free Journey
-
మనం అసలు సమీక్షలు చేయాల్సిన అవసమే లేద్సార్! అమలు చేయలేదు కాబట్టి!
మనం అసలు సమీక్షలు చేయాల్సిన అవసమే లేద్సార్! అమలు చేయలేదు కాబట్టి! -
TG: ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాల ఫ్రీ పాస్
సాక్షి,హైదరాబాద్: రాఖీ పౌర్ణమి రోజు గద్వాల డిపో ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.ఆర్టీసీ బస్సులు, బస్స్టేషన్లలలో పుట్టిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా ఈ చిన్నారికి ఉచిత బస్‌పాస్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.ప్రసవం చేసిన స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాదిపాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం (ఆగస్టు20) ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గర్భిణీకి పురుటినొప్పులు రావడంతో కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ భారతి, డ్రైవర్ అంజిలతోపాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. -
కేటీఆర్ కామెంట్స్‌పై మహిళా కమిషన్ సీరియస్
హైదరాబాద్, సాక్షి: ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్.. త్వరలో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.మరోవైపు.. తెలంగాణ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. బేషరతుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్స్‌లు చేసుకోవచ్చంటూ కేటీఆర్ అత్యంత హీనంగా మాట్లాడారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు తన తండ్రి నేర్పించిన సంస్కారం ఇదేనా? అని సీతక్క ప్రశ్నించారు. మహిళలపై కేటీఆర్‌కు గౌరవం లేదన్నది ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందని చెప్పారు. అదే సమయంలో.. రవాణా మంత్రి పొన్నం సైతం కేటీఆర్‌పై రాష్ట, జాతీయ మహిళా కమిషన్లు కేసు నమోదు చేయాలంటూ కోరారు. -
APSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై క్లారిటీ
ఎన్టీఆర్, సాక్షి: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టీసీకి నష్టం రాకుండా ఆ భారమంతా తెలంగాణ ప్రభుత్వమే భరించనుంది. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో APSRTC స్పందించింది. ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇక.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపిన ఆయన.. రాను పును బుక్ చేసుకుంటే పది శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఇక మరో నాలుగు నెలల్లో 1,500 కొత్త బస్సులు రాబోతున్నాయని, త్వరలో సరికొత్త హంగులతో సూపర్ లగ్జరీ బస్సులు వస్తాయని ఆయన అన్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా గురువారం నుంచి డోర్ పిక్ అప్ అండ్ డోర్ డెలివరీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ. గతంలో డోర్ డెలివరీ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుని నిర్వహించేదని.. ఇప్పుడు ఆర్టీసీనే స్వయంగా చేయనుందని చెప్పారాయన. రోజుకు డోర్ డెలివరీ సర్వీస్ లు 25వేలకు పైగా జరుగుతున్నాయని.. ప్రస్తుతానికి విజయవాడలో మాత్రమే పికప్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ముఖ్యనగరాలకు ఆ సేవల్ని విస్తరిస్తామని తెలిపారు. -
TS: కండక్టర్‌తో మహిళా వాగ్వాదం.. రెండూ ఒకటే కదా..
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సేవలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పట్ల చోట్ల బస్సుల్లో కండక్టర్లకు మహిళలకు, డ్రైవర్లకు మహిళలు మధ్య వాగ్వాదాలు జరుగుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ యువతి ఫోన్లో ఆధార్ కార్డు నంబర్ చూపి.. బస్సులో ప్రయాణానికి అనుమతి ఇవ్వావాలని కండక్టర్‌తో గొడవకు దిగింది. అక్కడితో ఆగకుండా ఒరిజినల్ ఆధార్, ఫోన్లో ఉండే ఆధార్ నంబర్ ఒకటే కాదా అని కండక్టర్‌తో వాదించింది. దీని సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అయితే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే.. కచ్చింతంగా ఆధార్ కార్డు/ ఓటర్ ఐడీ కార్డు/ పాస్ పోర్టు వంటి గుర్తింపు కార్డులు చూపించాలని మార్గదర్శకాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కండక్టర్లు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా చూపించాలని మహిళలను కోరుతున్నారు. ఇటువంటి సమయంలోనే పలు చోట్లు బస్సుల్లో గొడవలకు దారి తీస్తోంది. బస్సుల్లో ఉచిత ప్రయాణం పలు చోట్ల గొడవలకు దారి తీస్తోంది. ఉచితంగా ప్రయాణించాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు/ఓటర్ ఐడీ/పాస్ పోర్ట్ లాంటి ఒక గుర్తింపు కార్డు ఉండాలని అంటున్న కండక్టర్లు. అయితే ఓ యువతి ఫోన్లో ఆధార్ నంబర్ చూపించడంతో కండక్టర్ పర్మిషన్ ఇవ్వట్లేదు. దీంతో ఆమెకు, కండక్టర్ కు… pic.twitter.com/CYSYFMbZZV — Telugu Scribe (@TeluguScribe) December 27, 2023 -
TSRTC: పల్లె వెలుగులు ఎక్కువగా వాడుకోండి: సజ్జనార్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణం అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తున్నాం. మరోవైపు ఫ్రీ జర్నీ కల్పిస్తూనే.. బస్సుల సంఖ్యను తగ్గించదనే విమర్శ టీఎస్ ఆర్టీసీ ఎదుర్కొంటోంది. అయితే అలాంటిదేం లేదని.. బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఒక ప్రకటన చేశారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అయితే అది మరోలా ఉంటోందని చెబుతున్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరుతూ ఓ వీడియోను ఉంచారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని అన్నారయన. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. -
TSRTC: ‘ఫ్రీ జర్నీ సరే.. మరి మాకు సీట్లుంటలేవ్!’
వైరల్: ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణం సదుపాయం.. కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది. మహిళలతో బస్సులు కిటకిటలాడిపోతుండగా.. అదే సమయంలో సీట్లు లేక మగవాళ్లు స్టాండింగ్ జర్నీలతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడో యువకుడు రోడ్డెక్కి బస్సుకు అడ్డం తిరిగాడు. ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో పురుషులకూ ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో చోటుచేసుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మంచి విషయమే అయినా.. మగవాళ్లను కూడా ప్రభుత్వం కాస్త పట్టించుకోవాలని కోరుతున్నాడు. దీంతో బస్సులు నిండుగా ఉంటున్నాయని, పురుషులకు బస్సుల్లో వసతి లేకుండా పోయిందని, సీట్లు ఉండటం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బస్సుల్లో కనీసం 15 సీట్లు పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా.. మగజాతి ఆణిముత్యం అంటూ కొందరు సరదాగా ఆ యువకుడిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. -
ఫ్రీ జర్నీ.. తెలంగాణ మహిళలకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలకు అలర్ట్. నవంబర్ 15 అంటే రేపు శుక్రవారం నుంచి ప్రయాణాల్లో ఆధార్ సహా ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సిందే. కండక్టర్లకు ఆ కార్డుల్ని చూపించడంతో పాటు.. జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికులకు సూచించింది. ఉదయం నుంచి ఈ నిబంధన అమలు అవుతుందని తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ 9న ఈ స్కీమ్ ప్రారంభం అయ్యింది. అయితే తొలివారం గుర్తింపు కార్డు అక్కర్లేకుండానే ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత మాత్రం ఏదైనా గుర్తింపు కార్డు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పర్యవేక్షించారు. గురువారం వర్చువల్‌గా అధికారులతో సమావేశమైన ఆయన.. కండక్టర్లు జీరో టికెట్ జారీ చేయాలని, ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ తీసుకోవాలని కోరారు. ప్రస్తుతానికి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పథకం విజయవంతంగా అమలు అవుతోందని.. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేశారని అధికారుల్ని అభినందించారాయన. ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు @TSRTCHQ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC) తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో… pic.twitter.com/XgPKGPqtpf — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 14, 2023 మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ జర్నీ స్కీమ్ కింద.. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు, సిటీలో ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించే వీలు ఉంది. తెలంగాణ వాళ్లకు(గుర్తింపు కార్డు ఉండాల్సిందే) మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. -
మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అసెంబ్లీ వద్ద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, యువతులు ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. అలాగే, రాజీవ్ ఆరోగ్యశ్రీ(చేయూత)ని ప్రారంభించిన సీఎం, మంత్రులు. దీంతో, ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మహాలక్ష్మీ పథకం అమలులోకి రానుంది. తెలంగాణలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ఆవరణలో మూడు బస్సులు ప్రారంభమయ్యాయి. ఇక, ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వైద్యఖర్యులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. మంత్రులు సీతక్క, కొండా సురేఖ పచ్చజెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నేడు సోనియా గాంధీ పుట్టినరోజు. డిసెంబర్ 9 తెలంగాణకు పండుగ రోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా నెరవేర్చారు. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశాన్ని సోనియా మనకు ఇచ్చారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. తెలంగాణవ్యాప్తంగా మహాలక్ష్మీ పథకం అమలులోకి వస్తుంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు గ్యారంటీలను అమలుచేస్తున్నాం అని అన్నారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ మంత్రులు, మహిళ నేతలు బస్సులో ట్యాంక్ బండ్‌కు బయలుదేరారు. దీంతో, అక్కడ సందడి వాతావరణం చోటుచేసుకుంది. ఇక, నేటి మధ్యాహ్నం నుంచి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. నిఖత్ జరీన్‌కు ప్రోత్సాహకం.. అలాగే, బాక్సర్ జఖర్ ఘరీన్‌కు రూ. 2కోట్ల చెక్‌ను సీఎం రేవంత్ అందించారు. వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి. -
‘ఉచిత ప్రయాణానికి’ ఏర్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం ఎలా అమలవుతోంది, అక్కడ ఎంత ఖర్చవుతోంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తోంది..అన్న విషయాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం బెంగళూరుకు వెళ్తోంది. రెండు రోజుల పాటు అక్కడ పరిశీలించి నివేదికను సిద్ధం చేయనుంది. అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావటంతో అధికారులు పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కొలువుదీరబోతోంది. దీంతో వీలైనంత తొందరలో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నందున, ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో కూడా అమలు చేస్తే.. దక్షిణాదిలో తొలుత తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించారు. కానీ అక్కడ, కేవలం నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చారు. వాటిల్లోనే ఈ వెసులుబాటు ఉంటుంది. కానీ, కర్ణాటకలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని ప్రకటించింది. అధికారంలోకి రావటంతో దాన్ని అమలులోకి తెచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ కర్ణాటక మోడల్‌ను అనుసరిస్తుందా, తమిళనాడు మోడల్‌ను చేపడుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్లు అవుతుంది. పల్లెవెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా రూ.750 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సింది ప్రతినెలా దాదాపు రూ.185 కోట్లు .. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే, ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ కేటగిరీ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే సాలీనా రూ.2200 కోట్ల వరకు రీయింబర్స్ చేయాలి. అంటే ప్రతి నెలా రూ.185 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. జీరో టికెట్ ప్రవేశపెడతారా..? ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారన్నది లెక్క తేలాల్సి ఉంటుంది. ఇందుకోసం కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రారంభించారు. మహిళలకు రూ.సున్నా అని ఉండే జీరో టికెట్‌ను జారీ చేస్తారు. అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారు. ఇక్కడ అదే పద్ధతి ప్రవేశపెడతారా లేక మరో విధానాన్ని అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
6 గ్యారెంటీల అమలుపై అనుమానాలు...?
హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఇక సర్కారు కొలువుదీరడమే తరువాయి. సీఎం అభ్యర్థిపై ఇప్పటికే ఆ పార్టీ అధి ష్టానం చర్చలు జరుపుతోంది. త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఫలితాలు వెలువడి రోజైనా గడవక ముందే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై జనాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏయే హామీలు ఇచ్చింది.. ఎలా అమలు చేస్తుంది.. అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. రూ.500లకే గ్యాస్ సిలిండర్, పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ హామీల్లో ప్రధానమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అప్పుడే పుకార్లు షికారు చేస్తున్నాయి. బస్సుల్లో మహిళలు టిక్కెట్లు తీసుకోవద్దని, మహిళలకు డబ్బులు వస్తాయని.. ఇలా పలు రకాల ప్రచారాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఆరు గ్యారంటీలపై... కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరక ముందే పార్టీ పేర్కొన్న పథకాలపై ప్రచారం షురూ అయ్యింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2500 నగదుపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందిస్తున్న ఆసరా పింఛన్ ఉంటుందా?.. దానికే రూ.500 కలిపి అందిస్తారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సైతం మహిళల్లో ఆసక్తి నెలకొంది. ఇందిరమ్మ ఇండ్ల కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, రైతు భరోసా కింద ఏటా రూ.15 వేలు, రైతు కూలీలకు ఏటా రూ.12వేలు, వరిపంటపై రూ.500 బోనస్, తదితర అంశాలపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. తాము అధికారంలోకి వస్తే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామన్న హామీపై నిరుద్యోగుల్లో ఆశలు నెలకొన్నాయి. యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు రూ.5లక్షల వరకు విద్యాభరోసా కార్డు, చేయూత కింద వృద్ధులకు రూ.4వేల పింఛన్, రూ.10 లక్షల ఆరోగ్యబీమా, తదితర గ్యారంటీ హామీలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. -
గుడ్‌న్యూస్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
TSRTC Offers To Travelers: దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఫ్రీగా ప్రయాణించే గొప్ప అవకాశం టీఎస్ ఆర్టీసీ కల్పించిందని భెల్ డిపో మేనేజర్ సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్టణం, కాకినాడ, భద్రాచలం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు, 250 కిలోమీటర్ల దూరం మించి ఉన్న ప్రాంతాలకు ఆన్లైన్ లేదా బుకింగ్ కేంద్రాల వద్ద రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ అవకాశం పొందవచ్చన్నారు. ముందుగా బుక్ చేసుకున్న బస్సు బయలుదేరే టైం వరకు రెండు గంటల ముందు నగరంలో ఏ ప్రాంతం నుంచైనా బస్సు ఉన్న చోటుకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. నాన్ ఏసీ బుక్ చేసుకున్న ప్రయాణికులు నాన్ ఏసీ సిటీ సర్వీసుల్లో, ఏసీ బస్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏసీ సర్వీస్‌ల్లోనూ, నాన్ ఏసీ బస్సుల్లోను ప్రయాణించే వెసులుబాటు ఉందని తెలిపారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చే ప్రయాణికులకు కూడా వారు షెడ్యూల్డ్ టైం నుంచి 2 గంటలలోపు వారి గమ్యస్థానాలకు చేరుకునే వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. టీఎస్ ఆర్టీసీ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చదవండి: (నిలోఫర్‌లో ఇద్దరు చిన్నారుల మృతి? ఉద్రిక్తత) -
ఉచితాలతో నష్టాల్లోకి నెట్టేస్తారా?
న్యూఢిల్లీ: మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసలు మెట్రోలో ఉచిత ప్రయాణం ఎందుకు? ఇలా ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల భవిష్యత్తులో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్సీ)ను నష్టాల బాటలో నడిపిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘ఉచిత’ నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, ఇలాంటి ఉచిత తాయిలాలను ఉపేక్షించబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఢిల్లీలో నాలుగో ఫేజ్‌లో భాగంగా త్వరలో చేపట్టే మెట్రో విస్తరణ కోసం భూసేకరణ చేయాలని, దానికి అయ్యే వ్యయంలో సగం కేంద్రం భరించాలని ‘ఆప్’ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత ప్రయాణాల వల్ల దీర్ఘకాలంలో నష్టాలు తప్పవని, ఇలాంటి హామీలనిస్తూ కేంద్రం ఈ ఖర్చునంతా భరించాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మెట్రో, బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని గతంలో ప్రకటించడం తెల్సిందే. -
ఉచిత ప్రయాణానికి నో చెప్పిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కేజ్రీవాల్ సర్కార్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధానిలో మెట్రో, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రతిపాదనను కేంద్రం గురువారం తిరస్కరించింది. కాగా ఏడాది చివరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల జరుగునున్న విషయం తెలిసిందే. దానిని దృష్టిలో ఉంచుకుని పలు పథకాలకు ఆప్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత రవాణ సౌకర్యాన్ని కల్పించింది. ఇందుకు అయ్యే ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని.. వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా కేంద్రం తాజా నిర్ణయంతో కేజ్రీవాల్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చదవండి: త్వరలో మహిళలకు మెట్రోలో ఫ్రీ జర్నీ ఢిల్లీ మహిళలకు శుభవార్త -
త్వరలో మహిళలకు మెట్రోలో ఫ్రీ జర్నీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ సర్కారు ప్రతిపాదించిన మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తేవడానికి ఢిల్లీ మెట్రో దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలు రూపొందించింది. సాఫ్ట్వేర్ మార్చి టోకెన్లు, స్మార్ట్‌కార్డులు రెండింటినీ మహిళా ప్రయాణీకులు ఉపయోగించేలా చేయడమనేది దీర్ఘకాల ప్రణాళిక కాగా, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక టికెట్ వెండింగ్ మిషన్లు, ప్రత్యేక ప్రవేశ గేట్లు ఏర్పాటుచేసి వారికి పింక్ టోకెన్లు జారీ చేయాలని స్వల్పకాలిక ప్రణాళికలో సూచించారు. దీర్ఘకాల ప్రణాళికను అమలు చేయడానికి సంవత్సరానికి పైగా సమయం పడుతుందని, స్వల్పకాలిక ప్రణాళికను అమలుచేయడానికి కనీసం ఎనిమిది నెలల సమయం కావాలని ఢిల్లీ మెట్రో తెలిపిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అయితే కేంద్రం నియమించిన చార్జీల నిర్థారణ కమిటీ ఈ ప్రణాళికను అమోదించవలసి ఉంటుందని ఆ తరువాతనే తాము ఈ ప్రణాళికను అమల్లోకి తేగలమని ఢిల్లీ మెట్రో ఢిల్లీ సర్కారుకు సూచించింది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత 30 శాతమున్న మెట్రో మహిళా ప్రయాణీకుల సంఖ్య 50 శాతానికి పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. -
ఢిల్లీ మహిళలకు శుభవార్త
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీ శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దానిలోభాగంగా రాజధానిలో బస్సు, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘ఢిల్లీలో డిటీసీ, క్లస్టర్ బస్సులు, ఢిల్లీ మెట్రోలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. వారి ప్రయాణ ఖర్చుల్ని ప్రభుత్వం భరిస్తుంది’ అని సోమవారం ఢిల్లీలో కేజ్రీవాల్ చెప్పారు. 2, 3 నెలల్లో దీన్ని అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 8 వందల కోట్ల భారం పడుతుందన్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో రోజూ పాతిక లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఉచిత ప్రతిపాదన వల్ల ప్రయాణికుల సంఖ్య మరో లక్ష పెరిగే అవకాశం ఉందన్నారు. నగరంలో 1.50 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు ఆమోదించామని తెలిపారు.ఈ డిసెంబరు నాటికి 70వేల కెమెరాలు అమర్చుతామన్నారు. కాగా, ఉచిత ప్రయాణ ప్రతిపాదనపై వ్యాఖ్యానించడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిరాకరించింది. -
'ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం'
విజయవాడ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కొత్త బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వెల్లడించారు. మే 15 నుంచి విజయవాడ కేంద్రంగా ఏపీఎస్ ఆర్టీసీ కార్పొరేట్ ఆఫీస్ కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఆదివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లోని ఆఖరి రెండు వరుసలకు ఛార్జీలో 20 శాతం తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. మార్చి ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా 81 ఆర్టీసీ బస్టాండ్ల ఆధునీకరణ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది వందకోట్ల మేరకు నష్టాలు తగ్గినట్టు తెలిపారు. ఆపరేషన్ నష్టాలను పూర్తి స్థాయిలో అధిగమించమన్నారు. 250 కిలీమీటర్లు ప్రయాణించినవారికి చుట్టుపక్కల తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ప్రకటించారు. -
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణం
విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని 36 వేల మంది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఎస్ఆర్టీసీ కర్షకపరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వరహాలనాయుడు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్రాంత ఉద్యోగితో పాటు భార్యకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ప్యాసింజర్ సర్వీసు నుంచి డీలక్స్ వరకు ఉచిత ప్రయాణం, ఆపై సర్వీసుల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించే అవకాశం ఉందని వరహాలనాయుడు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీని ఆర్టీసీ యాజమాన్యం నిలబెట్టుకోవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అంబరాన్నంటిన ఆర్టీసీ సంబరాలు
మహబూబ్‌నగర్ అర్బన్ : వారంరోజుల పాటుసమ్మెలో పాల్గొన్న కార్మి కులు బుధవారం ఎట్టకేలకు విధుల్లో చేరారు. 44 శాతం ఫిట్మెంట్తో పాటు మరిన్ని అనూహ్య ఆర్థిక వెసులుబాట్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సమ్మెను విరమించారు. ఏం చేస్తారోనన్న దిగులుతో జిల్లాలో ఉన్న 4450 మంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అడిగిన దాని కంటే ఒకశాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి సీఎం సంకేతాలు పంపారని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం నుంచి సమాచారం అందడంతో జిల్లా నాయకులు టపాసులు పేల్చి, రంగులు చల్లుకుని సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో ఉన్న 9 బస్ డిపోల పరిధిలో కార్మికులు ఆనందోత్సాహాలను పంచుకున్నారు. చాలాచోట్ల కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు రాజసింహుడు, డీఎస్‌చారి, బసప్ప, కొండయ్య, నారాయణమ్మ, సాయిరెడ్డి, వీరాంజనేయులు మాట్లాడుతూ..సీఎం 44శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి అంగీకరించి తమపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారని అన్నారు. రిటైర్డ్ కార్మికులకు ఆర్డనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పూర్తి ఉచిత ప్రయాణం కల్పించడం ఆర్టీసీ చరిత్రలో గొప్ప నిర్ణయమన్నారు. ఏడో రోజు కొనసాగిన సమ్మె.. ఆర్టీసీ కార్మికులు జిల్లావ్యాప్తంగా ఏడో రోజు సమ్మెను ఉధృతంగానే కొనసాగించారు. వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి నిరసన తెలిపారు. అధికారులు మాత్రం పోలీసుల సహాయంతో సుమారు 250కిపైగా బస్సులను నడిపి తమ పట్టుదలను నెగ్గించుకున్నారు. గత వారం రోజులుగా జరిగిన సమ్మె కారణంగా సంస్థకు జిల్లాలో దాదాపు రూ.ఐదుకోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అధికారుల అంచనా. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, గ్యారేజ్ కార్మికులు, మినిస్ట్రియల్ సిబ్బంది సుమారు 4450 మంది సమ్మెలో పాల్గొనగా ఆర్ఎం, డిప్యుటీ సీటీఎం, డిప్యుటీ సీఎంఈ, తొమ్మిది మంది డీఎంలతోపాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మాత్రం విధులు నిర్వహించారు. కాగా, సమ్మె విరమించినట్లు జేఏసీ ప్రకటించడంతో గత షెడ్యూల్ ప్రకారం నైట్‌హాల్ట్ బస్సుల విధుల్లో కార్మికులు చేరారు.