ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణం | RTC retired employees got free journey facility | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణం

Published Thu, Jan 28 2016 10:42 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణం

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణం

విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని 36 వేల మంది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఎస్‌ఆర్టీసీ కర్షకపరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వరహాలనాయుడు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్రాంత ఉద్యోగితో పాటు భార్యకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్టు పేర్కొన్నారు.

ప్యాసింజర్ సర్వీసు నుంచి డీలక్స్ వరకు ఉచిత ప్రయాణం, ఆపై సర్వీసుల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించే అవకాశం ఉందని వరహాలనాయుడు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీని ఆర్టీసీ యాజమాన్యం నిలబెట్టుకోవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement