వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ | Demand for payment of arrears | Sakshi
Sakshi News home page

వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌

Published Mon, Dec 19 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌

వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌

కర్నూలు(రాజ్‌విహార్‌): ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీఎస్‌ఆ ఆర్టీసీ రిటైర్డు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రీజినల్‌ కార్యదర్శి పి. చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక కొత్త బస్టాండ్‌లోని రీజినల్‌ మేనేజరు కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013 ఏప్రిల్‌ నుంచి 2015 జూన్‌ మధ్య కాలంలో పదవీ విరమణ పొందిన కార్మికులు, ఉద్యోగులకు గ్రాట్యూటీ అరియర్స్ ఇప్పటి వరకు చెల్లించకపోవడం విచారకరమన్నారు. దీక్షల్లో ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్‌ఎస్‌ రావు, సుబ్బారాయుడు, ప్రసాద్, జీఎస్‌ వాసులు, ఎస్‌ఎ అజీమ్, జె. రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement