సాక్షి, హైదరాబాద్: దేశంలోని మెట్రో నగరాలు రెండు అంశాల్లో ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. 1. అభివృద్ధిలో 2. వాయు కాలుష్యంలో! దీంతో ఆయా నగరాల్లో వాయు నాణ్యత సూచీ గణనీయంగా తగ్గి స్థానిక ప్రజల జీవన కాలపరిమితి పడిపోతుంది. దీనికి పరిష్కారం చూపించేందుకు కాలుష్యానికి దూరంగా.. ఆరోగ్యానికి దగ్గరగా ఉండే భవనాల అవసరాన్ని గుర్తించింది గిరిధారి హోమ్స్. అందుకు తగ్గట్టుగానే ‘ది ఆర్ట్’ పేరిట అద్భుతమైన ప్రాజెక్ట్‌తో నగరవాసుల ముందుకొచ్చింది. ఒక్క ముక్కలో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే.. ఆధునిక వసతులతో పాటూ ఆరోగ్యం, ఆహ్లాదం, సంపద, అనుబంధాలను కలగలిపిన గృహాల సముదాయం!
కిస్మత్‌పూర్‌లోని బండ్లగూడ జాగీర్‌లో 3.30 ఎకరాల్లో ది ఆర్ట్ పేరిట గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోంది. మొత్తం 270 ఫ్లాట్లు. 1,171–1,857 చ.అ. విస్తీర్ణాల్లో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే, విల్లామెంట్ గృహాలుంటాయి. ధర చ.అ.కు రూ.4,200. విక్రయాలు ప్రారంభమైన వారం రోజుల్లోనే 30కి పైగా ఫ్లాట్లు విక్రయమయ్యాయి. 2022 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం.
ఇంట్లోనే రిసార్ట్ లైఫ్...
రిసార్ట్ లైఫ్ స్టయిల్‌ను రోజువారీ జీవనశైలిలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నాం. ఇందులో 20 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్ ఉంటుంది. ప్రివ్యూ థియేటర్, జిమ్, కిడ్స్ ప్లే పూల్, ఉమెన్స్ పూల్, గుడి, మెడిటేషన్ జోన్, బ్యాడ్మింటన్ కోర్ట్, గోల్ఫ్, సీనియర్ సిటిజన్ కోర్ట్, జిమ్, కాఫీ షాప్, ఆర్ట్ గ్యాలరీ, ఇండోర్ గేమ్స్, స్నూకర్, టేబుల్ టెన్నిస్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. స్మార్ట్ ఫోన్‌తో ఇంట్లోని ఎలక్ట్రికల్ ఉపకరణాలను, విద్యుత్, వాటర్ సరఫరాలను నియంత్రణ చేసుకునేందుకు వీలుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం.
ఈ ఏడాది మరో 3 ప్రాజెక్ట్‌లు..
ఇప్పటివరకు గిరిధారి హోమ్స్ 15 లక్షల చ.అ.ల్లో 9 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. దాదాపు వెయ్యికి పైగా గృహాలను నిర్మించాం. ఈ ఏడాది ముగింపులోగా కిస్మత్‌పూర్ కేంద్రంగా మరొక 3 ప్రాజెక్ట్‌లను నిర్మిస్తాం. త్వరలోనే 2 ఎకరాల్లో వ్యూ పేరిట హైరైజ్ అపార్ట్‌మెంట్‌ను ప్రారంభించనున్నాం. ఆ తర్వాత డెస్టినీ, రైజ్ ప్రాజెక్ట్‌లు ప్రారంభమవుతాయి. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు దగ్గర్లో తూప్రాన్‌లో గోల్ఫ్ కోర్ట్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం 80 లక్షల చ.అ.ల్లో మురారీ, కమల్‌నారాయణ్, రాజక్షేత్ర ప్రాజెక్ట్‌ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. వీటిల్లో బండ్లగూడ జాగీర్‌లోని మురారీ, సికింద్రాబాద్‌లోని కమల్‌నారాయణ్ ప్రాజెక్ట్‌లను వచ్చే నెలాఖరు నాటికి నిర్మాణం పూర్తి చేసి.. కొనుగోలుదారులకు అప్పగిస్తాం. రాజక్షేత్ర ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది చివరి నాటికి అందిస్తాం.
కిస్మత్‌పూర్ చుట్టూ అభివృద్ధి గురించి..
తెలంగాణ ప్రభుత్వం బుద్వేల్‌లో 300 ఎకరాల్లో ఐటీ క్లస్టర్‌ను ఏర్పాటును ప్రతిపాదించింది. దీంతో ఈ ప్రాంతంలో గచ్చిబౌలి తరహాలో లక్షలాది ఉద్యోగులొస్తారు. ఈ ప్రాంతంలో డీపీఎస్, టైమ్, శ్రీనిధి, ఇండస్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, భాస్కరా, షాదన్ మెడికల్ కాలేజీలు, వాసవీ ఇంజనీరింగ్, సీబీఐటీ, ఐసీఎఫ్‌ఏఐ బిజినెస్ స్కూల్ వంటి ఉన్నత విద్యా సంస్థలున్నాయి. ఓఆర్‌ఆర్, కొత్వాల్‌గూడ నైట్ సఫారీ పార్క్ 4 కి.మీ. దూరంలో, మృగవణి పార్క్ 10 కి.మీ. దూరంలో ఉంటాయి. మెహదీపట్నం, లక్డీకపూల్, బంజారాహిల్స్ వంటి ప్రధాన ప్రాంతాలకు 20 కి.మీ. దూరంలో ఉంటుంది. 5 నిమిషాల ప్రయాణ వ్యవధిలో హిమాయత్ సాగర్‌కు, 15 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉస్మాన్ సాగర్‌కు చేరుకోవచ్చు.
గాలిని శుభ్రపరిచే మొక్కలు: ది ఆర్ట్ ప్రాజెక్ట్‌లోని అన్ని గృహాల కిటికీల దగ్గర వాయు నాణ్యతను (ఏక్యూఐ) మెరుగుపరిచే యురోకా ఫామ్, మనీ ప్లాంట్, మదరిల్లా ప్లాంట్స్‌ను పెంచుతారు. ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఇవి గాలిలోని దుమ్ము, ధూళి కణాలను పీల్చుకుని స్వచ్ఛమైన గాలిని ఇంట్లోకి పంపిస్తాయి. అలాగే ఇంట్లోని వేడిని గ్రహించి.. ఇంటి వాతావరణాన్ని చల్లబరుస్తాయి.
ఒత్తిడిని తగ్గించే జలపాతం: మనం జలపాతాల దగ్గరికి వెళ్లినప్పుడు అక్కడి నుంచి వచ్చే నీటి శబ్దాన్ని వింటే మన మెదడులోని సూక్ష్మమైన నరాలు ఉత్తేజితమవుతాయి. దీంతో మనలోని ఒత్తిడి తగ్గి మనసు ఆహ్లాదకరంగా మారుతుంది. ది ఆర్ట్‌లోని కస్టమర్లకూ అలాంటి ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించేందుకు ప్రాజెక్ట్‌లో నెగటివ్ అయాన్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అంటే 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు పడే విధంగా జలపాతం ఉంటుంది. ఇక్కడి నుంచి వెలువడే రేణువులు, నీటి శబ్దం మెదడుకు పూర్తి స్థాయి ఆక్సిజన్‌ను అందించి మనస్సును ఉత్సాహపరుస్తుంది.
నక్షత్ర గార్డెన్: వంద శాతం వాస్తు నిర్మిత ఈ ప్రాజెక్ట్‌లో 27 నక్షత్రాలకు సంబంధించిన నక్షత్ర గార్డెన్ ఉంటుంది. ఒక్కో రాశి వారికి ఒక్కో చెట్టు ఉంటుందని పద్మ పురాణం చెబుతుంది. జాతకం ప్రకారం సంబంధిత రాశి వాళ్లు ఆయా చెట్టు కింద కూర్చుంటే మనలోని శక్తి ప్రేరేపితమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని ఆధారంగా తీసుకొని నక్షత్ర గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment