్, జె. రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
సారూ.. మా మొర ఆలకించండి
- ఉన్నతాధికారులకు రిటైర్డ్ ఉద్యోగుల విజ్ఞప్తి - నాలుగు రోజులైనా అందని పింఛన్ - బ్యాంకుల వద్ద తప్పని పడిగాపులు - ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి నందికొట్కూరు: వివిధ శాఖల్లో పని చేసి పదవీ విరమణ చేసిన 1142 మంది పింఛనర్లకు ఈ నెల పింఛన్ అందెకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రూ, 500, రూ, 1000 నోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరత తీవ్రం కావడం, వచ్చిన డబ్బు గంటలోపే అయిపోతుండడంతో బ్యాంకులు నిత్యం నో క్యాష్ బోర్డుతో దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీలేక పోవడంతో పింఛన్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు బ్యాంకుల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి నగదు కోసం బారులు తీరుతున్నారు. గత నెలలో పింఛన్ బ్యాంకు ఖాతాకు జమ అయినప్పటికీ అవసరాలను బట్టి డ్రా చేసుకునేవారం. అయితే గత నెల 8వ తేది రాత్రి పెద్ద నోట్ల రద్దు కావడంతో అది కూడా తీసుకోలేకపోయామని వాపోతున్నారు. దీంతో నిత్యావసరాలు, కుటుంబ ఖర్చులకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నా అమలు కావడం లేదని చెబుతున్నారు. తమ సమస్య పరిష్కారానికి కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నాలుగు రోజులైనా నయా పైసా ఇవ్వలేదు: రాముడు బ్యాంక్‌లో పింఛన్ డబ్బులు నేటికీ ఒక పైసా చేతికి రాలేదు. నాలుగు రోజుల నుంచి బ్యాంక్‌కు వెళ్లడం, ఇంటికి ఒట్టి చేతులతో రావడం సరిపోయింది. ఇంట్లో నిత్యావసర సరుకులు అయిపోయాయి. వైద్య ఖర్చులకూ దిక్కులేదు: ప్రసాదరావు ప్రతి నెలా డాక్టర్ల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవలసి ఉంది. అందుకు అవసమైన డబ్బుల్లేక వెళ్లలేదు. బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిల్చొని డబ్బులు తీసుకునే శక్తి లేదు. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలి: సుబ్బదాస్ బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి పింఛనర్లకు డబ్బులు అందించాలి. డుబ్బులు లేక ఎంతో మంది పెన్షనర్లు ఏన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంక్ అధికారులు మాత్రం సీనియర్ సిటిజన్ల పట్ల స్పందించడం లేదు. -
అవిశ్రాంత సవారీ
సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగుల ఆదర్శం ఎటు వెళ్లినా సైకిల్‌పైనే.. కార్లు, బైక్లున్నా.. సైకిలే ఇష్టం సిరిసిల్ల: ఉరుకులు... పరుగుల జీవితంలో శారీరక శ్రమ తగ్గిపోతోంది. సరైన వ్యాయామం లేక మానసిక ప్రశాంతత కొరవడుతోంది. ఈ తరుణంలో సైకిల్ సవారీతో నిరంతరం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపొచ్చని నిరూపిస్తున్నారు సిరిసిల్లకు చెందిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులు. ఆరు పదుల వయసు దాటినా 20 ఏళ్ల యువకుల్లా ఎక్కడికి వెళ్లినా సైకిల్‌పై సవారీ చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వ్యాయామంలో భాగంగా సైకిల్‌పై సంచరిస్తూ అందరినీ పలకరిస్తున్నారు. రోజూ సైకిల్ తొక్కడమే తమ ఆరోగ్య రహస్యమని చెబుతున్న రిటైర్డు ఉద్యోగులపై ప్రత్యేక కథనం.. ఏళ్ల తరబడి సైకిల్‌పై.. ఒకటి.. రెండు రోజులో కాదు.. ఏళ్లకు ఏళ్లుగా సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగులు. ఇందులో కొందరు ఆర్థికంగా స్థిరపడి కార్లు, బైక్‌లు, మోపెడ్లు ఉన్నా వాటికి దూరంగా ఉంటూ సైకిల్‌పైనే ప్రయాణం చేస్తున్నారు. మార్కెట్లో కూరగాయల నుంచి కిరాణ సామగ్రి దాకా అన్నింటికీ సైకిలే. నిత్యం ఉదయం గంటసేపు సైకిల్ తొక్కుతూ యువకుల్లా ఉత్సాహంగా గడుపుతున్నారు. సిరిసిల్లలో పాతిక మంది రిటైర్డు ఉద్యోగులు ఎవరికి వారు తీరిక వేళల్లో సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. యువతకు ఆదర్శం.. ఏ చిన్న పనైనా.. కొద్దిపాటి దూరమైనా బైక్‌పై వెళ్తున్న ఈ రోజుల్లో యువతకు సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ పని అయినా సైకిల్‌పై వెళ్లి చేసుకుంటున్నారు. 60 ఏళ్ల వయసులోనూ అలుపెరగడకుండా సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 30 ఏళ్లు దాటగానే అనారోగ్యం బారిన పడుతున్న నేటితరం యువతకు అవిశ్రాంత సైకిలిస్టులు ఆదర్శంగా ఉన్నారు. సైకిల్ తొక్కడంతో చెమట వస్తుందని, గుండెవేగం పెరిగి శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. మోకాళ్లు, మడిమెల, కీళ్లనొప్పులు ఉండి వాకింగ్ చేయలేని వారికి సైతం సైకిల్ తొక్కమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంతో సిరిసిల్ల వీధుల్లో సైకిల్ సవారీతో రిటైర్డు ఉద్యోగులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచి.. 15 ఏళ్ల వయసు నుంచి నేను సైకిల్ తొక్కుతున్నా. నాకు పది మంది పిల్లలు. 1965లో పోస్టల్ శాఖలో చేరా. 2010లో రిటైర్ అయ్యాను. ఉద్యోగంలో ఉండగా.. నిత్యం సైకిల్‌పైనే ఉత్తరాలను పంచేవాడిని. అదే అలవాటుతో ఇప్పటికీ సైకిల్ తొక్కుతూనే ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. - అబ్దుల్ అజీమ్(75), పోస్టుమెన్ మనవడి సైకిల్ తొక్కుతున్నా.. మా మనవడి సైకిల్ నేను తొక్కుతున్న. రోజూ ఉదయం గంట సైకిల్ తొక్కుత. 2009లో ఉద్యోగ విరమణ చేశా. వ్యాయామం కోసం సైకిల్ తొక్కమని డాక్టర్లు చెప్పారు. మూడేళ్లుగా సైకిల్ తొక్కుతున్నా. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. మా మనవడి సైకిల్‌ను వాడుకుంటున్నా. ఉల్లాసంగా ఉంది. - మాణిక్‌రావు లక్ష్మీనారాయణ(68), రిటైర్డు ఉద్యోగి కారు, స్కూటర్ ఉన్నా.. నాకు కారుంది. స్కూటర్ ఎప్పటి నుంచో ఉంది. ఆరోగ్యం కోసం రోజూ సైకిల్ తొక్కుతా. ఉదయం వ్యాయామంలో భాగంగా సిరిసిల్ల వీధుల్లో సైకిల్ తొక్కుతా. కొందరు కొత్తగా చూశారు. కానీ నాకు అలవాటైంది. ఐదేళ్లుగా సైకిల్‌పైనే వ్యాయామం చేస్తున్నాను. పార్కింగ్ సమస్య ఉండదు. పెట్రోల్ అవసరం లేదు. అన్నింటికీ సైకిలే బెటర్. - గుడ్ల రవి(60), రిటైర్డు ఉపాధ్యాయుడు -
విశ్రాంత ఉద్యోగులను ఆదుకోవాలి
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ గుంటూరు (కొరిటెపాడు): న్యూఇండియా, యునైటెడ్ ఇండియా, ఓరియంటల్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీల విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు గురుమూర్తి కోరారు. అరండల్‌పేటలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన వైజాగ్ రీజియన్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగినప్పుడల్లా విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ పెరుగుతోందని, కానీ బీమా సంస్థల విశ్రాంత ఉద్యోగులకు అటువంటి సౌకర్యం కల్పించకపోవడం అన్యాయమన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. -
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
హజూర్‌నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహర దీక్షలు శనివారంతో 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూలకంటి నర్సిరెడ్డి రిలే దీక్షలు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఆలోచించి అన్ని అర్హతలు కలిగిన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంకతి అప్పయ్య, ఎంబి.దేవదానం, చెన్నా సోమయ్య, హనుమంతరావు, పురుషోత్తం, రఘునాథం, రామ్మోహన్రావు, నారాయణరెడ్డి, కలకుంట్ల రామయ్య, మాణిక్యం, సత్యనారాయణ, నర్సయ్య, జాన్, వేముల వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, సుధాకర్‌రెడ్డి, lంకయ్య, కాశయ్య, ధర్మూరి, అనంతరామశర్మ, ఎన్.వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్ పాల్గొన్నారు.