TG: ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాల ఫ్రీ పాస్‌ | Telangana Rtc Free Lifetime Bus Pass To Child Born In Bus | Sakshi
Sakshi News home page

TG: ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాల ఫ్రీ పాస్‌

Published Tue, Aug 20 2024 8:04 PM | Last Updated on Tue, Aug 20 2024 8:24 PM

Telangana Rtc Free Lifetime Bus Pass To Child Born In Bus

సాక్షి,హైదరాబాద్‌: రాఖీ పౌర్ణమి రోజు  గద్వాల డిపో ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ అందిస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

ఆర్టీసీ బస్సులు, బస్‌స్టేషన్లలలో పుట్టిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్‌పాస్‌ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా ఈ చిన్నారికి ఉచిత బస్‌పాస్‌ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.

ప్రసవం చేసిన స్టాఫ్‌ నర్స్‌ అలివేలు మంగమ్మకు డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో ఏడాదిపాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మంగళవారం (ఆగస్టు20) ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. 

బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గర్భిణీకి పురుటినొప్పులు రావడంతో కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్‌ భారతి, డ్రైవర్‌ అంజిలతోపాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement