life time
-
TG: ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాల ఫ్రీ పాస్
సాక్షి,హైదరాబాద్: రాఖీ పౌర్ణమి రోజు గద్వాల డిపో ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.ఆర్టీసీ బస్సులు, బస్స్టేషన్లలలో పుట్టిన పిల్లలకు జీవితకాలం ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా ఈ చిన్నారికి ఉచిత బస్‌పాస్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.ప్రసవం చేసిన స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాదిపాటు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం (ఆగస్టు20) ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో గర్భిణీకి పురుటినొప్పులు రావడంతో కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ భారతి, డ్రైవర్ అంజిలతోపాటు నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. -
కాలు జారిన మోడల్.. షూ కంపెనీదే తప్పంటోంది!
లండన్‌కు చెందిన ఒక మోడల్ ఊహకందని రీతిలో ప్రమాదం బారినపడింది. దీంతో ఆమె జీవితాంతం హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆ మోడల్ సదరు షూ కంపెనీపై £ 100,000 (సుమారు ఒక కోటి రూపాయలు) నష్టపరిహారం కోసం కేసు వేసింది. ఆ షూ కంపెనీకి చెందిన హీల్స్ ధరించడం కారణంగానే తాను ప్రమాదం బారినపడినట్లు ఆ మోడల్ తెలిపింది. న్యూస్ సైట్ ది మిర్రర్ నివేదిక ప్రకారం 31 ఏళ్ల క్లో మికెల్‌బరో 2018లో మిలన్లోని డిజైనర్ బేస్‌లో ప్రకటనల షూట్లో పాల్గొంది. వాక్‌వేపై నడుచుకుంటూ వెళ్తుండగా కాలు స్లిప్ అయి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మోడల్ కాలి మడమ విరిగింది. తీవ్రమైన నొప్పి, కాలు వాపుతో ఆమె చాలా రోజులు మంచం మీదనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆమెకు హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో క్లో ఆ షూ కంపెనీ నుంచి పరిహారం పొందేందుకు కోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇకపై తాను ఎవరికీ డాన్స్ నేర్పించలేనని, తానూ డ్యాన్స్ చేయలేనని, పరిగెత్తలేనని కోర్టు ముందు మొరపెట్టుకుంది. అయితే స్టెల్లా మాక్కార్ట్నీ లిమిటెడ్ షూ కంపెనీ ఆమె వాదనను ఖండించింది. కంపెనీ తరపు న్యాయవాది మైఖేల్ పాట్రిక్ తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు నడక మార్గంలో ప్రమాదం జరిగింది. ఆమె తన బరువును నియంత్రించుకోలేక పడిపోయింది. కాగా కేసు కోర్టు విచారణలో ఉంది. ఇది కూడా చదవండి: ఆ గ్రామం కేన్సర్ నిలయంగా ఎందుకు మారింది? -
యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం
వెల్లింగ్టన్: ఆరోగ్యాన్ని హరించే పొగాకు వినియోగాన్ని అరికట్టడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం యువత ఇకపై సిగరెట్లు కొనడానికి వీల్లేదు. వారు సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం విధించారు. 2009 జనవరి 1న, ఆ తర్వాత జన్మించినవారంతా సిగరెట్లకు దూరంగా ఉండాలి. వారికి ఎవరైనా సిగరెట్లు విక్రయిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. కొత్త చట్టం వల్ల సిగరెట్లు కొనేవారి సంఖ్య ప్రతిఏటా తగ్గిపోతుందని, తద్వారా దేశం పొగాకు రహితంగా మారుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో సిగరెట్లు విక్రయించేందుకు అనుమతి ఉన్న రిటైలర్ల సంఖ్యను కొత్త చట్టం కింద 6,000 నుంచి 600కు కుదించింది. సిగరెట్లలో నికోటిన్ పరిమాణాన్ని తగ్గించింది. ఉపయోగించినవారిని భౌతికంగా అంతం చేసే సిగరెట్లను విక్రయించడానికి అనుమతించడంలో అర్థం లేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఆయేషా వెరాల్ చెప్పారు. ఇదీ చదవండి: అనంత శక్తిని ఒడిసిపట్టే... దారి దొరికింది! -
సంచలన నిర్ణయం.. సిగరెట్లపై జీవితకాల నిషేధం!
For Future Generations New Zealand To Ban Cigarettes: రాబోయే తరాల ఆయుష్షు పెంచేందుకు, ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీనేజర్లు సిగరెట్లు కొనడానికి, టీనేజర్లకు సిగరెట్లు అమ్మడాన్ని నిషేధిస్తూ చట్టం చేయనుంది అక్కడి ప్రభుత్వం. వచ్చే ఏడాది నుంచి అమలు కానున్న ఈ చట్టంలోని ‘మెలిక’ ద్వారా అక్కడ యువత జీవితాంతం పొగతాగడానికి దూరం కావడం ఖాయం!. న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకురాబోయే యాంటీ స్మోకింగ్ బిల్లు వచ్చే ఏడాది చట్టం కానుంది. 14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు వాళ్లకు సిగరెట్లు అమ్మడాన్ని అక్రమ కార్యకలాపంగా భావిస్తుంది అక్కడి ప్రభుత్వం. అంటే 2008 తర్వాత పుట్టిన వాళ్లెవరూ సిగరెట్లు కొని తాగడానికి, వాళ్లకు ఎవరూ సిగరెట్లు అమ్మడానికి వీల్లేదు. ఈ మేరకు 2027 నుంచి ఈ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలనే ప్రతిపాదన చేసింది. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏడాది సిగరెట్ కొని తాగేందుకు నిర్ధారించిన కనీస వయసును పెంచుకుంటూ పోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆ వ్యక్తి జీవిత కాలం సిగరెట్ కొని తాగడానికి.. దుకాణదారులు ఆ వ్యక్తిని సిగరెట్ అమ్మడానికి వీల్లేకుండా పోతుంది. టార్గెట్ విఫలం కావడంతోనే.. యువత ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు తమ జీవిత కాలంలో సిగరెట్ కాల్చకుండా.. వాళ్లకు ఎవరూ అమ్మకుండా ఇలా కఠిన చట్టం తీసుకురాబోతోందన్నమాట. గురువారం ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది న్యూజిలాండ్ ప్రభుత్వం. నిజానికి స్మోకింగ్ అలవాటును తగ్గించే ప్రయత్నాల్లో న్యూజిలాండ్ సర్కార్ ఎప్పటి నుంచో గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్లేయిన్ సిగరెట్ ప్యాకింగ్ తప్పనిసరి చేసిన 17 దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. అలాగే పద్దెనిమిదేళ్ల లోపు వాళ్లకు సిగరెట్లు అమ్మడం నిషేధం అక్కడ. అయినప్పటికీ 2025 నాటికి అడల్ట్ స్మోకింగ్ రేటు కనీసం 5 శాతం తగ్గించాలన్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఇలా కఠిన చట్టం ఆలోచన చేసింది. స్మోకింగ్ అలవాటుతో న్యూలాండ్‌లో సాలీనా ఐదు వేల మంది చనిపోతున్నారు. అంతేకాదు నికోటిన్‌కు అలవాటు పడ్డ పేషెంట్ల కోసం భారీగానే ఖర్చు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. అందుకే యుక్తవయసులోనే అలవాటుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది చివరికల్లా కొత్త చట్టం సిద్ధం అవుతుంది. ఆ తర్వాత దశలవారీగా అమలు చేస్తారు. 2024 నాటికల్లా.. సిగరెట్ స్టోర్ల సంఖ్యను తగ్గించి(8 వేల నుంచి 500కి తగ్గించాలనే ఆలోచనలో ఉంది).. అమ్మకాల్ని తగ్గుముఖం పట్టేలా చేస్తారు. 2025 నుంచి నికోటిన్ లెవల్ తక్కువ ఉండే సిగరెట్లను మాత్రమే అమ్మాలనే కఠిన నిబంధన అమలు చేయనుంది. ఇక 2027 నుంచి స్మోక్ ఫ్రీ జనరేషన్ నినాదంతో కఠిన చట్టం అమలు చేస్తారు. నిషేధాన్ని ఎలా అమలు చేస్తారు? ఏయే రిటైలర్స్‌ను అమ్మకాలకు దూరంగా ఉంచుతారు? ఎవరికి అనుమతులు ఉంటాయి?.. అనే ప్రణాళిక ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నారు. మిగతా వివరాలపై బిల్లు తీసుకొచ్చే టైంలోనే స్పష్టత ఇవ్వనున్నారు. న్యూజిలాండ్ ఇంత టఫా? అఫ్కోర్స్. కానీ, న్యూజిలాండ్ కంటే భూటాన్ సిగరెట్ నిషేధాన్ని కఠినాతికఠినంగా అమలు చేస్తోందని తెలుస్తోంది. అయితే భారత్ నుంచి బ్లాక్ మార్కెట్ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేసినట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. పక్కాగా అమలు యువతలో పెరిగిపోతున్న పొగతాగే అలవాటు-మరణాలపై మవోరి తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులతో పాటు మవోరి టాస్క్‌ఫోర్స్ ‘లైఫ్‌టైం స్మోకింగ్ బ్యాన్’ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇక ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా, రిటైలర్స్‌కు నష్టం వాటిల్లకుండా దశల వారీగా చర్యలతో నష్టనివారణ చేపట్టే దిశగా ప్రయత్నాలు చేయనున్నారు. ఉపాధి కోల్పోకుండా ఆ 1500 స్టోర్లను ప్రత్యామ్నాయ స్టోర్లుగా ప్రభుత్వమే నడిపించనుంది. మరీ ముఖ్యంగా స్మోక్ ఫ్రీ జనరేషన్ చట్టం ద్వారా ప్రజా ఆరోగ్య, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ఖర్చు చేస్తున్న 3.6 బిలియన్ అమెరికన్ డాలర్లను ఆదా చేయాలని భావిస్తోంది. -
Teacher Eligibility Test: టెట్ పాసైతే జీవితకాలం అర్హత
సాక్షి, అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితాలం చెల్లుబాటు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈమేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న మేరకు ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తిచేసిన తరువాత అభ్యర్థులకు టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను ప్రవేశపెట్టడంతో పాటు ఈ విధానం అన్ని రాష్ట్రాల్లోనూ అమలయ్యేలా తప్పనిసరి చేస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలు రూపొందించింది. జాతీయస్థాయిలో ప్రత్యేకంగా సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (సీటీఈటీ)ని సీబీఎస్ఈ ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును తప్పనిసరిగా నిర్వహించాలని, ఏడాదికి కనీసం రెండుసార్లు ఈ టెట్ పరీక్ష పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. టెట్ అర్హత ధ్రువపత్రాల అర్హత కాలపరిమితిని ఏడేళ్లుగా ఎన్సీటీఈ చేసింది. 2011 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రాల్లో టెట్ విధానం అమల్లోకి వచ్చింది. టెట్ ధ్రువపత్రాల చెల్లుబాటు కాలపరిమితిని ఏడేళ్లు మాత్రమే ఉండడంతో ఆ గడువు ముగిసిన అభ్యర్థులు మళ్లీ టెట్‌ను రాయవలసి వచ్చేది. ఇప్పుడు ధ్రువపత్రాల చెల్లుబాటు కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలం చేయడంతో నిరుద్యోగ టీచర్ అభ్యర్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. 2011 నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నామని, ఇప్పటికే ఈ పరీక్షలు రాసి అర్హత సాధించిన వారికి ఇచ్చిన ధ్రువపత్రాల కాలపరిమితి ముగిసి ఉంటే వాటిని జీవితకాలానికి పునరుద్ధరించడమో, కొత్త ద్రువపత్రాలు జారీ చేయడమో చేయాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గతంలో ఈ పరీక్షలు రాసి అర్హత సాధించిన వారు ఆ సర్టిఫికెట్ల పరిమితి ఏడేళ్లు దాటినా నిశ్చింతగా ఉండవచ్చు. వాటి కాలపరిమితి జీవిత కాలానికి పెంచడంతో మళ్లీ టెట్ రాయాల్సిన పనిలేదు. అయితే డీఎస్సీలో టెట్ అర్హత మార్కులకు 20 శాతం మేర వెయిటేజి ఇస్తున్నారు. దీనివల్ల టెట్ వెయిటేజి స్కోరును పెంచుకోవడానికి అభ్యర్థులు టెట్‌ను పలుమార్లు రాస్తున్నారు. చదవండి: పరీక్షల రద్దుతో హ్యాపీనా? -
రక్తపోటు మందుతో దీర్ఘాయువు?
రక్తపోటు నివారణకు ఉపయోగించే మందు ఆయువును పెంచేం దుకు దోహదపడుతుందని జపాన్‌లోని ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మెటోలజోన్ అనే ఈ మందును వాడినప్పుడు కణస్థాయిలో ఆయువును పెంచే ప్రక్రియలు జరుగుతాయని, ఏలిక పాములపై ఈ మందు ప్రయోగించామని, ఇవే ఫలితాలు మానవుల్లోనూ ఇస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైటోకాండ్రియా మన వయసు పెరిగే కొద్దీ సక్రమంగా పనిచేయదు. మైటోకాండ్రియాను మరమ్మతు చేసి ఆయువు పెంచేందుకు చాలాకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మైటోకాండ్రియా సక్రమంగా పనిచేయకపోతే శరీర వ్యవస్థలో మరమ్మతు చేసేందుకు ఓ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియను మందుల ద్వారా ప్రారంభిస్తే మైటోకాండ్రియా సక్రమంగా పనిచేసి మనం ఎక్కువ కాలం సమస్యల్లేకుండా బతకొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు ఏలికపాములపై జరిపిన పరిశోధనలకు ప్రాధాన్యమేర్పడింది. మైటోకాండ్రియా మరమ్మ తు ప్రక్రియ మొదలైనప్పుడు ఏలికపాము కాస్తా వెలుగులు చిమ్మేలా జన్యుమార్పులు చేసి.. పలు వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులను వాటిపై ప్రయోగించారు. మెటోలజోన్ అనే రక్తపోటు మందు వాడినప్పుడు ఏలికపాముల్లో మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియ ప్రారంభమైందని, వాటి జీవన కాలమూ పెరిగిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కేజ్ నకాడై తెలి పారు. మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియకు ఉపయోగపడే హెచ్ఎస్పీఏ–6 జన్యువు ఉత్తేజితం అవుతున్నట్లు తెలిసింది. చలిలో వ్యాయామం.. వేగంగా కరిగేను కొవ్వు! చలి ఎక్కువవుతున్న కొద్దీ మనలో చాలామంది దుప్పట్లు కప్పేసుకుంటాం. ఉదయా న్నే చేసే వ్యాయామానికి సెలవులు ప్రకటించుకుంటాం. కానీ చలి వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుందని చెబుతోంది కెనెడాలోని లారెన్షియన్ యూనివర్సిటీ పరిశోధన. మీరెప్పుడైనా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) గురించి తెలుసా..? వ్యాయామం చేసే తీరులో ఇదో పద్ధతి. కొన్ని నిమిషాల పాటు తీవ్రస్థాయిలో వ్యాయామం చేయడం ఆ తర్వాత కొంత విరామం.. తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామం ఇలా సాగుతుంది ఈ హెచ్ఐఐటీ. కొవ్వులను వేగంగా కరిగించేందుకు ఇది మేలైన వ్యాయామం అని ఇటీవల ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాయామంపై ఉష్ణోగ్రతల ప్రభావం ఏంటన్నది తెలుసుకునేందుకు లారెన్షియన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. పరిసరాల ఉష్ణోగ్రత 21ల డిగ్రీ సెల్సియస్‌గా ఉన్నప్పుడు హెచ్ఐఐటీ చేస్తున్న వారితో పోలిస్తే సున్నా డిగ్రీ సెల్సియస్‌లో అంటే నీరు గడ్డకట్టే పరిస్థితుల్లో వ్యాయామం చేసే వారిలో కొవ్వులు ఆక్సీకరణం చెందే వేగం దాదాపు 3.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. జీవక్రియల విషయంలోనూ చలి వాతావరణంలో చేపట్టిన హెచ్ఐఐటీ ప్రభావశీలంగా ఉందని, రక్తంలో చక్కెర మోతాదుల నియంత్రణకు, కొవ్వులు కరిగేందుకు, హానికారక ట్రైగ్లిజరైడ్స్ తగ్గేందుకూ ఇది ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
మన ‘గ్రహ’బలం ఎంత?
మీరీ విషయం విన్నారా.. మన భూమిలాగే ఉన్న మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారట. అక్కడ జీవులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం కూడా ఉందంటున్నారు.. అవునూ.. ఇక్కడ భూమ్మీద కాబట్టి మనం హాయిగా జీవించగలుగుతున్నాం. అదే సౌర కుటుంబంలోని మిగతా గ్రహాలకుగానీ మనం వెళితే.. స్పేస్ సూట్ లేకుండా అక్కడ మనం బతకగలమా? బతికితే ఎన్నాళ్లూ లేదా ఎన్ని క్షణాలు? ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? మాకు వచ్చింది.. మరి సమాధానం కనుగొందామా? చలో మరి సౌర కుటుంబంలోని మన బంధువుల ఇంటికి.. సూర్యుడు.. సూర్యుడి దగ్గరికి వెళ్లగానే వెంటనే మాడిపోయి.. ఆవిరైపోతాం. కాబట్టి ఇక్కడ అస్సలు చాన్సే లేదు. బతికే సమయం: సెకను కన్నా తక్కువ బుధుడు సూర్యుడి వైపు ఉన్న ప్రాంతం చాలా వేడిగా ఉంటుంది. అక్కడ 427 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి వైపు కాకుండా ఉన్న ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మైనస్ 179 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలు కలిసే చోట నిలబడితే మనం ఊపిరి బిగబట్టే సమయం బతకొచ్చు. బతికే సమయం: రెండు నిమిషాలకు పైగా.. శుక్రుడు దీనిపై దాదాపు 482 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి భూమిపై మాదిరిగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఆవిరి అయ్యేంత సమయం బతుకుతాం. సమయం: సెకను కన్నా తక్కువ భూమి ఆక్సిజన్, నీరు, ఆహారం ఇవన్నీ మానవ జీవనానికి అనుకూలంగాదీన్ని మార్చేశాయి. సమయం: 80 సంవత్సరాలకు పైగా.. అంగారకుడు ఈ గ్రహం చాలా చల్లగా ఉంటుంది. గాలి చాలా పలుచగా ఉండటంతో ఈ చల్లదనం మన భూమిపై మాదిరిగా బాధించదు. సమయం: రెండు నిమిషాలకు పైగా.. గురుడు పూర్తిగా వాయు గ్రహం కాబట్టి.. ఇక్కడ బతకడం చాలా కష్టం. నిలబడాలని ప్రయత్నిస్తే ఆ గాలి లోపలికి వెళ్లిపోతాం. అక్కడి పీడనానికి వెంటనే ఆ గాలిలోనే కలసి పోతాం. సమయం: సెకను కన్నా తక్కువ.. శని శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాల కారణంగా ఈ గ్రహంపై నడవలేం.. కనీసం నిల్చోలేం. సమయం: సెకను కన్నా తక్కువ. యురేనస్, నెప్ట్యూన్ గురుడు మాదిరిగానే ఈ రెండు గ్రహాలు కూడా వాయు గ్రహాలే. ఇక్కడ కూడా ఆ వాయువుల్లోకి వెళ్లిపోతాం. వాయువుల పీడనానికి గాల్లోనే కలసిపోతాం. బతికే సమయం: రెండు గ్రహాల్లో సెకను కన్నా తక్కువ.. -
ఆరోగ్యానికి దగ్గరగా ది ఆర్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మెట్రో నగరాలు రెండు అంశాల్లో ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. 1. అభివృద్ధిలో 2. వాయు కాలుష్యంలో! దీంతో ఆయా నగరాల్లో వాయు నాణ్యత సూచీ గణనీయంగా తగ్గి స్థానిక ప్రజల జీవన కాలపరిమితి పడిపోతుంది. దీనికి పరిష్కారం చూపించేందుకు కాలుష్యానికి దూరంగా.. ఆరోగ్యానికి దగ్గరగా ఉండే భవనాల అవసరాన్ని గుర్తించింది గిరిధారి హోమ్స్. అందుకు తగ్గట్టుగానే ‘ది ఆర్ట్’ పేరిట అద్భుతమైన ప్రాజెక్ట్‌తో నగరవాసుల ముందుకొచ్చింది. ఒక్క ముక్కలో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే.. ఆధునిక వసతులతో పాటూ ఆరోగ్యం, ఆహ్లాదం, సంపద, అనుబంధాలను కలగలిపిన గృహాల సముదాయం! కిస్మత్‌పూర్‌లోని బండ్లగూడ జాగీర్‌లో 3.30 ఎకరాల్లో ది ఆర్ట్ పేరిట గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోంది. మొత్తం 270 ఫ్లాట్లు. 1,171–1,857 చ.అ. విస్తీర్ణాల్లో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే, విల్లామెంట్ గృహాలుంటాయి. ధర చ.అ.కు రూ.4,200. విక్రయాలు ప్రారంభమైన వారం రోజుల్లోనే 30కి పైగా ఫ్లాట్లు విక్రయమయ్యాయి. 2022 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఇంట్లోనే రిసార్ట్ లైఫ్... రిసార్ట్ లైఫ్ స్టయిల్‌ను రోజువారీ జీవనశైలిలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నాం. ఇందులో 20 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్ ఉంటుంది. ప్రివ్యూ థియేటర్, జిమ్, కిడ్స్ ప్లే పూల్, ఉమెన్స్ పూల్, గుడి, మెడిటేషన్ జోన్, బ్యాడ్మింటన్ కోర్ట్, గోల్ఫ్, సీనియర్ సిటిజన్ కోర్ట్, జిమ్, కాఫీ షాప్, ఆర్ట్ గ్యాలరీ, ఇండోర్ గేమ్స్, స్నూకర్, టేబుల్ టెన్నిస్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. స్మార్ట్ ఫోన్‌తో ఇంట్లోని ఎలక్ట్రికల్ ఉపకరణాలను, విద్యుత్, వాటర్ సరఫరాలను నియంత్రణ చేసుకునేందుకు వీలుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఈ ఏడాది మరో 3 ప్రాజెక్ట్‌లు.. ఇప్పటివరకు గిరిధారి హోమ్స్ 15 లక్షల చ.అ.ల్లో 9 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. దాదాపు వెయ్యికి పైగా గృహాలను నిర్మించాం. ఈ ఏడాది ముగింపులోగా కిస్మత్పూర్ కేంద్రంగా మరొక 3 ప్రాజెక్ట్‌లను నిర్మిస్తాం. త్వరలోనే 2 ఎకరాల్లో వ్యూ పేరిట హైరైజ్ అపార్ట్‌మెంట్‌ను ప్రారంభించనున్నాం. ఆ తర్వాత డెస్టినీ, రైజ్ ప్రాజెక్ట్‌లు ప్రారంభమవుతాయి. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు దగ్గర్లో తూప్రాన్‌లో గోల్ఫ్ కోర్ట్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం 80 లక్షల చ.అ.ల్లో మురారీ, కమల్నారాయణ్, రాజక్షేత్ర ప్రాజెక్ట్‌ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. వీటిల్లో బండ్లగూడ జాగీర్‌లోని మురారీ, సికింద్రాబాద్‌లోని కమల్నారాయణ్ ప్రాజెక్ట్‌లను వచ్చే నెలాఖరు నాటికి నిర్మాణం పూర్తి చేసి.. కొనుగోలుదారులకు అప్పగిస్తాం. రాజక్షేత్ర ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది చివరి నాటికి అందిస్తాం. కిస్మత్పూర్ చుట్టూ అభివృద్ధి గురించి.. తెలంగాణ ప్రభుత్వం బుద్వేల్‌లో 300 ఎకరాల్లో ఐటీ క్లస్టర్‌ను ఏర్పాటును ప్రతిపాదించింది. దీంతో ఈ ప్రాంతంలో గచ్చిబౌలి తరహాలో లక్షలాది ఉద్యోగులొస్తారు. ఈ ప్రాంతంలో డీపీఎస్, టైమ్, శ్రీనిధి, ఇండస్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, భాస్కరా, షాదన్ మెడికల్ కాలేజీలు, వాసవీ ఇంజనీరింగ్, సీబీఐటీ, ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్ వంటి ఉన్నత విద్యా సంస్థలున్నాయి. ఓఆర్ఆర్, కొత్వాల్‌గూడ నైట్ సఫారీ పార్క్ 4 కి.మీ. దూరంలో, మృగవణి పార్క్ 10 కి.మీ. దూరంలో ఉంటాయి. మెహదీపట్నం, లక్డీకపూల్, బంజారాహిల్స్ వంటి ప్రధాన ప్రాంతాలకు 20 కి.మీ. దూరంలో ఉంటుంది. 5 నిమిషాల ప్రయాణ వ్యవధిలో హిమాయత్ సాగర్‌కు, 15 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉస్మాన్ సాగర్‌కు చేరుకోవచ్చు. గాలిని శుభ్రపరిచే మొక్కలు: ది ఆర్ట్ ప్రాజెక్ట్‌లోని అన్ని గృహాల కిటికీల దగ్గర వాయు నాణ్యతను (ఏక్యూఐ) మెరుగుపరిచే యురోకా ఫామ్, మనీ ప్లాంట్, మదరిల్లా ప్లాంట్స్‌ను పెంచుతారు. ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఇవి గాలిలోని దుమ్ము, ధూళి కణాలను పీల్చుకుని స్వచ్ఛమైన గాలిని ఇంట్లోకి పంపిస్తాయి. అలాగే ఇంట్లోని వేడిని గ్రహించి.. ఇంటి వాతావరణాన్ని చల్లబరుస్తాయి. ఒత్తిడిని తగ్గించే జలపాతం: మనం జలపాతాల దగ్గరికి వెళ్లినప్పుడు అక్కడి నుంచి వచ్చే నీటి శబ్దాన్ని వింటే మన మెదడులోని సూక్ష్మమైన నరాలు ఉత్తేజితమవుతాయి. దీంతో మనలోని ఒత్తిడి తగ్గి మనసు ఆహ్లాదకరంగా మారుతుంది. ది ఆర్ట్‌లోని కస్టమర్లకూ అలాంటి ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించేందుకు ప్రాజెక్ట్‌లో నెగటివ్ అయాన్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అంటే 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు పడే విధంగా జలపాతం ఉంటుంది. ఇక్కడి నుంచి వెలువడే రేణువులు, నీటి శబ్దం మెదడుకు పూర్తి స్థాయి ఆక్సిజన్‌ను అందించి మనస్సును ఉత్సాహపరుస్తుంది. నక్షత్ర గార్డెన్: వంద శాతం వాస్తు నిర్మిత ఈ ప్రాజెక్ట్‌లో 27 నక్షత్రాలకు సంబంధించిన నక్షత్ర గార్డెన్ ఉంటుంది. ఒక్కో రాశి వారికి ఒక్కో చెట్టు ఉంటుందని పద్మ పురాణం చెబుతుంది. జాతకం ప్రకారం సంబంధిత రాశి వాళ్లు ఆయా చెట్టు కింద కూర్చుంటే మనలోని శక్తి ప్రేరేపితమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని ఆధారంగా తీసుకొని నక్షత్ర గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. -
యావజ్జీవ శిక్షే.!
జగిత్యాలజోన్ : మహిళలను నేరుగా ఎదుర్కోని కొందరు, తమకు దక్కనిది ఇంకొక్కరికి దక్కొద్దనే దురాలోచనతో ఉన్నవారు.. మహిళలపై, విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా, యాసిడ్ దాడులకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్భయ చట్టం–2013 ద్వారా యాసిడ్ దాడులకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు ఉండేలా.. ఐపీసీ326 చట్టానికి సవరణలు చేసి.. ఐపీసీ326(ఏ), ఐపీసీ326(బీ) అనే కొత్త సెక్షన్లను తీసుకొచ్చారు. వీటితో పాటు మరిన్ని క్రిమనల్ చట్టాల గురించి జగిత్యాల బార్ అసోసియేషన్ న్యాయవాది ఎడ్మల నిరోషా వివరించారు. తీవ్రమైన హాని చేస్తే.. అగ్ని, విష ప్రయోగం, వేడితో మరిగిన పదార్థాలు, యాసిడ్, పేలుడు పదార్థాలు, రక్తంలో కలిసిపోయే తీవ్రమైన హానికర పదార్థాలు, జంతువులు, కత్తి వంటి సాధానాల ద్వారా ఒక మనిషికి మరణం కలిగించే విధంగా.. ఉద్దేశపూర్వకంగా తీవ్రగాయాలు చేస్తే ఐపీసీ326 కింద నేరంగా పరిగణించబడుతోంది. ఈ నేరానికి పాల్పడిన వారికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేయవచ్చు. లేదా కేసు పూర్వపరాలను బట్టి పదేళ్ల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష, జరిమానా వేసే అవకాశముంటుంది. యాసిడ్ వంటి పదార్థాలతో గాయపర్చడం.. ఎవరైనా ఎదుటి వ్యక్తిపై యాసిడ్ దాడి చేయడం లేదా ఇతర విధాలుగా దాడులు చేయడాన్ని ఐపీసీ326(ఏ)సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ దాడుల ద్వారా సదరు వ్యక్తికి శాశ్వత లేదా పాక్షికంగా నష్టం లేదా శరీర భాగాలు వైకల్యం పొందడం లేదా అందవిహీనంగా తయారవడం జరుగుతోంది. ఇలాంటి నేరానికి పాల్పడితే జీవితకాల శిక్ష విధించే అవకాశముంది. కేసు పూర్వపరాలను బట్టి పదేళ్ల కాల వ్యవధితో జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. ఇలాంటి కేసుల్లో ముద్దాయిలకు వేసే జరిమానాలు బాధితుల వైద్య ఖర్చులకు సరిపడే విధంగా న్యాయబద్దంగా ఆలోచించి కోర్టులు నిర్ణయిస్తుంటాయి. యాసిడ్ విసిరి శాశ్వత నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతో.. ఒక వ్యక్తికి శాశ్వతమైన లేక పాక్షికమైన నష్టం లేదా అంగవైకల్యం లేదా తీవ్రమైన గాయం చేయాలనే ఉద్దేశ్యంతో యాసిడ్‌ను విసిరినా లేదా యాసిడ్‌ను విసురుటకు ప్రయత్నించినా ఐపీసీ326(బీ) సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఆస్తిని పొందేందుకు గాయపర్చితే.. ఏదైనా ఆస్థిని లేదా విలువైన పత్రాలను బాధితుడి నుంచి బలవంతంగా లేదా బెదిరించడం, చట్టవిరుద్ధగా చేసే చర్యల వల్ల గాయాలైతే ఐపీసీ327 కింద నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు పదేళ్ల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. విషంతో హాని కలిగిస్తే.. ఎవరైనా ఒక వ్యక్తికి హాని కలిగించే ఉద్దేశ్యంతో విషం లేదా సృహ కోల్పోయే మత్తుమందును తాగించిన లేదా తాగించేలా చేసిన ఐపీసీ328 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పదేళ్ల వరకు కఠిన లేదా సాధారణ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. తీవ్రంగా గాయపర్చితే.. ఎవరినైనా ఉద్దేశ్యపూర్వకంగా బలవంతం చేసి, తీవ్రమైన గాయాలు చేస్తే ఐపీసీ329 కింద శిక్షలు కఠినంగా ఉంటాయి. అంతేకాకుండా, ఏదైనా ఆస్తిని బాధితుడి నుంచి బలవంతంగా లాక్కునేందుకు బెదిరించినా నేరమే. ఈ నేరానికి పాల్పడిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా కేసును బట్టి పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది. -
శ్రీశాంత్ బ్యాన్.. బీసీసీఐకు ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని సవాల్ చేస్తూ క్రికెటర్ శ్రీశాంత్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. సోమవారం అతని అభ్యర్థన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు పంపింది. ఈ సందర్భంగా శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాపై జీవిత కాల నిషేధం సరికాదు. మళ్లీ క్రికెట్ ఆడాలన్నది నా కల. ఖచ్ఛితంగా నాకు న్యాయ జరుగుతుంది’’ అని పేర్కొన్నాడు. కాగా, శ్రీశాంత్ నిషేధ అంశం పై వివరణ కోసం బీసీసీఐకు నాలుగు వారాల గడువు విధించినట్లు తెలుస్తోంది. 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్‌తోపాటు ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను స్పాట్‌ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బోర్డు శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీంతో అతను కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాగా.. అతనికి ఊరట లభించింది. అయితే, కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ బీసీసీఐ.. హైకోర్టు ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ఉండటంతోనే తాము నిషేధం విధించామని పేర్కొంటూ.. పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ఉన్నత ధర్మాసనం.. బీసీసీఐ వాదనను సమర్థిస్తూ.. అతడిపై కేరళ హైకోర్టు నిషేధాన్ని పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలోనే అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. -
హత్యకేసులో దంపతులకు యావజ్జీవం
కేకే.నగర్ : రైతును హత్య చేసిన కేసులో దంపతులకు యావజ్జీవం, వారికి సహాయపడిన రైతు అన్నకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తేని జిల్లా సెషెన్స్ కోర్టు తీర్పునిచ్చింది. విరుదునగర్ జిల్లా ముత్తులింగపురానికి చెందిన భోజరాజ్(50) రైతు. ఇతని భార్య భాగ్యలక్ష్మి(48). భార్య, భర్త మధ్య ఏర్పడిన తగాదాల కారణంగా భోజరాజ్ 2012లో తేని జిల్లా దేవారం వచ్చి ఆ ప్రాంతంలోని రంగనాథన్(55) ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. భోజరాజ్ అన్న అమృతరాజ్ అదే ప్రాంతంలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఈ స్థితిలో భోజరాజ్ భార్య మీద కోపంతో తనకు సొంతమైన ఎనిమిది ఎకరాల పొలాన్ని అన్న అమృతరాజ్‌కు రాసి ఇచ్చేశాడు. ఆ పొలాన్ని అమృతరాజ్ రంగనాథన్‌కు విక్రయించాడు. ఈ నేపథ్యంలో 2012 జూలై 30న భోజరాజ్ మృతి చెందినట్టు భార్య భాగ్యలక్ష్మికి సమాచారం అందింది. అతని మృతదేహాన్ని ఇంటి యజమాని రంగనాథన్, అతని భార్య అళగమ్మాల్(49), అమృతరాజ్‌లు సొంతఊరికి తీసుకొచ్చారు. భర్త మృతిపై అనుమానంతో భాగలక్ష్మి దేవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో అతడిని హత్య చేసినట్లు తెలిసింది. పోలీసుల విచారణలో భోజరాజ్ అన్నకు రాసిచ్చిన పొలాన్ని తిరిగి ఇవ్వమని అడగడంతో భోజరాజ్‌ను అమృతరాజ్ సహాయంతో రంగనాథన్, అళగమ్మాళ్లు హత్య చేసినట్లు తెలిసింది. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు తేని జిల్లా సెషన్స్ కోర్టులో సోమవారం తుది విచారణకు వచ్చింది. కేసు పరిశీలించిన న్యాయమూర్తులు రంగనాథన్, అళగమ్మాళ్కు యావజ్జీవం, అమృతరాజ్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. పోలీసులు ముగ్గురిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. -
అక్కడ జన్మించాడు.. ఛాన్స్ కొట్టేశాడు
న్యూఢిల్లీ: ఎగురుతున్న విమానంలో ఓ మహిళ ఆదివారం పండంటి బిడ్డను ప్రసవించింది. విమానంలో పుట్టిన ఆ శిశువుకు జీవితమంతా టికెట్లు ఉచితంగా ఇవ్వాలని జెట్ ఎయిర్వేస్ నిర్ణయించింది. జెట్ ఎయిర్వేస్కు చెందిన 9డబ్ల్యూ569 విమానం ఆదివారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని డమ్మమ్ నుంచి కొచ్చికి బయులుదేరింది. ప్రయాణం మధ్యలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలై విమానంలోనే మగబిడ్డను ప్రసవించింది. ఇలా విమానంలో పిల్లలు పుట్టడం జెట్ ఎయిర్వేస్ సంస్థకు ఇదే ప్రథమం. దీంతో ఆ శిశువుకు తమ విమానాల్లో జీవితాంతం ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. -
కవలలే ఎక్కువకాలం బతుకుతారట
ఒక్కరుగా పుట్టినవాళ్ల కంటే కవల పిల్లలైతే దీర్ఘాయుష్షు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వాళ్లు ఆడపిల్లలైనా, మగపిల్లలైనా కూడా మామూలు వాళ్ల కంటే జీవితకాలం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. సాధారణంగా కవలపిల్లల మధ్య సామాజిక సంబంధాలు చాలా బలంగా ఉంటాయని, ఇది కూడా అందుకు ఓ కారణం కావచ్చని అంటున్నారు. అందులోనూ.. పోలికలు కలవని వాళ్ల కంటే బాగా కలిసిపోయే కవలలైతే మరింత ఎక్కువ కాలం బతుకుతున్నట్లు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ డేవిడ్ షారో తెలిపారు. డెన్మార్క్‌లో 1870, 1900 సంవత్సరాల మధ్య పుట్టిన 2,932 మంది కవల పిల్లల జీవన స్థితిగతులను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. తర్వాత మొత్తం డేనిష్ ప్రజలు ఏ వయసులో మరణించారో అనే సమాచారంతో దీన్ని పోల్చిచూశారు. బాధలో ఉన్నప్పుడు ఓదార్చేందుకు ఎవరో ఒకరు ఉండటం.. ఆరోగ్యం బాగోనప్పుడు దగ్గరుండి చూసుకోవడం.. ఇలాంటి వాటివల్ల కవలలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉంటారట. ఈ పరిశోధన వివరాలు ప్లస్ వన్ అనే జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.