శేష జీవితం ప్రశాంతంగా గడపాలి | retired coal labour's felicitated | Sakshi
Sakshi News home page

శేష జీవితం ప్రశాంతంగా గడపాలి

Published Sat, Jul 30 2016 11:27 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

కార్మికుడిని సన్మానిస్తున్న అధికారులు - Sakshi

కార్మికుడిని సన్మానిస్తున్న అధికారులు

  • డీవైజీఎం కేవీ.సీతారామారావు
  • గనులపై రిటైర్డు కార్మికులకు సన్మానం
  • బెల్లంపల్లి : సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందుతున్న కార్మికులు శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని బెల్లంపల్లి సింగరేణి డీవైజీఎం(ఎక్స్‌ప్లోరేషన్‌) కేవీ.సీతారామారావు అన్నారు. శనివారం ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగంలో గంధం గట్టయ్య(టర్నర్‌), ఖాజామొహినోద్దీన్‌(డ్రైవర్‌) ఉద్యోగ విరమణ పొందారు. వీరికి డీవైజీఎం పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఎస్‌ఈ రమేశ్‌చందర్, శివనారాయణ, డీవైఎస్‌ఈ శ్రీనివాస్‌రావు, ఆఫీస్‌ ఇన్‌చార్జి పి.రాజమలు పాల్గొన్నారు.
    కాసిపేటగనిపై 
    కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేటగనిపై ట్రామర్‌ కోడి పెద్దులు, కోల్‌కట్టర్‌ రాంటెంకి రాజయ్య, జనరల్‌ మజ్దూర్‌ కార్మికుడు వేల్పుల గంగయ్య దంపతులను గని మైనేజర్‌ సైదులు, కార్మిక సంఘాల నాయకులు సన్మానించారు. రక్షణాధికారి అల్లావుద్దీన్, డెప్యూటీ మేనేజర్‌ సునిల్‌కుమార్, సంక్షేమాధికారి మైత్రేయ బందు, టీబీజీకేఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
     
    రామకృష్ణాపూర్‌లో..
    రామకృష్ణాపూర్‌ : మందమర్రి ఏరియాలోని ఆర్‌కే1ఏ గనిలో హాలర్‌ ఆపరేటర్లు ఎండీ.అంకూస్, సుంచు రాజయ్య, టెండాల్‌ సూపర్‌వైజర్‌ ఇర్రంకి రాము, ట్రామర్‌ ఓదెలు, డిప్యూటీ సూపర్‌వైజర్‌ అప్పారావు, కోల్‌ఫిల్లర్‌ రావుల సాంబయ్య, టింబర్‌మెన్‌ కార్మికుడు అప్పాల చంద్రయ్యలను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. గని మేనేజర్‌ కృష్ణారావు, రక్షణాధికారి రాంబరోస్‌ మహతా, సంక్షేమాధికారి భేతిరాజు పాల్గొన్నారు. 
     
    శ్రీరాంపూర్‌ ఏరియాలో.. 
    శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ ఏరియాలోని పలు గనులపై రిటైర్డ్‌ కార్మికులను ఘనంగా సన్మానించారు. శ్రీరాంపూర్‌ ఓసీపీలో పి.తిరుపతిరాజు(హెడ్‌ఓవర్‌మెన్‌)ను గని మేనేజర్‌ ఎం.నరేందర్‌ శాలువాతో సత్కరించారు. టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, గని రక్షణాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్టు అధికారి సీహెచ్‌.రవీందర్‌ పాల్గొన్నారు.
     
    ఆర్కే 6గనిపై..
    ఆర్కే 6 గనిపై జె.రామారావు(కోల్‌కట్టర్‌), యస్‌.దశరయ్య(ట్రామర్‌), గాజుల నర్సయ్య(జనరల్‌ మజ్ధూర్‌), ఏకుల రాజయ్య(జనరల్‌ మజ్ధూర్‌), అప్పాల లచ్చన్న(కోల్‌ఫిల్లర్‌), డి.వెంకటయ్య(కోల్‌ఫిల్లర్‌)లను గని మేనేజర్‌ ఎన్‌.సత్యనారాయణ శాలువాతో సత్కరించారు. గని రక్షణాధికారి సీహెచ్‌.శ్రీనివాస్‌రావు, ఫిట్‌ ఇంజినీర్‌ వీపీజే వెంకటేశ్, సంక్షేమ అధికారి శ్యాంప్రసాద్, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ బ్రాంచి సెక్రెటరీ పానుగంటి సత్తయ్య, ఫిట్‌ సెక్రెటరీ మేడారపు సత్తయ్య పాల్గొన్నారు.
     
    ఆర్కే 5 గనిలో..
    ఆర్కే 5 గనిలో రజ్జల వెంకటయ్య(జనరల్‌ మజ్ధూర్‌)ను గని మేనేజర్‌ జి.మల్లేశ్‌ శాలువాతో సత్కరించారు. గని డెప్యూటీ మేనేజర్‌ యస్‌కే సిన్హా, ఫిట్‌ ఇంజినీర్‌ రాధాకృష్ణ పాల్గొన్నారు.
     
    ఎస్సార్పీ 3, 3ఏ గనిలో..
    ఎస్సార్పీ 3, 3ఏ గనిలో వేముల శంకర్‌(కోల్‌కట్టర్‌), ఎండీ ఖాజాపాషా(ఎలక్ట్రీషియన్‌), పళ్ల రామస్వామి(ట్రామర్‌), రావుల రాయలింగు(హాలర్‌ ఆపరేటర్‌), దూలం చంద్రయ్య(కోల్‌కట్టర్‌)లను గని మేనేజర్‌ యన్‌.రమేశ్‌ శాలువాతో సత్కరించారు. గని మేనేజర్‌ డి.సతీశ్‌ పాల్గొన్నారు.
     
    రిటైర్డ్‌ అధికారికి సన్మానం..
    శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయంలో డెప్యూటీ సూపరిండెంట్‌ ఐ.సనత్‌కుమార్‌ను డీజీఎం(పర్సనల్‌) శర్మ, డీజీఎం జె.కిరణ్‌ శాలువాతో సత్కరించారు. డీవైపీఎం ఆజ్మీరాతుకారాం, టీబీజీకేఎస్‌ ఫిట్‌ సెక్రెటరీ రాళ్లబండి రాజన్న పాల్గొన్నారు. 
     
    మందమర్రి ఏరియాలో.. 
    మందమర్రి : మందమర్రి ఏరియాలోని వివిధ గనులు, డిపార్టుమెంట్లలో శనివారం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులను ఆయా గని ఆవరణలో ఏర్పాటు సన్మానించారు. కేకే–5 గనిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ చింతల శరత్‌ చంద్ర, కోల్‌కట్టర్‌ కూరపు కోంరయ్యలను శాలువాతో సన్మానించారు. గని మేనేజర్‌ రాంమోహన్‌ పాల్గొన్నారు.
     
    ఖైరిగూడ ఓసీపీలో..
    రెబ్బెన : ఖైరిగూడ ఓసీపీలో ఓసీపీలో జనరల్‌ మజ్దూర్‌ పవిసెట్టి సారయ్య దంపతులను ఓసీ మేనేజర్‌ శ్రీరమేష్‌ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఫిట్‌ ఇంజనీరు అహ్మద్‌ అలీ, వెల్ఫేర్‌ అధికారి సాదన్, సేఫ్టీ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 
     
    గోలేటి–1ఏలో.. 
    తాండూర్‌ : ఏరియా గోలేటీ–1ఏ గనిలో బంధం రాజన్న(మైనింగ్‌ సర్దార్‌), ఎం.రామపోశం(ఫోర్‌మెన్‌), మురళయ్య(క్లర్క్‌), దుర్గం ఇస్తారి(సపోర్టు మజ్దూర్‌), మేడం శంకరయ్య(టింబర్‌మెన్‌), పల్లె పోశం(జనరల్‌ మజ్దూర్‌), జుమ్మిడి చంద్రయ్య(లైన్‌మెన్‌), నలివేలి రాయమల్లు(కోల్‌కట్టర్‌)లను గోలేటీ గ్రూ‹ఫ్‌ ఆఫ్‌ మైన్స్‌ ఏజెంట్‌ దేవేందర్, మేనేజర్‌ మహేశ్‌ సన్మానించారు. వెంటిలేషన్‌ ఆఫీసర్‌ గుప్తా, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ శంకర్, వెల్ఫేర్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్, టీబీజీకేఎస్‌ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్రాజ్‌ శ్రీనివాస్‌రావు, ఏరియా కార్యదర్శి బైరి శంకర్, ఫిట్‌ కార్యదర్శి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement